మండలంలో మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్రవ్యాప్తంగా జేసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది.
అందులో భాగంగా తాజా మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటలు చేసి ఎన్నో అరెస్టులు అయ్యామని ఇటువంటి అరెస్టులకు భయపడమని అందులో భాగంగా జేఏసీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగా ముందస్తుగా సర్పంచులను అరెస్టు చేయడం జరిగిందని ఇందులో తెలంగాణ రాష్ట్ర జేఏసీ జిల్లా సర్పంచులఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు మాట్ల మధు రాజన్న సిరిసిల్ల జేఏసీ ప్రధాని కార్యదర్శి గణప శివజ్యోతి జేఏసీ కార్యవర్గ సభ్యులు కొయ్యడరమేష్ సురభి నవీన్ రావు ను తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఇందులో భాగంగా మాజీ సర్పంచ్ అరెస్టును ఖండిస్తూ తంగళ్ళపల్లి మండల బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజంకర్ రాజన్నమాజీ జెడ్పిటిసి కోడిఅంతయ్య వారికి సంఘీభావం తెలుపుతూ ఇటువంటి అరెస్టులకు భయపడమని తెలుపుతూ వారికి సంఘీభావం తెలిపారు
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ
పాలకుర్తి నేటిధాత్రి
జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పాత సెంట్రల్ జైలుకు సంబంధించిన ఇండియ న్ ఆయిల్ పెట్రోల్ బంకులలో కొన్ని రోజులుగా పనిచేయని సీసీ కెమెరాలు?
భద్రకాళి కమాన్ ఎదురుగా, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులలో, ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు..!
CCTV camera.
ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా డమ్మీ అని సమాచారం?
నగర నడిబొడ్డున, ప్రధాన రహదారిలో, ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పెట్రోల్ పంపులలో, కనీసం ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితి.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎవరు? ఉన్నతాధికారులు తనీకిలు చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్న వాహనదారులు.
ఇదే విషయంపై వెళ్లి ఫోటోలు, వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపై అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అసహనం..
CCTV camera.
సూపరిండెంట్ పర్మిషన్ ఉంటేనే ఫోటోలు తీయాలి అంటున్న పోలీసు సిబ్బంది.
ఎక్కడ లేని వింత అనే చెప్పొచ్చు? నగర ప్రధాన రహదారిలో, ఇంత పెద్ద పెట్రోల్ బంకుల్లో ఉన్న సిసి కెమెరాల వైర్లు పరిశీలిస్తే సగం కట్ అయి ఉండటం తద్వారా అవి డమ్మీ అని వాటిని చూస్తే అర్థమవుతున్న తీరు.
ఇప్పటికైనా సదరు సూపరిండెంట్ కానీ, స్థానిక పోలీసులు అయిన చొరవ తీసుకొని సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
గురువారం నర్సంపేట మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఎల్ఆర్ఎస్ క్రింద క్రమబద్దీకరణకు చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
District Collector
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 26 ఆగస్టు 2020 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ ఈ నెల 31 తో ముగుస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్ పొందవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా ప్లాట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరకాస్తుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆడిగి తెలుసుకొగా అధికారులు బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు.
నర్సంపేట మున్సిపల్ పరిధిలో 5732 మంది దరకాస్తూ చేసుకోగా 2271 క్రమబద్దీకరణకు మంజూరు చేయగా, 293 మంది ఫీజు చెల్లించారని,186 మందికి క్రమబద్దీకరణ పత్రాలు అందజేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.
ఈ సదావకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు దారులు సకాలంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తు దారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోగానే ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సంధ్య,టిపిఓ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద మహిళలు తమ ఉపాధి కొరకు రంగురంగుల బుట్టలు అల్లి ఉపాధి పొందుతున్నారు.
నేటి ధాత్రి రిపోర్టర్ నరేష్ గౌడ్ ఆ దారిలో వెళ్తూ వారిని చూసి వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడగగా వారు మంచిర్యాల లోని రాజీవ్ నగర్ చెందిన మహిళలు స్వప్న,మహేశ్వరి, ప్రవళిక,తిరుమల,శకుంతల స్వయం ఉపాధి కొరకు రెండు సంవత్సరాల నుండి బుట్టలు అల్లుతూ ఉపాధి పొందుతున్నామని అన్నారు.
Colorful Baskets
ఈ బుట్టలు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకే విక్రయిస్తున్నామని చెప్పారు.
ఒక బుట్ట 200 నుండి 600 వరకు ఉంటాయని వినియోగదారులకు కావాల్సిన సైజులు ఆర్డర్ బట్టి తయారు చేసి ఇస్తామని చెప్పారు.వీరు ఉపాధి పొందుతూ కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.ప్లాస్టిక్ కవర్లు వాడకంతో పర్యావరణం కలుషితం అవుతుందని,ఇలాంటి బుట్టలు వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ఆటంకం లేదని,అలాగే కూరగాయల మార్కెట్ కు, స్కూల్ పిల్లల టిఫిన్ బాక్స్ లకు ఇంకా రకరకాల సైజులో అందమైన రంగురంగుల బుట్టలు కావలసిన వారికి అందిస్తామని చెప్పారు. ప్రజలు చాలామంది రంగుల బుట్టలు చూసి ఆకర్షితులై ఈ బుట్టల వలన ఉపయోగాలు తెలుసుకుని చాలామంది ప్రజలు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
2025 జనవరి న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా ఈ ఫలితాల్లో నర్సంపేట పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు పి. అభిరామ్, కే. అశ్విత మరియు వి. హిమబిందులు సీట్లు సాధించారని చైర్మన్ వేముల సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సీట్లు సాధించడం చాలా సంతోషకరమని చైర్మన్ పేర్కొన్నారు.కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దానంతట అదే వస్తుందనే దానికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు.అనంతరం కష్టపడ్డ ప్రతీవిద్యార్ధికి,ఉపాధ్యాయులకు,సహకరించిన పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య రావ్, వైస్ ప్రిన్సిపాల్ విమల,ఇంచార్జి జాగృతి, మాథ్స్ ఉపాధ్యాయులు రాజు, అశోక్, చిరంజీవిలు పాల్గొన్నారు.
రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న టీఏఎస్‌ఎంఏసీ శాఖలు, ఉద్యోగులపై ఈడీ అధికార్ల దాడులను ఆపాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో మార్చి 25న ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ‘నిష్పాక్షికత సమస్య ఉత్పన్న మవుతున్నందున’ ఈ కేసు విచారణనుంచి తాము తప్పుకుంటున్నామని, మరో బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొనడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ విషయం తమిళనాడులో దుమారం సృష్టిస్తున్న నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు విచారణనుంచి తప్పుకోవడంతో ఈ కేసు విచారణపై మరికొంతకాలంపాటు య ధాతథ స్థితి కొనసాగనుంది.
తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలోని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టీఏఎస్‌ఎంఏసీ) మరియు దాని అనుబంధ విభాగాల్లో మార్చి 6వ తేదీనుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలుకొనసాగుతున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలను ఈ సంస్థే నియంత్రిస్తుంటుంది. ఈ సంస్థలో బోగస్ లావాదేవీలు నడుస్తున్నాయని, దాదాపు వెయ్యికోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిం దంటూ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలు చాలాకాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న నేప థ్యంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. ఏఐడీఎంకే నాయకులు ఎడప్పాడి పళనిస్వామి ఏకంగా ఈ స్కామ్ మొత్తం రూ.40వేల కోట్లకు పైమాటేనని ఆరోపిస్తూ మరింత లోతుగా విచారిస్తే అసలు బాగోతం బయటపడుతుందని చెప్పడం విశేషం. చాలాకాలంలో అధికార, విపక్ష పార్టీల మ ధ్య ఈ లిక్కర్ స్కామ్‌పై పరస్పర ఆరోపణలు, విమర్శల దాడులు కొనసాగుతున్నా యి. ప్రస్తుతం ఈడీ జరుపుతున్న దాడులు ప్రధానంగా 2001`2006 మరియు 2011`2021 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టరేట్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) నమోదు చేసిన కేసుల ఆధారంగా కొనసాగుతున్నాయనేది డి.ఎం.కె. నేతల ఆరోపణ. ఈ న మోదైన కేసులు అప్పటి ఏఐడీఎంకే మరియు డీఎంకే ప్రభుత్వాల హయాంలలో నమోదైనవేనని వారంటున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల యూనిట్లలో నమదైన దాదాపు 40 కేసుల ఆధారం గా ఈ దాడులు జరుగుతున్నాయని కూడా డీఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈడీ మాత్రం తమ తనిఖీల్లో అవకతవకలపై స్పష్టమైన ఆధారాలు లభించాయని పేర్కొంది. ఈ కేసుల్లో నమోదైన కేసులు ప్రధానంగా మూడు కేటగిరీలుగా వున్నాయి. మొదటిది నిర్దేశిత రిటైల్ ధరకంటే ఎక్కువ ధరకు అమ్మడం, రెండవది సరఫరా చేసినందుకు డిస్టిలరీ నుంచి వసూళ్లు చేయడం, ఇక మూడవది టీఏఎస్‌ఎంఏసీ సిబ్బంది బదిలీలకోసం జరిపిన వసూళ్లు. ఇదిలావుండగా తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై ప్రస్తుతం ఈడీ నిఘా కొనసాగుతోంది. టీఏఎస్‌ఎంఏసీ కేంద్ర కార్యాలయం, ఈ స్కామ్‌తో సంబంధమున్న ప్రైవేటు డిస్టిల్లరీ సంస్థలపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ స్కామ్‌లో డిస్టిల్లరీలు, అధికార్లు, రాజకీయనాయకులకు ప్రమే యమున్నదని ఈడీ పేర్కొంటున్నది. మరింత లోతైన విచారణ జరిపిన తర్వాత మరిన్ని అరెస్ట్‌లు కొనసాగే అవకాశముందని సంస్థ సూచనప్రాయంగా వెల్లడిరచింది. డీఎంకే నాయకుల ప్రమేయంపై మరింత లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. డిస్టిల్లరీలు, బాటిలింగ్ యూనిట్లలో పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు చెబుతున్నారు. అక్రమ చెల్లింపులు, అకౌంట్లలో చూపని నగదు, నకిలీ కొనుగోళ్లు వంటి అనేక గోల్‌మాల్ వ్యవహారాలు నడిచాయని ఈడీ పేర్కొంది. ఈవిధంగా అన్నిరకాల అక్రమాల ద్వారా రూ.వెయ్యికోట్ల మేర ‘లెక్కల్లో చూపని నగదు’ లావాదేవీలు జరిగాయని చెబుతోంది. అయితే దీనిపై విచారణ కొనసా గుతున్నదని ఈడీ పేర్కొంది.అయితే విషయం హైకోర్టుకు చేరడంతో ఈడీ కార్యకలాపాలకు తాత్కాలిక బ్రేక్ పడిరది.
డీఎంకే మాత్రం ఇదంతా కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమేనని ఆరోపిస్తోంది. ఇటువంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాల ద్వారా డీఎంకేను దెబ్బకొట్టలేరని రాష్ట్ర న్యాయశాఖ మంత్రిఎస్. రఘుపతి పేర్కొన్నారు. పార్టీ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ, ‘ఇంకా ఈడీ దాడులు మొదలుకాకముందే బీజేపీ అధ్య క్షుడికి రూ.వెయ్యికోట్ల స్కామ్ జరిగిందని ఎట్లా తెలుసు? ఢల్లీి, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అనుసరించే లిక్కర్ పాలసీలు, తమిళనాడుకు పూర్తి భిన్నం. అటువంటప్పుడు విచారణ పూర్తికాకముందే రూ.వె య్యికోట్ల స్కామ్ జరిగిందని ఈడీ ఎట్లా చెబుతుంది’ అని ప్రశ్నించారు.
