ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…

ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…

సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం,పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు ఆదివాసులు…

ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను ఆపాలి…

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి…

అడవి సంరక్షణ సవరణ బిల్లును వ్యతిరేకించాలి…

నేటి ధాత్రి-గార్ల:-

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T115349.870.wav?_=1

దశాబ్దాల కాలంలో అన్ని దేశాలు పరస్పర సహకారంతో మానవ హక్కులు, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధించడానికి కృషి చేయాలని నిర్ణయించినప్పటికీ దేశవ్యాప్తంగా నేడు దీనికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ రాష్ట్ర ఫోరం నాయకులు జి. సక్రు అన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి పోరాట దినోత్సవం సందర్భంగా మంగళవారం చిన్నకిష్టాపురం, సత్యనారాయణపురం, గుంపెళ్ళగూడెం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సక్రు మాట్లాడుతూ, ఈశాన్యభారతంలో,మధ్య భారతంలో సామ్రాజ్యవాద రూపంలో ఉన్న పాలకులు ఆదివాసులపై యుద్ధం ప్రకటించారని,భారతదేశ మూలవాసులైన ఆదివాసీలను అంతమొందించే చర్యలను చేపట్టారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానంపై విల్లు ఎక్కుపెట్టిన బీర్ షా ముండా, కొమురం భీమ్, రాంజీ గోండుల పోరాటాల ఫలితంగా నాడు రాజ్యాంగంలో ఐదు మరియు ఆరవ షెడ్యూల్ ఏర్పాటు అయితే నేడు ఈ చట్టాల ఊసే లేదని వీటిని నిర్వీర్యం చేయడానికి పాలకులు కొత్త చట్టాలను తీసుకువచ్చారని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో గిరిజన తెగల మధ్య విద్వేషాగ్ని రాజేషి అంతులేని అరాచకాలు కొనసాగిస్తుందని ఆయన అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగు దారులు అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మన చట్టాలను తూట్లు పొడుస్తూ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదివాసి వ్యతిరేక చర్యలను వ్యతిరేకించాలని ఇందులో భాగంగా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ను వాడవాడనా, గ్రామ,గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కవిత,ఇందిరా, భారతి, వెంకన్న,సైదులు, సాంబయ్య,ధర్మయ్య,రాధా తదితరులు పాల్గొన్నారు.

ముంపు సమస్యల సమయాత్తం కావాలి..

ముంపు సమస్యల సమయాత్తం కావాలి

రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్

*ముంపు నివారణ కోసం వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు,
జిడబ్ల్యూఎంసీ కమిషనర్ లతో సమీక్షా*

అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గ్రేటర్ నగరంలోని ప్రధాన నాలలను పరిశీలించిన స్పెషల్ సీఎస్

 

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి:

వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు
అధికారులు ప్రణాళికాబద్ధంగా సమాయాత్తం కావాలని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Flood problems need time to end.

సోమవారం జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో అరవింద్ కుమార్ వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరిష్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి లతో కలసి గ్రేటర్ వరంగల్ నగరంలో
వర్షాకాలంలో వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు ప్రణాళికల్లో భాగంగా, వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండటం వంటి అంశాలపై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ మాట్లాడుతూ గతంలో వరద ముంపు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు.వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.అందుకుగాను ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.సకాలంలో స్పందించకపోతే చిన్నసమస్య కూడా పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉంటుందని అరవింద్ కుమార్ అధికారులను హెచ్చరించారు.అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నగరంలోని ప్రధాన నాలల స్థితిగతులు, పూడికతీత పై సమీక్షిస్తూ వరద నీరు నిలువకుండా నాలాల్లోకి పంపేలా ముందస్తుగా పనులు చేయాలని తెలిపారు.బయటి నుంచి వచ్చే వరద నీటిని దారి మళ్లించేలా చూడాలని, జిల్లాలో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించబడే డిఆర్ఎఫ్,జిల్లా అగ్నిమాపక శాఖ,ఎస్డిఆర్ఎఫ్ బృందాలు భారీ వర్షాలవల్ల నష్టం జరగకుండా ముంపు నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్ర స్థాయిలో 6 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని అత్యవసత్యవసర పరిస్థితుల్లో ఈ బృందాలను వినియోగించుకోవాలని అన్నారు.

