ఉగాది కే ఇందిరమ్మ ఇండ్లు

`ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రి ‘‘పొంగులేటి’’ పట్టుదలతో ఉన్నారు

`ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు తయారు చేస్తున్నారు

`మంత్రి ‘‘శ్రీనివాస్‌ రెడ్డి’’ గట్టిగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కృషి చేస్తున్నారు

`అనుకున్న మేరుకు నాలుగేళ్లలో 20 లక్షలు ఇస్తే కాంగ్రెస్‌కు ఎదురుండదు

`మరో పదేళ్లు కాంగ్రెస్‌ పాలనను జనం వదులుకోరు

`పదేళ్ల కల తీరితే బిఆర్‌ఎస్‌ గురించే ప్రజలు ఆలోచించరు

`గత ప్రభుత్వం పదేళ్లలలో డబుల్‌ బెడ్‌ రూంలు ఇచ్చింది లేదు

`ఇస్తామని చెప్పి రెండు సార్లు బిఆర్‌ఎస్‌ మోసం చేసింది

`అందుకే ప్రజలు బిఆర్‌ఎస్‌ ను ఓడిరచింది

`కాంగ్రెస్‌ మీద ప్రజలకు అపారమైన నమ్మకం వుంది

`గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన అనుభవం కాంగ్రెస్‌కు వుంది

`పదేళ్ల పాటు అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్‌ ఇచ్చింది

`బిఆర్‌ఎస్‌ ఇస్తామని చెప్పి, పదేళ్లు మోసం చేసింది

`ఆ ప్రభావం బిఆర్‌ఎస్‌ మీద పడడం జరిగింది

`కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే చాలు తిరుగులేని శక్తిగా మారుతుంది

`కూడు, గూడు కల్పిస్తే ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

`అక్కడక్కడా నిర్మాణాలు చేసి బిఆర్‌ఎస్‌ ఓట్లు పొందింది

`ఆ నిర్మాణాలను చూపించారే గాని బిఆర్‌ఎస్‌ ఇచ్చింది లేదు

`అప్పుటి నుంచి పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు

`ప్రజా ప్రభుత్వం మీద పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు

`నాలుగేళ్లలో ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు ఇస్తే కాంగ్రెస్‌ కు తిరుగుండదు

