కుల గణన చేయడం చారిత్రాత్మక నిర్ణయం.

కుల గణన చేయడం చారిత్రాత్మక నిర్ణయం

బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ

శాయంపేట నేటిధాత్రి;

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల ప్రకారం రాబోయే జనాభా లెక్కల్లో ,కుల గణన చేర్చాలని తీసుకున్నా నిర్ణయం చారిత్రాత్మకమని ఈ నిర్ణయం తీసుకున్న శుభ తరుణంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇన్నేళ్లు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ ఏనాడు తీసుకొనటు వంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయ మని రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం గణన అనేది కేంద్ర జాబితాలోని 69 అంశం గా ఉందని, జనగణన కుల గణన బాధ్యత పూర్తిగా కేంద్ర పరిధిలోనిదే రాజకీయ దురుద్దేశంతోటే కావాలనే కొన్ని రాష్ట్రాల్లో తమకు అధికారం లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలు అశాస్త్రీయం గా సేకరించాయి ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూ డదు అన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని అంతేకాకుండా ఈ దేశాన్ని 70 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ కులగనానికి ఎప్పుడు వ్యతిరేకమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్వహిం చిన ఏ జనాభా గణనలో కూడా కులగణను కాంగ్రెస్ ప్రభుత్వాలు చేర్చలేదని 2010 అప్పటి ప్రధాన మంత్రి మన్మో హన్ సింగ్ కులగణన అంశాన్ని పరిశీలిస్తామని లోక్ సభకు హామీ ఇచ్చారు అంశంపై అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు అనుకూలంగా వారి అభిప్రా యాలు తెలిపిన కూడా కులగణన చేయలేదని ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటు న్నారని మన రాష్ట్రంలో సర్వేల పేరుతో కులగణన నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం సరైన లెక్కలను చూపెట్టక తప్పులతడకగా చూపెట్టడానికి ఇదొక నిదర్శనం అని ఇలాంటి సర్వేలతో కులగణన చేయడం వల్ల సమాజంలో సందేహాలు వస్తాయని ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని దేశంలోని సున్నితమైన సామా జిక నిర్మాణం రాజకీయల వల్ల చెడిపోకూడదని అంశంతో ఈ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు ఈ కులగణన వల్ల రేపు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగు తుందని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, సీనియర్ నాయకులు,బూర ఈశ్వరయ్య, భూతం తిరుపతి, కోమటి రాజశేఖర్, మేకల సుమ, బూత్ అధ్యక్షులు, కడారి చంద్రమౌళి, కన్నెబోయిన రమేష్, ఎర్ర తిరుపతిరెడ్డి, చిందం గణేష్, బత్తుల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు

అంకుష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్.!

అంకుష్, కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ బొల్లె పెల్లి వీరన్న

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన ఎండి అంకుష్ నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అనారోగ్య కారణాల వలన హాస్పటల్, లో చేరి శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు పోతుగల్లు గ్రామంలో అంకుష్ కుటుంబాన్ని కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుని ఆత్మ శాంతి చేకూర్చాలని పార్టీహదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన. మాజీ సర్పంచ్ బొల్లపల్లివీరన్న ఈ కార్యక్రమంలో, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు.

*కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలి.

*కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలి..

*అమాయక గిరిజనుల ప్రాణాలను కాపాడాలి..

*సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.వెంకటరత్నం డిమాండ్..

తిరుపతి(నేటి ధాత్రి) మే 02:

 

 

 

తెలంగాణ
చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలని సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం డిమాండ్ చేశారు. కగార్ ఆపరేషన్ ను నిరసిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి వెంకటరత్నం మాట్లాడుతూ మోది నాయకత్వంలో నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ కేంద్రం సాయుధ బలగాలను రంగంలో దింపి అడవులను జల్లెడ పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న అమాయక గిరిజనులు తూటాలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాల దాష్టికాన్ని తట్టుకోలేక గిరిజనులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ప్రకృతిని నమ్ముకుని నివసిస్తున్న అమాయకులను బలి తీసుకోవడం దుర్మార్గమైన చర్యని ఆయన మండిపడ్డారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో అటవీ ప్రాంతాల్లోని విలువైన ఖనిజ సంపాదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందని ఆయన ఆరోపించారు. తక్షణం కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.వెంకయ్య, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి.లోకేష్, పి ఓ డబ్ల్యు తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం.అరుణ అలాగే వెంకటేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

ఉచితంగా వైద్య శిబిరం.

