సింగరేణి సిఎండి శ్రీ ఎన్. బలరాం గారు మరియు డైరెక్టర్ (పా) శ్రీ కె. వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో టీఎస్ పాలీసెట్ – 2025 పరీక్షకు ఉచిత బోధన తరగతులు నిర్వహించబోతున్నాము.
ఈ తరగతులు 2025 ఏప్రిల్ 10 నుండి మే 10 వరకు సింగరేణి పాఠశాలల్లో నిర్వహించబడతాయి.
అర్హులు:
ఎస్ఎస్సి – 2025 పూర్తి చేసిన విద్యార్థులు
ఇతర పాఠశాలల్లో చదువుతున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు
సీట్ల పరిమితి మేరకు బడుగు, బలహీన వర్గాల, నిరుపేద ఎస్ఎస్సి విద్యార్థులు
వివరాలు: టీ.ఎస్ పాలీసెట్ (తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు:
లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు
ప్రభుత్వ/ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు
స్వంతంగా పరిశ్రమ/వ్యాపారం స్థాపించి స్వయం ఉపాధి పొందవచ్చు
మరిన్ని వివరాలకు: సమీపంలోని సింగరేణి పాఠశాల మందమర్రి ప్రధానోపాధ్యాయులను సంప్రదించగలరు సెల్ నెంబర్. 98492 15692
కార్యదర్శి సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్ సి ఈ ఎస్)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.
సోషల్ మీడియా వేదిక గా ప్రచారం నిర్వహించాలి
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్ర
కె.సి.ఆర్ గారి నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి చేశారని మాజి మంత్రి అన్నారు వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.ఈ భారీగా వచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేశారు రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు గ్రామగ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను,ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 25.సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్పూర్తి కలిగించాలని కోరుకున్నారు. తెలంగాణ ఆస్తి కె.సి.ఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర,10ఏండ్ల అధికారంలో తెలంగాణ కె.సి.ఆర్ నాయకత్వములో సుభిక్షంగా మారిందని కొంతమది కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో అభిమానం తగ్గలేదని అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కె.సి.ఆర్ విలువ బి.ఆర్.ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చింది అని అన్నారు. 20రోజులలో నాయకులు మండల,గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రజతోత్సవ సభ విజయవంతంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు రుణ మాఫీ రైతు భరోస,మహిళలకు 2500,తొలం బంగారం,నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలని అన్నారు.రజతోత్సవ సభ విజయవంతంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సకల జనులు బి.ఆర్.ఎస్ వైపు చూస్తారని గౌరవ నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, చంద్రశేఖర్ నాయక్,కురుమూర్తి యాదవ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,దిలీప్ రెడ్డి,వనం.రాములు,రాళ్ళ.కృష్ణయ్య,మాణిక్యం,వేణు యాదవ్,వెంకటస్వామి,మాజీ ప్రజాప్రతినిధులు రఘుపతి రెడ్డి,బోర్ల.భీమయ్య,కృష్ణా నాయక్, లక్ష్మమా రెడ్డి, కర్రేస్వామి, రాజశేఖర్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ, పెండం నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్ నాయుడు ,ప్రేమ్ నాథ్ రెడ్డి,సమద్, స్టార్.రహీమ్,ఇమ్రాన్,హేమంత్ ముదిరాజ్,సూర్యవంశం.గిరి జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము,సునీల్ వాల్మీకి మహిళా నాయకురాలు నందిమల్ల.శారద ,నాగమ్మ,జమ్ములమ్మ, సాయిలీలా,కవితా నాయక్ తదితరులు పాల్గొన్నారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు
మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారి ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రాంతంలో బస్టాండ్ ఏరియా లోని అభయ ఆంజనేయ స్వామి గుడి లో ఎమ్మెల్యే మాజీ విప్ నల్లాల ఓదెలు గారు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం రోజున స్థానిక అభయాంజనేయ స్వామి మారుతి నగర్ మందమర్రి బస్టాండ్. ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు ఏటూరి సత్యనారాయణ గారు మాజీ మా మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారు ఆరోగ్యంగా మహామృత్యుంజయడు గా తిరిగి రావాలని. అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.భక్తులకు ఓదన్న గారి అభిమానులు తీర్థప్రసాదాలను స్వీకరించి మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొద్దిరోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉన్నాడు. అరోగ్యం తొందరగా బాగా పాడాలని అభిమానులు కార్యకర్తలు భగవంతుని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరి సత్యనారాయణ తో పాటు ఓదన్న గారి అభిమానులు. ఆ ఏరియా ప్రజలు పెద్దలు అందరూ పాల్గొన్నారు
గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో టూరిజం వాల్ల ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలని బీజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైందని పనులు పూర్తయి ఆరు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించడం లేదన్నారు దీంతో కోటగుళ్లకి వచ్చే పర్యాటకులు ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ , టూరిజం శాఖ వారు స్పందించి వెంటనే మరుగుదొడ్లను ప్రారంభించి వాడుకలోకి తేవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి చెలిమల్ల ప్రవీణ్ కుమార్ బీజేవైఎం నాయకులు కర్క అన్వేష్ చరణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 12న అరాఫత్‌లోని జహీరాబాద్ మసీదులో హజ్ యాత్రికుల శిక్షణా శిబిరం.
జహీరాబాద్. నేటి ధాత్రి:
హజ్ యాత్రికుల కోసం ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అరాఫత్ మసీదులో ఒకరోజు శిక్షణ శిబిరం జరుగుతుందని, దీనిలో వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు పాల్గొంటారని అహ్మద్ అడ్వకేట్ తెలిపారు. మహిళలకు ప్రత్యేక బురఖా ఏర్పాటు ఉంటుంది. పాల్గొనేవారికి భోజన ఏర్పాటు ఉంటుంది. ముస్లిం సమాజం యాత్రికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ముహమ్మద్ జమీరుద్దీన్, న్యాయవాది ముహమ్మద్ ముయీజుద్దీన్ అలీ, అలీం మక్బూల్ అహ్మద్ వకార్ పటేల్, ముంతాజ్ అహ్మద్, ముయెజ్జిన్ సయ్యద్ ఇబ్రహీం చంద్ ఖాదిర్ మొహ్సిన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ్ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
శ్రీరామ్ మందిర్ ఆలయం లో శ్రీ సీతారాముల స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో వారిని సన్మానించారు.
Temple.
ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,డా౹౹చంద్రశేఖర్,బి.మల్లికార్జున్,శివాజీ సేన నాయకులు వంశీకృష్ణ గోడ్కే,శ్రీనివాస్ మరియు అర్చకులు,భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
ధ్యానం వాకింగ్ చేయాలి జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత. వనపర్తి నేటిదాత్రి :
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాసవి వనిత క్లబ్ వనపర్తి గోల్డ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశము నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా జెడ్జి శ్రీమతి ఎమ్.ఆర్ సునీత లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బి రజిని డిహెచ్ఎంఓ శ్రీనివాసులు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల న్యాయ వాది ఉత్తరయ్య పాల్గొన్నారు ఈసందర్భంగా జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం ఉదయం నడక తప్పనిసరిగా చేయాలని ఆరోగ్యం గా ఉంటారని అన్నారు పిల్లలను మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పిల్లలను గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి శ్రీనివాసులు సెక్రెటరీ కే బుచ్చయ్య కోశాధికారి ఏ మధుసూదన్ ఆర్యవైశ్య సంగం కన్వీనర్ పూరి బాలరాజు పట్టణ బీజేపీ మాజి అధ్యక్షులు బచ్చు రాము వనితా క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి సువర్ణ సెక్రెటరీ కొంపల్లి రజిత భార్గవి ఆర్యవైశ్య సంగం పట్టణ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి సంధ్య మాధవి రాజశేఖర్ నరసింహస్వామి నవీన్ వనపర్తి ఆర్యవైశ్య లు పాల్గొన్నారు.
