చిరంజీవి అభిమాని కుటుంబానికి వెలిచాల…

చిరంజీవి అభిమాని కుటుంబానికి వెలిచాల రాజేందర్ రావు సాయం అందజేత

కరీంనగర్, నేటిధాత్రి:

మెగా స్టార్ చిరంజీవి అభిమాని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ)లోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఇరవై వేల చెక్కును అందజేశారు. కమలాపుర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన చెరిపెల్లి కిరణ్ కుమార్ గత ఇరవై సంవత్సరాల నుంచి చిరంజీవి అభిమానిగా ఉంటూ అనేక సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించారు. మూడు సంవత్సరాల క్రితం కిరణ్ కుమార్ మృతి చెందాడు. కిరణ్ కుమార్కు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో కిరణ్ కుమార్ భార్య, పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వచ్చింది. దీంతో చిరంజీవి సూచనల మేరకు చిరు స్నేహితుడు బస్వారాజ్ శ్రీనివాస్ భారత సహకార సేవా ఫోరం ద్వారా కిరణ్ కుమార్ పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. పిల్లలు చదువు పదవ తరగతి పూర్తయ్యే వరకు ఈసాయం అందజేయనున్నారు. ఈనేపథ్యంలో బస్వారాజ్ శ్రీనివాస్ ఆర్థిక సాయం కింద పంపించిన ఇరవై వేల రూపాయల చెక్కును కిరణ్ కుమార్ భార్య చెరిపెల్లి స్వప్నకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అందజేశారు. రాబోయే రోజుల్లో కిరణ్ కుమార్ కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, కోడూరి హరికృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

‘దేవదాసు’ పాత్ర గురించి  అభిమానికి జవాబు  ..

‘దేవదాసు’ పాత్ర గురించి  అభిమానికి జవాబు  

అభిమానుల అభినందనలే అభినయమూర్తులకు అసలైన ఉత్తేజం కలిగించే ఔషధం! సదా ప్రశంసల జల్లులే కాదు సద్విమర్శలనూ కళాకారులు స్వీకరించాలి.

అభిమానుల అభినందనలే అభినయమూర్తులకు అసలైన ఉత్తేజం కలిగించే ఔషధం! సదా ప్రశంసల జల్లులే కాదు సద్విమర్శలనూ కళాకారులు స్వీకరించాలి. అప్పుడే వారిలోని అసలైన ప్రతిభ వెలుగొందుతుంది. ఈ అంశాన్ని తు.చ. తప్పక పాటించిన వారెందరో కళారంగంలో రాణించారు. చిత్రసీమలో మహానటులుగా జేజేలు అందుకున్నవారు, ప్రేక్షకుల అభిమానం చూరగొన్నవారు ఈ పంథాలోనే పయనించారు. అందుకే ఈ నాటికీ వారి కళను చర్చించుకుంటున్నాం. తెలుగు చిత్రసీమలో ఎందరో నటరత్నాలు తమదైన బాణీ పలికించారు. చిత్తూరు నాగయ్య, యన్టీఆర్, ఏయన్నార్(ANR), యస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య, భానుమతి, సావిత్రి, అంజలీదేవి, జమున- ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత జాబితా సిద్ధమవుతుంది. వీరందరూ అభిమానులను అలరించడానికి ఎంతో శ్రమించినవారే! (ANR Letter to Fan).

ప్రస్తుత విషయానికి వస్తే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావును తలచుకోగానే ఈ నాటికీ ఆయన అభిమానులు ముందుగా ‘దేవదాసు’ పాత్రనే గుర్తు చేసుకుంటారు.1953లో రూపొందిన ‘దేవదాసు’ చిత్రంతో ఏయన్నార్ జనం మదిలో చెరగని ముద్ర వేశారు. ఈ తరం ప్రేక్షకులు సైతం ఆ చిత్రాన్ని వీక్షిస్తే అక్కినేని అభినయాన్ని అభినందించకుండా ఉండలేరు. ఆ రోజుల్లోనే ఆరిపాక సూరిబాబు అనే అభిమాని అక్కినేని నాగేశ్వరరావుకు ‘దేవదాసు’ (Devadasu)పాత్ర గురించి ఓ ఉత్తరం రాశారు. అందుకు ఏయన్నార్ స్వదస్తూరితో రాసిన లేఖ ప్రస్తుతం లభ్యమవుతోంది. ఆ లేఖ సారాంశం ఇది…

‘మిత్రులు ఆరిపాక సూరిబాబు గారికి నమస్తే… మీరు ప్రేమతో రాసిన కార్డు చేరింది. చాలా సంతోషం. మీరు నా పట్ల చూపిన అభిమానానికి నా కృతజ్ఞతలు తెల్పుతున్నా.

