పులితో ఫేస్ టూ ఫేస్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

 పులితో ఫేస్ టూ ఫేస్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

 

కాపలాగా ఉన్న ఓ వ్యక్తికి రాత్రి వేళ షాకింగ్ అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి కుక్కలు పదే పదే మొరుగుతుండడంతో అతను బయటికి వచ్చి.. ఏమైందో చూసేందుకు కాస్త దూరంగా వెళ్లాడు. అయితే..

అడవుల్లో ఉండాల్సిన పులులు, సింహాలు.. అప్పుడప్పుడూ జనావాసాల్లోకి రావడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో అవి జనాలపై, జంతువులపై దాడి చేయడం కూడా జరుగుతుంటుంది. అయితే కొందరు అదృష్టవశాత్తు వాటి బారి నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పులికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పులికి హాయ్ చెప్పడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కాపలాగా ఉన్న ఓ వ్యక్తికి రాత్రి వేళ షాకింగ్ అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి కుక్కలు పదే పదే మొరుగుతుండడంతో అతను బయటికి వచ్చి.. ఏమైందో చూసేందుకు కాస్త దూరంగా వెళ్లాడు. అయితే కాస్త ముందుకు వెళ్లి.. ఇంటి వద్ద నుంచి మలుపు తిరగ్గానే.. అదే సమయంలో పులి కూడా అతడికి ఎదురుగా వస్తుంది.

పులిని చూడగానే ఆ వ్యక్తి భయంతో కేకలు వేస్తూ ఇంట్లోకి పారిపోతాడు. పులి కూడా అంతే భయంతో (Tiger runs away after seeing man) అక్కడి నుంచి వెనక్కు తిరిగి పారిపోతుంది. అతన్ని చూడగానే దాడి చేయాల్సిన పులి.. అందుకు విరుద్ధంగా భయంతో పారిపోవడం చూసే వారికి వింతగా అనిపిస్తోంది. ఈ వీడియో ఇంతటిలో ముగుస్తుంది.

కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పులికి హాయ్ చెప్పి వచ్చాడుగా’.. అంటూ కొందరు, ‘పులికి ఇతడు ఎలా కనిపించాడో ఏమో’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.79 లక్షలకు పైగా లైక్‌లు, 4.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version