సిరిసిల్ల సి.పి.ఎం పట్టణ కార్యదర్శి అన్నదాస్ గణేష్
సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు గత ఎనిమిది రోజులుగా పవర్ లూమ్ ,వార్పిన్ , వైపని కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరెలకు కూలీ నిర్ణహించాలని సమ్మె చేస్తున్న కార్మికులకు సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ 24 గంటల నేతన్న దీక్షను విరమింప జేస్తూ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి. అనంతరం అన్నదాస్ గణేష్ మాట్లాడుతూ పట్టణంలోని తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లుకు కండ్లు కనిపించడం లేదా కార్మికుల గోడు వినిపించడం లేదా అని ప్రశ్నించారు.
Workers.
మున్సిపల్ ఎన్నికలలో కార్మికుల ఓట్ల కోసం చేతులు చాచే కౌన్సిలర్లు కార్మికుల వేతనాలు ఇతర సమస్యల పై మాట్లాడకుండా యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.
Workers.
పట్టణంలోని పవర్ లూమ్ కార్మికులు బి.ఆర్.ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడి కార్మికులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. పవర్ లూమ్ కార్మికుల కూలీ సమస్యపై స్పందించని తాజా మాజీ కౌన్సిలర్లు వారి పార్టీలపై పట్టణ కార్మిక కుటుంబాలు రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తుంటే బిజెపి నాయకులు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కార్మికుల సమస్యలపై మాట్లాడకుండా యజమానులకు తొత్తులుగా మారి కార్మికుల సమస్యలపై మౌనం వహిస్తున్న పై మూడు పార్టీలు రాజకీయ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని కార్మిక వర్గం రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, మూషం రమేష్, సూరం పద్మ, సిరిమల్ల సత్యం, నక్క దేవదాస్, బెజుగం సురేష్,ఉడుత రవి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని రెండవ బైపాస్ చంద్రంపేట ఎక్స్ రోడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అధికారిక పర్యటన నిమిత్తం అటుగా వెళుతున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రమాదాన్ని చూసి గాయపడిన యువకులను అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రంలో నూతన హనుమాన్ సేవ కమిటీ అధ్యక్షులుగా చిలువేరి కనకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కడారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రమేష్, క్యాషియర్ గా జవ్వాజి అజయ్, కమిటీ మెంబర్ లుగా బొజ్జ తిరుపతి, నీలం ప్రశాంత్, మాడిశెట్టి జయంత్, మండల లక్ష్మణ్, మూల వంశీ, పూరెల్ల రాహుల్, చిట్యాల కమలాకర్, చిట్యాల శివకుమార్, మాడిశెట్టి శ్రీసాయి, బాసరవేణి కళ్యాణ్, కీర్తి కుమార్, బొమ్మరవేణి శ్రీనివాస్ ఈరెళ్ళ అంజయ్య, బసవేణి మధు, ఒంటెల ఆదిత్య రెడ్డి, మామిడి రాజకుమార్, తదితరులను ఎన్నుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భారత రాష్ట్ర సమితి యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య రంగ నిపుణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈసందర్భంగా బుదారపు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుద్ధత పాటించాలని డాక్టర్ల సూచనలేని అనవసరమైన మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడ రాదని తమ ఆరోగ్యాల పట్ల ఎవరికి వారు శ్రద్ధ వహించాలని కోరారు. ఈసందర్భంగా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వైద్య సిబ్బందిని సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి వెంకట గ్రీష్మన్య, వెంకటేశ్వర్లు, కొలిపాక కమలాకర్, స్వామి, పురాణం రమేష్, తిరుపతి, నరేందర్, శ్రీధర్, కొమురయ్య, శివశంకర్, నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతి పొందిన కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు తెలిపిన సిఐ.
