గాలి బీభత్సం బాధితులను పరామర్శించిన.!

గాలి బీభత్సం బాధితులను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

 

పాలకుర్తి మండల కేంద్రంలో గాలి బీభత్సం కారణంగా కిరాయి ఇంటిలో నివాసముంటున్న రాపర్తి లక్ష్మీ, భర్త రామచంద్రయ్య తీవ్రంగా బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా కిరాయికి ఓ చిన్న ఇంటిలో నివసిస్తున్న ఈ కుటుంబానికి, రాత్రి వచ్చిన బలమైన గాలికి ఇంటి పై భాగంలో ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. విషయం తెలుసుకున్న పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించారు. ఎమ్మెల్యే వారి నివాసానికి స్వయంగా వెళ్లి, రాపర్తి లక్ష్మీ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నారు. తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే స్వయంగా నిత్యావసర సరుకులు కొనిచ్చి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాన్ని ఓదార్చుతూ, ప్రభుత్వం వారి సంక్షేమానికి అంగీకరంగా ఉన్నదని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాపర్తి లక్ష్మీకి ఇప్పటివరకు ఇంటి స్థలం లేకపోవడం వల్ల డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవలేదు. అయితే తదుపరి విడతలో ప్రభుత్వం ద్వారా ఆమెకు ఇంటి స్థలం మంజూరు చేయించి, డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలెవరూ ఒంటరిగా ఉండకుండా చూడటమే మా బాధ్యత అని అన్నారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి భార్గవ్, పట్టణ అధ్యక్షులు నాగన్న, మాజీ సర్పంచ్ యకంత రావు, మండల యూత్ అధ్యక్షులు హరీష్, రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బాధిత కుటుంబం ఎమ్మెల్యే చర్యలను చూసి హర్షం వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన తహసిల్దార్ కి పూల మొక్క తో స్వాగతం.!

నూతన తహసిల్దార్ కి పూల మొక్క తో స్వాగతం పలికిన సామాజిక కార్యకర్తలు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):

 

 

నేటి ధాత్రి :తెలంగాణ రాష్ట్రం లో పరిపాలన మార్పులలో భాగంగా, వీణవంక మండలం లో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన దూలం మంజుల గారికి పూలమొక్కతో సాధర స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపిన సామజిక కార్యకర్తలు దేవునూరి శ్రీనివాస్, సిలివేరు శ్రీకాంత్, ఈ శుభ సందర్బంగా,తహసీల్దార్ మండల ప్రజలకు నూతన రెవెన్యూ చట్టాలు “భూభారతి, సాదా బైనామా”ల విషయంలో ప్రజలకు విరివిగా సేవలను అందించాలని, వీణవంక మండల ప్రజలు, అన్నదాతలైన రైతాంగ వర్గం తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడమైనది, అందుకు సానుకూలంగా స్పందించిన నూతన తహసీల్దార్ గారికి వీణవంక మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు.!

డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డీఈఓ కార్యాలయంలోతపస్ వినతిపత్రం.

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

డీఎస్సీ 2008 ద్వారా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమితులైన వనపర్తి జిల్లాలోని 34 మంది ఉపాధ్యాయులకు ఇంకా వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారు మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నార ని తపస్ జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తంచేశారుకావున వెంటనే పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లి వారికి వేతనాలు వెంటనే చెల్లించే విధంగా డీఈవో చొరవ తీసుకోవాలని కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస చారి కి వినతిపత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వేముల అమరేందర్ రెడ్డి గారు విష్ణువర్ధన్ గారు ఈశ్వర్ గారు జిల్లా మీడియా కన్వీనర్ శశి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు

రేవూరికి వినతిపత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.!

