బెట్టింగ్ యాప్స్ లలో పెట్టుబడి పెట్టిన వారిపై కఠిన చర్యలు..

అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో పెట్టుబడి పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతి (ఐ.పి.ఎస్) హెచ్చరిక

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

ఈరోజు అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ,ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడిన, ఆన్‌లైన్ బెట్టింగ్ ,గేమింగ్ కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ లను ప్రమోట్(ప్రోత్సాహించే) వారి సమాచారం అందించాలి. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ లు, బెట్టింగ్ ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు. అని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతి ఐ.పి.ఎస్ తెలిపారు. అంతేకాకుండా యువత, మరియు విద్యార్థులు చదువు మీద దృష్టి సాధించి, తమ తల్లిదండ్రులకు మరియు గురువులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత కొలువుల కోసం పాటుపడాలని జిల్లా ఎస్పీ గారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అక్రమ బెట్టింగ్ యాప్స్,గేమ్ యాప్‌లకి అలవాటు పడి అప్పులపాలై యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని,అక్రమ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ఆడిన ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.ఈ మెరకు జిల్లా ఎస్పీ సోషల్ మీడియా పై అవగాహన కార్యక్రమం మరియు శనివారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు.

ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలు…

ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ నలుమూల లా చాటారని కవితక్క ఆమె ఎంతో గొప్ప నాయకురాలని మరెన్నో ఉన్నత పదవులు అందుకోవాలని ముందు ముందు తెలంగాణ ప్రజల మనసులో స్థిర స్థాయిగా ఉండేలా మరిన్ని మంచి పదవులు పొందాలని ఆశిస్తూఆమె నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు మండల కేంద్రంలోని బి.ఆర్.ఎస్ పార్టీ కార్యంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వలిగొండ వేణుగోపాలరావు పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మోహన్ రెడ్డి కురుమ రాజయ్య బండి జగన్ దేవేందర్ యాదవ్ నవీన్ రావు కనకరాజు నేరెళ్ల అనిల్ గుండు ప్రేమ కుమార్ సిలివేరి చిరంజీవి వెంగళ రమేష్ మామిడాల విజయ్ పూస పెళ్లి రామచంద్రం కడారి నవీన్ రెడ్డి ఉమాశంకర్ మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..

కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో ఈనెల 14, 15, తేదీల్లో కొడవటంచ దేవ స్థానంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరకి పరకాల భూపాలపల్లి నుంచి ప్రత్యేకంగా బస్సు లు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ ఏ .ఇందు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి బస్సులు నడిపిస్తామన్నారు. భూపాలపల్లి బస్ స్టేషన్ ఎంక్వయిరీ నెంబర్ 7382854256 ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు కోరారు

ఈనెల 21న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం..

ఈనెల 21న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలి

జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత సంవత్సరంలో పదో తరగతిలో వచ్చిన ఫలితాలు కంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న విద్యా సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు అందరము కృషి చేస్తున్నాము. ఈనెల 21వ తేదీ నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఈ పరీక్షలకు ఎలా సంసిద్ధులు కావాలో, దీనికి జిల్లా విద్యాశాఖ ఏ చర్యలు చేపడుతున్నారు అన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్ద మల్ల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా పత్రిక సమావేశంలో మాట్లాడుతూ నవంబర్ మొదటివారం నుండి ఉదయం సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 3449 మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో1724- బాలికలు మరియు1725- బాలురు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వీరి కోసం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానిని అమలుపరచినట్లయితే మంచి ఫలితాలను మనం పొందవచ్చు అనే నినాదంతో మనం ముందుకు వెళ్లడం జరుగుతుంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సమక్షంలో 10వ తరగతి పరీక్షలు మార్చి 2025 పై సమీక్ష సమావేశం చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంటల్ అధికారులకు వార్షిక పరీక్షలకు సంబంధించిన అన్ని విభాగాలతో పరీక్ష నిర్వహణ కొరకు సమావేశమును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లాలో ఉత్తీర్ణత శాతము పెంచడం కోసం విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు పరీక్ష భయాన్ని తొలగించుటకు మోడల్ ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించడం జరిగింది. గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా విద్యార్థులకు స్నాక్స్ ప్రత్యేక తరగతి సమయంలో అందించబడుతుంది. ఒంటి పూట బడి సమయంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు అభ్యసన దీపికలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేస్తున్నాం. విద్యార్థులు ఉదయం లేచి చదువుకునేలా సంబంధిత ఉపాధ్యాయుల చే వేకప్ కాల్స్ చేపిస్తున్నాం. పర్యవేక్షణ అధికారులతో జిల్లాలోని అన్ని పాఠశాలలో విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి తగు సూచనలను ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందించడం జరుగుతుంది. సమిష్టి కృషితో సత్ఫలితాలను సాధించే దిశగా పనిచేస్తున్నాం. ఇంటి వద్ద పిల్లలను వారి తల్లిదండ్రులు చదివించే విధంగా వారిని చైతన్య పరుస్తున్నాం. గణితం, భౌతిక రసాయన శాస్త్రం ఇంగ్లీష్ వంటి కఠిన సబ్జెక్టులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు పరీక్ష భయాన్ని వీడడం కోసం గత మాదిరి ప్రశ్న పత్రాలను అభ్యాసం చేపిస్తున్నాం. పట చిత్రాల గీయడం, మ్యాప్ పాయింటింగ్ వంటి అంశాలపై విద్యార్థులను దృష్టి కేంద్రీకరించేలా చేపిస్తున్నాం. విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో అనవసరమైన ఒత్తిడికి గురికాకూడదు. పరీక్షల సమయంలో ఆహారము, నిద్ర, వ్యాయామానికి తగిన ప్రాధాన్యతనిస్తుండాలి. ప్రతిరోజు ఒకే సమయానికి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఖచ్చితంగా 7 నుండి 8 గంటల సమయం కేటాయించాలి. ఒక గంట సమయం చదివిన తర్వాత మెదడుకు ఐదు నిమిషాల విరామం ఇవ్వడం ద్వారా తిరిగి ఉత్సాహంతో చదవగలుగుతారు. టీవీ, మొబైల్స్, సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండాలి. పరీక్ష అంటే జీవితానికి అగ్నిపరీక్ష కాదు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని నిరుత్సాహపడకుండా మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. పరీక్షలను బాధ్యతతో రాయాలి కానీ భయంతో కాదు కావున జిల్లాలోని పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రణాళికతో మంచి ఫలితాన్ని సాధిస్తారని ఆశిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జయశంకర్ భూపాలపల్లి

3వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు.

3వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు

గోలి సుధాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా నాయకులు

ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నిరాహార దీక్షలు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగ అధ్యక్షతన రెండో రోజు కొనసాగడం జరిగింది
ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా
ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు గోలి సుధాకర్ మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ఎస్సీల వర్గీకరణ చేసిన తర్వాతనే ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగ ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఈ ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో గౌరవ పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉప కులాలను అన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
గజవెల్లి ప్రభాకర్ చిందు
చిందుఅక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు
ముత్యాల మల్లేష్ మాది

ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు.

ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు.

పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేకే అధినాయకత్వంపై ఆరోపణలు.

ఎంసిపిఐ(యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ వెల్లడి.

నర్సంపేట టౌన్ ,నేటిధాత్రి:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమరజీవి మద్దికాయల ఓంకార్,బి.ఎన్. రెడ్డిల పేర్లను ఉపయోగిస్తూ పార్టీ బహిష్కృత ఆరాచకవాదులు ఎంసిపిఐ పేరుతో చేస్తున్న అరాచక ఆగడాల పట్ల ఉపేక్షించేదిలేదని ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ హెచ్చరించారు.పట్టణం లోని పార్టీ కార్యాలయం ఓంకార్ భవన్ లో పార్టీ సీనియర్ నాయకులు నాగెల్లి కొమురయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.రాజాసాహెబ్ మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్ అమరజీవి మద్ది కాయల ఓంకార్ నాయకత్వంలో 1984 నుండి 2006 మధ్యకాలంలో మొదటగా ఎంసిపిగా వరంగల్ జిల్లాలో నర్సంపేట కేంద్రంగా ఏర్పడి, అనతి కాలంలోనే ఓంకార్ ఉద్యమ సహచరులతో కలసి ఎంసిపిఐ గా దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేయడంలో అసెంబ్లీ టైగర్ ఓంకార్ సఫలీకృతులు అయ్యారని పేర్కొన్నారు. సైదాంతిక విభేదాలతో చీలిన కమ్యూనిస్టు నాయకులను ఏకం చేసి వామపక్ష ఉద్యమాలను దేశంలో బలోపేతం చేయడానికి పార్టీ చివరన యూనిటీ అనే పదాన్ని జోడించారని, దీనిని పార్టీ నుండి బహిష్కరణకు గురైన పానుగంటి నర్సయ్య,సింగతి సాంబయ్య, మొగిలిచర్ల సందీప్ తదితరులు ఆర్థిక అరాచవాదులు పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పార్టీ అధినాయకత్వంపై ఎంసిపిఐ పేరుతో నర్సంపేటలో ఏకమై తీవ్రమైన ఆరోపణలు చేయడం వారి దివాలాకోరు రాజకీయ రాక్షసత్వానికి నిదర్శనమని అన్నారు.ఓంకార్, బి ఎన్ రెడ్డి ల పేర్లను వాడే నైతిక హక్కు వారికి లేదని,ఆ మహానుభావుల నిజమైన వారసులు ఎవరనేది సరైన సమయంలో సరైన గుణపాఠం ప్రజలే చెబుతారని తెలిపారు.అందుకు ఓంకార్, బి ఎన్ రెడ్డిల నిజమైన వారసులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికీ చాలా ఓపికగా పార్టీ శ్రేణులు ఉన్నాయని, త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీని, పార్టీ నాయకత్వాన్ని అసత్య ఆరోపణలతో ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజాక్షేత్రంలో శిక్షలు తప్పవని రాజా సాహెబ్ హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, మండల కార్యదర్శులు సింగతి మల్లికార్జున్, కలకొట్ల యాదగిరి, దామ సాంబయ్య, మార్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి..

పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి

– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

– 100% ఆస్తి పన్ను వసూలు చేయాలి

– గ్రామాలలో ఆస్తుల రీ అసెస్మెంట్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు

– గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

– పంచాయతీ రాజ్ చట్టం పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి

– పంచాయతీ కార్యదర్శుల పని తీరు పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల, మార్చి 13(నేటి ధాత్రి):

గ్రామాలలో ప్రభుత్వ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ పని తీరు పై పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూలు, ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ఫీజుల వసూళ్ల పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, గ్రామాలలో ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు, ఇండ్ల ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 17 రోజులు సమయం మాత్రమే ఉందని,ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా తక్కువ ఆస్తి పన్ను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ప్రత్యేకంగా రివ్యూ చేశారు. ఆస్తి పన్ను చెల్లించిన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు.గ్రామాలలో అవసరమైన చోట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్ను విలువ పెంచాలని, రీ – అసెస్మెంట్ చేసి సరైన ఆస్తుల విలువ ప్రకారం పన్ను వసూలు చేయాలని కలెక్టర్ సూచించారు.