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పరశురాములు, రవీందర్ లు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందారు. చొప్పదండి సిఐ ప్రకాష్‌గౌడ్, చొప్పదండి ఎస్ఐ సురేందర్ చేతుల మీదుగా పదోన్నతి తీసుకోని పరశురాములు మెదక్ జిల్లాకి, రవీందర్ కామారెడ్డి జిల్లాకి పదోన్నతిపై బదిలి అయ్యారు. పదోన్నతి పొందిన ఇరువురిని సిఐ ప్రకాష్ గౌడ్, ఎస్ఐ సురేందర్, సిబ్బంది, తదితరులు శుభకాంక్షలు తెలియజేశారు.
-పట్టుబడినా రెండేళ్ల వరకు కేసు తేలకుండా చూసుకుంటున్నారు.
-దర్జాగా మళ్ళీ కొలువులు తెచ్చుకొని అదే సీట్లో కూర్చుంటున్నారు.
-పెట్టిన పెట్టుబడికి మళ్ళీ పదింతలు వసూలు చేసుకుంటున్నారు.
-సస్పెండ్ అయిన కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
-విందులు, వినోదాలతో కాలం గడుపుతున్నారు.
-సస్పెన్షన్ కాలానికి కూడా తర్వాత జీతాలు అందుకుంటున్నారు.
-జీవితాంతం కష్టపడినా రాని సంపాదన లంచాల రూపంలో పదేళ్లలో పోగేసుకుంటున్నారు.
-ఏసిబి ఎంత కష్టపడి పట్టుకున్నా కేసులు నిలబడక కొలువుకెక్కుతున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి: ఉగాది పండుగ రోజు ఎవరైనా తప్పుడు పని చేయాలనుకుంటారా? తొలి పండుగ రోజు ఆత్మ వంచన చేసుకోవాలని ఎవరైనా చూస్తారా? అంటే కొంత మంది వుంటారు. మానవత్వం మర్చినవారు, మంచితనం లేని వారు వుంటారు. ఉగాది పండుగ రోజు లంచం తీసుకుంటే సంవత్సరమంతా లంచాల సంపాదన మూడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని ఆశించే దౌర్భాగ్యులు కూడా కొంత మంది వుంటారని తేలింది. ఓ అదికారి ఏకంగా ఉగాది నాడు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారంటే పరిస్దితి ఎంత దారుణంగా వుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు ఆ లంచంకూడా ఉగాది పండుగ రోజు కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. ఏసిబికి పట్టుబడ్డాడు. ఇక మరో ఇరిగేషన్ ఉద్యోగి ఓ వ్యక్తి భూమి ఎఫ్టీఎల్, భఫర్ జోన్లో లేదని ఎన్వోసి ఇవ్వడానికి శ్రీరారమ నవమి పండుగ రోజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిజానికి ఈ రెండు రోజులు ప్రభుత్వ సెలవు రోజులు. అయినా ఆ లంచాల వతారులకు పండగ, పబ్బం, నీతి, నిజాయితీ, మంచి తనం అనేది మచ్చుకు కూడా లేదని తేలిపోయినట్లైంది. ఇలాంటి అధికారులు తెలంగాణలో ఎంతో మంది వున్నారు. పట్టుబడుతూనే వున్నారు. ఎందుకంటే కొంత మంది ఉన్నతోద్యోగులకు జీతం చిల్లిగవ్వతో సమానమైపోయింది. దాన్యంలో తాలుతో సమానమైపోయింది. జీతం అన్నది లెక్కలేకుండాపోయింది. ఎందుకంటే లంచాల ద్వారా జీతానికి పదుల రెట్లు నెలనెల సంపాదన అందుతోంది. అక్రమ సంపాదనకు పూర్తిగా అలవాటుపడిన కొంత మంది ఉద్యోగులు ఈ విధంగా లంచం లేనిదే పూట గడపడం లేదు. ఇది ఈ శాఖ, శాఖ అని తేడాలేదు. ఏశాఖలో చూసినా లంచావతారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒకప్పుడు నెల జీతగాళ్లమని చెప్పుకునే అదికారులు ఇప్పుడు జీతం కోసం ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. లంచాల పేరుతో నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తూ, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అలా లంచాలు తీసుకుంటూ దొరుకుతున్న వారు కేవలం ఒక్క శాతమే.. ఇంతగా ఏసిబి దృష్టిపెట్టినా అధికారులు లంచాలు తీసుకోవడం ఎందుకు మానుకోవడం లేదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కళ్లమందు లక్షలకు లంచాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంటే ఊరికే పనులు ఎందుకు చేయాలన్న ఆలోచన అధికారుల్లో మొదలైంది. సంతకం పెట్టాలంటే, పెన్ను కదలాంటే లంచం అందాల్సిందే..లేకుంటే అదికారుకు కనికరం అనేది లేకుండా పోతోంది. వ్యవస్ధలన్నీ దిగిజారిపోతున్నాయి. ఏ శాఖలో చూసినా లంచమే కనిపిస్తోది. ఈ మధ్య పట్టుబడుతున్న వారిలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికులు వున్నారు. గత వారం రోజుల్లోనే వైద్య, రెవిన్యూ, ఇరిగేషన్, విద్యుత్, ఆఖరుకు విద్యాశాఖకు చెందిన ఉన్నతోద్యోగులు పట్టుబడ్డారంటే ఎంతగా భరితెగించారో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి జీతం మీద లెక్కలేదు. జీతం ఆగిపోతుందన్న భయం లేదు. ఉద్యోగం పోతుందన్న భయం అసలే లేదు. ఎందుకంటే ఒక వేళ ఏసిబికి పట్టుబడినా, ఆ కేసును రెండు సంవత్సరాల పాటు కొనసాగేలా చేసుకంటే సరిపోతుంది. అప్పుడు న్యాయస్ధానమే ప్రభుత్వానిది తప్పని తేల్చి, లంచావతారులకు మళ్లీ పోస్టింగ్ ఇస్తుంది. చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకొని, ప్రజల జీవితాలతో కొంత మంది లంచగొండులు ఆడుకుంటున్నారు. లంచం తీసుకున్నాడని తెలిస్తే వెంటనే ఉద్యోగం పోతుందన్న భయం లేదు. ఉద్యోగులు ఇంతలా దిగజారిపోతారని చట్టంచేసినప్పుడు ప్రభుత్వాలు అనుకోలేదు. రాజ్యాంగంలో పొందుపర్చినప్పుడు ఉద్యోగులకు హక్కులు కల్పించబడినప్పుడు పెద్దలు ఆలోచించలేదు. అది ఇప్పుడు ఉద్యోగులకు వరమైంది. ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా కాపాడుతోంది. వారి కొలువకు భరోసా కల్పిస్తోంది. అందుకే ఉద్యోగులు ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయడం లేదు. ప్రభుత్వాలను కూడా లెక్క చేయడం లేదు. లంచాలకు మరిగి..మానవత్వం మరిచి! దిగజారిపోతున్న రెవిన్యూ వ్యవస్ధ. లంచాలు లేనిదే కొలువు చేయలేకపోతున్న ఉద్యోగులు. తహసిల్ధారుల మితిమీరుతున్న ఆగడాలు. రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. రైతులు భూములు అమ్ముకున్నా కష్టమే? కొనుక్కున్నా లంచం ఇవ్వాల్సిందే. ఆఖరుకు తమ భూమి తమ పేరు మీద మార్చుకున్నా లంచమే. తహసిల్ధార్ సంతకం పెట్టాలంటే కూడా లంచమే. రైతుల రక్తం తాగుతున్నారు.. ఏసిబికి ఎంత మంది చిక్కుతున్నా భయపడడం లేదు. కేసులు పెడతారన్న ఆందోళన లేదు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం అసలే లేదు. తప్పు చేస్తున్నామన్న భావన అసలే లేదు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. చిన్నా, చితకా పని ఏదైనా సరే..