శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి ఉత్సవాలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత సమేత జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణం,శిఖర పూజ, కార్యక్రమాలు నిర్వహించారు ఇట్టి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు
Mata Jayanti celebrations.
శ్రీ చంద్రశేఖర శివచార్య మహాస్వామి బెమల్ ఖేడ్, బసవలింగ అవధూత గిరి మహరాజ్ , మాతృశ్రీ మఠం శివలీలమ్మ, రాచయ్య స్వామి, కేతకీ టెంపుల్ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్, సిద్దయ్య స్వామి, నాగరాజ్ పటేల్,లింగం గౌడ్ , ఈశ్వరప్ప పాటిల్, తదితర భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని వారందరికీ లేబర్ శాఖ ద్వారా సంక్షేమ పథకాలు అందజేయాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.ఐస్ క్రీమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ అధ్యక్షుడు కొమురయ్య అధ్యక్షతన జరిగింది. గోనె యువరాజు మాట్లాడుతూ దేశంలో నాలుగున్నర కోట్ల మంది కార్మికులు రోజువారీగా పనులు చేసుకుంటూ కార్మిక చట్టాల అమలుకు దూరంగా ఉంటున్నారని వారందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే పార్లమెంటులో సమగ్ర బిల్లు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా చట్ట సవరణలు చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 20న దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులు సమ్మె చేయబోతున్నారని ఆ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షులుగా చెరుపల్లి కొమరయ్య, కార్యదర్శిగా ఎండి అజీమ్, ఉపాధ్యక్షులుగా సలేంద్ర చేరాలు, కోశాధికారిగా గుండు స్వామి, కమిటీ సభ్యులుగా అన్నే బోయిన రాజు, జి సారయ్య,రాజు, మహేందర్ ,నరసయ్య ,శ్రీను బద్రు, పాషా ఎన్నికైనారు.
పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగినది. పహాల్గంలోని టెర్రరిస్టులు అమాయక హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని భారత దేశంలో ఉన్న పాకిస్థానీయులందరినీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నేడు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా
BJP district president
అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ ఝా కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ దుమాల శ్రీకాంత్,జిల్లా కార్యదర్శి శ్రీ గొప్పాడి సురేందర్ రావు, ఒబిసి మోర్చా అధ్యక్షుడు శ్రీ నంద్యాడపు వెంకటేష్, మరియు మాజీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు శ్రీ పొన్నాల తిరుపతి రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీ నాగుల శ్రీనివాస్ మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు మరియు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన గోవిందు పుష్ప అనే నిరుపేద మహిళ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. కాగా కడు నిరుపేదలైన మృతురాలి కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు, కర్మకాండల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గీసుకొండ గ్రామానికి ఆమె బంధువులు, గీసుకొండ గ్రామ శ్రీమంతుడు, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణకు తెలిపి సహాయం కోరారు.కాగా మానవత్వంతో స్పందించిన లక్ష్మీనారాయణ వెంటనే రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ నగదును ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, మృతురాలి బంధువులు ఇనుముల ప్రభాకర్, కోట అయిలయ్య, అశోక్, రాజు, బరిగెల యాకూబ్ కలిసి మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈకార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.
