పివైఎల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రంజిత్
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రగతిశీల యువజన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామానికి కానుగుల రంజిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రంజిత్ గతంలో పిడిఎస్యు విద్యార్థి సంఘంలో నర్సంపేట డివిజన్ నాయకుడిగా, దుగ్గొండి ,నల్లబెల్లి మండలాల కార్యదర్శిగా పనిచేసి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేశాడు.కాగా ఇటీవల జరిగిన పివైఎల్ కార్యవర్గ సమావేశంలో రంజిత్ ను గుర్తించి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం పాటపడుతానని అన్నారు. యువత వివిధ వ్యసనాలకు గురికావడం వలన యువతను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితం చేస్తూ వస్తున్నాయని దీనికి వ్యతిరేకంగా యువతతో పోరాటాలు నిర్వహిస్తానని తెలిపారు.