ఎమ్మెల్యే రేవూరికి వినతిపత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ నాయకులు బొచ్చు కళ్యాణ్,మడికొండ ప్రశాంత్ లు వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ లను విడుదల చేయాలని అదే విధంగా పరకాల పట్టణంలో ఎస్సీ బాయ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మించాలని పరకాల పట్టణంలో ఉన్న ఎస్ఎంహెచ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరమన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు. ఈ తనిఖీ సమయంలో అక్కడ ఉన్న రైతులు ఎమ్మెల్యేకి తమ సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని, మిల్లులకు ధాన్యం తరలించడానికి అవసరమైన లారీలు అందుబాటులో లేవని వారు చెప్పారు. దీనిపై స్పందించిన శ్రీమతి యశస్విని రెడ్డి తక్షణమే జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని వివరించారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టం వృథా కాకూడదు, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. లాజిస్టిక్స్ సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదు అని కలెక్టర్ తో మాట్లాడి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాను అని అన్నారు. వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలి అని, ధాన్యాన్ని తడి కాకుండా కాపాడుకోవడం అవసరం రైతులకు ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా అధికారులను ఆదేశించారు. అదనంగా, వారు అధికారులను ఆలస్యం కాకుండా, ఖచ్చితమైన పద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. రైతులు ఎటువంటి అవినీతిని సహించవద్దని, ఏదైనా సమస్య ఎదురైతే తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ తనిఖీతో గ్రామస్థుల్లో, రైతుల్లో విశ్వాసం పెరిగిందని, ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడతానని వారు హామీ ఇచ్చారు.

గంజాయి సప్లై లో పరారీలో ఉన్న హమ్మద్.!

గంజాయి సప్లై లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందితుడు అరెస్ట్

జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన,రవాణా చేసినవారి సమాచారం అందించండి.

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గంజాయి సప్లై చేసే నిందితుడను అరెస్టు చేసిన పోలీసులు.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ మాట్లాడుతూ.గంజాయి అక్రమ రవాణా కేసులో MD. హమ్మద్ S/0 రఫిక్ age23,r/o సిరిసిల్ల అనే వ్యక్తిపై జిల్లాలోని సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట,
తంగళ్ళపల్లి ,బోయినపల్లి,చందుర్తి పోలీస్ స్టేషన్ లలో 15 కేసులు నమోదు కాగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో 04 కేసులలో,చందుర్తి పోలీస్ స్టేషన్లో 01కేసులో పరారీలో ఉండగా సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్లకి వస్తున్నాడన్న సమాచారం మేరకు MD. హమ్మద్ పట్టణంలోని ఎల్లమ్మ చౌరస్తా వద్ద అరెస్ట్ చేసి విచారణ అనంతరం రిమాండ్ కి తరలించడం జరుగుతుందన్నారు.జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు.గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని,గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం RS-NAB 8712656392 నంబర్ కి అందించలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదని జిల్లా ఎస్పీ ఈసందర్భంగా తెలిపారు. ఎస్పీ వెంట సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, క్రైమ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుల్ ఇంతియాజ్ ఉన్నారు.

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర.!

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర

వరంగల్ నేటిధాత్రి :

జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం వరంగల్ నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు శోభాయాత్ర కన్వీనర్లు పొట్టి శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, దాచేపల్లి సీతారాం తెలిపారు.
సాయంత్రం 5 గంటలకు వరంగల్ స్టేషన్ రోడ్డులోని పోచమ్మ గుడి నుండి శోభాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అమ్మవారి శోభాయాత్ర మేళతాళాలు మరియు ఆడపడుచుల దాండియా ఆటలతో ముందుకు సాగుతుందన్నారు. ఈ శోభాయాత్ర పోచమ్మ గుడి నుండి పోస్ట్ ఆఫీస్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, దుర్గేశ్వర స్వామి విది, పిన్నవారి వీధి, ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్, మీదుగా బట్టల బజార్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రక్కన గల వాసవి మాత దేవాలయం చేరుకుంటుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది.
ఆర్యవైశ్య బంధుమిత్రులందరు శోభాయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శోభాయాత్ర కన్వీనర్లు కోరారు.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి

జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల విషయం గురించి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఇందులో నిరుపేదలైన రెడ్డి వెలుమలకు మరియు 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ వారు గ్రామాల్లో కేటాయించాలి ఒక కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే ఇది ప్రజా పాలన కాదు కాంగ్రెస్ పాలన అవుతుంది గ్రామాల్లో ఉన్న అన్ని పార్టీల నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి ఒకవేళ అలా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే కేటాయిస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ వారిని మాత్రమే ఓట్లు అడగాలి లబ్ధిదారుల ఎంపిక ఒక రూపాయి కూడా ఆశించకుండా జరగాలి ఇందిరమ్మ ఇండ్ల కొలతల్లో ఒకటి రెండు ఫీట్లు పెంచుకొని కట్టుకునే వారికి కూడా అవకాశాన్ని ఇవ్వాలి రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు బిల్లును సకాలంలో చెల్లించాలి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ కంటే అధికారులు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది

పేకాటరాయుళ్ల అరెస్ట్ నగదు స్వాధీనం.