Flood problems need time to end.

దీంతో పాటుగా ఆపద మిత్ర వాలంటీర్ల సేవలు కూడా ఉపయోగించుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా, సైరన్ ద్వారా నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు.గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్ల కార్పొరేటర్లు, ఆధికారులతో వాట్స్అప్ గ్రూప్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలని తెలిపారు.సీజన్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఎన్డిఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్ మాట్లాడుతూ ముందస్తుగా వరద నివారణ ప్రణాళికలను చేసుకొన్నచో సునాయసంగా వరదనుండి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవచ్చునని అన్నారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ వర్షాకాలంలో తక్షణ చర్యలకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, డ్రైనేజీ పరికరాలు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందుగానే సమర్థవంతమైన ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు.

Flood problems need time to end.

సత్వర సహయార్ధం జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424 ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో డి.ఆర్ ఎఫ్ బృందాలతో పాటు ఆపద మిత్ర వాలంటీర్ల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో తాగునీటి కలిషితం కాకుండా ప్రత్యేక చొరవ తీసుకునున్నట్లు, అన్ని చెరువుల ఎఫ్టిఎల్ మ్యాప్పింగ్ చేస్తున్నట్లు తెలిపారు.హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ లో గల 193 లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధవహించి ఎప్పటికప్పుడు సానిటేషన్ నిర్వహణతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టుటకు అప్రమత్తంగా ఉంచడం జరిగిందన్నారు.ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, సానిటరీ ఇన్స్పెక్టర్, కార్మికులతో ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు.బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి మాట్లాడుతూ కార్పొరేషన్ కు చెందిన సమాచారాన్ని అందజేయడానికి నగర వ్యాప్తం గా 5 ప్రాంతాల్లో వేరియబుల్ మెసేజ్ డిస్ప్లే బోర్డ్ సమాచారాన్ని ప్రదర్శిస్తూ ప్రజలకు అప్రమత్తం చేయడం జరుగుతున్నదని,బల్దియా ప్రధాన కార్యాలయం లో టోల్ ఫ్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1980 ఫోన్ నెం :9701999645, వాట్స్ అప్ నెం: 9701999676 ద్వారావర్షానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్న సత్వరమే సహాయం అందించనున్నట్లు తెలిపారు.ప్రజలకు పబ్లిక్ అనౌన్స్ మెంట్ ద్వారా కూడా సమాచారం అందిస్తూ ఐసిసిసి ద్వారా ఎప్పటికపుడు వర్షపాత తీవ్రత ను గుర్తిస్తూ క్షేత్ర స్తాయి లో ఉండే అధికారులకు సమాచారం అందజేసి పరిష్కరించేలా చూస్తున్నట్లు,100 కార్యాచరణలో భాగంగా సిడిఏంఏ సూచించినట్లు డ్రైన్ లకు మెష్ లు ఏర్పాటు చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికపుడు డీ వాటరింగ్ , శానిటేషన్ కు సంబంధించి డ్రైన్ లలో ఎప్పటికపుడు చెత్త తొలగింపు ప్రక్రియ భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి బెడ్ షీట్లు ఆహారం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ అన్నారు.శిథిల భవనాలకు నోటీసులు జారీ, వారిని తక్షణమే ఖాళీ చేయించడం జరుగుతున్నదని అన్నారు.అనంతరం ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి నయీమ్ నగర్ నాలా, రాజాజీ నగర్ కల్వర్టు, ప్రెసిడెంట్ పాఠశాల నుండి నయీమ్ నగర్ వరకు రిటర్నింగ్ నిర్మించిన రిటైనింగ్ వాల్, జవహర్ నగర్, సమ్మయ్య నగర్, భద్రకాళి చెరువు ఎఫ్ టి ఎల్ లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జోనా,ఉప కమిషనర్లు రవిందర్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్, డిఆర్ ఎఫ్, టౌన్ ప్లానింగ్, స్మార్ట్ సిటీ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వర్షాకాలంలో.. రైతులకు ఊరట.