ఈడీ దాడుల నేపథ్యంలో టీఏఎస్‌ఎంఏసీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు అక్రమమని, వీటిని తక్షణం నిలిపేసేలా ఆదేశాలివ్వాలని’ కోర్టును అభ్యర్థించింది. మద్యం విధాన రూపకల్పన రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన అధికారపరిధిని దాటి ఈ దాడులకు పాల్పడుతున్నదని తన పిటిషన్‌లో పేర్కొంది. దీం తో ఈనెల 20న టీఏఎస్‌ఎంఏసీ అధికార్లపై ఏవిధమైన చర్యలు తీసుకోవద్దని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎఆర్.ఎల్. సుందరేశన్‌కు మౌఖికంగా సూచిస్తూ జస్టిస్ ఎం.ఎస్. రమేష్, జస్టిస్ ఎన్. శాంతికుమార్‌లతో కూడిన బెంచ్, దీనికి కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి మార్చి 25వరకుఅవకాశం ఇచ్చింది. అప్పటివరకు టీఏఎస్‌ఎంఏసిపై దాడులు జరపవద్దని ఈడీని ఆదేశించింది. విచిత్రంగా మార్చి 25న జరిగిన విచారణలో, ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ‘నిష్పాక్షికత సమస్య ఉత్పన్న మవుతున్నందున’ ఈ కేసు విచారణనుంచి తాము తప్పుకుంటున్నామని, మరో బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొనడం సంచలనం సృష్టించింది. దీంతో ఈడీ దాడుల విచారణపై మరికొంతకాలం సస్పెన్స్ కొనసాగనుంది.
ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న లిక్కర్ స్కామ్ వివాదం అధికార డీఎంకేను స్వీయరక్షణలో పడేసిందనేది సత్యం. బీజేపీ, ఏఐడీఎంకేలకు లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన అస్త్రంగా మారింది. నిజానికి టీఏఎస్‌ఎంఏసీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. లిక్కర్‌కు సంబంధించిన సర్వాధికారాలు ఈ సంస్థ చేతుల్లోనే వుంటాయి. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థ హోల్‌సేల్ మరియు రిటైల్ మద్యం పంపిణీ వ్యవహారాలను చూస్తుంది. ఆవిధంగా తమిళనా డులో మద్యం మొత్తం ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగుతుంటుంది. డిస్టిల్లరీలనుంచి మద్యాన్ని సేకరించి ప్రభుత్వం ఔట్‌లెట్‌ల ద్వారా పంపిణీ చేస్తుంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4700 ఔట్‌లెట్‌లుండగా, మొత్తం మద్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.45వేల కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. ఆవిధంగా లిక్కర్ రాష్ట్రప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. అయితే టీఏఎస్‌ఎంఏసీ అనుసరిస్తున్న పద్ధతిలో పారదర్శకత లోపించడంతోపాటు, విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈడీ చేసిన దాడుల్లో టీఏఎస్‌ఎంఏసీలోని అవినీతి నెట్‌వర్క్ మొత్తం బయటపడినట్టు తెలుస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు, అధికార్లు, మద్యం తయారీదార్లు కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా అమ్మకాలు, టెండర్లు, మద్యం సేకరణ విషయాలో అవినీతి విపరీతంగా వున్నట్టు స్పష్టమైంది.
ఈడీ ప్రధానంగా తెలుసుకున్నట్టుగా చెబుతున్న అంశాలీవిధంగా వున్నాయి: 1. డిస్టిల్లరీలో మ ద్యం కొనుగోళ్ల రికార్డుల ను తారుమారుచేయడం. తద్వారా ధరలను విపరీతంగా పెంచేసి షెల్ కంపెనీల ద్వారా బదిలీచేయడం. కొన్ని కంపెనీలు బోగస్ ఇన్‌వాయిస్‌ల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడటం. 2. లిక్కర్ తయారీదార్లు టీఏఎస్‌ఎంఏసీ అధికార్లకు విపరీతంగా లంచాలు ఇచ్చి మద్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. కొన్ని డిస్టిలరీ కంపెనీలకు ఇందులో ప్రధానపాత్ర వుంది. 3. సరైనపత్రాలు లేనివారికి కూడా బార్‌లైసెన్స్‌లు ఇష్టారాజ్యంగా ఇచ్చారు. కొ న్ని కంపెనీలకు అనుకూలంగా రవాణా టెండర్లు ఆమోదించడంవల్ల, ఏటా టీఏఎస్‌ఎంఏసీ ఇటువంటి కంపెనీలకు అక్రమంగా రూ.100కోట్ల వరకు చెల్లింపులు జరుపుతోంది. 3. కేవలం లెక్కల్లో చూపని నగదు లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాజకీయ పార్టీలకు పంపడం. డిస్టిల్లరీ సంస్థలు ఎగ్జిక్యూటివ్‌లకు మరియు టీఏఎస్‌ఎంఏసీ అధికార్లకు మధ్య ప్రత్యక్ష లావాదేవీలను ఈడీ దాడుల్లో గుర్తించారు. అంటే ఇక్కడ క్విడ్ ప్రొ కో నడుస్తోంది. అంతేకాదు టీఏఎస్‌ఎంఏసీ స్టోర్లలో నిర్దేశిత ధరలకంటే 30 నుంచి 40శాతం అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నట్టు కూడా గుర్తించింది.
