కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం-బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం వారికి మనస్పూర్తిగా యావత్ తెలంగాణ మరియు భారతదేశ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెళ్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కాడే నర్సింగమ్, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిత్తవేణి అంజిబాబు, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల యువ మోర్చ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేమ్ కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల ప్రకారం రాబోయే జనాభా లెక్కల్లో ,కుల గణన చేర్చాలని తీసుకున్నా నిర్ణయం చారిత్రాత్మకమని ఈ నిర్ణయం తీసుకున్న శుభ తరుణంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇన్నేళ్లు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ ఏనాడు తీసుకొనటు వంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయ మని రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం గణన అనేది కేంద్ర జాబితాలోని 69 అంశం గా ఉందని, జనగణన కుల గణన బాధ్యత పూర్తిగా కేంద్ర పరిధిలోనిదే రాజకీయ దురుద్దేశంతోటే కావాలనే కొన్ని రాష్ట్రాల్లో తమకు అధికారం లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలు అశాస్త్రీయం గా సేకరించాయి ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూ డదు అన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని అంతేకాకుండా ఈ దేశాన్ని 70 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ కులగనానికి ఎప్పుడు వ్యతిరేకమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్వహిం చిన ఏ జనాభా గణనలో కూడా కులగణను కాంగ్రెస్ ప్రభుత్వాలు చేర్చలేదని 2010 అప్పటి ప్రధాన మంత్రి మన్మో హన్ సింగ్ కులగణన అంశాన్ని పరిశీలిస్తామని లోక్ సభకు హామీ ఇచ్చారు అంశంపై అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు అనుకూలంగా వారి అభిప్రా యాలు తెలిపిన కూడా కులగణన చేయలేదని ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటు న్నారని మన రాష్ట్రంలో సర్వేల పేరుతో కులగణన నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం సరైన లెక్కలను చూపెట్టక తప్పులతడకగా చూపెట్టడానికి ఇదొక నిదర్శనం అని ఇలాంటి సర్వేలతో కులగణన చేయడం వల్ల సమాజంలో సందేహాలు వస్తాయని ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని దేశంలోని సున్నితమైన సామా జిక నిర్మాణం రాజకీయల వల్ల చెడిపోకూడదని అంశంతో ఈ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు ఈ కులగణన వల్ల రేపు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగు తుందని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, సీనియర్ నాయకులు,బూర ఈశ్వరయ్య, భూతం తిరుపతి, కోమటి రాజశేఖర్, మేకల సుమ, బూత్ అధ్యక్షులు, కడారి చంద్రమౌళి, కన్నెబోయిన రమేష్, ఎర్ర తిరుపతిరెడ్డి, చిందం గణేష్, బత్తుల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో గల ఎస్వీకేకే ఫంక్షన్ హాల్ ఘనంగా ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుపుకున్నారు. రాష్ట్ర,జిల్లా నాయకులు మాట్లాడుతూ పద్మశాలీల అంతా ఏకతాటిపై నడిచి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు రాజకీయ ప్రాధాన్య త గురి చేస్తూ భవిష్యత్తులో తమకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.సీట్ల కేటాయింపులో వెనుకబడి ఉన్న పద్మశాలీలకు రాజకీయంలోకి రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాలని అన్నారు. జియో టాకింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి చేనేత బీమా, చేనేత భరోసా పథకాలను అందించేలా ప్రభుత్వం దృష్టి చేయాల న్నారు చేనేత సంఘం పటిష్టం కోసం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
Congress party
మండల కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాbల అధ్యక్షులను ప్రధాన కార్యదర్శి కోశాధికారులను సమావేశంలో ఘనంగా సన్మానించారు.
