సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు.!

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొత్త నంబర్ల నుండి వచ్చే కాల్స్, లింక్స్, ఏపీకె మెసేజ్ ల పట్ల తస్మాత్ జాగ్రత్త.

సైబర్ నేరాలకు గురైతే గంటలోపు(గోల్డెన్ అవర్) ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయడం చాలా ముఖ్యం.

జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,సులభంగా డబ్బులు సంపాదించాలానే అత్యశ చివరికి ఇబ్బందుల పాలు చేస్తుందని, సైబర్ నేరం జరిగిన గంట(గోల్డెన్ అవర్)లోపు 1930 నంబర్ కు లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో పిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా
మీమొబైల్ ఫోన్ కి ఆఫ‌ర్లు,డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింక్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని,అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌చ్చే మెసేజ్ ల‌కు,కొత్త నంబర్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవ‌కాశం ఉన్నందున వాటి పట్ల స్పందించవద్దని,సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి & ఫ్లీప్ చేయడానికి విభిన్నమైన కార్యనిర్వహణతో బయటకు వస్తున్నారని వాటిని క‌ట్ట‌డికి అప్ర‌మ‌త్త‌త‌, అవ‌గాహ‌నే ఆయుధం అని తెలిపారు.సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల తీయని మాటల వలలో పడి వ్యక్తిగత విషయాలు, ఫోటోలు అస్సలు ఇవ్వవద్దని,వ్యక్తిగత విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటుగా ఉండవద్దని ,సోషల్ మీడియా అకౌంట్స్ కి తప్పని సరిగా ప్రొఫైల్ లాక్ పెట్టుకోవాలని, సోషల్ మీడియా వేధికాకగా వేధిస్తే తక్షణమే పోలీస్ వారిని స్పందించాలని తెలిపారు.

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.

● లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
● కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
●.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
●. లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
●.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
●.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
●. పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
●.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
●.ఒక పోలీసు అధికారి పేరుతో మీకు ఫోన్ చేసి మీ ఆధార్ గురించి మాట్లాడితే స్పందించకండి ఇది ఒక స్కామ్..
●. మీరు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని చెబితే, స్పందించవద్దు.ఈది ఒక స్కామ్.
మీ కోసం లేదా మీరు పంపిన ప్యాకేజీలో డ్రగ్స్ కనుగొనబడిందని మీకు చెబితే ప్రతిస్పందించవద్దు.ఇది ఒక స్కామ్.
ఎవరైనా మీకు కాల్ చేసివారు పొరపాటున మీ UPI IDకి డబ్బు పంపారన తమ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరితే ప్రతిస్పందించవద్దు ఇది ఒక స్కామ్.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version