కాంగ్రెస్ పార్టీలోనేనే సీనియర్. నాకంటే సీనియర్ ఎవరూ లేరు. పార్టీలో నేనెంత చెబితే అంత. అదిష్టానానికి నేనంటే ప్రేమ. అని చెప్పుకోకపోతే రాజకీయాలు చేయలేరు. అలా ఇంత కాలం రాజకీయం చేసుకుంటూ వచ్చిన సీనియర్లకు ఇప్పుడు మింగుడు పడడం లేదు. వారి రాజకీయం చెల్లడం లేదు. వారికి తెలిసి ఏ పని జరగడం లేదు. అధిష్టానం వారి అభిప్రాయాలు తీసుకోవడం లేదు. వారిని సంప్రదించడం లేదు. గతంలో సీనియర్లు ఎప్పుడూ డిల్లీలో వుండేవారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వుండేవారు. కాని వారి వల్ల పార్టీకి ఒక్కశాతం కూడా లాభం వుండేది కాదు. అయినా వారికి పదవులు వస్తూ వుండేవి. ప్రాదాన్యత దక్కుతూ వుండేది. కాని ఇప్పుడు సీనియర్ల ఆటలు సాగడం లేదు. అంతో ఇంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కాలంలో కూడా కొంత మంది పదవులు పొందేవారు. అధిష్టానం వద్ద సానుభూతిని పొందుతూ వుండేవారు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత సీనియర్ల మాటలు నమ్మడానికి పార్టీ ఇష్టపడడం లేదు. వారి సూచనలు సలహాలు తీసుకోవడానికి సిద్దపడడం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్లను అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు. సరిగ్గా గత ఐదు సంవత్సరాలుగా సీనియర్లమని చెప్పుకుంటున్నవారికి అధిష్టానం సమయం కూడా ఇవ్వడం లేదు. డిల్లీకి వెళ్లిపడిగాపులు కాసినా వారి ముఖం కూడా చూడడం లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆ మాత్రం ఎంట్రీకూడా లేకుండా పోయింది. లేకుంటే ఇప్పటికే ఇల్లు పీకి పందిరేసేవారు. అయినా కొంత మంది సీనియర్లు అవకాశం దొరికితే చాలు ఏదో ఒకటి చెప్పాలని చూస్తున్నారు. కాని వారికి ఆ అవకాశం పార్టీ ఇవ్వడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే లాబీయింగ్ చేయని నాయకుడు లేడు. సీనియర్లంతా మాకంటే, మాకే అవకాశమివ్వాలంటూ డిల్లీపెద్దలను కోరుతూ వచ్చారు. కాని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ఎంపిక చేసింది. అప్పటి దాకా మూడు రోజులపాటు సీనియర్ల హైడ్రామా నడిపారు. దాంతో వారిని పూర్తిగా ఇప్పుడే పక్కన పెట్టడం వల్ల ఆదిలోనే అపశృతులు వద్దనుకొని అధిష్టానం కొంత మందికి అవకాశమిచ్చింది. నిజానికి ఇప్పుడున్న మంత్రి వర్గంలో కూడా సీనియర్లు మరి కొంత మంది వున్నారు. కాని వాళ్లు ఎప్పుడూ డిల్లీ చెవుల్లో ఏదో చెప్పేందుకు వెళ్లేవారు కాదు. డిల్లీ పెద్దలు రమ్మంటే తప్ప వారి వద్దకు వెళ్లరు. అలాంటి వారితో వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాని ఓ ముగ్గురు నలుగురు సీనియర్ల మూలంగానే పార్టీకి ఇంకా తిప్పలుతప్పడం లేదు. సీనియర్లమని చెప్పుకోవడం , పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదని చెప్పడం తప్ప పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పడానికి వారికి ఒక్క సాక్ష్యం లేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాటి నుంచి ఆయన చేసినంత పోరాటం ఎవరూ చేయలేదు. పైగా రేవంత్‌రెడ్డి పోరాటం చేస్తుంటే అడుగడుగునా అడ్డు పుల్లలు పెట్టారు. మాకంటే ముందు వెళ్తున్నాడని ఆయనకు బ్రేకులువేసే ప్రయత్నాలు చేశారు. రేవంత్‌రెడ్డి పిసిసి అయిన నాటి నుంచి ఆయనను ఏదో రకంగా ఇరుకన పెట్టాలని చూశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సినన్ని మాటలు మాట్లాడారు. పిపిసి. కొనుక్కున్నారంటూ కూడా విమర్శలు చేసిన సందర్భం వుంది. ఓ సందర్భంలో నేనంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే నేను అని పార్టీకి పేరు తెచ్చేలా రేవంత్‌రెడ్డి గొప్పగా చెబితే కూడా దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. వివాదం చేసి, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాడంటూ విమర్శలు చేశారు. అసలు ఆ మాట చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. ఏకంగా పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వున్న సమయంలో మా ఉమ్మడి జిల్లాకు రావాల్సిన అవసరం లేదు అని కూడా కొందరు నాయకులు ప్రకటించిన సందర్భం వుంది. ఇక రేవంత్‌రెడ్డి పిసిసి ప్రెసిడెంటు అయిన తర్వాత ఆయన కింద మేం పనిచేయాలా అంటూ ప్రశ్నించిన వారున్నారు. పార్టీ అదికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంతగా నోరు పారేసుకోవాలో అంత పారేసుకున్నారు. అసలు రేవంత్ రెడ్డి పెత్తనమేమిటంటూ ప్రశ్నిస్తూ వుండేవారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడంటూ కూడా ఎద్దేవా చేస్తూ వుండేవారు. కాని ఆయన బిఆర్‌ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగానే బిజేపిలో చేరి మెదక్ నుంచి ఎంపిగా పోటీచేశారు. ఓడిపోయి, మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాని ఆయన పార్టీన సంగతి