ఉచితంగా వైద్య శిబిరం

నిజాంపేట ,నేటి ధాత్రి

 

 

నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయాలని ఉద్దేశంతో జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ ఉమెన్స్ చైల్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిజాంపేట మండలం నస్కల్ లో ఏర్పాటు చేశారు. నిజాంపేట, రామాయంపేట ఉమ్మడి మండల కు సంబంధించి ఆర్ఎంపి పి.ఎం.పి యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు. బిపి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి అలాగే ఉచిత మందులను అందించి ఆర్.ఎం.పి డాక్టర్లకు సిపిఆర్ గురించి వివరించారు.

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం.!

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 అందుకున్న డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి పెళ్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గిన్నారపు ఆదినారాయణపశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో భారతీయ భాషా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 కార్యక్రమంలో తెలుగు భాష నుండి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ లోహియా అవార్డును బహూకరించారు.భారతీయ భాషలు, సాహిత్యంలో కృషి చేసిన యువ పరిశోధకులు, రచయితలను సత్కరించే ఈ కార్యక్రమంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ సేవలను కొనియాడారు. ప్రొఫెసర్ అనురాధ లోహియా మాట్లాడుతూ, “ఈ యువ అవార్డు గ్రహీతలు భావి సమాజ చైతన్యానికి మార్గదర్శకులు. వీరి సాహిత్య కృషి భారతీయ భాషల సంరక్షణ, ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది,” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో భారతీయ భాషా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కుసుమ్ ఖేమాని, డైరెక్టర్ శ్రీ శంభునాథ్, ఉపాధ్యక్షులు ప్రదీప్ చోప్రా, సుశీల్ కాంతి తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (పార్ట్‌టైమ్)గా సేవలందిస్తున్నారు. కవిగా, రచయితగా గుర్తింపు పొందిన వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి దళిత ఆత్మకథలపై డాక్టరేట్, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంపై ఎం.ఫిల్ పూర్తిచేశారు. ‘నానీల సుగుంధం’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించిన ఆయన, యుజిసి కేర్ లిస్టెడ్ పరిశోధన పత్రికలతో పాటు దిన, మాస పత్రికల్లో అనేక వ్యాసాలు, కవితలు రాశారు.తెలుగు భాష, సాహిత్యంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయకమని, ఈ అవార్డు వారి పరిశోధన, సాహిత్య సేవలకు గుర్తింపు గా నిలుస్తుందని భారతీయ భాషా పరిషత్ పేర్కొంది.

ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం.

ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం

మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా సామల మధుసూదన్

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో గల ఎస్వీకేకే ఫంక్షన్ హాల్ ఘనంగా ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుపుకున్నారు. రాష్ట్ర,జిల్లా నాయకులు మాట్లాడుతూ పద్మశాలీల అంతా ఏకతాటిపై నడిచి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు రాజకీయ ప్రాధాన్య త గురి చేస్తూ భవిష్యత్తులో తమకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.సీట్ల కేటాయింపులో వెనుకబడి ఉన్న పద్మశాలీలకు రాజకీయంలోకి రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాలని అన్నారు. జియో టాకింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి చేనేత బీమా, చేనేత భరోసా పథకాలను అందించేలా ప్రభుత్వం దృష్టి చేయాల న్నారు చేనేత సంఘం పటిష్టం కోసం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

Congress party

 

మండల కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాbల అధ్యక్షులను ప్రధాన కార్యదర్శి కోశాధికారులను సమావేశంలో ఘనంగా సన్మానించారు.

బీసీ కుల గణన వెంటనే అమలు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కాంగ్రెస్ పార్టీ కులగణను చేపట్టి తర్వాత కేంద్రం దిగివచ్చి కుల గణన చేయడం హర్షణీయమని అన్నారు బీసీ కులదనులకు 150 మందికి ఒక వ్యక్తిని కేటాయించి వాడ వాడల పోస్టర్లు అతికించి ఒక తేదీ ప్రకటించి బీసీ కుల గణన 58.8% గా ఉందని నిర్ధారించారు.96% మంది కుల గణన చేయడానికి అవసరమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేసి బీసీ లకు చట్టబద్ధత చేయడం జరుగుతుంది. 2029లో బీసీ కుల గణన చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఉపయోగిస్తారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర,జిల్లా, మండల, గ్రామలలో ఉన్న పద్మశాలం దరూ పాల్గొన్నారు

పంట నష్టపోయిన రైతులకు.!