బీసీ కుల గణన వెంటనే అమలు చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
కాంగ్రెస్ పార్టీ కులగణను చేపట్టి తర్వాత కేంద్రం దిగివచ్చి కుల గణన చేయడం హర్షణీయమని అన్నారు బీసీ కులదనులకు 150 మందికి ఒక వ్యక్తిని కేటాయించి వాడ వాడల పోస్టర్లు అతికించి ఒక తేదీ ప్రకటించి బీసీ కుల గణన 58.8% గా ఉందని నిర్ధారించారు.96% మంది కుల గణన చేయడానికి అవసరమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేసి బీసీ లకు చట్టబద్ధత చేయడం జరుగుతుంది. 2029లో బీసీ కుల గణన చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఉపయోగిస్తారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర,జిల్లా, మండల, గ్రామలలో ఉన్న పద్మశాలం దరూ పాల్గొన్నారు
గణపురం మండల కేంద్రం లో మాట్లాడుతూ కులగనన నిర్వహించడం చరిత్రలో మిగిలి పోయే నిర్ణయం అని దీపక్ పటేల్ అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంవత్సరాల కలను నిజం చేసి భారతదేశ వ్యాప్తంగా కులగనన చేయడం శుభపరిణామం అని కానియాడారు బీసీ లు ఇకనైనా ఆర్థికంగా, రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలపునిచ్చారు ఈకార్యక్రమంలో గండు రమేష్ పటేల్ జంగిలి శ్రీనివాస్ పటేల్ బోట్ల శ్రీనివాస్ పటేల్ మండల మున్నూరుకాపు సంఘము సభ్యులు పాల్గొన్నారు.
అకాల వర్షానికి కూలిన ఇండ్లు బాధితులకు భరోసా కల్పించిన బీఆర్ఎస్ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామ పంచాయతీలోని గోపాల్ పూర్,శివ్వారం గ్రామాలలో గురువారం రాత్రి వీచిన గాలివానకు ఇండ్లు పూర్తిగా దెబ్బతిని,పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసం అయి పలు కుటుంబాలకు నిలువ నీడ లేకుండా మారిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో నష్టపోయిన బాధితులను పరామర్శించి,ఆర్థిక సాయం అందించి,బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కంకణాల లక్ష్మీపతి రమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర రావు మధుప్రియల వివాహా మహోత్సవ వేడుక(అన్విత గార్డెన్స్ కరీంనగర్) లో జరగగా ఆవేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈవివాహ మహోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఎల్లా జగన్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, శనిగారపు అనిల్ కుమార్, తదితరనాయకులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త కుల గణన చారిత్రాత్మక నిర్ణయం అని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గత రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్త కులగనన చేయడం హర్షించదగ్గ విషయమని శుక్రవారంనాడు చిట్యాల మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి బీసీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి రుణపడి ఉన్నారని ఎన్నో సంవత్సరాలుగా బీసీలను జెండాలు మోసే బానిసలుగానే వివిధ రాజకీయ పార్టీలు చూసాయని కానీ భారతీయ జనతా పార్టీ బీసీలకు రాజ్యాధికారం అందాలని ప్రతి ఒక్క బిసి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఆశించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అని ఆయన అన్నారు ఇప్పటికైనా మిత్రులందరికీ ఏకతాటి మీద నిలబడి నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ ఓదెల శ్రీహరి నల్ల శ్రీనివాస్ రెడ్డి, మైదం శ్రీకాంత్ అనుప మహేష్ వల్లల ప్రవీణ్ కేంసారపు ప్రభాకర్ రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి
జహీరాబాద్ మండలం మల్చేల్మా గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు గ్రామస్థుల కోరిక మేరకు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గారు*ఇప్పేపల్లి PACS చైర్మన్ మచ్చండర్ ,మరియు మండల గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తో కలిసి ప్రారంభించారు .ఈ సంధర్బంగా గ్రామ నాయకులు,ప్రజలు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గార్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనందం మాజీ ఎంపీటీసీ లు ఇస్మాయిల్,మోయిన్,రాములు, ప్రేమ్ సింగ్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, అధ్యక్షులు,మండల బిసి సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,మండల యూత్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచులు చిన్నారెడ్డి,నాయకులు గోరెప్ప,భీమ్ రావ్, దత్తు రెడ్డి,మోహన్ రాథోడ్,శ్రీకాంత్, పిజి శంకర్,యేసు, శ్రీనివాస్, పాపన్న కయ్యుమ్, నసీర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జూడో యాత్రలో భాగంగా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బడుగు బలహీన వర్గాల కులాల గురించి అన్ని గ్రామాల్లో కులగణన చేపడతామని, జనగణన తో పాటు కులాల వారీగా కుల గణన చేపడతామని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్య, వైద్య