మర్చిపోయి, రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకునేవారు. అయినా అవన్నీ ఏనాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లెక్కపెట్టుకునేవారు కాదు. ఆయన లక్ష్యం వేరు. ఆయన ఆలోచనలు వేరు. ఇతర నాయకులు ఎంత మంది ఏది మాట్లాడినా ఎక్కడా పార్టీకి చెందిన నాయకుల మీద ఎలాంటి ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. అంతా మన మంచికే అన్నట్లు ఇన్నింటినీ చిరునవ్వుతో స్వాగతించేవారు. అలా పార్టీ కోసం పనిచేస్తూ, మరోవైపు అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి మాత్రమే. కాంగ్రెస్‌లో ఇంత పెద్ద నాయకులున్నారు. కాని ఏనాడైనా, ఏ ఒక్క నాడైనా బిఆర్‌ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసింది లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటి రెడ్డి వెంకటరెడ్డిగాని ఈ పదేళ్ల కాలంలో ఏనాడు జైలుకు వెళ్లలేదు. కనీసం అరెస్టు కాలేదు. ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. ఏ వర్గానికి కొమ్ము కాయలేదు. పోరాటాలకు శ్రీకారం చుట్టలేదు. కాని రేవంత్‌రెడ్డి ప్రతి నిత్యం పోరాటంచేశారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అలా ఆయన చేపట్టిన ఉద్యమాలకు హజరు కావడానికికూడా ఇష్టపడేవారు కాదు. ఓ సందర్భంలో కేసిఆర్ హాయాంలో వరి వేస్తే ఉరి అంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దానికి నిరసనగా కేసిఆర్ పొలంలో వరి ఎందుకు వేశారంటూ రేవంత్ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో నా జిల్లాలో నాకు తెలియకుండా కేసిఆర్ మీద పోరాటం చేయడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అని జగ్గారెడ్డి ప్రశ్నించిన సందర్భం వుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో రేవంత్‌రెడ్డికి ఎదరుపడిన మీడియా అభ్యర్ధి ఎంపిక గురించి ఓ ప్రశ్న అడిగే సమిష్టి నిర్ణయం వుంటుందని చెప్పారు. ఆ మాట చెప్పడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అంటూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియా ముందు రేవంత్‌రెడ్డి పరవు తీసినంతపనిచేశారు. కాని ఇప్పుడు అందరూ సుద్దులు చెబుతున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద కూడా కావాలని కొంత మంది కుట్ర చేస్తున్నారు. ఆయనపై రకరకాల వివాదాలు సృష్టిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు చేసేందుకు కొంత మంది పని గట్టుకొని మాట్లాడుతున్నారు. కాని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లేకపోతే ఖమ్మం జిల్లాలో పార్టీలోనే కాదు, తెలంగాణలో 27 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుపు కష్టమయ్యేది. ఉమ్మడి ఖమ్మంతోపాటు, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ వరకు సుమారు 27 నియోజకవర్గాలను తన కనుసన్నల్లో గెలిపించిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది. ఆ సంగతి సీనియర్లు మర్చిపోతున్నారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ శపధం చేసిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఖమ్మం మొత్తం సీట్లను గెలిపించుకున్నారు. పొరపాటున బిఆర్‌ఎస్‌నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చేశారు. అలా సీనియర్ నాయకులమని చెప్పుకుంటున్న వాళ్లెవరైనా చేశారు. ఒక్క నాయకుడినైనా బిఆర్‌ఎస్ నుంచి తెచ్చారా? బిఆర్‌ఎస్ అదికారంలో వున్నంత కాలం ఆ పార్టీకి కోవర్టులు అని ముద్ర వేయించుకున్న వాళ్లే కొందరు సినీయర్లు. వారికి చెందిన వారసులు కూడా ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. అంటే వారికి పార్టీ మీద ఎంత చిత్తశుద్ది వుందో అర్దంచేసుకోవచ్చు. వారి నాయకత్వ పటిమ ఎంత బలంగా వుందో ఈ ఒక్క విషయంతో తెలుసుకోవచ్చు. మంత్రి వర్గ విస్తరణలో కూడా మాకంటే మాకే కావాలంటూ ఆ సీనియర్ నాయకులు కోరడం విడ్డూరం. అసలు కాంగ్రెస్‌పార్టీ పని అయిపోయిందని, బిజేపిలో చేరి అక్కడ ప్రాదాన్యత దక్కక తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి కూడా నేనే మంత్రిని అంటున్నారు. నాకు ఎన్నికల ముందు హమీఇచ్చారనిచెబుతున్నారు. ఇలాంటి వారికి కోసం బిసి. మహిళామంత్రికొండా సురేఖను పక్కన పెట్టేందుకుకూడా కుట్ర చేస్తున్నారన్న వార్తలువస్తున్నాయి. కాని అధిష్టానం అన్నీ గమనిస్తూనే వుంటుంది.పైగా దేశంలో అదికారంలోవున్న మూడు రాష్ట్రాలలో తెలంగాణ అత్యంత కీలకమైంది. అందవల్ల తెలంగాణలో ఏ నాయకుడు ఏమిటో అదిష్టానానికి అంతా తెలుసు. రేవంత్ రెడ్డి పార్టీని ఎంతకష్టపడి గెలిపించారో తెలుసు. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంత శ్రమించారో పార్టీ పెద్దలందరికీ తెలుసు. ఎందుకంటే అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది. ఏమీ లేని విస్తరులే ఎగిరెగిరి పడుతుంటాయన్న సామెతను మర్చిపోతున్నారు.
