చర్చలు ఫలించకుంటే.. రేపటి నుంచి షూటింగ్‌లు బంద్: ఫిల్మ్ ఫెడరేషన్
TG: వేతనాలు పెంచాలని సినీ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆ తర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈరోజు జరిగే చర్చలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాల కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.