టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

TPCC President Mahesh Kumar Goud.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ ఆఫీజ్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మినిష్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం హాజరైన సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు ఉజ్వల్ రెడ్డి తోపాటు వెళ్లి షేక్ ఆఫిజ్ మహిష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఈ కార్యక్రమం లో మండల యువ నాయకులు అశ్విని పాటిల్ ఉన్నారు.

స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలి.

స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలి.

#బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వనికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనికి పడుతుంది.

#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

 

Activists should work with the aim of winning local elections.

నల్లబెల్లి , నేటి ధాత్రి: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం మండలంలోని ముచింపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 66 మోసాలతో మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళాదిస్తూన్నా ప్రభుత్వనికి గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.గత 2 నెలల క్రితం అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నేడు మండలానికి ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే ఇండ్ల కోసం ముగ్గులు పోసి ప్రజలను మోసం చేస్తున్నా ప్రభుత్వనికి రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పి బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి ప్రతి కార్యకర్త సైనికుడు వలె పోరాటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.పార్టీలో చేరిన వారు దొమ్మటి శ్రీను గౌడ్, బచ్చాలు, బత్తినీ మల్లికార్జున గౌడ్, కుమారస్వామి గౌడ్ , కక్కెర్ల సమ్మయ్య గౌడ్ , ఈరగోని లింగయ్య చేరారు కార్యక్రమంలో గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు ఊటుకూరి చిరంజీవి,బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి , నాయకులు వల్లే పార్వతలు , పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ (కోటి ) ,ధర్మారం క్రాంతికుమార్ ,బోట్ల ప్రతాప్ ,పులి రజినీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.

ఇమామ్ మరియు ముజ్జిన్‌లకు అభినందనలు.

పాత బాగ్దాద్ మసీదులో తరావీహ్‌లో ఖురాన్ పూర్తి చేసినందుకు ఇమామ్ మరియు ముజ్జిన్‌లకు అభినందనలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నగరంలోని పురాతన మరియు చారిత్రాత్మకమైన బాగ్దాదీ మసీదులో, హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ ఖాద్రీ షహీద్ బాగ్దాదీ మందిరం లోపల ఉన్న తరావీహ్ ప్రార్థనల సమయంలో ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ ప్రతిరోజూ మూడు అధ్యాయాలను పఠిస్తూ మొత్తం ఖురాన్ షరీఫ్‌ను పఠించే అధికారాన్ని పొందారు. హజ్రత్ సయ్యద్ షా అజీజుద్దీన్ ఖాద్రీ సాహిబ్ ఖిబ్లా మరియు సయ్యద్ షా హుస్సాముద్దీన్ ఖాద్రీ ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్, హఫీజ్ ముహమ్మద్ షకీల్ నూరి మరియు బాగ్దాదీ మసీదు డిప్యూటీ ముజ్జిన్ ముహమ్మద్ ఖైరుద్దీన్ లపై పూల వర్షం కురిపించి, వారికి అభినందనలు మరియు నైవేద్యాలను అందించారు. ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ పవిత్ర ఖురాన్ పారాయణంతో అభినందన కార్యక్రమం ప్రారంభమైంది. రిటైర్డ్ ఏఎస్ఐ ముహమ్మద్ జిలానీ నాత్ షరీఫ్ పారాయణం చేశారు. మసీదులో సింహరాశి కూడా పంపిణీ చేయబడింది. ఇది షామ్ జహీరాబాద్‌లోని ఒక పెద్ద మరియు ప్రత్యేకమైన మసీదు అని గమనించాలి, ఇక్కడ మసీదులోని ఎక్కువ మంది ఆరాధకులు ఉంటారు మరియు తరావీహ్ ప్రార్థనల సమయంలో వెయ్యి మందికి పైగా ఆరాధకులు వినయం మరియు భక్తితో పవిత్ర ఖురాన్ వింటారు. మరియు రంజాన్ మాసంలో, తరావీహ్ సమయంలో ఖురాన్ యొక్క మూడు పారాయణలు ఏర్పాటు చేయబడతాయి. ఈ సత్కార కార్యక్రమంలో ఖాజీ సయ్యద్ జియావుద్దీన్ ఓం, ఖతీబ్ ఈద్గా మరియు హఫీజ్ ముబిన్ అహ్మద్ ఖాస్మి, ముహమ్మద్ మోర్, మియా సికందర్ ఆసిద్ షకీర్, ఉస్తాద్ ముహమ్మద్ హషీం, ముహమ్మద్ రఫీ, ముహమ్మద్ రిషాద్ డానిష్ హుస్సేన్ రఫీక్ అన్సారీ, ఆరిఫ్ టోరి ముహమ్మద్ బాబా నిష్, ముహమ్మద్ అజీమ్ బారిల్, షానవాజ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదిర్ మరియు మసీదు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శకత్వ బాధ్యతలను సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నిర్వర్తించారు.

పాలనను భ్రష్టుపట్టిస్తున్న అవినీతి ఉద్యోగులు

ఆదాయం వున్న పోస్టులకు అధిక డిమాండ్‌

అందినకాడికి దండుకోవడమే లక్ష్యం

వేలంపాటలో అధిక మొత్తం చెల్లించినవారికే అటువంటి పోస్టులు

పెట్టిన పెట్టుబడికి లాభంకోసం ప్రజలను పీడిస్తున్న ఉద్యోగులు

కొందరు చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా కోట్ల విలువైన ఆస్తులు

అవినీతికి స్వేచ్ఛనిస్తున్న మన ప్రజాస్వామ్యం

ఏసీబీ అంటే భయపడే రోజులు పోయాయి

పట్టుబడినా పోస్టులు పదిలం…అవినీతికి లేదు అడ్డం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమనే రథానికి అధికార యంత్రాంగం చక్రాలవంటివారు. వీరు లేకపోతే పాలన సాగదు. అందువల్లనే పాలనా యంత్రాంగానికి అంతటి ప్రాధాన్యత. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించాల్సిన వివిధ రకాల సేవలు ఈ యంత్రాంగం ద్వారానే జరుగుతాయి. అధికారంలో వున్న పార్టీ తన హామీలను సక్రమంగా అమలు చేయడానికి చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేది ఈ ప్రభుత్వ అధికారులే! మరోమాట లో చెప్పాలంటే ప్రజాసేవలో అధికార్లది అత్యంత కీలకమైన పాత్ర. ఎందుకంటే ప్రభుత్వం తన పాలనా శైలిని మాత్రమే చెబుతుంది. కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసేది ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా కృషిచేసేది అధికార యంత్రాంగమే. ఇంతటి కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నందువల్లనే అడుగడుగునా అవినీతికి ఆస్కారం వుంటుంది. ప్రభుత్వ పాలనను భ్రష్టుపట్టించేది,అధికారపార్టీని అప్రతిష్టపాలు చేసేది కూడా ఈ అవినీతి మాత్రమే! ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులు రిటైరయ్యే వరకు తమ తమ స్థానాల్లో కొనసాగుతారు. అదే ప్రభుత్వానికి నేతృత్వం వహించే పార్టీ పదవీకాలం ఐదేళ్లు మాత్రమే! అందువల్ల పాలనలోని ప్రతి అంశాన్ని మంత్రులకు వివరించడం ద్వారా, సదరు పార్టీ తన హామీలను చట్టబద్ధమైన రీతిలో అమలు చేసేలా సలహాలు ఇచ్చి దిక్సూచిగా వ్యవహరించేది ఉన్నతాధికార్లు.

ప్రజాస్వామ్యంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషించే పాలనా యంత్రాంగంలోకి అవినీతి వేరుపురుగు ప్రవేశిస్తే, సర్వం భ్రష్టమైపోతుంది. ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడి కుప్ప కూలే అవకాశముంది. అందువల్ల ఈ పాలనా యంత్రాంగం ఎప్పుడూ ప్రభుత్వ ఆధీనంలో, ని బంధనల మేరకు పనిచేయించగలిగే ఫ్రేమ్‌వర్క్‌ ఒకటి రూపొందించబడి వుంటుంది. కానీ అవినీతి పెచ్చరిల్లినప్పుడు, ఈ ఫ్రేమ్‌వర్క్‌ పనిచేయడంలేదు. ప్రభుత్వాలు మారేకొద్దీ ఈ అధికార యంత్రాంగంలో చాలామంది బలంగా వేళ్లూనుకుపోయి, అవినీతి మార్గాల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడటం వర్తమాన చరిత్ర. ఇది రానురాను మరింత వికృతరూపం దాలుస్తున్నట్టు తెలంగాణలో జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ముఖ్యంగా దిగువస్థాయి అధికార్లు ఏదశకు చేరుకున్నారంటే, అవసరమైతే తమ అక్రమ సంపాదన దన్నుతో మంత్రులపై తప్పుడు ప్రచారాలు చేయించి, వారి పదవులకే ఎసరుపెట్టే స్థాయికి ఎదగడం వర్తమాన వైచిత్రి!

ప్రజాసంబంధాలకు సంబంధించిన శాఖల్లో పనిచేసే ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువ. కొందరు నిజాయతీ పరులైన అధికార్లు లేకపోలేదు. కానీ వీరిశాతం చాలా తక్కువ. అవినీతి అధికార్లు సంపాదన ఎక్కువగా ఉండే పోస్టులకు వెళ్లడానికి అవసరమైనంత చెల్లించడానికిఎంతమాత్రం సంకోచించడంలేదు. రానురాను ఇదొక వేలంపాటగా మారిపోయింది. అంటే ఉ ద్యోగులే తమకు కావలసిన పోస్టులకోసం పై అధికార్లకు పెద్దమొత్తాల్లో లంచాలు సమర్పించుకొని ఆ పోస్టులో నియామకమైతే, ప్రజలను ఏ స్థాయిలో పీడిరచుకు తింటారో అర్థం చేసుకోవ చ్చు. ఒకప్పుడు లంచం అంటే చాటుమాటుగా, భయంగా తీసుకునే పద్ధతికి ఎనాడో కాలం చె ల్లింది. ఇప్పుడంతా బహిరంగమే. ఒక్కొక్క పనికి ఇంత మొత్తం అని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. పై అధికార్లకు అప్పటికే నజనారానాలు చెల్లించి పోస్టులోకి రావడంవల్ల ఎవ రూ అడగరనే ధైర్యం పెరిగిపోయింది. తాము లంచంగా ఇచ్చిన మొత్తానికి రెట్టింపు లాభార్జన వసూళ్ల రూపంలో సంపాదించాలన్న యావ బాగా ముదిరింది. ఈ కారణంగానే కొన్ని శాఖల్లో దిగువస్థాయి ఉద్యోగుల ఆస్తులు వందలకోట్లకు చేరుతున్నాయి. ఒకవేళ అవినీతి నిరోధక శాఖ అధికార్లకు పట్టుబడినా వీరిలో భయం ఏకోశానా కనిపించంలేదు. తాము సంపాదించిన మొత్తంలో కొంత ఖర్చుచేసి కేసులనుంచి బయటపడి తిరిగి పోస్టుల్లో చేరుతున్నారు. ఎ.సి.బి.కి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు కోర్టుకెళ్లి ఏదోరకంగా తిరిగి తమ పోస్టుల్లో కొనసాగుతున్నారు.

ఇటీవల ఎ.సి.బి.కి పట్టుబడిన అధికార్లు తమపై కేసులు నిరూపణ అయ్యే వరకు పోస్టుల్లోనే కొనసాగించాలని, నేరం నిరూపణ అయితే అప్పుడే కఠిన శిక్ష విధించవచ్చునని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు చెప్పడం వారిలో మనోధైర్యాన్ని రెట్టింపు చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈవిధంగా పట్టుబడి సస్పెండ్‌ అయిన అధి కార్లను, కేసు పూర్తయ్యేవరకు పోస్టులోకి తీసుకోదు. కానీ కోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సదరుశాఖ మంత్రివద్దకు తీసుకెళ్లి, తమకు తిరిగి పోస్టుల్లోకి తీసుకోవాలని ఇటీవల అటువంటి అధికార్లు సంబంధిత శాఖ మంత్రివద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు మం త్రి ససేమిరా అనడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదే సమయంలో మంత్రి నిజాయతీగా పనిచేయమంటూ హితోక్తులు పలకడం వారికి ఎంతమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు లం చాల రూపంలో విపరీతంగా ఆదాయాన్ని పొందుతున్న ఈ అధికార్లకు ఇప్పుడు కేవలం జీతం రాళ్లతోనే బతకాలంటే మనసు ఎంతమాత్రం ఒప్పుకోదు. తప్పుడు మార్గాల్లో వచ్చే అధికాదాయంద్వారా విలాసాలకు, ఆస్తులు సమకూర్చుకోవడానికి అలవాటుపడిన అధికార్లు ఇప్పుడు మంత్రిపై గుర్రుగా వున్నారు. విచిత్రమేమంటే సదరు మంత్రివర్యులు, ఈ అధికార్ల అవినీతిబాగోతంపై ఒక పత్రికలో వచ్చిన వార్తలను చూపించి, నిజాయతీగా పనిచేసుకోవాలని కోరడం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.

వెంటనే వారు తమకు అనుకూల మీడియా వ్యక్తుల వద్దకు వెళ్లి, పరిస్థితిని వివరిస్తే, యూనియన్‌ నేతల వద్దకు వెళ్లి సదరు వార్తలను ఖండిరచమని కోరమని సలహా ఇవ్వడంతో వారు అదేవిధంగా తమ యూనియన్‌ నాయకులపై ఒత్తిడి తెచ్చారు. ఇక వార్తలు రాసిన పత్రిక విలేకర్లు త మను రూ.20లక్షలు డిమాండ్‌ చేయగా తాము అంగీకరించకపోవడంతో, తప్పుడు వార్తలు రాసినట్టు ఈ అధికార్లు తమకు అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం, ప్రసారం చేయ డం మొదలుపెట్టారు. ఆవిధంగా తమకు అనుకూలంగా పనిచేసిన మీడియాకు కొంత ముట్టజె ప్పారు. పనిలోపనిగా ఇదే మీడియా సహాయంతో తమకు హితవు చెప్పిన మంత్రికి వ్యతిరేకంగా వార్తలను వండటం మొదలుపెట్టారు. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటమే కాకుండా, అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఈ అధికార్లు తాము సంపాదించిన పాపపు సొమ్ముతో, మంత్రులనే ఏకంగా టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారంటే వారి ఆర్థిక మూలాలు ఎంత బలంగా వున్నాయో అర్థమవుతుంది.

అవినీతి సంపాదన ఒకస్థాయి దాటిన తర్వాత, పార్టీ టిక్కెట్లకోసం రాజకీయ నాయకులతో పోటీపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక సంఘటనలో ఒక అధికారి ఒక ప్రముఖ పార్టీ నేత వ ద్దకు వెళ్లి తనకు పార్టీ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తూ, రూ.25కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చేందుకు ముందుకు రావడమే కాదు, ఎన్నికల్లో తన ఖర్చు తానే పెట్టుకుంటానని ఆఫర్‌ ఇచ్చాడంటే ఆయన అవినీతి సంపాదన ఏస్థాయిలో ఉన్నదో చెప్పల్సిన అవసరం లేదు. ఒకప్పటి వరంగల్‌ జిల్లాకుచెందిన ఒక చిన్నస్థాయి ఉద్యోగి తన కుమార్తెకు ఏకంగా రూ.5కోట్లు కట్నం చెల్లించాడంటే అవినీతి సంపాదన ఏస్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది నెలల క్రితం ఇదే జిల్లాకు చెందినఒక రెవెన్యూ అధికారి కుమారుడికి వివాహం నిశ్చయమైంది. సరిగ్గా ఇదే సమయంలో రూ.7కోట్ల విలువైన ఆయన ఆక్రమ ఆస్తులు జప్తుకు గురయ్యాయి. పెళ్లి ఆగిపోతుందని అంతా భయపడ్డారు. కానీ పిల్ల తరపువారు మాత్రం, ‘జప్తు అయింది ఏడుకోట్లే కదా! ఇంకా చాలా కోట్ల ఆస్తి వుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. మన అమ్మాయి సుఖపడుతుంది’ అంటూ వివాహా న్ని చక్కగా జరిపించేశారు. అవినీతి ఇస్తున్న భరోసాకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఒకరకంగా చెప్పాలంటే అవినీతి ‘చట్టబద్ధతను’ సంతరించుకున్నదనుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. రెవెన్యూశాఖలో లంచాలు మరిగిన అధికార్లు పహణీల్లో పేర్లు మార్చడానికి కూడా వెనుకాడటంలేదు. పట్టేదారు పాస్‌పుస్తకం కావాలంటే ఎకరానికి రూ.లక్ష డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈమొత్తం మరింత ఎక్కువ వుంటోంది. రెండెకరాలున్న రైతు రెండు లక్ష లు లంచంగా ఇవ్వగలడా? కానీ తప్పడంలేదు. లంచం ఇవ్వు…సేవను పొందు అనేరీతిలో ప్ర భుత్వ సేవలు తయారయ్యాయి. దీన్నే ‘అవినీతిలో నీతి’ అని సరిపుచ్చుకోవాలో తెలియని దుస్థితి! వచ్చేకాలంలో ఈ అవినీతి మరింత జడలువిప్పి కొత్త పోకడలతో ప్రజలను ‘అలరించ’వచ్చు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు ఫీజుకు రె ట్టింపు చెల్లిస్తే తప్ప పనులు జరగడంలేదు. అంటే చెల్లించే రెట్టింపు మొత్తం అధికార్లు పంచుకోవడానికి సరిపోతోంది. 