సరస్వతి శిశు మందిర్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ :పట్టణ పరిధిలోని సరస్వతి శిశు మందిర్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ్లనం ను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు, చదువొక్కటేనా.. విద్యతో పాటు బుద్ధులు బుద్ధులతో పాటు విలువలు.. క్రమశిక్షణా కట్టుబడి దేశభక్తి జాతీయభావనను నరనరమున నింపి… వినయవిధేయతలు,ధర్మనిష్టా సత్సాంప్రదాయ సదాచారాలు కణకణమున అలవర్చిన మన బడి…బడి కాదు అది వ్యక్తిత్వ నిర్మాణ ధర్మక్షేత్రం సమాజ నిర్మాణ కార్య క్షేత్రం మనందరిలో ఏకాత్మతా భావనను నింపిన దైవ క్షేత్రం..బడి కాదు అది బ్రతుకు నేర్పిన అమ్మ ఒడి..మన శిశు మందిర్ గుడి..!ఆ దైవ క్షేత్రం..ఆ ధర్మక్షేత్రం..ఆ కార్య క్షేత్రం..స్మరిస్తూ శారదామాతా ఒడిలో స్నేహాతులు కలుసుకుని వాళ్ళ బాల్యపు మధుర స్మృతులను,మరపురాని అనుభవాలను వారి ఆచార్యులతో పంచుకున్న విద్యార్థులు మన పాఠశాల 2000-2001 బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత బాల్య మిత్రులు అంతా ఒక్కటిగాఏర్పడి చిన్న నాటి మధుర జ్ఞాపకాలను అందరితో కలసి పంచుకున్నారు. పాఠశాలలో దాదాపు 4 లక్షల వ్యయంతో 2 తరగతి గదులను మరియు రేలింగ్ వేయించి ఆధునీకరించడం జరిగిందని పాఠశాల అధ్యక్షులు సాయి రెడ్డి విఠల్ రెడ్డి అన్నారు,పాఠశాల తిరిగి పునర్ వైభవం లోకి రావడానికి పూర్వవిద్యార్థులు,పూర్వ ఆచార్యులు అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు వారందరినీ అభినందించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు గోకుల కృష్ణయ్య ,పూర్వ ఆచార్యులు మరియు పూర్వ విద్యార్ధి పరిషత్ సభ్యులు గిరీష్,మహేష్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా జనగణన,కులగణన చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ అధ్యక్షులు గూడూరు సందీప్, పట్టణ నాయకులతో కలిసి పట్టణంలోని వరంగల్ రోడ్ సర్కిల్ లో గల అమరవీరుల స్థూపం దగ్గర ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శిని,కులగణనతో అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం అని అధ్యక్షులు గూడూరు సందీప్ పేర్కొన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని తలపెట్టిన జనగణనతో పాటు కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ (చిన్న),జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శలు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, ఠాకూర్ విజయ్ సింగ్, కార్యదర్శులు చేను నరేష్, సామల ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు పొనుగోటి రవీంద్ర చారి, దుగ్యాల సమ్మయ్య, ఠాకూర్ శివాంజన్ సింగ్, నూనె రంజిత్, రూరల్ నాయకులు బట్టు మదన్, తాళ్లపల్లి రాము, బూసాని సుదర్శన్, యువ మోర్చా జిల్లా ప్రధాన
కార్యదర్శి అచ్చ దయాకర్ ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, శ్రీనివాస్, కార్యదర్శి చిలువేరు అన్వేష్, నర్సంపేట యువ మోర్చా అధ్యక్షులు తప్పెట్ల సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
*గృహ అవసరాలతో పాటు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం…
*రూ. 60 లక్షలతో ఏర్పాటు చేసిన 100 కేవి ట్రాన్స్ ఫార్మర్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్..
గంగవరం(నేటి ధాత్రి) మే05:
గంగవరం మండలంలోని కీలపట్ల పంచాయతీ పరిధిలో విద్యుత్ సమస్య శాశ్వతంగా పరిష్కారానికి నోచుకుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. కీలపట్లలోని కోనేటి రాయస్వామి ఆలయంలో స్వామి వారిని ఆదివారం ఆయన దర్శించుకుని పంచాయతీ కేంద్రంలో రూ.60 లక్షల ఆర్డీఎస్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన నాలుగు 100 కేవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల తో పాటు విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కీలపట్ల గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్బంగా చేపట్టే ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో విద్యుత్ తీగల కారణంగా ఇబ్బందులు ఉండేవన్నారు. గ్రామస్తులు మరియు భక్తుల శ్రేయస్సు దృష్ట్యా 60 లక్షలతో గ్రామంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుతోపాటు 100కేవి ట్రాన్స్ ఫా ర్మర్లను మరియు సమస్య అనేదే ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అదనంగా 25 కేవి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ను సైతం ఏర్పాటు చేశామన్నారు. దీంతో అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండడమే కాకుండా లో ఓల్టేజి సమస్య అనే మాటే ఉండదన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజల అవసరాలకే గాక 24 గంటలు త్రీఫేస్ విద్యుత్ ను వాడుకోనేందుకు వీలుందన్నారు. దాంతో పాటు పంచాయతీ పరిధిలో చిన్న పరిశ్రమలను సైతం ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. అతి తక్కువ సమయంలో ఆర్డీఎస్ కాంట్రాక్టర్ లు మరియు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులను పూర్తి చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. కీలపట్ల పంచాయతీ పరిధిలో ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకోవడం, రోడ్లు,గృహాలు, విద్యుత్, తాగునీరు, పాఠశాలలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి గా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఈఈ శ్రీనివాస మూర్తి, ఏడి చిన్నబ్బ, కన్స్ట్రక్షన్ ఏడి రెడ్డి కుమార్, ఏఈ రామక్రిష్ణ, మరియు టీడీపీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ చంద్ర శేఖర్, వేణు, గిరిధర్ గోపాల్, రాము,శీనప్ప, శ్రీనివాసులు, జనసేన నాయకులు చంద్ర తదితరులున్నారు..