మహాకవి శరశ్చంద్రుడు సృష్టించిన దేవదాసు కథలో (నా దృష్టిలో) అతిక్లిష్టమైన దేవదాసు పాత్రను నేను నటించపోవడం, ఆ భయంతోనే దేవదాసు పాత్ర నటించడానికి అంగీకరించాను. పట్టుదలతో పనిచేశాను. నేనే కాకుండా, డైరెక్టరూ, కెమెరామన్, తదితర మిత్రులు, ఆ పాత్ర విజయవంతం కావడానికి సర్వవిధాలా సహాయం చేశారు. అనేక మంది ఏదో అనుకున్నా, అందరి సహాయంతో అతి కష్టమైన పాత్రతో, మీ బోటి సద్విమర్శకుల మెప్పు పొందానంటే మీరన్నట్లు ఈ పాత్ర దొరకడం నా అదృష్టంగానే భావిస్తున్నా. ఇకముందు కూడా, నా నటనద్వారా మీకింకా దగ్గర కావడానికి ప్రయత్నిస్తా’

మీ రూల్స్‌ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..

మీ రూల్స్‌ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..

అభిమానుల చేష్టలు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉన్నా.. పలు సందర్భాలో పరువు తీసే విధంగా ఉంటాయి. యూకేలోని సినీ వరల్డ్‌ థియేటర్‌లో ఫాన్స్  చేసిన  హంగామా ట్రోలింగ్‌కు గురైంది

ఇండియన్‌ చిత్రాలకు ఓవర్సీస్‌లో క్రేజ్‌ ఎక్కువ. అందులోనూ తెలుగు చిత్రాలకు మరీ ఎక్కువ. తాజాగా పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో విడుదలైంది. అభిమానులు ప్రతి చోటా కోలాహలం చేశారు. అయితే అభిమానుల చేష్టలు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉన్నా.. పలు సందర్భాలో పరువు తీసే విధంగా ఉంటాయి. యూకేలోని సినీ వరల్డ్‌ థియేటర్‌లో (UK Cine world Theater)ఫాన్స్  చేసిన  హంగామా ట్రోలింగ్‌కు గురైంది. ‘హరిహర వీరమల్లు’ (HHVM)చిత్రం ప్రొజెక్షన్‌ జరుగుతుండగా ఆ అభిమాని సృష్టించిన హంగామా ఇంటర్‌నెట్‌ అంతా వైరల్‌ అయింది. ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 25న లండన్‌లోని ఓ సింగిల్‌ స్క్రీన్  థియేటర్‌లో హరిహర వీరమల్లు చిత్రం షో జరుగుతోంది. తొలిరోజే లండన్‌ సమీప ప్రాంతాల అభిమానులు అంతా ఆ ధియేటర్‌కి చేరుకున్నారు. తమ అభిమాన హీరోని  తెరపై చూడగానే ఉత్సాహం ఆపుకోలేక రంగు కాగితాలు స్క్రీన్ పై  చల్లుతూ ఎంజాయ్‌ చేశారు.

అయితే విదేశాల్లో థియేటర్లు నిబంధనలకు లోబడి ఉంటాయి. కాన్ఫెట్టిను (రంగు కాగితాలు)థియేటర్‌లో వాడాలంటే ముందుగా థియేటర్‌ యాజమాన్యం అనుమతి పొందాలి. కానీ అక్కడి అభిమానులు అనుమతి తీసుకోకుండానే సందడి చేయడంతో థియేటర్‌ సిబ్బంది తీవ్రంగా స్పందించారు. వెంటనే సినిమా  స్క్రీనింగ్  నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘థియేటర్‌ ఏది చేసినా చెల్లదు. ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి. మీరు ఏదైనా చేయాలంటే ముందు అనుమతి కావాలి’ అని సిబ్బంది స్పష్టంగా చెప్పినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి ఫ్యాన్స్‌ కౌంటర్‌ ఇచ్చారు ‘ఇలాంటి రూల్స్‌ ఉన్నాయని థియేటర్‌లో ఎక్కడా బోర్డ్‌లు కనిపించలేదు’ అని వాదించారు.

ఇప్పుడీ విషయంపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘థియేటర్‌ సిబ్బంది సరిగ్గా స్పందించారు’ అంటుంటే, మరికొందరు ‘‘అభిమానులు అత్యుత్సాహం వల్ల ఇతరులకు అసౌకర్యం కలిగింది’’ అని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ‘ఇది ఇండియా కాదు’ అనే మాట ఇప్పుడు ట్రెండింగ్‌ ట్యాగ్‌గా మారింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version