శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 7 న జయంతి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు . ఉదయం 6 గంటలకు అమ్మవారి పల్లకి సేవ 6:45 నిమిషాలకు గణపతి పూజ 8 గంటల కు వాసవి మాత మూలవిరాట్ ఉత్సవమూర్తికి అభిషేకం అలంకారం 12 గంటలకు అమ్మవారికి ఒ డిబియ్యం మహోత్సవం మధ్యాహ్నం 1 గంటకు తీర్థి ప్రసాదాలు భోజనాలు సాయంత్రం 6 గంటలకు కలశం ఉత్సవమూర్తి ఊరేగింపు రాత్రి 8 గంటలకు ఉద్వాసన 9 గంటలకు దేవతమూర్తుల పుష్పాక్ష తలతో ఆశీర్వచనం ఉంటుందని వారు పేర్కొన్నారు వనపర్తి లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలో ఆర్యవైశ్య సంఘాలు రైస్ మిల్లర్స్ కిరాణా షాప్ యజమానులు ఏజెన్సీ వారు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వాసవి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు ఆత్మకూర్ కొత్తకోట పెబ్బేర్ ఇతర ప్రాంతాలలో కిరాణా షాపులు రైస్ మిల్లర్స్ బందు పాటించి పూజలో పాల్గొంటారని ఇదే సాంప్రదాయం వనపర్తి లో కిరాణం షాప్ లు రైస్ మిల్లర్స్ ఏజెన్సీ నిర్వాహకులు కొద్దిసేపు బందు పాటించి పూజలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని బచ్చు వెంకటేష్ ప్రచార కార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి కోరారు

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ.

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ

మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ గారు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు,పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ కార్మిక సంఘాలు,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు,స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు ఇచ్చాయని లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం కష్టతరం అవుతుందని, కార్మికుల సమష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం కాపాడుతుందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత,ఉపాధి భద్రత దూరమవడమే కాకుండా కార్మిక శాఖ కూడా నిర్వీర్యం కాబడుతుందని అందుకని కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని తదితర ప్రధానమైన డిమాండ్లతో మే 20 న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం,ఉడుత రవి,మచ్చ వేణు,గాజుల రాజు ,బూట్ల వెంకటేశ్వర్లు,అవధూత హరిదాసు,చింత కింది సుదన్,దోమల రమేష్ , శ్యామ్,సతీష్ ,సదానందం తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ.!

జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా టీవీ సత్యం

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

 

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జగిత్యాల జిల్లా బండారి గార్డెన్లో నిర్వహించినటువంటి 18 మండలాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా టీవీ సత్యం ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మాట్లాడుతూ టీవీ సత్యం మన జగిత్యాల అధ్యక్షుడు కావడం మన అదృష్టమని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని నిరుపేదలకు సబ్సిడీ ద్వారా దుగోడా మిషన్లు మరియు సంగడి మిషిన్లు విశ్వకర్మలకు ఇప్పించాలని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మరియు ప్రధాన కార్యదర్శి మద్దెనపల్లి నాగేష్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద దశరథం మరియు 18 మండలాల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత.

రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ దేవాలయానికి పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులు ఒక లక్ష నూట పదహారు రూపాయల విరాళంను మంగళవారం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన సింహద్వారా తలుపులకి అదనంగా అయ్యే మరో లక్ష రూపాయలని కూడా మేమే భరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని పులి లత ఆంజనేయులు గౌడ్ దంపతులను గ్రామస్తులతో పాటు కులసంఘ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, పలువురు గ్రామస్తులు, కుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్.

కాంగ్రెస్ ఖేల్ ఖతం…దుకాణ్ బంద్

సీఎం వ్యాఖ్యలే నిదర్శనం

ఇగ రైతుల హామీలన్నీ గాలికొదిలేసినట్లే

వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు

మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఓట్టిమాటేనని తేలింది

నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇగ రాదు

విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇగ ఇయ్యరని తేల్చేశారు

మోసాల కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం

రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం

‘‘సంవిధాన్’’ చేత పట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేమైనయ్

రాహుల్ సమాధానం చెప్పి తీరాల్సిందే…

రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ వన్నీ ఝూటా మాటలే…

నాగుపాములెక్క వంకర టింకరగా రోడ్డును నిర్మించింది కాంగ్రెస్సే

కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించింది కాంగ్రెస్సే

2035 వరకు కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ చేయించుకున్నది కాంగ్రెస్సే

ఆ కాంట్రాక్ట్ తో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్రం చెప్పింది నిజం కాదా?

ఆ సమస్యను పరిష్కరిస్తే 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరిస్తామని 2022లోనే చెప్పలేదా?

ఇదిగో…ఆధారం

నిన్న కోమటిరెడ్డికి కూడా గడ్కరీ ఇదే విషయాన్ని చెప్పారు

అయినా లేఖల పేరుతో కేంద్రంపై బురద చల్లడం ఎంత వరకు కరెక్ట్?

ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ డ్రామాలాడుతున్నారు

సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించాల్సిందే

ఎల్లారెడ్డిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్…

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

 

 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమనని దొంగలాగా చూస్తూ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇగ అమలు చేయలేనని సీఎం తేల్చేశారు. ఇక వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు. మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది. నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి ఇయ్యనట్లే. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యరని తేల్చేసినట్లే. రైతులకిచ్చిన హామీలను గాలికొదిలేసినట్లే’’అని వ్యాఖ్యానించారు.

ఇగ తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం… దుకాణం బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకుని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి రేపటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. స్థానిక విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం వినతి పత్రం తీసుకొని ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే…..

