సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా
పాలకుర్తి నేటిధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని స్థానిక తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 16 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, కొత్త పెన్షన్లు, ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం వల్ల ఒకే కుటుంబంలో ముగ్గురు కాపురాలు చేసే పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక సమస్యలైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ, వేసవికాలంలో త్రాగునీటి ఇబ్బంది ఏర్పడిందని రైతుల వరి పొలాలు ఎండిపోయాయని ఎండిన పంట పొలాలకు ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలన్నారు. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరు అందించాలని, లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, బెల్లి సంపత్, మూస్కు ఇంద్రారెడ్డి, నాయకులు నక్క రమేష్, వేల్పుల కొమురయ్య, సోమ నరసయ్య, ఒగ్గుల కొమురయ్య, ఎల్లయ్య, చెరి పెళ్లి కొమురయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
*తిరుపతిలో ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:
గురువారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో రుయా హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు విచ్చేసి.మెగా అభిమానులతో కలిసి పేదలకు భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తండ్రికి, బాబాయికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అని కొనియాడారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, పగడాల మురళి, కిషోర్, సాయి, సుమన్ బాబు, రాజమోహన్, హేమకుమార్, రాజేష్ ఆచారి, సాయిదేవ్, రమేష్, సుధా, హేమంత్, వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రావణ్, ముఖేష్, మరియు మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*టీటీడీ పరిపాలన భవనం ముందు స్విమ్స్ కార్మికుల భారీ ధర్నాలో కందారపు మురళి డిమాండ్..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:
స్విమ్స్ కార్మికుల కు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కారం చేయాలని బుధవారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రి నుండి కార్మికులు ప్రదర్శనగా టీటీడీ పరిపాలన భవనం వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.
ధర్నా అనంతరం టీటీడీ జేఈవో వీర బ్రహ్మం కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ధర్నా ను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు పనిచేస్తున్న కార్మికుల కు వేతనాలు పెంచటం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా, కార్మికుల జీవితాలు వారి తలరాతలు మాత్రం మారడం లేదని అన్నారు.
గతంలో స్విమ్స్ ఏర్పడినప్పుడు ఉద్యోగాల్లో వార్డు బాయులుగా చేరిన వీరిని శానిటేషన్ కార్మికులుగా పేరు మార్చడం వల్ల వీరికి శాపంగా మారిందని అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారని అన్నారు.
పని భారం నుండి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని కార్మికులతో అన్ని పనులు చేయించడo, ఊడవటం మొదలు ఆపరేషన్ థియేటర్ ల్లో అన్ని పనులు వరకు వీరి దగ్గరే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని నిర్దిష్టమైన పనిని కేటాయించడం లేదని వీరికి నిర్దిష్టమైన పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు.
గతంలో మూడుసార్లు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించినాస్వయంగా డైరెక్టర్ చర్చల్లో పాల్గొని సమస్యలపై హామీ ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, టీటీడీ స్విమ్స్ సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం,సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ స్విమ్స్ గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు టీటీడీలోకి విలీనం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, వేతనాలు పెరుగుతాయని కార్మికులందరూ ఆశపడ్డారని దానికి భిన్నంగా ప్రభుత్వం నుండి టీటీడీలోకి విలీనం చేసిన తరువాత పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా వీరి పరిస్థితి అయిందని అన్నారు.
టీటీడీ స్విమ్స్ పై స్విమ్స్ టీటీడీ పై ఒకరి ఒకరు దాట వేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని పరిష్కారం చేయడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, టీటీడీ ఈవో కు లేఖలు పంపినా పరిష్కారం కాలేదని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, ఎప్పటికైనా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.
సానుకూలంగా స్పందించిన జేఈవో వెంటనే ఈ సమస్యల పట్ల చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిమ్స్ కార్మికుల యూనియన్ కార్యదర్శి రవి అధ్యక్షులు సూరి కోశాధికారి మారి ముత్తు నాయకులు గోపి వేలు వెంకటేష్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని రంజాన్ పర్వదినసందర్భంగా కారల్ మార్క్స్ కాలనీలో 25వ వార్డులో ముస్లిం సోదరులకు సిపిఐ 25వ వార్డ్ ఇంచార్జ్ క్యాతరాజు సతీష్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా (పండుగ సామాను) అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల అత్యంత ప్రసిద్ధమైన పండుగ రంజాన్ అని ఈ రంజాన్ సందర్భంగా నెల అంతా ఉపవాసాలు ఉండి పవిత్రంగా దేవుని ఆరాధించే గొప్పనైన పండుగని కొనియాడారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్ రోజున హిందువులందరిని పిలిచి పండుగ చేసుకుంటారని హిందువులు ముస్లింలు ఐక్యమత్యంగా కలిసి ఉండడానికి ఈ పండుగ ఒక ప్రతిక అని అన్నారు కార్మాస్ కాలనీలో 25 వ వార్డ్ లో దాదాపు 20 కుటుంబాలకు 450 విలువైన సామాగ్రిని అందివ్వడం జరిగిందన్నారు కాలనీలో ఉండే ముస్లింలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ 25వ వార్డు సహాయ కార్యదర్శి యాకుబ్ పాషా, సాబీర్ భాష, కసరబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
*తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి పరిష్కారం చూపండి..
*కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి బేటీ..
*త్వరలోనే తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం..
*కేంద్ర మంత్రి గడ్కరీ హామీ..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:
తిరుపతి పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారులకు సంబందించిన సమస్యలు, ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖా మాత్యులు నితిన్ గడ్కరీతో బేటీ అయ్యారు.
