అరేబియా సముద్రంలో భారత్, పాక్ నేవీ డ్రిల్స్?
భారత్, పాకిస్థాన్ అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఒకే సమయంలో నౌకాదళ విన్యాసాలు చేపట్టనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ నెల 11, 12 తేదీల్లో 2 రోజుల పాటు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఇరు దేశాల నేవీ డ్రిల్స్ జరగనున్నట్లు పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సమీపంలో భారత్ నేవీ డ్రిల్స్ చేపట్టనుండటం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ డ్రిల్స్పై ఉత్కంఠ నెలకొంది.