తెలంగాణ రాష్ట్రమనే కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో ఏం కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా. రాష్ట్రం దివాళా తీసింది. అని మాట్లాడటం సిగ్గు చేటు. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నరు. నిన్న సీఎం మాటలతో కాంగ్రెస్ పనైపోయింది. ఖేల్ ఖతం దుకాణ్ బంద్.

 

Congress

 

సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మా భవిష్యత్తు ఏమిటనే భయంతో ఉన్నరు. ఇంటికి ఏదైనా సమస్య వస్తే ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యను అధిగమించేందుకు యత్నిస్తరు. కానీ రాష్ట్రానికి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీసిండు. దేశం ముందు తలదించుకునేలా చేసిండు. యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం నిన్న పూర్తిగా మంట కలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇంతకంటే అవమానం మరొకటి లేనేలేదు.

ఢిల్లీకి పోతే అపాయిట్ మెంట్ కూడా ఇస్తలేరని చెప్పడం పచ్చి అబద్దం. ప్రధానమంత్రిని చాలా సార్లు కలిశారు. కేంద్ర మంత్రులను ఎప్పుడంటే అప్పుడు కలుస్తూనే ఉన్నడు. అయినా ఏం మాట్లాడుతున్నరు. ‘‘వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతరేమోననే భయంతో దగ్గరికి కూడా రానీయడం లేదు.’’అని అంటున్నడు. ఈ చెప్పులెత్తకపోవడమేంది? ఈ చెప్పులెత్తకపోవడమేంది? నాకైతే అర్ధం కాలే. కాంగ్రెస్ లో అట్లనే చేస్తరేమో. ఆ పార్టీ సంస్కృతి అదేనేమో. 2023 డిసెంబర్ లో, 2024 జులైలో, 2025 ఫిబ్రవరిలో కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కేంద్ర మంత్రులైతే లెక్కేలేదు. నిన్న కూడా గడ్కరీ కలిశారు. అయినా అపాయిట్ మెంట్ ఇయ్యడం లేదు. చెప్పులు ఎత్తకపోయేవాడిలా చూస్తున్నరనడం సిగ్గు చేటు.

 

Congress

సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే…. ఆయన పూర్తిగా చేతులెత్తేశారు. హామీలను అమలు చేయలేం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేం. ఇచ్చిన హమీలను అమలు చేయలేమని చెప్పిండు… ఇగ ప్రజలే ఆలోచించాలి. ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెప్పిండు. అయినా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చిండు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నడు. హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. కానీ సీఎం సీటెక్కంగనే చేతులెత్తేసిండు. ఇగ మీ ఖర్మ అని చేతులెత్తిసిండు. ఓట్లేసి గెలిపించినందుకు మీ తీట మీది అని అంటున్నడు. ఇకపై రైతులకిచ్చిన హామీలను అమలు చేయడు. వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇయ్యడు. మహిళలకు రూ.2500లు ఇయ్యరు. తులం బంగారం ఇయ్యరు.

మాట తప్పిన కాంగ్రెస్ ను ఇగ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాట ఇచ్చి తప్పినందుకు ఆ పార్టీ సంగతి తేలుస్తాం. ఏం ఆశించి ఎన్నికలప్పుడు హామీలను అమలు చేస్తామన్నరు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎందుకు బాండ్ పేపర్ రాసిచ్చారు? ఇప్పుడెందుకు చేతులెత్తేశారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ రాక్షసత్యం బయటపడింది. సంవిధాన్ పుస్తకం చేత పట్టుకుని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు చేతులెత్తేశారో సమాధానం చెప్పి తీరాల్సిందే. అప్పటిదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం. రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం. ప్రజలతో కలిసి అడ్డుకుని తీరుతాం.

ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏమీ చేయలేదంటరు. ఇచ్చేదంతా కేంద్రమే. అభివ్రుద్ధి జరుగుతున్నదంతా కేంద్ర నిధులతోనే. రోడ్ల కోసమే 1.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. రైల్వేల కోసం 32 వేల కోట్లు ఖర్చు చేసినం. వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లు ఇచ్చినం. కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బాగా సాయం చేస్తుందని పొగుడుతారు. బయటకు వచ్చినంక నయాపైసా ఇయ్యడం లేదని రెండు నాల్కల ధోరణితో మాట్లాడతారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతటి దుర్మార్గులంటే… చేసిన తప్పులన్నీ చేసేస్తారు. పాపాలన్నీ చేస్తారు….అవన్నీ బయటకొస్తున్నయని తెలిసే సరికి ఎదుటి వాళ్ల మీద రుద్ది బయటపడాలనుకుంటరు. నిన్న ఓ మంత్రి రాజీవ్ రహదారిని 6 లేన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తడు. ఇదేం పద్దతి? అరే.. రాజీవ్ రహదారిని నిర్మించింది నాటి కాంగ్రెస్ పార్టీయే. ఆ కాంట్రాక్టర్ తో కలిసి కమీషన్లు కక్కుర్తి పడి రోడ్డును అడ్డదిడ్డంగా నిర్మించింది కాంగ్రెస్సే. భారీ ఎత్తున కమీషన్లు దండుకుంది కాంగ్రెస్సే…. అట్లాంటి పార్టీ నేతలు ఇయాళ ఏమంటున్నరు? రాజీవ్ రహదారిని 8 (ఎయిట్) లేన్ రోడ్డుగా మార్చండి… కేంద్రం పట్టించుకోవడం లేదని నిందలేస్తున్నరు. ఇంతకంటే సిగ్గు చేటు ఇంకొకటి ఉందా? 2036 దాకా ఆ కాంట్రాక్ట్ కొనసాగేలా ఒప్పందం చేసుకుందే కాంగ్రెస్ పార్టీ.
అయినా సరే… తెలంగాణ ప్రజలపై మోదీ ప్రభుత్వానికి ఉన్న అభిమానంతో రాజీవ్ రహదారిని 6 లేన్ జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పుడే కాదు. 2022లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇదే మాట చెప్పింది. ఇదిగో ఆధారం(3.6.2022న కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వు కాపీని చూపిస్తూ….). ‘‘హైదరాబాద్ నుండి కరీంనగర్ మీదుగా మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారినికి 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ తో చేసుకున్న ఒప్పందం ద్రుష్ట్యా ఆ సమస్యను పరిష్కరించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బులను సెటిల్ చేసుకోండి. అవసరమైతే గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ కింద లేదా జాతీయ రహదారిగానైనా విస్తరిస్తాం’’ అని చాలా స్పష్టంగా పేర్కొంది. ఆ కాపీలను కూడా మీకు పంపిస్తా… చెక్ చేసుకోండి.
ఇదే కాదు… తెలంగాణ అభివ్రుద్ది కోసం కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఖర్చు చేసినం. రాబోయే 2 ఏళ్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే మరో 2 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనం. కలిసి పనిచేసేందుకు మేమెప్పుడూ సిధ్దమే. ఇకనైనా కేంద్రంపై బురద చల్లడం మానుకొని ప్రజల బాధలను అర్ధం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాలని సూచిస్తున్నా…