లంచం ఇవ్వాల్సిందే. రైతులను అరిగోస పెడుతున్నారు. అయినా పట్టింపు ఎవరికీ లేదు. కొంత మంది తహసిల్ధార్‌లలో కనీసం మానవత్వం కరువైపోతోంది. ఎక్కడికక్కడ కొంత మంది తహసిల్ధార్లు ఏసిబికి పట్టుబడుతున్నా, మిగతా వాళ్లు భయపడం లేదు. కాసుల కక్కుర్తికి బాగా అలవాటు పడ్డారు. లంచాలు తీసుకోకుండా వుండలేకపోతున్నారు. లంచం తమ హక్కు అకునే స్ధాయికి దిగిజారిపోతున్నారు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము? జైలుకెళ్తాము..ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది వుందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదుతుందా? అనుకుంటున్నట్లున్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంత మంది తహసిల్ధార్లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు. విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు నాలుగురోజులైతే చెరిగిపోతాయి. విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ..లేకుంటే దొర..అంతే ఇక్కడ పెద్ద తేడాలేదు. తహసిల్ధార్లు అడిగింది ఇవ్వాల్సిందే..లేకుంటే జీవిత కాలం చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే..ఎమ్మార్వో కాళ్లునిత్యం మొక్కాల్సిందే..అయినా ఆఖరుకు ఎమ్మార్వోలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్ధితులు రాష్ట్రంలో వున్నాయంటేనే సిగ్గు చేటు. రోజుకు లక్షల రూపాయల్లో లంచాలు వస్తుంటే, వారి ఆగడాలకు అడ్డూ అదుపేముంటుంది. రైతుల బలహీనతలను ఆసరా చేసుకొని వారికి మేలు చేస్తామని స్దానిక నాయకులు చెబుతుంటారు. నిజానికి ఏ సమస్య వచ్చినా నేరుగా తహసిల్ధార్ వద్దకు వెళ్లొచ్చు. కాని ఇప్పటికీ అధికార యంత్రాంగం అంటే ప్రజలకు కూడా భయమే వుంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టడానికి సామాన్యుడు ముందూ వెనుక ఆలోచిస్తూనే వుంటాడు. తమ సమస్యచెప్పుకుందామని వెళ్లినా ముందుగా అటెండర్ల నుంచే చిన్న చూపు ఎదురౌతుంది. సార్ లేడంటూ..లేదంటే పక్కన నిలబడంటూ…రేపు రాపో అంటూ అటెండర్లే రైతులను, ఇతర పనులపై వచ్చిన ప్రజలను గద్దిస్తుంటారు. దాంతో ప్రజలకు తమ పనులకోసం ఆ గ్రామంలోవున్న నాయకులను తీసుకొని వెళ్తుంటారు. నాయకులు మధ్య వర్తిత్వం వహిస్తుంటారు. సంబంధిత అధికారులతో బేర సారాలు చేసుకుంటారు. అప్పుడుగాని ప్రజలకు మోక్షం దొరకదు. ఇలా నిత్యం డబ్బుల మూటలు అందుతుంటే అదికారులు మారమంటే ఎందుకు మారుతారు? లంచాలు తీసుకోవద్దంటే ఎందుకు ఊరుకుంటారు? పట్టుబడతామని ఎందుకు భయపడతారు? పట్టుబడినా ఫరవాలేదని చాలా మంది అదికారులు తెగించేశారు. మహా అయితే ఓ నాలుగు రోజులు జైలుకెళ్తారు. అక్కడ ఇతర క్రిమినల్స్ వుంటే ట్రీట్ మెంటు వుండదు. అందువల్ల జైలు జీవితం అంటే పెద్దగా భయం కూడా వుండడంలేదు. రోజూ సూట్‌కేసుల తూకం కళ్లముందు కనిపిస్తుంటే, పట్టుబడితే కదా? అన్న ఆలోచన తప్ప, భయం వుండడడం లేదు. ఒక వేళ పట్టుబడి సస్పెండ్ అయినా ఎలాంటి బాధ వుండదు. ఎందుకంటే ఇవ్వాల కాకపోయినా రేపు తన ఉద్యోగం తనకు వస్తుందన్న బలమైన నమ్మకం. ఆ సస్పెన్షన్ కాలంలో హాయిగా విందులు, వినోదాలు, విహారయాత్రలు, వ్యాపారాలు చూసుకుంటున్నారు. మొత్తానికి చాలా మంది ఉన్నతోద్యోగులు తెగిస్తున్నారు. అందుకే నిత్యం ఎక్కడో అక్కడ పట్టుబడుతున్నారు. అందులో కూడా నిస్సిగ్గుగానే వ్యవహరిస్తున్నారు.
