ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.
కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, బావి భారత ప్రధాని అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు..
రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు పూజారి వెంకన్న , వగలబోయిన శ్రీను, దంచనాల రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం, గోగు కిరణ్ కుమార్, మేడి శ్రీను, అశ్రపునిస, పోలేబోయిన సుజాత,కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..