ఆపరేషన్ కగార్ శాంతియుత చర్చల పై అభిప్రాయం…

అసలు చర్చలు అనేవి లేవని తుపాకులు పట్టుకున్న వారితో చర్చలు ఏంటి?
తుపాకులు వదిలేసి జనంలో కలవాలని దానికి చర్చలు ఎందుకు,సమస్య తీరిపోతుందని అన్నారు…

పహల్గాం దాడి పై వివరణ

భారతదేశ పౌరులపై దాడి చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా వదలమని త్వరలోనే దానికి సమాధానం తెలుస్తుందని అన్నారు…

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షులు రేపాక రామచంద్రం, పట్టణ అధ్యక్షుడు నంది నరేష్, సీనియర్ నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, బుగ్గారెడ్డి, కంచర్ల పరుశురాములు, సళ్ళ సత్యం రెడ్డి, రావుల బాల్రెడ్డి, గాజుల దాసు, స్రవంతి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు రాలిన మామిడి తోటలను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను, మామిడి ఇతర పళ్ళ తోటలను వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి అంచనాలు వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జైపాల్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో చాలా గ్రామాల వద్ద ఐకెపి సెంటర్ల వద్ద వరి ధాన్యం వందలాది క్వింటాల అమ్మకం కోసం ఆరబోసారని వడగళ్ల వాన వల్ల పూర్తిగా వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయన్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలన్నారు.
రైతన్నకు చేతికి అందిన పంట వడగళ్ల వాళ్ళతో నీటిలో కలిసిపోయిందని, మామిడి ఇతర పళ్ళ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతన్న తీవ్ర ఆవేదనతో కృంగిపోతున్నాడని వెంటనే ప్రభుత్వం ప్రతి ఎకరాకు యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగపడేదని ప్రభుత్వ అసమర్థ విధానం వల్ల ప్రతి రైతు కూడా పరిహారాన్ని గ్యారంటీగా అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండ్లతోటలు పరిశీలించిన వారిలో పతెం రాజేశ్వర్ రెడ్డి, తాటిపెళ్లి లింగయ్య, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.!

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.

◆- అన్ని వర్ణాల వారు అర్హులే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాలలో ఉచిత ప్రవేశాలు జరుగుతున్నాయని సంస్థాపకులు, మహామండలేశ్వర్ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 14 ఏళ్లలోపు వారు అర్హులని చెప్పారు. వేదంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ఏ వర్ణానికి చెందినవారైనా అర్హులేనని తెలిపారుప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలో 90 మంది విద్యార్థులు కృష్ణ యజుర్వేదంలోని వివిధ కోర్సులు చదువుతున్నారని వారు పేర్కొన్నారు. ఆశ్ర.మంలో వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధన, భోజనం, వసతి కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ ఉంటుందని వారు అన్నారు. ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరోహిత్య షోడశ సంస్కార విద్య) వేదాంత విజ్ఞానంపై బోధన ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో వేదాంత, న్యాయ, యోగదర్శనం,ధ్యానం, భజన, గ్రంథపఠనం తదితర తరగతులు ఉంటాయని ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఆచార్యులు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమైనట్లు వివరించారు. ఈ నెల 29న మౌఖిక పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 5న అడ్మిషన్లు జరుగుతాయని, జూన్ 12న లింగదీక్షతోతరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గలవారు దత్తగిరి ఆశ్రమ కార్యాలయాన్ని లేదా మరింత సమాచారం కోసం చరవాణి 9177259329, 86392 58008 ద్వారా సంప్రదించాలని కోరారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు.!

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొత్త నంబర్ల నుండి వచ్చే కాల్స్, లింక్స్, ఏపీకె మెసేజ్ ల పట్ల తస్మాత్ జాగ్రత్త.

సైబర్ నేరాలకు గురైతే గంటలోపు(గోల్డెన్ అవర్) ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయడం చాలా ముఖ్యం.

జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,సులభంగా డబ్బులు సంపాదించాలానే అత్యశ చివరికి ఇబ్బందుల పాలు చేస్తుందని, సైబర్ నేరం జరిగిన గంట(గోల్డెన్ అవర్)లోపు 1930 నంబర్ కు లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో పిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా
మీమొబైల్ ఫోన్ కి ఆఫ‌ర్లు,డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింక్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని,అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌చ్చే మెసేజ్ ల‌కు,కొత్త నంబర్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవ‌కాశం ఉన్నందున వాటి పట్ల స్పందించవద్దని,సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి & ఫ్లీప్ చేయడానికి విభిన్నమైన కార్యనిర్వహణతో బయటకు వస్తున్నారని వాటిని క‌ట్ట‌డికి అప్ర‌మ‌త్త‌త‌, అవ‌గాహ‌నే ఆయుధం అని తెలిపారు.సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల తీయని మాటల వలలో పడి వ్యక్తిగత విషయాలు, ఫోటోలు అస్సలు ఇవ్వవద్దని,వ్యక్తిగత విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటుగా ఉండవద్దని ,సోషల్ మీడియా అకౌంట్స్ కి తప్పని సరిగా ప్రొఫైల్ లాక్ పెట్టుకోవాలని, సోషల్ మీడియా వేధికాకగా వేధిస్తే తక్షణమే పోలీస్ వారిని స్పందించాలని తెలిపారు.

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.

● లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
● కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
●.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
●. లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
●.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
●.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
●. పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
●.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
●.ఒక పోలీసు అధికారి పేరుతో మీకు ఫోన్ చేసి మీ ఆధార్ గురించి మాట్లాడితే స్పందించకండి ఇది ఒక స్కామ్..
●. మీరు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని చెబితే, స్పందించవద్దు.ఈది ఒక స్కామ్.
మీ కోసం లేదా మీరు పంపిన ప్యాకేజీలో డ్రగ్స్ కనుగొనబడిందని మీకు చెబితే ప్రతిస్పందించవద్దు.ఇది ఒక స్కామ్.
ఎవరైనా మీకు కాల్ చేసివారు పొరపాటున మీ UPI IDకి డబ్బు పంపారన తమ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరితే ప్రతిస్పందించవద్దు ఇది ఒక స్కామ్.

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్.!

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

డ్యూటీకి డుమ్మా కొట్టిన 15 మంది డ్యూటీ డాక్టర్లు…

డాక్టర్లు,నర్సుల హాజరు రిజిస్టర్ ని పరిశీలించిన కలెక్టర్…

బయోమెట్రిక్,హాజరు బుక్ పంపించాలని సూపర్డెంట్ ని హెచ్చరించిన కలెక్టర్…

రోగులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపిన కలెక్టర్…

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన ని జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ హాస్పటల్ ల్లో విజిట్ చేసే సమయానికి ఈ రోజు డ్యూటీలో ఉండాల్సిన 15 మంది డాక్టర్లు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్ పూర్తి వివరాలు బయోమెట్రిక్ ,హాజరు రిజిష్టర్ తో వివరాలు జిల్లా కార్యాలయానికి పంపి,హాజరు కానీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపిన జిల్లా కలెక్టర్, హాస్పటల్ పరిసరాల్లో రోగులకు అందాల్సిన సేవలు పై అడిగి తెలుసుకుని తాగునీరు ఏర్పాటు చేయాలని మరియు ఒపీ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు…
హాస్పటల్లో డ్యూటీ చేస్తున్న నర్సులు హాజరు రిజిష్టర్ ని పరిశీలించి చికిత్సకు హాస్పటల్ వస్తున్న వారిపట్ల మర్యాదగా ఉండాలని రోగులకు సేవ చేస్తూ తగు గుర్తింపు తెచ్చ

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన.!

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన జహీరాబాద్ ఎమ్మెల్యే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు కలిశారు. ఝరసంగం మండలం భూపాలపల్లి లో నిర్వహించే పార్టీ సమావేశానికి మరియు మొహమ్మద్ సయ్యద్ తన కూతురు పెళ్లి పత్రిక ఇచ్చి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్, నాగన్న, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!

కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్

సీఎం వ్యాఖ్యలే నిదర్శనం

ఎల్లారెడ్డిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్

రాజన్న సిరిసిల్ల (నేటి ధాత్రి):