మరి ఇంతటి విచ్చలవిడి అవినీతికి అంతం పలకలేమా? అంటే ఇందుకు ఒక్కటే మార్గం! కీలక మైన ప్రజాసంబంధాల శాఖల్లో పోస్టులకు ఉద్యోగ భద్రత వుండకూడదు! చిన్న అవినీతి లేదా తప్పు జరిగినా తక్షణం ఉద్యోగం వూడుతుందన్న భయం వుండాలి. అవినీతికి సంబంధించిన వి చారణలో బాధితులు చెప్పే అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. నిజాయతీ అధికార్లకు ప్రోత్సాహం, తగిన అండదండలు అందించాలి! ఉద్యోగ యూనియన్లకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు! యూనియన్లు గుదిబండలు తప్ప ప్రజాసేవకు పనికిరావు! 

ప్రైవేటు సంస్థలు విజయవంతమవుతున్నాయంటే పై అంశాలను పాటించడమే ప్రధాన కారణం.కానీ మన వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిపోయిందంటే, ఈ లంచం అనే భూతం, ఓటు వేసేదగ్గరి నుంచి మొదలై పై స్థాయి వరకు ఊడలు పాకిపోయింది. రాజకీయమే పెట్టుబడిగా మారినప్పు డు అవినీతి మాత్రమే లాభాలు తెచ్చిపెడుతుంది. నిజాయతీగా వుండేవాడు ఎందుకూ కొరగా కుండా పోయే రోజులివి! కానీ నిజాయతీగా వ్యవహరించే అధికార్లు ‘నిప్పు’లాగా ఎప్పుడూ వెలుగుతూనే వుంటారు. వారికి సమాజంలో వుండే గౌరవం, అవినీతి అధికార్లకు వుండదు. డబ్బు విలాసవంతమైన జీవితాన్నిస్తుంది కానీ, నైతికతతో కూడిన ప్రశాంతతను మాత్రం ఇవ్వదు! అవినీతిలో మునిగిన వారి జీవితం ‘మీటరు’ సక్రమంగా పనిచేయని ఆటో ప్రయాణం వంటిది. వేగంగా పెరుగుతూ, ఒక్కసారిగా పడిపోతుంది! ఇక లేవడం కష్టం!

సిరిసిల్ల జిల్లాలో పోలీస్ విషాద దుర్ఘటన ప్రమాదం.

లిఫ్ట్ ప్రమాదంలో గాయపడిన సెక్రటేరియట్ మాజీ సిఎస్ఓ తోట గంగారాం మృతి..
* సిరిసిల్ల జిల్లాలో పోలీస్ విషాద దుర్ఘటన ప్రమాదం..

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు…
లిఫ్ట్ ప్రమాదంలో గాయపడిన సెక్రటేరియట్ మాజీ సిఎస్ఓ తోట గంగారాం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ కు చెందిన కమాండెంట్ తోట గంగారాం(58) సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్ మెంట్ లో సోమవారం అర్ధరాత్రి డిన్నర్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు లిఫ్ట్ వద్ద కొద్దిసేపు వెయిట్ చేశారు. ఏదో సౌండ్ రావడంతో లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లగా కింద పడ్డారు. తీవ్రగాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే గంగారాం చనిపోయారని నిర్ధారించారు.
బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన వారు. కాగా, ఆయనకు భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారాం మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరియు జిల్లా పోలీసు అధికారులు నివాళి  తెలిపారు.

హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం.

హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్:బస్తీ దవఖానలో చిన్న చిన్న మరమ్మత్తుల కోసం సీనియర్ జర్నలిస్ట్ షకిల్ అహ్మద్ రూ. 15,000 నగదు అందజేశారు. ఈ మొత్తాన్ని ఏఎన్ఎం బి. రేణుక కు అందించారు, దవఖానకు రంగులు వేయించడం, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.ఆరోగ్య సేవలు మెరుగుపరిచే లక్ష్యంతో తాను సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెవరైనా ఆర్థిక సహాయం అవసరమైతే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

కానిస్టేబుల్ తిరుపతి ని అభినందిస్తున్న నెక్కొండ ప్రజలు.

సలాం పోలీస్….

@ కానిస్టేబుల్ తిరుపతి ని అభినందిస్తున్న నెక్కొండ ప్రజలు

#నెక్కొండ, నేటి ధాత్రి :

పోలీసులంటే భయంతో వణికిపోయే ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ ను ఏర్పాటు చేయడంతో ప్రజలతో మమేకంగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో పోలీస్ సేవలు అత్యంత అమోఘం అని చెప్పవచ్చు. పోలీస్ సేవలో భాగంగానే 2024- 25 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తుండడంతో మొదటిరోజు పరీక్షకు నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్దకు వచ్చిన విద్యార్థిని తన పరీక్ష కేంద్రం అక్కడ కాదని నెక్కొండ మోడల్ స్కూల్లో ఉందని ఉపాధ్యాయులను తెలుసుకొని నెక్కొండ ప్రభుత్వ కాలేజీ నుండి ప్రభుత్వం మోడల్ స్కూల్ లో పరీక్ష రాయవలసి ఉండడంతో సమయం కూడా కేవలం ఐదు నిమిషాల సమయం ఉండడంతో ఆ విద్యార్థి ఇక పరీక్ష రాయలేనేమో అని బోరున్న విలపించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న బానోతు తిరుపతి అనే కానిస్టేబుల్ వెంటనే ఆ విద్యార్థి దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని తెలుసుకుని ఐదు నిమిషాల వ్యవధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మోడల్ స్కూలుకు తన బైక్ పై తీసుకువెళ్లి నిర్ణీత ఐదు నిమిషాల వ్యవధిలో విద్యార్థిని పరీక్షకు హాజరు చేయడంతో ఆ విద్యార్థిని కానిస్టేబుల్ తిరుపతికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది. ఇది అంతా ఓ వ్యక్తి వీడియో తీసి పలు నెక్కొండ మరియు వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో సలాం పోలీస్ అన్న అంటూ కానిస్టేబుల్ తిరుపతి ని నెక్కొండ ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ ఐడీ కార్డుల రగడ

సమస్యను పెద్దది చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ యత్నం

మూడు నెలల్లో పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం హామీ

నెంబరు డూప్లికేషన్‌ అంటే దొంగ ఓట్లు కాదన్న ఎన్నికల సంఘం

ఎదురుదాడికి దిగుతున్న భాజపా

గత ఎన్నికలప్పుడే నకిలీ ఓట్లపై భాజపా నేత సుబేందు ఫిర్యాదు

ఇప్పటికే అప్రతిష్ట పాలైన మమతా ప్రభుత్వం

తృణమూల్‌లో పెరుగుతున్న విభేదాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డుల (ఈపీఐసీ)నెంబర్ల డూప్లికేషన్‌ సమస్యను సత్వరం పరిష్కరించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన పదిమంది నాయకుల బృందం ఈనెల 11న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలువనుంది. ఈపీఈసీ నెంబర్ల డూప్లికేషన్‌ విషయంలో ఎన్నికల కమిషన్‌, భాజపాలు కుమ్మక్కయ్యాయంటూ ఫిబ్రవరి 27న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిజానికి గత పార్లమెంట్‌ ఎ న్నికల సందర్భంగా బీజేపీ నాయకుడు సుబేందు అధికారి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అరీజ్‌అఫ్తాబ్‌ను కలిసి రాష్ట్రంలో 16లక్షల దొంగ ఓటరు కార్డులు న్నాయని ఫిర్యాదు చేయడం గమనార్హం. అప్పుడు దీన్ని పట్టించుకోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు నెంబర్ల డూప్లికేషన్‌పై నానా రగడ చేస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా యధావిధిగా ఎదురుదాడికి దిగుతుండటంతో రాష్ట్ర రాజకీయం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఇప్పటికే ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటనతో పాటు పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన మమతా బెనర్జీ ఈ ప్రతికూలతలనుంచి బయట పడేందుకు ఓటర్ల ఐ.డి. డూప్లికేషన్‌ను రాజకీయ అస్త్రంగా మలచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తన మేనల్లుడినుంచి చాపకింద నీరు రాజకీయాన్ని కూడా ఆమె ఎదుర్కొంటున్న నేపథ్యంలో బెంగాల్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోపక్క తృణమూ ల్‌ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పకడ్బందీగా అడుగులు ముందుకేస్తుం డటంతో, తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ అక్రమ వలసలు, రోహింగ్యాల దొంగవోట్లతో అధికారంలోకి రాగలగలుతున్నారన్న ఆరోపణలున్న నేపథ్యంలో అటువంటి ఓట్లు ఎక్కడ బయటపడతాయోనన్న భయం కూడా, మమతా బెనర్జీ ఎదురుదాడు లకు దిగేందుకు ఒక కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోయిన ఎన్నికల తర్వాత బెంగాల్‌లో జరిగిన హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా వుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐ.డి.కార్డుల గొడవ రాష్ట్రంలో రాజకీయాలను కుదిపేస్తున్నది.  

పశ్చిమబెంగాల్‌లో బోగస్‌ ఓటర్ల బాగోతం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకే ఐ.డి. నెంబరు కలిగిన 25వేల వోటర్‌ కార్డులను గత నవంబర్‌లో ఎన్నికల కమిషన్‌ కనుగొంది. మొత్తం రాష్ట్ర అసెంబ్లీలో 294 స్థానాలుండగా, 11 నియోజకవర్గాల్లో ఇవి బయటపడ్డాయి. 

గత నవంబర్‌ 11న రాష్ట్ర ఎన్నికల అధికారి మొత్తం 7.4కోట్ల ఓటర్ల జాబితాను విడుదల చేయగా, వీటిల్లో 16 లక్షల ఓటర్ల పేర్లను సరిచేయడమో లేక తొలగించడమో చేశారు. బంగ్లాదేశ్‌ సరిహద్దులోని దక్షిణ బోన్‌గామ్‌ (ఉత్తర 24`పరగణాల జిల్లా), నేపాల్‌ సరిహద్దులోని పానిటంకి సమీపంలోని మతిగర`నక్సల్‌బరి (డార్జిలింగ్‌) నియోజకవర్గాల్లో ఒకే ఐ.డి. నెంబరు కలిగిన ఓటరు కార్డులను కనుగొన్నారు. ఒకే నెంబరు కలిగిన ఎలక్టోరల్‌ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్‌) లేదా మల్టిపుల్‌ ఓటర్‌ ఐడీ కార్డులను ఉత్తర బోన్‌గామ్‌, మధ్యమ్‌గ్రామ్‌, రాజార్‌హట్‌`గోపాల్‌పూర్‌, కన్నింగ్‌ పుర్బా, బారుయ్‌పూర్‌ పుర్బా, పశ్చిమ కుర్సియాంగ్‌, సిలిగురి, ఫలకత ప్రాంతాల్లో కూడాకనిపించినట్టు ఎన్నికల అధికార్లు తెలిపారు. ఇటువంటి డూప్లికేట్‌ ఐ.డి.కార్డులను గుర్తించి తొలగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఎన్నికల కమిషన్‌ అధికార్లు అప్పట్లో తెలిపారు. ప్రస్తుతం ఒకే పేరుతో వున్న ఓటరు ఐ.డి. కార్డులను ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో పరిశీలించి వీటిల్లో నకిలీలను తొలగించే ప్రక్రియను కమిషన్‌ చేపట్టింది. ఒకే ఐ.డి. నెంబరు పునరావృ త్తం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని అధికార్లు చెబతున్నారు. మరి ఎందుకు ఇట్లా వచ్చాయనేది తేలాల్సివుంది. ఇప్పటికైతే ఈ నియోజకవర్గాల్లో ఇటువంటి డూప్లికేట్‌ కార్డులను కనుగొన్నప్పటికీ, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి వుండకూడదనేం లేదని ఎన్నికల అధికార్లు అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్‌ 11న విడుదల చేసిన ఓటర్ల ముసాయిదాలో 7.4కోట్ల ఓటర్లుండగా, 6.2లక్షల కొత్త పేర్లు జాబితాల్లో చేర్చగా, 4.5లక్షల పేర్లు తొలగించారు, 11.2లక్షల పేర్లలో తప్పులు సరిదిద్దారు. 

ఇవి బోగస్‌ ఓట్లు కావు

రెండు కార్డులకు ఒకే ఈపీసీ నెంబరు వుండటం బోగస్‌ వోట్ల కిందికి రాదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. అంతేకాదు అందరు ఓటర్లకు ప్రత్యేక ఈపీఐసీ నెంబర్లను కేటాయించడం ద్వా రా ఈ సమస్యను పరిష్కరించవచ్చునని ఈసీ స్పష్టం చేసింది. అంతేకాదు ఓటర్ల డేటాబేస్‌ను డి జిటలైజేషన్‌ చేయడానికి ముందు మ్యాన్యువల్‌గా వికేంద్రీకరణ పద్ధతిలో ఓటర్ల నమోదు చేసిన ప్పుడు జరిగిందని, దీన్ని మరో మూడు నెలల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఇక ప్రతి చిన్న విషయాన్ని రాజకీయంగా రచ్చరచ్చ చేసే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఈ అంశానికి విపరీతమైన రాజకీయ కోణాన్ని ఆపాదిస్తూ, భాజపా, ఎన్నికల అధికార్లు కుమ్మక్కయి ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ పశ్చిమబెంగాల్‌ వీధులకెక్కడం తాజా పరిణామం. ‘గుజరాత్‌, హ ర్యానాల్లో కూడా పశ్చిమబెంగాల్‌లో మాదిరిగానే డూప్లికేట్‌ ఈపీఐసీ నెంబర్లు ఇ చ్చారు. ఆవిధంగా ఆన్‌లైన్‌లో బోగస్‌ ఓటర్లను నమోదు చేశారంటూ’ ఆరోపణలకు దిగారు. మహారాష్ట్ర, ఢల్లీిల్లో ప్రతిపక్ష పార్టీలు వీటిని గుర్తించలేదు. కానీ మేం గుర్తించామంటూ ఆమె గర్వంగా చెప్పుకుంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘం మళ్లీ స్పందించింది. ‘‘ఈపీఐసీ నెంబర్లు ఒకటే ఉన్నప్పటికీ, పోలింగ్‌ బూత్‌, నియోజకవర్గం తదితర వివరాలు భిన్నంగా వుంటాయి కనుక ఓటర్లు తమకు కేటాయించిన బూత్‌ల్లో నిరభ్యంతరంగా ఓటు చేయవచ్చు’ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదిలావుండగా బీజేపీ పశ్చిమ బెంగాల్‌ కో`ఇన్‌చార్జ్‌ మాలవ్యా, త్రిణమూల్‌పై ఎ దురుదాడికి ది గారు. మమతా బెనర్జీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కేవలం ఓటర్లను తప్పు దోవ పట్టించేందుకే ఆమె రాజకీయం చేస్తునారంటూ ఆరోపించారు. అంతేకాదు మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకుకోసం అక్రమంగా బంగ్లాదేశ్‌ నుంచి వలసవచ్చినవారు మరియు రోహింగ్యాలకు నకిలీ ఓటర్‌ ఐ.డి.కార్డులు ఇప్పించారని అటువంటి దొంగ ఓటర్ల పేర్లను తొలగించాలని మాలవ్యా ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు భాషాపరమైన మైనారిటీలు, మతువా వర్గానికి చెందిన హిందూ వలసదార్ల ఓట్లను తొలగించాలని చేస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రయత్నాలనువమ్ము చేయాలని కూడా కమిషన్‌ను ఆయన కోరారు. బంగ్లాదేశ్‌లో నిరంతరం జరుగుతున్న దాడులు, హింసాకాండ నేపథ్యంలో అక్కడినుంచి పారిపోయిన మతువా వర్గానికి చెందిన హిందు వులు బెంగాల్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 

