బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటం కోసం సిరిసిల్ల టు ఢిల్లీ ప్రయాణం
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదట కులగణన చేసి అట్టి బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపగా కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ బిల్లును ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చి చట్టబద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కాలం గడుపుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర ప్రభుత్వాన్ని కి కనువిప్పు కలిగించి బీసీల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాలని చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిరిసిల్ల నుంచి బయలుదేరారు. చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప, టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు రెడ్దిమల్ల భాను, గుడిసె ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సబ్బని వేణు కలిసి బయలుదేరారు.