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. స్థానిక విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమనని దొంగలాగా చూస్తూ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇగ అమలు చేయలేనని సీఎం తేల్చేశారు. ఇక వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇగ ఇయ్యరు. మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది. నిరుద్యోగులకు రూ.4 వేల భ్రుతి ఇయ్యనట్లే. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యరని తేల్చేసినట్లే. రైతులకిచ్చిన హామీలను గాలికొదిలేసినట్లే’’అని వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం… దుకాణం బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకుని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి రేపటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రమనే కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో ఏం కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా. రాష్ట్రం దివాళా తీసింది. అని మాట్లాడటం సిగ్గు చేటు. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నరు. నిన్న సీఎం మాటలతో కాంగ్రెస్ పనైపోయింది. ఖేల్ ఖతం దుకాణ్ బంద్.సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మా భవిష్యత్తు ఏమిటనే భయంతో ఉన్నరు. ఇంటికి ఏదైనా సమస్య వస్తే ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యను అధిగమించేందుకు యత్నిస్తరు. కానీ రాష్ట్రానికి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీసిండు. దేశం ముందు తలదించుకునేలా చేసిండు. యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం నిన్న పూర్తిగా మంట కలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇంతకంటే అవమానం మరొకటి లేనేలేదు.ఢిల్లీకి పోతే అపాయిట్ మెంట్ కూడా ఇస్తలేరని చెప్పడం పచ్చి అబద్దం. ప్రధానమంత్రిని చాలా సార్లు కలిశారు. కేంద్ర మంత్రులను ఎప్పుడంటే అప్పుడు కలుస్తూనే ఉన్నడు. అయినా ఏం మాట్లాడుతున్నరు. ‘‘వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతరేమోననే భయంతో దగ్గరికి కూడా రానీయడం లేదు.’’అని అంటున్నడు. ఈ చెప్పులెత్తకపోవడమేంది? ఈ చెప్పులెత్తకపోవడమేంది? నాకైతే అర్ధం కాలే. కాంగ్రెస్ లో అట్లనే చేస్తరేమో. ఆ పార్టీ సంస్క్రుతి అదేనేమో. 2023 డిసెంబర్ లో, 2024 జులైలో, 2025 ఫిబ్రవరిలో కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కేంద్ర మంత్రులైతే లెక్కేలేదు. నిన్న కూడా గడ్కరీ గారు కలిశారు. అయినా అపాయిట్ మెంట్ ఇయ్యడం లేదు. చెప్పులు ఎత్తకపోయేవాడిలా చూస్తున్నరనడం సిగ్గు చేటు. సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే…. ఆయన పూర్తిగా చేతులెత్తేశారు. హామీలను అమలు చేయలేం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేం. ఇచ్చిన హమీలను అమలు చేయలేమని చెప్పిండు… ఇగ ప్రజలే ఆలోచించాలి. ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెప్పిండు. అయినా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చిండు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నడు. హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. కానీ సీఎం సీటెక్కంగనే చేతులెత్తేసిండు. ఇగ మీ ఖర్మ అని చేతులెత్తిసిండు. ఓట్లేసి గెలిపించినందుకు మీ తీట మీది అని అంటున్నడు. ఇకపై రైతులకిచ్చిన హామీలను అమలు చేయడు. వ్రుద్దులకు రూ.4 వేల ఫించన్ ఇయ్యడు. మహిళలకు రూ.2500లు ఇయ్యరు. తులం బంగారం ఇయ్యరు.మాట తప్పిన కాంగ్రెస్ ను ఇగ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాట ఇచ్చి తప్పినందుకు ఆ పార్టీ సంగతి తేలుస్తాం. ఏం ఆశించి ఎన్నికలప్పుడు హామీలను అమలు చేస్తామన్నరు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎందుకు బాండ్ పేపర్ రాసిచ్చారు? ఇప్పుడెందుకు చేతులెత్తేశారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ రాక్షసత్యం బయటపడింది. సంవిధాన్ పుస్తకం చేత పట్టుకుని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు చేతులెత్తేశారో సమాధానం చెప్పి తీరాల్సిందే. అప్పటిదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టబోం. రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం. ప్రజలతో కలిసి అడ్డుకుని తీరుతాం.ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏమీ చేయలేదంటరు. ఇచ్చేదంతా కేంద్రమే. అభివ్రుద్ధి జరుగుతున్నదంతా కేంద్ర నిధులతోనే. రోడ్ల కోసమే 1.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. రైల్వేల కోసం 32 వేల కోట్లు ఖర్చు చేసినం. వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లు ఇచ్చినం. కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బాగా సాయం చేస్తుందని పొగుడుతారు. బయటకు వచ్చినంక నయాపైసా ఇయ్యడం లేదని రెండు నాల్కల ధోరణితో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతటి దుర్మార్గులంటే..చేసిన తప్పులన్నీ చేసేస్తారు. పాపాలన్నీ చేస్తారు.అవన్నీ బయటకొస్తున్నయని తెలిసే సరికి ఎదుటి వాళ్ల మీద రుద్ది బయటపడాలనుకుంటరు. నిన్న ఓ మంత్రి రాజీవ్ రహదారిని 6 లేన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తడు. ఇదేం పద్దతి? అరే.. రాజీవ్ రహదారిని నిర్మించింది నాటి కాంగ్రెస్ పార్టీయే. ఆ కాంట్రాక్టర్ తో కలిసి కమీషన్లు కక్కుర్తి పడి రోడ్డును అడ్డదిడ్డంగా నిర్మించింది కాంగ్రెస్సే. భారీ ఎత్తున కమీషన్లు దండుకుంది కాంగ్రెస్సే…. అట్లాంటి పార్టీ నేతలు ఇయాళ ఏమంటున్నరు? రాజీవ్ రహదారిని 8 (ఎయిట్) లేన్ రోడ్డుగా మార్చండి… కేంద్రం పట్టించుకోవడం లేదని నిందలేస్తున్నరు. ఇంతకంటే సిగ్గు చేటు ఇంకొకటి ఉందా? 2036 దాకా ఆ కాంట్రాక్ట్ కొనసాగేలా ఒప్పందం చేసుకుందే కాంగ్రెస్ పార్టీ.
అయినా సరే… తెలంగాణ ప్రజలపై మోదీ ప్రభుత్వానికి ఉన్న అభిమానంతో రాజీవ్ రహదారిని 6 లేన్ జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పుడే కాదు. 2022లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇదే మాట చెప్పింది. ఇదిగో ఆధారం 3.6.2022న కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వు కాపీని చూపిస్తూ ‘హైదరాబాద్ నుండి కరీంనగర్ మీదుగా మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారినికి 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ తో చేసుకున్న ఒప్పందం ద్రుష్ట్యా ఆ సమస్యను పరిష్కరించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బులను సెటిల్ చేసుకోండి. అవసరమైతే గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ కింద లేదా జాతీయ రహదారిగానైనా విస్తరిస్తాం’’ అని చాలా స్పష్టంగా పేర్కొంది. ఆ కాపీలను కూడా మీకు పంపిస్తా… చెక్ చేసుకోండి.
ఇదే కాదు… తెలంగాణ అభివ్రుద్ది కోసం కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఖర్చు చేసినం. రాబోయే 2 ఏళ్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే మరో 2 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనం. కలిసి పనిచేసేందుకు మేమెప్పుడూ సిధ్దమే. ఇకనైనా కేంద్రంపై బురద చల్లడం మానుకొని ప్రజల బాధలను అర్ధం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ నేతలు ద్రుష్టి పెట్టాలని సూచిస్తున్నా.