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు చింతల రమణారెడ్డి ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం మరణించాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆకస్మిక మరణానికి చింతిస్తూ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మృత దేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గండ్ర వెంకటరమ ణారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు మండ ల కేంద్రంలో భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానా యకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డిమరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
Gangula Manohar Reddy.
అనంతరం గవర్న మెంట్ హాస్పిటల్ కి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆయురా రోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.
Gangula Manohar Reddy.
ఈ కార్యక్ర మంలో మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మా రెడ్డి, మండల సోషల్ మీడి యా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, పసుల ప్రవీణ్, చిలుకయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, మాజీ సర్పంచులు వలపదాస్ చంద్రమౌళి, బొమ్మ కంటి సాంబయ్య, రఘుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లినందం, గడిపే విజయ్, ధైనంపల్లిసుమన్, పోతురమణారెడ్డి సావుళ్ళ కిష్టయ్య, నర్రరాజు, ఆకుల లక్ష్మణ్, కల్వాలశ్యామాజీ, అట్లతిరుపతి, రంగుమహేం దర్,కొమ్ముల రాకేష్,కరుణ్ బాబు, పైండ్లభానుచందర్, పైండ్లశంకర్, ఫైండ్లశ్రీనివాస్, కోగీలరవికిరణ్, కుతాటి రమేష్, మామిడి శంకర్, ప్రశాంత్, ఆదిరెడ్డి, నారాయణ రెడ్డి, రామరాజు, రమేష్ , మొగిలి,సుభాష్, వైద్యుల సాం బరెడ్డి, మస్కే సుమన్ , నాగరాజు ,దేవయ్య,రేణికుం ట్ల సంతోష్ ,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలో కొప్పుల గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్న ఎస్ఎస్ సి పూర్వ విద్యార్థులు 2000-2001 బ్యాచ్ విద్యార్థులు అందరు కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ను లలిత కన్వెన్షన్ హాల్ పరకాలలో జరుపుకోవ డం జరిగింది ఇట్టి సమావేశా నికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు రవీందర్ ముక్తవరం శ్రీనివాసచారి, రేగులమొగిలి, వేములపల్లి మొగిలి,అడిదల మోహన్ రెడ్డి పసునూటి సంపత్, ఆడెపు ఆనంద్,అల్వాల శ్రీధర్, కల్లెపూ సమ్మయ్య , ఆనాటి విద్యా కమిటీ చైర్మన్ అయిన తడక చంద్రమౌళి గౌడ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన డం జరిగిందిఉపాధ్యాయులం దరూ మాట్లాడుతూ మీలాంటి ఇంత మంచి బ్యాచ్ ని సమావేశం ఏర్పరచుకొని ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ 50 ఒకే చోట చేరి ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ తరగతి గదిలో జరిగే ప్రతీది గుర్తు చేసుకుంటూ ఉపాధ్యా యులకు విద్యార్థుల మధ్య జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతి ఒక్క విద్యార్థి మంచి స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు దీవించడం జరిగింది ఈ కార్యక్రమంలో బండి రాజు, సామల శ్రీనివాస్, ఆకుతోట తిరుపతి, రాంపల్లి రాము, మరియు ఆలువాల హేమలత తదితరులు పాల్గొన్నారు
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షులుగా.. మండలంలోని సూరారం గ్రామపంచాయతీ శంకరాయపల్లి తండాకు చెందిన పాత్లావత్ గోపాల్ నాయక్ సోమవారం నియామకమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలుపొందేందుకు కృషి చేస్తానన్నారు. మండల అధ్యక్షుడుగా నియమించినందుకు ఎంపీ డీకే అరుణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గోపాల్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు.
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.
నాగర్ కర్నూల్/నేటి దాత్రి:
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.