ఉపాధి, ఉద్యోగ, అవకాశాలపై ఏ కులాలకు ఎంత వాటాల రూపంలో తీర్చేందుకే ఈ కుల గణనను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ఈ కుల గణన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన విధానం నుంచి వచ్చిందని, అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ద్వారా కులగణన తెలంగాణ ప్రభుత్వంలో చేపట్టడం జరిగినదని. ఈ కులగణలలో 1,50,000 మంది సర్వేలో పాల్గొనడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా ఈ కులగణలో బీసీల రిజర్వేషన్ శాతం 56.36% శాతం ఉన్న బీసీలకు విద్య, వైద్య, ఉపాధి కల్పనా రాజకీయంగా గాని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో 42% శాతం అసెంబ్లీ ఆమోదం నిర్ణయించడం జరిగింది . అంతేకాకుండా కరీంనగర్ బీసీ ముద్దుబిడ్డ, బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణన ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే రాష్ట్రంలో కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీసీ కులగనున చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను తోపాటు మన తెలంగాణ రాష్ట్రంలోని బిసి సంఘాలను ఏకం చేసుకుంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా కుల గణన నిరసన తెలుపడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరసన ఒత్తిడి తెచ్చింది అని అందుకు కేంద్ర ప్రభుత్వం కులగననకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, ఎండి హమీద్, చుక్క శేఖర్, వెంగళ అశోక్, అడ్డగట్ల శంకర్, పైసా ఆంజనేయులు, నేరెళ్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. మొన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల డి.సి.సి సమావేశంలో ప్రభుత్వ విప్ చీప్ ఆది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తల ముందు చిటి ఉమేష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దానిపై ఈరోజు కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి వచ్చే చీటీ ఉమేష్ రావు ఏ నాయకులను గాని ఏ కార్యకర్తలను గాని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి. సిరిసిల్లలోని కాంగ్రెస్ కార్యకర్తలపై పార్టీ పరంగా గాని వ్యక్తిగతంగా గాని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైనది కాదని అందువల్ల అతనిపై టీ.పి.సీ.సీకి ఫిర్యాదు చేస్తూ చర్యలు తీసుకునే విధంగా చూస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మరియు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగినది.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
పేదల కాలనీలో కనీస సదుపాయాలు కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి
ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతికి వినతి
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో పేదలను నివసించే కాలనీలకు ప్రత్యేక నిధులు కేటాయించి కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.బుదవారం ఎంసిపిఐ (యు) ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం స్థానిక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చెంది జనాభాపరంగా విపరీతంగా పెరుగుతున్నదని అదే స్థాయిలో కనీస వసతులు లేవని అందులో ముఖ్యంగా పేదల నివసించే కారల్ మార్క్స్ కాలనీ జ్యోతి బస్ నగర్ తదితర ఏరియాల్లో అంతర్గత రోడ్లు డ్రైనేజీ కాలువలు మంచినీటి నల్లాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పేదల కాలనీలో ఈ ప్రభుత్వంలోనైనా మెరుగుపడతాయని ఆశపడితే ఇంతవరకు కనీస దృష్టి పెట్టకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో సైతం పారదర్శకత లోపించిందని అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా ప్రక్రియ చేపట్టారని ఇది సరైన చర్య కాదని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి ప్రాధాన్యత క్రమంలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, పట్టణ నాయకులు ముప్పారపు రాజేందర్, బైరబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.
వరంగల్, నేటిధాత్రి
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ అధ్యక్షతన బుధవారం నాడు ఏకశిలా పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ కొరకై మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరుతూ దేశాయిపేట ఇండ్ల ముందు నిరాహార దీక్ష చేపట్టిన వారికి మద్దతుగా బీజేపీ మద్దతు ప్రకటించి ఈరోజు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలనీ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కలలను నిజం చేస్తూ డబుల్ బెడ్ రూమ్ లను గత బిఅర్ఎస్ కేటాయించినా ఇండ్లు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు కావస్తున్న జర్నలిస్టులకు నీడ లేకపోయిందని విమర్శించారు.