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ఎంపీ నిధులతో ఏర్పడిచేసిన సీసీ రోడ్డు పనులు స్థానిక గ్రామ బిజెపి నాయకులు బుధవారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటిసారి గ్రామంలో ఎంపీ నిధుల సహకారంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ సుధాకర్ శ్రీనివాస్ దివ్య సాగర్ శంకరి ముఖేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏస్ పి రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఇల్లందు డి ఏస్ పి చంద్రభాను సూచన మేరకు బుధవారం గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని శంబుని గూడెం గ్రామంను గుండాల సిఐ లోడిగ రవీందర్, కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ సందర్శించి వారికి వాలీబాల్ కిట్టు ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ ఆదివాసి యువత నక్సలిజానికి, అసాంఘిక శక్తులకి దూరంగా ఉండాలని, అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు. యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉంటూ విద్య వైపు తమ దృష్టిని మళ్ళించాలని, అప్పుడే ఆదివాసి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపపారు. అదేవిధంగా క్రీడలను తమ దైనందిక కార్యక్రమాలలో భాగంగా చేసుకోవాలని, దాని ద్వారా శారీరకకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన, అనుమానస్పద వ్యక్తులు వచ్చిన పోలీస్ వారికి వెంటనే తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అన్ని డాక్యూమెంట్స్ కలిగి ఉండాలని, మద్యం త్రాగి వాహనాలు నడపారాదని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని, అపరిచితులకు తమ యొక్క బ్యాంకు వివరాలు, ఓటీపీ నెంబర్ లు తెలుపవద్దని చెప్పారు. శంబుని గూడెం గ్రామస్తులు తమకు వాలీబాల్ కిట్టు ఇవ్వడం ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
జిల్లా అధికార ప్రతినిధి మిడతపల్లి యాకయ్య మాదిగ డిమాండ్
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడమండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చింత అనిల్ మాదిగ ఆధ్వర్యంలో
ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మిడతపెల్లి యాకయ్యమాదిగ మాట్లాడుతూ భారతదేశం
ఒక లౌకిక దేశం భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండి క్రైస్తవ సంఘాలు సంస్థలు మరియు సమాజం లో కుల మత పేద ధనిక మేధావి నిరాక్షరాశులనే భేదం లేకుండా అందరి మధ్య నిస్వార్ధంగా వైద్య విద్య మరియు సామాజిక రంగాలలో ప్రభుత్వంతో సమానంగా అఖండ సేవలందిస్తున్నాయి
ఈనాటికి బాధ్యత మైన క్రైస్తవ సమాజం నిస్వార్థ సేవలు అందిస్తూనే ఉంది స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా క్రైస్తవ సమాజంపై హత్యలు అత్యాచారాలు మాత్రం మారలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన
రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 (1) అధికరణాలను అనుసరించి దేశంలోని పౌరులందరికీ తమకిష్టమైన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛను కల్పించింది కానీ కొంతమంది రాజకీయ స్వార్ధపరులు
రాజ్యాంగ చట్టాలను ఉల్లగించి తమ స్వార్థం కోసం మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ శాంతియుతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని అశాంతి యుతంగా మారుస్తున్నారు మొన్న మణిపూర్ ఘటన లో కూడా ఆడ మగ పిల్ల పాపలు అనే తేడా లేకుండా చిత్రహింసలకు గురి చేశారు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ను హత్య చేసి కొట్టి పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించి కేసును తప్పుదోవ పట్టించేవిధముగావ్యవహరిస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ డెడ్ బాడీని పోస్టుమార్టం చేసి రిపోర్టులు న్యాయబద్ధంగా ఈయకపోతే క్రైస్తవ సమాజం శాంతియుతం మానుకొని శాంతి భద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక దోషులు ఎవరైతే ఉన్నారో వారికి చట్టపరమైన శిక్ష పడే విధంగా ఆంధ్ర రాష్ట్ర డిజిపి హోం శాఖ మంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గార్లు మానవిక కోణంలో విచారణ జరిపి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ప్రేమ్ సాగర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి బాల్య శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి తాళ్ళపెల్లి ప్రభాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మిడతపల్లి విక్రమ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కోశాధికారి గుడెల్లి రవి, ఎర్ర రామచంద్రు, మచ్చ రాజు తదితరులు పాల్గొన్నారు
భూపాలపల్లి పట్టణ ప్రజలకు శుభవార్త ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు బకాయి పడినటువంటి ఆస్తి పన్ను పై 90% వడ్డీని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వన్ టైం సెటిల్మెంట్ (ఓ.టి.ఎస్) పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు గల ఆస్తి పన్ను బకాయిలపై గల వడ్డీనీ 90% వరకు మినహాయింపు ఇవ్వడం జరిగినది కేవలము ఆస్తి పన్ను వడ్డీలో కేవలం 10% వడ్డీని ఒకేసారి చెల్లించి వారి యొక్క బకాయిలను పూర్తి చేసుకోవచ్చు, కావున భూపాలపల్లి పట్టణ ప్రజలు ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని మునిసిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ పట్టణ ప్రజలను కోరినారు ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన యజమానులకు వారికి వారి యొక్క వడ్డీ రాయితీ భవిష్యత్తు చెల్లింపులతో సర్దుబాటు చేస్తారు కావున పట్టణ సద్వినియోగం చేసుకోవాలి
బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో బీసీ..చలో ఢిల్లీ
-బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే
-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేస్తున్న పోరాటం గల్లీలో ముగిసింది..
ఇక ఢిల్లీలో చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ 2న చేపట్టిన హలో బీసీ..
చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం గల్లీలో పోరాటం ముగిసిందని, ఇక ఢిల్లీలో పోరాటం చేయబోతున్నామన్నారు.
చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దేశంలోని 29 రాష్ట్రాల నుండి ఢిల్లీని బీసీల దండు ముట్టడించబోతుందన్నారు.
ఏప్రిల్ 2వ తేదిలోగా కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ పెడతామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తే కేంద్రంలోనే అగ్గి రాజేస్తామని హెచ్చరించారు.
బీసీ నినాదాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరన్నారు.
బీసీలను అణగదొక్కాలని చూస్తే వదిలిపెట్టబోమన్నారు.
బీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు కూడా కారాదని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీసీలకు అన్యాయం చేస్తే వెంటాడుతాం..మేలు చేస్తే గుండెల్లో దాచుకుంటామన్నారు.
మా పోరాటంతోనే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు.
హలో బీసీ..చలో ఢిల్లీ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహిళలు, విద్యార్థులు, యువకులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిపోతున్నామని ఆయన తెలిపారు.
ప్రజా వాణిలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి .
చిట్యాల, నేటిధాత్రి :
బుధవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు దూడపాక సాంబయ్య అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు కనకం తిరుపతి లు* మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పలు సమస్యలు గ్రామాల్లో ఉన్నాయన్నాయని వాటి పరిష్కారానికి మండలలో నిర్వహించే ప్రజా వాణి లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పిన ప్రకారం గత సోమవారం 17న దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను ఇంతవరకు వాటిని పరిష్కరించకపోవడం బాధాకరమని అన్నారు. గత సోమవారం రోజున చిట్యాల లో నిర్వహించిన ప్రజా వాణి కి 4 దరఖాస్తులు* వచ్చాయని వాటితో పాటు ఈ సోమవారం ప్రజా వాణి కి కూడ కొన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పారు .గత ప్రజా వాణి లో చిట్యాల మండల కేంద్రంలోని దళితులకు ఇండ్ల స్థలాల పట్టాలు* ఇచ్చిన 5 ఎకరాల భూమికి హద్దులు* సరి చేయాలని ఇచ్చిన దరఖాస్తు తో పాటు మిగిలిన దరఖాస్తులను వెంటనే *జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గత సోమవారం రోజున దరఖాస్తులతో పాటు ఈ సోమవారం రోజున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
మీనాక్షి నటరాజన్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
ఢిల్లీలోని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విస్లావత్ దేవన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
*చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.- కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 26:
వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా, ఎండ నుండి ఉపశమనం కలిగేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు.
వేసవి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వివరించారు.
నగరంలో ప్రజలకు ఇబ్బందులు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
ముందస్తుగా నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, వేసవిలో వచ్చే సీజనల్ వ్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బందికి ఎండల వలన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
పలు చోట్ల నీరు వృధాగా పోతున్నదని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని అన్నారు.
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ప్రైవేట్ నీటి ట్యాంకర్ల యాజమానుల సమావేశం ఏర్పాటు చేసి ఒకే ధరకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.
కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని వారు ఎండల బారిన పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్ళు, గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య సిబ్బంది పనివేళల్లో మార్పులు చేశామని, మస్టర్ పౌయింట్ల వద్ద త్రాగునీరు, ors పాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
ఎండ వేడిమి నుండి తట్టుకునేలా తగు చర్యలు చేయాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు.
ఎక్కడా మురుగునీరు నిలకుండా, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, మేనేజర్ హాసీమ్, డి.ఈ.లు, తదితరులు పాల్గొన్నారు..
గణపురం మండల కేంద్రంలో రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ సమావేశం మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ కార్యక్రమం కన్వినర్ బనగాని రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించుటకు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దీని ద్వారా ఓకే సారి ఎన్నికలు జరిగితే ఆదేశం ఆర్థికంగా అభివృద్ధి పరంగా ప్రజాధనం వృధా జరగదని పరిపాలన సైతం వేగంగా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు సైతం ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు సైతం ఇలాంటి డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకుంటారని దీనివల్ల సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటారని మనమందరం ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాగతించి జిల్లా మండల స్థాయిలో బూతు స్థాయిలో విస్తృత ప్రచారం చేసి పార్టీలకు అతీతంగా యువకులను మేధావులను బాగాసామ్యం చేసుకొని వారి సహకారంతో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు ఇది ఒక మంచి కార్యక్రమం అని ప్రజలందరికీ వివరించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాన్నె మొగిలి దుప్పటి భద్రయ్య బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిప్ నాయకులుసోమా దామోదర్, మంద మహేష్ పున్నం చందర్, మిట్ట కుమార్,రాజశేఖర్, నరేందర్, సాయి పటేల్, ప్రవీణ్,హరిలాల్, రాజన్న, మల్లన్న, సంపత్, రామదాసు, రాకేష్ రెడ్డి,నరేష్, సమ్మయ్య,సంతోష్, తదితరులు పాల్గొన్నా రు అనంతరం వివిధ గ్రామాల నుండి యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది వీరిని జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిదర్ రెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జాయిన్ అయినా వారు రజనీకాంత్ నవీన్ వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నారు
పట్టణంలోని పశువుల ఆసుపత్రిలో బుధవారం రోజున వికాస తరంగణి వారి ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
వికాస తరంగణి ఉపాధ్యక్షులు రిటైర్డ్ పశుసంవర్తన శాఖ జాయింట్ డైరెక్టర్ చాడసుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ వికాస తరంగిణి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారంతో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు అందిస్తామని,ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.
Farmers
ఈ కార్యక్రమంలో డాక్టర్ కే.విజయ భాస్కర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి హనుమకొండ జిల్లా, డాక్టర్ పి శ్రీనివాస్ సహాయ సంచాలకులు,సిహెచ్ వెంకటేష్ కమిషనర్,డాక్టర్ బి. వినయ్,డాక్టర్ శ్రీరామ్ పశువైద్యాధికారులు,పెద్ది ఆంజనేయులు ఎంపీడీవో, రవీందర్ నాథ్,కల్పన, రాంబాయిలాల్ సింగ్, రమేష్,కుమార్ పశు వైద్య సిబ్బంది,కుమారస్వామి, కిషోర్,కోటి,రవి పశువుల మందుల షాపుల యజమాన్యం సభ్యులు, వికాస తరంగిణి సభ్యులు దయాకర్ రెడ్డి,రామచంద్ర రెడ్డి, పాల్గొన్నారు.
