నులి పురుగుల మందులు తప్పనిసరి
పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత పాఠశాలల విద్యార్థులు పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవాలి ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సాధారణంగా,ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా నులిపురుగుల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని అన్నారు.పిల్లల పొట్టలో నులిపురుగులు చేరితే రక్తహీనత,పోషకాల లోపం, ఆకలి మందగించడం,కడుపు నొప్పి,వికారం,వాంతులు, విరేచనాలు,బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు తప్పనిసరిగా పిల్లలు ఆల్బండాజోలు మాత్ర వేసుకోవాలని,ఎవరైనా వేసుకోకుంటే మాప్ అప్ డే రోజు 18వ తేదీన తప్పని సరిగా వేసుకోవాలని అన్నారు.