గ్రామాలలో వ్యాపారాల ట్రెడ్ లైసెన్స్ రెన్యువల్ సకాలంలో జరిగేలా చూడాలని, ట్రెడ్ లైసెన్స్ లేకుండా ఎక్కడైనా వ్యాపారాలు నిర్వహిస్తే సీజ్ చేయాలని అన్నారు. ట్రెడ్ లైసెన్స్ రెన్యువల్ పన్ను ముందుగా వసూలు చేయాల్సి ఉంటుందని అన్నారు. గ్రామాలలో మల్టీ పర్పస్ సిబ్బంది వేతనాలు ఎప్పటికప్పుడు పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలని అన్నారు.

గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాల పరిసరాలలో అపరిశుభ్రత అధికంగా గమనిస్తున్నామని, దీన్ని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భవనాల పరిసరాల్లో పరిశుభ్రత పట్ల శ్రద్ద పెట్టాలని అన్నారు.రోడ్లను రెగ్యులర్ గా శుభ్రం చేయాలని, ప్రతి రోజు ప్రజల నుంచి చెత్త సేకరణ జరగాలని అన్నారు.

గ్రామాలలో పెండింగ్ ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులు క్లియర్ చేయాలని అన్నారు. ఆమోదించిన ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల నుంచి ఫీజు వసూలు చేయాలని, దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా చూడాలని, ప్రజలు ప్రభుత్వం కల్పించిన 25% రీబెట్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఎల్.ఆర్.ఎస్ చేసుకోకపోతే ఇంటి నిర్మాణం అనుమతులు, ఇతరులకు అమ్మేందుకు ఆస్కారం ఉండదని, ఎల్.ఆర్.ఎస్. చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.

ఈ సమావేశంలో డి.పి.ఓ. శరిపుద్దీన్, డి.ఎల్.పి.ఓ. నరేష్, డి.టి.సి.పి.ఓ. ఆన్సర్, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ సిసి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

ఎన్ సిసి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు*

బాలాజీ టెక్నో స్కూల్ లో ఎన్.సి.సి. విద్యార్థుల ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

ఎన్.సి.సి విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందనీ, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఉంటాయని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్ లో గురువారం జరిగిన 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఎన్.సి‌.సి సెలక్షన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ఎన్ సిసి టెన్త్ బటాలియన్ ఆఫీసర్స్ హవల్దార్ విజయ్, దీపక్ లు మరియు బాలాజీ టెక్నో స్కూల్ ఎన్ సిసి థర్డ్ఆఫీసర్ ఎం.డి. రియాజుద్దీన్ ఆధ్వర్యంలో బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సెలక్షన్స్ నిర్వహించారు. 185 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో నుండి 49 మంది విద్యార్థులను ఎన్.సి.సి. అధికారులు అర్హులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భవానీ చంద్, పార్వతి, వినోద్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 20 శాతం నిధులు కేటాయించాలి.

రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 20 శాతం నిధులు కేటాయించాలి

ఎన్నికల్లో రైతాంగానికి ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

రెండు లక్షల రుణమాఫీ,రైతు భరోసా, పంటలకు బోనస్ తక్షణమే అమలు చేయాలి

పంటల మద్దతు ధర, ఉత్పత్తి ఖర్చుల నియంత్రణ చట్టం చేయాలి

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

సమాజ మనుగడలో ప్రధాన భూమిక పోషిస్తున్న వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పాలకులు బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల సంక్షేమాన్ని విస్మరించడం ఆందోళన కలిగిస్తున్నదని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. రైతుల వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
గురువారం అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడారు.70 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ప్రజలు జీవిస్తున్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులతో మనిషి బ్రతుకుతున్నప్పటికీ పాలకులకు మాత్రం రైతుల వ్యవసాయంపై పట్టింపు లేదన్నారు. పైగా ఆరుగాలం కష్టించి పండించిన పంటలను మధ్య దళారులు వ్యాపారులు సిండికేట్ అయి దోచుకుంటున్న పండిన పంటలకు సరైన ధరరాక తెచ్చిన అప్పులు తీరక అనేక అవస్థలు పడుతున్న రైతుల గోస ప్రభుత్వాలకు పట్టడం లేదని అవేదన వ్యక్తం చేశారు.
రైతుల భూములను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా చట్టాలను రూపొందించి తమ నైజాన్ని తేట తెల్లం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న సన్నకారు రైతుల వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ప్రకటించకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా రాయితీలు సబ్సిడీలు మాఫీలు ఇస్తున్నారని ఈ క్రమంలో రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ రైతు కుటుంబాలు దిక్కులేని పరిస్థితిలోకి నెట్టి వేయబడుతున్నాయని పేర్కొన్నారు.52 శాతం మందికి ఉపాధి అవకాశాలు కేవలం వ్యవసాయ రంగంలోనే లభిస్తున్న పాలకులు మాత్రం ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం రైతులకు ఆశాజనకమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా తాత్సారం చేస్తూ మోసం చేస్తున్నారని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.ఎన్నికల్లో చెప్పినట్లు రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ, రైతులందరికీ రైతు భరోసా, పత్తి మిర్చి వరి మొక్కజొన్నలకు క్వింటాకు వెయ్యి రూపాయల తగ్గకుండా బోనస్, 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు 5000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబా బాబురావు, జిల్లా నాయకులు నాగెల్లి కొంరయ్య, ఐతం నాగేష్,సింగతి మల్లికార్జున్, కేశెట్టి సదానందం,గోనె రాంచందర్,బుడిమె సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి..

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి..

సీఐ వెంకటరాజా గౌడ్..

రామాయంపేట మార్చి 13 నేటి ధాత్రి (మెదక్)

హోలీ పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని సీఐ వెంకటరాజా గౌడ్ ప్రకటన విడుదల చేశారు. హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పండగను ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించాలని సూచించారు.ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు చల్లితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు సృష్టించడం, మద్యం సేవించి వాహనం నడపడం చట్ట విరుద్ధమని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

జిల్లా వైద్య అధికారులకు కలెక్టర్ ఆదేశాలు.

