ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం.

ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతిభ స్వచ్ఛంద సేవా సంస్థ,మునిసిపాలిటీ, జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ పట్టణీకరణ వల్ల అడవులు నశించిపోయి భూభాగం మొత్తం సిమెంటు కాంక్రీట్ జంగల్ గా మారి భూమిలో నీరు ఇంకిపోక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. దీనికి ప్రతి ఒక్క ఇంటి నిర్మాణం వద్ద ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలని,అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ప్రతిభ సంస్థ అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ భూమిపై ఏడు పాళ్లు నీళ్లు మూడు పాళ్ళు భూమి ఉన్నప్పటికీ 97.5 శాతం సముద్రాల్లోని పనికిరాని ఉప్పు నీరు ఉండగా రెండున్నర శాతం మాత్రమే మంచినీరు అని అలాగే కూడా ఒక్క శాతం మాత్రమే భూమి ఉపరితలంలో నదులు సరస్సులలో ఉన్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బెజ్జంకి ప్రభాకర్ ,మున్సిపాలిటీ మేనేజర్ సంపత్ కుమార్,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సూర్యతేజ, జూనియర్ అసిస్టెంట్ శివ టెక్నికల్ ఆఫీసర్ నర్సింగరావు, ప్రతిభ సంస్థ వెంకటేశ్వర్లు, వినియోగదారుల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ నాగెల్లి సారంగం, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో…

ప్రపంచ మంచినీటి దినోత్సవం సందర్బంగా తిమ్మంపేట,తొగర్రాయి ప్రభుత్వ పాఠశాలలో బాలవికాస స్వచ్చంద సంస్థ వారి ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలవికాస కోఆర్డినేటర్ రజిత, దేవేంద్ర రమాదేవి, లక్ష్మిలు విద్యార్థులను ఉద్దెశించి మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలి.భూగర్భ జలాలను డెవలప్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రజలకు అవగహన కల్పించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు,వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

చర్లపల్లి పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం.

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపా ధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
పచ్చని చెట్లతో,పారే నదులతో,అందమైన పక్షులు, అలరించే జంతువులతో, ఎన్నో జీవుల్ని కలిగి వున్న గ్రహం ఈ భూమి.ఈ జీవులన్నిటి మనుగడకు కావలసినది నీరు.అటువంటి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ప్రజలకు అవగాహన కలిగించుటకు 1993వ సం॥లో ఐక్యరాజ్యసమితి మార్చి 22ని అంతర్జాతీయ జల దినోత్సవం’గా ప్రకటించిందని, భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరయితే ఉందో,ఇప్పుడు కూడా అంతే నీరు ఉంది. పెరగడం కాని, తరగడం కాని లేదు.కానీ ప్రపంచ జనాభా నిత్యం పెరుగుతునే ఉంది. అందుకే కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు. భూమి మీద ఉన్న నీటిలో 97% ఉప్పునీరు. కేవలం 3% మాత్రమే మంచినీరు. ఈ నీటిని మనం చాలా పొదుపుగా ఉపయోగించుకోవాలని, ప్రపంచంలో భారీయుద్ధాలలో చనిపోయిన వారికన్నా కలుషిత నీరు తాగడం వలన మరణించిన వారి సంఖ్య ఎక్కువని,సంవత్సరానికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మరణిస్తున్నారని అన్నారు.
కాబట్టి,నీటిని పొదుపుగా వాడుట, కలుషితం అవకుండా కాపాడుట మన అందరి యొక్క బాధ్యత అని,సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం నీరు,నీరు లేక జీవకోటి మనుగడ లేదని అన్నారు.అనంతరం జల ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కంచరాజు కుమార్,అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్యా,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ నీటి దినోత్సవం…

ప్రపంచ నీటి దినోత్సవం

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం రోజున బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమాన్ని గ్రామంలో ర్యాలీతో విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో నీటి వినియోగం గురించి విద్యార్థిని విద్యార్థులు మాట్లాడిన ఉపన్యాసంలో మొదటి బహుమతి రెండవ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ నుండి ఈ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందిస్తూ ప్రజల బాగోగులకు తోడ్పడింది.
జలమే జగతికిమూలఆధారం
జలమే ప్రగతికి ప్రణాధారం
జలమే మనకు ఆహారం
జలమే మనకు ఆరోగ్యం
జలాన్ని మనం రక్షిస్తే జలం మనం రక్షిస్తుంది.
నీరు కలుషితం కాకుండా నీటి స్వచ్ఛతను పెంచాలని తెలిపారు. నీటిని పొదుపుగా వాడాలి ఉన్న నీటిని కాపాడాలి. త్రాగునీరు సాగునీరు బాధలన్నీ అరికట్టుటకు యువత ముందడుగు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,లలిత, సురేందర్, బాలవికాస సూపర్వైజర్ పరుశురాం,జోనల్ డైరెక్టర్ జీడి తిరుపతి గౌడ్, దుబాసి సంజీవ్, పాగాల ఎల్లం యాదవ్, బాలవికాస కమిటీ సభ్యులు మెట్టు వెంకట్, పోలు శ్రీనివాస్, దేవరాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version