(మాస్) సభ విజయవంతం.

(మాస్) సభ విజయవంతం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో,మన ఆలోచన సాధన సమితి (మాస్) సభ అధ్యక్షుడు ఎనుగుల ఎల్లయ్య మాట్లాడుతు (మన ఆలోచన సాధన సమితి)ఆలోచన చైతన్యం, చైతన్యమే ఆయుధం, అనే భావాలతో బీసీ ఉద్యమం నవ శకం ఆరంభమైంది అని అన్నారు. అంతేకాకుండా ప్రధాన లక్ష్యమైన రాజ్యాధికారం బీసీల సమైక్యతలో ఉంటుందని జ్యోతిబాపూ పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోని భాగమే బీసీల సమైక్యత అని తెలిపారు.కటకం నర్సింగరావు .దొంత ఆనందం, మంగలి పల్లి శంకర్, రాష్ట్ర శాఖ నుంచి హాజరై బీసీల సమైక్యత కోసం అనర్ఘళంగా ఉపన్యాసం అందించారు. బీసీలు అందరూ ఒకటైతే బీసీలకు రాజ్యాధికారం వస్తే అందరూ సామాజిక ,ఆర్థికంగా, బలపడతారని సభలో తెలిపారు. సిరిసిల్ల కుల సంఘాల నుండి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయడానికి కుల సంఘానికి ఇద్దరు చొప్పున కన్వీనర్లను నియమించాలని సూచనతో పాటు 15న బీసీ సమైక్యత జెండాను సిరిసిల్ల పట్టణంలో చైతన్యవంతంగా ఎగరవేయాలని నిశ్చయించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా దొంత దేవదాసు వ్యవహరించారు,గాదమైసయ్య, వెంగళ అంకయ్య,యువ కవి వెంగళ లక్ష్మణ్, తన గానంతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. డాక్టర్ జనపాల శంకరయ్య,కోడం నారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version