ఘనంగా ప్రపంచ మెకానిక్ డే దినోత్సవం
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 3న జరుపుకుంటారు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో మెకానిక్ యూనియన్ సభ్యులందరూ కలిసి జెండా ఎగరవేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి యూనియన్ అధ్యక్షుడు చిరుత మల్లేష్, యూనియన్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఆయన మాట్లాడుతూ..ఈ రోజున, వాహనాలు, యంత్రాలు మరియు ఇతర సాంకేతిక పరికరాలను సరిచేయడంలో నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన మెకానిక్ల కృషిని, ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఆ మెకానిక్స్ డేను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత మెకానిక్ల పాత్రను గుర్తించడం.
వాహనాలు,యంత్రాలు సజావుగా పనిచేయడానికి మెకానిక్ల కృషి ఎంతో అవసరం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెకానిక్ల కృషిని గుర్తించి,అభినందించడానికి ఈ రోజున జరుపుకోవడం జరుగుతుందని మెకానిక్స్ రోజు అనేది సాంకేతిక పరిజ్ఞానం మెకానికల్ నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
సమాజానికి సేవనందించే విధంగా
మెకానిక్ సేవలు మన జీవితాలను సులభతరం చేస్తాయిని మన కృషి లేకుండా మనం వాహనాలను లేదా ఇతర యంత్రాలను సరిగ్గా ఉపయోగించలేముని
ఈరోజు మెకానిక్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుదాంఆని మన జీవితాలను సులభతరం చేయడానికి చేసే కృషిని గుర్తుంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రోజు బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి ముత్యం పల్లి భాస్కర్, మర్రి రాము,మెరుగు కిషన్,కస్తూరి సత్యం, కుమార్,ఓ శ్రీనివాస్, తుమ్మల శ్రీనివాస్,సురేష్, మున్నా,ఓదెలు,శ్రీను, జగదీష్,శంకర్,తదితరులు పాల్గొన్నారు.