రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి.

రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
-పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

 

 

భారత రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని కర్కాల నుండి హరిపిరాల గ్రామ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం నిర్వహించి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేతిలో గాంధీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి,రామచంద్రయ్య, సురేందర్ రెడ్డి,అచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి,శ్రావణ్ కుమార్,చెవిటి సధాకర్,యాకూబ్ రెడ్డి,ధరావత్ సోమన్న, రవి నాయక్, ఫింగిలి ఉష, ప్రశాంతి, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version