తృణమూల్‌లో విభేదాలు

ఇదిలావుండగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఫిబ్రవరి 27న పార్టీ కేంద్రకార్యాలయంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కొత్త ఓటర్ల జాబితాను సమీ క్షించడం ఈ సమావేశం ప్రధాన అజెండా. అయితే ఈ సమావేశానికి పార్టీ అఖిలభారత ప్రధానకార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ గైర్హాజరు కావడం పార్టీలో అంతర్గత రాజకీయ విభేదాలను మరోసారి బయటపెట్టాయి. ఈ సమీక్ష ద్వారా ఓటర్ల లిస్ట్‌లో అవకతవకలు జరిగాయని నిర్ణయించి ప్రజల్లోకి వెళ్లాలన్నది వ్యూహం. విచిత్రమేమంటే ఈ కమిటీ పేర్లలో మొదటి స్థానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభ్రతా బక్షి పేరుండగా, రెండో స్థానంలో మాత్రమే తనపేరుండటం అభిషేక్‌ బెనర్జీ కి నుకకు కారణమని ఒక్కసారి వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా ఇది పెద్ద చర్చనీయాంశం కావడంతో, మమతా బెనర్జీ తెలివిగా, ఇటీవల నేతాజీ ఇండోర్‌ స్టేడి యంలో నిర్వహించిన ర్యాలీనుద్దేశించి అభిషేక్‌ బెనర్జీ చేసిన ప్రసంగాన్ని బహిరంగంగా ప్రశం సించడం ద్వారా ఊహాగాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయగలిగారు. పార్టీలో కొందరు ఈ తాజా పరిణామాలను తక్కువ చేసి చూపడానికి యత్నిస్తున్నారు. కానీ ఓటర్ల జాబితాకు సంబంధించిన పనులన్నీ టీఎంసీ కేంద్రకార్యాలయంలోనే జరగాలని మమతా బెజర్జీ కచ్చితమైన ఆదేశాలి చ్చిన నేపథ్యంలో, పార్టీలో రాజకీయాల గతిశీలతలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీలోని మరొక వర్గం పేర్కొంటున్నది. అయితే అభిషేక్‌ అనుకూల వర్గాలు మాత్రం ఆయన సొంత ని యోజకవర్గమైన డైమండ్‌ హార్బర్‌లో నిర్వహిస్తున్న ‘శేబాష్‌రే’ పేరిట నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలు చివరి దశలో వుండటమే ఆయన గైర్హాజరుకు కారణమని సమర్ధిస్తున్నాయి. ఫిబ్రవరి 27న కోల్‌కతాలో ఓటర్ల జాబితాపై కీలక సమావేశమున్నప్పటికీ అభిషేక్‌ బెనర్జీ, డైమండ్‌ హార్బర్‌ లో నిర్వహిస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గనడం గమనార్హం. 

వర్చువల్‌ సమావేశానికి యత్నాలు

ఇదిలావుండగా పార్టీకి చెందిన అన్ని రాష్ట్ర కమిటీలు, జిలా అధ్యక్షులు, సంస్థాగత నాయకులతో వర్చువల్‌ సమావేశాన్ని మార్చి 15న నిర్వహించడానికి డైమండ్‌ హార్బర్‌ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు భౌతికంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త పద్ధతిని తీసుకురావడంతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. దీన్ని రాష్ట్రంలోని దిగువస్థాయి నాయకులు తమకు సౌకర్యవంతమైన పద్ధతిగా భావించే వీలు ఏర్పడిరది. మరి మమతా బెనర్జీ ఇటువంటి సమావేశాలను నిర్వహించినప్పుడు ఆయా నాయకులు వ్యక్తిగతంగా హాజరుకావడం తప్పనిసరి! ఈ నేపథ్యంలో పార్టీలో రెండు కేంద్రస్థానాలు కొనసాతున్నాయన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. కాగా ఫిబ్రవరి 27న జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితా సమీక్షా బాధ్యతలను వివిధ నాయకులకు అప్పగించడం మరో పరిణామం. ఈ వికేంద్రీకరణలో భాగంగా పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షీ దక్షిణ కోల్‌కతాకు, అభిషేక్‌ బెజర్జీ దక్షిణ 24 పరగణాల జిల్లాలో సమీక్షకు బాధ్యత వహి స్తారు. పార్టీలో క్రమంగా కేంద్రీకృత వ్యవహారశైలి, వికేంద్రీకృతంగా మారుతున్నదనడానికి ఇది ఉదాహరణగా కొందరు పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుబ్రతా బక్షీ నేతృత్వంలోని కమిటీ బృందం రాష్ట్ర ఎలక్టోరల్‌ అధికారిని కలిసి, ఓటర్లకు ప్రత్యేక ఐ.డి. ఇచ్చే కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని కోరారు. రాజకీయ పార్టీలు నియమించే బూత్‌ లెవెల్‌ ఆఫీసర్ల సమక్షంలో పారదర్శకంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇవ్వడం గమనార్హం.

ఉద్యమ కారులకు పెద్ద పీట!

`మళ్లీ రంగంలోకి రాములమ్మ!

`ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక!

`పార్టీకి చేసిన సేవలకు ఎట్టకేలకు గుర్తింపు.

`గల్లీ నుంచి డిల్లీ దాకా తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక మహిళా నాయకురాలు.

`కోట్ల రూపాయల సంపాదన వదులుకొని తెలంగాణ కోసం రంగంలోకి దిగారు.

`తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఉద్యమానికి ఊపిరిపోశారు.

`పార్లమెంటు సభ్యురాలిగా తన గళం వినిపించారు.

`తెలంగాణ కోసం పార్లమెంటును గడగడలాడిరచారు.

`ఒంటరిగా కొన్నేళ్ల పాటు లోక్‌సభ సాగుకుండా అడ్డుకున్నారు.

`తెలంగాణ తెచ్చి రాజకీయంగా కుట్రకు బలయ్యారు.

`కల నెరవేరింది!

`అద్దంకి అడ్డేముంది!!

`నల్గొండ ఉమ్మడి జిల్లా రాజకీయాలకు ఊపిరి వచ్చింది.

`అణగారిన వర్గాల గొంతుకు బలమొచ్చింది.

`కాంగ్రెస్‌ పార్టీకి మరో పదునైన గళం పదునుపెట్టినట్లైంది.

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన ప్రజల్లోకి తీసుకెళ్లే గొంతుక వచ్చింది.

`కాంగ్రెస్‌పై మాట్లాడాలంటే ప్రత్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.

`ఉద్యమ కాలం నాటి సింహం నిద్ర లేచింది.

`కాంగ్రెస్‌ కు రక్షణ కవచం తొడిగినట్లైంది.

`ఇచ్చిన మాట నిలబెట్డుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి.

`కాంగ్రెస్‌ కు కంచుకోట లాంటి నాయకత్వం మరొకటి చట్ట సభకు చేరింది.

……………

`కంచు కంఠం దాసోజు!

`పాయింట్‌ లేవదీస్తే ప్రత్యర్థులకు మాటరాదు.

`తెలంగాణ ఉద్యమ కారుడు.

`గతంలోనే దక్కాల్సిన అవకాశం.

`లేట్‌గా వచ్చినా లెటెస్ట్‌ గానే వుంది.

`ఎట్టకేలకు దాసోజును ఎమ్మెల్సీ వరించింది.

రాజకీయాలలో అవకాశాలు వెత్తుక్కుంటూ కొంత మందికి వస్తాయి. కొంత మందికి జీవితాంతం ఎదురుచూసినా రావు. రాజకీయాల్లో ఎంత కష్టపడినా, ఆవ గింజంత అదృష్టంకూడా వుండాలని అంటారు. అదే నిజమని కూడా చాలా సార్లు రుజువైంది. ఈసారి ఎమ్మెల్సీల ఎంపికలో అలాంటి సంకేతాలు కనిపించాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్‌, ఇటు బిఆర్‌ఎస్‌ ఎంపిక చేసిన అభ్యర్ధులను చూస్తే అర్ధమౌతుంది. ఎంత కష్టపడినా, ఎన్ని త్యాగాలు చేసినా కొన్ని సార్లు వారికి పదవులు చాలా అలస్యమౌతుంటాయి. ప్రజలనుంచి కూడా వారికి సానుభూతి ఎంత వున్నా, సరే కొన్ని సార్లు అవకాశాలు దక్కవు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా వారి పోరాటం నిజంగానే స్పూర్తిదాయమే..కాని అలాంటి వారికి పదవులు అందకపోతే మిగిలేది నైరాశ్యమే..ఓపికకు కూడా ఒక హద్దు వుంటుంది. ఏడాదో, రెండేళ్లో కాదు. దశాబ్దాల పాటు ప్రజా సేవ, రాజకీయ సేవలు చేసిన వారికి పదవులు దక్కకపోతే రాజకీయాలలో కొనసాగడం అంత సులువు కాదు. అయినా పదవులో,తమ పరిశ్రమో చూద్దామని కంకణం కట్టుకున్నవారికి మాత్రం ఎప్పటికైనా మళ్లీ గుర్తింపు వస్తుందని చెప్పడానికి ఈసారి ఎమ్మెల్సీ పదవులు పంపకమే నిదర్శనమని చెప్పకతప్పదు. ముందుగా తెలంగాణ ఉద్యమనాయకురాలు, సినీ నటి విజయశాంతి. తెలంగాణ సమాజమే కాదు, దేశ వ్యాప్తంగా వున్న ఆమె అభిమానులు రాములమ్మ అంటూ గొప్పగా పిలుచుకుంటారు. సినీ కేరిర్‌ ఉచ్చదశలో వున్నప్పుడు ఎవరూ వదులుకోవాలని అనుకోరు. కాని దేశంలోనే ఏ మహిళా నటి తీసుకోనంత రెమ్యునరేషన్‌తో సినిమాల్లో విజయశాంతి నటించారు. జాతీయ స్దాయిలో ఆమె ఊర్వశి అవార్డును సొంతం చేసుకున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు. సినిమా అంటే హీరోయిజం. అలాంటి దశలో హీరో లేకుండా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు కోట్లు ఖర్చు పెట్టి తీసేంత ఇమేజ్‌ వున్న నటి విజయశాంతి. అలాంటి విజయశాంతి తెలంగాణ కోసం తన జీవితం త్యాగం చేశారు. తన కేరిర్‌ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన కాదనుకున్నారు. నా తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించే కాలం రావాలని కోరుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాలనుకున్నారు. తెలంగాణ సాదన కోసం ఆమె తల్లి తెలంగాణ అనే పార్టీని స్దాపించి తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర్ర ఆకాంక్షను బలపర్చారు. మరింతగా తెలంగాణలో చైతన్యం నింపారు. తెలంగాణ సమాజమంతా ఉద్యమంలో పాలు పంచుకునేలా చేశారు. బిఆర్‌ఎస్‌ అప్పటి టిఆర్‌ఎస్‌కు ధీటుగా తెలంగాణ వాదం వినిపించారు. కేసిఆర్‌ కోరిక మేరకు ఉద్యమ సంస్దలన్నీ ఒకే వేదిక మీదకు వస్తే తెలంగాణ ఉద్యమానికి మరింత బలం పెరుగుతుందని నమ్మారు. కేసిఆర్‌ మాటను మన్నించారు. తల్లి తెలంగాణ పార్టీని భేషరుతుగా టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆమె మెదక్‌ నుంచి పోటీచేసి గెలిచారు. పార్లమెంటులో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఇక నిరంతరం ఆమె ఇటు గల్లీలోనూ, అటు డిల్లీలోనూ తెలంగాణ గళం వినిపించిన ఏకైక నాయకురాలు విజయశాంతి. అయితే డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రకటన వచ్చినా, తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తీసుకోవడాన్ని ఆమె పార్లమెంటు సాక్షిగా నిలదీశారు. నాలుగేళ్లపాటు ఆమె నిరంతరం పార్లమెంటులో తన గళం వినిపించారు. ఆ సమయంలో టిఆర్‌ఎస్‌ నుంచి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచారు. ఒకరు కేసిఆర్‌, మరొకరు విజయశాంతి. కేసిఆర్‌ పార్లమెంటు సమావేశాలకు హజరు కాకపోయినా, ఆమె మాత్రం పార్లమెంటు వేదికగా సభ జరిగినన్ని రోజులు స్పీకర్‌ పోడియం వద్ద నిలబడి నిరసన తెలియజేసేవారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ ఎంపిలు పార్లమెంటు బైట నిరసన చేస్తే, విజయశాంతి ఏకంగా స్వీకర్‌ పోడియం ముందే నిరసన తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు. పార్లమెంటు జరిగినన్ని రోజులు, సభ సాగినంత సమయం ఆమె అయితే వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేసేవారు. లేకుంటే తన సీట వద్దనే నిలబడి ఉద్యమ ఆకాంక్షను నినాదాల ద్వారా తెలియజేసేవారు. 2014కు ముందు ఆమెను కేసిఆర్‌ పక్కన పెట్టే రాజకీయం చేశారు. తెలంగాణ వస్తే విజయశాంతికి క్రెడిట్‌ పోవడం ఆయన ఇష్టం లేదు. అందుకే ఆమెను పార్టీలో ప్రాధాన్యత తగ్గిసూ వచ్చారు. అయినా ఆమె ఉక్కు మహిళ. పదవుల కోసం ఆమె తెలంగాణ ఉద్యమం చేయలేదు. తెలంగాణ వస్తే చాలనుకున్నారు. తెలంగాణ సాధనలో ముందు వరసలో వున్నారు. తెలంగాణ రావడంలో తన పాత్రను చరిత్రలో లిఖించుకున్నారు. తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్‌ లో చేరారు. ఆ పార్టీలో కూడా తగిన ప్రాదాన్యత లభించలేదు. తర్వాత బిజేపిలోకి వెళ్లారు. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కనిపంచలేదు. తిరిగి గత ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంటుగా పదవిని కూడా పొందారు. కాని సరిగ్గా ఎన్నికల సమయంలో ఆమె సహాకారం ఎవరూ కోరకపోయినా, తన కర్తవ్యాన్ని ఆమె నెరవేర్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. కాని ఆమె పదవులకోసం ఏనాడు ప్రయత్నం చేయలేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పుడే పార్టీ అధిష్టానం హమీ ఇచ్చింది. ఆ హమీని పార్టీ నిలబెట్టుకున్నది. ఏది ఏమైనా రాములమ్మ లాంటి చైతన్య కిరణం కాంగ్రెస్‌కు ఎంతో అవసరం. ఆ పార్టీ అధికారంలోకి రావడంలో రాములమ్మ ప్రయత్నం కూడా వుంది. అందుకే పార్టీ ఆమెకు ప్రాధాన్యత కల్పించింది.