వర్షాకాలంలో.. రైతులకు ఊరట.

షీట్ షెడ్ నిర్మాణానికి రూ.175 కోట్లు నిధులు మంజూరు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, గాల్వాలూమ్ షీట్ రూఫింగ్‌తో కూడిన కవర్‌డ్ షెడ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.75 కోట్ల నిధులను ఈరోజు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రత్యేక కృషి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నూతన కవర్ షెడ్ నిర్మాణం ద్వారా రైతులకు వర్షాలు, ఎండల సమయంలో కూడా మద్దతు ధరపై ధాన్యం అమ్మే అవకాశాలు మెరుగవుతాయని మార్కెట్ యార్డ్ సిబ్బంది తెలిపారు. మార్కెట్ యార్డ్ పరిధిలో వృద్ధి చెందుతున్న వ్యవసాయ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణం కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా AMC చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్, కార్యవర్గం సభ్యులు,రైతులు, మార్కెట్ యార్డ్ ఉద్యోగులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి,

విద్యుత్ ప్రమాదంలో ఆవు మృతి,

నేటి ధాత్రి, మొగుళ్లపల్లి:

మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో సోమవారం విద్యుత్ ప్రమాదంలో తోకల లక్ష్మయ్య అనే రైతుకు సంబంధించిన ఆవుమొట్లపల్లి పల్లె ప్రకృతి వనం వద్ద నున్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు ప్రమాదానికి గురై ఆవు అక్కడికక్కడే మృతి చెందింది సుమారు 50 వేల రూపాయల ఆవు మృతి చెందడంతో రైతు తోకల లక్ష్మయ్య ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు..

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు పట్ల మంత్రులకు, ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లాకపోవడం శోచనీయంశం అని, స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు. మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం మంత్రుల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పొలీస్ స్టేషన్ల చుట్టూ తింపరని, రైతులను నేరస్థులుగా చూడటం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి కోసం వారి భూములను ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు. ప్రతి పక్షాల పట్ల దురుసుగా మాట్లాడం కాదు, మీకు చాతనవుతే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపండి అని హితబోధ చేశారు. కేవలం నాలుగు గంటలు మాత్రమే నీటిని విడుదల చేసి ఆపడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు నీటి సరఫరా తిరిగి విడుదల చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, దయ్యాల వీరమల్లు, పురంశెట్టి మల్లేశం, లంక నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T172721.005.wav?_=2

గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు.

బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్

చిట్యాల, నేటిధాత్రి ;

గ్రామల అభివృద్ధియే బిజెపి లక్ష్యమని చిట్యాల మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలుసాని తిరుపతిరావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగిందని పేద ప్రజల కోసం ముద్ర లోన్లు ఇంటింటికి ఎల్ఈడి బల్బులు సౌకర్యం సులభతరంగా ఉండాలని ఐదు వందే భారత్ రైలును యువత కు ఉద్యోగ కల్పన అదేవిధంగా మహిళలకు ఉజ్వల యోజన గ్యాస్ లు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతుగా నిలబడి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మద్దతు తెలిపాలని అన్నారు
అదేవిధంగా అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ బూటక హామీలతోని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు నోచుకోలేని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అములు చేయలేదన్నారు,
కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు సీనియర్ నాయకులు చెక్క నరసయ్య, సుధ ల వెంకటరాజ వీరు, సుదగాని శ్రీనివాస్ ,నల్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, గొపగాని స్వామి, మారత అశోక్ ,అనుపమ మహేష్, గొప గాని రాజు, మాదారపు రాజు ,రాజేష్, చెన్నవేని సంపత్, కదం రాజు, కేంసారపు ప్రభాకర్, ఆ వంచ రాజు, తీగల వంశీ,, అశోక్ చారి, శివారెడ్డి, చింతల రాజేందర్ ,జూనువల వివేక్, తొట్ల మహేష్, జంజర్ల కుమార్, కల్వచర్ల కిషోర్, చెప్పాలా రాజు, తదితరులు పాల్గొన్నారు.

కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ కార్యకర్తలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T165118.813.wav?_=3

కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు.

వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు, 41వ డివిజన్ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్, సోషల్ మీడియా ఇంచార్జి మైనార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో, ఉర్సు ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త ఎం.డి ఫకీర్ తండ్రి ఇటీవల మరణించగా, వారి ఇంట్టికి వెళ్లి పరామర్శించి, 50కేజీల బియ్యం అందచేశారు. ఈ కార్యక్రమంలో మంద సతీష్, ఎస్. లింగమూర్తి, పోలేపాక భాస్కర్, అశోక్ గౌడ్, బజ్జురి రవి, బొల్లం సంజీవ, ఎం.డి అఫ్రీన్, కోట యాదగిరి, లక్క సురేందర్, ఎండి షారఫాద్దీన్, మైదం బాలు, గొర్రె చేరాలు, కార్ శ్రీపాల్, వి నరేష్, ఎండి ఆహేమద్ ఖాన్, ఎండి అజర్, మైదం వంశీ, మైదం బన్నీ తదితరులు పాల్గొన్నారు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.!

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో గ్రామసభలు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download.wav?_=4

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే స్థానిక సంస్థలఎన్నికల లో.కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు పునాదులు. అని. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ప్రవేశపెట్టిన పథకాలే స్థానిక అభ్యర్థులను గెలిపిస్తాయని దానికి ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం గాని. రేషన్ కార్డులు గానీ. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీరుణాలు గాని
. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 18 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పిస్తూ ఇక ముందు కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కంటే. ఎక్కువగా అమలు చేస్తారని. తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తూ. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని రాబోయే కాలంలో మరింత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలా. ప్రజలు తమ ఓటు హక్కుతో స్థానిక అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగిల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి.లింగాల గుగ్గిళ్ళ భరత్
. బాలరాజ్ కోల మాజీ సర్పంచ్ బానయ్య.జలంధర్ రెడ్డి. సదానందం. శ్రీరామ్. శ్రీనివాస్. అంజయ్య. రాములు. లావణ్య. ప్రమీల. తంగళ్ళపల్లి మండల. ప్రతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
.

బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటం కోసం సిరిసిల్ల టు ఢిల్లీ ప్రయాణం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T132609.249.wav?_=5

బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటం కోసం సిరిసిల్ల టు ఢిల్లీ ప్రయాణం

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదట కులగణన చేసి అట్టి బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపగా కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ బిల్లును ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చి చట్టబద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కాలం గడుపుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర ప్రభుత్వాన్ని కి కనువిప్పు కలిగించి బీసీల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాలని చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిరిసిల్ల నుంచి బయలుదేరారు. చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప, టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు రెడ్దిమల్ల భాను, గుడిసె ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సబ్బని వేణు కలిసి బయలుదేరారు.

మంత్రుల ను సన్మానము చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి..

మంత్రుల ను సన్మానము చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి .

కొల్లాపూర్ నియోజక వర్గాలలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ శంకుస్థాపనల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూల్ ఎంపి డాక్టర్ మల్లు రవి ,ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి సన్మానించి ఘన స్వాగతం పలికినారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోర్దినేట ర్ డి వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారురాష్ట్ర ఉప ముఖ్యమంత్ర మల్లు బట్టి విక్రమార్క మంత్రి జుపల్లికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి టౌన్ నియోజకవర్గంలోని సమస్యల గురించి వివరించారని తెలిపారు

బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ని.!

బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు ని కలిసిన మెట్ పల్లి మున్నూరు కాపు సంఘ సభ్యులు కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి వారి యొక్క సంఘం భవన నిర్మాణం కోసం కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర నాయకులు రఘుని కోరారుఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్ జిల్లా నాయకులు శ్రీకర్ గౌడ్ చింతల మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ్యానిపెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన…

