సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామనికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో సిసి రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. 14 లక్షల విలువైన సిసి రోడ్ల నిర్మాణానికి బుధవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆది శ్రీనివాస్ అహర్నిశలు శ్రమిస్తున్న తీరుపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ ఏ ఎంసి డైరెక్టర్ కరీమ్, మాజీ ఎంపిటిసి మొకానపెల్లి దేవరాజు మంజుల, బాణాల లక్ష్మా రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్, పోతుగంటి రఘుపతి,పోతుగంటి రంజిత్, చిగుర్ల మల్లేశం, చిగుర్ల నాగేష్,భూమాండ్ల కొమురయ్య, మ్యాదరి లచ్చయ్య, పుల్లూరి జెలందర్, భూమాండ్ల మధు,తదితరులు పాల్గొన్నారు.

రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ

గద్వాల /నేటి ధాత్రి

గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రము సబ్ స్టేషన్ దగ్గర 200 రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో గద్వాల ప్రాంతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని.. రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కరెంటు లేక సరైన పంటలు లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునేవారన్నారు.
నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతంలోని రైతుల కష్టాలను తీర్చానన్నారు. గద్వాల నియోజకవర్గంలో కొత్తగా ఏడు గ్రామాలలో 7 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ
– గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులను పెన్నులను పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి..
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను, పెన్నులను అందించరు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని జీవితంలో విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పదవ తరగతి ఎంతో కీలకమైనదని ఈ సమయంలో చదువు పట్ల ఎవ్వరు అశ్రద్ధ చేయరాదని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డం లత భాస్కర్, బి. ఆర్. ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్, జిల్లా అధ్యక్షులు మానాల అరుణ్ పాల్గొన్నారు.

విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.

మంజీర విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు..

రామయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్)

Graduation Day

మంజీరా విద్యాలయంలో నేడు యూకేజీ విద్యార్థులకు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది .విద్యార్థులు ప్రీ ప్రైమరీ ముగించుకొని ప్రైమరీ స్థాయిలోకి వెళ్లడం సందర్భంగా ఈ గ్రాడ్యువేషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనంలోనే ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం నేటితరం విద్యార్థుల యొక్క అదృష్టంగా భావించడం జరిగింది. వాసవి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో జరుపుకునేటటువంటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. పిల్లలని చూసి గ్రాడ్యుయేషన్ డ్రెస్ లో తల్లిదండ్రులు వచ్చినటువంటి వాళ్ళు ఎంతో ఆనందించారు. అతిధి రాజేశ్వరి (చైల్డ్ సీనియర్ మేనేజర్ అండ్ ట్రేనర్ స్కాలరి ప్రోగ్రాం )గారు మాట్లాడుతూ తల్లిదండ్రులు చేసే పనులను చూసి విద్యార్థులు నేర్చుకుంటారని, ఉపాధ్యాయులు గాని తల్లిదండ్రులు గాని వారిని చూసి ఆచరిస్తారని అందుకే చెప్పడం కంటే మనం ఆచరించి చూపించడం వారికి ఆదర్శనీయంగా ఉంటుంది, అని చెప్పారు. పిల్లలని చదువుకోమని చెప్పి తల్లిదండ్రులు టీవీ సీరియల్ చూస్తే పిల్లలు టీవీ చూడొద్దంటే ఫోన్ చూడొద్దు అని చెప్పడం తల్లిదండ్రులు అస్తమానం ఫోన్లో చూస్తుంటే, రీల్స్ చేయడం కోసం ఎంకరేజ్ చేస్తుంటే పిల్లలు ఏ విధంగా సరైన మార్గంలో వెళ్తారు చెప్పడం కంటే ఆచరించడం ఉత్తమం. క్లాస్ కి టీచర్లు కూడా రోజు పిల్లల కంటే ముందుగా వచ్చి ఎందుకు ఆలస్యంగా వచ్చారని అడిగితే వారు మారుతారు కానీ టీచర్ రోజు లేటుగా వస్తే అడగడానికి అర్హులు కారు అని చెప్పడం జరిగింది .కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే పిల్లలు స్టేజి మీద చక్కగా ఉపన్యసించడం జరిగింది .ఈ వయసు నుంచి స్టేజ్ ఫియర్ అనేది పోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలను ఈ డ్రెస్ లో చూడడం ఈ కార్యక్రమాన్ని చూడడం ఈ చుట్టుపక్కల ఏ పాఠశాలలో జరిగినటువంటిది మంజీర పాఠశాల వాళ్ళు నిర్వహించడం మా పిల్లలు మరియు మా యొక్క అదృష్టంగా భావిస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, స్వాతి ,మౌనిక ,మీనా ప్రజ్ఞ ,శ్రీశైలం, అనిల్ శ్రీనివాస్ ,అమూల్యాలు పాల్గొన్నారు.

వేసవికాలం దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!

సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వేసవికాలం దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తాగునీరు సమస్య లేకుండా అందించడం కోసం

ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని ప్రజలందరికీ వచ్చే వేసవికాలం దృష్ట్యా, తాగునీరు సరఫరా కోసం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ గదిని ఏర్పాటు చేయడం జరిగినది. సిరిసిల్ల పట్టణ ప్రజలకు తాగునీరు సమస్య రాకుండా వార్డుల వాయిసుగా ఎలాంటి సమస్య లేకుండా ఉండడం కోసం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ 7893593330 సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు.

జన్మ జన్మలకు ఇలా సేవచేసే భాగ్యం కలుగాలి.!

మానవత్వం పరిమళించే యువ దంపతులకు హార్దిక శుభాకాంక్షలు

జన్మ జన్మలకు ఇలా సేవచేసే భాగ్యం కలుగాలి

ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి

మన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు శతమానం భవతి అని దీవెనలు అందించిన ప్రముఖులు

పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన గ్రామ ప్రజలు

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

మానవత్వం పరిమళించే బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు పురస్కరించుకొని సర్వత్ర హార్దిక శుభాకాంక్షలు తెలిపి అభినందించి ఆశీర్వదించారు. ఆది దంపతులైన వీరిద్దరూ జన్మ జన్మలకు ఇలా సేవచేసే భాగ్యం కలుగాలి అని దీవించారు. ప్రజల కోసం ప్రతిస్పందించే, పరితపించే మనుసున్న ప్రజా ప్రతినిధి మన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ లు అని వేనోళ్ళ కొనియాడారు. బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు పెళ్లి రోజు సందర్భంగా శతమానం భవతి అని దీవెనలు ప్రముఖులు దీవెనలు అందించి ఆశీర్వదించారు. వివరాల్లోకి వెళ్లితే… మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన వ్యవసాయ ముద్దుబిడ్డ బుడ్డ రామయ్య బుడ్డ బాలవ్వ మనుమడు, బుడ్డ బాలయ్య పోచవ్వ దంపతుల కొడుకు బుడ్డ భాగ్యరాజ్ చందాయిపేట గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండి తనకు ఉన్న అనుభవంతో గ్రామంలో మంచిచెడులు తెలుసుకున్న భాగ్యరాజ్, సర్పంచ్ ఎన్నికల్లో ఆయన భార్య బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ 2019 వ సంవత్సరంలో గ్రామ పంచాయితీ సర్పంచ్ గా పోటీ చేయించి గ్రామ ప్రజలు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 951మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటినుంచి ప్రజాసేవలో ముందుండి గ్రామమలో నెలకొన్న సమస్యలపై అను నిత్యం అధికారులతో అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే బాధ్యత తనపై వేసుకున్నారు. నిరుపేదలకు అండగా నిలిచి అభాగ్యులకు ఆదుకున్న అపర చాణక్యుడు. గ్రామంలో నిరుపేదలుగా ఉన్న వారికి నేనున్నానంటూ ఏ ఆపద వచ్చిన ఇంటికి పెద్ద కొడుకు లాగా మనసున్న మారాజు లాగా ఆదుకునే మనస్తత్వం కలిగిన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అని చెప్పుకోవచ్చు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లి లు అయితే ఆడపడుచుల కుటుంబానికి పుస్తె మట్టెలు తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందజేశారు. అంతే గాకుండా మరణించిన వారికీ ఆర్థిక సహయం చేసి అండగా నిలిచి ఆదుకున్న మాస్. గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి దశదిన కర్మకు 50 కేజీల బియ్యం తో పాటు రెండు వేలు రూపాయల ఆర్థిక సాయం ఎందరికో అందజేసిన ఘనత భాగ్యరాజ్ దంపతులకు దక్కింది. ఎవరైనా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా తనకు తోచినంత సహాయం అందించేవారు. మెదక్ జిల్లా ఉత్తమ సర్పంచిగా అవార్డు అందుకొని ఉత్తమ సేవకునిగా నిలిచిన దాన గుణం కలిగిన దాన కర్ణుడు మన స్వర్ణలత భాగ్య రాజు. గ్రామ సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించిన అధికారులు ప్రజలకు సేవ చేసిన బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మెదక్ జిల్లాలోని ఉత్తమ సర్పంచిగా ప్రజల ఆశీర్వాదాలతో ఉత్తమ అవార్డు అందుకున్నారు. ప్రజల ఆశీర్వాదాలతోనే అభివృద్ధి పనులు చేశాడూ…. తన పై నమ్మకంతో సర్పంచిగా గెలిపించిన చందాయిపేట గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడుతూ 13/3/2025 రోజున 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వివాహ వార్షికోత్సవ సందర్భంగా పెళ్లి రోజు శుభాాంక్షలు తెలిపిన గ్రామ ప్రజలకు అధికారులకు ధన్యవాదములు తెలిపారు. గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఇటువంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, నేను చేసిన సేవలను గ్రామ ప్రజలు గుర్తించి ఆశీర్వదించాలని , ఇకముందు జరగబోయే పనుల్లో ఉన్నత పదవులు సాధించాలని, అలాగే నాపై గ్రామ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు గ్రామ ప్రజలు, మహిళలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, యువకులు, యువజన సంఘాల నాయకులు, అధికారులు, అనాధికారులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులకు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని, ఇటువంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని అక్షాసిస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలే కాకుండా చెగుంట మండలం లోని పలు గ్రామాల్లో తోచిన ఆర్థిక సహాయం, బియ్యం, కిరాణ సామాను అందజేసి అండగా నిలిచిన స్వర్ణలత భాగ్యరాజు చేసిన సేవలకు అపూర్వ స్పందన లభించి యువ దంపతులను అభినందించి ఆశీర్వదించారు.