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్.
జహీరాబాద్. నేటి ధాత్రి:
సోమవారం నాడు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదిలాపల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ నాయకులు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఏర్పడడంతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ట్రేడ్ యూనియన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్రం మానుకోవాలి
హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల డిమాండ్
జైపూర్,నేటి ధాత్రి:
పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం ప్రభుత్వం హరిస్తుందని హెచ్ఎంఎస్ కార్మిక నేతలు ఆరోపించారు.ట్రేడ్ యూనియన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సోమవారం హెచ్ఎంఎస్ కార్మిక నేతలు హెచ్చరింఛచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 20న దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడు లుగా కుదించిందన్నారు.గత మార్చి నెల 18 నాడు ఢిల్లీలో హెచ్ఎంఎస్ యూనియన్ తో సహా అన్ని జాతీయ కార్మిక సంఘాలు,అసంఘటిత కార్మిక సంఘాలు ఉమ్మడిగా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో సమ్మె చేయుటకు నిర్ణయించారని పేర్కొన్నారు.దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేశారు.సింగరేణిలో సమ్మె విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పనిచేసి, సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమై కార్మిక చట్టాలను కాపాడుకోవాలని కోరారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టడం మానుకోవాలని కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ కార్మిక నేతలు పాల్గొన్నారు.
కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన చిలువేరు సమ్మయ్య గౌడ్.
యువత పట్ల సమ్మి గౌడ్ సహాయ సహకారాలు ఆదర్శనీయం – డివైఎఫ్ఐ యువజన సంఘం
కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో సోమవారం డి వై ఎఫ్ ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమ్మి గౌడ్ మాట్లాడుతూ క్రీడలు మానవ జీవితంలో అంతర్భాగమని క్రీడలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకు సోపానాలని ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలలో పాల్గొనాలని పలికారు. అంతేకాదు క్రీడలతోనే ఉజ్వలమైన భవిష్యత్ ను పొందుతారని అన్నారు. క్రీడల వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా మానసిక శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చని, అదేవిధంగా డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘం వారు మాట్లాడుతూ క్రీడలు నిర్వహించాలని ఆలోచనతో సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మయ్య గౌడ్ వద్దకు వెళ్లి విషయం తెలిపిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి యువత చెడు దారి పట్టుతున్న ఈ రోజుల్లో మీలో ఇలాంటి ఆలోచనలు రావడం గర్వించదగ్గ విషయమని మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తున్న మీ కార్యక్రమాలకు నేను ఎల్లవేళలా అండగా ఉంటానని మాకు భరోసా కల్పించి మమ్మల్ని ముందుకు నడిచేలా ప్రోత్సహించి ప్రధమ బహుమతిగా రూ.10,116 లు అందజేస్తూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అండగా ఉంటానని భరోసా కల్పించి మా ఆహ్వానం మేరకు విచ్చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా ద్వితీయ బహుమతిగా డి.ఈ విజయ్ రూ. 5,015 రూపాయలను అందిస్తున్నారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, కొండేటి కళాధర్, గొడిషాల వెంకన్న, రాచర్ల రాములు, గొర్రె వెంకన్న గౌడ్, కాలేరు వెంకన్న, కందుకూరి దాస్, తీగల సునీత, మేన్పు పద్మ, వల్లాల రాజేందర్, వల్లాల శ్రవణ్, అనిల్, శాల్వా సుమన్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయాలను కాపాడుకోవడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ అభియాన్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ అభియాన్, కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు మాట్లాడారు. భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని, గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ..రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ..అప్రజాస్వామ్య పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ..గౌరవిస్తూ..పాలన చేయాల్సిన పాలకులు..నేడు తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారన్నారు. భారతదేశం మన కుటుంబమని, మనం అనే భావనే మన జాతీయత అని, జాతీయ భావనతో దృఢమైన సమాజాన్ని నిర్మించి, రాజ్యాంగం చూపిన మార్గంలో పయనిద్దామన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను, మన రాజ్యాంగాన్ని అవమానించే బిజెపి దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంట్ లో హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. జాతి ఐక్యత ముఖ్యమని మహాత్మా గాంధీ పేర్కొన్న మాటలను గుర్తు చేస్తూ..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించుకుందామన్నారు. మహాత్మ గాంధీ చూపిన బాటలో ముందుకు సాగాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ..మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలన్నారు.
ఎదురు గట్ల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి రావలసిందిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆహ్వానం
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో వైభవంగా నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను రావాల్సిందిగా కోరుతూ దేవస్థాన కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్, దేవస్థాన కమిటీ ఛైర్మెన్ సంపేట గంగరాజు, వైస్ చైర్మన్లు పొన్నం బాలయ్య, నరేడ్ల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కోడెం గంగాధర్, పొన్నం మల్లేశం సోయినేని రాజు పొన్నం నాగేందర్ అర్చకులు కార్తీక్, మకులభరణం శ్రీనివాస్ వంగపల్లి మల్లేశం బండ శ్రీనివాస్ సంఘ స్వామి పొన్నం రాజేశం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ ఎస్టిపిపి టౌన్షిప్లో కరాటే శిక్షణా కేంద్రం 2021లో దారవత్ పంతుల విజన్‌తో, డైరెక్టర్ మరియు జీఎం (ఎస్టిపిపి)ఆమోదంతో స్థాపించబడింది.ఈ శిక్షణా కేంద్రం ద్వారా ఎస్ సి సి ఎల్, పవర్ మెక్ మరియు సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగుల పిల్లలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢతతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ శిక్షణా కేంద్రం అభివృద్ధికి ప్రతిఫలంగా,2025 ఏప్రిల్ 6వ తేదీ,ఆదివారం జైపూర్ ఎస్టిపిపి ఓపెన్ ఆడిటోరియంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సింగరేణి జనరల్ మేనేజర్ కొండారెడ్డి శ్రీనివాసులు హాజరై టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బెల్ట్‌లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు.
Karate beltt.
ఈ సందర్భంగా జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన విద్యార్థిని జనని ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ ఘనత ఎస్టిపిపి కరాటే శిక్షణా కేంద్రానికి గర్వకారణంగా నిలిచింది.కరాటే కోచ్ శివ మహేష్ మాట్లాడుతూ… దారవత్ పంతుల ప్రోత్సాహం వల్లే ఈ కార్యక్రమం ఇవాళ ఈ స్థాయికి ఎదిగింది అని అన్నారు.జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీజీఎంలు దారవత్ పంతుల, రాజేష్, జెంట్స్టోరియో స్టైల్ చీఫ్ కోచ్ రాజనర్స్,జూల శ్రీనివాస్ మరియు కోచ్ శివ మహేష్ పాల్గొన్నారు.
మండలం నూతన ఎస్సైగా బండి రాజేష్ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై నిజాంపేట మండల కేంద్రానికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.