క అద్దంకి దయాకర్‌. ఆయనకు పదవి రాకపోతే తెలంగాణ సమాజమే తిరగబడేంత పరిస్దితి కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్‌పార్టీ కోసం ఆయన చేసిన సేవను తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూనే వుంది. అడుగడుగునా ఆయనకు అన్యాయం జరుగుతుంటే సానుభూతి పెరుగుతూనే వుంది. తెలంగాణ ఉద్యమంలో అద్దంకి దయకర్‌ కీలకభూమిక పోషించారు. అటు మాలమహానాడురాష్ట్ర అధ్యక్షుడుగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమానికి అంకితయ్యారు. జేఏసి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. జేఏసి సమావేశాలకు ఆ సమయంలో హజరు కావాలంటే కొంత మంది ముందూ వెనకు ఆలోచించేవారు. కాని జేఏసి ఏర్పాటు చేసే ప్రతి సమావేశానికి, సభలకు ఆయన క్రమం తప్పకుండా హజరౌతూ వచ్చేవారు. తెలంగాణ గళం వినిపించేవారు. తెలంగాణ వ్యతిరేకులను తన వాక్చాతుర్యంతో చీల్చి చెండాడేవారు. ఉన్నత విద్యావంతుడు కావడం వల్ల తెలంగాణ మీద పూర్తి పట్టు వుంది. అవగాహన వుంది. గత చరిత్ర తెలుసు. వర్తమానంలో తెలంగాణ సమజానికి ఏం కావాలో తెలుసు. ప్రతి అంశంపై సునిశితన జ్ఞానం వుంది. ఆయా సమస్యల మీద పూర్తిగా పట్టు వుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎలా మోసపోయారు. ఎంత మోసపోయారు. మోసపోడానికి ప్రేరేపించిన అంశాలపై ఆయన అనర్గళంగా లెక్కలతో సహా చెప్పడంతో దిట్ట. అందుకే ఆయనకు పార్టీలకు అతీతంగా ఉద్యమ సమయంలో పేరొచ్చింది. అంత గౌరవం కూడా దక్కింది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఆహ్వానించింది. పార్టీలో చేర్చుకున్నది. నిజానికి ఆయన ఆ సమయంలో బిఆర్‌ఎస్‌లో చేరితే ఇప్పటికే అనేక రాజకీయ అవకాశాలు,పదవులు అందుకునేవారేమో! కాని కష్టపడడమే ఆయన తత్వం. ఏటికి ఎదురీడడం ఆయన నైజం. ఏదైనా సరే, కష్టపడిసాధించున్నదానిలో వుండే ఆత్మ సంతృప్తి మరెందులోనూ వుండదని నమ్ముతారు. ఎందుకంటే అద్దంకిదయకర్‌కు పదవీ కాంక్ష అప్పుడు లేదు. ఇప్పుడూ లేదు. కాని సమాజ దిశా నిర్ధేకులైన కొంత మందికి పదవులు అవసరం. సామాన్య వ్యక్తిగానే సమాజాన్ని ఎంతో చైతన్య పర్చిన అద్దంకి దయాకర్‌ లాంటి వారు చట్టసభల్లో వుంటే ఆ సమాజానికే ఎంతో మేలు కలుగుతుంది. అద్దంకి దయాకర్‌ అంటే ఒక ప్రశ్న. స్పందించే గళం. ఎదిరించే నైజం. పాలకులను నిలదీసే గుణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు చట్టసభలో వుంటే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి ఆయన 2014లోనే ఎమ్మెల్యే కావాలి. ఆ ఎన్నికల్లో పోటీ చేసినా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లోనూ గెలుపు తీరం చేరుకుంటున్న దశలో ఫలిత ంత తారు మారైంది. తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఆయనను లాక్కోవాలిన బిఆర్‌ఎస్‌ అనేక సార్లు ప్రయత్నం చేసింది. కాని అద్దంకి దయకర్‌ గాలి వాటం నాయకుడు కాదు. అంతెందుకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఆయన ఎదుర్కొన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ఎన్నికల్లో చిరునవ్వుతో సీటు త్యాగం చేశారు. తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గెలుపుకు కృషిచేశారు. ఆఖరు దశదాకా టికెట్‌ అద్దంకికే అని ప్రచారం జరిగినా, ఆఖరు నిమిషంలో ఆయనకు టికెట్‌ ద్కక్కపోయినా ఇబ్బంది పడలేదు. పార్టీ మీద అలగలేదు. నిరసన తెలియజేయలేదు. పైగా తెలంగాణ మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చేశాడు. పార్టీని గెలిపించడంలో కీలకభూమిక పోషించారు. తర్వాత ఎమ్మెల్సీ వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్‌ నుంచి టికెట్‌ వస్తుందని ఆశించారు. టికెట్‌ కన్‌ఫర్మ్‌ అనుకునే క్షణంలో మళ్లీ నిరాశే ఎదురైంది. అయినా ఆయన కలత చెందలేదు. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పాడు. తనకు ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది. ఆ కృతజ్ఞత వుంది. తనకు పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా పక్కకు జరిగేదిలేదు. పార్టీ మారే ప్రసక్తిలేదని పలుమార్లు చెప్పారు. ఆయనను అడుగడుగునా ఎవరు అడ్డుకుంటున్నారో ఆయనకుతెలుసు. ఎందుకు అడ్డుకుంటున్నారో తెలుసు. అయినా ఆయన ఏనాడు సహనం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. రాసి పెట్టి వుంటే అదే వస్తుందని నమ్మిన నాయకుడు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఆదరించేలేదు. ప్రజలు కూడా సానుభూతితో కోరుకుంటున్నప్పుడు పార్టీ సహకరించలేదు. ఎప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి అద్దంకి దయకర్‌. అంతే కాకుండా ఒక్కసారి మాట ఇస్తే తప్పని నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సమయం చూసి అద్దంకికి పదవి ఇప్పిస్తానని చెప్పారు. చెప్పినట్లే పదవి ఇప్పించారు.

ఇక బిఆర్‌ఎస్‌లో 2008 నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకి సేవలు చేస్తున్న నాయకుడు దాసోజు శ్రవణ్‌. మేదావి వర్గంలో ఒకడుగా పేరుపొందిన దాసోజు శ్రవణ్‌ తన రాజకీయాన్ని ప్రజారాజ్యాంతో మొదలు పెట్టారు. చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆ పార్టీలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. చిరంజీవి ముందు చెప్పిన సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఆ పార్టీలో చేరారు. అయితే 2009లో తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించారు. సమైక్య రాష్ట్రనినాదం అందుకున్నారు. ఆ సమయంలో దాసోజు శ్రవణ్‌ పార్టీని వదులుకున్నారు. అయితే ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న సందర్భంలో శ్రవణ్‌కు పదవి కల్పిస్తానని చిరంజీవి మాటిచ్చారు. దాసోజు రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని చిరంజీవి చెప్పారు. కాని శ్రవణ్‌కు నచ్చలేదు. అయితే ఇక్కడ మరో విషయం వుంది. దాసోజు ప్రజారాజ్యంపార్టీలో చేరినప్పటికీ ఆయన మనసంతా కేసిఆర్‌ చుట్టే వుంది. కేసిఆర్‌ ప్రసంగాలు వింటూ ప్రభావితమయ్యారు. ఎలాగైనా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి వున్నారు. కాకపోతే చిరంజీవి సామాజిక తెలంగాణ నినాదాన్ని శ్రవణ్‌ నమ్మారు. అందుకే ఆ పార్టీలో చేరారు. ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నాడో అప్పుడే ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి కేసిఆర్‌కు ఎంతో సన్నిహితులయ్యారు. ఎక్కెగడప, దిగే గడప అన్నట్లు కేసిఆర్‌ డల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ దాసోజు ఆయనతో వుండేవారు. ఇలా కేసిఆర్‌కు అంత్యంత సన్నిహితులలో ఒకడుగా మారారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీతరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీచేయాలని అనుకున్నారు. కాని ఆయనకు టికెట్‌ దక్కలేదు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లోనూ క్రియాశీలకంగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి అధ్యక్షుడయ్యాక శ్రవణ్‌ను దూరం పెడుతూ వచ్చారు. రేవంత్‌రెడ్డితో రాజకీయ విభేదాల కారణంగా ఆయన బిజేపిలో చేరారు. అక్కడి రాజకీయం ఆయనకు నచ్చలేదు. దాంతో తిరిగి బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. 2023లోనే ఆయనకు కేసిఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కాని అప్పటి గవర్నర్‌ తమిళ సై ఆ ఫైలు మీద సంకతం చేయకపోవడంతో ఆ ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. అప్పడు దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవి వాయిదా పడిరది. ఆ సమయంలో అందాల్సిన ఎమ్మెల్సీలు ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బిఆర్‌ఎస్‌ ఒకరిని ఎంపిక చేసే అవకాశం వచ్చింది. ఆ ఒక్కటి దాసోజు శ్రవన్‌ను వరించింది. నిజానికి 2014 వరకు కేసిఆర్‌తో వున్న దాసోజు ఎన్నికల ముందు పార్టీని వీడడం ఆయన చేసిన తొందరపాటు చర్య. ఎందుకంటే దాసోజు కన్నాముందు నుంచి బిఆర్‌ఎస్‌లో వున్న వారున్నారు. దాసోజుకన్నా ముందు నుంచి ఉద్యమం చేస్తున్నవారు అనేక మంది వున్నారు. 2001 నుంచి కేసిఆర్‌తో కొనసాగుతున్న వాళ్లున్నారు. అయినా దాసోజు బిఆర్‌ఎస్‌లో చేరినప్పటినుంచి కేసిఆర్‌ ఎంతో ప్రాదాన్యత కల్పించారు. ఆ నాడు దాసోజు తొందరపడకపోతే ఇప్పటికే ఆయన రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. అటూ ఇటు తిరిగి వచ్చిన దాసోజుకు సత్వర న్యాయమే జరిగింది. ఎందుకంటే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ లాంటి వారు పదవులు రాకుండా బిఆర్‌ఎస్‌లో దాసోజు కన్నా ముందునుంచే వున్నారు. అయినా దాసోజు అదృష్టవంతుడే అని చెప్పాలి. బిఆర్‌ఎస్‌ గొంతు వినిపించడంతో అందరికన్నా దాసోజు వుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే రాజకీయంగా ఎదుర్కొవడంలో, పార్టీకి అండగా వుండడంలో దాసోజు ముందుంటారని చెప్పడంలో అతిశయోక్తికాదు. ఆల్‌దిబెస్ట్‌.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి ;

ఆనాటి కాలంలో ఎవరికి ఏమి తెలియని వారికి విద్య ద్వారా అందరినీ చైతన్య వంతులను చేయాలని ముందుగా స్త్రీల విద్యాభివృద్ధికి మరియు వారి హక్కుల కోసం ఎంతో కృషి చేసిన తొలి ఉద్యమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారూ,చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో *సావిత్రిబాయి పూలే వర్ధంతి*వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మల్లయ్య మాట్లాడుతూ పూర్వ కాలంలో ప్రజలు అమాయకత్వం తో బానీసలుగా బ్రతుకులు బ్రతుకుతున్న వారిని చూసి విద్యి ద్వారా చైతన్య వంతులను చేయాలని పట్టుదలతో మొదటి పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీల తో పాటు ప్రజలందరికి విద్యను అందించిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు. మహిళల తో పాటు ప్రజల హక్కుల కోసం ఎదురించి అలుపెరుగని పోరాటం చేసిన ఉద్రమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలిపారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి విశేష కృషి చేసిందని తెలిపారు. ఆమె చేసిన సేవలు మరువలేనివని స్త్రీలతో పాటు ప్రజలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ ఎమ్మార్పీఎస్ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్ పాముకుంట్ల చందర్ శీలపాక ప్రణిత్ దాసారపు సాంబయ్య మహిళలు పాల్గొన్నారు.

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు.

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు
ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి జర స్పందించరూ?
అధికారులను వేడుకుంటున్న వ్యవసాయదారులు, మహిళలు

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :-

ఐనవోలు మండల కేంద్రంలోని బొడ్రాయి దగ్గర నుంచి ఐలోని మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉండి వాహన దారులకు ఇబ్బందిగా ఉందని ఇటీవల సి. సి రోడ్డు వేశారు. అయితే కొత్త రోడ్డు వేశారని సంబరపడాలో లేక ఆ రోడ్డు కు లింకుగా ఉన్న అంగడి ప్రాంతం నుండి ఖమ్మరి వారి కుంట కింద ఉన్న వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లాల్సిన దారికి వాహనాలు దిగకుండా చేశారని బాధ పడాలో అర్ధం కాని అయోమయంలో ఆ ఏరియా రైతులు ఉన్నారు. రోడ్డు పోసిన అధికారులు,కాంట్రాక్టర్లు ప్రధాన రహదారికి లింక్ గా ఉన్న మట్టి బాటకు వెళ్లేందుకు వీలుగా రోడ్డును ఏటవాలుగా చేయడం మర్చి పోయారు. రోడ్డు వేసి చాలా రోజులు అవుతున్నా కనీసం ఇబ్బంది ఉన్నచోట మట్టి కూడా పోయలేదు. దాంతో అటుగా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే ద్విచక్ర వాహనదారులు రాత్రి పూట వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇవేవి పట్టించు కోకుండా అధికారులు రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. మరి ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప వారు స్పందించేలా కనిపించడం లేదు అని స్థానికులు వాపోతున్నారు.

అవినీతి ఆపరా! లంచాలు మానరా!!

`అన్నమే తింటున్నారా! 

`అది కూడా మింగుతున్నారా!!

`అన్నం కన్నా అదే బాగుందని లొట్టలేసుకొని ?

`నోటి దాక వెళ్లే ముందు ముద్దను చూసుకొనే తింటున్నారా!

`తాగేప్పుడు మంచి నీళ్లే తాగుతున్నారా?

`ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని చేతికి ఇంకు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు!

`లక్షలకు లక్షలు తీసుకుంటూనే దమ్ముంటే పట్టుకోండని కొందరు ఎమ్మార్వోలు సవాలు విసురుతున్నారు

`వార్తలు రాసే మీడియాను అవినీతి పరులే నిందిస్తున్నారు!

`లంచం తీసుకోమని మాత్రం ఎవరూ చెప్పడం లేదు

`అక్రమార్జనకు మీడియా అడ్డుపడుతుందని అక్కసు వెళ్లగక్కుతున్నారు

`లంచం కూడా హక్కు అనుకుంటున్నట్లున్నారా?