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న.!

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సిరిసిల్లబిజెపి బిజెపి కార్యకర్తల్లో జోష్

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల కి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ * తేదీ:16-03-2025 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా * విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నేడు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం.

జిల్లా వ్యక్తికి రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం

నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన గోశిక వెంకటేష్ ఉన్నత చదువులకు హర్యానా ,హిసార్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ ప్రింటింగ్ మరియు ప్యాకేజ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. భారత రాష్ట్రపతి మరియు హర్యానా గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు, ఈ సందర్భంగా గోషిక వెంకటేష్ మాట్లాడుతూ , హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని తన కృషికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రోత్సహంతో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను మొదట డిప్లొమా, జి జె యు నుండి బి. టెక్ , ఎం. టెక్ చేసాను. దీని తరువాత నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసాను మరియు కొన్ని సంవత్సరాల తరువాత – నాకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఈ రోజు నా డిగ్రీ మరియు పతకాన్ని స్వీకరించడానికి జి జె యు హిసార్ హర్యానాకు పిలువబడిందన్నారు. ఇది నాకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు

యాజమాన్యాల సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి.

యాజమాన్యాల సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల యాజమాన్యాల సమస్యలను ఎమ్మెల్సీ అంజిరెడ్డికి దృష్టికి బుధవారం తీసుకువచ్చారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రైవేట్ కళాశాలలపై కక్షపూరిత దోరణి వుందని, వెంటనే ఫీజు రీయింబర్స్ చెల్లించేలా కృషిచేయాల్సిందిగా ఎమ్మెల్సీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి వెంటనే రియంబర్స్ మెంట్ వచ్చేలా కృషి చేస్తా అని అన్నారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

TPCC President Mahesh Kumar Goud.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ ఆఫీజ్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మినిష్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం హాజరైన సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు ఉజ్వల్ రెడ్డి తోపాటు వెళ్లి షేక్ ఆఫిజ్ మహిష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఈ కార్యక్రమం లో మండల యువ నాయకులు అశ్విని పాటిల్ ఉన్నారు.

ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ నాయకులు.

ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ నాయకులు..

రామాయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్)

ఇటీవల అనారోగ్యంతో మరణించిన రామయంపేట మండల లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ నాయకులకు ఆర్థిక సాయం అందజేశారు. భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి కాంటా రెడ్డి తిరుపతిరెడ్డి రూ.5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీసీ మైస గౌడు, బాలయ్య, మల్లేశం,విజయభాస్కర్ రెడ్డి, కాట్రాల బిక్షపతి, రాజేందర్ గుప్త, మాజీ ఉపసర్పంచ్ స్రవంతి రాజేందర్, బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కొరటికల్, శిర్దపల్లి రోడ్డు త్వరగా పూర్తి చేయాలి.

కొరటికల్, శిర్దపల్లి రోడ్డు త్వరగా పూర్తి చేయాలి:
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే నత్త నడకగా సాగుతున్న రోడ్డు పనులు: సిపిఎం జిల్లా కార్యద ర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
కొరటికల్,శిర్దపల్లి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ రోడ్డు పనులు నత్త నడకగా సాగుతున్నాయని, ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారంచండూరు మండల పరిధిలోని శిర్దపల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోడ్డును రెండుసార్లు శంకుస్థాపన చేసి రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయకపోవడంతోప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యఉందని, ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని
ప్రజలు తమ ఆవేదనను సిపిఎం నాయకులకువెలిబుచ్చారు. గతంలో ఈ గ్రామానికి బస్సు వచ్చేదని, కరోనా కారణంగా ఆర్టీసీ బస్సు బంద్ చేశారని గ్రామ ప్రజలు సర్వే బృందానికి తెలియజేశారని ఆయన అన్నారు.
ఉదయంనల్లగొండ నుండివయా గూడపూర్,కొరటికల్,శిర్దపల్లికి ఉదయం 8 గంటలకు చేరుకునే విధంగాచండూరుకు,అదేవిధంగాచండూరు నుండి శిర్దపల్లి, కొరటికల్, గూడపూర్, నల్లగొండకు పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఈ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైనసోలిపురం,తాస్కానిగూడెం,బోడంగిపర్తి, దుబ్బకాల్వ, ఈ గ్రామాలకు బీటీ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు.ఈ గ్రామంలో సుమారుగాపింఛన్ల కోసం60 మంది, రేషన్ కార్డుల కోసం120 మంది, ఇందిరమ్మ ఇండ్ల కోసం 120 మందిదరఖాస్తు చేసుకున్నట్లు,ఇందులో భూమిలేనినిరుపేదలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అదే విధంగా చొరవ తీసుకోవాలనిఆయన అన్నారు.ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమం కు మంచి స్పందన వస్తుందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొరటికల్,శిర్దపల్లి, తాస్కాని గూడెం రోడ్డు మరమ్మతు పనులుత్వరగా పూర్తి చేయాలని,అదేవిధంగా ప్రజలు ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ,సిపిఎం సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య,వెంకటేశం,ఈరటి వెంకటయ్య,బల్లెం స్వామి, గ్రామ ప్రజలురామ్ రెడ్డి, చంద్రారెడ్డి,లింగస్వామి,రామస్వామి,నిర్మల,అశ్విని తదితరులు పాల్గొన్నారు.

