వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న.!

వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న వనపర్తి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ ను తరిమి వేయాలి

 

ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

 

 

వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో కార్పొరేట్ సంస్థల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు వివిధ రకాల కలర్ బ్రోచర్స్ తో ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తున్నారని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు జిల్లా సతీష్ యాదవ్ తెలిపారు.

వనపర్తి పట్టణం వనపర్తి పట్టణంలో ప్రైవేటు స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వారు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రభుత్వ స్కూల్స్ చేర్పించే వారిని తరిమి కొట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించారు.

నూతనంగా చేరుతున్న విద్యార్థులను అభినందించారు.

జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గురురాజును ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయాలని సూచించారు.

ఈ మేరకు హె చ్ఎం గురురాజును అభినందించారు.

సతీష్ యాదవ్ వెంట అఖిలపక్ష నాయకులు గౌని కాడి యాదయ్య వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి సతీష్ రాజనగరం రామస్వామి శ్రీధర్ కృష్ణయ్య నాగరాజ్ రాఘవేందర్ తదితరులు ఉన్నారు.

వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ లో అంతస్తులు ఉన్నాయని లిఫ్టులు లేవని విద్యార్థులు నోటు బుక్కులు బుక్స్ కలుపుకొని దాదాపు8 కిలోల వరకు ఉండవచ్చని ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ విద్యార్థులు మెట్ల ద్వారా పోవాలంటే ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ డిఇఓ వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో తనిఖీలు నిర్వహించి లిఫ్ట్ లేని స్కూల్స్ ను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యార్థులు బుక్కులు నోట్ బుక్స్ మెట్ల ద్వార పోవడం వల్ల విద్యార్థుల నడుములు కాళ్లు నొప్పులు ఏర్పడి అనారోగ్యాల గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం డీఈఓ కు టి ఏ లు డి ఏ లు సదుపాయం ఏర్పాటు చేసిందని వెంటనే తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు అసౌకర్యాల గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.

*ఓంకార్ గారి శత వేలాదిగా తరలిరావాలి *.!

*ఓంకార్ గారి శత జయంతి సభకు వేలాదిగా తరలిరావాలి *

ఎంసిపిఐ (యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి

మాదన్నపేట లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈ నెల 12న వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మచ్చాపురం గ్రామంలో గల స్థూపం వద్ద జరిగే అమరజీవి,అసెంబ్లీ టైగర్, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఎంసిపిఐ(యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఓంకార్ శతజయంతి సభ
వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాజమౌళి మాట్లాడుతూ ఆనాడు నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజల ప్రతినిధిగా ఎన్నికైన ఓంకార్ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అసెంబ్లీలో గలమెత్తాడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా , సమస్యలను అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడన్నారు. నేటి పాలకులు సమస్యలు తీర్చకుండా కొత్త సమస్యలను సృష్టిస్తూ పేదవాళ్లను మరింత పేదవాళ్లుగా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్య మానవుని కనీస అవసరాలను తీర్చకుండా తమ సొంత ప్రయోజనాల కోసం వ్యాపార లావాదేవీల కోసం పాకులాడుతూ కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.ఓంకార్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి ఈ సభ ఎంతగానో ఉపయోగపడుతుందని అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు .ఈ సభలో ప్రముఖ కవులు ,గోరటి వెంకన్న ,జయరాజు ప్రముఖ కవి , గాయకులు యోచన , ప్రజాకళాకారులు , వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు,మేధావులు విద్యార్థులు,ప్రజాసంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశెట్టి సదానందం,అనుమాల రమేష్,
కేశెట్టి శ్రీను ,కొప్పుల సమ్మక్క,కర్నే సాంబయ్య ఆకుల రాజేందర్, కందికొండ సాంబయ్య ,వక్కల రాజమౌళి , కేశెట్టి పెద్ద సాంబయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version