`తెలంగాణ లో ఇతర పార్టీలకు ఆదరణ వుండదు

`ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కారు వైపు కన్నెత్తి కూడా చూడరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సొంతింటి కల నెరవేరే సమయం వచ్చేసింది. ఉగాదికి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చట్టనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుచేస్తోంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రజలకు హమీ ఇచ్చింది. ఆ హమీ అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గత కొంత కాలంగా ఈ కార్యక్రమం అమలు మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా సుమారు 20లక్షల ఇండ్లు ఈ నాలుగేళ్లకాలంలో పేదలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో ఈ ఏడాది మొదటి విడుతగా సుమారు 5లక్షల ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పట్టుదలతో వున్నారు. అందుకు అవసరమైన ఇండ్ల పంట్టాలను యుద్ద ప్రాతిపదికన తయారు చేస్తున్నారు. ఉగాదికి ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి చొరవతో అధికారులు కూడా చకచకా ఆ పనులు పూర్తి చేస్తున్నారు. అనుకున్న మేరకు ఈ ఏడాది ఎట్టిపరిస్ధితుల్లో 5లక్షల ఇండ్లు పేదలకు పంచి వారి కళ్లలలో ఆనందం చూడాలనుకుంటున్నారు. వారికి ఇచ్చిన హమీని మొదటి దఫాలోనే నెరవేర్చి వారి ఆశలను నెరవేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అర్హులందిరకీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం దిగ్విజయంగా సాగేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీమీద ప్రజలకు అంచెంచలమైన విశ్వాసం. పదేళ్లుగా పేదలు ఇందిరమ్మ ఇండ్లకోసం ఎదురుచూస్తున్నారు. 2005 నుంచి 2014 వరకు 25లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. రేవంత్‌ సర్కారు నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు ఇస్తామంటోంది. నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కాంగ్రెస్‌కు తిరుగుండదు. తెలంగాణలో ఇతర పార్టీలు రాజకీయమే వుండదు. రేవంత్‌ సర్కారు నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నది. ఈ ఏడాది సుమారు 5లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 5లక్షల ఇండ్లు నిర్మాణమైతే కాంగ్రెస్‌కు తిరుగుండదు. పల్లెల్లో ఇతర పార్టీల జెండాలే కనిపించవు. ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు కల. ఆ కలను ఆది నుంచి నెవరేస్తున్న పార్టీ, ప్రభుత్వం కాంగ్రెస్‌. ఇందిరా గాంధీ హాయాం నుంచి మొదలు, 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు ఇండ్లు కట్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో పెద్దఎత్తున ఎస్సీ, ఎస్టీలకు పక్కా గృహాలు, వ్యవసాయ భూములు, వాటితోపాటు తెట్టెతో నిర్మాణం చేసిన బావులు తవ్వించి, పేదలను ఆర్ధికంగా ఉన్నత స్దితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీలకు సాగు భూములు వుండేవి కాదు. దాంతో ఎస్సీలకు ప్రభుత్వ భూములను అందించారు. ఆ భూములను సాగు యోగ్యం చేసేందుకు సహకారమందించారు. సాగు నీటికి అవసరమైన బావులను పెద్దఎత్తున తవ్వించి ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణలో ప్రతి గ్రామంలో వ్యవసాయ భూముల వద్ద రాతి కట్టడంతో కూడాని తెట్టె నిర్మాణం చేసిన బావులే ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత బిసిలకు బలహీన వర్గాల గృహ సముదాయాల పేరుతో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వాలే. 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పెద్దఎత్తున పేదలకు అందజేసింది. ఉమ్మడిరాష్ట్రంలో సుమారు 45లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. అప్పుడు ఎస్సీ, ఎస్సీ, బిసి , ఓసి అని తేడాలు లేకుండా ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది. తెలంగాణలో ఆ పదేళ్ల కాలంలో సుమారు 25లక్షలు పైగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లినా ఇందిరమ్మ ఇండ్లు కనీసం 500 వరకు వుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపధకం ద్వారా తెలంగాణ మొత్తం సుమారు 25 లక్షల మంది పేదలు ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రజలకు అందించేందుకు బృహత్తర ప్రణాళిలను రచిస్తోంది. తెలంగాణలో ఇల్లు లేదన్న పేద వారు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. గతంలో ఇల్లు కావాలన్న ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. అవి ఇప్పుడు పల్లెల్లో మరో గ్రామంగా, పట్టణాలలో పెద్ద పెద్ద కాలనీగా అవతరించాయి. అంత గొప్పగా ఆ పధకాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాలది. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పడకల గదులు ఇండ్ల నిర్మాణం పేరు చెప్పి ప్రజలను వంచించిన ఘనత బిఆర్‌ఎస్‌ది. కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను ఎద్దేవా చేస్తూ వాటిని అగ్గిపెట్టెలంటూ హేళన చేసి బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల స్ధానంలో ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ ఇంటిని నిర్మించి ఇస్తామని హమీ ఇచ్చి కేసిఆర్‌ అధికారంలోకి వచ్చాడు. ఒకటి కాదు, రెండుసార్లు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఏ ఒక్క తెలంగాణ పల్లెలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. పేదలకు ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ను గెలిపించారు. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే తప్పదని ప్రజలకు తెలుసు. అందుకే ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డిని ప్రజలు బలంగా విశ్వసించారు. ఆయన నాయకత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు ఐదేళ్ల కాలంలో కనీసం 20లక్షల ఇందిరమ్మ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఏటా కనీసం 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వనున్నారు. అందుకు అవసరమైననిధులను కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. త్వరలోనే ఇందిరమ్మ నిర్మాణం మొదలు కానున్నది. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలు పెడతామని హమీ ఇచ్చారు. ఆ ప్రజా విజయోత్సవాలలో ఇండ్ల ధరఖాస్తులుకూడా ప్రజల నుంచి స్వీకరిం చారు. వాటి ఆధారంగా ఎంపిక ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. పల్లెల్లో గాని,పట్ణణాలలో గాని స్ధలం వున్న వారికి రూ.5లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. స్థలాలు లేని వారికి ప్రభుత్వ స్ధలాలను గుర్తించి, ఇండ్ల పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లునిర్మాణం చేసిఇస్తారు. ఇటీవల జరిగిన సమగ్ర సర్వేతో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. దాంతో తెలంగాణ లో ఎంత మందికి ఇండ్లు అవసరపడతాయో తెలుతుంది. అయితే ఇప్పటికే ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను సుమారు 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వడానికి ప్రణాళికలు కూడా సిద్దమయ్యాయి. దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేసింది. ముందుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు పైలెట్‌ ప్రాజెక్టు కింద మంజూరు చేశారు. ఇలా దశల వారిగా ప్రతి నియోజకవర్గంలో ఏటా 3500 ఇండ్లు నిర్మాణంచేసి ఇస్తారు. పట్టణాలలో అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తారు. అందుకు అసవరమైన మోడళ్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ప్రభుత్వమే పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి పేదలకు పంచే కార్యక్రమం మొదలు కాకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోపు సుమారు 450000 ఇండ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా వుంది. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలలో దానికి అంకురార్పన జరగుతోంది. తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షలాది ధరఖాస్తులు వచ్చాయి. ఈసారి కూడ ఏడాదికి సుమారు 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇలా ఈ నాలుగేళ్ల కాలంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వచ్చే ఇవరై ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగుండదు. కాంగ్రెస్‌ను కాదని ఏ ఇతర పార్టీని ప్రజలు ఆదరించరు.

