పి ఏం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడుత నిధుల విడుదల.

పి ఏం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడుత నిధుల విడుదల.

కాశిబుగ్గ నేటిధాత్రి

రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద 20వ విడత నిధులుశనివారం రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతు ఖాతా లోకి నేరుగా విడుదల ఈ సందర్భంగా దేశ రైతుంగాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమం రైతు వేదికలోని వీసీ యూనిట్ లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి ఎస్సి కార్పొరేషన్ ఈ డి సురేష్ కుమార్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మండలంలో 7079 మంది రైతులకు కిసాన్ సన్ నిధి క్రింద ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.6000 మూడు విడుతలలో,ఒక విడుతకు రూ.2000 చొప్పున లబ్ది చేకూరుతుందన్నారు.

⏩ అనంతరం ఏ వో హరిప్రసాద్ మాట్లాడుతూ మండలంలో ఇంకా 573 మంది రైతులు ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉందని,929 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు.వెంటనే
పెండింగ్ ఉన్న రైతులు అట్టి పనులు వెంటనే పూర్తి చేసుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ది పొందాలని కోరుతున్నాము.
అంతకుముందు గంగదేవి పల్లి గ్రామంలో ఏరువాక సాగుబడి రైతు అవగాహన కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏవో హరిప్రసాద్ మాట్లాడుతూ రైతులు ప్రస్తుతం పత్తి పంటలు తెలుసుకోవలసిన జాగ్రత్తల నుంచి అవగాహన కల్పించడం జరిగింది. రైతులు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేసుకోవాలని పురుగు మందులతో కలిపి చల్లకూడదని తెలిపారు.రసం పీల్చే పురుగుల ఉధృతిని తెలుసుకోవడానికి జిగురు అట్టలను వాడాలని,ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్ మందులను ఎట్టి పరిస్థితుల్లో కలిపి వాడరాదని,పంట తొలి దశలో నీమ్ ఆయిల్ ను విస్తృతంగా వాడాలని సూచించారు.నానో ఏరియా నానో డిఏపి ఎరువులను వాడడం వల్ల 80 నుంచి 90 శాతం నత్రజని ఎరువు మొక్కకు అందుతుందన్నారు. మొక్కలపై ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే పురుగు మందుల పిచికారి చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గీసుకొండ ఏఈఓ రజిని,ధర్మారం ఏఈవో కావ్య,కూసం రాజమౌళి మరియు రైతులు పాల్గొన్నారు.

పి. హరి ప్రసాద్ బాబు
మండల వ్యవసాయ అధికారి
గీసుగొండ.

20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి.

20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

ఆల్ ట్రేడ్ యూనియన్ లు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

కార్మిక చట్టాలను అమలు చేయాలని కార్మికులకు, గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయాలని కోరుతూ గురువారం నర్సంపేట పట్టణంలో వరంగల్ రోడ్డు కూడాలీ నుండి జయలక్ష్మి సెంటర్ వరకు సీఐటీయూ,బిఆర్టిటి, ఏఐటీయూసీ ఏఐఎఫ్టీయు న్యూ,ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం గౌడ్,బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బానోత్ సాగర్, ఏఐటిసి జిల్లా నాయకులు గుంపల్లి మునీశ్వర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ కార్పొరేట్లకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని కోరారు. దశాబ్ద కాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను కార్పొరేట్ సంస్థలకు పణంగా పెట్టి శ్రామిక వర్గ శ్రమశక్తిని కారు చౌకగా దోచుకోవడానికి మరిన్ని అదనపు లాభాలను పోగు చేసుకోవడానికి పని గంటల భారాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఇరువైన దేశవ్యాప్తంగా సంఘటితమై సమ్మె చేస్తున్నారని అన్నారు సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హనుమకొండ శ్రీధర్, పట్టణ కార్యదర్శి రాజు, బిఆర్టియు జిల్లా నాయకులు పెరమండ్ల రవి, నాయిని వేణు చంద్ ,బొల్లం ప్రసాద్ ,అన్నం రాజు ,అనిల్, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు అశోక్ ,రవి, పైడి ,ఆనంద్, ఐ ఎఫ్ టి యు నాయకులు కుమార్, ప్రదీప్ ,తదితరులు పాల్గొన్నారు.

20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్.

అఖిలభారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయండి

20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్.

నేటిధాత్రి కాశీబుగ్గ

అఖిలభారత పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున హైదారాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే అఖిల భారత పద్మశాలి 17వ మహాసభకు, వరంగల్ లోని ప్రతి పద్మశాలి ఇంటి నుండి ప్రతి ఒక్కరు భారీగా తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని వరంగల్ అఖిల భారత పద్మశాలి పట్టణ గౌరవ అధ్యక్షులు, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ పద్మశాలి కులస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అఖిలభారత పట్టణ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజు, 20వ డివిజన్ అఖిల భారత సేవా సంఘం అధ్యక్షులు గంజి సాంబయ్య, బొద్దుల కుమార్, 20వ డివిజన్ అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు ములుక సురేష్, 19వ డివిజన్ అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు క్యాతం రంజిత్, మార్త ఆంజనేయులు, కుసుమ సారంగపాణి, వేముల నాగరాజు, వంగరి రవి, రంగు శ్రీధర్, వంగరి రాంప్రసాద్, దుస్స కృష్ణ, గూడూరు కృష్ణ, కుందారపు గోపి, బొప్పరాతి నగేష్, మార్త జగన్, క్యాతం రవీందర్, క్యాతం శ్రీనివాస్, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version