`సిగ్గు, శరం, అభిమానం అన్నీ వదిలేశారు

`అన్నం తినే మనిషిని ఎప్పుడో చంపుకున్నారు

`లంచం తీసుకోకుండా వుండలేకపోతున్నారు

`లంచం తీసుకునే వాడికంటే పెండల పురుగు నయం

`సమాజమంతా ఛీఛీ అంటున్నా నిస్సిగ్గుగా లంచాలు తింటున్నారు

`ఓ వైపు ఏసిబి దాడులు జరుగుతున్నా అధికారుల్లో భయం లేదు

`నిత్యం ఎక్కడో అక్కడ దొరుకుతూనే వున్నారు

`ప్రజలను పీడిరచుకు తింటూనే వున్నారు

`దొరికిన వాళ్లే కాదు దొరక్కుండా లంచాలు తింటున్న వాళ్లు చాలా మంది వున్నారు

`అవినీతి ఆరోపణలున్న ప్రతి అధికారి ఇంటి మీద ఏసిబి దాడులు నిర్వహించాలి

`అక్రమాస్థులను వెలికి తీయాలి

`అక్రమాస్థులన్నీ ప్రభుత్వ పరం చేయాలి

`లంచం తీసుకొని దొరికిన వారి ఉద్యోగం వెంటనే పోవాలి

`అప్పటి వరకు సంపాదించిన అక్రమార్జన ప్రభుత్వ పరం కావాలి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఉద్యోగమంటేనే లంచాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లు భావిస్తున్నారు కొందరు అధికారులు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు వస్తన్నాయన్నది మర్చిపోతున్నారు. కష్టపడి ఉద్యోగం సంపాదించున్నాం..అంటుంటారు. ఆ కష్టం జనంకోసం చేశారా? వాళ్లుకు ఉద్యోగం వచ్చిందే ప్రజల కోసం అన్నట్లు, లంచాలు తీసుకోవడం తమకు హక్కు అన్నట్లు ఉద్యోగులు తయారౌతున్నారు. తెలంగాణలో రోజూ కనీసం నలుగురు,ఐదుగురు ఉద్యోగులు ఏసిబికి పట్టుబడుతున్నారు. నిజం చెప్పాలంటే గతం కన్నా కొత్త ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా ఏసిబి రైడ్స్‌ జరుగుతూనే వున్నాయి. ఉద్యోగులు పట్టుబడుతూనే వున్నారు. అడ్డంగా దొరుకుతున్నారు. వేలకు వేలు, లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటూ రెడ్‌ హాండెడ్‌గా దొరుకుతూనే వున్నారు. అందులో కింది స్దాయి ఉద్యోగుల నుంచి మొదలు పెద్ద స్ధాయి అధికారుల వరకు పట్టుబడుతూనే వున్నారు. అయినా ఎక్కడా లంచాలు ఆగడం లేదు. తీసుకునే వారు ఆపడం లేదు. మాకు లంచం లేకుండా పని చేయమని చెప్పే ఉద్యోగులే పెరుగుతున్నారే తప్ప, లంచం తీసుకోమని ఏ ఒక్క అధికారి చెప్పడం లేదు. ఏ శాఖ కార్యాలయం ముందు మాకు లంచం ఇవొద్దు అని బోర్డు పెట్టడం లేదు. బాజాప్త లంచాలు తీసుకుంటున్నారు. దొరికే వారు దొరుకుతున్నారు. లంచాలు తీసుకుంటున్నా దొరకని వారు మేం దొరలమన్నట్లు ఫోజులు కొడుతున్నారు. పైగా మేం లంచాలు తీసుకుంటున్నప్పుడు పట్టుకోండి చూద్దాం…అని కొంత మంది తహసిల్ధార్‌లు సవాలు విసురుతున్నారు. ఆ మెసెజ్‌లను వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ కూడా చేస్తున్నారు. అసలు లంచాలు తీసుకోవడాన్ని ఆపడమే తప్పన్నట్లు కొంత మంది తహసిల్ధార్‌లు గగ్గోలు పెడుతున్నారు. ప్రజల నుంచి కొంత మంది తహసిల్ధార్‌ల అనుచరులు, ప్రైవేటు సైన్యం బహిరంగంగానే లంచాలుతీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న ఎమ్మార్వోల అనుచరులకు సంబందించిన వీడియోలు అనేకం బైట పడుతూనే వున్నాయి. ఏసిబికి పట్టుబడకుండా ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకొని మరీ లంచాలు తీసుకుంటున్నారు. అలా లంచాల సొమ్ముతో జీతాలిచ్చి అనుచరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంతకీ చాలా మంది తహసిల్ధార్‌లు ఉద్యోగాలు చేస్తున్నారా? లేక ప్రజల మీద వ్యాపారాలు చేస్తున్నారా? రెవిన్యూ వ్యవస్ధ కిందకు వచ్చే అన్ని శాఖల్లో ఇదేతంతు. ముఖ్యంగా ఎమ్మార్వోలకు ప్రైవేటు సైన్యం ఎందుకు? వాళ్లకు కార్యాలయంలో ఏ పని? దర్జాగా ఎమ్మార్వో కార్యాలయంలోకి ఎందుకు వస్తున్నారు? కార్యాలయంలో ఇతర ఉద్యోగుల కన్నా, ఎమ్మార్వోల ప్రైవేటు సైన్యమే ఎందుకు పెత్తనం చేస్తోంది. ఎమ్మార్వో డ్రైవర్‌ దగ్గర నుంచి ధరణి ఆపరేటర్‌తో సహా,ఇతర ప్రైవేటు వ్యక్తులతో కార్యాలయంలో ఆధిపత్యం. లంచాలు పుచ్చుకునేది వాళ్లే… ఆ సొమ్మును ఎవరి కంట పడకుండా ఎమ్మార్వోకు అందజేసేది వాళ్లే… అలాంటి వారికి ఎమ్మార్వో తన జీతం నుంచి డబ్బులు ఇవ్వరు. ఎమ్మారోలు తీసుకునే లంచాలను వారికి పంచుతారు. అంటే తాను తప్పు చేయడమే కాదు…వారి తప్పు బైటకు రాకుండా ప్రజలను పీడిరచి ప్రైవేటు వ్యక్తులను తహసిల్ధార్‌లు పోషిస్తున్నారు. దొంగలుదొంగలు ఊళ్లు పంచుకుంటారన్న సామెతను నిజం చేస్తున్నారు. మీడియా ఇంత పెరిగినా లంచాలు ఎక్కడా ఆగడం లేదు. ఏసిబి ఇంతగా దాడులు చేస్తున్నా లంచాలు ఆపడం లేదు. అసలు ఉద్యోగుల్లో భయమే లేదు. ఏసిబి పట్టుకున్నంత మాత్రాన ఉద్యోగం పోవడం లేదు. సస్పెండ్‌ అయిన కాలానికి కూడా తిరిగి మళ్లీ జీతం వస్తుంది. ఏసిబికి చిక్కిన లంచావతారులకు కూడా ప్రమోషన్లు వెంటనే వస్తున్నాయి. ఇలా అవినీతి అదికారులే ముందు అందలం ఎక్కుతుంటే ఒకరిని చూసి ఒకరు లంచాలకు మరుగుతున్నారు. కోట్లు సంపాదించి, కోటి ఖర్చు పెట్టి మళ్లీ ఉద్యోగంలో చేరుతున్నారు. ఇలాంటప్పుడు ఇక ఉద్యోగులకు భయం ఎందుకు వుంటుంది. కుటుంబం వీధినపడుతున్నందన్న బాధ ఎందుకుంటుంది? ఎలాగూ సిగ్గూ శరం విడిచేశారు. సమాజం ఏమనుకుంటే నాకేంటి? బంధువులు దగ్గర పరువు పోతే వచ్చే నష్టమేముంది? డబ్బుంటే అందరూ చుట్టాలే అన్నట్లు చట్టం కూడా వారికి చుట్టమైపోతోంది. ఉన్నతాధికారులే బంధువులైపోతున్నారు. లంచాలుతిని ఏసిబికి పట్టుబడినా మళ్లీ పై స్ధాయి అధికారులకు లంచాలిచ్చి మళ్లీ కొలువులో చేరుతున్నారు. కింది నుంచి పై స్ధాయి దాకా లంచం ఒక నిచ్చెనగా మారిపోయింది. అందుకే తప్పు చేసినా ఫరవాలేదు. ప్రజలు పీడిరచి సొమ్ము తిన్నా ఉద్యోగానికి ఏమీ కాదు? ఒక వేళ దొరికితే నాలుగు రోజులు జైలు.. ఆ తర్వాత బెయిలు…మరింత కాలం పోతే మళ్లీ కొలువు…ఇంతకన్నా ఏం జరుగుతుంది. లంచాలు తీసుకున్నారని కొలువు నుంచి పూర్తిగా తొలగిస్తారా? లేక జైలు శిక్ష వేసి ఉరి తీస్తారా? న్యాయ స్దానాన్ని కూడా మోసం చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. న్యాయ దేవత కళ్లు కప్పేస్తున్నారు. మళ్లీ కొలువులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమాజంలో లంచం ఆపమంటే ఎవరు ఆపుతారు..ఎందుకు ఆగుతారు..? ఇది వ్యవస్ధ లోపాలనే అదికారులు రెచ్చిపోతున్నారు. ఇలా అడ్డదిడ్డంగా లంచాలు తీసుకుంటూ మీడియా లేకుంటే బాగుండు అనుకుంటున్నారు. మీడియా పెరిగిపోవడం వల్ల బాజాప్తా లంచాలు తీసుకునే అవకాశం కుదరడం లేదని కొంత మంది తహసిల్ధార్‌లు మధనపడుతున్నారు. మీడియాను దూషిస్తున్నారు. జర్నలిస్టులనే ఎద్దేవా చేస్తున్నారు. గొట్టాలు పట్టుకొని తమను లంచాలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని మీడియాను కొంత మంది ఎమ్మార్వోలు దుమ్మెత్తి పోస్తున్నారు. మీడియా చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టుకొని వస్తుందని లేకి మాటలు మాట్లాడుతున్నారు. ఒక మీడియాకు టైటిల్‌ రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి వుంటే తప్ప రాదన్న సంగతి కూడా తెలియనంత దౌర్భాగ్యస్ధితిలో కొంత మంది ఎమ్మార్వోలున్నారు. మీడియా అనేది గాలికి పుట్టుకొచ్చేదికాదు. ఎవరికి వారు మీడియా అంటూ రారు. అయినా ప్రతి పౌరుడికి అవినీతిని ప్రశ్నించే హక్కు వుంది. లంచావతారులను పట్టించే స్వేచ్ఛవుంది. తప్పు చేసిన వారిని గుర్తించి చెప్పే అధికారం వుంది. దేశంలో ప్రతి పౌరుడు ఒక జర్నలిస్టే…ఈ మాత్రం పరిజ్ఞానం లేని వాళ్లు కొంత మంది ఎమ్మార్వో కొలువులు చేస్తున్నారు. అక్షరం ముక్క రాని వాళ్లు కూడా జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని జర్నలిస్టులంటే మింగుడు పడని ఎమ్మార్వోలు అంటున్నారు. ఎంత మంది ఎమ్మార్వోలకు కంపూటర్‌ ఆపరేటింగ్‌ వస్తుంది. అసలు కంపూటర్‌లో ఒక్కపదం కూడా టైపింగ్‌ చేయలేని ఎమ్మార్వోలు ఎంతో మంది వున్నారు. అలాంటి వాళ్లు ఎమ్మార్వోలుగా కొలువులు చేస్తున్నప్పుడు సమాజిక బాధ్యత కల్గిన వ్యక్తులు జర్నలిస్టులు కావడంలో తప్పేముంది? అవినీతి అధికారుల బాగోతాలు బైట పెడితే కొంత మందికి కలిగే నొప్పేమిటి? లంచాలు తీసుకుంటున్న అదికారులు రోజూ నిజంగానే అన్నంతింటున్నారా? లేక అందులో అదేదైనా అద్దుకొని తింటున్నారా? అదే రుచిగా వుందని లంచాలకు మరుగుతున్నారా? ఒక ఉద్యోగికి జీతం అంటే అన్నం లాంటంది. లంచం అనేది అశుద్దం లాంటిది. మేం జీతాలు తీసుకుంటాం…లంచాలు తీసుకుంటామంటే అన్నంతో పాటు అదికూడా తింటున్నట్లే అవుతుంది. ప్రజలంతా ఛీ ఛీ అంటున్నా, చీదరించుకుంటున్నా, కాండ్రిరచి ఉమ్మేస్తున్నా తుడుకుంటున్నారే గాని, లంచం తీసుకోవడం చాల మంది మానడం లేదు. ఎంగిలిని అద్దుకు తినడం ఆపడం లేదు. ఇంతకన్నా కుక్క బతుకు మరొకటి వుంటుందా? ప్రజలు ఎంత తిడుతున్నా మమ్మల్ని కాదని దులుపుకుంటూ, లంచాలు తీసుకుంటున్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరులైన ఉద్యోగులను ఏరివేసే యజ్ఞం మొదలుపెట్టింది. అయినా ఉద్యోగుల్లో ఆ వణుకు కనిపించడం లేదు. బెనుకు లేదు. లంచాలు తీసుకోవద్దన్న సోయి లేదు. అసలు ఉద్యోగాలు పోతాయన్న భయం లేకుండా పోతుండడంతో ఇప్పటి వరకు పట్టుబడని వారికి ఉద్యోగాలు ఇటీవల మళ్లీ ఇవ్వలేదు. అయినా అవినీతి అధికారులు మారడం లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు అవినీతి అధికారుల పట్ల కఠినంగా వుంటున్నారు. లంచాలు తీసుకొని అడ్డంగా దొరికిన వారిని కొలువులు ఇవ్వడం లేదు. దాంతో దొరక్కుండా లంచాలు తీసుకుంటున్నారు. పైగా మమ్మల్ని పట్టుకునే అవకాశం ఇవ్వమంటూ సవాలు చేస్తున్నారు. కాని నిజాయితీగా కొలువు చేస్తామని అనడం లేదు. అందుకే లంచావతారి అని తెలిస్తే చాలు వారి సంపాదనలపై దర్యాప్తు చేస్తే తప్ప అవినీతి పరులు దారికి రారు. లేకుంటే వారి ఆగడాలు ఆపరు. లంచాలు తీసుకోకుండా వుండరు. ప్రజలను పీడిరచుకుతినడం మానరు. అద్దుక తినే అలవాటు మానుకోరు.

బండి బలం.. కమలం విజయం!

బండితోనే కమల వికాసం.

బండితోనే కమలనాధుల్లో ఊపు

బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.

తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్‌ పెంచించే బండి.

బండి మాటలతోనే యువత బిజేపి వైపు చూపు.

జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందు అందరికీ అనుమానాలే.

అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ కనిపించిన నిరాశావాదం..

నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో నెలకొన్న అనుమానం.

పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వం.

అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ చేరిన గెలుపు తీరం.

బిజేపిని గెలిపించి చూపిస్తా అన్నాడు.

కాంగ్రెస్‌ ను ఓడిరచి చూపించాడు.

టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.

ఎమ్మెల్సీలను గెలిపించి చూపించిన ఘనత బండిదే.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి సంకేతం.

టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి సంకేతం.

మంత్రిగా వున్నా జనంలో వుండడమే సంజయ్‌కు ఇష్టం.

బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం.

బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ నేతల ఆకాంక్ష.

బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా.