ఈ సందర్బంగా నాయుడుపేట, తూర్పు కనుపూరు జాతీయ రహదారి -71లో ప్యాకేజ్ 4, వరగలి క్రాస్, తూర్పు కనుపూరు జాతీయ రహదారి-516 డబ్ల్యూ ప్యాకేజ్ 2లో సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు మంజూరు చేసి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు.
ఈ రహదారుల్లో రూపొందించిన అండర్ పాస్ ల డిజైన్ కారణంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతుల పొలాలలో రహదారులు నిర్మిస్తున్నందున వారికి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు.
రైతులు ప్రదానంగా రహదారికి ఒక వైపు నుంచి మరో వైపుకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలిచేందుకు, వ్యవసాయ సామగ్రిని తీసుకెళ్లేందుకు అనువుగా సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు అవసరం అని ఆయనకి వివరించారు.
ఆయా ప్రాంతాలలో రైతులు చేపట్టిన ఆంధోళన కార్యక్రమాల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
సర్వీసు రోడ్లు, అండర్ పాస్ లు కావాలని రైతులు అందించిన వినతి పత్రాలతోపాటుగా సమగ్రమైన వివరాలను ఆయనకు అందజేశారు.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ ఈ రహదారులకు సంబందించి మరోసారి పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అదికారులను ఆదేశించారు.
తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా డిజైన్ లలో స్వల్ప మార్పుల కారణంగా ఆలస్యమైనదని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారని ఎంపీ తెలియజేశారు.
రేణిగుంట, నాయుడుపేట మధ్య జాతీయ రహదారిపై నుండి సర్వీసు రోడ్లకు ప్రవేశం లేదని, ప్రస్తుత డిజైన్ స్థానిక ప్రజలకు అసౌకర్యంగా ఉందని ఆయనకి వివరించారు.
అలాగే ఈ రహదారిపై శ్రీకాళహస్తి నుండి ముచ్చువోలు, వెంకటగిరిల రోడ్డును కలిపేందుకు యాక్సెస్ రోడ్డు, చావలి నుండి గుర్రపుతోట జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ, చిల్లకూరు నుండి గుర్రపుతోట వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని అభ్యర్దించారు..
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు జె వెంకటేష్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువులో గుడిసెలు నిర్మించుకున్న పేదలందరికి ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు, కరెంటు సౌకర్యం, మంచి నీటి సౌకర్యం, రోడ్ల సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి.
జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలని జోహార్ నగర్ రాజీవ్ నగర్ బాంబులగడ్డ, సి.ఆర్.నగర్, శాంతినగర్, రాంనగర్, ఫక్మీర్ గడ్డ వాసులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు పలిమెల మండలంలోని మండల కేంద్రంతో పాటు కాటారం మండలంలోని గ్రామాలు, ముత్తారం మండలంలోని గ్రామాలు, మండల కేంద్రాలతో పాటు వివాసం ఉంటున్న ఇండ్లకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలి.
ముత్తారం మండలంలోని కనుకునూరు పలిమెల మండలంలోని క్రిషంపాటు పండిన రెవెన్యూ భూములలో గుడిసెలు వేసుకున్న వారికి ఇందిరమ్మ ఇండ్లను కెటాయించాలి దుబ్బపల్లి, గడ్డిగానిపల్లి, కాపురం గ్రామాలను తరలించి ఆర్ & ఆర్ ప్యాకేజి క్రింది ఇండ్లు నిర్మించి సింగరేణి, జెన్ కో ఆధారిత పరిశ్రముల అయిన బొగ్గు శుద్ధి కర్మగారం, ఎరువుల కర్మగారం, సిమెంట్, కర్మగారాన్ని నెలకొల్పి జిల్లాలో ఉండే యువతకు ఉద్యోగ అవకాశాల కల్పించాలి.
భూపాలపల్లి జిల్లాలో రైల్వేమార్గం ఏర్పాటు చేస్తామని గతపాలకులు ఉప్పల్ నుండి భూపాలపల్లి మీదుగా ఇల్లందు.
వరకు భూ సేకరణ జరిపి సర్వేలు వేసినారు, రైల్వే మార్గం ఉంచడం వలన జిల్లా అభివృద్ది అవుతుంది.
వెంటనే జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలి.
జిల్లాలో వరి తర్వాత పెద్ద పంట అయిన తునికాకు సేకరణ పని గిరిజనులు, గిరిజనేతరులు చేస్తున్నారు.
ఇప్పటి వరకు గత సంవత్సరం తునికాకు బోనస్ అందలేదు వెంటనే పరిశీలించి ఇప్పించాలి.
ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి ఈ కాలంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా మంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలలో సరఫరా చేయించాలి.
ఇండ్ల స్థలాలు లేని జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేశు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు చెన్నూరి రమేష్,గుర్రం దేవేందర్,వెలిశెట్టి రాజయ్య, ఆత్కూరి శ్రీకాంతు గడప శేఖర్, ఆకుదారి రమేష్,,కుందాం బుధవారం,వి విజయలక్ష్మి, బి క్రాంతి,, సిహెచ్ రవికుమార్, ఎమ్ రాజేందర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
వైకాపా నేతల దాడిలో మృతి చెందిన రామక్రిష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన
మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యే లు
పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి 27:
పుంగనూరు నియోజకవర్గంలోని చండ్రమాకుల పల్లి పంచాయతీ క్రిష్ణపురం గ్రామంలో ఇటీవల వైకాపా నేతల దాడిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు చిత్తూరు ఇన్ చార్జీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి,గురజాల జగన్మోహన్, మురళీమోహన్ లు నివాళులర్పించారు.ఆ మేరకు కృష్ణాపురం గ్రామంలో గురువారం జరిగిన దినకర్మ కార్యక్రమానికి వారు హాజరై రామకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అదేవిధంగా ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ ఆర్థిక సాయం అందజేశారు.