మ్యానిపెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని నిరసన ప్రదర్శన

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 18 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం అంటే కేవలం బీసీ సమాజాన్ని మభ్యపెట్టడం అవుతుంది.ఇప్పటికైనా ఈ అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.అమలు చేయవలసిన
బీసీ అంశాలు..మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ సివిల్ కన్స్ ట్రాక్షన్ మెంటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం,రిజర్వేషన్లు కల్పించాలి.చిరు వ్యాపారులకు విద్యార్థుల ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచి కత్తులేని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.బీసీ కార్పొరేషన్లు అలాగే ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.అన్ని జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్ ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీల క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఈ ఐక్యత భవనాలలోనే బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల ఏర్పాటు చేస్తామని అనేక అంశాలను మానిఫెస్టోలో పెట్టి బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం అంటే బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అవుతుంది ఇప్పటికైనా ఈ అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేనిపక్షంలో ఈ అంశాలను బీసీ సమాజం దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగానిలబెడతామనిహెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్
రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకన్న,జిల్లా కార్యదర్శి శాఖ పురం భీమసేన్,ఏదునూరు రమేష్,కీర్తి బిక్షపతి,చంద్రగిరి చంద్రమౌళి,రంగు అశోక్,గుండా రాజమల్లు,వేముల అశోక్,ఆరెందుల రాజేశం, అంకం సతీష్,జక్కం పూర్ణచందర్,తదితరులు నాయకులు పాల్గొన్నారు.

పి ఏం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడుత నిధుల విడుదల.

పి ఏం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడుత నిధుల విడుదల.

కాశిబుగ్గ నేటిధాత్రి

రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద 20వ విడత నిధులుశనివారం రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతు ఖాతా లోకి నేరుగా విడుదల ఈ సందర్భంగా దేశ రైతుంగాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమం రైతు వేదికలోని వీసీ యూనిట్ లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి ఎస్సి కార్పొరేషన్ ఈ డి సురేష్ కుమార్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మండలంలో 7079 మంది రైతులకు కిసాన్ సన్ నిధి క్రింద ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.6000 మూడు విడుతలలో,ఒక విడుతకు రూ.2000 చొప్పున లబ్ది చేకూరుతుందన్నారు.

⏩ అనంతరం ఏ వో హరిప్రసాద్ మాట్లాడుతూ మండలంలో ఇంకా 573 మంది రైతులు ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉందని,929 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు.వెంటనే
పెండింగ్ ఉన్న రైతులు అట్టి పనులు వెంటనే పూర్తి చేసుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ది పొందాలని కోరుతున్నాము.
అంతకుముందు గంగదేవి పల్లి గ్రామంలో ఏరువాక సాగుబడి రైతు అవగాహన కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏవో హరిప్రసాద్ మాట్లాడుతూ రైతులు ప్రస్తుతం పత్తి పంటలు తెలుసుకోవలసిన జాగ్రత్తల నుంచి అవగాహన కల్పించడం జరిగింది. రైతులు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేసుకోవాలని పురుగు మందులతో కలిపి చల్లకూడదని తెలిపారు.రసం పీల్చే పురుగుల ఉధృతిని తెలుసుకోవడానికి జిగురు అట్టలను వాడాలని,ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్ మందులను ఎట్టి పరిస్థితుల్లో కలిపి వాడరాదని,పంట తొలి దశలో నీమ్ ఆయిల్ ను విస్తృతంగా వాడాలని సూచించారు.నానో ఏరియా నానో డిఏపి ఎరువులను వాడడం వల్ల 80 నుంచి 90 శాతం నత్రజని ఎరువు మొక్కకు అందుతుందన్నారు. మొక్కలపై ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే పురుగు మందుల పిచికారి చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గీసుకొండ ఏఈఓ రజిని,ధర్మారం ఏఈవో కావ్య,కూసం రాజమౌళి మరియు రైతులు పాల్గొన్నారు.

పి. హరి ప్రసాద్ బాబు
మండల వ్యవసాయ అధికారి
గీసుగొండ.

గని ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం…

గని ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం…

కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

సింగరేణికి అవ్వా, అయ్యా లేకుండా అనాధగా మారింది…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి గని ప్రమాదంలో మరణించిన కార్మికుడు శ్రావణ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం,కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.మందమర్రి డివిజన్ లోని కేకే 5 గనిలో అండర్ గ్రౌండ్ లో ఎస్ డి ఎల్ యాక్టింగ్ గా పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు రాచపల్లి శ్రావణ్ కుమార్ ప్రమాదంలో మృతి చెందాడు.శనివారం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని సందర్శించి, మృతదేహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించి,మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.అనంతరం మంత్రి మాట్లాడారు.

