వెన్నునొప్పి వస్తుందా..

వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..

 

 

 

 

వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. అయితే, దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

 

 

వెన్నునొప్పి అంటే వీపు భాగంలో కలిగే నొప్పి. ఇది కండరాలు, ఎముకలు, నరాలు, లేదా వెన్నుపాములోని ఇతర భాగాల నుండి రావచ్చు. సాధారణంగా, ఇది స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

తప్పుగా కూర్చోవడం:

గంటల తరబడి కంప్యూటర్ ముందు వంగి కూర్చోవడం, సోఫాలో సరిగా కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తగ్గించాలంటే నేరుగా కూర్చోవాలి, కుర్చీ కూడా మంచిది ఉపయోగించాలి. ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవడం మంచిది.

 

 

 

 

శారీరక శ్రమ లేకపోవడం

రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడితే, వెన్నెముకకు సరైన మద్దతు లేక నొప్పి వస్తుంది. కనీసం రోజుకు కొన్ని నిమిషాలు యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మంచిది.

 

 

 

 

బరువులు ఎత్తడం:

బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తడం, లేదా ఒక్కసారిగా ఎక్కువ బరువు మోయడం వల్ల వెన్నెముకకు నష్టం కలుగుతుంది. కింద ఉన్న వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, నెమ్మదిగా లేచే విధంగా ఎత్తాలి. అవసరమైతే ఎవరైనా సహాయం తీసుకోవాలి.

 

 

 

 

పరుపు లేదా నిద్ర భంగిమ:

మృదువైన లేదా గట్టిగా ఉన్న పరుపులు వెన్నెముకకు సరైన మద్దతు ఇవ్వవు. అలాగే నిద్రించే స్థితి సరిగాలేకపోతే ఉదయం నడుము నొప్పితో లేచే ప్రమాదం ఉంటుంది. మితమైన గట్టితనంతో ఉన్న పరుపును ఎంచుకోవాలి. వీపు నేరుగా ఉండేలా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. వెన్నునొప్పి సాధారణమైన సమస్య అయినా దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు మార్చుకోండి. వెన్ను నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించండి.

 

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా..

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..

 

 

కొంతమందికి అర్ధరాత్రి కూడా ఆకలిగా అనిపిస్తుంది. అయితే, అలాంటి వారు పడుకునే ముందు వీటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

 

 

చాలామందికి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల జరగవచ్చు. ముఖ్యంగా రాత్రి మేలుకువగా ఉండేటప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో చాలా మంది చిప్స్, స్వీట్లు వంటి అనారోగ్యకరమైన వాటిని తింటారు. కానీ ఇవి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి, మీకు ఆకలిగా అనిపిస్తే ఈ తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ఆకలిని తీరుస్తాయని, అదే సమయంలో నిద్రకు ఇబ్బంది కలిగించవని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

గోరువెచ్చని పాలు

రాత్రిపూట ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే, పాలలో ప్రోటీన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలకు మంచిగా పనిచేస్తాయి. అలాగే ఆకలిని కూడా నియంత్రిస్తాయి. ప్రతి రోజు పడుకునే ముందు 150–200 మి.లీ పాలు తాగడం మంచిది.

 

 

 

 

 

 

గింజలు (బాదం, వాల్‌నట్స్)

గుప్పెడు బాదం లేదా 2–3 వాల్‌నట్స్ తినడం మంచిది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రకు సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల తక్షణమే ఆకలి తగ్గుతుంది. అలాగే రాత్రంతా చక్కెర స్థాయిలు స్తిరంగా ఉంటాయి.

 

 

 

 

 

 

అరటిపండు

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఉంటాయి. ఇవి కండరాలను సడలించడంతో పాటు నిద్రకు సహాయపడతాయి. అరటిపండు ఆకలిని తీరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న అరటిపండు తినవచ్చు. దీనిని పాలతో కలిపి తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

 

 

 

ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల.

పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి

హన్మకొండ, నేటిధాత్రి:

 

shine junior college

 

 