పేకాటరాయుళ్ల అరెస్ట్ నగదు స్వాధీనం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్-డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఆదేశానుసారం, జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచనమేరకు హొతి-కె గ్రామ శివారులోని ఇటుకల బట్టి ప్రక్కన గల ఖాళీ స్థలంలో గల వేపచెట్టు కింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు, అందిన నమ్మదగిన సమాచారం మేరకు, డి. సుజిత్, ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జహీరాబాద్ రూరల్ సిబ్బందితో అక్కడికి వెళ్ళి రైడ్ చేసి, పట్టుకొని వారి వద్ద నుండి రూపాయలు 7,140 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 7 మొబైల్ ఫోన్లు, 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు, జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్ డి. సుజిత్ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలి.

ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలి.

⏩మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.

⏩కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి.

⏩సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్ర.

⏩కర్రెగుట్టల నుండి బలగాలను వెనక్కి రప్పించాలి

⏩ఏజెన్సీ ఏరియాలో శాంతియుత వాతావరణం కల్పించాలి.

ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,దళిత రత్న కేదాసి మోహన్
కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

మావోయిస్టుల పై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఎమ్మార్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న కేదాసి మోహన్ డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాశిబుగ్గలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అనంతరం కేదాసి మోహన్ మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. బండి సంజయ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.సహజ వనరులను, విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టె కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను హత్య చేస్తున్నారని ఆయన ఆరోపించారు.మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారని కర్రెగుట్టల నుండి పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ ప్రాణాల హననాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ మంజాల బిక్షపతి గౌడ్, హనుమకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్,తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య,వివిధ ప్రజా సంఘాల నాయకులు పిట్టల రాజమౌళి,మంద నవీన్,గుండ్ల కాశీం,పారనందుల శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మృతి..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందు మృతి చెందాడు. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40) యువకుడు వరంగల్ కరీంబాద్ కు చెందిన రజితతో 16 సంవత్సరాల క్రితం పెళ్ళికాగా ఇద్దరు ఆడపిల్లలు అమృత,ఐశ్వర్య జన్మించారు. వారిని వరంగల్ లో చదివించాలని భార్య పట్టుబట్టింది. భర్త రవి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ లో ఉంటూ చదివించుకుంటున్నది. రవి వరంగల్ కు వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటూ మన స్థాపానికి గురిచెందాడు.ఈ నెల 4 న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన గ్రామస్తుల కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజియంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందగా తల్లి కొమరమ్మ ఫిర్యాదు మేరకు శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

విద్యుత్ ఉద్యోగులకు భద్రత,.!

విద్యుత్ ఉద్యోగులకు భద్రత, అవగాహనా కార్యక్రమం నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన గుండి సబ్ డివిజన్ పరిధిలో గల విద్యుత్ ఉద్యోగులకు విద్యుత్ భద్రత అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమానికి విశేష అతిథిగా కరీంనగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మేక రమేష్ బాబు, ముఖ్యఅతిథిగా కరీంనగర్ రూరల్ డివిజనల్ ఇంజనీర్ ఎం.తిరుపతిలు హాజరై విద్యుత్ భద్రత సూత్రాలు, భద్రతపై ప్రతిజ్ఞ, పరికరాల ఉపయోగంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాలకు సంబంధించిన విద్యుత్ ఉద్యోగులు, మండలాల యొక్క ఏఈలు, సబ్ ఇంజనీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.!

చేనేత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాదుని సత్యనారాయణ …..

నేటి ధాత్రి .,,……………..

 

 

జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండల గ్రామం ఎల్లారెడ్డి పల్లెలో చేనేత కార్మిక కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాధుని సత్యనారాయణ మాట్లాడుతూ రోజంతా శ్రమించి కార్మికులకు రోజు 300 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని కావున ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు అయ్యేవిధంగా పని కల్పించాలని మరియు ఇందిరమ్మ గృహాలు హెల్త్ కార్డు అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు వరంగల్ జిల్లాలో ఏర్పాటు అవుతున్న కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో పద్మశాలీలకు మరియు చేనేత కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిపి కల్పించాలని 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు పవర్ రూమ్ కార్మికులకు విద్యార్థి పింఛన్ వెంటనే మంజూరు చేయాలని మరియు మగ్గం వేసే ప్రతి కార్మికునికి జియో ట్రాక్ తో సంబంధం లేకుండా చేనేత మిత్ర కింద 2500 అందించి చేనేత కార్మికులకు ఆర్థిక ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు

సమస్యలపై స్పందించకపోతే.!