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25000/- నష్ట పరిహారం అందించాలి –

మాజీ పి ఎ సి ఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

మిల్లర్లు రైతులకు సహకరించాలి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలంలో అకాల వర్షం కారణంగా మండలంలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని , పంట చేతికచ్చే సమయానికి రైతులపై పకృతి విలయతాండవం చేసిందని, రెండు రోజులుగా కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఇ పరిస్థితులను విపత్తుగా పరిగణలోకి తీసుకొని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 25000/- అందించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధికారులు, జిల్లా మంత్రి చొరవ తీసుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు
మిల్లర్లు రైతులకు సహకరించాలని, సివిల్ సప్లై అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు భరోసా కల్పించాలని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.

అకాల వర్షాల వల్ల కౌలు రైతుల ఆవేదన .

అకాల వర్షాల వల్ల కౌలు రైతుల ఆవేదన

ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికి అంది వచ్చిన పంట పొలాలు నీట మునిగి కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గణపురం మండలానికి చెందిన కౌలు రైతు గుర్రం తిరుపతి గౌడ్ అనే రైతు 10 ఎకరాల లో వరి పంట సాగు చేయడం జరిగింది మొన్న కురిసిన అకాల వర్షం కారణంగా వరి పంట మొత్తం నీట మునిగి నష్టం వాటిల్లిందని కౌలు రైతు ఆవేదన వ్యక్తం తెలిపాడు
కౌలు రైతులు పంట పొలాలకు ఎంతో పెట్టుబడింది పెట్టి కష్టపడి పండిస్తున్న పంట చేతికి వచ్చే. సమయానికి అకాల వర్షం వల్ల నష్టాలు జరిగే కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి చేతికి అందక అప్పుల పాలు అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు గానీ కౌలు రైతులను ఆదుకోవాలి అని తెలిపారు

కులగనన నిర్ణయం చరిత్రత్మకం.

కులగనన నిర్ణయం చరిత్రత్మకం

మున్నూరుకాపు సంఘము మండల అధ్యక్షులు దీపక్ పటేల్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రం లో మాట్లాడుతూ కులగనన నిర్వహించడం చరిత్రలో మిగిలి పోయే నిర్ణయం అని దీపక్ పటేల్ అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంవత్సరాల కలను నిజం చేసి భారతదేశ వ్యాప్తంగా కులగనన చేయడం శుభపరిణామం అని కానియాడారు బీసీ లు ఇకనైనా ఆర్థికంగా, రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలపునిచ్చారు ఈకార్యక్రమంలో గండు రమేష్ పటేల్ జంగిలి శ్రీనివాస్ పటేల్ బోట్ల శ్రీనివాస్ పటేల్ మండల మున్నూరుకాపు సంఘము సభ్యులు పాల్గొన్నారు.

కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు.

కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి గొప్ప సంఘ సేవకులు , విద్యాదాత, మతసామరస్యం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని ప్రతి మనిషికి చదువు తప్పక అవసరమని పేద విద్యార్థుల కోసం ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతిగృహాలకు, డబ్బులు దానం చేసిన గొప్పదాత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో రెడ్డి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా రెడ్డి హాస్టల్ ని నెలకొల్పిన వ్యక్తి బహదూర్ వెంకట రామిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగు మామిడి కృష్ణారెడ్డి ఎడుమల,హనుమంత రెడ్డి,వేసి రెడ్డి రామిరెడ్డి, కుంబాల మల్లారెడ్డి,కంది భాస్కర్ రెడ్డి, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన.

