చట్టాలపై అవగాహన సదస్సు

చట్టాలపై అవగాహన సదస్సు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులోని పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్, గోపాల్ నగర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జ్ కం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు.

గృహహింస మరియు మహిళలు ఎదుర్కొంటున్న అనేక చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు,జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, శ్రీ.గుర్రం ఆంజనేయులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్,ఈ.జ్యోతి, అడ్వకేట్లు,గెంట్యాల భూమేష్, తిరుపతి, అనుష, అరుణ, అలేఖ్య మరియు 19వ వార్డు మాజీ కౌన్సిలర్,అన్నారం శ్రీనివాస్, జి.జ్యోతి, డి.అనుష, టి.కావ్య, వి.సునీత మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు 19వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ మరియు మహిళలను జడ్జి రాధిక జైస్వాల్ అభినందించారు.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు:-

వరంగల్/హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

వరంగల్ మరియు హన్మకొండ న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ఇరువురు అనాధ బాలురలను వివేకానగర్ లోని సాయి స్పందన పాఠశాలలో జాయిన్ చేశారు.గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామానికి చెందిన ఓని రమేష్, తిరుపతమ్మలకు  గౌతం వయస్సు 11 సంవత్సరాలు మరియు గర్విక్ వయస్సు 6 సంవత్సరాల కుమారులు కలరు. అనారోగ్య కారణాల వల్ల ఆరు నెలల క్రితం రమేష్ మరియు తిరుతమ్మలు మరణించడంతో  గౌతం మరియు గర్విక్ లు అనాదలైనారు. వీరు అనాథలుగా మిగిలిపోవడంతో  పెద్ద నానా అయిన ఓని విజయ్  వీరిని తనవద్ద ఉంచుకున్నాడు. తరువాత వీరిని పాఠశాలలో చేర్పించడానికి స్థోమత లేక పోవడం తో తేదీ:- 05- 06-2025 రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేశారు. వెంటనే  వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే గార్లు స్పందించి వారిని సాయి స్పందన పాఠశాలలో చేర్పించి వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇట్టి కార్యక్రమం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో జరిగింది

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజున వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో “యోగ మహోత్సవం” ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి.బి.నిర్మల గీతాంబ మరియు విశిష్ఠ అతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శోభా బృందం ఆధ్వర్యంలో వివిధ ఆసనాలు, శ్వాస పద్ధతులు ప్రదర్శించబడ్డాయి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ మాట్లాడుతూ – ‘‘యోగా మన మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక అంశాలలో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. యోగా నిత్య ప్రక్రియ వల్ల మనం మన సాధారణ ఆరోగ్యం మరియు శక్తిని మెరుగుపరచుకోవచ్చు అని తెలిపారు.యోగా టీచర్లు శోభ మరియు భాస్కర్ యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించి, ఆరోగ్యపూరిత జీవనానికి యోగా అవసరమని స్పష్టం చేశారు.

ఈ యోగా కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, వరంగల్ హనుమకొండ జిల్లాలో ఇతర న్యాయమూర్తులు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ డి. రమా కాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హాజరయ్యారు.

అనంతరం యోగా గురువులను న్యాయమూర్తులు మరియు వరంగల్ బార్ అసోసియేషన్ వారు శాలువాలతో సన్మానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version