నాగర్ కర్నూల్/నేటి దాత్రి:
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద నుండి వేగవంతంగా మిల్లులకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు.ఇటీవల అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, మార్కెట్‌లో అధికారులు, రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల ప్రభావం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వర్షం వలన తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, పాడి క్లీనర్ ద్వారా శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Grain
ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ధాన్యం నాణ్యత, రైతుల అవసరాలు, డబ్బు చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించారు. ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలని అధికారుల కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాలలో ప్యాడి క్లీనర్ లు, గన్ని బ్యాగులు, తాగునీరును అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటనే జరిగేలా అవసరమైన హమాలీలను సమకూర్చుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ,జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య,జిల్లా మేనేజర్ సంధ్యారాణి,ఆర్డీఓ ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్,కార్యదర్శి జి.రెడ్డి, తహసీల్దార్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్
సీఐ లోడిగా రవీందర్,ఎస్సై సైదా రహూఫ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల ఎస్సై రహుఫ్ తమ సిబ్బందితో కలిసి సోమవారం పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు పాయం రాజేందర్ నడిమిగూడెం,ఆళ్లపల్లి మండలం కల్తీ పాపయ్య (అలియాస్ సర్పంచ్) ఘణపురం గ్రామం,గుండాల మండలం అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారు. కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చాడు.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయాడు వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల,ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.సోమవారం వీరిద్దరిని గుండాల పోలీస్లు అరెస్ట్ చేశారు.వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డిఎస్పి చంద్రభాను తెలిపారు.ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు.వీరిని పట్టుకోవటం లో కృషి చేసిన గుండాల సిఐ లోడిగ రవీందర్,ఎస్ఐ సైదా రహుఫ్, పిసి వెంకటేశ్వర్లు ను డిఎస్పి అభినందించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం కార్యాలయం స్థల దాతలు పోలెబోయిన కుటుంబస్తులు ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు, అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయితీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలో గల గ్రామలలో ప్రభుత్వం ప్రారంభించిన గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేసారు అలాగే పంచాయతీలలో నీటి సరఫరా గురుంచి, కరెంటు సమస్యల గురుంచి, ఇరిగేషన్, విద్య, వైద్యం,అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వారం లోగ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనీ అదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు అర్హులయినా ప్రతీ ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని తెలియజేశారు అలాగే ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత తనై చూసుకుంటానని అని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వినతి పత్రాలు అందజేశారు.
ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుసేన్ , మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి,, మండల నాయకులు ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో.బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్ ఎన్నుకున్నారు. అభివృద్ధి ప్రదాత ప్రజల సంక్షేమం కోసం భూపాలపల్లి మాజీశాసనస భ్యులుగండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షు రాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో దాసి శ్రావణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా, ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాజీ జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి మండల నాయకులు గంగుల మనోహర్ రెడ్డి మెతుకు తిరుపతి రెడ్డి రామ్ శెట్టి లక్ష్మారెడ్డి మాజీ ఎంపిటిసి మాజీ సర్పంచ్ లకు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి లకు, ఉపాధ్యక్షులకు బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు, యూ త్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కథలాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10 వ తరగతి చదివిన 1999-2000 సంవత్సరనికి చెందిన విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత మండల కేంద్రంలో నీ SRR ఫంక్షన్ హాల్ లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలన్నిటిని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు,ఉపాధ్యాయులు భూమా చారి, అఖిల్ అహ్మద్, శ్రీనివాస్, అంజయ్య, రాజయ్య పాల్గొన్నారు.
జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన మహమ్మద్ కరీం కూతురు నూరిన్ ఫాతిమా లా విద్యాలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. HYDలో లా పూర్తి చేసిన ఫాతిమా మూడు రోజులపాటు HYDలోని సుల్తాన్ ఉల్ ఉలమ్ కాలేజ్ ఆఫ్ లాలో హార్మనీ ఇన్ డిస్ప్యూట్స్ అనే అంశంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నాగేశ్వరరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.
స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం బయటకు వస్తుండగా ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధమ్మ (56)ను గుర్తించిన సమీప స్థానికులు వెను వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన సిద్ధమ్మకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరి కుమారుడు సంజీవ్ కుమార్ (31) ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్పై చెల్లా రాజశేఖర్ కేసు నమోదు చేసి. శివ పంచనామ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.