శ్రావణ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని, ఈ ప్రమాదానికి కారణమైన అధికారుల పై చర్యలు తీసుకునే విధంగా చేస్తామన్నారు.గని ప్రమాదంలో మరణించిన కార్మికుడు శ్రావణ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం,కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.మంత్రి వెంట ఏఐటియుసి జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య మృత దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా చొరవ తీసుకుంటామని అన్నారు. సింగరేణి యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేకుండా ఉందని, కార్మికుల రక్షణ కు ప్రత్యేక శ్రద్ధ చూపించేల యాజమాన్యం చొరవ తీసుకోవాలని సిఐటియు నాయకులు రాజీ రెడ్డి,సాంబారి వెంకటస్వామి లు డిమాండ్ చేశారు. పలువురు యూనియన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,నాయకులు పాల్గొన్నారు.

సింగరేణికి అవ్వా, అయ్యా లేకుండా అనాధగా మారింది…

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

సింగరేణికి అయ్యా అవ్వ లేకుండా అనాథగా మారిందని, సీఎండి , సంబంధిత మంత్రి , ఎవరు పట్టించుకోకుండా పోవడం వల్లే ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నాయని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మంచిర్యాల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు, మందమర్రి గని ప్రమాదం లో మృతి చెందిన కార్మికుడు శ్రవణ్ మృతదేహానికి ఆర్కేపి ఏరియా ఆసుపత్రి లో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు, కార్మికుల రక్షణ మీద శ్రద్ధ పెట్టక అవినీతి అక్రమాలు చేస్తున్నారని మండి పడ్డారు, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు, రామిడి కుమార్,టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, మహేష్ నాయకులు పాల్గొన్నారు.

రామాలయాన్ని ఎండోమెంట్ కు అప్పగించడం దారుణం..

రామాలయాన్ని ఎండోమెంట్ కు అప్పగించడం దారుణం..

ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే..

మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి..

రామయంపేట ఆగస్టు 2 నేటి ధాత్రి (మెదక్)

మెదక్ రామాలయాన్ని ఎండోమెంట్కు అప్పగించడం దారుణమని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఇందుకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా లేనివిధంగా ఎండోమెంట్కు అప్పగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే అన్నారు.

ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా రామాలయాన్ని ఎందుకు ఎండోమెంట్కు ఇచ్చారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని అన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయంలో పోరాటం చేస్తామని అన్నారు. ఎండోమెంట్లో కలిపే పరిస్థితి వస్తే ముందస్తుగా ప్రకటన చేసి అభిప్రాయాలు తీసుకోవాల్సింది పోయి ఎవరికి తెలియకుండా ఎండోమెంట్లో కలపడం సమంజసం కాదన్నారు.

చిరంజీవి అభిమాని కుటుంబానికి వెలిచాల…

చిరంజీవి అభిమాని కుటుంబానికి వెలిచాల రాజేందర్ రావు సాయం అందజేత

కరీంనగర్, నేటిధాత్రి:

మెగా స్టార్ చిరంజీవి అభిమాని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ)లోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఇరవై వేల చెక్కును అందజేశారు. కమలాపుర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన చెరిపెల్లి కిరణ్ కుమార్ గత ఇరవై సంవత్సరాల నుంచి చిరంజీవి అభిమానిగా ఉంటూ అనేక సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించారు. మూడు సంవత్సరాల క్రితం కిరణ్ కుమార్ మృతి చెందాడు. కిరణ్ కుమార్కు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో కిరణ్ కుమార్ భార్య, పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వచ్చింది. దీంతో చిరంజీవి సూచనల మేరకు చిరు స్నేహితుడు బస్వారాజ్ శ్రీనివాస్ భారత సహకార సేవా ఫోరం ద్వారా కిరణ్ కుమార్ పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. పిల్లలు చదువు పదవ తరగతి పూర్తయ్యే వరకు ఈసాయం అందజేయనున్నారు. ఈనేపథ్యంలో బస్వారాజ్ శ్రీనివాస్ ఆర్థిక సాయం కింద పంపించిన ఇరవై వేల రూపాయల చెక్కును కిరణ్ కుమార్ భార్య చెరిపెల్లి స్వప్నకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అందజేశారు. రాబోయే రోజుల్లో కిరణ్ కుమార్ కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, కోడూరి హరికృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