*ఓంకార్ గారి శత వేలాదిగా తరలిరావాలి *.!

*ఓంకార్ గారి శత జయంతి సభకు వేలాదిగా తరలిరావాలి *

ఎంసిపిఐ (యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి

మాదన్నపేట లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈ నెల 12న వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మచ్చాపురం గ్రామంలో గల స్థూపం వద్ద జరిగే అమరజీవి,అసెంబ్లీ టైగర్, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఎంసిపిఐ(యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఓంకార్ శతజయంతి సభ
వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాజమౌళి మాట్లాడుతూ ఆనాడు నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజల ప్రతినిధిగా ఎన్నికైన ఓంకార్ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అసెంబ్లీలో గలమెత్తాడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా , సమస్యలను అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడన్నారు. నేటి పాలకులు సమస్యలు తీర్చకుండా కొత్త సమస్యలను సృష్టిస్తూ పేదవాళ్లను మరింత పేదవాళ్లుగా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్య మానవుని కనీస అవసరాలను తీర్చకుండా తమ సొంత ప్రయోజనాల కోసం వ్యాపార లావాదేవీల కోసం పాకులాడుతూ కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.ఓంకార్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి ఈ సభ ఎంతగానో ఉపయోగపడుతుందని అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు .ఈ సభలో ప్రముఖ కవులు ,గోరటి వెంకన్న ,జయరాజు ప్రముఖ కవి , గాయకులు యోచన , ప్రజాకళాకారులు , వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు,మేధావులు విద్యార్థులు,ప్రజాసంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశెట్టి సదానందం,అనుమాల రమేష్,
కేశెట్టి శ్రీను ,కొప్పుల సమ్మక్క,కర్నే సాంబయ్య ఆకుల రాజేందర్, కందికొండ సాంబయ్య ,వక్కల రాజమౌళి , కేశెట్టి పెద్ద సాంబయ్య ,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ నియోజకవర్గం రిపోర్టర్ నగేష్ జన్మదిన వేడుకలను వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు జానారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెపల్లి బాలరాజ్ పాల్గొని విలేఖర్ నాగేష్ ను శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకున్నట్టు తెలిపారు. రిపోర్టర్లకు తమ వంతు సహకారం ఎల్లవేళల అందిస్తానని హామీ ఇచ్చారు. తన కూతురు జ్యురి లియోనా జన్మదినం కూడా ఉండడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా జహీరాబాద్ యూనియన్ ప్రెసిడెంట్ జానారెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఝరాసంగం మండల అధ్యక్షుడు నర్సింలు, జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్, జర్నలిస్ట్ అనిల్ కుమార్, జర్నలిస్టు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఈదురు గాలుల బీభత్సానికి మార్కెట్ షెడ్.!

ఈదురు గాలుల బీభత్సానికి మార్కెట్ షెడ్ పైకప్పు ధ్వంసం

మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

మండలంలోని పర్లపల్లి గ్రామంలో. ఆదివారంవారం అర్ధరాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించడంతో. కూరగాయల మార్కెట్ షెడ్లు పైకప్పు కూలిపోవడం జరిగింది. ప్రజల అవసరాల మేరకు షెడ్డు మల్లి నిర్మానించాలని మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య అన్నారు. ప్రజల అవసరాల కోసం వారసంతపు సంత ప్రతి బుధవారం కూరగాయలు కొనుగోలు నిర్వహించడం జరిగేదని, ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో గాలులు రావడంతో ద్వారంతో పాటు 15 షెడ్లు పై కప్పులు కూలిపోవడం జరిగిందని. ఎన్.ఆర్.ఇ.జి ఎస్ ద్వారా మార్కెట్ షెడ్లు నిర్మించడం జరిగిందని. దాని విలువ ఐదు లక్షలు అవుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి. గ్రామప్రజల అవసరాల దృష్ట్యా మళ్ళీ మార్కెట్ షెడ్లు పైకప్పులు పునర్నిర్మానం చేయాలని ఆయన కోరారు.

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం.

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన పాత్రికేయలు

రెనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రొ.బంగారి స్వామి

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లాలోని పరిసర ప్రాంతాల పేద ప్రజలకు వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈనెల 4వ తేదీన నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రేనే హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం కావడంలో ఆ పాత్రికేయుల కృషి ఎంతో విలువైనదని రేనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం నస్పూర్ & శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు భూపతి రవి, కొండ శ్రీనివాస్ లతో పాటు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వైద్య శిబిరానికి చేసిన సౌకర్యవంతమైన ఏర్పాట్లు శిబిరం విజయవంతం కావడానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.మండు వేసవిలో కూడా మా వైద్యులకు, సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లకు రుణపడి ఉన్నామన్నారు.ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడానికి,అతి తక్కువ సమయంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించి ప్రత్యేక వన్నె తీసుకువచ్చారని కొనియాడారు.ముఖ్యంగా మా సిబ్బందికి మీరిచ్చిన సహకారం మరువలేనిది, రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి వైద్య సేవా కార్యక్రమాల్లో మేము మీ వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. ఎటువంటి ఆరోగ్య సేవ కార్యక్రమాలకైనా మా రెనే హాస్పిటల్ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.