సమస్యలపై స్పందించకపోతే త్వరలో సమ్మె సైరన్..టీజీఈజెఎసి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ ఉద్యోగుల,గెజిటెడ్ ఆఫీసర్స్,ఉపాధ్యాయులు,కార్మికులు మరియు పెన్సనర్స్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ (టీజీఈజెఎసి) సూచనల మేరకు మంగళవారం రోజున బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వివరించడం జరిగింది.అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహాయ సహకారాలు అందించి ఉద్యోగుల మరియు వారి కుంటుంబాలకు చేయూత అందించాలని కోరారు.57 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా శాసనసభ సభ్యుడు గడ్డం వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోని వెళ్లి సమస్యల పరిష్కారానికి తనవంతు సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరము టీజీఈజెఎసి మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి,జనరల్ సెక్రెటరీ కె.వనజా రెడ్డి,మంచిర్యాల జిల్లా టీజీఈజేఏసీ తరుపున ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 15 లోపు స్పందించకపొతే మే 15 నాడు నల్ల బ్యాడిలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన మరియు ధర్నాలు చేపట్టడం జరుగుతుందని,జూన్ 9 నాడు హైదరాబాద్ లో జరిగే మహా సదస్సులో మంచిర్యాల జిల్లా తరుపున ప్రతి ఉద్యోగి పాలుగొంటారని,వర్క్ టూ రూల్,పెన్ డౌన్,సాముహిక సెలవులతో ప్రభుత్యం పై ఒత్తిడి పెంచుతామని,సమ్మె సైరన్ మోగించక తప్పదనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ గడియారం శ్రీహరి,జనరల్ సెక్రెటరీ కె.వనజా రెడ్డి,రాష్ట సెక్రెటరీ పొన్న మల్లయ్య,డిప్యూటి సెక్రెటరీ జనరల్ భూముల రామ్ మోహన్,కో-చైర్మన్ శ్రీపతి బాపూరావు,చక్రపాణి,రవి,చెన్న కేశవులు,సుధాకర్, గోపాల్,వెంకటేశం మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం.!

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నిర్ణిత సమయం ఇచ్చిన కూడా పాకిస్థానీ దేశస్తులు భారత దేశంలో అక్రమంగా ఉంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు, వెంటనే వారిని గుర్తించి దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి జాబితా తయారు చేసి బహిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ నాయకులే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేమ్ కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్,.!

యజమానుల వైఖరి నిరసిస్తూ వార్పిన్, పై పని కార్మికుల సమ్మె

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్
కేకే మహేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత కార్మికులకు
ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న మహిళా సంఘాల చీరలకు కార్మికులకు,మెరుగైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం మీటరుకు రెండు రూపాయలు యజమానులకు పెంచిన కూడా,సరియైన వేతనం ఇవ్వకుండా తగ్గించాలని చూస్తున్నా యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిని
రేపు పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద
ధర్నా వై పని,పవర్లూమ్ కార్మికులు పాల్గొని ధర్నాలు విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడం జరిగినది.
ఈరోజు అమృత శుక్ల కార్మిక భవనం వద్ద వార్పిన్ కార్మికుల జనరల్ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్,వార్పిన్, వై పని కార్మికులు,15 రోజుల క్రితం మహిళా సంఘాల చీరలకు కూలి పెంచాలని సమ్మె చేసిన సందర్భంగా, చేనేత జోలి శాఖ అధికారులు గత బతుకమ్మ చీరలకు ఏ విధంగా అయితే కూలి వచ్చిందో అంతకంటే మెరుగైన వేతనం కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి సమ్మె విరమించడం జరిగింది.

