నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన బిజెపి శ్రేణులు
– రైతులను ఆదుకోవాలని ఎమ్మార్వో కు వినతి పత్రం
చందుర్తి, నేటిధాత్రి

నిన్న కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి దెబ్బ తిన్న పంటలను బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో పరిశీలించి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నియోజకవర్గ కన్వీనర్ నాయకులు మార్తా సత్తయ్య మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో నిన్న కురిసిన చేతికంది పంట దాదాపు 60% నష్టం వాటిల్లిందని, గత ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పసల్ బీమా యోజన స్కీం ని ఇక్కడ అమలు చేయకపోవడం బాధాకరమని, ఫసల్ బీమా యోజన ఉంటే నష్టం జరిగిన రైతులకు ఇన్సూరెన్స్ అందేదని, ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, తక్షణమే ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వ్యవసాయ అధికారులను వ్యవసాయ క్షేత్రం లోకి పంపించి పంట నష్టం అంచనా వేసి ఎకరాకు 50,000వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని మార్త సత్తయ్య అన్నారు, ఈ పంట నష్టం పర్యవేక్షణలో బిజెపి మండల అధ్యక్షులు మొకిలి విజేందర్, ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు, మర్రి మల్లేషం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మూడపెళ్లి ముఖేష్ , మనోహర్ రెడ్డి , బొరగాయ తిరుపతి , లింగాల రాజన్న, నిరటి శేకర్, హనుమయ్య చారి, చింతకుంట గంగాధర్, సిరికొండ తిరుపతి, మట్కామ్ మల్లేశం, పాటి సుధాకర్, కూతురు మహేందర్ రెడ్డి, అల్లం శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.