జహీరాబాద్ లో వడగళ్ల కూడిన భారీ వర్షం..

జహీరాబాద్ నియోజకవర్గం లో వడగళ్ల కూడిన భారీ వర్షం l

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో శనివారము నాలుగున్నర గంటల ప్రాంతంలో అప్పటివరకు భానుడి భగభగతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Heavy rain

వడగండ్ల వానకు తోడుగా బికర గాలులతో తోడవడంతో ప్రజలు భయాందోళన వచ్చింది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు వానగాళ్లు తో ప్రజలు ఇక్కట్లు

Heavy rain

పడ్డారు. సాయంత్రం ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా..

 

 

సాయంత్రం కురిసిన వర్షం తో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో వానగాళ్లు
కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జహీరాబాద్ న్యాల్కల్ కోహీర్ మొగుడంపల్లి ఝరాసంగం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ఝరాసంగం మండలంలో ఈదురుగాలులతో కూడిన వానకురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోనూ భారీ వర్షం పడింది. భారీ వర్షాలు పడటంతో రైతులకు కొంతమేర నష్టం కలిగింది.

అర్ధరాత్రి విద్యార్థుల నిర్భందఖాండ.

అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… అర్ధరాత్రి విద్యార్థుల నిర్భందఖాండ…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ లో బి.ఆర్.ఎస్వీ నాయకుల అక్రమ నిర్బంధం…విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి బయల్దేరిన బి.ఆర్.ఎస్వీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన జహీరాబాద్ పోలీసులు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు..
బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి రాకేష్…