ఎండ కాలంలో వడ దెబ్బె మందులు సిద్ధంగా ఉంచుకోవాలి

జిల్లా వైద్య అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి జిల్లా జిల్లాలో సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను
నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య అధికారులను ఆదేశించారు.క్షయ వ్యాధిమధుమేహం వేసవి కాలంలో వచ్చే వడదెబ్బలను అరికట్టేందుకు వైద్య శాఖ ద్వారా చేపడుతున్న చర్యల పై గురువారం కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు.మిషన్ మధుమేహ ద్వారా జిల్లాలోని 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మధుమేహం వ్యాధిని ముందుగానే గుర్తించి వ్యాధి నివారణకు అవగాహన మందులు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో 40 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికీ నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పూర్తి అయ్యిందని మిగిలినవి మార్చి 25 లోపు పూర్తి చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు.
జిల్లాలోమధుమేహం బారిన పడకుండా ఉండటానికి, వచ్చినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపు అలవాట్లలో మార్పులు వ్యాయామం పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా గోడపత్రికలు చేయించి ప్రచారం చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని అనుమానిత లక్షణాలు ఉన్న క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ఏ ఒక్క అనుమానితున్ని వదిలిపెట్టవద్దని కలెక్టర ఆదేశించారు .దాదాపు 99 శాతం ప్రక్రియ పూర్తి అయ్యిందని మిగిలిన ఒక్క శాతం సైతం త్వరలో పూర్తి చేస్తామని ప్రోగ్రాం ఆఫీసర్ డా సాయినాథ్ రెడ్డి తెలిపారు. క్షయవ్యాధి నిర్ధారణకు గల్లా పరీక్షతో పాటు ఎక్సరే తీసి క్షయవ్యాధి నిర్ధారణ పకడ్బందీగా చేయాలని సూచించార.వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా అవగాహనతో పాటు అవసరమైన మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ముఖ్యంగా ఉపాధిహామీ లో పనిచేసే వారికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు ముందుగానే అందుబాటులోఉంచాలని సూచించారు ఎవరైనా వడదెబ్బకు గురి అయితే సెలైన్, అవసరమైన మందులు ఇచ్చి పూర్తిస్థాయి వైద్యం అందించే విధంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వడదెబ్బ బారిన పడకుండా తగిన సలహాలు సూచనలు ప్రచారం చేయాలని సూచించారు.జిల్లా వైద్య అధికారి డా. శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. రామచంద్ర రావు. డా. పరిమళ, బాసిత్ డి పి ఆర్ ఓ వైద్య అధికారులు పాల్గొన్నారు

‘రైతుల నుంచి పాలను కొనుగోలు చేయాలి’

‘రైతుల నుంచి పాలను కొనుగోలు చేయాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ పరిశ్రమ వారు స్థానిక రైతుల నుంచి పాలను కొనుగోలు చేయకుండా మహారాష్ట్ర, కర్నాటక నుంచి పాలను దిగుమతి చేస్తోంది. దీంతో జహీరాబాద్ పాడి రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూరుకుపోతున్నారని, అప్పులు చేసి పాడిపశువులు పెంచుకున్నామని, ఇప్పుడు పాలను అమ్మే మార్గం లేదని రైతులు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు.

సెల్ఫ్ గవర్నమెంట్ డే స్వయం పరిపాలన దినోత్సవం.

సెల్ఫ్ గవర్నమెంట్ డే స్వయం పరిపాలన దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని మండల కేంద్రమైన ఝరాసంగంలోని విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ ఈరోజు పాఠశాలలోని విద్యార్థులు బి దీక్షిత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా ఉపాధ్యాయులుగా ప్రజ్వలిక సంజన వైష్ణవి సాయి కీర్తన రుహీన మహిన్ అబూబకర్ అలీ అబ్బాస్ బి ప్రకాష్ జి మధు జి నితీష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పాఠశాల బి నాగన్న ప్రధానోపాధ్యాయురాలు బి శ్వేత మరియు ఉపాధ్యాయుల బృందంతో వారిని శాలువాలతో సన్మానం చేసి బహుమతులు అందజేశారు.

ఎల్ఆర్ఎస్ పై అవగాహన నిర్వహించిన డిఐజి..

ఎల్ఆర్ఎస్ పై అవగాహన నిర్వహించిన డిఐజి

గంగాధర నేటిధాత్రి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం పట్ల గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీఐజీ రవీందర్ అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రేతలకు, దస్తావేజు లేఖరులకు ఎల్ఆర్ఎస్ ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించారు. పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. ఈ నెలా 31 వరకు 25%శాతం రాయితీ తో అధిక సంఖ్యలో చెల్లించుకోవాలని కోరారు.

మేమేం పాపం చేశాం.. మాకు ఇంత తక్కువ ధరెందుకు.

మేమేం పాపం చేశాం.. మాకు ఇంత తక్కువ ధరెందుకు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

మేమేం పాపం చేశామ్..మా చుట్టుపక్కల నిమ్జ్ ప్రాజెక్టులో ఎకరా భూమి ధర రూ.40 నుంచి రూ.60 లక్షల ఉంది. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తే తమకు వచ్చే ప్రయోజనం ఏమిటని రైతులు మూకుమ్మడిగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు. నిమ్జ్ భూసేకరణలో భాగంగా బుధవారం న్యాల్కల్ మండలంలోని మామడ్గిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 2013 చట్టం గురించి రైతులకు వివరించారు. అనంతరం రైతులు తమ అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం ఇచ్చారు. గ్రామస్తులను ఒక్కొక్కరు వేదికపై పిలిచి వారితో మాట్లాడించారు. ఈ సందర్భంగా రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2013 చట్టాన్ని సెక్షన్ రెండు, మూడుని మీనాయించి రైతులకు అన్యాయం చేసిందన్నారు.