BJP
ప్రభుత్వానికి, ప్రజలకు ప్రతినిధులగా వారి మధ్య జరిగే సమాచారాన్ని తెలియపర్చే వారు జర్నలిస్టులు. వారికి పేపర్ సంస్థ నుండి చాలీచాలని వేతనాలతో కుటుంబంతో జీవనాన్ని గడుపుతున్నారు. ఇంటి అద్దె కట్టలేక నాన అవస్థలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అప్పుడున్న రాజకీయ పరిణామాలు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వలన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టులను వాడుకోవడం, ప్రభుత్వం పోయాక మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అదే తరహా జర్నలిస్టులను వాడుకుంటూ, గత ప్రభుత్వాల మాదిరిగానే చేస్తూ ఉండడం అనవాయితిగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఇప్పడి లబ్ధి దారులకు ఇండ్లు ఇయ్యక పొవడం వలన శిథిలావస్థకు చేరుతుతున్నాయి. అసాంఘిక కర్యకలాపాలకు అడ్డాగా మారి జూదాలకి, వ్యభిచారులకు ఆశ్రయం ఐపోయి, తలుపులు, కిటికీలు, కరెంటు వైర్లు,నీటి పైపు లైను, ట్యాంకులు అన్ని ధ్వంసం చేశారు.
తూర్పులో శాసనసభ్యులుగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఎన్నోసార్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల దగ్గర పర్యటించినప్పటికీ జర్నలిస్టులపై అనుకూల భావన లేనట్లు కనిపిస్తుంది.
అదే నిజమైతే గత ప్రభుత్వంలో భూమి కేటాయింపు నిధుల కేటాయింపు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఏ రకంగా చేశారు. దీనిని ప్రభుత్వాలు దేనికోసం నిర్మించాయి. సదరు పాలకులు గమనించాలి.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా అంటూ వరంగల్ తూర్పులో వర్కింగ్ జర్నలిస్టులు నిరాహార దీక్షలు చేపట్టారు.
సమస్య శాంతియుతంగా పరిష్కారం కాకపోతే నగర నడిబొడ్డున తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామన్నారు తెలిపారు.
ఇప్పటికైనా ప్రజాపాలన ప్రభుత్వం స్పందించి తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు త్వరగా కేటాయించాలని కోరారు.
BJP
12 ఏప్రిల్, 2021 రోజున వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం డబల్ బెడ్రూంలు భూమి పూజ చేసిన అప్పటి మంత్రివర్యులు కేటీఆర్..
రెండు ఏండ్లలో 12 కోట్లు ఖర్చు పెట్టి, మొత్తం మూడు ఎకరాల భూమిలో, రెండు ఎకరాల్లో మొత్తం 9 బ్లాకులు కలిపి 200 డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తి చేసిన అప్పటి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తేదీ 17 జూన్, 2023 నాడు నిర్మాణం పూర్తి చేసిన డబల్ బెడ్ రూం లు, అట్టహాసంగా ప్రారంభం చేసి, ఆరుగురు జర్నలిస్టులకు గృహ ప్రవేశం, జర్నలిస్ట్ ల కాలనీ, జర్నలిస్టుల కొరకు అని పేర్కొన్న అప్పటి ప్రభుత్వం.
రెండు ఏండ్లుగా నిరుపయోగంగా ఉండటం వలన చాలా వరకు కిటికీలు, ఎలెక్ట్రిక్ పరికరాలు, డోర్ లు, పైపులు ధ్వంసం అయ్యాయి.
వాటర్ ఇంటెక్స్ ట్యాంక్ లు మాయమయ్యాయి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన తీరు కనిపిస్తుందని అన్నారు.
వరంగల్ జర్నలిస్ట్ ఐకాస ప్రధాన డిమాండ్లు
అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలి.
జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ( జేహెచ్ఎస్) పరిమితి రెండు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలి.
అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో (జేహెచ్ఎస్) పనిచేయడంతో పాటు అన్ని వ్యాధులకు వర్తింపజేయాలి.