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి చారిత్రక విజయం సాధించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని గెలిపించడంతో బిజేపి గొప్ప విజయాన్ని అందుకుంది. తెలంగాణ రాష్ట్రములోని బిజేపి నాయకులంతా అదే స్పూర్తిని అనురించాలి. తమ తమ రాజకీయ చతురతను, రాజకీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే తెలంగాణలో బిజేపి తిరుగులేని శక్తిగా మారడానికి ఎంతో సమయం పట్టదు. వచ్చే ఎన్నికలలో నాటికి బిజేపి ఎదురులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఓసారి లోతుగా విశ్లేషిస్తే మంత్రి బండి సంజయ్‌ చూపిన చొరవ అంతా ఇంతా కాదు. గత ఆరు నెలల కాలంగా ఒక్కో ఇటుకను పేర్చినట్లు తన ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేశాడని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ఒక తార్కాణం. ఎన్నికలలో బండి వ్యక్తి గత రాజకీయానికి బిజేపి బలం తోడై కమలం విజయం ఉత్తుంగ తరంగంలా విజయకేతనం ఎగరవేసింది. తెలంగాణ బిజేపి నాయకులు, శ్రేణులు బండి సంజయ్‌ను కొనియాడుతున్నారు. అసలు టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే కాదు, సరికొత్త చరిత్ర సృష్టించడం కూడా బిజేపికే చెల్లింది. నిజానికి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలంటే సహజంగా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవు. కానీ యూనియన్లు పాలు పంచుకునే రాజకీయానికి కొత్త తరహా రాజకీయం కూడా చూపించింది బండి సంజయ్‌ అని చెప్పకతప్పదు. గతంలో ఇలా ఏ పార్టీ ధైర్యం చేయలేదు. టీచర్స్‌ ఎమ్మెల్సీలలో పార్టీల అభ్యర్థులను రంగంలోకి దింపే సాహసం చేయలేదు. బండి సంజయ్‌ అంటేనే ఒక సాహసం. ఒక ధైర్యం. నలుగురు నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. నలుగురికి దారి చూపించే సరికొత్త మార్గం వేసేవారికే సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. అది తెలంగాణ రాజకీయాలలో తన మార్క్‌ రాజకీయాన్ని చూపించి, విజయాన్ని సొంతం చేసిన ఏకైక నాయకుడు బండి సంజయ్‌. బండి సంజయ్‌ తోనే తెలంగాణలో బండితోనే కమల వికాసమని మరో సారి రుజువైంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా బండితోనే బిజేపికి ఊపు…బిజేపికి గెలుపు అని చెప్పకతప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ బిజేపి రాజకీయాలలో బండి సంజయ్‌ కు ముందు, తర్వాత అని చెప్పడం కరక్ట్‌. గతంలో తెలంగాణలో బిజేపి ప్రభావం లేదని కాదు. ఆ పరంపరను కొనసాగించడమే కాదు, ఊపును తెచ్చి విజయ తీరాలను బిజేపి ఒంటరిగా అందుకునేలా బండి నాయకత్వం పని చేసింది. తెలంగాణలో సహజంగా హైదరాబాద్‌ లో బిజేపి ఎంతో కొంత కీలక భూమికనే పోషించేది. ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడూ జిహెచ్‌ఎంసిలో సీట్లు పది దాటింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో కనీస ప్రభావం కనిపించలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్‌ రంగంలోకి దిగారో అప్పుడే సీన్‌ మారిపోయింది. బిఆర్‌ఎస్‌ కు సీన్‌ సితారైంది. బిజేపి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఒక్క అంశం చాలు. బండి రాజకీయం ఎలా వుంటుందో చెప్పడానికి…గత ఎన్నికల ముందు బండి దూకుడుకు ఎందుకు కళ్లెం వేశారో ఎవరికి అర్థం కాలేదు. ఎన్నికల దాక బండి సంజయ్‌ అధ్యక్షుడుగా వుండే ఆ రాజకీయాలే మరోలా వుండేవి. కాంగ్రెస్‌ పార్టీ అధికారపు అంచులను తాకేది కాదు. బిఆర్‌ఎస్‌ కు 39 సీట్లు వచ్చేవే కాదు. కానీ అనుకోని రాజకీయ ఎత్తుగడలు బండిని లాగేయాలని చూసినా, పార్టీ కోసం నిరంతరం పరిశ్రమించే నాయకుడు సంజయ్‌. ఇప్పటికీ మించి పోలేదు. బిజేపి నాయకుల చూపంతా బండి నాయకత్వం వైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మరో సారి బండి చాతుర్యం సాక్ష్యంగా నిలిచింది. బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు కార్యకర్తలు మరింత బలంగా నమ్మడానికి కారణమైంది. తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్‌ పెంచించే బండి సంజయ్‌ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ యువతను బిజేపి వైపు మళ్లించడంలో బండిపోషించిన పాత్ర అందరికన్నా పెద్దది. ఒకప్పుడు బిజేపి చిన్న చిన్న పట్టణాలకే పరిమితం. ఇప్పుడు తెలంగాణ లో ప్రతి పల్లెల్లో బిజేపి జెండా ఎగురుతోంది. ప్రతి గ్రామంలో బిజేపి పార్టీ ఏర్పడిరది. ప్రతి ఊరులోనూ బిజేపి బలంగా మారుతోంది. జాతీయ నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిషాల జపం యువత చేస్తున్నారంటే ముమ్మాటికి అది బండి సంజయ్‌ కృషి అని చెప్పాలి. బండి మాటలతోనే యువత బిజేపి వైపు చస్తున్నారు. జాతీయ రాజకీయాల వైపు యువత ఆలోచనలు చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఎర్ర జెండాలు కనిపించేవి. ఆ జెండాలు పోయి, అంతటా కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. అందుకు ప్రధాన కారణం బండి సంజయ్‌. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే బిజేపి అభ్యర్థుల ఎంపికపై ముందు అందరికీ అనుమానాలే వుండేవి. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థుల ఎంపిక సమయంలో బిజేపి శ్రేణులలో నిరాశావాదం ఆవహించింది. అంతెందుకు నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో అనుమానం అలాగే వుంది. కానీ బండి సంజయ్‌ ప్రచార రంగంలోకి దిగిన తర్వాత ఆ మాటలు మాయమై పోయాయి. పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వంతో కాంగ్రెస్‌ పార్టీ ఖంగుతిన్నది. బిజేపి ప్రచారంలో దూసుకుపోతుంటే అప్పుడే కాంగ్రెస్‌ చేతులెత్తేసింది. అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ గెలుపు తీరం చేర్చింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంలో మిగతా బిజేపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకుల పాత్ర అంతా ఒక ఎత్తు. బండి సంజయ్‌ సాగించిన ప్రచారం మరో ఎత్తు. ఎందుకంటే బిజేపిని గెలిపించి చూపిస్తా అని బండి సంజయ్‌ శపధం చేశాడు. బిజేపి అభ్యర్థులను గెలిపించి, కాంగ్రెస్‌ ను ఓడిరచి చూపించాడు. టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి బండి నాయకత్వమే సంకేతం. టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి నిదర్శనం. కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా వున్నా జనంలో వుండడమే సంజయ్‌కు ఇష్టం. జనం సమస్యల పరిష్కారమే బండి సంకల్పం. కేంద్ర మంత్రిగా వున్న వాళ్లు గతంలో కంటికి కనిపించే వారు కాదు. అధికారిక కార్యక్రమాలు తప్ప జనంలో నడిచింది లేదు. కారు దిగి ప్రజల వద్దకు వచ్చే వాళ్లు కాదు. కానీ బండి అలా కాదు. సికింద్రాబాద్‌ లో గుడి విషయంలో అలజడి నెలకొంటే జనం మధ్యలో వున్నారు. అశోక్‌ నగర్‌లో గ్రూపు అభ్యర్థులు నిరసనలు తెలియజేస్తుంటే వారికి సంఫీు భావం తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా కాకుండా, ఒక బిజేపి సామాన్య కార్యకర్తగా నిరుద్యోగుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి విజయం సాధించడం ఆ పార్టీకి ఎంతో ఊపునే కాదు, మరింత ఊపిరి పోసినట్లైంది. దాంతో బండి సంజయ్‌ పై బిజేపి నాయకులలో మరింత నమ్మకం పెరిగినట్లైంది. అందువల్ల బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో కోరుతున్నారు. బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా బలంగా విశ్వసిస్తున్నారు. కేంద్ర బిజేపి నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది. ఈ సారి అధ్యక్ష ఎంపిక బండి సంజయ్‌కే అప్పగించాలని అనుకుంటోంది. మంత్రి పదవి బండి సంజయ్‌ కు అడ్డంకి కాదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో వుండి కూడా బండి మంత్రిగా కొనసాగడం ఇబ్బంది ఏ మాత్రం కాదు. మంత్రిగా కొనసాగిస్తూనే బండికి అధ్యక్ష పదవి మరోసారి ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

నోటిని అదుపులో పెట్టుకో..

నోటిని అదుపులో పెట్టుకో
– మాట్ల మధు పై కాంగ్రెస్ నాయకుల ధ్వజం
– కేకే సిరిసిల్ల వాసి
– గతంలో కెసిఆర్ కేకే ను మోసం చేశారు

సిరిసిల్ల:(నేటి ధాత్రి)

బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్ల మధు నువ్వు నిన్న మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని, భేషరతుగా కెకె మహేందర్ రెడ్డి అన్నకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. అర్హతకు, ( పరిధికి ) మించి మాట్లాడొద్దని అన్నారు.
పెద్దవారిని విమర్శిస్తే పెద్దొనివైతవని భ్రమలో మాట్లాడుతున్నావని అన్నారు.
కెకె మహేందర్ రెడ్డి పుణ్యమే సిరిసిల్ల నియోజకవర్గం, కెకె మహేందర్ ప్రతి ఇంటి,ఇంటికి గులాబి జెండాని, తెలంగాణ నినాదాన్ని పరిచయం చేసిందని అన్నారు.
నీకు తెల్వకపోతే కేటీఆర్, కేసీఆర్ లను అడుగని అన్నారు.
10 సంవత్సరాల కాలంలో మల్కపేట రిజర్వాయర్ లో నీళ్ళు నింపలేని చాతగాని మనుషులు ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలుసని అన్నారు.
కెకె మహేందర్ రెడ్డి ని విమర్శిస్తే కెకె మహేందర్ రెడ్డి అభిమానులు

స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు.

స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు

జహీరాబాద్:నేటి ధాత్రి

ఝరాసంగం మండలం లోని క్రిష్ణాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నాడు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ శ్రీ సూర్యప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా, ఇష్టంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులు కనబర్చిన ప్రతభను కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు ధర్ము రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకుని ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎచ్.యం. గా శాంసన్, ఎంఈఓ గా జెస్సిక, ఉపాధ్యాయులుగా దీపిక, అర్చన, ఎస్తర్ రాణి, వెన్నెల, సంధ్య, అరవింద్, సూరజ్ మంచి ప్రతిభ కనబర్చినారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్టార్ లిన్, సురేష్, నాగమణి గ్రామ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు, అంబమ్మ తదితరులు పాల్గొన్నారు.

కులరాజీయ కుంపట్లలో బిహార్‌ రాజకీయాలు

కులబలం కాదు నాయకుడి సమర్థత ముఖ్యం

నియంత్రించే నాయకుడు లేకపోతే జనబలం నిరర్ధకం

జనమనే అస్త్రాన్ని ప్రయోగించే సామర్థ్యం నాయకుడికి అవసరం

జనసంఖ్య అధికమే…నాయకుడు మాత్రం ఒక్కడే

బిహార్‌ రాజకీయాలు చెబుతున్న పాఠం

ఛరిష్మా నాయకుడు లేకపోతే ఏ పార్టీ మనుగడ అయినా కష్టమే

బిహార్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలన పరిశీలిస్తే, దేశంలో కులగణన జరిపిన రాష్ట్రం గా పేరుతెచ్చుకున్నా, కులాల లెక్కలు రాజకీయాలో పెద్దగా పనిచేయడంలేదన్న సంగతి ఇప్పుడి ప్పుడే వెల్లడవుతోంది. ముఖ్యంగా కుల జనాభా కాదు, ప్రాంతాన్ని నియంత్రించే నాయకుడి అవసరాన్ని బిహార్‌ రాజకీయాలు నొక్కి చెబుతున్నాయి. నాయకత్వ సామర్థ్యం లేనప్పుడు కుల బలంఎందుకూ పనికిరాదన్న సత్యం స్పష్టమవుతోంది. కుల రాజకీయాలకు పెట్టనికోటగా పరిగణించేబిహార్‌లోనే ఈ పరిస్థితి వుంటే, తెలంగాణ పరిస్థితిని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా రేవంత్‌ ప్రభుత్వం కులగణన చేపట్టింది. బిహార్‌ నేర్పుతున్న పాఠాలు, ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం తన కులగణన రాజకీయ వైఖరిలో మార్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరచవచ్చు. అంతేకాదు కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన ఎన్ని ప్రయోజనాలు చేకూర్చినా ఒక ప్రాం తాన్ని నియంత్రించే బలమైన నాయకుడున్నప్పుడు అవేవీ పనిచేయవన్న సత్యాన్ని బిహార్‌ రాజకీ యాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ నితిష్‌ కుమార్‌ ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణ లో కులాలకే ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలు/ఎస్టీలను నియంత్రించే గట్టి నాయకుడిగా కూర్మీ వర్గానికి చెందిన నితిష్‌ వున్నంతకాలం మరే కుల నాయకుడు ఆధిపత్యం సాధించడం కష్టం. కూర్మీ వర్గం జనాభా కేవలం సుమారు మూడుశాతం మాత్రమే! మరి నితిష్‌ ఇప్పటివరకు రాష్ట్ర రాజకీ యాలన శాసిస్తున్నారంటే ఆయన ఛరిష్మాయే కారణం. ఛరిష్మా కలిగిన నాయకుడు లేకుండా ఏపార్టీ అయినా ఎన్ని కుల రాజకీయాలు చేసినా ఫలితం వుండదన్నది వర్తమాన రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం.

మంత్రివర్గ విస్తరణ

గత ఫిబ్రవరి 26న బిహార్‌లోని నితిష్‌కుమార్‌ ప్రభుత్వం బహుశా తన టర్మ్‌లో చివరి మంత్రివర్గవిస్తరణ చేసింది. మంత్రివర్గ విస్తరణలో విశేషమేముందన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ఈ ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నితిష్‌కుమార్‌ చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో అందరి అంచనాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వ భాగస్వామి బీజేపీకి ఏకంగా ఏడు బెర్త్‌లు కట్టబెట్టడం బిహార్‌ రాజకీయాలను పరిశీలిస్తున్నవారిని ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మహా అయితే ఐదు బీజేపీకి, రెండు జేడీయూకు కేటాయిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్‌, కేంద్ర ఎం.ఎస్‌.ఎం.ఈ.మంత్రి జితిన్‌రామ్‌ మంరిa తనయుడు ఇప్పటివరకు నిర్వహించిన మూడు పోర్ట్‌ఫోలియోల్లో రెండిరటిని ఆయన్నుంచి తప్పించి బీజేపీ నాయకులైన కృష్ణకుమార్‌ మంతూ, విజయ్‌కుమార్‌ మండల్‌కు అప్పగించడం విశేషం. ఈ రెండిరటిలో ఒకటి సమాచార మంత్రిత్వ శాఖ కాగా రెండవది విపత్తు నిర్వహణ మంత్రిత్వశాఖ. ఈ విస్తరణతో ప్రస్తుతం బీహార్‌ కేబినెట్‌ లో 36 మంది మంత్రులుండగా వీరిలో 21మంది బీజేపీకి చెందినవారు కావడం విశేషం. మం త్రివర్గంలో మొదట్నుంజీ జేడీయూ వాటా 13లో ఏవిధమైన మార్పు లేదు. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో క్రమంగా నితిష్‌ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి మంత్రివర్గంలో ప్రస్తుతం తమ వాటా సంతృప్తినిచ్చివుండవచ్చు.

నితిష్‌ శైలే వేరు

నిజం చెప్పాలంటే నితిష్‌కుమార్‌ పరిపాలనా శైలిని ఎవరూ అంచనా వేయలేరు. ఎందుకంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా పూర్తిస్థాయి నియంత్రణ తనచేతుల్లోనే వుండేలా జాగ్రత్త పడతా రు. ఆయన దృష్టిలో మంత్రులు కేవలం ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే! విశేషమేంటంటే ఇప్పుడు కొత్తగా మంత్రిపదవులు దక్కిన ఏడుగురిలో, ఆరుగురు మిథిలాంచల్‌ ప్రాంతానికి చెందినవారు. ఈ ప్రాంత సరిహద్దుల విషయంలో వివాదం కొనసాగుతున్నప్పటికీ, ముజాఫర్‌పూర్‌, సరన్‌, సీ తామర్హి జిల్లాలు కూడా ఇందులో కలిపే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక మిథిలాంచల్‌ రాష్ట్ర పోరాటంలో దర్భంగా కేంద్రం కానుంది. ఇప్పుడు మంత్రివర్గంలో స్థా నం సంపాదించిన సంజయ్‌ సరౌగో (దర్భంగా స్థానం) మిథిలాంచల్‌ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతి స్తున్నారు. ఈ మిథిలాంచల్‌ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టుంది. 2025`2026 కేంద్ర బడ్జెట్‌లోమఖానా బోర్డు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో మౌలిక ప్రాజెక్టుల అభివృద్ధికి కేటాయింపులు జరగడం గమనార్హం.

మిథిలాంచల్‌కు ప్రాధాన్యం

కొత్తగా మంత్రివర్గంలో నితిష్‌కుమార్‌ మిథిలాంచల్‌ ప్రాంతానికి ప్రాధాన్యమిచ్చినట్టు స్పష్టమవు తోంది. ఇదే సమయంలో ఇక్కడ కులం కార్డు కూడా బలంగా వుండటం గమనార్హం. మంత్రివ ర్గంలో బెర్త్‌ సంపాదించిన వారిలో రాజుకుమార్‌ సింగ్‌, జీవేష్‌కుమార్‌లు రాజ్‌పుట్‌, భూమిహార్‌ కులాలకు చెందినవారు. ఈరెండూ అగ్రవర్ణాలు. ఇక విజయ్‌కుమార్‌ మండల్‌ నిషాద్‌ కులానికి చెందినవాడు కాగా మోతిలాల్‌ ప్రసాద్‌ వైశ్యుడు. మోతీలాల్‌ రీగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణకుమార్‌ మంటో కూర్మి వర్గానికి, సునీల్‌ కుమార్‌ కుశావా వర్గానికి చెందినవారు. వీరిద్దరూ ఓబీసీలు. సంజయ్‌ సరోగి కూడా వైశ్యుడే. ఇప్పుడు మొత్తం 36 మంది మం త్రుల్లో 11మంది అగ్రకులాలకు చెందినవారు. వీరిలో ఐదుగురు రాజ్‌పుత్‌లు, ముగ్గురు భూమి హర్‌లు కాగా ఇద్దరు బ్రాహ్మణులు, ఒకరు క్షత్రియుడు. ఇక ఓబీసీలకు చెందిన పదిమంది మం త్రుల్లో నలుగురు కోయ్‌రి`కుశావహ వర్గానికి చెందగా ముగ్గురు కూర్మీలు, ఇద్దరు వైశ్యులు. మరో ఏడుగురు మత్రులు పూర్తి వెనుకబడిన కులాలకు చెందినవారు (ఈబీసీ). వీరిలో ముగ్గురు మలాప్‌ా కులానికి చెందగా కోహార్‌, తెలి, నోనియా, ధనుక్‌ కులాలనుంచి ఒక్కొక్కరు మంత్రివ ర్గంలో వున్నారు. మరో ఐదుగురు షెడ్యూల్డు కులాలకు చెందినవారు. వీరిలో ఇద్దరు పాశ్వాన్‌ వర్గానికి, రవిదాస్‌, పాసి కులాలనుంచి ఒక్కొక్కరు చెందినవారున్నారు. మహాదళిత్‌ (ముషార్‌) వర్గానికి చెందినవారు ఇద్దరు, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ప్రస్తుతం నితిష్‌కుమార్‌ మంత్రివర్గంలో చోటు దక్కింది.