Student

జహీరాబాద్ కార్యలయంలో ఎర్పాటు చేసిన సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ రాకేష్ మాట్లాడుతూ సీ.ఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి డుమ్మా కొట్టడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ఎగవేసి విద్యార్థులను మోసం చేశాడు అని ద్వజమెత్తారు. అదే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతకు మొండి చెయ్యి ఇవ్వడం జరిగింది అని అన్నారు. మహిళా విద్యార్థినిలకు స్కూటీల పేరు చెప్పి ఓట్లు దండుకుని నేడు వారికి బడ్జెట్ లో కనీసం వారీ ప్రస్తావన సైతం తీయలేదని ఎద్దవ చేశారు. మరి ముఖ్యంగా అనగారిన విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ గురించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే కాకుండా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం బి.ఆర్.ఎస్వీ ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అర్ధరాత్రి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యి పట్టున పది రోజులు గడువక ముందే ఇప్పటి అనేక మార్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను రాత్రికి రాత్రే అరెస్టులు చేసి నిర్బంధకాండ సృష్టిస్తున్నారని అన్నారు. ఈలాంటి కాంగ్రెస్ ప్రజాపాలన చూస్తే ఎమర్జెన్సీ పాలనను తలపించే విధంగా సాగుతుందని ఎద్దేవా చేశారు.జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థి నాయకులను భయబ్రాంతులకు గురి చేసి అక్రమ అరెస్టులు తక్షణమే మానుకోలవని హెచ్చరించారు. ఇప్పటి వరకు విద్యార్థుల జోలికి వొచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నిలిచిన దాఖలు లేవని విధ్యార్థులు జోలికి వొస్తే ఊరుకోబోమని బీ.ఆర్.ఎస్వీ తరపున పోరాటం ఉదృతం చేస్తాం అని ముందస్తు అరెస్టులు ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వన్ని కోరారు. ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి విద్యార్థులను అరెస్టు చేయడాలను ఆపాలని హెచ్చరించారు . ఈ సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఓంకార్ , బీ.ఆర్.ఎస్వీ న్యాల్కాల్ మండల అధ్యక్షులు జెట్గొండ మారుతి యాదవ్ , సీనియర్ బీ.ఆర్.ఎస్వీ నాయకులు పరశురాం , ఎం.డీ ఫయాజ్ , రఘు తేజ , ఆవేజ్ , అజీమ్ , ఇక్బాల్ , మహేష్ , రజాక్, మరియు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్…

బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్వీ నాయకులను రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని, ఎన్నికల్లో గెలుపు కోసం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ముందస్తు అరెస్టు చేయడం మంచిది కాదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రవణ్, గోనె రాజేందర్, గాజుల చంద్ర కిరణ్, దేవి సాయికృష్ణ, కుర్మ దినేష్, కంది క్రాంతి తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

100 రోజుల పని కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు

100 రోజుల పని కూలీలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట గ్రామం లో జరుగుతున్న రోడ్ వర్క్ పనిని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి , ఆర్డీవో నరేష్ , ఎంపీడీవో ఎల్ భాస్కర్ విజిట్ చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ కూలీలకు విలువైన సూచనలు కొలతల ప్రకారం పని చేసి 300 రూపాయల వేతనం పొందాలి అని చెప్పడం జరిగింది. కూలీలు ఎండలో పనిచేయడం వలన వడాదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది మరియు కూలీలకు ఓ ఆర్ ఎస్ పాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మండలం లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు జరగాలని వాటిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది.ఇందులో ఏ పీ ఓ / ఈసీ రాజు,పంచాయతీ సెక్రటరీ షఫీ, బి ఎఫ్ టి రాజశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ సుజాత, కూలీలు పాల్గొన్నారు

బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్..!

బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ అర్ధరాత్రి విద్యార్థులపై నిర్భందఖాండ అమలు చేస్తున్నదని శనివారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. జహీరాబాద్ లో అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్వీ నాయకులు రాకేష్, ఓంకార్ లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు

ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్

ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయండి.

జహీరాబాద్. నేటి ధాత్రి 

న్యాల్కల్ మండల కేంద్రములోని ఇందిరా క్రాంతి పథకం ఆఫిస్ లో వివోఏల అధ్యక్షుడు నాగేందర్ ఆధ్వర్యంలో ఐకెపి వివోఎల సమావేశం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు నాగేందర్ మాట్లాడుతూ ఐకెపి వివోఏల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ఐకెపి వివోఎలందరు కదిలి వచ్చి రాష్ట్ర కమిటీ తల పెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ధ్రువీకరణ పత్రాలకు తప్పుని తిప్పలు.