రేణుక చార్యుల వారికి రుద్రాభిషేకము.

రేణుక చార్యుల వారికి రుద్రాభిషేకము.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో ఆది జగద్గురు రేణుక చార్యుల జయంతి సందర్భంగా శ్రీ రేవణసిద్దేశ్వర దేవాలయంలో ఉదయం ధ్వజారోహణం గణపతి పూజ స్వస్తి పుణ్యా వచనము శ్రీ రేణుక చార్యుల వారికి రుద్రాభిషేకము బిల్వార్చన పూజ మహా మంగళహారతి నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాతృశ్రీ మఠం శివలీలమ్మ రాచయ్య స్వామి మరియు తాజా మాజీ సర్పంచ్ బసవరాజ్ పటేల్ నాగేష్ పాటిల్ నాగరాజ్ పటేల్ లింగం గౌడ్ పండరినాథ్ రాజేశ్వర్ నవీన్ కుమార్ వెంకట సాయి సమస్త భక్తులు పాల్గొన్నారు. మరియు వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది పడకుండా అన్నదాన నీటి సౌకర్యం కల్పించడంతోపాటు అన్ని కార్యక్రమలు నిర్వహించడం జరిగింది.

స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలి.

స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలి.

#బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వనికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనికి పడుతుంది.

#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

 

Activists should work with the aim of winning local elections.

నల్లబెల్లి , నేటి ధాత్రి: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం మండలంలోని ముచింపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 66 మోసాలతో మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళాదిస్తూన్నా ప్రభుత్వనికి గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.గత 2 నెలల క్రితం అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నేడు మండలానికి ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే ఇండ్ల కోసం ముగ్గులు పోసి ప్రజలను మోసం చేస్తున్నా ప్రభుత్వనికి రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పి బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి ప్రతి కార్యకర్త సైనికుడు వలె పోరాటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.పార్టీలో చేరిన వారు దొమ్మటి శ్రీను గౌడ్, బచ్చాలు, బత్తినీ మల్లికార్జున గౌడ్, కుమారస్వామి గౌడ్ , కక్కెర్ల సమ్మయ్య గౌడ్ , ఈరగోని లింగయ్య చేరారు కార్యక్రమంలో గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు ఊటుకూరి చిరంజీవి,బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి , నాయకులు వల్లే పార్వతలు , పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి ) ,ధర్మారం క్రాంతికుమార్ ,బోట్ల ప్రతాప్ ,పులి రజినీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్.

అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్

జహీరాబాద్. నేటి ధాత్రి:

తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారము ఉదయం జహీరాబాద్ నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తాజా మాజీ సర్పంచులు చిన్న రెడ్డి (శేఖపూర్) విజయ్ ( రాయిపల్లి డి) లను జహీరాబాద్ రూరల్ పోలీసులు ఇంటి వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు తమ పదవి కాలం ముగిసి పదమూడు నెలలు గడిచిపోయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రోజు రాష్ట్ర సర్పంచుల జెఎసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జాహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉదయమే హైదరాబాద్ కు తరలి వెళ్ళడానికి సిద్ధం కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమానికి సిద్ధమైనట్టు తెలిపారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పంచాయతీలో నిధులు అందుబాటులో లేకపోయినప్పటికీ సర్పంచులు అప్పు చేసి మరి అభివృద్ధి పనులు చేశారని ఆ బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని ఆవేద వ్యక్తం చేశారు బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు గ్రామ ప్రథమ పౌరులుగా ఉండి ప్రజలకు సేవలందించిన మాజీ సర్పంచ్ లు తమ బిల్లుల కోసం అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్టు చేయడం తగదని వారు ఖండించారు తదనంతరం పోలీసులు సొంత పూచీకత్తు పై విడుదల చేసారు .

ఉద్యోగాల పేరుతో మోసం.

ఉద్యోగాల పేరుతో మోసం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ కిలాడీ లేడీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇపిస్తామని ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ ఆసుపత్రిలో ఉద్యోగం ఆశ చూపించి సుమారు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసింది. అధికారులు స్పందించి ఉద్యోగం లేదా తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

ఇమామ్ మరియు ముజ్జిన్‌లకు అభినందనలు.