YSRCP leaders
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇన్ చార్జీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు.ఈ సంతాప కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సి. ఆర్. రాజన్, పుంగనూరు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు, యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబులతో పాటు పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు..
మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సరము 30 ఆదివారం ఉగాది నూతన సంవత్సరము సందర్భంగా కవి సమ్మేళనం తేదీ:29 శనివారం రోజున ఉదయం 10గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా సినారే గ్రంధాలయంలో నిర్వహించబడుతుంది. ఈ కవి సమ్మేళనం లో రాజన్న సిరిసిల్ల కవులు, సాహితీ అభిమానులు కళాకారులు కవితా గానంకు ఆహ్వానం పలుకుతున్నాం. మారసం అధ్యక్షులు TV. నారాయణ,ఉపాధ్యక్షులు బుర దేవానందం ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, కార్యదర్శి ఎలగొండ రవి, మారసం సభ్యులు కామవరపు శ్రీనివాసు తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో మరియు జిల్లా ముఖ్య నేతలతో పలమనేరు గురువారం సందడిగా మారింది.
పుంగనూరులో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి బాధితులను వెళ్ళి పరామర్శించాలని పార్టీ ఆదేశించింది.
దీంతో చంద్రగిరి, కాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, గురుజాల జగన్ మోహన్, మురళీ మోహన్ లు స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్వగృహనికి చేరుకున్నారు.
దీంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఇక్కడ అల్పాహార విందు అనంతరం ఎమ్మెల్యేలందరు కలసి పుంగనూరు నియోజకవర్గంలోని క్రిష్ణపురం గ్రామానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులు సీఆర్ రాజన్, జయప్రకాశ్ నాయుడు, పలమనేరు కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు అర్వీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు..
*టిడిపి నాయకులు, జాతీయ బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం..
తిరుపతి( నేటి ధాత్రి)మార్చి 27:
యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టిడిపి బిసి నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన విజయవాడలో జరుగు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలిరావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు, గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తిరుపతి టిడిపి బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం 9 గంటలకు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం కు బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలిరావాలని రజక సంఘం, గాండ్ల సంఘం, యాదవ సంఘం,నాయి బ్రాహ్మణ సంఘం, మత్స్యకారుల సంఘం, వడ్డెర సంఘం, వన్నెకుల క్షత్రియ సంఘం, పట్టు శాలి సంఘం, శాలివాహన సంఘ నాయకులు హాజరు కావాలని బీసీ కార్పొరేషన్ లో రాష్ట్రంలో ఉన్నతమైన చైర్మన్ పదవిని మన తిరుపతి నాయకులు నరసింహ యాదవ్ కు రావడం మనకందరికీ ఆనందంగా ఉందని కనుక తిరుపతి జిల్లా నుంచి భారీగా తరలి వెళ్దామని పిలుపునిచ్చారు, తిరుపతి నుండి భారీగా బీసీ కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని టిడిపి నాయకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి .జగన్నాథం పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, గాండ్ల సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్నాథం, తిరుపతిలో కుల సంఘాల నాయకులు వడ్డెర సంఘం నాయకులు బాలాజీ, కరాటే చంద్ర , అక్కినపల్లి లక్ష్మయ్య , ఆముదాల తులసీదాస్ , శంకరయ్య , భక్తవత్సలం , అశోక్ తదితరులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని .
రాష్ట్రంలోప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో సహాయపడుతుందని.
సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన అని .
కాంగ్రెస్ పార్టీ నాయకుల తెలియజేశారు అలాగే గోపాల్ రావు పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు గోట్ల కొమురయ్యకు25000. రూపాయలు న గునూరి ఎల్లయ్యకు25000. రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి చెక్కులు రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ప్రభుత్వ విప్ వేముల వాడ ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి తంగళ్ళపల్లి మండలం అధ్యక్షులు ప్రవీణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు ఇందుకుగాను లబ్ధిదారులు ఆపద సమయంలో మాకు ముఖ్య మంత్రి సహాయనిధి అందజేసినందుకు వారికి పేరుపేరునా కృతజ్ఞతలు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కడారిసునీల్ రెడ్డి మండల నాయకులు మీరాల శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు కూతురి రాజు ఎడ్ల ప్రేమ్ కుమార్ కొండవేని రవి కాసర్ల రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
ముందస్తు అరెస్ట్ లను ఖండించిన మాజీ సర్పంచ్ విద్యాసాగర్
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రజా పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న సీఎం గత తాజా మాజీ సర్పంచుల పిండింగ్ బిల్లుల పట్ల బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు పోరాటం చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ ఆరోపించారు.
BRS party
తనతో పాటు నియోజకవర్గం పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ,ఖ నాపురం, నర్సంపేట మండలాల తాజా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టులు చేసి ఆయా పోలీసు స్టేషన్లో నిర్బందించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులు నిలిపివేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన పెడింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.
మండలంలో మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్రవ్యాప్తంగా జేసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది.