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించినందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ ర్యాంకులు,గ్రేడ్లు ప్రాముఖ్యత కాకుండా ఆవరేజ్ విద్యార్థులను తీసుకొని అందరినీ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్న శ్రీ కృష్ణవేణి హై స్కూల్ ఉపాధ్యాయులు యాజమాన్యం ప్రతి సంవత్సరం నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నారు.భవిష్యత్తులో విద్యార్థులు విద్యావంతులు కావడానికి వారే స్వయం నిర్ణయాన్ని తీసుకోవాలని అనేక రంగాలలో ప్రవేశించడానికి( ఐటిఐ, పాలిటెక్నిక్,డిప్లమా కోర్సులు, ఇంటర్మీడియట్) తదితర కోర్సులలో ప్రవేశించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని,ఎవరిని బలవంతం పెట్టకుండా భవిష్యత్తులో మంచి మార్గం ఎన్నుకోవడానికి విద్యార్థులను కృషి చేయాలని కోరారు.

అకాల వర్షానికి కూలిన ఇండ్లు బాధితులకు భరోసా కల్పించిన.

అకాల వర్షానికి కూలిన ఇండ్లు
బాధితులకు భరోసా కల్పించిన బీఆర్ఎస్ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామ పంచాయతీలోని గోపాల్ పూర్,శివ్వారం గ్రామాలలో గురువారం రాత్రి వీచిన గాలివానకు ఇండ్లు పూర్తిగా దెబ్బతిని,పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసం అయి పలు కుటుంబాలకు నిలువ నీడ లేకుండా మారిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో నష్టపోయిన బాధితులను పరామర్శించి,ఆర్థిక సాయం అందించి,బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

భ‌గాయ‌త్‌లో పారిశుద్ధ్యానికి పెద్ద‌పీట‌.

భ‌గాయ‌త్‌లో పారిశుద్ధ్యానికి పెద్ద‌పీట‌

కార్మికుల నియామ‌కానికి రంగం సిద్ధం

వీధి దీపాల నిర్వహణకు ప్రత్యేక ఫోకస్

కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌త్యేక చొర‌వ‌

ఉప్ప‌ల్ నేటిధాత్రి 02

 

 

 

 

ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన‌ట్టుగా ఉప్పల్ వార్డు ఆఫీస్ లో జిహెచ్ ఎం సి అధికారులు మరియు ఉప్పల్ హెచ్ఎండిఏ బాగాయత్ రెసిడెన్షల్ వెల్ఫర్ అసోసియేషన్ సభ్యుల సామావేశం లో కార్పొరేటర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. సిబ్బంది నియామ‌కం, డ‌స్ట్ బిన్‌ల ఏర్పాటు వంటి అంశాల‌కు త్వ‌ర‌లోనే శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో అధికారులు, సిబ్బంది కూడా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సూచించారు.

ఉప్ప‌ల్ స‌ర్కిల్‌లోన పారిశుద్ధ్య విభాగం, వీధి దీపాల నిర్వహణకు విద్యుత్ శాఖ అధికారుల‌తో కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పారిశుద్ధ్య సిబ్బంది నియామ‌క ప్ర‌క్రియ తుది ద‌శ‌లో ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. మొద‌టి విడ‌త‌లోనే భ‌గాయ‌త్‌లో పారిశుద్ధ్యం కోసం 25 మంది సిబ్బందిని నియ‌మించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామ‌న్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌న్నారు. రెండో విడ‌త‌లో ఇంకా కావాల్సిన పారిశుద్ధ్య కార్మికుల నియామ‌కం జ‌రుగుతుంద‌న్నారు.

 

 

 

 

Sanitation.

భ‌గాయ‌త్‌లోని వీధుల్లో చెత్త వేయ‌కుండా కూడా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టుగా రజితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి చెప్పారు. భ‌గాయ‌త్‌లోని అన్ని వీధుల్లో చెత్త డ‌బ్బాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టుగా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను కూడా సిద్ధం చేశామ‌న్నారు.