పాత బాగ్దాద్ మసీదులో తరావీహ్‌లో ఖురాన్ పూర్తి చేసినందుకు ఇమామ్ మరియు ముజ్జిన్‌లకు అభినందనలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నగరంలోని పురాతన మరియు చారిత్రాత్మకమైన బాగ్దాదీ మసీదులో, హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ ఖాద్రీ షహీద్ బాగ్దాదీ మందిరం లోపల ఉన్న తరావీహ్ ప్రార్థనల సమయంలో ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ ప్రతిరోజూ మూడు అధ్యాయాలను పఠిస్తూ మొత్తం ఖురాన్ షరీఫ్‌ను పఠించే అధికారాన్ని పొందారు. హజ్రత్ సయ్యద్ షా అజీజుద్దీన్ ఖాద్రీ సాహిబ్ ఖిబ్లా మరియు సయ్యద్ షా హుస్సాముద్దీన్ ఖాద్రీ ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్, హఫీజ్ ముహమ్మద్ షకీల్ నూరి మరియు బాగ్దాదీ మసీదు డిప్యూటీ ముజ్జిన్ ముహమ్మద్ ఖైరుద్దీన్ లపై పూల వర్షం కురిపించి, వారికి అభినందనలు మరియు నైవేద్యాలను అందించారు. ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ పవిత్ర ఖురాన్ పారాయణంతో అభినందన కార్యక్రమం ప్రారంభమైంది. రిటైర్డ్ ఏఎస్ఐ ముహమ్మద్ జిలానీ నాత్ షరీఫ్ పారాయణం చేశారు. మసీదులో సింహరాశి కూడా పంపిణీ చేయబడింది. ఇది షామ్ జహీరాబాద్‌లోని ఒక పెద్ద మరియు ప్రత్యేకమైన మసీదు అని గమనించాలి, ఇక్కడ మసీదులోని ఎక్కువ మంది ఆరాధకులు ఉంటారు మరియు తరావీహ్ ప్రార్థనల సమయంలో వెయ్యి మందికి పైగా ఆరాధకులు వినయం మరియు భక్తితో పవిత్ర ఖురాన్ వింటారు. మరియు రంజాన్ మాసంలో, తరావీహ్ సమయంలో ఖురాన్ యొక్క మూడు పారాయణలు ఏర్పాటు చేయబడతాయి. ఈ సత్కార కార్యక్రమంలో ఖాజీ సయ్యద్ జియావుద్దీన్ ఓం, ఖతీబ్ ఈద్గా మరియు హఫీజ్ ముబిన్ అహ్మద్ ఖాస్మి, ముహమ్మద్ మోర్, మియా సికందర్ ఆసిద్ షకీర్, ఉస్తాద్ ముహమ్మద్ హషీం, ముహమ్మద్ రఫీ, ముహమ్మద్ రిషాద్ డానిష్ హుస్సేన్ రఫీక్ అన్సారీ, ఆరిఫ్ టోరి ముహమ్మద్ బాబా నిష్, ముహమ్మద్ అజీమ్ బారిల్, షానవాజ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదిర్ మరియు మసీదు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శకత్వ బాధ్యతలను సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నిర్వర్తించారు.

పాలనను భ్రష్టుపట్టిస్తున్న అవినీతి ఉద్యోగులు

ఆదాయం వున్న పోస్టులకు అధిక డిమాండ్‌

అందినకాడికి దండుకోవడమే లక్ష్యం

వేలంపాటలో అధిక మొత్తం చెల్లించినవారికే అటువంటి పోస్టులు

పెట్టిన పెట్టుబడికి లాభంకోసం ప్రజలను పీడిస్తున్న ఉద్యోగులు

కొందరు చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా కోట్ల విలువైన ఆస్తులు

అవినీతికి స్వేచ్ఛనిస్తున్న మన ప్రజాస్వామ్యం

ఏసీబీ అంటే భయపడే రోజులు పోయాయి

పట్టుబడినా పోస్టులు పదిలం…అవినీతికి లేదు అడ్డం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమనే రథానికి అధికార యంత్రాంగం చక్రాలవంటివారు. వీరు లేకపోతే పాలన సాగదు. అందువల్లనే పాలనా యంత్రాంగానికి అంతటి ప్రాధాన్యత. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించాల్సిన వివిధ రకాల సేవలు ఈ యంత్రాంగం ద్వారానే జరుగుతాయి. అధికారంలో వున్న పార్టీ తన హామీలను సక్రమంగా అమలు చేయడానికి చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేది ఈ ప్రభుత్వ అధికారులే! మరోమాట లో చెప్పాలంటే ప్రజాసేవలో అధికార్లది అత్యంత కీలకమైన పాత్ర. ఎందుకంటే ప్రభుత్వం తన పాలనా శైలిని మాత్రమే చెబుతుంది. కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసేది ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా కృషిచేసేది అధికార యంత్రాంగమే. ఇంతటి కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నందువల్లనే అడుగడుగునా అవినీతికి ఆస్కారం వుంటుంది. ప్రభుత్వ పాలనను భ్రష్టుపట్టించేది,అధికారపార్టీని అప్రతిష్టపాలు చేసేది కూడా ఈ అవినీతి మాత్రమే! ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులు రిటైరయ్యే వరకు తమ తమ స్థానాల్లో కొనసాగుతారు. అదే ప్రభుత్వానికి నేతృత్వం వహించే పార్టీ పదవీకాలం ఐదేళ్లు మాత్రమే! అందువల్ల పాలనలోని ప్రతి అంశాన్ని మంత్రులకు వివరించడం ద్వారా, సదరు పార్టీ తన హామీలను చట్టబద్ధమైన రీతిలో అమలు చేసేలా సలహాలు ఇచ్చి దిక్సూచిగా వ్యవహరించేది ఉన్నతాధికార్లు.