మా గ్రామానికి సంబంధించిన భూములు సారవంతమైన భూములని, సంవత్సరానికి మూడు పంటలు పండుతాయన్నారు. అయిన ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారానికి భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. మరో రైతు కూరన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో అల్లం, పసుపు, ఆలుగడ్డ, అన్ని రకాల వాణిజ్య పంటలు పండే సారవంతమైన భూములన్నారు. పర్యావరణ శాఖ వారు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్లకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన సమగ్ర విచారణ నిర్వహించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందారు.ఇకనైనా మా విన్నపాన్ని మన్నించి సమస్య పరిష్కరించాలన్నారు. దాబేవాలె మహబూబ్ మాట్లాడుతూ… మీరిచ్చే ఒక ఎకరానికి నష్టపరిహారం రూ.15 లక్షలకు జహీరాబాద్ లో ఒక ప్లాటు రాదన్నారు. దీంతో తమ జీవనాధారం కోల్పోయి తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు నాగప్ప మాట్లాడుతూ.. నాకు పది ఎకరాల పొలం నలుగురు కుమారులు పది ఎకరాలు తీసుకొని 8 ఎకరాలు ఇచ్చిన పర్వాలేదని విన్నవించారు. నా నలుగురు కుమారులకు 2013 చట్టం ప్రకారం ఉపాధి హామీ కల్పించిన పర్వాలేదన్నారు. ప్రభుత్వం స్పందిస్తే భూమి ఇవ్వటానికి ఆలోచిస్తామన్నారు. లేకుంటే మూడు పంటలు పండే భూమి ఇవ్వనని తేల్చి చెప్పారు. మరో రైతు చింతల్ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 2013 చట్టం గురించి అవగాహన కల్పిస్తే తెలుస్తుందని, మార్కెట్ వ్యాలు ప్రకారం రూ.45 నుంచి 60 లక్షలు భూమి పలుకుతుందని రూ. 15 లక్షలు ఇస్తే ఒక ఫ్లాట్ కూడా రాదన్నారు. ప్రభుత్వానికి భూములిచ్చి తమ కుటుంబాలు అడుక్కుతినాలా అని ప్రశ్నించారు.
పట్టా భూమి, అసైన్మెంట్ భూముల రైతుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సమాధానం చెప్పలేని అధికారులు గ్రామ సభ వాయిదా వేశారు. అసైన్మెంట్ భూమికి సంబంధించిన ఓ భూ నిర్వాసితుడు మాట్లాడుతూ..” మీ భూములు మూడు పంటలు పండితే, మా భూములు నాలుగు పంటలు పండుతాయి” అంటూ సభలో వెటకారంగా భూసేకరణకు అనుకూలంగా మాట్లాడటంతో కొద్దిసేపు రైతుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతుల మధ్య సమన్వయం లోపించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకా అధికారులు గ్రామ సభ వాయిదా వేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భూపాల్, నాయబ్ తహసిల్దార్ రాజిరెడ్డి, నిమ్జ్ ప్రాజెక్ట్ ఆర్ఐ సిద్ధారెడ్డి, డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, జహీరాబాద్ రూరల్ సీఐ.జక్కుల హనుమంతు, జహీరాబాద్ సీఐ శివలింగం, హద్నూర్ ఎస్ఐ. చల్ల రాజశేఖర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాసిరకం ఇసుకతో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణం పనులు..

నాసిరకం ఇసుకతో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణం పనులు..

పునాదిలోనే నాసిరకం పనులు చేస్తే భవనం భవిష్యత్తు ఏమిటి..?

స్థానిక ఇసుకతోటే పనులు చేయాలని ఆదేశాలు.

హౌసింగ్ డి.ఈ విష్ణువర్ధన్ రెడ్డి వింత వివరణ..

నర్సంపేట,నేటిధాత్రి:

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు ప్రారంభం చేసింది. కాగా అందుకు సంబంధించిన మోడల్ ఇందిరమ్మ భవనాన్ని ప్రతి మండలానికి ఒక భవనం నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జార్ చేసింది. ప్రజలు లబ్ధిదారులు ఇందిరమ్మ పథకంలో బాగంగా 400 స్క్వేర్ ఫీట్స్ తో రూ.5 లక్షల నిధులతో ఇంటి నిర్మాణం నమూనా కోసం హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో ఇందిరమ్మ పథకం మోడల్ భవనం నిర్మాణ పనులు చేపట్టారు. కాని ఆ భవనం నిర్మాణ పనులు పునాదిలోని నాసిరకంగా పనులు చేపట్టడం వాళ్ళు చర్చలకు దారితీస్తున్నది. దుగ్గొండి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో
400 స్క్వేర్ ఫీట్స్ తో రూ.5 లక్షల నిధులతో నమూనా భవనం నిర్మాణం పనులు ప్రారంభం చేశారు. భవనం నిర్మాణం పనులు మొదలుపెట్టిన అధికారులు పునాదిలోని నాసిరకం ఇసుకతో పనులు చేపట్టడం పట్ల పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరణం పునాదిలోనే నాసిరకంగా పనులు చేపడితే ఏంద తరబడి ఉండాల్సిన భవనం ప్రమాదాల గురయ్యా అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాసిరకం పనులు చేపట్టకుండా నాణ్యతతో కూడిన పనులను చేపట్టి గ్రామాల్లో చేపట్టబోయే ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు నిలువుటద్దంగా నిరూపించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

స్థానిక ఇసుకతోటే పనులు చేయాలని ఆదేశాలు..

హౌసింగ్ డి.ఈ విష్ణువర్ధన్ రెడ్డి వింత వివరణ..