ధ్రువీకరణ పత్రాలకు తప్పుని తిప్పలు

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయంలో ప్రజలకు ఇక్కట్లు తప్పట్లేదు. సంక్షేమ పథకాలకు కుల, రాబడి ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటాయని ధ్రువీకరణ పత్రాల కోసం తాహాసిల్దార్ కార్యాలయం కి వెళ్తే అక్కడ గిర్ధావర్ లు పెండ్లి అయి 10 సంవత్సరాలు అయినా కూడా కుల ధ్రువీకరణ కోసం తమ అమ్మవారి ఇంటి పేరు తో కుల ధ్రువీకరణ పత్రం ఉండాలని నిక్కట్టుగా చెప్తున్నారు. ఈ పదేళ్లలో అమ్మవారి ఇంటికాడ నుండి సర్టిఫికెట్లన్నీ మెట్టినింటి కి మారిన సర్టిఫికెట్లు చూపెట్టిన ఫలితం లేకుండా పోతుంది. తప్పనిసరిగా పెండ్లి అయి ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పుడు అమ్మగారి ఇంటి పేరు చెక్ చేయాల్సిందే అంటున్నారు. గతంలో చేసిన అధికారులు ఎలాంటి ధ్రువీకరణలు లేకుండా చేశారా?గతం లో ఉన్న గిర్ధవర్లె ఆ ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేశారని మర్చిపోయారా? లేకపోతే ప్రజలను గిర్దవర్ లు కావాలని ఇలా చేస్తున్నారా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలు.

నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన బిజెపి శ్రేణులు
– రైతులను ఆదుకోవాలని ఎమ్మార్వో కు వినతి పత్రం
చందుర్తి, నేటిధాత్రి 

 

heavy rain.

నిన్న కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి దెబ్బ తిన్న పంటలను బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో పరిశీలించి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నియోజకవర్గ కన్వీనర్ నాయకులు మార్తా సత్తయ్య మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో నిన్న కురిసిన చేతికంది పంట దాదాపు 60% నష్టం వాటిల్లిందని, గత ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పసల్ బీమా యోజన స్కీం ని ఇక్కడ అమలు చేయకపోవడం బాధాకరమని, ఫసల్ బీమా యోజన ఉంటే నష్టం జరిగిన రైతులకు ఇన్సూరెన్స్ అందేదని, ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, తక్షణమే ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయ క్షేత్రం లోకి పంపించి పంట నష్టం అంచనా వేసి ఎకరాకు 50,000వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని మార్త సత్తయ్య అన్నారు, ఈ పంట నష్టం పర్యవేక్షణలో బిజెపి మండల అధ్యక్షులు మొకిలి విజేందర్, ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు, మర్రి మల్లేషం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మూడపెళ్లి ముఖేష్ , మనోహర్ రెడ్డి , బొరగాయ తిరుపతి , లింగాల రాజన్న, నిరటి శేకర్, హనుమయ్య చారి, చింతకుంట గంగాధర్, సిరికొండ తిరుపతి, మట్కామ్ మల్లేశం, పాటి సుధాకర్, కూతురు మహేందర్ రెడ్డి, అల్లం శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్.

అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ట్రాక్టర్ లారీ పట్టివేత..!

– అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండలంలో శుక్రవారం నాడు హద్నూర్ ఎస్పై చల్ల రాజశేఖర్ సమాచారం మేరకు అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ఒక లారీ సీజ్ చేశారు హుస్సేల్లి చెక్పోస్ట్ దగ్గర హద్నూర్ ఎస్పై చల్లా రాజశేఖర్ తోటి సిబ్బందితో వాహన తనిఖీలు చేపడుతుండగా గణేష్ పూర్ గ్రామం నుండి ఒక ట్రాక్టర్( కె ఏ 38 టీ 5174 ) అశోక్ లేలాండ్ లారీ (ఏపీ 13 టీ 4188) లో అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తుండగా వాటిని పట్టుకొని వివరాలు అడగగా ఎర్ర రాయికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని ఆ ట్రాక్టర్ లారీ లను స్వాధీన తీసుకొని న్యాల్కల్ మండల్ ఎమ్మార్వోకు తగు చర్య తీసుకోవాలని సీజ్ చేసిన ట్రాక్టర్ లారీని అధికారులకు అప్పగించారు. హద్నూర్ ఎస్సై చల్లా రాజశేఖర్ తెలిపారు.

ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం.

ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతిభ స్వచ్ఛంద సేవా సంస్థ,మునిసిపాలిటీ, జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ పట్టణీకరణ వల్ల అడవులు నశించిపోయి భూభాగం మొత్తం సిమెంటు కాంక్రీట్ జంగల్ గా మారి భూమిలో నీరు ఇంకిపోక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. దీనికి ప్రతి ఒక్క ఇంటి నిర్మాణం వద్ద ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలని,అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ప్రతిభ సంస్థ అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ భూమిపై ఏడు పాళ్లు నీళ్లు మూడు పాళ్ళు భూమి ఉన్నప్పటికీ 97.5 శాతం సముద్రాల్లోని పనికిరాని ఉప్పు నీరు ఉండగా రెండున్నర శాతం మాత్రమే మంచినీరు అని అలాగే కూడా ఒక్క శాతం మాత్రమే భూమి ఉపరితలంలో నదులు సరస్సులలో ఉన్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బెజ్జంకి ప్రభాకర్ ,మున్సిపాలిటీ మేనేజర్ సంపత్ కుమార్,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సూర్యతేజ, జూనియర్ అసిస్టెంట్ శివ టెక్నికల్ ఆఫీసర్ నర్సింగరావు, ప్రతిభ సంస్థ వెంకటేశ్వర్లు, వినియోగదారుల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగెల్లి సారంగం, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో…

ప్రపంచ మంచినీటి దినోత్సవం సందర్బంగా తిమ్మంపేట,తొగర్రాయి ప్రభుత్వ పాఠశాలలో బాలవికాస స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలవికాస కోఆర్డినేటర్ రజిత, దేవేంద్ర రమాదేవి, లక్ష్మిలు విద్యార్థులను ఉద్దెశించి మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలి.భూగర్భ జలాలను డెవలప్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రజలకు అవగహన కల్పించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు,వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

శాప్ చేర్మెన్ రవికి చిరు సన్మానం..

శాప్ చేర్మెన్ రవికి చిరు సన్మానం..

తిరుపతి నేటి ధాత్రి 

 

ఇటీవల అమరావతి లో శాసన సభ్యులు, మరియు శాసన మండలి సభ్యుల మానసిక ఉల్లాసం కొరకు జరిగిన క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లో కీలక పాత్ర పోషించడమే కాకుండా . ముఖ్యమంత్రి, మరియు శాసనసభ స్పీకర్ లు చే మన్ననలు పొందిన శాప్ చేర్మెన్ అనిమిని రవి నాయుడు ను శనివారం తిరుపతిలో ఎమ్మెలే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సన్మానించారు. క్రీడాల నిర్వహణలో రవి నాయుడు చూపిన చొరవ ను ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఈ కార్యక్రమం లో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, నాయకులు రాజారెడ్డి, నైనార్ మహేష్,, బాబ్జి,తదితరులు పాల్గొన్నారు..

సిసి రోడ్లకు భూమి పూజ…

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్లకు భూమి పూజ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రెడ్డబోయినీ గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ గారి సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (NREG S). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి కోటి 75లక్షల రూపాయలు నిధులతో కేటాయించడంతోసిసి రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సారం పెళ్లి గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి అధ్యక్షులు రాధా వినయ్ బిజెపి సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్ సందే వేని రాజు సిరిసిల్ల వంశీ బరికెల రాజు బిజెపి నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

10 పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో రెండవ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,తహసీల్దారు వనజా రెడ్డి,ఎస్సై శ్రీధర్ సందర్శించారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు సరియైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకొని ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా సమయస్ఫూర్తితో తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు బాగా రాయాలని ఉన్నత ఫలితాలను మండల కేంద్రానికి తీసుకురావాలని విద్యార్థులకు సూచనలు చేశారు.