సీ పి ఏం అధ్యర్యములో 18 వ వార్డుల్లో ప్రజల సమస్యలపై సర్వే
వనపర్తి నేటిదాత్రి :
సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్డులో ఇంటింటి సర్వే నిర్వహించార.
సర్వేలో ప్రధానంగా వాటర్ పైప్ లైన్ వేసి కంకర వేయినందున ఒక మహిళకు కిందపడి కాలు కు గాయాలు వార్డులో చేసిన పైప్ లైన్లు మొత్తం తేలుకొని ఉన్నాయి.
వాటిని వెంటనే మూయాలి.
వాటిని పైన సిమెంటు కంకర వేసి రోడ్డు సైజులో వచ్చేయాలని సీపీ ఏం నాయకులు డిమాండ్ చేశారు వార్డులో విద్యుత్తు లో వోల్టేజి సమస్య ఉన్నది.
వెంటనే లో వోల్టేజీ సమస్యను పరిష్కారం చేయాలి.
హనుమంతు ఇంటి పక్కల ఉన్న విద్యుత్ పోల్ ఇంటి స్థలంలో ఉన్నది.
రోడ్డుపైకి వేయాలి.
విద్యుత్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది.
భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేయాలి .
అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. చాలామందికి పెన్షన్స్ లేవు.
పింఛన్లు ఇవ్వాలి.
కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి.
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం .
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని అనడం తప్ప ఒక్క రూపాయి మంజూరు చేయడం లేదు.
వెంటనే ప్రతి ఇంటి నిర్మాణానికి 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం, 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
దళిత వాడకుస్మశాన వాటిక లేదు .
వెంటనే దళిత వాడకు స్మశాన స్థలం కేటాయించాలి.
ఈ కార్యక్రమంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం వనపర్తి పట్టణ కార్యదర్శి ఏం పరమేశ్వర చారి, 18 వ వార్డు శాఖ కార్యదర్శి గంధం మదన్, సిపిఎం 18 వ వార్డు నాయకులు డి. బాలరాజు ,ఎం. మన్యం, రత్నయ్య, బాల పీరు, రవి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
# 20 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న బద్ధి పోచమ్మ తల్లి..
# జాతరలో అలరించునున్న ప్రభ బండ్లు.
#పకడ్బద్ధంగా పోలీసుల భారీ భద్రత ఏర్పాటు.
#గ్రామంలో రెండు రోజుల ముందే పండుగ వాతావరణం.
#ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతరకు హాజరు కానున్న భక్తులు.
నల్లబెల్లి,నేటిధాత్రి:
కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన శ్రీ బద్ది పోచమ్మ జాతర ఈనెల 28 న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బోల్లోనిపల్లి (పోచంపల్లి)లో అంగరంగ వైభవంగా జాతరను జరగనున్నది.జాతరను దిగ్విజయం చేయడం కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్ళు, విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా ఆలయం చుట్టూ అలంకరించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం ఆనవాయితీ వస్తున్నది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.
బద్ది పోచమ్మతల్లి ఎక్కడి నుండి వచ్చి వెలసింది..!
బద్ది పోచమ్మ తల్లి మొదటగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దుద్యాల గ్రామంలో గల కూన వంశస్థులు ఆరాధ్య దైవంగా పూజలు చేసేవారు తదనంతరం కూన అమ్మక్క బోల్లోనిపల్లి గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్టాపన చేసి నేటికీ 20 దశాబ్దాలు కావస్తుంది.నాటి నుండి నేటి వరకు గ్రామస్తులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్వాహకులు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
Baddi Pochamma Temple
ఆకర్షించనున్న ప్రభ బండ్లు…
జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు ఆకర్షిస్తాయి.భక్తులు తమ కోరిన కోర్కెలు తల్లి తీర్చడం వల్ల భక్తులు మొక్కుబడిగా ప్రభ బండ్లు కట్టి తమ మొక్కును చెల్లించుకుంటారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడంతో తల్లి బద్దిపోచమ్మ పేరుతో వచ్చే అక్షరాలతో నామకరణం చేసి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలకు అందించే విధంగా ఆలయ ప్రాంగణంలో నామకరణం చేసి మొక్కును చెల్లిస్తారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత.
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాజకీయ ప్రభ బండ్ల అత్యుత్సాహంతో ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం పునరావృతం కాకుండా బద్ది పోచమ్మ జాతరలో పకడ్పద్దంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. జాతరలో ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా,రాజకీయ వాతావరణానికి తావు లేకుండా చుట్టుపక్కల గ్రామాల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి గొడవలకు తావులేకుండా జాతరను సజావుగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరగా అన్ని పార్టీ నాయకులు సానుకూలంగా స్పందించారని ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.
వైభో పేతంగా బోనాలు..
Baddi Pochamma Temple
ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఉగాది పండుగకు ముందు వచ్చే శుక్రవారం బద్ది పోచమ్మతల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో ఈనెల 28 న శుక్రవారం జరిగే బద్ది పోచమ్మ జాతరకు బొల్లోనిపల్లి గ్రామంతో పాటు నల్లబెల్లి మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.ఈ క్రమంలో ప్రతి ఇంటి నుండి బోనాలతో పాటు యాటా పోతులతో బయలుదేరగా శివసత్తులు పూనకాలతో ఊగిపోతూ తల్లిని స్మరించుకుంటారు. ఊరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా జాతర సమయంలో సొంత ఊరికి చేరుకొని పిల్ల పాపలతో , బంధువులతో కలిసి పండుగను సంబరంగా జరుపుకుంటారు.
జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం.
ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు , తాగునీటి,ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడికి అనుగుణంగా భారీ కేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి తెలిపారు. గురువారం నుండి శుక్రవారం సాయంత్రం వరకు జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం కోసం పోలీస్ శాఖను కోరడం జరిగిందని అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.