కులగణనామంత్రివర్గంలో స్థానాలు

బిహార్‌లో నిర్వహించిన కులగణన ప్రకారం జనాభాలో ఓబీసీలు 27.12% వున్నారు. అందువల్లరాష్ట్ర కేబినెట్‌లో వీరికి 28% ప్రాతినిధ్యం దక్కింది. ఇక పూర్తి వెనుకబడిన వర్గాల (ఈబీసీ) జ నాభా 36శాతం కాగా నితిష్‌ మంత్రివర్గంలో వీరి వాటా 19శాతం మాత్రమే వుంది. బిహార్‌ జనాభాలో షెడ్యూల్డు కులాలు (దళితులు కూడా వీరిలో భాగం) 19.65శాతం కాగా, మంత్రివ ర్గంలో వీరి వాటా 19శాతం వుంది. వీటన్నింటికి విరుద్ధంగా జనరల్‌ కేటగిరీకి చెందినవారు మంత్రివర్గంలో 31శాతం వరకు వున్నారు. వీరి మొత్తం జనాభా 15.52%కు మించి లేరు! ఇక్కడ ఇద్దరు అగ్రవర్ణాలవారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి ప్రధాన కారణం గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించిన నితీష్‌ ఇప్పుడు ఆవి ధంగా చేయలేకపోవడం. ఫలితంగా అగ్రవర్ణాలు, ప్రాంతీయంగా బలీయంగా వున్న నేతలు మరే ఇతర పార్టీలో చేరిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రతిష్ట అట్టడుగుకు దిగజారిన నేప థ్యంలో ప్రాంతీయంగా బలంగా వున్న అగ్రవర్ణావారు ప్రశాంత్‌కిషోర్‌కు లేదా మరే ఇతర నాయకుడికైనా మద్దతివ్వడానికి వెనుకాడటంలేదు. ఇందుకు ఉదాహరణ ముజాఫర్‌పూర్‌నుంచి ము న్నా శుక్లా తాజాగా రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) తీర్థం పుచ్చుకోవడం. 2020లో సాహెబ్‌గం జ్‌ నియోజకవర్గం నుంచి వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) తరపున గెలిచిన రాజూ సింగ్‌ బీజేపీలో చేరిపోయారు. తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లడానికి నజరానాగాఆయనకు మంత్రివర్గంలో ప్రమోషన్‌ దక్కింది. ఈ సింగ్‌కు ముజాఫర్‌పూర్‌, వైశాలి, తూర్పు చంపరాన్‌ ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు.
విజయ్‌కుమార్‌ మండల్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం నిషాద్‌ వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలన్న భాజపా వ్యూహంలో భాగం. ముఖ్యంగా వికాస్‌ శీల్‌ ఇన్సాఫ్‌ పార్టీ నాయకుడు ముఖేష్‌ సహానీ మద్దతును భాజపా కోరుకుంటోంది. 2024 సాధారణ ఎన్నికల్లో ముఖేష్‌ సహానీ ఆర్‌జేడీతో జట్టుకట్టినా, తేజస్వినీ యాదవ్‌తో గత అర్థసంవత్సరంగా ఈయన కలిసి తిరిగిన దాఖలాలు లే వు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని భాజపా యత్నిస్తోంది. అయితే కృష్ణకుమార్‌ మంటూ లేదా కృష్ణ పటేల్‌, సునీల్‌ కుమార్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవడం వివాదం సృష్టి స్తోంది. ఎందుకంటే కుమార్‌ కుశ్‌వాహా వర్గానికి, కృష్ణకుమార్‌ మంటూ కూర్మీ వర్గాలకు చెందినవారు. నితీష్‌కుమార్‌ కూడా కూర్మీ కులానికి చెందినవాడే! బిహార్‌లో కూర్మీల జనాభా 2.87 శాతం కాగా నలంద, చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఇక కుశ్‌వాహా వర్గంవా రు రాష్ట్ర జనాభాలో 4.21%. ఈ రెండు వర్గాలు ఓబీసీ కేటగిరీ కిందికి వస్తారు. ఈ రెండువర్గాలు రాష్ట్రంలో యాదవుల (14%) తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తున్నారు. 1990 ప్రాంతంలో లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రభుత్వ హయాంలో యాదవుల ఆధిపత్యాన్ని మొట్టమొదట సవాలు చేసింది కూర్మీలే!

కూర్మీ నేతగా నితిష్‌

1994లో నిర్వహించిన కూర్మీ చింతన ర్యాలీలో నితిష్‌ పాల్గనడం ద్వారా లాలూ ప్రసాద్‌తో విభేదించడం మొదలుపెట్టారు. ఈ ర్యాలీ తర్వాత కూర్మీ`కోయిరీ (కుశావహ) వర్గాల నాయకుడిగా నితీష్‌ స్థిరపడ్డారు. నితిష్‌కుమార్‌ పార్టీ కూర్మీలకు సముచిత స్థానం కల్పించింది. విచిత్రమేమంటే చింతన ర్యాలీ జరిగిన 31 సంవత్సరాల తర్వాత మళ్లీ కోయిరీ`కూర్మీ వర్గాల భవితవ్యం నిర్దిష్ట దిశలేని స్థితికి చేరుకుంది. శకుని చౌదరి, ఆయన కుమారుడు ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి, ఉపేంద్ర కుశావహ వంటి నాయకులున్నప్పటికీ, వారెవ్వరికీ కూర్మీల్లో నితీష్‌ కుమార్‌కున్న పట్టులేదు. ఇప్పుడు నితీష్‌ వయసురీత్యా ఇతరత్రా కారణాలవల్ల క్రమంగా బలహీన పడటం కూర్మీలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్‌జేడీ, బీజేపీలు ఈ వర్గాల్లో పలుకుబడి పెంచుకోవడానికి యథాశక్తి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకుడు కృష్ణకుమార్‌ మంటూ ఇటీవల పాట్నాలో ‘కూర్మీ ఏక్తా ర్యాలీ’ నిర్వహించారు. ప క్కనే వున్న నేపాల్‌ నుంచి కూడా ఈ వర్గానికి చెందిన ఏడుగురు ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం విశేషం. కూర్మీల్లో కూడా అనేక ఉపకులాలున్నాయి. కులగణన నిర్వహించినప్పుడు కూర్మీ జనాభాను తక్కువగా చూపారని, నిజానికి లెక్కల్లో చూపినదానికంటే వీరి జనాభా చాలా అధిక మన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ర్యాలీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నదని విస్తృ తంగా ప్రచారం చేసినా, నిజానికి దీనికి కర్త కర్మ క్రియ భాజపానే. నితీష్‌ కుమార్‌ తనయుడు నిశాంత్‌ కుమార్‌ను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినా ఆయన రాలేదు. దీనికి నితిష్‌కూడా గైర్హాజ రుకావడం గమనార్హం. ఈ ర్యాలీ రాష్ట్రంలో మీడియా పతాక శీర్షికల్లో చోటుచేసుకోవడం ద్వారా మోటూను ముందుకు తీసుకెళ్లడంలో బీజేపీ కొంతమేర విజయం సాధించినందని చెప్పాలి.

నితిష్‌ను సవాలు చేయడం బీజేపీ లక్ష్యం

ఇప్పుడు నలంద ప్రాంతానికి చెందిన బిహారీషరీఫ్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం సంపాదించిన సునీల్‌కుమార్‌ను కుశావహ నాయకుడిగా భాజపా ప్రోత్సహిస్తూ, నలంద ప్రాంతంలో నితిష్‌కుమార్‌ నాయకత్వాన్ని సవాలుచేయాలని కోరుతోంది. రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నితిష్‌ నిలుపుకుంటూ వస్తున్నారు. ఇందుకు ఆయనకు శ్రావణ్‌కుమార్‌ పూర్తి వెన్నుదన్నుగా వుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రణాళిక ఎంతవరకు విజయవంతమవుతుందో చెప్పడం కష్టం. బహుశా నితిష్‌ కుమార్‌ చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు కనుక దీర్ఘకాలంలో ప్రయోజనకారి కావచ్చు.

వైఖరి మార్చుకుంటున్న నితిష్‌

నితిష్‌కుమార్‌ తన తనయుడు నిశాంత్‌కు రాజకీయ శిక్షణ ఇవ్వాల్సిన తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతుండటానికి ప్రధాన కారణం ఈ ఏడాది జరగబోయే అ సెంబ్లీ ఎన్నికలేనని చెప్పక తప్పదు. ఇప్పుడిప్పుడే నిశాంత్‌ కూడా తన గత జీవనశైలిని మార్చు కొని స్పష్టమైన రాజకీయ నేతగా ఎదగడానికి యత్నిస్తున్నారు. నితిష్‌కుమార్‌ కూడా గతంలో వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన వ్యవహారశైలినుంచి క్రమంగా వైదొలగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు నిశాంత్‌ నుంచి అవసరమైన మద్దతు లభించడంలేదు. ఎందుకంటే ని శాంత్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ పట్ల సానుకూలంగా వుండటమే. ఇదే సమయంలో బీజేపీ మం టూ, సునీల్‌కుమార్‌లను గట్టి నాయకులుగా ముందుకు తెస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దిలీప్‌ జైస్వాల్‌, నితిష్‌ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడటంలేదు. అయితే ఈ దాగుడుమూతల రాజకీయాలు బిహార్‌లో మరికొద్దినెలలు కొనసాగే అవకాశముంది. పూర్తిగా తన చేయి దాటిపోతే నితిష్‌కుమార్‌ కేంద్రంలో మద్దతు ఉపసంహరించుకుంటానని బెదిరించే అవ కాశాలు కూడా లేకపోలేదు.

నిశాంత్‌కు పూలబాట కాదు

ఇటీవల ఇండియా టుడే ‘సీ ఓటర్‌ సర్వే’ ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రకారం బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ జైస్వాల్‌కు 41% ఓటర్ల మద్దతు లభిస్తే, నితిష్‌కుమార్‌కు 18% మంది మాత్ర మే అనుకూలంగా వుండటం గమనార్హం. విచిత్రమేమంటే ప్రశాంత్‌ కిషోర్‌కు అనుకూలంగా 15% మంది వ్యవహరించడం మరో విశేషం. 50శాతం మంది ప్రజలు నితీష్‌ పాలనపై అసం తృప్తిని వ్యక్తం చేశారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో నిశాంత్‌కుమార్‌ రాజకీయ రంగ ప్రవేశం పూలబాటగా సాగదనేది స్పష్టమవుతోంది. ఈ ముళ్లబాటలో ఆయన ఎట్లా పయనం సాగిస్తారనేది వేచి చూడాలి.

కలుషితమవుతున్న భగీరథ నీరు..

కలుషితమవుతున్న భగీరథ నీరు

పలుచోట్ల వృధాగా పోతున్న
పట్టించుకోని అధికారులు

వేములవాడ రూరల్ :నేటిధాత్రి

వేములవాడ రూరల్ మండలం పలు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా గ్రామ పంచాయతీలకు కలుషిత నీరు సరఫరా అవుతుంది కొన్ని నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రంగు మారిన నీరు సరఫరా అవుతున్న ఎవరు పట్టించుకుంటలేరు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది క్లోరినేషన్ చేసిన శుద్ధ నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్న అది ఆచరణలో సాధ్యం కావడం లేదు పంచాయతీ అధికారులు మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం కోరవడంతో సమస్య పరిష్కారం కావడం లేదని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు ఎండాకాలం సమీపిస్తుండడంతో మంచినీరు అందక కుళాయిలో మురికి నీరు వస్తుండడంతో తాగడానికి ప్రజలు వాడకుండా వృధాగా వదిలేస్తున్నారు రంగు మారిన మిషన్ భగీరథ నీటి వల్ల ప్రజలకు పలు ఇబ్బందులు తలెత్తుతూ రోగాలు బారిన పడుతున్నారు ఇది కాక అనేక చర్మవ్యాధుల పట్ల పలు అవస్థలు పడుతున్నారు

మిషన్ భగీరథ నీరు ట్యాంక్ నుండి వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు

చెక్కపల్లి గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు నిండి వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో నీరు ఇలా వృధాగా పోతున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని ట్యాంకులు నుండి వృధాగా పోతున్న నీటిని అరికట్టి ప్రజలకు సకాలంలో మంచినీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు

పేదల గురువు మానయ్య మృతి.

“పేదల గురువు” మానయ్య మృతి

” విద్యార్థుల సంతాపం

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన మానయ్య సార్ (రిటైర్డ్) మంగళవారం మృతి చెందారు. సాంఘిక శాస్త్రంతో పాటు గణితం తెలుగు ఆంగ్ల భాష ఉర్దూ పై అపారమైన పరిజ్ఞానం కలిగి ఉండేవారు. ఇంగ్లీషులో ఎం.ఎ పట్టభద్రులైన మానయ్య, తెలుగు , ఉర్దూ భాష జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి వద్ద అభ్యసించారు. దిగ్వాల్ జడ్పీ హైస్కూల్లో, ఝరాసంగం జడ్పీ హైస్కూల్లో సేవలు అందించారు. పేదల ఉపాధ్యాయులుగా పేరు పొందిన మానయ్య సార్ హాస్టల్ల్లో చదువుతున్న పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధలు చూపించేవారు. ఆయన మార్గదర్శకంలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత హెూదాలలో సేవలందిస్తున్నారు. ఆయన అంతక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన మునిపల్లి మండలం పెద్దలోడిలో జరుగుతాయని బంధువులు స్నేహితులు తెలిపారు. ఉపాధ్యాయుడు మృతికి ఝరా సంగం విద్యార్థులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.