అందులో భాగంగా తాజా మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటలు చేసి ఎన్నో అరెస్టులు అయ్యామని ఇటువంటి అరెస్టులకు భయపడమని అందులో భాగంగా జేఏసీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగా ముందస్తుగా సర్పంచులను అరెస్టు చేయడం జరిగిందని ఇందులో తెలంగాణ రాష్ట్ర జేఏసీ జిల్లా సర్పంచులఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు మాట్ల మధు రాజన్న సిరిసిల్ల జేఏసీ ప్రధాని కార్యదర్శి గణప శివజ్యోతి జేఏసీ కార్యవర్గ సభ్యులు కొయ్యడరమేష్ సురభి నవీన్ రావు ను తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఇందులో భాగంగా మాజీ సర్పంచ్ అరెస్టును ఖండిస్తూ తంగళ్ళపల్లి మండల బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజంకర్ రాజన్నమాజీ జెడ్పిటిసి కోడిఅంతయ్య వారికి సంఘీభావం తెలుపుతూ ఇటువంటి అరెస్టులకు భయపడమని తెలుపుతూ వారికి సంఘీభావం తెలిపారు
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ
పాలకుర్తి నేటిధాత్రి
జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పాత సెంట్రల్ జైలుకు సంబంధించిన ఇండియ న్ ఆయిల్ పెట్రోల్ బంకులలో కొన్ని రోజులుగా పనిచేయని సీసీ కెమెరాలు?
భద్రకాళి కమాన్ ఎదురుగా, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులలో, ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు..!
CCTV camera.
ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా డమ్మీ అని సమాచారం?
నగర నడిబొడ్డున, ప్రధాన రహదారిలో, ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పెట్రోల్ పంపులలో, కనీసం ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితి.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎవరు? ఉన్నతాధికారులు తనీకిలు చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్న వాహనదారులు.
ఇదే విషయంపై వెళ్లి ఫోటోలు, వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపై అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అసహనం..
CCTV camera.
సూపరిండెంట్ పర్మిషన్ ఉంటేనే ఫోటోలు తీయాలి అంటున్న పోలీసు సిబ్బంది.
ఎక్కడ లేని వింత అనే చెప్పొచ్చు? నగర ప్రధాన రహదారిలో, ఇంత పెద్ద పెట్రోల్ బంకుల్లో ఉన్న సిసి కెమెరాల వైర్లు పరిశీలిస్తే సగం కట్ అయి ఉండటం తద్వారా అవి డమ్మీ అని వాటిని చూస్తే అర్థమవుతున్న తీరు.
ఇప్పటికైనా సదరు సూపరిండెంట్ కానీ, స్థానిక పోలీసులు అయిన చొరవ తీసుకొని సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
గురువారం నర్సంపేట మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఎల్ఆర్ఎస్ క్రింద క్రమబద్దీకరణకు చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
District Collector
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 26 ఆగస్టు 2020 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ ఈ నెల 31 తో ముగుస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్ పొందవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా ప్లాట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరకాస్తుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆడిగి తెలుసుకొగా అధికారులు బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు.
నర్సంపేట మున్సిపల్ పరిధిలో 5732 మంది దరకాస్తూ చేసుకోగా 2271 క్రమబద్దీకరణకు మంజూరు చేయగా, 293 మంది ఫీజు చెల్లించారని,186 మందికి క్రమబద్దీకరణ పత్రాలు అందజేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.
ఈ సదావకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు దారులు సకాలంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తు దారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోగానే ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సంధ్య,టిపిఓ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద మహిళలు తమ ఉపాధి కొరకు రంగురంగుల బుట్టలు అల్లి ఉపాధి పొందుతున్నారు.
నేటి ధాత్రి రిపోర్టర్ నరేష్ గౌడ్ ఆ దారిలో వెళ్తూ వారిని చూసి వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడగగా వారు మంచిర్యాల లోని రాజీవ్ నగర్ చెందిన మహిళలు స్వప్న,మహేశ్వరి, ప్రవళిక,తిరుమల,శకుంతల స్వయం ఉపాధి కొరకు రెండు సంవత్సరాల నుండి బుట్టలు అల్లుతూ ఉపాధి పొందుతున్నామని అన్నారు.
Colorful Baskets
ఈ బుట్టలు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకే విక్రయిస్తున్నామని చెప్పారు.
ఒక బుట్ట 200 నుండి 600 వరకు ఉంటాయని వినియోగదారులకు కావాల్సిన సైజులు ఆర్డర్ బట్టి తయారు చేసి ఇస్తామని చెప్పారు.వీరు ఉపాధి పొందుతూ కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.ప్లాస్టిక్ కవర్లు వాడకంతో పర్యావరణం కలుషితం అవుతుందని,ఇలాంటి బుట్టలు వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ఆటంకం లేదని,అలాగే కూరగాయల మార్కెట్ కు, స్కూల్ పిల్లల టిఫిన్ బాక్స్ లకు ఇంకా రకరకాల సైజులో అందమైన రంగురంగుల బుట్టలు కావలసిన వారికి అందిస్తామని చెప్పారు. ప్రజలు చాలామంది రంగుల బుట్టలు చూసి ఆకర్షితులై ఈ బుట్టల వలన ఉపయోగాలు తెలుసుకుని చాలామంది ప్రజలు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
2025 జనవరి న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా ఈ ఫలితాల్లో నర్సంపేట పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు పి. అభిరామ్, కే. అశ్విత మరియు వి. హిమబిందులు సీట్లు సాధించారని చైర్మన్ వేముల సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సీట్లు సాధించడం చాలా సంతోషకరమని చైర్మన్ పేర్కొన్నారు.కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దానంతట అదే వస్తుందనే దానికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు.అనంతరం కష్టపడ్డ ప్రతీవిద్యార్ధికి,ఉపాధ్యాయులకు,సహకరించిన పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య రావ్, వైస్ ప్రిన్సిపాల్ విమల,ఇంచార్జి జాగృతి, మాథ్స్ ఉపాధ్యాయులు రాజు, అశోక్, చిరంజీవిలు పాల్గొన్నారు.
రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న టీఏఎస్‌ఎంఏసీ శాఖలు, ఉద్యోగులపై ఈడీ అధికార్ల దాడులను ఆపాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో మార్చి 25న ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ‘నిష్పాక్షికత సమస్య ఉత్పన్న మవుతున్నందున’ ఈ కేసు విచారణనుంచి తాము తప్పుకుంటున్నామని, మరో బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొనడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ విషయం తమిళనాడులో దుమారం సృష్టిస్తున్న నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు విచారణనుంచి తప్పుకోవడంతో ఈ కేసు విచారణపై మరికొంతకాలంపాటు య ధాతథ స్థితి కొనసాగనుంది.
తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలోని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టీఏఎస్‌ఎంఏసీ) మరియు దాని అనుబంధ విభాగాల్లో మార్చి 6వ తేదీనుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలుకొనసాగుతున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలను ఈ సంస్థే నియంత్రిస్తుంటుంది. ఈ సంస్థలో బోగస్ లావాదేవీలు నడుస్తున్నాయని, దాదాపు వెయ్యికోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిం దంటూ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలు చాలాకాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న నేప థ్యంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. ఏఐడీఎంకే నాయకులు ఎడప్పాడి పళనిస్వామి ఏకంగా ఈ స్కామ్ మొత్తం రూ.40వేల కోట్లకు పైమాటేనని ఆరోపిస్తూ మరింత లోతుగా విచారిస్తే అసలు బాగోతం బయటపడుతుందని చెప్పడం విశేషం. చాలాకాలంలో అధికార, విపక్ష పార్టీల మ ధ్య ఈ లిక్కర్ స్కామ్‌పై పరస్పర ఆరోపణలు, విమర్శల దాడులు కొనసాగుతున్నా యి. ప్రస్తుతం ఈడీ జరుపుతున్న దాడులు ప్రధానంగా 2001`2006 మరియు 2011`2021 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టరేట్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) నమోదు చేసిన కేసుల ఆధారంగా కొనసాగుతున్నాయనేది డి.ఎం.కె. నేతల ఆరోపణ. ఈ న మోదైన కేసులు అప్పటి ఏఐడీఎంకే మరియు డీఎంకే ప్రభుత్వాల హయాంలలో నమోదైనవేనని వారంటున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల యూనిట్లలో నమదైన దాదాపు 40 కేసుల ఆధారం గా ఈ దాడులు జరుగుతున్నాయని కూడా డీఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈడీ మాత్రం తమ తనిఖీల్లో అవకతవకలపై స్పష్టమైన ఆధారాలు లభించాయని పేర్కొంది. ఈ కేసుల్లో నమోదైన కేసులు ప్రధానంగా మూడు కేటగిరీలుగా వున్నాయి. మొదటిది నిర్దేశిత రిటైల్ ధరకంటే ఎక్కువ ధరకు అమ్మడం, రెండవది సరఫరా చేసినందుకు డిస్టిలరీ నుంచి వసూళ్లు చేయడం, ఇక మూడవది టీఏఎస్‌ఎంఏసీ సిబ్బంది బదిలీలకోసం జరిపిన వసూళ్లు. ఇదిలావుండగా తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై ప్రస్తుతం ఈడీ నిఘా కొనసాగుతోంది. టీఏఎస్‌ఎంఏసీ కేంద్ర కార్యాలయం, ఈ స్కామ్‌తో సంబంధమున్న ప్రైవేటు డిస్టిల్లరీ సంస్థలపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ స్కామ్‌లో డిస్టిల్లరీలు, అధికార్లు, రాజకీయనాయకులకు ప్రమే యమున్నదని ఈడీ పేర్కొంటున్నది. మరింత లోతైన విచారణ జరిపిన తర్వాత మరిన్ని అరెస్ట్‌లు కొనసాగే అవకాశముందని సంస్థ సూచనప్రాయంగా వెల్లడిరచింది. డీఎంకే నాయకుల ప్రమేయంపై మరింత లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. డిస్టిల్లరీలు, బాటిలింగ్ యూనిట్లలో పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు చెబుతున్నారు. అక్రమ చెల్లింపులు, అకౌంట్లలో చూపని నగదు, నకిలీ కొనుగోళ్లు వంటి అనేక గోల్‌మాల్ వ్యవహారాలు నడిచాయని ఈడీ పేర్కొంది. ఈవిధంగా అన్నిరకాల అక్రమాల ద్వారా రూ.వెయ్యికోట్ల మేర ‘లెక్కల్లో చూపని నగదు’ లావాదేవీలు జరిగాయని చెబుతోంది. అయితే దీనిపై విచారణ కొనసా గుతున్నదని ఈడీ పేర్కొంది.అయితే విషయం హైకోర్టుకు చేరడంతో ఈడీ కార్యకలాపాలకు తాత్కాలిక బ్రేక్ పడిరది.
డీఎంకే మాత్రం ఇదంతా కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమేనని ఆరోపిస్తోంది. ఇటువంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాల ద్వారా డీఎంకేను దెబ్బకొట్టలేరని రాష్ట్ర న్యాయశాఖ మంత్రిఎస్. రఘుపతి పేర్కొన్నారు. పార్టీ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ, ‘ఇంకా ఈడీ దాడులు మొదలుకాకముందే బీజేపీ అధ్య క్షుడికి రూ.వెయ్యికోట్ల స్కామ్ జరిగిందని ఎట్లా తెలుసు? ఢల్లీి, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అనుసరించే లిక్కర్ పాలసీలు, తమిళనాడుకు పూర్తి భిన్నం. అటువంటప్పుడు విచారణ పూర్తికాకముందే రూ.వె య్యికోట్ల స్కామ్ జరిగిందని ఈడీ ఎట్లా చెబుతుంది’ అని ప్రశ్నించారు.