ప్రజాస్వామ్యంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషించే పాలనా యంత్రాంగంలోకి అవినీతి వేరుపురుగు ప్రవేశిస్తే, సర్వం భ్రష్టమైపోతుంది. ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడి కుప్ప కూలే అవకాశముంది. అందువల్ల ఈ పాలనా యంత్రాంగం ఎప్పుడూ ప్రభుత్వ ఆధీనంలో, ని బంధనల మేరకు పనిచేయించగలిగే ఫ్రేమ్‌వర్క్‌ ఒకటి రూపొందించబడి వుంటుంది. కానీ అవినీతి పెచ్చరిల్లినప్పుడు, ఈ ఫ్రేమ్‌వర్క్‌ పనిచేయడంలేదు. ప్రభుత్వాలు మారేకొద్దీ ఈ అధికార యంత్రాంగంలో చాలామంది బలంగా వేళ్లూనుకుపోయి, అవినీతి మార్గాల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడటం వర్తమాన చరిత్ర. ఇది రానురాను మరింత వికృతరూపం దాలుస్తున్నట్టు తెలంగాణలో జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ముఖ్యంగా దిగువస్థాయి అధికార్లు ఏదశకు చేరుకున్నారంటే, అవసరమైతే తమ అక్రమ సంపాదన దన్నుతో మంత్రులపై తప్పుడు ప్రచారాలు చేయించి, వారి పదవులకే ఎసరుపెట్టే స్థాయికి ఎదగడం వర్తమాన వైచిత్రి!

ప్రజాసంబంధాలకు సంబంధించిన శాఖల్లో పనిచేసే ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువ. కొందరు నిజాయతీ పరులైన అధికార్లు లేకపోలేదు. కానీ వీరిశాతం చాలా తక్కువ. అవినీతి అధికార్లు సంపాదన ఎక్కువగా ఉండే పోస్టులకు వెళ్లడానికి అవసరమైనంత చెల్లించడానికిఎంతమాత్రం సంకోచించడంలేదు. రానురాను ఇదొక వేలంపాటగా మారిపోయింది. అంటే ఉ ద్యోగులే తమకు కావలసిన పోస్టులకోసం పై అధికార్లకు పెద్దమొత్తాల్లో లంచాలు సమర్పించుకొని ఆ పోస్టులో నియామకమైతే, ప్రజలను ఏ స్థాయిలో పీడిరచుకు తింటారో అర్థం చేసుకోవ చ్చు. ఒకప్పుడు లంచం అంటే చాటుమాటుగా, భయంగా తీసుకునే పద్ధతికి ఎనాడో కాలం చె ల్లింది. ఇప్పుడంతా బహిరంగమే. ఒక్కొక్క పనికి ఇంత మొత్తం అని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. పై అధికార్లకు అప్పటికే నజనారానాలు చెల్లించి పోస్టులోకి రావడంవల్ల ఎవ రూ అడగరనే ధైర్యం పెరిగిపోయింది. తాము లంచంగా ఇచ్చిన మొత్తానికి రెట్టింపు లాభార్జన వసూళ్ల రూపంలో సంపాదించాలన్న యావ బాగా ముదిరింది. ఈ కారణంగానే కొన్ని శాఖల్లో దిగువస్థాయి ఉద్యోగుల ఆస్తులు వందలకోట్లకు చేరుతున్నాయి. ఒకవేళ అవినీతి నిరోధక శాఖ అధికార్లకు పట్టుబడినా వీరిలో భయం ఏకోశానా కనిపించంలేదు. తాము సంపాదించిన మొత్తంలో కొంత ఖర్చుచేసి కేసులనుంచి బయటపడి తిరిగి పోస్టుల్లో చేరుతున్నారు. ఎ.సి.బి.కి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు కోర్టుకెళ్లి ఏదోరకంగా తిరిగి తమ పోస్టుల్లో కొనసాగుతున్నారు.