శ్రీ గురుకులంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని లక్నపల్లి గ్రామ శివారులో గల శ్రీ గురుకుల విద్యాలయంలో 2012 సంవత్సరంలో పదవతరగతి.చదివిన
విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూర్వ విద్యార్థులంతా తమ విధేయుడు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి చదువుకున్న పాఠశాలలో ఒకేవేదికపైకలుసుకోని పాత జ్ఞాపకాలు నెమలి వేసుకున్నారు ఒకరిని ఒక అలింగం చేసుకుంటూ ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి ఉపాధ్యాయుల మంచి ఆలోచనలు, ప్రణాళికలతోనే తమ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డామని ఒకనివ్వదు తమ స్థాయిలో అని చెప్పుకుంటూ ఆనందపడ్డారు. ఈ సందర్భంగా తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను మెమొంటో,శా లువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ గురుకులం ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడి సమాజానికి సేవలు అందించినప్పుడే చదువు నేర్పిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆనందం లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు మేడి.రమేష్, వెంకటరమణ,కామని.రమేష్ ,కోటేశ్వరరావు, కనుకయ్య, కవిత ,సునిత, రాంబాబు విద్యార్థులు పాల్గొన్నారు.

జికె నామ్ ఎడ్యుకేషనల్.!

జికె నామ్ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్ లీగల్ సహకరం.

ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు

నర్సంపేట,నేటిధాత్రి:

 

జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో మెడికల్, లీగల్ సహకారం అందించబడునని
ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు తెలిపారు. నర్సంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్
ప్రాజెక్ట్ చైర్మన్ సుప్రియా రత్న కుమార్ గౌడి పేరు మాట్లడుతూ నిరాదరణకు గురైన ప్రజలకు మెడికల్, లీగల్ సర్వీస్ అందించడం కోసం ఈ ట్రస్ట్ ఎర్పాటు చేశామని దీనిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.ఈ ప్రాజెక్ట్ సమాజంలో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి మరియు వైద్య సేవల ద్వారా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందన్నారు.
ప్రాజెక్ట్ ప్రాన్ పబ్లిక్ రీడ్రెస్సల్ అసోసియేటెడ్ నెట్‌వర్క్ ద్వారా ఉచిత వైద్య సేవలు,చట్టపరమైన అవగాహన శిబిరాలు అలాగే హన్మకోండలోని చక్రవర్తీ నెట్‌వర్క్ హాస్పిటల్ సహకారంతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.జికె నామ్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుప్రియా రత్న కుమార్ గౌడిపేరు లండన్,ఎమ్మార్సి,యూఎస్ఏ లోని న్యూజెర్సీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.ఎన్జీఓ 13 రాష్ట్రాల్లో న్యూ ఢిల్లీ లోని ప్రధాన కార్యాలయంతో వివిధ ప్రాజెక్టులతో పనిచేస్తుంది.రి.నం.725,అలాగే తెలంగాణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారం ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

ట్రస్ట్ ఆరోగ్య కార్డుతో లభించే సేవలు:

ఉచిత ఓపిడి కన్సల్టేషన్లు,
డయాగ్నస్టిక్ పరీక్షలపై డిస్కౌంట్లు 50 శాతం,చికిత్స ఖర్చులపై రాయితీలు 50 శాతం,ఉచిత ఆరోగ్య శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

సంస్థ ద్వారా అత్యవసర వైద్య సహాయానికి మార్గనిర్దేశం:

డాక్టర్ తారున్ కుమార్ రెడ్డి (క్రిటికల్ కేర్),డాక్టర్ ఏ.వి మోహన్ రెడ్డి (MS జనరల్ సర్జన్)డాక్టర్ ఎ. చంద్రికారెడ్డి (ఎంఎస్ జనరల్ సర్జన్),డాక్టర్ రామకృష్ణ (ఎండి జనరల్ మెడిసిన్),డాక్టర్ పాద్మాజా (క్రిటికల్ కేర్)

మా కార్డు పొందడానికి అర్హులు:

1. వికలాంగులు
2. అనాథలు
3. అన్ని బిపిఎల్ హోల్డర్లు
4. ఒంటరి మహిళలు
5. డెస్టిట్యూట్స్
6. తక్కువ ఆదాయ కుటుంబాలు
7. క్రమమైన ఆరోగ్య సంరక్షణకు నోచుకోలేని వ్యక్తులు

గుర్తింపు మరియు ఆదాయ పత్రాలు (అవసరమైతే)

కార్డుకు ఎలా…ఎలా దరఖాస్తు చేయాలి:

మే 15 వ తేదీ నుండి – ఆగస్టు 15, 2025 మధ్య అన్ని మండలాలలో పంచాయతీ కార్యాలయం మా నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
తద్వారా అవసరమైన పత్రాలు (గుర్తింపు కార్డు,ఆదాయ ధ్రువీకరణ మొదలైనవి) తీసుకురావాలి.

మా సంస్థ లక్ష్యం:

ఆర్థిక సమస్యల కారణంగా ఎవ్వరూ మౌలిక ఆరోగ్య సేవలకు, మరియు చట్టపరమైన సేవలు దూరంగా ఉండకూడదు అనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.మనమంతా కలిసి ఆరోగ్యవంతమైన, చట్టపరమైన సమానత్వమున్న సమాజాన్ని నిర్మించుకుందాం.
మరిన్ని వివరాల కోసం: సంప్రదించండి.
: 7207024416/9581226703
ఇమెయిల్: gktrustnaam@gmail.com
వెబ్‌సైట్: www.gktrustnaam.org

జయముఖి ఇంజినీరింగ్ యాజమాన్యంపై చర్యలు.!

జయముఖి ఇంజినీరింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

150 తాటిచెట్ల ధ్వంసం..ఇంజనీరింగ్ కళాశాలపై ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు.

ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు..

మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్.

చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు..

మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్

చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం సభ్యులు ఆందోళన..

