నిత్య సేవలందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్..

నిత్య సేవలందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

ఘనంగా ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

సామాన్య ప్రజలకు నిత్య సేవలు అందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్ అని టీపీసీసీ సభ్యులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ అన్నారు.ప్రపంచం ఆటో డ్రైవర్స్ దినోత్సవం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ సభ్యులు,గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆటో కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామానంద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పారు.ఆటో డ్రైవర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో కాకతీయ యూనియన్ అధ్యక్షులు ఇస్రం కుమార్,పట్టణ ఇన్చార్జి కొమ్ము వినయ్ కుమార్, ఐఎన్టియుసి నాయకులు ఆకుతోట ఇంద్రసేనారెడ్డి, పాకాల రోడ్ ఆటో యూనియన్ అధ్యక్షులు దేశి విజయ్, ఉపాధ్యక్షులు ఈదుల శ్రీను, కార్యదర్శి మండల రమేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు పోగుల రాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి,మాజీ కౌన్సిలర్ యెలకంటి విజయ్,మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, ప్రధాన కార్యదర్శి బైరి మురళి,కార్యదర్శులు మోటం రవి,గిరగాని రమేష్,నాంపెల్లి వెంకటేశ్వర్లు,బూస నర్సింహరాములు,బిట్ల మనోహర్,రామగోని శ్రీనివాస్,మైధం రాకేష్, రామగోని సుధాకర్,గండు గిరివరంగంటి విక్రమ్ సాయి తదితరులు పాల్గోన్నారు.

యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలి.

యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

నిరంతర యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్,యోగ గురువు కొల్గూరి రాజేశ్వర రావు ఆద్వర్యంలో శనివారం పరకాల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పతంజలి యోగ మహర్షికి జ్యోతి ప్రజ్వలన గావించి సుమారు రెండు గంటల పాటు వివిధ రకాల యోగాసనాల,ప్రణాయమాలు పట్టించడం జరిగింది.అనంతరం యోగా”డే”ను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా,ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలన్నారు.తాను కొంత కాలంగా యోగ వర్చ్యువల్ గా పాటిస్తున్నట్లు తెలిపారు.

మానసిక ప్రశాంత చేకురుతుందని,ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నట్లు వెల్లడించారు.యోగా
9సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయస్సు వరకు యోగాను ఎవరైన పటించ వచ్చన్నారు.
యోగ గురువు రాజేశ్వరరావు మాట్లాడుతూ యోగా డే ప్రాశస్త్యాన్ని వివరించారు.అనంతరం అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించి,మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి తన జన్మదినం సందర్భంగా అందించిన భగవద్గీతను యోగ అభ్యాసకులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్ కే నారాయణ,మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ సుష్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,సిఐ క్రాంతికుమార్, కాంగ్రెస్ నాయకులు పాడి ప్రతాప్ రెడ్డి,ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మౌనిక,ప్రభుత్వ అయూష్ వైద్యాధికారి సీనియర్ జర్నలిస్టు మెండు రవిందర్,మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం.

ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం

కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో యోగా శిక్షణ

ఐడీఓసీలో దశాబ్ది ఉత్సవాలు

యోగా శిక్షకులు శ్రీనివాస్, స్వప్న

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ అధికారులకు, యోగ శిక్షణలో భాగంగా నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,టీ.స్వప్న
పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరేట్ అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగా ఆసనాలు, ప్రాణాయామం ముద్రలు ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ..చేయించారుప్రతి రోజు యోగా చేయడం వలన కలిగే లాభాలు, ఆరోగ్యం ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో.రామ్ రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప ,డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందిన.

ఆర్యవైశ్య వైకుంఠ రథానికి ఉచితంగా బ్యాటరీ ఇచ్చిన దాత

నేటిదాత్రి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందిన

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా చిట్యాల రోడ్ లో ఆర్యవైశ్య వైకుంఠ రథానికి బ్యాటరీ లేనందువల్ల వైకుంఠ రథం ఉపయోగంలోకి రావడం లేదని దహన కమిటీ మాజీ చైర్మన్ పాలాది శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా పాలాది శ్రీనివాసులు తన సొంత ఖర్చు లతో శనివారం నాడు వైకుంఠ రథానికి బ్యాటరీ కొనుగోలు చేసి డ్రైవర్ కు అప్పగించారు ఈకార్యక్రమంలో పెంట్లవెల్లి విశ్వనాథం డ్రైవర్ వెంకటేష్ పాల్గొన్నారు ఈమేరకు పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ విలేకరులు వేముల రాజి శెట్టి బొమ్మ వెంకటస్వామి అ వొ ప .పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు పొలిశెట్టి మురళి లారీ చే బా ర నరసింహ చవ్వ పండరయ్య తాడిపర్తి వెంకటస్వామి వేముల శంకరయ్యశెట్టి వేముల వెంకటస్వామి వేముల రాజు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకూరు బుచ్చయ్య శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టిఆర్యవైశ్య వైకుంఠ రథం బ్యాటరీ కొనుగోలు చేసి ఇచ్చినందుకు ఒక ప్రకటనలో పోలాది శ్రీనివాసులు కు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్యవైశ్య నేతలు ఆర్యవైశ్య అనుబంధ సంఘాలు వనపర్తి ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం పట్టణ ఆర్యవైశ్యులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా చిట్యాల రోడ్డులో ఉన్న వైకుంఠ రథం బయటకి తీసుకురావాలని ఆర్యవైశ్యులు వేడుకుంటున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version