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రతిపక్షాల నాయకుల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఈ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

నిజాంపేట, నేటిధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతుల్లో విద్యాబోధన అందించారు.వీరిలో ప్రధానోపాధ్యాయులుగా సింధు,
డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓ గా సాత్విక్,లు ఉన్నారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు చక్కటి విద్యను అందించారని ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు వినోద్, శ్రీలత, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్,ఇంతియాజ్ భాను, బాల్ లక్ష్మి,ప్రమీల,తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు…

ముందస్తు అరెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలలానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నిషేధంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్వి నాయకులు ముందస్తుగా అడ్డుకొని ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్కు ట్రాఫిక్ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మాకు సంబంధించిన విషయాల గురించి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో చీమల ప్రశాంత్ యాదవ్ బొలవేణి ఎల్లం యాదవ్ పొందాల చక్రపాణి నందగిరి భాస్కర్ గౌడ్ తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు వీరిని మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ నాయకులు కోడి యంతయ్య జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు తదితరులు పరామర్శించారు

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత.

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత

 

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

గీసుకొండ మండల కేంద్రానికి చెందిన తాళ్లపెళ్లి రమేష్ – నాగమణిల కూతురు పుట్టిన కొన్ని రోజుల తర్వాత కడుపు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో ఆ చిన్నారి పాపకు వైద్య చికిత్స చేయించడానికి ఇబ్బందులు పడుతూ, సాయంఅందించాలని ప్రాధేయపడుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న హన్మకొండలో ఉంటున్న గీసుకొండ గ్రామానికి చెందిన ఏనుగుల మంజుల -సాంబరెడ్డి దంపతులు మానవత్వంతో స్పందించి రూ.3వేలు పంపగా ఆ నగదును కర్ణకంటి రజిత -రాంమూర్తి దంపతులు ఆ చిన్నారి పాప తల్లికి అందజేశారు.ఈకార్యక్రమంలో స్థానికులు చాపర్తి రాజమ్మ పాల్గొన్నారు.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను.

భగత్ సింగ్ 94 వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయండి.
న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ*

నర్సంపేట,నేటిధాత్రి:

 

బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరితాడును ముద్దాడిన యువ కిశోరులు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 94వ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ నర్సంపేట పట్టణంలోని న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.పిడిఎస్యు, పివైఎల్, సంఘాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు 94 వ వర్ధంతి వారోత్సవాలను జరపాలని పిలుపునిచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి నిరుద్యోగులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న దురాహంకారానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఈపి 20-20 మరియు యుజిసి ముసాయిదాలను రద్దు కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్ విద్యార్థి సంఘాలు చేసే ఆందోళన ఇతర కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేతకు పోరాడాలని కోరారు.నేడు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు గట్టి కృష్ణ,ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భోగి సారంగపాణి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు పూలక్క,గుగులోతు భద్రాజి భీమగాని మల్లయ్య,బరిగల కుమార్, గొర్రె ప్రదీప్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనికి వెళ్లిన కార్మికుడు మృతి.

ఉపాధి పనికి వెళ్లిన కార్మికుడు మృతి

చందుర్తి, నేటిధాత్రి:

 

ఈ రోజు అనగా శనివారం రోజున ఉదయం 9 గంటల 30 నిమిషాలకు చందుర్తి మండలం ఎన్గల్ గ్రామములో ఉపాధి హామీ పనులో భాగంగా రోడ్డు పనులు చేసి మధ్యలో అన్నం తినేటప్పుడు పసుల లచ్చయ్య s/o రాజయ్య, అకస్మాత్తుగా పడిపపోవడం జరిగినది వెంటనే అంబేలెన్స్ కి కాల్ చేసి తెప్పించి ఏరియా ఆసుపత్రి వేములవాడ కు తీసుకువెళ్లడం జరిగినది అక్కడ డాక్టర్లు ఇసిజి తీసిన తర్వాత లచ్చయ్య చనిపోయాడని తెలియజేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version