అసత్య ఆరోపణలు చిల్లర రాజకీయాలు

అసత్య ఆరోపణలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు మండల కేంద్రంలో కస్తూరిబా హాస్టల్ తనిఖీ చేసి సౌకర్యాలు లేవనడం సిగ్గుచేటని గత పది సంవత్సరాల కాలంలో హాస్టలను పట్టించుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు, గత పది సంవత్సరాల కాలంలో హాస్టల్ పిల్లలు దొడ్డన్నతో తింటే ఒక్కరోజు వచ్చి చూడలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు సన్న బియ్యం తింటుంటే ఓ ర్చుకోలేక గండ్ర సత్తెన్న పై ఆరోపణ చేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే తన చిల్లర రాజకీయాలు చేయొద్దని అలాగే గత పాలకుల కాలంలో కస్తూర్బా స్కూలు వర్షంతో తడిసి ఉరుస్తుంటే పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే సత్తన్న ఎమ్మెల్యే గెలిచినాక 20 లక్షల తో అభివృద్ధి పనులు చేసి పిల్లలకు సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు దీని జీర్ణించుకోలేక హాస్టల్ల సందర్శన పేరుతో వంటలు బాగా లేవనడం సౌకర్యాలు లేవనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు, స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య రాష్ట్ర నాయకులు దబ్బేట రమేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమారు గుంటూరు పల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దున నాగరాజు కాంగ్రెస్ నాయకులు బుర్ర శ్రీనివాసు, మార్కండేయ, రాజమౌళి, గుమ్మడి సత్యనారాయణ, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓదేలు స్వంత అన్నా మాకు భూమి విక్రయించాడు.

ఓదేలు స్వంత అన్నా మాకు భూమి విక్రయించాడు.

బాట స్థలాన్ని బర్ల ఫామ్ గా మార్చుకున్నాడు.

ఆ స్థలాన్ని ఖాళీ చేపించాలని మున్సిపాలిటీ కి పిర్యాదు చేశాం.

ఇందులో ఎమ్మేల్యే కు ఎలాంటి సంబంధం లేదు.

విలేకర్ల సమావేశంలో ముంజూర్ నగర్ భూభాధితుల వెల్లడి.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా ముంజూర్ నగర్ లో రెండు రోజుల క్రితం
కురాకుల ఓదెలు లలిత దంపతులు తను బర్ల కోసం వేసికున్న షెడ్డు తమ భూమిలోనే ఉన్నాయని భూభాధితుల పేర్కొన్నారు. శనివారం భూపాలపల్లి ప్రెస్ క్లబ్ లో భూమికి సంబందించిన డాకుమెంట్స్ పత్రాలతో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి పత్రలు లేకున్నా తాము కొనుగోలు చేసిన రోడ్డును కబ్జా చేసి ఓదేలు షెడ్డు నిర్మించడని అన్నారు. అయితే ఆ భూమికి సంబంధించి 2010 లొ కొనుగోలు చేసిన దొంతుల వేణుమాధవ్ సర్వే నెంబర్ 192లో అట్టి భూమిని కూరకుల రాజయ్య దగ్గర కొనుగోలు చేయడం జరిగిందని పేర్కోన్నారు. వేణు మాధవ్నుండి 2015 లో 31 గుంటల భూమి ని మేకల రమేష్ కొనుగోలు చేసుకుని రిగిస్ట్రేషన్ చేసుకున్నామని అన్నారు. ఆ భూమి కొనుగోలు అగ్రిమెంట్ లో మెయిన్ రోడ్డు నుండి 33 ఫీట్ల దారిని తీసి ఇచ్ఛారని తెలిపారు. అప్పటి నుండి ఓదేలు దారి భూమిలో బర్ల ఫామ్ వేసుకొని తమను ఇంబందులు పెట్టున్నారని అన్నారు. దింతో జిల్లా ఎస్పీ కి, మున్సిపల్ అధికారులకు పిర్యాదు చేయడంతో సరైన సర్వే చేసి అభూమి రోడ్డుకు ,పక్కనే ఉన్న పాఠశాలకు సంబంధించిన రోడ్డు అని నిర్దారించి,అషెడ్డు ను కులగొట్టాడం జరిగిందన్నారు.
అయితే దీన్ని అదును చేసుకొని స్థానిక ఎన్నికల్లో మెప్పుకోసం… కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి కలిసి కురాకుల ఓదెలు,లలిత దంపతులను తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యే ను బాధానాం చేస్తున్నారని అన్నారు. ఆ భూమి కి సంబంధించిన దొంతుల వేణుమాధవ్, మేకల రమేష్ ఆ భూమికి సంబంధించిన అన్ని రకాల లింక్ డాక్యుమెంట్లను మీడియా సమావేశంలో చూపించారు.ఈ సమావేశంలో భూభాధితులు టెంట్ రమేష్ రాపర్తి ఆమర్నాధ్, మోగిలి తదితరులు ఉన్నారు.
ఫొటోస్.

హనుమకొండలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం..

హనుమకొండలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ, నేటిధాత్రి:

హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మరియు రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి వృద్ధులతో సంభాషించిన ఆయన, తరువాత తలసీమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.
ముందుగా ఎమ్మెల్యేకు రెడ్ క్రాస్ చైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలమొక్క అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా డాక్టర్ల సేవలు, చెస్, క్యారమ్ వంటి ఆటల సౌకర్యం అందిస్తామన్నారు. వృద్ధులు సమయం విలువైనదిగా గడిపే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.
ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో హనుమకొండలో రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ సెంటర్ ప్రారంభమవడం గర్వకారణమని తెలిపారు. రెడ్ క్రాస్ రక్తదానం, ఇతర సేవలకు రాష్ట్రంలో తొలి స్థానంలో నిలుస్తున్న హనుమకొండ రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
రెడ్ క్రాస్ సేవలకు మరింత తోడ్పాటు అందించాలని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని హనుమకొండ రెడ్ క్రాస్ సందర్శించేవిధంగా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు చేనేత కళాకారులు తయారు చేసిన టవెల్స్ తో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యేకు పాలకవర్గం షీల్డ్ అందించి సత్కరించింది.
ఈ కార్యక్రమంలో డా. పి. విజయచందర్ రెడ్డి (చైర్మన్), బొమ్మినేని పాపిరెడ్డి (కోశాధికారి), ఈ.వి. శ్రీనివాస్ రావు (రాష్ట్ర పాలకవర్గ సభ్యులు), జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డా. ఎం. శేషుమాధవ్, బిళ్ల రమణ రెడ్డి, మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ అధికారి జె. జయంతి, డిఆర్‌డిఓ పీ.డి. యం. శ్రీను, హనుమకొండ డిఎంహెచ్ఓ ఎ. అప్పయ్య, కేయూ ఈ సి సభ్యులు కే. అనిత రెడ్డి, వృద్ధులు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పివైఎల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రంజిత్…

పివైఎల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రంజిత్

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రగతిశీల యువజన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామానికి కానుగుల రంజిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రంజిత్ గతంలో పిడిఎస్యు విద్యార్థి సంఘంలో నర్సంపేట డివిజన్ నాయకుడిగా, దుగ్గొండి ,నల్లబెల్లి మండలాల కార్యదర్శిగా పనిచేసి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేశాడు.కాగా ఇటీవల జరిగిన పివైఎల్ కార్యవర్గ సమావేశంలో రంజిత్ ను గుర్తించి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం పాటపడుతానని అన్నారు. యువత వివిధ వ్యసనాలకు గురికావడం వలన యువతను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితం చేస్తూ వస్తున్నాయని దీనికి వ్యతిరేకంగా యువతతో పోరాటాలు నిర్వహిస్తానని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version