సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్…

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో మ‌హిళా పారిశ్రామిక‌వేత్తను త‌యారు చేసే ప్రణాళికలు అమ‌లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతి వేదికగా లోకేశ్ మాట్లాడారు.

ఏపీకి బిల్‌ గేట్స్‌.. సీఎం చంద్రబాబు ట్వీట్…

ఏపీకి బిల్‌ గేట్స్‌.. సీఎం చంద్రబాబు ట్వీట్

గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీకి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్ అని పోస్టు చేశారు సీఎం.

అమరావతి, ఫిబ్రవరి 16: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో, ఐటీ మంత్రి నారా లోకేశ్‌, పలువురు మంత్రులు.. ఆయన్ను ఘనంగా స్వాగతించారు. తర్వాత రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), ఇతర మంత్రులు బిల్ గేట్స్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)ను బిల్ గేట్స్, ఆయన ప్రతినిధి బృందం సందర్శించింది.
ఏపీకి బిల్ గేట్స్ రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. బిల్ గేట్స్‌ను స్వాగిస్తూ సీఎం ట్వీట్ చేశారు. ‘వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే #APWelcomesYou హ్యాష్‌ట్యాగ్‌తో ట్యాగ్ చేశారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీకి బిల్‌ గేట్స్ రావడం ఇది మూడోసారి. మరోవైపు, సచివాలయానికి చేరుకున్న బిల్స్ గేట్స్, ఆయన ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అమరావతిలోనే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..

అమరావతిలోనే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..

 

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రతి ఏటా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాత్రం రాజధాని అమరావతిలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాయపూడి సీఆర్డీఏ ఆఫీసు సమీపంలో 20 ఎకరాల్లో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం..

రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం

 

అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు వడ్డమాను రైతులు అంగీకారం తెలిపారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు గ్రామ రైతులు మద్దతుగా నిలిచారు.

రాజధాని అమరావతిలోని తుళ్ళూరు మండలంలో మంత్రి నారాయణ ఈరోజు (బుధవారం) పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పోలింగ్‌కు రైతులు అంగీకారం తెలిపారు. అయితే కౌలు ప్యాకేజీ పెంచాలని మంత్రికి రైతులు వినతి చేశారు. గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు తమ పాసుపుస్తకాలను మంత్రి నారాయణకు అందజేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏడు గ్రామాల్లో 16.666 వేల పైచిలుకు భూమి అవసరమన్నారు. 2014 -19 లో రాజధాని రైతుల సలహాలతో పాలసీ నిర్ణయించామని.. అదే విధంగా రైతులతో చర్చించి వారి నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రభుత్వం మారటం వలన గత ప్రభుత్వం కేసుల వల్ల జాప్యం జరిగిందన్నారు. తమ పరిధిలో చేయగలిగిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.రోడ్లు, డ్రైన్లు సరి చేయమని రైతులు కోరారని.. అది పూర్తి చేస్తామని చెప్పారు. 29 గ్రామాలను అభివృద్ధి చేయడానికి రూ.900 కోట్లు అవసరమని తెలిపారు. ఆరు నెలల్లో తొమ్మిది గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. వడ్డమాను గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతులు ఏ విధంగా అడిగితే అలా అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

శాప్ చేర్మెన్ రవికి చిరు సన్మానం..

శాప్ చేర్మెన్ రవికి చిరు సన్మానం..

తిరుపతి నేటి ధాత్రి 

 

ఇటీవల అమరావతి లో శాసన సభ్యులు, మరియు శాసన మండలి సభ్యుల మానసిక ఉల్లాసం కొరకు జరిగిన క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లో కీలక పాత్ర పోషించడమే కాకుండా . ముఖ్యమంత్రి, మరియు శాసనసభ స్పీకర్ లు చే మన్ననలు పొందిన శాప్ చేర్మెన్ అనిమిని రవి నాయుడు ను శనివారం తిరుపతిలో ఎమ్మెలే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సన్మానించారు. క్రీడాల నిర్వహణలో రవి నాయుడు చూపిన చొరవ ను ఎమ్మెల్యే ప్రశంసించారు.
ఈ కార్యక్రమం లో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, నాయకులు రాజారెడ్డి, నైనార్ మహేష్,, బాబ్జి,తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version