ఈడీ దాడుల నేపథ్యంలో టీఏఎస్‌ఎంఏసీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు అక్రమమని, వీటిని తక్షణం నిలిపేసేలా ఆదేశాలివ్వాలని’ కోర్టును అభ్యర్థించింది. మద్యం విధాన రూపకల్పన రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన అధికారపరిధిని దాటి ఈ దాడులకు పాల్పడుతున్నదని తన పిటిషన్‌లో పేర్కొంది. దీం తో ఈనెల 20న టీఏఎస్‌ఎంఏసీ అధికార్లపై ఏవిధమైన చర్యలు తీసుకోవద్దని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎఆర్.ఎల్. సుందరేశన్‌కు మౌఖికంగా సూచిస్తూ జస్టిస్ ఎం.ఎస్. రమేష్, జస్టిస్ ఎన్. శాంతికుమార్‌లతో కూడిన బెంచ్, దీనికి కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి మార్చి 25వరకుఅవకాశం ఇచ్చింది. అప్పటివరకు టీఏఎస్‌ఎంఏసిపై దాడులు జరపవద్దని ఈడీని ఆదేశించింది. విచిత్రంగా మార్చి 25న జరిగిన విచారణలో, ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ‘నిష్పాక్షికత సమస్య ఉత్పన్న మవుతున్నందున’ ఈ కేసు విచారణనుంచి తాము తప్పుకుంటున్నామని, మరో బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొనడం సంచలనం సృష్టించింది. దీంతో ఈడీ దాడుల విచారణపై మరికొంతకాలం సస్పెన్స్ కొనసాగనుంది.
ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న లిక్కర్ స్కామ్ వివాదం అధికార డీఎంకేను స్వీయరక్షణలో పడేసిందనేది సత్యం. బీజేపీ, ఏఐడీఎంకేలకు లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన అస్త్రంగా మారింది. నిజానికి టీఏఎస్‌ఎంఏసీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. లిక్కర్‌కు సంబంధించిన సర్వాధికారాలు ఈ సంస్థ చేతుల్లోనే వుంటాయి. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థ హోల్‌సేల్ మరియు రిటైల్ మద్యం పంపిణీ వ్యవహారాలను చూస్తుంది. ఆవిధంగా తమిళనా డులో మద్యం మొత్తం ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగుతుంటుంది. డిస్టిల్లరీలనుంచి మద్యాన్ని సేకరించి ప్రభుత్వం ఔట్‌లెట్‌ల ద్వారా పంపిణీ చేస్తుంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4700 ఔట్‌లెట్‌లుండగా, మొత్తం మద్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.45వేల కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. ఆవిధంగా లిక్కర్ రాష్ట్రప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. అయితే టీఏఎస్‌ఎంఏసీ అనుసరిస్తున్న పద్ధతిలో పారదర్శకత లోపించడంతోపాటు, విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈడీ చేసిన దాడుల్లో టీఏఎస్‌ఎంఏసీలోని అవినీతి నెట్‌వర్క్ మొత్తం బయటపడినట్టు తెలుస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు, అధికార్లు, మద్యం తయారీదార్లు కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా అమ్మకాలు, టెండర్లు, మద్యం సేకరణ విషయాలో అవినీతి విపరీతంగా వున్నట్టు స్పష్టమైంది.
ఈడీ ప్రధానంగా తెలుసుకున్నట్టుగా చెబుతున్న అంశాలీవిధంగా వున్నాయి: 1. డిస్టిల్లరీలో మ ద్యం కొనుగోళ్ల రికార్డుల ను తారుమారుచేయడం. తద్వారా ధరలను విపరీతంగా పెంచేసి షెల్ కంపెనీల ద్వారా బదిలీచేయడం. కొన్ని కంపెనీలు బోగస్ ఇన్‌వాయిస్‌ల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడటం. 2. లిక్కర్ తయారీదార్లు టీఏఎస్‌ఎంఏసీ అధికార్లకు విపరీతంగా లంచాలు ఇచ్చి మద్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. కొన్ని డిస్టిలరీ కంపెనీలకు ఇందులో ప్రధానపాత్ర వుంది. 3. సరైనపత్రాలు లేనివారికి కూడా బార్‌లైసెన్స్‌లు ఇష్టారాజ్యంగా ఇచ్చారు. కొ న్ని కంపెనీలకు అనుకూలంగా రవాణా టెండర్లు ఆమోదించడంవల్ల, ఏటా టీఏఎస్‌ఎంఏసీ ఇటువంటి కంపెనీలకు అక్రమంగా రూ.100కోట్ల వరకు చెల్లింపులు జరుపుతోంది. 3. కేవలం లెక్కల్లో చూపని నగదు లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాజకీయ పార్టీలకు పంపడం. డిస్టిల్లరీ సంస్థలు ఎగ్జిక్యూటివ్‌లకు మరియు టీఏఎస్‌ఎంఏసీ అధికార్లకు మధ్య ప్రత్యక్ష లావాదేవీలను ఈడీ దాడుల్లో గుర్తించారు. అంటే ఇక్కడ క్విడ్ ప్రొ కో నడుస్తోంది. అంతేకాదు టీఏఎస్‌ఎంఏసీ స్టోర్లలో నిర్దేశిత ధరలకంటే 30 నుంచి 40శాతం అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నట్టు కూడా గుర్తించింది.
