గని ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం…
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
సింగరేణికి అవ్వా, అయ్యా లేకుండా అనాధగా మారింది…
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి గని ప్రమాదంలో మరణించిన కార్మికుడు శ్రావణ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం,కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.మందమర్రి డివిజన్ లోని కేకే 5 గనిలో అండర్ గ్రౌండ్ లో ఎస్ డి ఎల్ యాక్టింగ్ గా పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు రాచపల్లి శ్రావణ్ కుమార్ ప్రమాదంలో మృతి చెందాడు.శనివారం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని సందర్శించి, మృతదేహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించి,మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.అనంతరం మంత్రి మాట్లాడారు.
శ్రావణ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని, ఈ ప్రమాదానికి కారణమైన అధికారుల పై చర్యలు తీసుకునే విధంగా చేస్తామన్నారు.గని ప్రమాదంలో మరణించిన కార్మికుడు శ్రావణ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం,కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.మంత్రి వెంట ఏఐటియుసి జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య మృత దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా చొరవ తీసుకుంటామని అన్నారు. సింగరేణి యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేకుండా ఉందని, కార్మికుల రక్షణ కు ప్రత్యేక శ్రద్ధ చూపించేల యాజమాన్యం చొరవ తీసుకోవాలని సిఐటియు నాయకులు రాజీ రెడ్డి,సాంబారి వెంకటస్వామి లు డిమాండ్ చేశారు. పలువురు యూనియన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,నాయకులు పాల్గొన్నారు.
సింగరేణికి అవ్వా, అయ్యా లేకుండా అనాధగా మారింది…
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
సింగరేణికి అయ్యా అవ్వ లేకుండా అనాథగా మారిందని, సీఎండి , సంబంధిత మంత్రి , ఎవరు పట్టించుకోకుండా పోవడం వల్లే ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నాయని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మంచిర్యాల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు, మందమర్రి గని ప్రమాదం లో మృతి చెందిన కార్మికుడు శ్రవణ్ మృతదేహానికి ఆర్కేపి ఏరియా ఆసుపత్రి లో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు, కార్మికుల రక్షణ మీద శ్రద్ధ పెట్టక అవినీతి అక్రమాలు చేస్తున్నారని మండి పడ్డారు, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు, రామిడి కుమార్,టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, మహేష్ నాయకులు పాల్గొన్నారు.