Warpin, Pyi workers

వారు హామీ ఇచ్చిన ప్రకారంగా కార్మికుల కూలి పెంచడం కోసం మీటరుకు రెండు రూపాయలు బట్ట ధర పెంచడం జరిగింది 32 రూపాయలు ఉన్నది 34 రూపాయలు పెంచడం జరిగింది.కార్మికుల కోసం రెండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన కూడా కార్మికుల శ్రమకు తగ్గ వేతనం ఇచ్చేందుకు యజమానులు మనసు రావడం లేదు కార్మికులు ప్రభుత్వం నుంచి పోరాడి సాధించినటువంటి కూలీ నుండి కూడా. యజమానులు లాభం పొందాలని చూస్తున్నారు
బతుకమ్మ చీరల కూలి ఇంతకుముందు పవర్ లోన్ కార్మికులకు 5.25 పైసలు ఒక మీటర్ కు కార్మికునికి కూలి ఉంటే ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తామని అంటున్నారు .వార్పిన్. వై పని కార్మికునికి గత బతుకమ్మ చీరల పనికంటే.విపరీతమైన పని భారం పెరిగింది చిన్నకోములు వస్తున్నాయి పోగులు పెరిగినాయి అయినా కూడా పెరిగిన పనికి ధర ఇవ్వడానికి. యజమానులు ఒప్పుకోవడం లేదు.. చేనేత జౌళి శాఖ అధికారులు కూలి నిర్ణయం చేయకపోవడం.యజమానులకు కూలి నిర్ణయించాలని బాధ్యతలు అప్పజెప్పడం వలన ఈ పరిస్థితి రావడం జరిగినది.అధికారుల యజమానుల మధ్య.కార్మికులు నష్టపోవడం జరుగుతుంది.అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కూలి సమస్య పరిష్కరించాలి లేని ఎడల
పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు
సమావేశంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి
కోడం రమణ,అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి,మచ్చ వేణు,బుట్ల వెంకటేశం, దోమల రమేష్ ఐరన్ ప్రవీణ్,సామల శీను తదితరులు పాల్గొన్నారు.

డీఎఫ్ఓ కలిసిన టీపీసీసీ సభ్యులు.!

డీఎఫ్ఓ కలిసిన టీపీసీసీ సభ్యులు రామానంద్

పాకాల చేపలు మత్స్యకారులకు అవకాశం కల్పించాలి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మత్స్యకారుల జీవనోపాధి కోసం వారిని పాకాల సరస్సులో చేపలు పట్టుకునేందుకు అవకాశాలు కల్పించాలని కోరుతూ టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మత్స్యకార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఖానాపూర్ మండలానికి చెందిన పాకాల సరస్సులో 12 గ్రామాలకు సంబంధించిన దాదాపు 200 మత్స్యకారుల కుటుంబాలు తమ కులవృత్తిగా చేపలను పట్టుకొని జీవన ఉపాధి పొందుతున్నారని అన్నారు.గత 10 రోజుల క్రితం పాకాల సరస్సులో చేపలను పడుతున్న మత్స్యకారుల వలలను జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వలలను స్థానిక ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మత్స్యకారులకు కుటుంబాల సమస్యలు పరిష్కారం కోసం డిఎఫ్ఓ వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. అనాది కాలం నుంచి చేపలను పట్టే వలలను పట్టుకపోవడం వలన మత్స్యకారులు వారి ఉపాధిని కోల్పోవడం జరుగుతున్నదని కాగా విషయాన్ని వివరించడం జరిగిందన్నారు. గతంలో వారికి కేటాయించిన హద్దుల ప్రకారం వలలు వేసి చేపలు పట్టుకొని అవకాశాన్ని కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించిన డీఎఫ్ఓ గతంలాగే చేపలను పట్టుకొనే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పెండెం రామానంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీను, ఎస్.అల్లోరు, లక్ష్మినారాయణ,జి. రమేష్, రాజేందర్,పి. వెంకన్న,రమేష్, ఎస్.రాజు, యాకన్న,రవి, మల్సుర్,జి. శ్యాంరాజ్, శేఖర్,వెంకటేష్, జితేందర్, వెంకన్న, రాజయ్య,కార్తీక్,బిక్షపతి, సారంగం,సారంగం,కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం.!

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి లండన్ వెళ్లడానికి అవసరమైన రూ.70 వేల విలువైన విమాన టికెట్ అందజేసిన ఎమ్మెల్యే

ఖండాంతరాలు దాటి చదువుకొని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాగా భారతదేశానికి ఖ్యాతి తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే

గంగాధర నేటిధాత్రి :

 

 

 

ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి అండగా నిలవడంలో ముందుంటారని మరోసారి నిరూపించుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థినిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి కి లండన్ లోని గ్రీన్ విచ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం వచ్చింది.ఉన్నత చదువుల కోసం శతాక్షి దేశాలకు వెళుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి వచ్చింది.ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంలో ముందుండే ఎమ్మెల్యే మేడిపల్లి శతాక్షికి ఆర్థిక సహకారం అందజేయాలని నిర్ణయించుకున్నారు.మంగళవారం కరీంనగర్ లోని తన నివాసంలో శతాక్షిని అభినందించి, స్వంత ఖర్చులతో కొనుగోలు చేసిన రూ. 70 విలువైన విమాన టికెట్ ను అందజేశారు. ఖండాంతరాలు దాటి చదివి, అంబేద్కర్ వలె భారతదేశానికి ఖ్యాతిని తీసుకురావాలని విద్యార్థినికి ఎమ్మెల్యే సూచించారు.విమాన టికెట్ను అందజేసిన ఎమ్మెల్యేకు శతాక్షీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా విద్యార్థినిని ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను మండల ప్రజలు అభినందించారు.

గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో.

నేటి ధాత్రి ఎఫెక్ట్.. గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : ఆదివారం “వర్షాకాలం పొంగుడు, ఎండాకాలం ఎండుడు” అనే శీర్షికతో” నేటి ధాత్రి” లో వచ్చిన కథనానికి ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ స్పందించారు.మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి,సిబ్బందితో కలిసి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతోందని గ్రామస్తులను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్.!

డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్…?

– నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగేనా.

కొల్చారం (మెదక్) నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇల్లు మంజూరులో రోజురోజుకు దుమారం రాజుకుంటోంది సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల లిస్టులపై ఆగ్రహం, అనుమానాలు, గంద రగోళం వ్యక్తమవుతోంది. పల్లె పల్లెలో కాంగ్రెస్ నేతలు మేము కష్టపడ్డాం ఓట్లు వేయించాం అధికారంలోకి వచ్చాం… ఇప్పుడు ఇల్లు తీసుకోవడం మా హక్కు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు గుసగుసలు చేస్తున్నారు. హస్తం పార్టీకి చెందిన నాయకులు అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారని, మా అధికారం మా రాజ్యం అన్న తీరుతో ప్రజలపై ఆధిపత్యం చూపుతున్నా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాత్రం ఎవరైనా అర్హుల కాదని తేలితే లిస్టులు రద్దు చేస్తామని తప్పులు జరిగితే అధికారులపై చర్యలు తీసు కుంటామని చెబుతున్నారు. కానీ ఈ మాటలకూ కమిటీల చర్యలకూ పొంతన లేదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారుల సర్వేలకు గ్రామాల్లో అవ రోధాలు ఏర్పడుతున్నాయి. అధికారులు కూడా నిరుత్సా హంగా “చేస్తే చేస్తాం లేకపోతే వెళ్తాం” అన్న విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా చాలా చోట్ల సర్వేలు పూర్తవ్వకుండానే అధికారులు వెనుదిరు గుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో పార్టీ జెండా పట్టి
నవారికి పెద్దపీట పడుతోంది. పేదవారికి న్యాయం జర గాలంటే పార్టీ బలమే అర్హతాగా బంధుప్రీతి, డబ్బు, ఆర్థిక బలం ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలలో ఈ రచ్చ మరింత ఉధృతంగా ఉంది. స్వయంగా మంత్రులు చేసిన ప్రకటనలను లెక్క చేయకుండా స్థానిక కమిటీలు తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లు లిస్టుల్లో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మండల నాయకులు కూడా సిఫార్సుల పేరుతో కమిటీలకు ప్రభావం చూపుతున్నట్లు చర్చ సాగుతోంది. ఇందిరమ్మ ఇల్లు లభించని పేదలు అర్హులు నిరాశతో ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలోనూ ఈ ఇళ్ల వ్యవహారాన్ని కేంద్రంగా చేసుకుని వర్గ పోరు ముదురుతోంది. కొంతమంది నేతలకు ఇల్లు రాకపోవడంతో పార్టీలో గొడవలు జరుగుతున్నాయిని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇల్లు ఇచ్చే వారు కాంగ్రెస్ నేతలే మరోవైపు అదే నేతల వల్లే గొడవలు జరుగుతు న్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ వ్యవహారంపై నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆర్హత కలిగిన పేదలకు గూడు కల్పిం చాలన్నదే చాలామంది అభిప్రాయం. వర్గీయతను బంధు ప్రీతిని తొలగించి నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగితేనే ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. నిజమైన నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో.. ఇండ్లు లేనివారికి.. అధికార పార్టీ నాయకులతో అయితదా..? అధికారులు సర్వే చేసి నిజమైన అర్హులను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేసే చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version