కాంగ్రెస్ పార్టీలోనేనే సీనియర్. నాకంటే సీనియర్ ఎవరూ లేరు. పార్టీలో నేనెంత చెబితే అంత. అదిష్టానానికి నేనంటే ప్రేమ. అని చెప్పుకోకపోతే రాజకీయాలు చేయలేరు. అలా ఇంత కాలం రాజకీయం చేసుకుంటూ వచ్చిన సీనియర్లకు ఇప్పుడు మింగుడు పడడం లేదు. వారి రాజకీయం చెల్లడం లేదు. వారికి తెలిసి ఏ పని జరగడం లేదు. అధిష్టానం వారి అభిప్రాయాలు తీసుకోవడం లేదు. వారిని సంప్రదించడం లేదు. గతంలో సీనియర్లు ఎప్పుడూ డిల్లీలో వుండేవారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వుండేవారు. కాని వారి వల్ల పార్టీకి ఒక్కశాతం కూడా లాభం వుండేది కాదు. అయినా వారికి పదవులు వస్తూ వుండేవి. ప్రాదాన్యత దక్కుతూ వుండేది. కాని ఇప్పుడు సీనియర్ల ఆటలు సాగడం లేదు. అంతో ఇంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కాలంలో కూడా కొంత మంది పదవులు పొందేవారు. అధిష్టానం వద్ద సానుభూతిని పొందుతూ వుండేవారు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత సీనియర్ల మాటలు నమ్మడానికి పార్టీ ఇష్టపడడం లేదు. వారి సూచనలు సలహాలు తీసుకోవడానికి సిద్దపడడం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్లను అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు. సరిగ్గా గత ఐదు సంవత్సరాలుగా సీనియర్లమని చెప్పుకుంటున్నవారికి అధిష్టానం సమయం కూడా ఇవ్వడం లేదు. డిల్లీకి వెళ్లిపడిగాపులు కాసినా వారి ముఖం కూడా చూడడం లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆ మాత్రం ఎంట్రీకూడా లేకుండా పోయింది. లేకుంటే ఇప్పటికే ఇల్లు పీకి పందిరేసేవారు. అయినా కొంత మంది సీనియర్లు అవకాశం దొరికితే చాలు ఏదో ఒకటి చెప్పాలని చూస్తున్నారు. కాని వారికి ఆ అవకాశం పార్టీ ఇవ్వడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే లాబీయింగ్ చేయని నాయకుడు లేడు. సీనియర్లంతా మాకంటే, మాకే అవకాశమివ్వాలంటూ డిల్లీపెద్దలను కోరుతూ వచ్చారు. కాని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ఎంపిక చేసింది. అప్పటి దాకా మూడు రోజులపాటు సీనియర్ల హైడ్రామా నడిపారు. దాంతో వారిని పూర్తిగా ఇప్పుడే పక్కన పెట్టడం వల్ల ఆదిలోనే అపశృతులు వద్దనుకొని అధిష్టానం కొంత మందికి అవకాశమిచ్చింది. నిజానికి ఇప్పుడున్న మంత్రి వర్గంలో కూడా సీనియర్లు మరి కొంత మంది వున్నారు. కాని వాళ్లు ఎప్పుడూ డిల్లీ చెవుల్లో ఏదో చెప్పేందుకు వెళ్లేవారు కాదు. డిల్లీ పెద్దలు రమ్మంటే తప్ప వారి వద్దకు వెళ్లరు. అలాంటి వారితో వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాని ఓ ముగ్గురు నలుగురు సీనియర్ల మూలంగానే పార్టీకి ఇంకా తిప్పలుతప్పడం లేదు. సీనియర్లమని చెప్పుకోవడం , పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదని చెప్పడం తప్ప పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పడానికి వారికి ఒక్క సాక్ష్యం లేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాటి నుంచి ఆయన చేసినంత పోరాటం ఎవరూ చేయలేదు. పైగా రేవంత్‌రెడ్డి పోరాటం చేస్తుంటే అడుగడుగునా అడ్డు పుల్లలు పెట్టారు. మాకంటే ముందు వెళ్తున్నాడని ఆయనకు బ్రేకులువేసే ప్రయత్నాలు చేశారు. రేవంత్‌రెడ్డి పిసిసి అయిన నాటి నుంచి ఆయనను ఏదో రకంగా ఇరుకన పెట్టాలని చూశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సినన్ని మాటలు మాట్లాడారు. పిపిసి. కొనుక్కున్నారంటూ కూడా విమర్శలు చేసిన సందర్భం వుంది. ఓ సందర్భంలో నేనంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే నేను అని పార్టీకి పేరు తెచ్చేలా రేవంత్‌రెడ్డి గొప్పగా చెబితే కూడా దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. వివాదం చేసి, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాడంటూ విమర్శలు చేశారు. అసలు ఆ మాట చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. ఏకంగా పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వున్న సమయంలో మా ఉమ్మడి జిల్లాకు రావాల్సిన అవసరం లేదు అని కూడా కొందరు నాయకులు ప్రకటించిన సందర్భం వుంది. ఇక రేవంత్‌రెడ్డి పిసిసి ప్రెసిడెంటు అయిన తర్వాత ఆయన కింద మేం పనిచేయాలా అంటూ ప్రశ్నించిన వారున్నారు. పార్టీ అదికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంతగా నోరు పారేసుకోవాలో అంత పారేసుకున్నారు. అసలు రేవంత్ రెడ్డి పెత్తనమేమిటంటూ ప్రశ్నిస్తూ వుండేవారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడంటూ కూడా ఎద్దేవా చేస్తూ వుండేవారు. కాని ఆయన బిఆర్‌ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగానే బిజేపిలో చేరి మెదక్ నుంచి ఎంపిగా పోటీచేశారు. ఓడిపోయి, మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాని ఆయన పార్టీన సంగతి మర్చిపోయి, రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకునేవారు. అయినా