నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు పట్ల మంత్రులకు, ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లాకపోవడం శోచనీయంశం అని, స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు. మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం మంత్రుల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పొలీస్ స్టేషన్ల చుట్టూ తింపరని, రైతులను నేరస్థులుగా చూడటం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి కోసం వారి భూములను ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు. ప్రతి పక్షాల పట్ల దురుసుగా మాట్లాడం కాదు, మీకు చాతనవుతే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపండి అని హితబోధ చేశారు. కేవలం నాలుగు గంటలు మాత్రమే నీటిని విడుదల చేసి ఆపడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు నీటి సరఫరా తిరిగి విడుదల చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, దయ్యాల వీరమల్లు, పురంశెట్టి మల్లేశం, లంక నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.