స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా 15 రోజుల పాటు పిల్లలు అతిసార వ్యాధికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఓ ఆర్ ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలనిహనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు .ఈరోజు హనుమకొండ పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీ కడిపికొండ కు సంబంధించిన వైద్యాధికారులు సూపర్వైజర్లతో కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ ,ప్రజల్లో అవగాహన కలిగిస్తూ పాజిటివ్ వచ్చిన ఏరియాలో తగిన చర్యలు తీసుకోవాలని , ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని డ్రైడే ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయాలని అలాగే గ్రామాల్లో మరియు పాఠశాలల్లో వైద్య శిబిరములు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా చేతుల పరిశుభ్రత పై ,పరిసరాల పరిశుభ్రత వంటి అంశములపై అవగాహన కలిగించాలన్నారు. టీవీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపులలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతోపాటు టీవీకి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి పోషణకు సంబంధించిన అవగాహన ,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్,అడిషనల్ డి ఎం హెచ్ ఓ మరియు ఇన్చార్జి మలేరియా అధికారి డాక్టర్ టి మదన్ మోహన్ రావు ఆరోగ్య కేంద్రాల వారీగా మెడికల్ క్యాంపులు ,అలాగే పాజిటివ్ కేసులు (తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించగా, జిల్లా ఎమినైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్,మరియు రోట వైరస్ వ్యాక్సిన్ ల గురించి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు టీబీ ముక్తాభియాన్ అలాగే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తదార్ అహ్మద్ఎన్సిడి, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల తగిన సూచనలు చేయడం జరిగింది.

వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన.

వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన *
జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి

జమ్మికుంట :నేటిధాత్రి

shine junior college

ఈరోజు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు గారు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి తనిఖీ లో భాగంగా ఫార్మసీ రూమ్, ల్యాబ్ మరియు రికార్డులను పరిశీలించడం జరిగింది ఆరోగ్యశాఖ సిబ్బందికి క్రింది విషయాలపై దిశా నిర్దేశం చేశారు
అందులో
1.NCD క్లినిక్స్ ను పగడ్బందీగా నిర్వహించాలి అందులో ఎన్ సి డి పరీక్షలు హైపర్ టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్ ,ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు నిర్వహించాలి
2.లెప్రసి సర్వేను ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలో విధిగా నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించాలిACF camp పెట్టి,Sputum Samples సేకరించాలి. అవసరం అనుకున్న వారికి Xray తీయించాలి.
3.ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్ర వారం తప్పనిసరిగా నిర్వహించాలని అందులో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని
4.జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుక్రవారం సభను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని
5.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని
6.వర్షాకాలంలో వచ్చే వ్యాధుల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద ప్రజలకు అవగాహన కల్పించాలని
7.సిబ్బంది సమయపాలన పాటించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ABHA కార్ట్స్ ను ఇంప్రూవ్ చేయాలని ప్రజలందరూ ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ , హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ సదానందం,ఫార్మసిస్ట్ శ్రీధర్,ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు.

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు

సిరిసిల్ల టౌన్ : ( నేటి ధాత్రి )

shine junior college

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో స్కానింగ్ సెంటర్ల ల్లో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో రికార్డులను పరిశీలించి, స్కానింగ్ మిషన్ల తనిఖీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీల వివరాలతో ఫారం ఎఫ్ ఆడిట్ లను పరిశీలించి, సి సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు ప్రోత్సహించవలసిందిగా సూచిస్తూ, లింగ నిర్ధారణ చేయడం నేరమని ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలిపినారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్ పి ఓ ఎమ్ హెచ్ ఎన్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్.ఈ బాలయ్య పాల్గొన్నారు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:.

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు షైక్ రబ్బాని యొక్క తమ్ముడు షైక్ సులేమన్ తనయుని కూతురు అజ్వ యొక్క జన్మదిన సంధర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కేకు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. షేక్ రబ్బాని మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.అని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ షఫీ ఉద్దీన్ షేక్ సజ్జహోద్దీన్ బంధుమిత్రులు కుటుంబ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.

మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన.

మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన
జిల్లా వైద్య అధికారి డాక్టర్ రజిత

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల మరియు వేములవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును మరియు లోని పిఎస్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ను తనిఖీ నిర్వహించి మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించినారు.

Health Officer Dr. Rajitha.

 

 

 

ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ శానిటేషన్ మహిళ సిబ్బంది, స్వయం సహాయక మహిళా సిబ్బందిని ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ ఆరోగ్య రక్షణలో తన బాధ్యతగా క్యాన్సర్ సంబంధిత రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు దీర్ఘకాల వ్యాధుల( మధుమేహం, రక్తపోటు) పై ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డిపిఓ రాజేందర్, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు…

పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు…

వ్యాధుల కాలం- జరఫైలం..

అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించాలి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి…

ఆసుపత్రి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి…

వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కావలసిన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి…

పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టాలి…

డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి…

మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి…

మీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయాలి…

దోమలు రాకుండా ఫాగింగ్ చేయించాలి…

వైద్య సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి…

పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి…

బిపి, హెచ్ఐవి,షుగర్ రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవనందించాలి…

స్కానింగ్ మిషన్లు,ఫ్యాన్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచాలి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి…

 

 

 

 

 

Lurking seasonal diseases

నేటి ధాత్రి -మహబూబాబాద్, గార్ల:- వర్షాకాలం ప్రారంభంలో మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం లోపించి రోడ్లపైనే మురికి నీరు నిలబడడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. గ్రామస్థాయి అధికారులు, వైద్య సిబ్బంది ముందు నుండే జాగ్రత్త పడి జ్వరాలను నియంత్రించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా డెంగ్యూ, చికున్ గున్య, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. వర్షాకాలం కారణంగా వీధులు, రహదారులు, ఇళ్ల నడుమ మురుగునీరు నిలిచి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి ఏటా వానాకాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ,చికున్ గున్య,మెదడువాపు, ఫైలేరియా,అతిసారం, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు గ్రామీణ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించాలి. ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలి. ఆసుపత్రి చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించుకోవాలి. పల్లె ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చే రోగులకు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారితో స్నేహపూర్వకంగా మెలిగి వైద్యం అందించాలి. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కావలసిన అత్యవసర మందులు, వైద్యం అందుబాటులో ఉంచాలి. అత్యవసర మందులు ఆసుపత్రుల్లో సమయానికి లేకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ, గ్రామపంచాయతీ, మున్సిపల్, విద్యాశాఖ, సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్ల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులను అరికట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టి ప్రజలు డెంగ్యూ,మలేరియా,చీకున్ గున్య లాంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. డ్రైనేజీలు మురుగు నీటితో, చెత్తాచెదారం తో నిండిపోయి ఉన్నాయి. తక్షణమే డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. వర్షాకాలంలో మంచినీటి బావులలో చెత్తాచెదారం, దుమ్ము ధూళితో నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నందున ఎప్పటికప్పుడు మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి. నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయించి దోమలు రాకుండా ఫాగింగ్ చేయించాలి. వారానికి రెండు రోజులు డ్రైడే పాటించేలా అధికారులు కిందిస్తాయి అధికారులను ఆదేశించాలి. వర్షాకాలంలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. మలేరియా, చీకున్ గున్య, డెంగ్యూ వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తి చెందడం కారణంగా వ్యాధులు ప్రభలే ఆస్కారం ఉంటుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. అన్ని రకాల మందులతోపాటు నీడిల్స్ కొరత రానివ్వకుండా చర్యలు చేపట్టాలి. బిపి, హెచ్ఐవి, షుగర్ రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన సేవలందించాలి. ప్రభుత్వ వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి వైద్య సేవలు అందించడంలో విఫలం చెందటంతో ప్రజలు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. స్తోమత లేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలో నిర్లక్ష్యం మూలంగా, సకాలంలో వైద్యం అందించకపోవడంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి.మలేరియా, చీకున్ గున్య, ఫైలేరియా, డెంగ్యూ, జ్వరాలు మరియు కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అతిసారా, కలరా, రక్త విరోచనాలు, టైఫాయిడ్, వ్యాధులు రాకుండా గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. పాము తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి. పాము తేలు కాటుకు గురైన ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మంత్రాలు, నాటు వైద్యులను సంప్రదించి ఆలస్యం చేయడం మూలంగా మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించి రోగాల బారి నుండి ప్రజలను కాపాడే విధంగా వైద్య సిబ్బంది చొరవ చూపాలి. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి. అన్ని సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలి. గ్రామపంచాయతీలు, పురపాలికల్లో నీటి క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల వద్దకు ప్రతి ఇంటింటికి వెళ్లి జాగ్రత్తలు తెలియజేయాలి. ఇళ్లలోని కుండీలు, కూలర్లు వంటి వాటిలో ఉన్న నీటిని పారబోసేలా చైతన్యం చేయాలి. గ్రామాలు కాలనీల్లో ని ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా, వైద్యులు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించడంతో గ్రామాల్లో ఇవేమీ అమలు కావడం లేదు. సీజనల్ వ్యాధులు ముంచుకొస్తున్న వేళ ముందస్తు చర్యలు చేపట్టి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి, పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ వైద్యులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు కోరుతున్నారు.

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం..

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం..