వరంగల్ ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలని, అలాగే పలు డిమాండ్లతో వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెమొరండం ఇవ్వడం జరిగింది.
BJP
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా మిత్రులు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు మార్తీనేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, మాజీ పూర్వ జిల్లా అధ్యక్షులు చాడ శ్రీనివాసరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ , గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కార్పొరేటర్ చాడ స్వాతి, కాసు శిల్పా, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చా నాయకులు, బిజెపి జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
బుధవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు.సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు మానవులంతా.ఒక్కటే అని కుల మతాలు లేవని ప్రగాఢంగా నమ్మి ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు .మూఢ నమ్మకాలను నమ్మవద్దని, సమానత్వం, శోషలిజం వంటి సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ బసవేశ్వరుడు శ్రమకు మించిన సౌందర్యం లేదని, ఏ పని చేసిన నిష్టతో అంకిత భావంతో పనిచేయాలని బోధించిన బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తాయని అన్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.సి.డి.బి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ,ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
డిసిసి అధ్యక్ష పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలి- అనుపురం పరశురాం గౌడ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలని యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురాం గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడిపల్లి సత్యం పీహెచ్డీ చేసిన ఒక విద్యావేత్త, యువ నాయకులు, పేదల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులు, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే గొప్ప వ్యక్తి. మంచి నాయకత్వ లక్షణాలు కలిగివున్న సత్యంకు డిసిసి అధ్యక్ష పదవిని అందించడం ద్వారా ముందు ముందు పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా యువత కూడా రాజకీయంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.
రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి -పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
భారత రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని కర్కాల నుండి హరిపిరాల గ్రామ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం నిర్వహించి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేతిలో గాంధీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి,రామచంద్రయ్య, సురేందర్ రెడ్డి,అచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి,శ్రావణ్ కుమార్,చెవిటి సధాకర్,యాకూబ్ రెడ్డి,ధరావత్ సోమన్న, రవి నాయక్, ఫింగిలి ఉష, ప్రశాంతి, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన విగ్నేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ బుదవారం ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అజ్మీర మేఘ్య నాయక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజు మురళి, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, విగ్నేశ్వర రైతు సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి, విజ్ఞేశ్వర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రేమిడి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ రాజా మల్లారెడ్డి, మేడబోయిన కుమార్, విగ్నేశ్వర రైతు సంఘం సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.
రాష్ట్రీయ బసవ దళ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,
◆ మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్*
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు మంగళవారం పట్టణం లోని బసవ మంటపం లో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్ ఈ సంధర్బంగా డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు,ప్రేమతత్వం, సమానత్వం,సౌభ్రాతృత్వాన్ని విశ్వమానవాళికి ప్రబోధించిన మహాత్మ శ్రీ బసవేశ్వరుడి చూపిన మార్గంలో నడవాలాన్నారు.బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రక్త దాన కార్యక్రమాలు చేయడం ఒక పుణ్య కార్యం అని,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజశేఖర్,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,అశ్విన్ పాటిల్,రంగా అరుణ్ కుమార్, కుతుబోద్దిన్,తాజోద్దిన్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,బి.జి.సందీప్ మరియు రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ముఫై ఒకలక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను రామడుగు ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోని శ్రీపెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి తన వంతు సహాయం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు దీనికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దమనుషులకు, సొసైటీ సభ్యులకు, ముదిరాజ్ యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు జిట్టవేణి రాజు, సదరు పెద్దమనిషి జిట్టవేణి రమేష్, వైస్ చైర్మన్ నీలం రవి, డైరెక్టర్లు, పెద్దమనుషులు ఉత్తం రాయమల్లు, సామంతుల తిరుపతి, రాగం రాజయ్య, మామిడి సుదర్శన్, రాగం వెంకటి, జిట్టవేణి అంజిబాబు, పెసరి రాజమౌళి, సామంతుల తిరుపతి, రాగం లచ్చయ్య, ఈగ రాజేశం, రాగం సంపత్, చిలువేరి కనకయ్య, ఉప్పరి మహేష్, నీలం లక్ష్మణ్ బొమ్మరివేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.