తమిళనాడులో భాషా రాజకీయాల రచ్చ

-జాతీయ విద్యావిధానం`2020ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు

-ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నది కేవలం ఈ రాష్ట్రం మాత్రమే

-ఎన్‌ఈపీా2020 వల్ల డ్రాపౌట్లు పెరుగుతాయి: స్టాలిన్‌

-హిందీని రుద్దే ఉద్దేశం లేదు: కేంద్రం

-త్రిభాషా సూత్రాన్ని సమర్థిస్తున్న భాజపా

-మిగిలిన అన్నిపార్టీలు ద్విభాషా విధానానికే మద్దతు

-విద్యను కూడా రాజకీయం చేసిన తమిళనాడు నేతలు

-కాలానికి అనుగుణంగా మారని నేతలు

-ముదిరిపోయిన ఓటుబ్యాంకు రాజకీయాలు

-మార్పు కోరుకోకపోతే ప్రజలకే నష్టం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న తరుణంలో తమిళనాడులో వరుస వివాదాలతో రాజకీయ పార్టీలు ప్రజల్లో ఏదోవిధంగా తమ పలుకుబడిని పెంచుకోవాలని ప్రయత్నిస్తుండటం తాజా పరిణామం. ఫిబ్రవరి మొదటివారంలో తిరుపురన్‌ కుండ్రం ఆలయ వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తే తాజాగా జాతీయ విద్యావిధానం`2020 కేంద్ర, రాష్ట్రాల మధ్య రగడను రాజేసింది. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ విధానం కింద త్రిభాషా సూత్రాన్ని అంగీకరించబోమని తమిళనాడు తెగేసి చెబుతోంది. హిందీని బలవంతంగా రుద్దడానికే కేంద్రం కుయుక్తులు పన్నుతోందని ఆరోపిస్తోంది. అయితే కేంద్రం అటువంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది. నిజానికి తమిళనాడు ప్రజల్లో భాషాదురభిమానాన్ని హిందీ వ్యతిరేకతను ప్రజల్లో బాగా రెచ్చగొట్టింది ప్రముఖ రచయిత మరైమలై అడిగళ్‌ మరియు ద్రవిడవాద సిద్ధాంత కర్త పెరియార్‌. తమిళుల్లో హిందీ వ్యతిరేకతకు ప్రధాన కారణం, హిందీలో సంస్కృత పదాలు ఎక్కువగా వుండటం. తమిళులు సంస్కృతాన్ని ప్రాచీన భాషగా అంగీకరించరు. తమిళం మాత్రమే అతి ప్రాచీన భాషగా వారు పేర్కొంటారు. ఆర్యభాష అయిన హిందీని ద్రావిడులైన తమిళులపై రుద్దడం ద్వా రా ఆర్యులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఒప్పుకోబోమన్నది వారి వాదన. కానీ ఇక్కడ ఒక్క నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైతే తమిళనాడులో ఇప్పుడు హిందీని వ్యతిరేకిస్తు న్నారో వారి పిల్లలు చదివేది త్రిభాషా సూత్రాన్ని పాటించే పాఠశాలల్లోనే! కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసం హిందీని వ్యతిరేకిస్తే, రాష్ట్రంలోని ఎస్సీలు/ఎస్టీలు తీవ్రంగా నష్టపోతారు. ఎం దుకంటే స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 80ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి.హిందీ నేర్చుకుంటేనే దేశంలోని ఏప్రాంతంలోనైనా మనుగడ సాగించడానికి వీలవుతుంది. ఉద్యోగావకాశాలు దేశవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో, ఇంగ్లీషుతో పాటు హిందీభాష వచ్చినవారు మాత్రమే మంచి ఉద్యోగాలు సాధించగలరు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. తమిళనాడులోని ద్రవిడ పార్టీ నాయకులకు ఇది తెలియంది కాదు. అందుకనే వారి పిల్లల్ని సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివిస్తూ పైకి మాత్రం ఓట్లకోసం తమిళభాషాభిమానాన్ని రెచ్చగొడుతున్నారు. నిజం చెప్పాలంటే తమిళనాడులో కూడా చాలామందికి హిందీ తెలుసు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు, ద్రవిడ వాదం చట్రాల్లోనే ఈ పార్టీల మనుగడ వుండటం, తమిళనాడు ప్రజల పురోభివృద్ధికి ఆటంకంగా మారిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

తాజా వివాదానికి కారణం

ఫిబ్రవరి 15న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఒక ప్రకటన చేస్తూ, జాతీయ విద్యావిధానం`2020 (ఎన్‌ఈపీ`2020)ని అమలు చేయని తమిళనాడు వంటి రాష్ట్రాలకు సమగ్ర శి క్షా పథకం కింద నిధుల (రూ.2వేల కోట్లు) మంజూరు సాధ్యంకాదని స్పష్టం చేయడం తాజా వివాదానికి కారణం. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2020 జాతీయ విద్యావిధానానికి తాను వ్యతిరేకమని తమిళనాడులోని డి.ఎం.కె. ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. 1968 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ద్విభాషా విధానాన్ని`ఇంగ్లీషు, తమిళం` మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తామని కుండబద్దలు కొట్టడంతో మరోసారి రాష్ట్రంలో భాషా రాజకీయాలు వేడెక్కాయి. దేశం మొత్తంమీద ద్విభాషా విధానాన్ని అనుసరించే రాష్ట్రం కేవలం తమిళనాడు మాత్రమే. మిగిలిన అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నాయి. నిజానికి తమిళనాడు రాజకీయ పార్టీలు 1930 నుంచి త్రి భాషా సూత్రాన్ని తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులోని డి.ఎం.కె. ప్రభుత్వం భాషా విధానంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్నే మరోసారి నొక్కి చెప్పింది. దీంతో కేంద్రం, తమిళనాడు మధ్య విద్యావిధానం విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. డిఎంకే ప్రభుత్వం కేంద్రంపై విరుచు కుపడటంలో రెండిరటి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ కేవలం నిధులకోసం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని, కేంద్రం ఒత్తిళ్లకు తలగ్గేది లేదంటూ తెగేసి చెప్పారు. ఆయన ఇంకా ముందు కెళ్లి తమిళనాడు రాష్ట్రం కేంద్రానికి పన్నులు చెల్లించకపోతే ఏమవుతుందో ఒక్కసారి గుర్తుంచుకోండంటూ ఘాటుగా హెచ్చరించారు కూడా! కేంద్రం రూ.10వేల కోట్ల నిధులు తమిళనాడుకు ఇస్తామని చెప్పినా తాము త్రిభాషాసూత్రం అమలు చేయబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం ఎన్‌ఈపీ`2020ను అమల్లోకి తేవడం ద్వారా విద్యార్థులను చదువులకు దూరం చేస్తుందని పేర్కొన్నారు. మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పుడు అమలు చేస్తున్న నీట్‌ విధానం వల్ల ఎంతోమంది విద్యార్థులకు సీట్లు దొరకక విద్యకు దూరమవుతున్నారని, ఎన్‌ఈపీని అమల్లోకి తెస్తే ఆర్ట్స్‌మరియు సైన్స్‌ కోర్లుకు కూడా ఎంట్రెన్స్‌ పరీక్షలు పెడతారని అప్పుడు మరింత మంది విద్యార్థులు తప్పనిసరిగా విద్యకు దూరంకావాల్సి వస్తుందని పేర్కొన్నారు. ‘మేం ఏ భాషకు వ్యతిరేకం కాదు. కాకపోతే హిందీని రుద్దాలనుకుంటే ఒప్పుకోం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులను ఇది స్కూళ్లకు దూరం చేస్తుంది’ అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఈ విధానం కిందమూడు, ఐదు, ఎనిమిది తరగతుల స్థాయిల్లో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఎంట్రెన్స్‌లు ప్రవేశపెడతారు. దీనివల్ల ఎంతోమంది ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు చదువు అందుబాటులో లేకుండా పోతుందన్నారు.
ప్రస్తుతం తమిళనాడులో ఒక్క భారతీయ జనతాపార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ద్విభాషా సూ త్రానికే మద్దతునిస్తున్నాయి. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో పోటీపడాలంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాల్లో కూడా హిందీ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర బీజేపీ వాదిస్తోంది. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడం దారుణమైన తప్పిదమని కూడా పార్టీ భావిస్తోంది. ము ఖ్యంగా ఈవిధానంలో హిందీని తప్పనిసరిగా బోధించాలన్న అంశం ఎక్కడాలేదన్న సంగతిని గుర్తు చేస్తోంది.

మొట్టమొదటి హిందీ వ్యతిరేక ఉద్యమం

తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొట్టమొదటిసారి 1937లో ప్రారంభమై 1940 వర కు కొనసాగింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి, హిందీ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయడం ఈ ఉద్యమానికి ప్రధాన కారణం. అప్ప ట్లో ప్రముఖ రచయిత మరైమలై అడిగళ్‌, ద్రవిడవాద సిద్ధాంత కర్త పెరియార్‌లు ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఆందోళన సందర్భంగా 1271మంది నిరసన కారులను అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రభుత్వం అరెస్ట్‌ చేసి జైళ్లల్లో పెట్టింది. నాటి ప్రెసిడెన్సీ గవర్నర్‌ లార్డ్‌ ఎర్‌స్కైన్‌ ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్న తర్వాత మాత్రమే ఆందోళన కారు లు తమ ఉద్యమాన్ని విరమించారు. స్వాతంత్య్రానంతరం 1948 కేబినెట్‌ మంత్రి ఒమండూర్‌ రామస్వామి రెడ్డి హిందీభాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయడం రాష్ట్రంలో రెండోసారి హిందీ వ్యతిరేక ఉద్యమానికి దారితీసింది. ఆ తర్వాత 1963లో కేంద్రం తీసుకొచ్చిన అధికారిక భాషా చట్టం నేపథ్యంలో మళ్లీ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఆందోళన చెలరేగి 1964`65 మధ్య కాలంలో ఉధృతంగా కొనసాగింది. ఈ ఉద్యమం ఎంతటి తీవ్రస్థాయికి చేరుకుందంటే దాదాపు అరడజను మంది ఆందోళనకారులు తమను తాము సజీవదహనం చేసుకోవడమే కాదు, నిరసన లు హింసాత్మకంగా మారడంతో ఇద్దరు పోలీసులతో సహా 60మంది మరణించారు. తర్వాత కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగొచ్చి, చట్టంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణస్థితికి చేరుకున్నాయి.

త్రిభాషా సూత్రం

1968లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన త్రిభాషా విధానం (హిందీ, ఇంగ్లీషు మరియు ఏదైనా ప్రాంతీయ భాష) దేశంలోని అన్ని రాష్ట్రాలు మూడుభాషలను అమలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఒక్క తమిళనాడు మాత్రం కేవలం ద్విభాషా విధానానే అమలు చేయడానికి నిర్ణయించింది. అప్పటి మొట్టమొదటి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి అన్నాదురై మాట్లాడుతూ తమిళులు ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడానికి ఇంగ్లీషు భాష సరిపోతుంది. హిందీ అవసరం లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఈమేరకు ఆయన 1968 జనవరి 23న రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దీనిపై మూడురోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. చివరకు త్రిభాషా సూత్రాన్ని అసెంబ్లీ తిరస్కరిస్తూ తీర్మానం చేసింది. అప్పటినుంచి రాష్ట్రంలో ద్విభాషా సూత్రాన్నే అమలు చేస్తున్నారు. అయితే తమిళనాడులోని సి.బి.ఎస్‌.సి. స్కూళ్లలో మాత్రం హిందీని కూడా బోధించడం కొనసాగుతూ వస్తోంది.

ఎన్‌ఈపీా2020

2020లో కేంద్రంలోని ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చింది. తమ పూర్వ ప్రభుత్వాల మార్గాన్నే అప్పటి ఏ.ఐ.డి.ఎం.కె. ప్రభుత్వం అనుసరిస్తూ, తమకు త్రిభాషా సూత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ విద్యావిధానంలో కేంద్రం మూ డు భాషల్లో ఒకటి ఏదైనా ప్రాంతీయ భాష కూడా వుండాలని స్పష్టం చేసినా, ఏ.ఐ.డి.ఎం.కె. ప్రభుత్వం మాత్రం ఏదోవిధంగా హిందీని రుద్దడానికి మాత్రమే కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకితెచ్చిందని విమర్శించింది. జాతీయ స్థాయిలో ఏకీకృత జాతీయ విద్యావిధానం ఉమ్మడి జాబితా లో ఉండటం కూడా తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించడానికి మరో కారణం. ముఖ్యంగా ఈ విద్యావిధానంలో నాలుగు సంవత్సరాల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను కేంద్రం ప్రతిపాదించింది. ఒక విద్యార్థి మధ్యలో బయటకు రావడానికి ఇందులో బహుళ ఐచ్ఛిక మార్గాలున్నాయి. ఇవి డ్రాపౌట్లకు దారితీస్తాయని భావించడం కూడా తమిళనాడు ప్రభుత్వం ఈ నూతన జాతీయ విధానాన్ని వ్యతిరేకించడానికి మరో కారణం. ముఖ్యంగా ఈ విధానంఅట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎంతమాత్రం అనుకూలం కాదని కూడా తమిళనాడు ప్రభుత్వం విస్పష్ట అభిప్రాయం. త్రిభాషా సూత్రంపై తాజా వివాదం నేపథ్యంలో ఫిబ్రవరి 23న తమిళభాష వీరాభిమానులు రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడి బోర్డులపై ఉన్న హిందీ భాషపై నల్లటి రంగును పూయడం ‘వెర్రికి వేయి తలలన్న’ సత్యాన్ని మరోసారి నిజం చేసింది.

హిందీ ఉమ్మడి భాష

విశ్వహిందూ పరిషత్‌ ప్రస్తుత వివాదంపై అన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళం భారతీ య భాషల్లో ఒకటి. అయితే హిందీభాష దేశవ్యాప్తంగా ప్రజలమధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. దేశం ఉమ్మడిగా పురోగతిలో ముందుకు సాగుతున్నప్పుడు, ‘ప్రత్యేకత’ పేరుతో తమిళనాడును ప్రధాన స్రవంతినుంచి వేరుచేయవద్దని కోరింది. ప్రస్తుతం ఎన్‌ఈపీ`2020పై కేంద్రం, తమిళనాడుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఈవిధంగా స్పందించింది. డీఎంకే ప్రభుత్వం సంస్కృత భాషను గుడ్డిగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమేనని వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ విమర్శించారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ మాట్లాడుతూ ఎన్‌ఈపీ`2020 కేవలం త్రిభాషా సూత్రాన్ని మాత్రమే ప్రతిపాదించింది. ఇందులో హిందీని త ప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదన్న సత్యాన్ని గుర్తించాలి. ఈ అంశాన్ని దాచిపెట్టి డీఎంకే రాజకీ య లబ్దికోసం తప్పుడు ప్రచారం మానుకోవాలని కూడా ఆయన కోరారు.

ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు

-సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు

 

-మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు

-క్షమించి మమ్మల్ని రమ్మంటారా?

-వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా!

-రమ్మంటే పరుగెత్తుకొస్తాం

-మేమక్కడ నెగలలేకపోతున్నాం…

-కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం

-ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు

-ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు

-మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు

-ప్రజల ముందు చులకనయ్యాం

-ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం

-కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు

-ముందు నుయ్యి, వెనుక గొయ్యి తొవ్వుకున్నారు

-ఎమ్మెల్యేలను ఆదరించకపోవడంలో కాంగ్రెస్‌ నాయకుల తప్పేం లేదు

-పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వేధించింది వీళ్లే

-పదేళ్లు పడరాని పాట్లు పడి కాంగ్రెస్‌ కోసం పనిచేశారు

-అనేక కేసులు ఎదుర్కొన్నారు

-నిర్భంధాలు చూశారు…పోలీసు దెబ్బలు తిన్నారు

-పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తనం లేక కాంగ్రెస్‌ నాయకులు సలసల కాగుతున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యే లకు సలాం కొట్టలేకపోతున్నారు

-కాంగ్రెస్‌ నాయకులు పాత బకాయిలు తీర్చుకునే సమయంలో వచ్చి చేయందుకున్నారు

-ఇది కాంగ్రెస్‌ నేతలకు సుతారం ఇష్టం లేదు

-అప్పుడు అదే ఎమ్మెల్యే పెత్తనం.. ఇప్పుడు అదే ఆధిపత్యం

-కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు

-ఎమ్మెల్యేలైనా సరే లెక్క చేయడం లేదు

-ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుల వెంటనే కార్యకర్తలుంటున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు

-కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కుబిక్కుమంటున్నారు

-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్‌లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్‌ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్‌ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్‌ఎస్‌ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్‌లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్‌ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్‌ దక్కకపోవచ్చు. కాంగ్రెస్‌లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్‌పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌నుంచి బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్‌ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్‌ఎస్‌కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్‌ఎస్‌ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్‌పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్‌లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్‌లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్‌ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్‌ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్‌ఎస్‌ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్‌ఎస్‌ను అణచివేయొచ్చు. బిఆర్‌ఎస్‌ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్‌ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్‌ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్‌ఎస్‌ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్‌ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్‌ఎస్‌ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్‌ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్‌లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్‌ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్‌లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్‌ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్‌ఎస్‌ ఛీప్‌తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్‌, హరీష్‌రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్‌ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ టికెట్‌ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్‌లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్‌ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్‌ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్‌ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్‌ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్‌ఎస్‌ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version