కొరటికల్, శిర్దపల్లి రోడ్డు త్వరగా పూర్తి చేయాలి:
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే నత్త నడకగా సాగుతున్న రోడ్డు పనులు: సిపిఎం జిల్లా కార్యద ర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
కొరటికల్,శిర్దపల్లి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ రోడ్డు పనులు నత్త నడకగా సాగుతున్నాయని, ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారంచండూరు మండల పరిధిలోని శిర్దపల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోడ్డును రెండుసార్లు శంకుస్థాపన చేసి రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయకపోవడంతోప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యఉందని, ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని
ప్రజలు తమ ఆవేదనను సిపిఎం నాయకులకువెలిబుచ్చారు. గతంలో ఈ గ్రామానికి బస్సు వచ్చేదని, కరోనా కారణంగా ఆర్టీసీ బస్సు బంద్ చేశారని గ్రామ ప్రజలు సర్వే బృందానికి తెలియజేశారని ఆయన అన్నారు.
ఉదయంనల్లగొండ నుండివయా గూడపూర్,కొరటికల్,శిర్దపల్లికి ఉదయం 8 గంటలకు చేరుకునే విధంగాచండూరుకు,అదేవిధంగాచండూరు నుండి శిర్దపల్లి, కొరటికల్, గూడపూర్, నల్లగొండకు పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఈ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైనసోలిపురం,తాస్కానిగూడెం,బోడంగిపర్తి, దుబ్బకాల్వ, ఈ గ్రామాలకు బీటీ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు.ఈ గ్రామంలో సుమారుగాపింఛన్ల కోసం60 మంది, రేషన్ కార్డుల కోసం120 మంది, ఇందిరమ్మ ఇండ్ల కోసం 120 మందిదరఖాస్తు చేసుకున్నట్లు,ఇందులో భూమిలేనినిరుపేదలను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అదే విధంగా చొరవ తీసుకోవాలనిఆయన అన్నారు.ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమం కు మంచి స్పందన వస్తుందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొరటికల్,శిర్దపల్లి, తాస్కాని గూడెం రోడ్డు మరమ్మతు పనులుత్వరగా పూర్తి చేయాలని,అదేవిధంగా ప్రజలు ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ,సిపిఎం సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య,వెంకటేశం,ఈరటి వెంకటయ్య,బల్లెం స్వామి, గ్రామ ప్రజలురామ్ రెడ్డి, చంద్రారెడ్డి,లింగస్వామి,రామస్వామి,నిర్మల,అశ్విని తదితరులు పాల్గొన్నారు.
కొరటికల్, శిర్దపల్లి రోడ్డు త్వరగా పూర్తి చేయాలి.