 

ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది తింటే జీవితంలో మధుమేహం రాదని అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణంగా ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల వస్తుంది. నేటి కాలంలో చిన్న పిల్లలు మొదలుకుని పెద్దలవరకు చాలా మంది ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. దీని కోసం కొంతమంది మందులు వాడతారు. మరికొందరు ఇన్సులిన్ తీసుకుంటారు. కానీ, అరటి పువ్వు డయాబెటిస్‌కు ఒక అద్భుతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అరటి పువ్వు మధుమేహానికి దివ్య ఔషధమని అంటున్నారు. దీని నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయని, దీనిలోని ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయని చెబుతున్నారు.
అరటి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. అరటి పువ్వులో మెగ్నీషియం చాలా సమృద్ధిగా ఉంటుంది. మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇవి మహిళల్లో రుతుక్రమ సమస్యలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్లు ఎ, సి, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణ వ్యాధులను నివారిస్తాయి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

వరంగల్ జిల్లాలో గల దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను
రాష్ట్ర ప్రభుత్వము కళాశాల స్థాయిలో (ఇంటర్ మీడియట్) (ఎంఎల్టీ) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నూతన కోర్స్ లను ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు.ప్రతీ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లను మంజూరు చేయడం
జరిగిందన్నారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరని తెలిపారు. అంతే
కాక 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్ర మరియు జిల్లా ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలు కేజిబివిలు
సాధించయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాలో గల 09 కేజిబివిలలో ఖానాపూర్, రాయపర్తి మరియు వర్ధన్నపేట
కేజిబివిలలో ఎంపీసీ,బైపిసి కోర్సులు ,చెన్నారావుపేట, గీసుగొండ, నల్లబెల్లి,సంగెం కేజిబివిలలో సిఈసి,ఎంపీహెచ్ డబ్ల్యు,(మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్) కోర్సులు ఉన్నాయని అలాగే దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో ఎంఎల్టి కోర్సులలో అధిక
మొత్తంలో గ్రామీణ ప్రాంతంలోని పేద బలహీనవర్గాల బాలికలు ప్రవేశాలను పొందగలరని జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కోరారు.

సిబ్బందికి జీతాలు చెల్లించాలి.

‘సిబ్బందికి జీతాలు చెల్లించాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి: జహీరాబాద్లోని 1962 పశుసంచార వాహన సేవల సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం జీతాలు చెల్లించాలని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూగ జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న వీరికి సకాలంలో జీతాలు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఫార్మసి మందులను పోర్టల్ లో ఎంట్రీ చేయాలి…

ఫార్మసి మందులను పోర్టల్ లో ఎంట్రీ చేయాలి…

డాక్టర్ బి.రవి రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి…

నేటి ధాత్రి – మహబూబాబాద్ :-

 

 

జిల్లాలో వ్యాప్తంగా పనిచేస్తున్న ఫార్మసీ వైద్య సిబ్బంది అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన తాత్కాలిక పద్ధతులైన అంతరా ఇంజక్షన్స్, ఓరల్ పిల్స్,ఐ యు సి డి జిల్లాకు వచ్చినఅన్ని రకాల మందులు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫార్మసీ వైద్య సిబ్బందిలో తో ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ,వర్షాకాలంలో మందులన్నీ మూడు నెలల స్టాక్ ఉంచుకోవాలని కోరడం సూచించారు.

Dr. B. Ravi Rathod, District Medical Health Officer.

 

 

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ,డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సారంగం, డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ,లోక్య,ఫార్మసీ ఆఫీసర్ రామారావు, డిపిఓ నీలోహన, డిడిఎం సౌమిత్, సూపర్వైజర్ రవి, రాజ్యలక్ష్మి విసిసిఎం, ఫార్మసీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ‌. ‌

రోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది హాజరు పట్టికను పరిశీలి ంచి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డే )డేసర్వే చేయాలని మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అదే రంగాపురం పిఢిసిల్ల మోట్ల పెళ్లి నూతన సబ్ సెంటర్ లను (పల్లె దవఖానాలను) పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ నవత ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

సీజనల్ వ్యాధుల అవగాహన.

*సీజనల్ వ్యాధుల అవగాహన. * *

డాక్టర్ నాగరాణి .

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి .

 

 

 

*మొగుళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వేసవికాలం పూర్తి కాలేదు ఎండలు బాగా ఉండటంవల్ల వడదెబ్బ తలిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అదేవిధంగా వర్షాలు కూడా అధికముగా పడడం వల్ల నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి మలేరియాl, డెంగ్యూ ,చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి తగిన సూచనలు ఇవ్వాలని వైద్యాధికారి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సునీత, జమున, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్.

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

◆ విధుల్లో నిర్లక్ష్యం.. కరెంట్ పోయినప్పుడు టార్చ్ లైట్లతో వైద్యం

జహీరాబాద్ నేటి ధాత్రి,:

 

 

 

జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో భద్రత లోపాలు, ఆధునిక వసతుల వినియోగంలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ను అదికారికంగా సస్పెండ్ చేశారు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో జన రేటర్ ఉన్న వాడకపోవడంతో పేషెంట్లకు టార్చ్ లైట్ల ద్వారా వైద్యం అందిం చిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పత్రికల్లో కథనాలు వెలువడిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశే ఖర్ స్వయంగా ఆస్పత్రిని తనిఖీ చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో డాక్టర్ శ్రీదర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలోను డాక్టర్ శ్రీధర్పై పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఉద్యో గులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు. ప్రజల ప్రాణాలు దోహదంగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. ఈ ఘటనపై మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆరోగ్య శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది.

పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారంతో మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు పొగాకు వ్యతిరేకత దినోత్సవం గురించి మండల ప్రజలు మరియు పేషంట్లతోని పొగాకు వాడడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు తెలియజేయుచు దీనిని వాడకూడదని వాడిన వారిని వాడకుండా చూడాలని చెప్పుచు అందరి చేత పొగాకు వాడకం నిరోధించుటకు ప్రతిజ్ఞ చేపించారు ఈ సందర్బంగా వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ పొగాకుతో అనుసంధానం అయినా పాన్ మసాలాలు తంబాకులు సిగరెట్లు వాడడం వల్ల త్రోట్ క్యాన్సర్ గాని లంగ్ క్యాన్సర్ గాని వివిధ రకములైన జబ్బులు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఇలాంటివి వాడకూడదని తెలియజేసి అందరికీ ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది. అందరితోని పొగాకు వాడమని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో పి ఎచ్ ఎన్ గ్రేసీ వన్ సూపర్వైజర్స్ రమాదేవి ఎమ్ ఎల్ ఎచ్ పి లావణ్య దీప్తి మరియు ఏఎన్ఎంలు రమాదేవి స్రవంతి సునీత కళావతి దుర్గమ్మ పుష్పలత మరియు ఆశా వర్కర్స్ స్టాఫ్ నర్స్ రవళి ఝాన్సీ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ ఫార్మసిస్ట్ జగదీశ్వర్ మరియు భూపెల్లి మొగిలి పాల్గొన్నారు

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

నిజాంపేట పట్టణంలో నివాసముంటున్న బీహార్ కు చెందిన మహిళ మనిషేదేవ్ పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్న సమయంలో పురిటి నొప్పులు అధికమవడంతో మార్గమధ్యంలో 108 ఈఎంటి స్వామి అంబులెన్స్ లో ప్రసారం చేశారు. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా

కలిసిన జిల్లా వైద్య హెచ్.వన్ సంఘo అధికారులు

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

 

 

తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల H -1 సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కు సన్మాన కార్యక్రమం.వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పై ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరీసిల్ల జిల్లా కు వచ్చిన అబ్దుల్ ఖాదర్ కు సన్మాన చేయడం జరిగింది. ఈ సందర్భముగా యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ ఖాదర్ గత 35 ఇయర్స్ నుండి వైద్య ఆరోగ్య శాఖ లో వివిధ హోదాలలో నిబద్ధతో పని చేస్తూ పై అధికారుల మన్నన పొందారని వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉంటారనీ తెలిపారు. సౌమ్యంగా వ్యహరిస్తూ కింది స్థాయి సిబ్బంది తో పని చేయిస్తారని తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రమోషన్ పొందిన పోస్ట్ లోకూడా సక్సెస్ గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము.మరియు ఈ సందర్భముగా B. లక్ష్మీ నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బొకే ఇచ్చి మర్యాద పూర్వకముగా కలిశారు.సన్మాన కార్యక్రమం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరిడెంట్ MD. షమీము, జిల్లా యూనియన్ నాయకులు MD. అజీజ్ B. జనార్దన్ మరియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ యన్.శ్రీనివాస్ కర్ణ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ T. రవీందర్ బ్లడ్ బ్యాంక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD.రఫీ మరియు అంజయ్య, MD. రషీద్ రవి, రాహుల్, మౌనిక మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డెంగ్యూ,మలేరియా జ్వరాల నివారణలో భాగంగా డ్రై డే కార్యక్రమంలో పాల్గొని (డ్రము )తొట్టి లలో లార్వా లు గల నీటి ని తొలగించడం, టైర్లు, కూలర్లు, రోళ్ళు గల లార్వాలను తొలగించడం, నీటి నిల్వలు గల ప్రాంతాలను గుర్తించి పూడ్చి వేయడం, డ్రైనేజ్ లలో నీరు నిల్వ ఉండకుండా, రోడ్లపై చెత్త చెదారము నిల్వ ఉండకుండా, ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత లో భాగంగా తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం, గుంపులలో, ప్రయాణ సమయంలో మాస్కులు ధరించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలు నివారించవచ్చునని

Program Officer Dr. Anitha,

ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, మలేరియా సూపర్వైజర్ లింగం, వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version