15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠ ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నట్లు పాఠశాల వ్యవసాపకులు సిద్దేశ్వరా నందగిరి మహా రాజ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు స్వీక రించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఉమ్మడి రాష్ట్ర నుంచి 200 వరకు దరఖాస్తులు ఇంతవరకు తమకు అందాయన్నారు .దరఖాస్తులు స్వీకరించిన పిదప ఈనెల 15న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వ హిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి వారిలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు వెంటనే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు చేసుకో వాలని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ సూచించారు.

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.!

వేద పాఠశాలకు దరఖాస్తుల స్వీకరణ.

◆- అన్ని వర్ణాల వారు అర్హులే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాలలో ఉచిత ప్రవేశాలు జరుగుతున్నాయని సంస్థాపకులు, మహామండలేశ్వర్ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 14 ఏళ్లలోపు వారు అర్హులని చెప్పారు. వేదంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ఏ వర్ణానికి చెందినవారైనా అర్హులేనని తెలిపారుప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలో 90 మంది విద్యార్థులు కృష్ణ యజుర్వేదంలోని వివిధ కోర్సులు చదువుతున్నారని వారు పేర్కొన్నారు. ఆశ్ర.మంలో వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధన, భోజనం, వసతి కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ ఉంటుందని వారు అన్నారు. ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరోహిత్య షోడశ సంస్కార విద్య) వేదాంత విజ్ఞానంపై బోధన ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో వేదాంత, న్యాయ, యోగదర్శనం,ధ్యానం, భజన, గ్రంథపఠనం తదితర తరగతులు ఉంటాయని ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఆచార్యులు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమైనట్లు వివరించారు. ఈ నెల 29న మౌఖిక పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 5న అడ్మిషన్లు జరుగుతాయని, జూన్ 12న లింగదీక్షతోతరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గలవారు దత్తగిరి ఆశ్రమ కార్యాలయాన్ని లేదా మరింత సమాచారం కోసం చరవాణి 9177259329, 86392 58008 ద్వారా సంప్రదించాలని కోరారు.

వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రికి ఆహ్వానం.

వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రికి ఆహ్వానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాస్తు జ్యోతిష పండితుల ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 23 న జరిగే జాతీయస్థాయి వైదిక జ్యోతిష్య సమ్మేళనానికి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రవన్ శాస్త్రి బూరుగుపల్లికి ఆహ్వానం అందింది.విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజున విజయవాడలో నిర్వహించనున్న వైదిక జ్యోతిష సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేసిన వాస్తు సిద్ధాంతులు, జ్యోతిష్య పండితులను ఆహ్వానించగా వారిలో తనకు చోటు దక్కడం సంతోషంగా ఉందని శ్రవణ్ శాస్త్రి శుక్రవారం తెలిపారు. రాబోయే తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు సెషన్లుగా జ్యోతిష్య సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పలు జ్యోతిష్య ,వాస్తు గ్రంథాల రచయిత, దైవజ్ఞరత్న పుచ్చా శ్రీనివాసరావు చే
ద్రేక్కాణ చక్ర రహస్యాలు,
శతాధిక జ్యోతిష గ్రంధ సంకలనకర్త ఆదిపూడి శివ సాయిరామ్ చే
జాతక దోషాలు- సులభ నివారణలు,
జ్యోతిష గ్రంథ రచయిత
శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ తో
ప్రశ్నా జ్యోతిషం- ఫలితాలు,
శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ధాంతి
లక్కావఝుల విజయసుబ్రహ్మణ్య సిద్ధాంతి
తో వైదిక జీవనం-అనుసరణీయం అనే అంశాలపై ప్రసంగాలు,
శ్రీ శృంగేరి శంకర మఠం – శ్రీ మహాలక్ష్మి ఆలయ ధర్మాధికారి- ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ, రాజమండ్రి కి చెందిన బహు గ్రంథ రచయిత గురురాజేష్ కొటేకల్, పంచాంగ కర్త శ్రీనివాస శశికాంత్ శర్మతో సమకాలిన వాస్తు జ్యోతిష అంశాలపై చర్చ గోష్టి ఉంటుందన్నారు.ప్రముఖ వైదిక జ్యోతిష వాస్తు పండితులతో నిర్వహించే ఈ సమ్మేళనం కో ఆర్డినేటర్ డాక్టర్ డి విశ్వనాథ్ నుండి ఆహ్వానం అందినట్లు శ్రవణ్ శాస్త్రి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version