ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో రౌడీయిజం.. యువకుల బెదిరింపులు
విజయవాడ నగరానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక మాధ్యమాల్లో తమ నైజాన్ని బయట పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎదుటి వారిని హెచ్చరించేలా రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాలో పోస్టుచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారి నైజానికి తగినట్టుగానే అకౌంట్లకు పేర్లు పెట్టుకుంటున్నారు.
» రీల్స్, రౌడీయిజం.. నగరంలో రెచ్చిపోతున్న కొందరు యువకులు
‘..మీరంతా లం.. తెలుసురా. మీ వయసుకు గౌరవం ఇస్తున్నా. దాన్ని నిలబెట్టుకోండి. లేకపోతే పీక కోస్తా.’ ఇన్‌స్టాలో ఓ యువకుడి పోస్ట్ ఇది,
..ఒకటే కోత, టూటౌన్ పీఎస్‌కు వార్త. నా కొడ.. తెలుసుగా పీకలు కోసి లోపలికి వెళ్లిపోతాం.” సోషల్ మీడియాలో ఇద్దరు యువకులు చేసిన రీల్ ఇది.
నగరంలో కొందరు యువకులు రీల్స్ మోజులో రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకరిని హెచ్చరిస్తూ.. బూతులు తిడుతూ.. పీకలు కోస్తామని బెదిరిస్తూ చేస్తున్న రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, ఏకంగా గంజాయి సేవిస్తున్న ఫొటోలు కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ): నగరానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక మాధ్యమాల్లో (Social Media Reels) తమ నైజాన్ని బయట పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎదుటి వారిని హెచ్చరించేలా రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాలో (Instagram) పోస్టుచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారి నైజానికి తగినట్టుగానే అకౌంట్లకు పేర్లు పెట్టుకుంటున్నారు. నగరంలో ఖాళీ ప్రదేశాల్లోకి వెళ్లి రీల్స్ చేస్తున్నారు. ఎదుటి వారికి, ప్రత్యర్థులను హెచ్చరించేలా ఈ రీల్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నగరంలో ఇద్దరు యువకులు చేసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రీల్స్ చేసిన ఇద్దరిలో ఒక యువకుడిపై కులు కేసులు ఉండటం గమనార్హం.