దుగ్గొండి మండల కేంద్రంలో ఇందిరమ్మ హౌసింగ్ నమూనా భవనాన్ని 400 స్క్వేర్ ఫీట్లతో 5 లక్షల రూపాయల నిధులు వ్యయంతో నిర్మాణం కోసం పనులు ప్రారంభించాము. భవనం నిర్మాణం కోసం రోబో ఇసుక, గోదావరి ఇసుక వాడాల్సి ఉంటుంది. మేము కొత్తగా వరంగల్ జిల్లాలో బాధ్యతలు తీసుకున్నాము. ప్రస్తుతం లోకల్ ఇసుకతో పనులు ప్రారంభం చేపట్టాము. ఇప్పుడున్న లోకల్ ఇసుకను మార్చి గోదావరి ఇసుకతో పనులు చేపడతామని హౌసింగ్ డిఈ విష్ణువర్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమ కెరటానికి దక్కనున్న గౌరవం

-రాములమ్మకు మంత్రి యోగం.

-త్వరలో మంత్రిగా రాములమ్మ.

-మలి తరం తెలంగాణ ఉద్యమానికి తొలి మహిళ.

-తల్లి తెలంగాణ పార్టీతో పోరాడిన ధీర వనిత.

-మహా మహా నాయకులే పార్టీ నడపలేదు.

-మహిళగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపారు.

-జయశంకర్‌ సార్‌ కోరిక మేరకు పార్టీని విలీనం చేశారు.

-లేకుంటే రాములమ్మ రాజకీయం మరో లెవల్‌లో వుండేది.

-మొదట జై తెలంగాణ అన్న వాళ్లెందరో వెనుకడుగు వేశారు.

-తెలంగాణ ప్రకటన వచ్చే దాక రాములమ్మ అలుపెరగని పోరాటం చేశారు.

-తెలంగాణ బిల్లు రోజు ప్రాణాలకు తెగించి స్పీకర్‌కు అండగా నిలబడ్డారు.

-తెలంగాణ బిల్లు చించేయాలని చూసిన వారికి అందకుండా రక్షణగా నిలిచారు.

-సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆమె సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు.

-రాజకీయ కుయుక్తులు తెలియక నమ్మి మోసపోయారు.

-కాలం మళ్ళీ సమాధానం చెప్పే అవకాశం రాములమ్మకు ఇచ్చింది.

-ఇప్పుడు రాములమ్మ టైమ్‌ మళ్ళీ వచ్చింది.

