కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగితో గౌడ వృత్తి సమానం.

కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగితో గౌడ వృత్తి సమానం..

గౌడ కులస్తుల వల్ల ఆనాటి నైజాం ప్రభులే ధనవంతులయ్యారు

గీత వృత్తిని కొనసాగిస్తూ ఆర్థికంగా ఎదగాలి.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కీట్ల పంపిణీ

నర్సంపేట నేటిధాత్రి:

ప్రస్తుతం ఉన్న మద్యం రేట్లును పరిగణలోకి తీసుకున్న పలువురు ప్రకృతి వరమైన తాటికల్లులు సేవిస్తున్నారని ఈ నేపథ్యంలో గీత వృత్తి చేసే కార్మికులు ఒక కంప్యూటర్ ఉద్యోగిగా భావిస్తూ వృత్తి కొనసాగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ,ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. బ్రిటిష్ కాలంలో తెలంగాణ ప్రాంతంలో గౌడ కులస్తులు కల్లు ద్వారా వచ్చే ఆదాయంతో నిజాం నవాబులు ధనవంతులు అయ్యారని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన సర్వేలో వెళ్లడైందని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కువగా మద్యం తాగేది తెలంగాణలోనే అని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ఆయుర్వేద మెడిసిన్గా భావిస్తూ ప్రతీ ఒక్కరూ తాటికల్లు తాగుతున్నారు.కళ్లు అనేది నామూసి కాదని ఎమ్మెల్యే అభిప్రాయ వ్యక్తం చేశారు. గౌడ కులస్తులు నమ్ముకున్న గీత వృత్తిని కొనసాగించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కాటమయ్య రక్షణ కిట్లకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 41 లక్షల 40 వేల ఖర్చు చేసిందని పేర్కొన్నారు. గీత కార్మికులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తాం. ఎక్సైజ్ శాఖ అధికారులు,కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు సహకారంతో ఉంటుందని ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చిన అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి హామీ ఇచ్చారు.జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత మాట్లాడుతూ గీత కార్మికులకు తాడిచెట్టు ఎక్కేటప్పుడు రక్షణ కల్పించేందుకు గాను కాటమయ్య రక్షణ కిట్స్ పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో చేపట్టినట్లు తెలిపారు. ప్రాణాలను రక్షించుకుంటూ
వృత్తిని కాపాడుకున్న కోవాలని గీత కార్మికులను సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి ఎస్ఐ శార్వాణి సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.

క్రేజ్ పెంచుతున్న చీనాబ్ వంతెన

Jammu-kashmir chenab నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికుల్లోనూ అత్యంత ఆసక్తిని నింపుతోంది. ఈనెల 6న ప్రధాని నరేంద్రమోదీ ప్రారం భించిన ఈ వంతెనను నింగిలోనుంచే క్లిక్ మనిపించేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. “ఇటీవల జమ్ము-కశ్మీర్లో ఆకర్షణీయమైన లోయల ఎగువన విహరించే ప్రతి విమానం… ఓ అద్భుతాన్ని వీక్షిస్తోంది. లోహ విహంగం చీనాబ్ లోయకు దగ్గరైనప్పుడు “మీ కింద ప్రపంచం లోనే అతిపెద్దదైన రైల్వే ఆర్చి వంతెన… chenab నది వంతెన’ అనే ప్రకటన వెలువడుతుంది. వెంటనే ప్రయాణికులు కిటికీల దగ్గరకు పరుగెడుతున్నారు. ఈ అద్భుత నిర్మాణాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకుంటున్నారు. ఈ వంతెనను వారు గర్వకారణంగా భావిస్తున్నారు’ అని రైల్వే బోర్డు సమాచార, ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేర్కొన్నారు.

జయముఖి ఇంజినీరింగ్ యాజమాన్యంపై చర్యలు.!

జయముఖి ఇంజినీరింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

150 తాటిచెట్ల ధ్వంసం..ఇంజనీరింగ్ కళాశాలపై ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు.

ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు..

మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్.

చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు..

మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్

చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం సభ్యులు ఆందోళన..

నర్సంపేట నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మగ్దుంపురం గ్రామం శివారు జయముఖి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణంలో వున్న తాటివనాన్ని అక్రమంగా కాల్చి ధ్వంసం చేసిన జయముఖి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ముగ్దుపురం గౌడ పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడు సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో నర్సంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ జయముఖీ కళాశాల ఆవరణలో ఉన్న వందలాది
తాటివనంలోని తాటిచెట్లను ఎన్నో సంవత్సరాలుగా కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. గౌడ సంఘానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారికి ఇష్టంవచ్చినట్లు దౌర్జన్యంగా సుమారు 150పైగా పెద్ద పెద్ద తాటిచెట్లను,బొత్తలను జెసిబిలు , కూలీల సహాయంతో నరికించి దగ్ధం చేయించారని దీంతో నిరుపేదలమైన మాకు జీవనోపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొన్నది అవేదన వ్యక్తం చేశారు.తాటిచెట్లను అక్రమంగా ధ్వంసం చేశారని కళాశాల యాజమాన్యాన్ని అడగగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని గౌడ సంఘం సభ్యులు ఆరోపించారు.కళాశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఆర్థికంగా నష్టపోయి జీవనోపాధి కోల్పోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరారు.

ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు..

గీత వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న గౌడ కులస్తుల సంబంధించిన తాటివనాన్ని అక్రమంగా నరికి వేయడం పట్ల వారు జీవనోపాధిని కోల్పోతున్నారని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని పలు మండలాలలో కొందరు అక్రమ దారులు రియల్ ఎస్టేట్ పేరుతో, నిర్మాణాల పేరుతో తాటి వనాలను విచక్షణరహితంగా నరికివేస్తున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గౌడ కులస్తులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రమేష్ గౌడ్ కోరారు.

చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు..

నర్సంపేట మండలంలోని ముగ్ధుపురం గౌడ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఉన్న సుమారు 150 తాటిచెట్లను అక్రమంగా నరికి,కాల్చివేసి ధ్వంసం చేసిన ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. డివిజన్ పరిధిలోని గౌడ సంఘం సొసైటీల ఆధ్వర్యంలో ఉన్న తాటి వనాలలో కొందరు వ్యక్తులు అక్రమంగా తాటిచెట్లను నరికి వేస్తున్నారని తెలిపారు. జయముకి కళాశాలలో తాటివనాన్ని ధ్వంసం చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే నర్సంపేట పట్టణంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అదిలాబాద్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు కళాశాల యాజమాన్యం నుండి నష్టపాడియాల వసూలు చేసి అందజేయాలని ఆయన ప్రభుత్వ అధికారులను కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version