నర్సంపేట నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మగ్దుంపురం గ్రామం శివారు జయముఖి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణంలో వున్న తాటివనాన్ని అక్రమంగా కాల్చి ధ్వంసం చేసిన జయముఖి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ముగ్దుపురం గౌడ పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడు సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో నర్సంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ జయముఖీ కళాశాల ఆవరణలో ఉన్న వందలాది
తాటివనంలోని తాటిచెట్లను ఎన్నో సంవత్సరాలుగా కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. గౌడ సంఘానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారికి ఇష్టంవచ్చినట్లు దౌర్జన్యంగా సుమారు 150పైగా పెద్ద పెద్ద తాటిచెట్లను,బొత్తలను జెసిబిలు , కూలీల సహాయంతో నరికించి దగ్ధం చేయించారని దీంతో నిరుపేదలమైన మాకు జీవనోపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొన్నది అవేదన వ్యక్తం చేశారు.తాటిచెట్లను అక్రమంగా ధ్వంసం చేశారని కళాశాల యాజమాన్యాన్ని అడగగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని గౌడ సంఘం సభ్యులు ఆరోపించారు.కళాశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఆర్థికంగా నష్టపోయి జీవనోపాధి కోల్పోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరారు.

ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు..

గీత వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న గౌడ కులస్తుల సంబంధించిన తాటివనాన్ని అక్రమంగా నరికి వేయడం పట్ల వారు జీవనోపాధిని కోల్పోతున్నారని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని పలు మండలాలలో కొందరు అక్రమ దారులు రియల్ ఎస్టేట్ పేరుతో, నిర్మాణాల పేరుతో తాటి వనాలను విచక్షణరహితంగా నరికివేస్తున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గౌడ కులస్తులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రమేష్ గౌడ్ కోరారు.

చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు..

నర్సంపేట మండలంలోని ముగ్ధుపురం గౌడ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఉన్న సుమారు 150 తాటిచెట్లను అక్రమంగా నరికి,కాల్చివేసి ధ్వంసం చేసిన ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. డివిజన్ పరిధిలోని గౌడ సంఘం సొసైటీల ఆధ్వర్యంలో ఉన్న తాటి వనాలలో కొందరు వ్యక్తులు అక్రమంగా తాటిచెట్లను నరికి వేస్తున్నారని తెలిపారు. జయముకి కళాశాలలో తాటివనాన్ని ధ్వంసం చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే నర్సంపేట పట్టణంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అదిలాబాద్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు కళాశాల యాజమాన్యం నుండి నష్టపాడియాల వసూలు చేసి అందజేయాలని ఆయన ప్రభుత్వ అధికారులను కోరారు.

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు.

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు తరలి వెళ్లిన సింగరేణి కార్మికులు.కరీంనగర్ లోని గోవిందపతి శ్రీవారి సేవ ఫౌండర్ గోవిందపతి శీనన్న ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దొమ్మటి విజయ్ కుమార్,రాజేందర్, స్పందన,సత్య ప్రసాద్,నరేష్, శ్రీనివాస్,మోహన్ లు ప్రతి సంవత్సరం తేదీ 28/04 నుండి 05/05/25 వరకు భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో మునిగిపోతున్నారు.దేశం, రాష్ట్రం శష్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని వారు ప్రతి సంవత్సరం శ్రీవారి సేవలో వేడుకుంటున్నట్లు తెలిపారు.

వర్గ సామాజిక జమిలి పోరాటాలే.!

వర్గ సామాజిక జమిలి పోరాటాలే సమస్యలకు పరిష్కారం

ఓంకార్ అనుసరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరం

శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంసిపిఐ(యు) నేతలు

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,

నేటిధాత్రి:

 

దేశంలో పెరిగిపోతున్న అసమానతలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే పరిష్కారం చూపుతాయని ఈ క్రమంలో అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఆచరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోనె కుమారస్వామి, హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి అన్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్లో ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ ప్రచార వాల్ పోస్టర్లను పార్టీ రాష్ట్ర జిల్లా నేతలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక అంతరాలు పెరిగిపోయి నూటికి 70 శాతం మంది ఎంత శ్రమపడిన కనీస అవసరాలు తీరలేని స్థితికి నెట్టి వేయబడుతున్నారని పాలకుల దోపిడీ విధానాలు కార్పొరే ట్ పెట్టుబడుదారి శక్తుల దోచుకునే పద్ధతులు రోజురోజుకీ విస్తృతం అవుతున్నాయని మరోవైపు కులం మతం ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వైశాల్యాలను సృష్టిస్తున్నారని మభ్యపెట్టే హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని అందరికీ సమానంగా దక్కాల్సిన సంపద కొద్దిమందికే చెందుతున్నదని ఇలాంటి పరిస్థితులలో ఆదర్శవంతమైన రాజకీయాలు శ్రమజీవుల కోసం పాటుపడే నేతలు మార్క్సిజం లెనినిజం పునాదుల మీద మరింత శక్తిని కూడగట్టుకుని పనిచేయాలని అందుకు అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఆశయాలను ఆచరణను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అందులో భాగంగా కామ్రేడ్ ఓంకార్ శత జయంతి వార్షికోత్సవం సందర్భంగా మే 12న మచ్చాపూర్ స్తూపం వద్ద ప్రారంభ సభ నిర్వహిస్తున్నట్లు ఈ సభకు కమ్యూనిస్టు వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు కవులు కళాకారులు హాజరవుతారని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంద రవి, కేంద్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు నర్ర ప్రతాప్, రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, కుసుంబ బాబూరావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా నాయకులు ఐతం నాగేష్, ఎగ్గని మల్లికార్జున్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version