అరేబియా సముద్రంలో భారత్, పాక్ నేవీ డ్రిల్స్?

అరేబియా సముద్రంలో భారత్, పాక్ నేవీ డ్రిల్స్?

భారత్, పాకిస్థాన్ అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఒకే సమయంలో నౌకాదళ విన్యాసాలు చేపట్టనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ నెల 11, 12 తేదీల్లో 2 రోజుల పాటు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఇరు దేశాల నేవీ డ్రిల్స్ జరగనున్నట్లు పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సమీపంలో భారత్ నేవీ డ్రిల్స్ చేపట్టనుండటం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ డ్రిల్స్‌పై ఉత్కంఠ నెలకొంది.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో.

పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమికొట్టాలని నల్ల రిబ్బన్లతో నమాజ్.

మాజీ కోఆప్షన్ సభ్యులు
ఎండి రాజ్ మహమ్మద్.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

ఈనెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పైల పహిలగామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు వారి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని మరియు మండలంలో ఉన్నటువంటి మసీదు లలో శుక్రవారం నమాజులో ముస్లిం సోదరులు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలను చేసేవారిని తరిమికొట్టాలని ముఖ్యంగా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన సమయంలో కాశ్మీరు వస్త్ర వ్యాపారి నాజా కతలి మరియు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ వీరోచితంగా పోరాడి చాలామంది టూరిస్టుల ప్రాణాలు కాపాడారు కావున ముస్లింలు ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ప్రాణాలర్పించి ముందు వరుసలో ఉన్నారు కావున అందరం కలిసి టెర్రరిస్టుల చర్యను ఖండించాలని చిట్యాల మండలం

మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version