ఇటీవల ఎ.సి.బి.కి పట్టుబడిన అధికార్లు తమపై కేసులు నిరూపణ అయ్యే వరకు పోస్టుల్లోనే కొనసాగించాలని, నేరం నిరూపణ అయితే అప్పుడే కఠిన శిక్ష విధించవచ్చునని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు చెప్పడం వారిలో మనోధైర్యాన్ని రెట్టింపు చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈవిధంగా పట్టుబడి సస్పెండ్‌ అయిన అధి కార్లను, కేసు పూర్తయ్యేవరకు పోస్టులోకి తీసుకోదు. కానీ కోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సదరుశాఖ మంత్రివద్దకు తీసుకెళ్లి, తమకు తిరిగి పోస్టుల్లోకి తీసుకోవాలని ఇటీవల అటువంటి అధికార్లు సంబంధిత శాఖ మంత్రివద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు మం త్రి ససేమిరా అనడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదే సమయంలో మంత్రి నిజాయతీగా పనిచేయమంటూ హితోక్తులు పలకడం వారికి ఎంతమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు లం చాల రూపంలో విపరీతంగా ఆదాయాన్ని పొందుతున్న ఈ అధికార్లకు ఇప్పుడు కేవలం జీతం రాళ్లతోనే బతకాలంటే మనసు ఎంతమాత్రం ఒప్పుకోదు. తప్పుడు మార్గాల్లో వచ్చే అధికాదాయంద్వారా విలాసాలకు, ఆస్తులు సమకూర్చుకోవడానికి అలవాటుపడిన అధికార్లు ఇప్పుడు మంత్రిపై గుర్రుగా వున్నారు. విచిత్రమేమంటే సదరు మంత్రివర్యులు, ఈ అధికార్ల అవినీతిబాగోతంపై ఒక పత్రికలో వచ్చిన వార్తలను చూపించి, నిజాయతీగా పనిచేసుకోవాలని కోరడం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.

వెంటనే వారు తమకు అనుకూల మీడియా వ్యక్తుల వద్దకు వెళ్లి, పరిస్థితిని వివరిస్తే, యూనియన్‌ నేతల వద్దకు వెళ్లి సదరు వార్తలను ఖండిరచమని కోరమని సలహా ఇవ్వడంతో వారు అదేవిధంగా తమ యూనియన్‌ నాయకులపై ఒత్తిడి తెచ్చారు. ఇక వార్తలు రాసిన పత్రిక విలేకర్లు త మను రూ.20లక్షలు డిమాండ్‌ చేయగా తాము అంగీకరించకపోవడంతో, తప్పుడు వార్తలు రాసినట్టు ఈ అధికార్లు తమకు అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం, ప్రసారం చేయ డం మొదలుపెట్టారు. ఆవిధంగా తమకు అనుకూలంగా పనిచేసిన మీడియాకు కొంత ముట్టజె ప్పారు. పనిలోపనిగా ఇదే మీడియా సహాయంతో తమకు హితవు చెప్పిన మంత్రికి వ్యతిరేకంగా వార్తలను వండటం మొదలుపెట్టారు. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటమే కాకుండా, అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఈ అధికార్లు తాము సంపాదించిన పాపపు సొమ్ముతో, మంత్రులనే ఏకంగా టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారంటే వారి ఆర్థిక మూలాలు ఎంత బలంగా వున్నాయో అర్థమవుతుంది.

అవినీతి సంపాదన ఒకస్థాయి దాటిన తర్వాత, పార్టీ టిక్కెట్లకోసం రాజకీయ నాయకులతో పోటీపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక సంఘటనలో ఒక అధికారి ఒక ప్రముఖ పార్టీ నేత వ ద్దకు వెళ్లి తనకు పార్టీ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తూ, రూ.25కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చేందుకు ముందుకు రావడమే కాదు, ఎన్నికల్లో తన ఖర్చు తానే పెట్టుకుంటానని ఆఫర్‌ ఇచ్చాడంటే ఆయన అవినీతి సంపాదన ఏస్థాయిలో ఉన్నదో చెప్పల్సిన అవసరం లేదు. ఒకప్పటి వరంగల్‌ జిల్లాకుచెందిన ఒక చిన్నస్థాయి ఉద్యోగి తన కుమార్తెకు ఏకంగా రూ.5కోట్లు కట్నం చెల్లించాడంటే అవినీతి సంపాదన ఏస్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది నెలల క్రితం ఇదే జిల్లాకు చెందినఒక రెవెన్యూ అధికారి కుమారుడికి వివాహం నిశ్చయమైంది. సరిగ్గా ఇదే సమయంలో రూ.7కోట్ల విలువైన ఆయన ఆక్రమ ఆస్తులు జప్తుకు గురయ్యాయి. పెళ్లి ఆగిపోతుందని అంతా భయపడ్డారు. కానీ పిల్ల తరపువారు మాత్రం, ‘జప్తు అయింది ఏడుకోట్లే కదా! ఇంకా చాలా కోట్ల ఆస్తి వుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. మన అమ్మాయి సుఖపడుతుంది’ అంటూ వివాహా న్ని చక్కగా జరిపించేశారు. అవినీతి ఇస్తున్న భరోసాకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఒకరకంగా చెప్పాలంటే అవినీతి ‘చట్టబద్ధతను’ సంతరించుకున్నదనుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. రెవెన్యూశాఖలో లంచాలు మరిగిన అధికార్లు పహణీల్లో పేర్లు మార్చడానికి కూడా వెనుకాడటంలేదు. పట్టేదారు పాస్‌పుస్తకం కావాలంటే ఎకరానికి రూ.లక్ష డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈమొత్తం మరింత ఎక్కువ వుంటోంది. రెండెకరాలున్న రైతు రెండు లక్ష లు లంచంగా ఇవ్వగలడా? కానీ తప్పడంలేదు. లంచం ఇవ్వు…సేవను పొందు అనేరీతిలో ప్ర భుత్వ సేవలు తయారయ్యాయి. దీన్నే ‘అవినీతిలో నీతి’ అని సరిపుచ్చుకోవాలో తెలియని దుస్థితి! వచ్చేకాలంలో ఈ అవినీతి మరింత జడలువిప్పి కొత్త పోకడలతో ప్రజలను ‘అలరించ’వచ్చు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు ఫీజుకు రె ట్టింపు చెల్లిస్తే తప్ప పనులు జరగడంలేదు. అంటే చెల్లించే రెట్టింపు మొత్తం అధికార్లు పంచుకోవడానికి సరిపోతోంది. 