అవన్నీ ఏనాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లెక్కపెట్టుకునేవారు కాదు. ఆయన లక్ష్యం వేరు. ఆయన ఆలోచనలు వేరు. ఇతర నాయకులు ఎంత మంది ఏది మాట్లాడినా ఎక్కడా పార్టీకి చెందిన నాయకుల మీద ఎలాంటి ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. అంతా మన మంచికే అన్నట్లు ఇన్నింటినీ చిరునవ్వుతో స్వాగతించేవారు. అలా పార్టీ కోసం పనిచేస్తూ, మరోవైపు అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి మాత్రమే. కాంగ్రెస్‌లో ఇంత పెద్ద నాయకులున్నారు. కాని ఏనాడైనా, ఏ ఒక్క నాడైనా బిఆర్‌ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసింది లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటి రెడ్డి వెంకటరెడ్డిగాని ఈ పదేళ్ల కాలంలో ఏనాడు జైలుకు వెళ్లలేదు. కనీసం అరెస్టు కాలేదు. ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. ఏ వర్గానికి కొమ్ము కాయలేదు. పోరాటాలకు శ్రీకారం చుట్టలేదు. కాని రేవంత్‌రెడ్డి ప్రతి నిత్యం పోరాటంచేశారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అలా ఆయన చేపట్టిన ఉద్యమాలకు హజరు కావడానికికూడా ఇష్టపడేవారు కాదు. ఓ సందర్భంలో కేసిఆర్ హాయాంలో వరి వేస్తే ఉరి అంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దానికి నిరసనగా కేసిఆర్ పొలంలో వరి ఎందుకు వేశారంటూ రేవంత్ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో నా జిల్లాలో నాకు తెలియకుండా కేసిఆర్ మీద పోరాటం చేయడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అని జగ్గారెడ్డి ప్రశ్నించిన సందర్భం వుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో రేవంత్‌రెడ్డికి ఎదరుపడిన మీడియా అభ్యర్ధి ఎంపిక గురించి ఓ ప్రశ్న అడిగే సమిష్టి నిర్ణయం వుంటుందని చెప్పారు. ఆ మాట చెప్పడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అంటూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియా ముందు రేవంత్‌రెడ్డి పరవు తీసినంతపనిచేశారు. కాని ఇప్పుడు అందరూ సుద్దులు చెబుతున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద కూడా కావాలని కొంత మంది కుట్ర చేస్తున్నారు. ఆయనపై రకరకాల వివాదాలు సృష్టిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు చేసేందుకు కొంత మంది పని గట్టుకొని మాట్లాడుతున్నారు. కాని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లేకపోతే ఖమ్మం జిల్లాలో పార్టీలోనే కాదు, తెలంగాణలో 27 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుపు కష్టమయ్యేది. ఉమ్మడి ఖమ్మంతోపాటు, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ వరకు సుమారు 27 నియోజకవర్గాలను తన కనుసన్నల్లో గెలిపించిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది. ఆ సంగతి సీనియర్లు మర్చిపోతున్నారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ శపధం చేసిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఖమ్మం మొత్తం సీట్లను గెలిపించుకున్నారు. పొరపాటున బిఆర్‌ఎస్‌నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చేశారు. అలా సీనియర్ నాయకులమని చెప్పుకుంటున్న వాళ్లెవరైనా చేశారు. ఒక్క నాయకుడినైనా బిఆర్‌ఎస్ నుంచి తెచ్చారా? బిఆర్‌ఎస్ అదికారంలో వున్నంత కాలం ఆ పార్టీకి కోవర్టులు అని ముద్ర వేయించుకున్న వాళ్లే కొందరు సినీయర్లు. వారికి చెందిన వారసులు కూడా ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. అంటే వారికి పార్టీ మీద ఎంత చిత్తశుద్ది వుందో అర్దంచేసుకోవచ్చు. వారి నాయకత్వ పటిమ ఎంత బలంగా వుందో ఈ ఒక్క విషయంతో తెలుసుకోవచ్చు. మంత్రి వర్గ విస్తరణలో కూడా మాకంటే మాకే కావాలంటూ ఆ సీనియర్ నాయకులు కోరడం విడ్డూరం. అసలు కాంగ్రెస్‌పార్టీ పని అయిపోయిందని, బిజేపిలో చేరి అక్కడ ప్రాదాన్యత దక్కక తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి కూడా నేనే మంత్రిని అంటున్నారు. నాకు ఎన్నికల ముందు హమీఇచ్చారనిచెబుతున్నారు. ఇలాంటి వారికి కోసం బిసి. మహిళామంత్రికొండా సురేఖను పక్కన పెట్టేందుకుకూడా కుట్ర చేస్తున్నారన్న వార్తలువస్తున్నాయి. కాని అధిష్టానం అన్నీ గమనిస్తూనే వుంటుంది.పైగా దేశంలో అదికారంలోవున్న మూడు రాష్ట్రాలలో తెలంగాణ అత్యంత కీలకమైంది. అందవల్ల తెలంగాణలో ఏ నాయకుడు ఏమిటో అదిష్టానానికి అంతా తెలుసు. రేవంత్ రెడ్డి పార్టీని ఎంతకష్టపడి గెలిపించారో తెలుసు. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంత శ్రమించారో పార్టీ పెద్దలందరికీ తెలుసు. ఎందుకంటే అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది. ఏమీ లేని విస్తరులే ఎగిరెగిరి పడుతుంటాయన్న సామెతను మర్చిపోతున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.