స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలి.
#బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వనికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనికి పడుతుంది.
#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

నల్లబెల్లి , నేటి ధాత్రి: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం మండలంలోని ముచింపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 66 మోసాలతో మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళాదిస్తూన్నా ప్రభుత్వనికి గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.గత 2 నెలల క్రితం అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నేడు మండలానికి ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే ఇండ్ల కోసం ముగ్గులు పోసి ప్రజలను మోసం చేస్తున్నా ప్రభుత్వనికి రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పి బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి ప్రతి కార్యకర్త సైనికుడు వలె పోరాటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.పార్టీలో చేరిన వారు దొమ్మటి శ్రీను గౌడ్, బచ్చాలు, బత్తినీ మల్లికార్జున గౌడ్, కుమారస్వామి గౌడ్ , కక్కెర్ల సమ్మయ్య గౌడ్ , ఈరగోని లింగయ్య చేరారు కార్యక్రమంలో గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు ఊటుకూరి చిరంజీవి,బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి , నాయకులు వల్లే పార్వతలు , పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి ) ,ధర్మారం క్రాంతికుమార్ ,బోట్ల ప్రతాప్ ,పులి రజినీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.