మరి ఇంతటి విచ్చలవిడి అవినీతికి అంతం పలకలేమా? అంటే ఇందుకు ఒక్కటే మార్గం! కీలక మైన ప్రజాసంబంధాల శాఖల్లో పోస్టులకు ఉద్యోగ భద్రత వుండకూడదు! చిన్న అవినీతి లేదా తప్పు జరిగినా తక్షణం ఉద్యోగం వూడుతుందన్న భయం వుండాలి. అవినీతికి సంబంధించిన వి చారణలో బాధితులు చెప్పే అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. నిజాయతీ అధికార్లకు ప్రోత్సాహం, తగిన అండదండలు అందించాలి! ఉద్యోగ యూనియన్లకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు! యూనియన్లు గుదిబండలు తప్ప ప్రజాసేవకు పనికిరావు! 

ప్రైవేటు సంస్థలు విజయవంతమవుతున్నాయంటే పై అంశాలను పాటించడమే ప్రధాన కారణం.కానీ మన వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిపోయిందంటే, ఈ లంచం అనే భూతం, ఓటు వేసేదగ్గరి నుంచి మొదలై పై స్థాయి వరకు ఊడలు పాకిపోయింది. రాజకీయమే పెట్టుబడిగా మారినప్పు డు అవినీతి మాత్రమే లాభాలు తెచ్చిపెడుతుంది. నిజాయతీగా వుండేవాడు ఎందుకూ కొరగా కుండా పోయే రోజులివి! కానీ నిజాయతీగా వ్యవహరించే అధికార్లు ‘నిప్పు’లాగా ఎప్పుడూ వెలుగుతూనే వుంటారు. వారికి సమాజంలో వుండే గౌరవం, అవినీతి అధికార్లకు వుండదు. డబ్బు విలాసవంతమైన జీవితాన్నిస్తుంది కానీ, నైతికతతో కూడిన ప్రశాంతతను మాత్రం ఇవ్వదు! అవినీతిలో మునిగిన వారి జీవితం ‘మీటరు’ సక్రమంగా పనిచేయని ఆటో ప్రయాణం వంటిది. వేగంగా పెరుగుతూ, ఒక్కసారిగా పడిపోతుంది! ఇక లేవడం కష్టం!

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం.!

బోడంగిపర్తి గ్రామానికి చిట్యాలనుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
బోడంగిపర్తి గ్రామానికి చిట్యాల నుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.మంగళవారంచండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, దేవరకొండ నుండి , ఉదయం 5 గంటలకు బయలుదేరి వయా చండూరు మీదుగా బోడంగపర్తి గ్రామానికి ఏడు గంటలకు చేరుకుని చిట్యాలకు పోయే విధంగా మళ్లీ సాయంత్రం చిట్యాల నుండి బయలుదేరి బోడంగి పర్తి గ్రామానికి మూడు గంటలకు చేరుకుని మళ్లీ దేవరకొండ పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు.
. ఈ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 500 పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 600 మంది, కొత్త పింఛన్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందనిఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని ఆయన అన్నారు. వేసవి వస్తుండడంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండాఅధికారులు చూడాలని, ఇంకా అనేకమంది పేదలు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, పింఛన్ల కోసం ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రైతాంగానికి నేటికీ సక్రమంగా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారనిఆయనఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిట్యాల నుండి వయా మునుగోడు,బోడంగిపర్తి చండూరు, నాంపల్లిదేవరకొండకు పోయే విధంగామళ్లీ సాయంత్రం ఇదే విధంగాఈ గ్రామాల మీదుగా దేవరకొండ నుండి చిట్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట కార్యక్రమంలోప్రజలు బాధలు పంచుకుంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించని యెడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం, యాదయ్య,నరసింహ, గ్రామ ప్రజలుముత్తయ్య,శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి హుండీ లెక్కింపు.!

నేడు..శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి హుండీ లెక్కింపు

కల్వకుర్తి /నేటి ధాత్రి.

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాల గ్రామంలో వెలసిన శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు దేవాలయంలో హుండీ లెక్కింపు ఉంటుందని.. భక్తులు, గ్రామప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు అందరూ పాల్గొనాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version