-అప్పుడు ఉద్యమం… ఇప్పుడు అసలైన రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో అందరూ నిస్వార్ధ పరులువుండరు. కాని కొంత మంది మాత్రమే ఎలాంటి స్వార్ధం లేకుండా, ప్రజల కోసం జీవితం త్యాగంచేస్తుంటారు. వారి భవిష్యత్తు ఫణంగా పెట్టి ప్రజల కోసం నిలబడతారు. కేవలం తన ప్రజల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తారు. అయితే అందులోనూ అటు ప్రజల కోసం, ఇటు తన మాతృభూమి కోసం కొంత మందే త్యాగాలు చేస్తుంటారు. అలాంటి అతి కొద్ది మందిలో తెలంగాణ ఉద్యమ కెరటం విజయశాంతి ఒకరు. తెలంగాణ అనే ఉద్యమం లేకుండా వుంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చేవారు. కాని తన ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్ధాలుగా సొంత రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బకడం ఆమెను కలిచివేసింది. ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం పచ్చగా, మరో ప్రాంతం ఎడారిగా వుండడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఒక ప్రాంతమంతా పాడి పంటలతో సస్యశ్యామలంగా వుంటే, మరో ప్రాంతంలో కనీసం తగడానికి చుక్క నీరు దొకరని దుస్ధిని చూసి ఆమె చలించిపోయారు. ఆంద్రా ప్రాంతలో సీటి సవ్వడులతో ఏడాదంతా గళగళాపారే నీళ్లులో పచ్చని పొలాలు, అందమైన ప్రకృతి, సంతోషంలో ప్రజలు, ఆర్ధికంగా వారి ఉన్నత స్ధితిని చూసిన రాములమ్మ, నా ప్రాంతం ఏం పాపం చేసుకున్నది అని తల్లడిల్లిపోయింది. గోదావరి, కృష్ణ నదులు తెలంగాణ నుంచే పారుతుంటాయి. ఎక్కువ శాతం తెలంగాణ నుంచే వెళ్తుంటాయి. తలాపున గోదావరి వున్నా ఉత్తర తెలంగాణ, పక్కనే కృష్ణ పరుగులు పెడుతున్నా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలు పలుగు రాళ్లు తెలి, బీళ్లు కనిపిస్తుంటే ఆమె గుండె చెరువైంది. దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజలు కోరుతూనే వున్నారు. మాకు నీళ్లు కావాలని పోరాటాలు చేస్తూనే వున్నారు. కాని అప్పటి పాలకులుపట్టించుకోలేదు. కనీసం తెలంగాణ బతుకులను కూడా చలించలేదు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నా చేయూతనివ్వలేదు. తెలంగాణ యువతకు పనిలేదు. తెలంగాణ రైతులు సాగు చేసే పరిస్ధితి లేదు. కనీసం తెలంగాణలో వున్న గొలుసు కట్టు చెరువులు నింపినా కాని, కనీసం తెలంగాణ ఎంతో కొంత బాగుపడేది. తెలంగాణ రైతు కన్నీళ్ల వ్యవసాయం చేయాల్సిన అవసరం వచ్చేదికారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు కాకముందే నిర్మాణం చేయాలనుకున్నా పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసినా కనీసం తెలంగాణలో సాగు సాగేది. ఏ రకంగా చూసినా తెలంగాణ అంతగా వెనుకబడేదికాదు. తెలంగాణ పల్లెలు వలసలు పోయవి కాదు. బొంబాయి, బొగ్గుబాయి, అప్పులు చేసి దుబాయిలకు వెళ్లే పరిస్దితి వచ్చేదే కాదు. తెలంగాణను పూర్తిగా ఎండబెట్టి, ఆంద్రాకు నీళ్లన్నీ తరలిస్తూ, తెలంగాణ రైతుల ఆత్మహత్యల పరంపరసాగుతున్నా కనీసం పట్టించుకోలేదు. పైగా తెలంగాణ రైతులు ఎక్స్‌గ్రేషియా కోసం చనిపోతున్నారని కూడా ఎద్దేవా చేసిన ఆంద్రా నాయకులు ఎద్దేవా చేసేవారు. తెలంగాణ భూముల్లో పంటలు కాదు, కనీసం తొండలు గుడ్లు పెట్టేందుకు కూడా పనికి రావంటుండేవారు. ఇదిలా వుంటే పుండు మీద కారం చల్లినట్లు, రైతాంగానికి ఇచ్చే కరంటు చార్జీలు విపరీతంగా పెంచారు. తెలంగాణ ప్రాంతానికి సాగు నీరందించాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులే శరణ్యం. వాటిని నిర్మాణాలు చేయలేం. రైతుల కోసం తెల్ల ఏనుగులాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఏటా అయ్యే ఖర్చును భరించలేమంటూ ఆంద్రా పాలకులు అంటుండేవారు. అంతే కాకుండా రైతులు ఆత్మగౌరవం మీద అడుగడుగునా దెబ్బ కొడుతుండే వారు. ఏపిలో చిన్న చినుకు పడి చేను చెడిపోయినా, పరిహారం అందించేవారు. కాని తెలంగాణలో అకాల వర్షాలుకు పంటలు చెడిపోయినా పట్టించుకునేవారు కాదు. ఎండలకు పంటలు ఎండిపోయి, సరైన నీరందక పంటలు పొట్టకొచ్చేదశలో చేతికి రాకుండాపోయినా కనీసం అయ్యే అని కూడా అనేవారు కాదు. ఇవన్నీ దాటుకొని రైతు పంట పండిస్తే గిట్టుబాటు ధర ఇచ్చేవారు కాదు. రైతుకు ఎప్పుడూ కష్టమే.. ఇవన్నీ చూసి రాములమ్మకు కుడపు తరుక్కుపోయింది. దాంతో సినీ రంగాన్ని ఏలుతున్న ఉచ్చ దశలో ఆ రంగాన్ని వదిలేశారు. అప్పటి నుంచి సినిమా వైపు చూడలేదు. సినిమా గురించి ఆలోచించేలేదు. వస్తూ, వస్తూనే తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ మొత్తం కలియ తిరిగారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేశారు. అనేక ఉద్యమాలు చేపట్టారు. ఓ వైపు కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని, తాను సంపాదించిన కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అయితే ఇదే సమయంలో కేసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి సాగుతోంది. అంతకుముందే ఆలెనరేంద్ర తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేశారు. అప్పటికే నరేంద్ర పార్టీని కేసిఆర్‌ పార్టీలోవిలీనం చేశారు. అలా రెండు పార్టీలు కలవడంతో తెలంగాణ ఉద్యమం మరింత బలపడిరదని ప్రొఫెసర్‌. జయశంకర్‌ సార్‌ అంచనావేశారు. అదే సమయంలో తల్లి తెలంగాణ పార్టీ ఊరూరా రెపరెపలాడుతోంది. ఆసమయానికి విజయశాంతి తెలియని వారులేరు. ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ కంటే రాములమ్మ తెలంగాణ ప్రజలకు ఎక్కువ తెలుసు. రాములమ్మ సినిమాతో ప్రతి గుడెసికు ఆమె పేరు చేరిపోయింది. అలా తెలంగాణ మాస్‌ ప్రజలకు కూడా ఆమె పేరు చేరిపోయింది. అలా కేసిఆర్‌ కంటే ఎక్కువగా తెలంగాణ సమాజానికి తెలిసిన రాములమ్మ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని జయశంకర్‌ సార్‌ ప్రతిపాదన పంపించారు. ఆయన మాట మీద నమ్మకంతో మాత్రమే తెలంగాణ సాధన కోసమే రాములమ్మ తన పార్టీని కేసిఆర్‌ పార్టీలో విలీనం చేశారు. లేకుంటే ఇప్పటికీ ఆ పార్టీ వుంటే రాములమ్మ రాజకీయం వేరుగా వుండేది. తెలంగాణలో అప్పటికే తెలుగుదేశం పార్టీలో నెంబర్‌ టూగా వున్నా దేవేందర్‌ గౌడ్‌ నవ తెలంగాణ అని పార్టీ ఏర్పాటు చేశారు. కాని ఆయన పట్టుమని పది నెలలు కూడా నడిపించలేకపోయారు. తన పార్టీని నడపలేక, సామాజిక తెలంగాణ నినాదంతో వచ్చిన చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీలో ఆ పార్టీని విలీనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి లాంటి నటుడు కూడా పార్టీని నడపలేక జెండా పీకేశారు. జయశంకర్‌లాంటి వారితో చెప్పించి, కేసిఆర్‌ తన పార్టీ తప్ప మరో పార్టీ వుండడానికి వీలు లేదని తల్లి తెలంగాణపార్టీ గొంతు కోశాడు. నిజంగా ఆమె పార్టీ అలాగే వుంటే ఇప్పుడు తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీగా వెలుగొందుతూనేవుండేది. మొదట్లో విజయశాంతికి ప్రాదాన్యతనిచ్చినట్లే కనిపించినా, ఆలె నరేంద్ర రాజకీయాన్ని ఎలా తుంచి వేశారో అలాగే విజయశాంతిని కూడా రాజకీయాలకు దూరం చేయాలనుకున్నారు. చెల్లి, చెల్లి అంటూ నమ్మించి తన రాజకీయ అవసరాల కోసం, తల్లి తెలంగాణ పార్టీని ఆనవాలు లేకుండా, విజయశాంతికి తెలంగాణ రాజకీయాల్లో స్ధానం లేకుండా చేయాలనుకున్నారు. అయినా ఎప్పుడూ విజయశాంతి దిగులు చెందలేదు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో విజయశాంతికి కీలక భూమిక. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఆమె పోషించిన పాత్ర మరే మహిళా నాయకురాలు పోషించలేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరూ ఆమెకు సాటి రారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం వచ్చింది. తెగించి పోరాటం చేసంది. తెలంగాణ కోసం జరిగిన సుధీర్ఘ పోరాటంలో ఆమె ముందుండి నడిచారు. రాజకీయ పదవుల కోసం ఆమె ఆలోచించలేదు. పదవులు కావాలని కోరలేదు. తన వచ్చిన లక్ష్యం తెలంగాణ ఏర్పాటు. అది పూర్తయింది.. అందులోనూ విజయశాంతి పాత్ర పెద్ద అందరికన్నా పెద్దది. తెలంగాణ బిల్లు రోజున ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టారనే చెప్పాలి. లోక్‌సభ స్వీకర్‌ మీరా కుమారి తెలంగాణ బిల్లు చదువుతుంటే ఆ ప్రతులను లాక్కొని చించేయాలని, బిల్లు పాస్‌ కాకండా చూడాలని ఏపి పార్లమెంటు సభ్యులు ఎంతో ప్రయత్నం చేశారు. ఆ సమయంలో స్పీకర్‌ పక్కన వుండి బిల్లు ప్రతులు వారికి దక్కకుండా రాములమ్మ చూశారు. ఒక వేళ స్పీకర్‌ మీద దాడి జరిగే ప్రయత్నాలు జరిగినా అడ్డుకునేందుకు సిద్దంగా వున్నారు. అయినప్పటికీ లగడపాటి రాజగోపాల్‌ పెప్పర్‌ స్ప్రే చల్లి మీరా కుమార్‌ సృహ తప్పి పడిపోయేలా చేశారు. ఆ సమయంలో విజయశాంతి అక్కడే వున్నారు. ఆమె తృటిలో తప్పించుకున్నారు. అలా తెలంగాణ బిల్లు పాస్‌ అయ్యేందుకు రాములమ్మ చేసిన తెగింపు తెలంగాణ వున్నంత వరకు మర్చిపోరు. అలాంటి రాములమ్మకు మళ్లీ టైం వచ్చింది. పదేళ్లపాటు ఆమె రాజకీయాలు దూరం కావాల్సి వచ్చినా కాలమనేది ఒకటుంటుంది. అది మళ్లీ త్యాగ ధనులకు మళ్లీ మంచి రోజులు తెస్తుంది. ఇప్పుడు మళ్లీ రాములమ్మకు గుడ్‌ టైమ్‌ మళ్లీ స్టార్ట్‌ అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలోనే మంత్రి కానున్నారు. ఇక రాములమ్మ రంగలోకి దిగితే ఇక బిఆర్‌ఎస్‌కు దబిడిదిబిడే..