వీధి దీపాల నిర్వహణపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా రజితాపరమేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే భగాయత్ లో వీధి దీపాల ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఏఎంహెచ్ ఓ రంజిత్ ,జి హెచ్ ఎంసీ ఎలక్ట్రికల్ డిఈ రవీందర్, ఏ ఈ టి ఆర్ ప్రసాద్ ,ఉప్పల్ హెచ్ ఎం డి ఎ బాగాయత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రావు గారు సుధాకర్ రెడ్డి ,వంశీ దార్ రెడ్డి ,ఈగ సంతోష్,లింగంపల్లి రామకృష్ణ,చిరంజీవి రెడ్డి ,మహేష్,నరేంద్ర చౌదరి ,మనోహర్ రెడ్డి ,అంజి రెడ్డి ,శివ ప్రసాద్ శుభన్ రెడ్డి సామ్ జంగయ్య పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధం.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధం ..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి సుమారు 3500 వరకు మంజూరి అయినవి ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంతకు ముందు ప్రభుత్వం నుండి లబ్దిపొందిన వారు కాకుండా, ఇల్లు లేని వారికి,స్వంత ప్లాటు ఉండి ఇల్లు కట్టే స్థోమత లేని వారికి,దివ్యాoగులకు,ఒంటరి మహిళలకు,వితంతువులకు,అనాదలకు,పాకిపని వారికి,మొదటి ప్రాధాన్యత ఇచ్చి గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది కానీ ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జరిగిన తీరును పరిశీలిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు ఉన్న వారికి,ఇంతకు ముందు లబ్దిపొందిన వారికి కేటాయించినట్లు తెలుస్తున్నది. ఈ ఇండ్లకు ప్రభుత్వం ఇచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే దానికి అధికారులు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టాలని నిర్బంధం చేస్తున్నారు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టితే 2రేట్లు అధిక వ్యయం అయ్యే అవకాశం ఉంది మిగతా డబ్బులు వారు ఎక్కడి నుండి తేవాలి వారు ముందే బీదవారు ఇల్లు కట్టలేని పస్థితిలో ఉన్నప్పుడు ఈ అధిక వ్యయం ఎక్కడినుండి తేవాలి అదనపు భారం కొరకు తప్పని సరి అప్పులు చేయాల్సిన పరిస్థితి అంటే ఇండ్లు పొందిన వారు అప్పుల పాలు కావల్సిందేన కాబట్టి ప్రభుత్వం,అధికారులు కేవలం నాయకులు చెప్పిన వారికి కాకుండా నిబంధనల ప్రకారం అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని,మరియు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు సరిపడే విధంగా ఇంటి ప్లాన్ కుదించాలని,ఆపై ఇల్లు కట్టు కుంటే లబ్ధిదారుల ఇష్టానికి వదలాలని డిమాండ్.ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్శింలు,యస్.గోపాల్,పాల్గొన్నారు.

విధి నిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి.

విధి నిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి జైపూర్ మండలంలోని ఇందారం,టేకుమట్ల, కిష్టాపూర్,వేలాల గ్రామపంచాయతీలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఎక్కడ ఉండకూడదని,క్రమం తప్పకుండా డ్రై వేస్ట్ కలెక్షన్ చేయాలని,డ్రైనేజీలలో పూర్తిస్థాయిలో మట్టి తీయాలని,క్రమం తప్పకుండా రికార్డులను అప్డేట్ చేయాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది. గనుక ముందస్తుగా గ్రామంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని,అదేవిధంగా నీటిని పంపిణీ చేసే ప్రతిసారి బ్లీచింగ్ పౌడర్ కలపాలని,క్రమం తప్పకుండా నీటిని పరీక్షించాలని,వేస్ట్ కలెక్షన్ రిజిస్టర్,కంపోస్ట్ కంజుమ్షన్ రిజిస్టర్ నిర్వహించాలని,క్యాష్ ఇన్ హ్యాండ్ త్వరగా గ్రామపంచాయతీ సాధారణ నిధికి జమ చేయాలని,విధి నిర్వహణలో ప్రతిక్షణం చాలా అప్రమత్తంగా ఉండాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గురువారం రాత్రి సంభవించిన గాలి దుమారానికి ఎగిరిపోయిన నర్సరీ షేడ్ నెట్ ను సరిచేయాలని,చలివేంద్రంలో వాటర్ క్రమం తప్పకుండా నింపాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,పంచాయితీ కార్యదర్శులు ఏ.సుమన్,ఆర్. శ్రావణి,ఎల్.ప్రశాంత్,రాకేష్ గ్రామపంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో

➡ *₹ 8,02,000/- సీఎం సహయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, ఝరాసంగం, మొగుడంపల్లి,జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం సహయనిధి చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు గారు, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు హుగేల్లి రాములు, వెంకట్ రెడ్డి,అడ్వొకేట్ వాజహత్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ గారు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి డా౹౹ఏ. చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
లబ్ధిదారుల వివరాలు:-పసుల. వెంకట్ – 60,000
మనియర్పల్లి ఆర్య మల్లికార్జున్ – 60,000 నాగిరెడ్డిపల్లి బోయ. నరేష్ – 60,000 గొట్టిగరపల్లి నాగేల్లి. సమ్మయ్య – 42,500 బిలాల్ పూర్ యండి. ఖాద్రి – 27,500 జహీరాబాద్ పట్టణం గౌరిహ.బేగం -37,500 జహీరాబాద్ పట్టణం.మహమ్మద్. ఖాలీల్ – 50,000
జహీరాబాద్ పట్టణం గౌష్. బేగం – 50,000
మల్చేల్మా బానోత్.వారురాన్ – 45,000 అర్జున్ నాయక్ తండా బ్రాహ్మణ తనియా – 60,000 వైసత్వార్
రుకితమ్మ – 58,000 గుడ్పల్లి ఆగమాయ్య – 45,000
టేకుర్ బిరాదర్.అప్పారావు – 49,000 న్యాయంతాబాద్
రబియా. బేగం – 60,000 జహీరాబాద్ మోహన్ రెడ్డి – 60,000 చిల్కాపల్లి గంగామని – 37,500 హమాలి కాలనీ- జహీరాబాద్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కంకణాల లక్ష్మీపతి రమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర రావు మధుప్రియల వివాహా మహోత్సవ వేడుక(అన్విత గార్డెన్స్ కరీంనగర్) లో జరగగా ఆవేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈవివాహ మహోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఎల్లా జగన్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, శనిగారపు అనిల్ కుమార్, తదితరనాయకులు పాల్గొన్నారు.

ఎస్ఎస్ఎస్సి 2025 ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం .

ఎస్ఎస్ఎస్సి 2025 ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రభుత్వం ప్రకటించిన పదవి తరగతి పలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అక్షర హై స్కూల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈవిద్యా సంవత్సరం కూడా కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా అత్యుత్తమ ఫలితాలను సాధించారని కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర హై స్కూల్ లో 95 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 500 పైగా మార్కులు 63 మంది విద్యార్థులు సాధించారు. 550కిపైగా 22 మంది విద్యార్థులు సాదించారు. అత్యధిక మార్కులు సాధించిన జి.మనస్విని 568, టి.తేజ 562, ఈ.సాక్షిత 560, కే.మమత 559, ఎల్.కార్తీక్ 558, విద్యార్థులను కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ విద్యార్థులను పుష్పగుచ్చములతో అభినందించిన అనంతరం మునిందర్ మాట్లాడుతూ 500 పైన మార్కులు జిల్లా స్థాయిలో ఎక్కువ మంది అక్షర విద్యార్థులే సాధించడం గొప్ప విజయమని విద్యార్థులను కొనియాడారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్ మినుకుల రాధ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గాలివానకు దెబ్బతిన్న వరి,మామిడి,మిర్చి ఇతర నేలకొరిగిన పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే రైతుల పక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వం అని,ప్రజలు అధైర్య పడొద్దని,ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.

ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్ల పల్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపెళ్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేయడంజరిగింది. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపెళ్లి యుగంధర్ రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడం మూలంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని వారు విమర్శించారు. ఉపాధి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఏప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని వారు అన్నారు. పాలకులు ఎంతసేపటికీ ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలపైనే ఆధారపడటం ద్వారా దేశ ఆర్థిక సమతుల్యత సాధ్యం కాదని వారు అన్నారు. ఈ చర్యల మూలంగా దేశంలో గత పది సంవత్సరాలుగా వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సైన్యం పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే 2025 మే 15-18వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరగనున్నాయని, ఈమహాసభలలో ప్రధానంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు, తీర్మానాల ద్వారా నిర్ణయాలు ఉంటాయని, ఈజాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుండి సుమారు ఎనిమిది వందల మంది డెలిగేషన్ నాయకత్వం పాల్గొంటారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎనభై మంది డెలిగేషన్ పాల్గొంటున్నట్లు, మే15న తిరుపతిలో జరగనున్న మహాసభల ర్యాలీ, బహిరంగ సభకు వెయ్యి మంది పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.
ఈపోస్టర్ ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వెంకటేష్, చిన్న సదాశివ్, అవినాష్, రమేష్ , దామోదర్, అఖిల్, మురళి, భాస్కర్, రవి, రమేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version