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు….

తంగళ్ళపల్లి:నేటి ధాత్రి

తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముందుగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బంది సరైన టైంలో వస్తున్నారా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారనిఅధికారులను ఆదేశించారు అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం టి సైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించి మండలంలో ఇంటి ఇతర పనులపై ఆరా తీశారు మండలంలో భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని ఎంపిడిఓ లక్ష్మీనారాయణ ఆరా తీయగా . 2893. దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని
కలెక్టర్అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ ముందుగా ఓపి రిజిస్ట్రేషన్ పరిశీలించారు ఇతర రూములు తిరుగుతూ ఆసుపత్రికి వచ్చే రోగులపై ఎటువంటి రకాల పరీక్షలు చేస్తూ వారికి మందులు ఇచ్చే గది ల్యాబ్ తనిఖీ చేసి మందులు వ్యాక్సిలపై ఆరా తీశారు ప్రభుత్వ వైద్య సేవ చేసుకునేలా ప్రజలందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు ప్రభుత్వ దావఖానాలోనే ప్రసవం అయ్యేలా చూడాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కొరతలు ఉన్నాయని నేరెళ్ల వైద్యశాల అధికారి డాక్టర్ చంద్రిక రెడ్డిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తర్వాత నేరెళ్ల టీజి ఆర్ ఎస్ గర్ల్స్ విద్యార్థి హాస్టల్లో సందర్శించి విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం రాగిజావయిస్తుండగా పరిశీలించారు తర్వాత ఏ ఆహారాలు విద్యార్థులకు అందిస్తున్నారు అని అడగగా ప్రిన్సిపల్ సమాధానం చెబుతూ మెనూ ప్రకారం బగారా రైస్ ఆలుగడ్డ కూర టమాట ఉడికించిన గుడ్లు, సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేలా చర్యలు తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికల ప్రకారం విద్యార్థులను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

రిలే నిరవధిక దీక్షలు…

 

రిలే నిరవధిక దీక్షలు…

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత పార్లమెంటులో చేసేంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ నిలిపివేయాలని రిలే నిరవధిక దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కే సముద్రం మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు వల్లందాస్ మహేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి మామిళ్ల ప్రేమ్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము యాకయ్యమాదిగ, దుర్గం ఆకాష్ మాదిగ, గుజ్జునూరి నవీన్ మాదిగ, కొమ్ము రాధా, కొమ్ము బొందమ్మ, పందుల అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

 

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

TPCC President Mahesh Kumar Goud.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ ఆఫీజ్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మినిష్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం హాజరైన సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు ఉజ్వల్ రెడ్డి తోపాటు వెళ్లి షేక్ ఆఫిజ్ మహిష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఈ కార్యక్రమం లో మండల యువ నాయకులు అశ్విని పాటిల్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version