పల్లెల్లో కొరవడిన పారిశుధ్యం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-3.wav?_=1


పల్లెల్లో కొరవడిన పారిశుధ్యం…

వసతి గృహాల్లో విధిగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి…

సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…

గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి…

మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి…

తరచుగా మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలి…

గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేసి ఉపయోగించాలి…

డయేరియా, డెంగ్యూ, మలేరియా కేసులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ శుభ్రంగా ఉంచాలి…

సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేపట్టాలి…

సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న వైద్యులు,సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి…

నేటి ధాత్రి -గార్ల :-

వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రభలకుండా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధులను అరికట్టాలి. వర్షాకాలం ప్రారంభం నుండి నీటి వరకు మండల వ్యాప్తంగా ఎక్కడ కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు స్థానికంగా ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, సిబ్బంది ఖమ్మం వరంగల్ లాంటి సుదూర ప్రాంతాల నుండి యదేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ సమయపాలన పాటించనప్పటికీ జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి, జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు,విరేచనాల బాధితులు వందల సంఖ్యలో వస్తుంటారు. వారికి సకాలంలో వైద్యం అందించడంలో వైద్యులు విఫలమవుతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో దోమలు ఈగలు స్వైర విహారం చేస్తున్నప్పటికీ దోమల మందు పిచికారి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తు, తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనేది నిజం. వర్షాకాలంలో నీరు మారడం మూలంగా ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. వర్షపు నీరు ప్రవహిస్తూ రావడంతో దుమ్ము,చెత్త,మట్టి కలిసిపోతాయి. నీటి రంగు మారుతుంది. అందుకు కాచిన, చల్లార్చిన నీటిని వడ పోసి త్రాగేలా, ఇంటి లోపల దోమలు రాకుండా, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించేలా ప్రజలను చైతన్య పరచాలి. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. పల్లెల్లో సైడ్ కాలువలలో మురుగు నీరు తొలగించి బ్లీచింగ్ పౌడర్ వేయాలని, త్వరితగతిన దోమల మందు పిచికారి చేయాలని, వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-4-4.wav?_=2

బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా.
సవతి తల్లి తన సవతి పిల్లలపైన సవతి ప్రేమా ఎలా చూపిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అడ్డగోలుగా, ఇష్టానుసారంగా తలా తోక లేని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు, అలాగే కామారెడ్డిలో డిక్లేర్ చేసిన బీసీ రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యమవుతుందని తెలుసుకోకుండా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు బిజెపి పైన ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ నీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసి డిక్లరేషన్ తెలిసి చేశారా తెలియక చేశారా అన్న అంశం కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి. జనవరి 1, 1979 నాడు అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషన్ ని బీ.పీ మండల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 340 ప్రకారం ఎవరైతే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉంటారో వాళ్ళందరినీ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కమిషన్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిటీ వాళ్లు సర్వే చేసి డిసెంబర్ 31, 1984 సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారము బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1979లో ఏదైతే గవర్నమెంట్ రూలింగ్ లో ఉండెనో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత 1980లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ 1989 వరకు అధికారంలో ఉండడం జరిగింది కానీ ఈ పదేళ్ల కాలంలో రాజీవ్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని ఈ రిపోర్టు పైన ఎలాంటి స్పందన తెలియజేయలేదు. 1990లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత 1990లో అప్పటి ప్రధానమంత్రి అయిన వీ.పీ సింగ్ గారు ఈ మండల్ కమిటీ వారు ఏదైతే రిపోర్టు ఇవ్వడం జరిగిందో ఆ రిపోర్టు ప్రకారము 27% రిజర్వేషన్ ఇవ్వాలని వారు నిర్ణయించుకొని రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ ని అమల్లోకి తీసుకురావడం వల్ల దేశంలో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నిరసనలు చేపట్టడం జరిగింది. అయితే ఇంద్రా సావ్నే అనే పిటిషనర్ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల, సుప్రీంకోర్టు ఇంద్రా సావ్నే vs యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగంలో మూడు గవర్నమెంటల్ మిషనరీస్ ని అమలులోకి తీసుకురావడం జరిగింది (లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ). అయితే పార్లమెంట్లో ఏదైతే బిల్లు పాస్ చేయడం జరుగుతుందో ఆ బిల్లు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ లిమిట్ ని విధించడం జరిగింది. ఇప్పుడు బిజెపి గవర్నమెంట్ బిసి రిజర్వేషన్ ని ఆమోదించిన కూడా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడం జరుగుతుంది.
ఒకవేళ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా చాలా స్పష్టమైన మరియు న్యాయపరమైన అలాగే స్టాటిస్టికల్ డేటాని చూపిస్తూ మన రాష్ట్రంలో బీసీలు ఎలా అణిచివేయబడుతున్నారు, వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతున్నది అని ఇలాంటి అంశాలన్నీ కూడా న్యాయస్థానానికి ఇచ్చినప్పుడు మాత్రమే బిసి రిజర్వేషన్నీ ఆమోదించడం జరుగుతుంది.మీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కాస్ట్ సర్వే చేశామని చెప్పడం జరుగుతుంది కానీ ఆ రిపోర్ట్ ని ఎందుకు బయట పెట్టడం లేదని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ ని ప్రశ్నించడం జరిగింది. ఆ రిపోర్టు బయట పెట్టినప్పుడు మాత్రమే మీరు ఎంత బాగా సర్వే చేశారని తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీ సర్వే కరెక్ట్ గా జరగలేదు బీసీల జనాభాని తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ వారు తీన్మార్ మల్లన్న నీ సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే బీసీ సర్వే అవ్వకముందే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎలా ప్రవేశపెడతారు? ఈ అడ్డిమారి గుడ్డి బిసి సర్వే ని ఆధారం చేసుకొని బిజెపి ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టు గాని ఎలా ఆమోదిస్తుంది అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు.
బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలు తగిన బుద్ధి చెబుతారనే భయంతో బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తూ ఢిల్లీలో నిరసన తెలియజేయడం చూస్తుంటే, బట్ట కాల్చి బిజెపి పైన వేయాలన్న ఉద్దేశం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల వరకు భారతదేశంలో రూలింగ్ లో ఉండే మరి అప్పుడు బీసీల పైన ఈ ప్రేమ ఎక్కడ పోయింది, కొత్తగా ఈ ప్రేమ ఇప్పుడు ఎప్పటినుంచి పుట్టుకొచ్చిందో తెలియజేయాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది.
మీ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇది సుప్రీంకోర్టు ఆమోదించదు మరియు 9th షెడ్యూల్లో కూడా చేర్చడం చాలా కష్టమైన విషయం అని తెలిసి కూడా బీసీల సింపతి కోసం మరియు బీసీల ఓట్ల కోసం ఈ సవతి ప్రేమ చూపించడం జరిగిందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ లో ఉన్న బీసీలు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాగే మద్దతు తెలిపితే మిమ్మల్ని ఇలానే మోసం చేస్తూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేలా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కావున కాంగ్రెస్ లో ఉన్న బీసీలు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాన్ని తెలుసుకోవాలని మరియు తెలుసుకుంటారని ఆశిస్తున్నానని జ్యోతి పండాల్ అన్నారు.

రైతు బీమా దరఖాస్తుల ఆహ్వానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T173140.229.wav?_=3

రైతు బీమా దరఖాస్తుల ఆహ్వానం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

రైతు భీమా పథకం 2025 ఝరాసంగం మండల కేంద్రంలోని అన్ని రైతువేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు బీమా దరఖాస్తు స్వీకరణ చేపట్టడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ ఒక ప్రకటన తెలిపారు.

◆ 05-06-2025 నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతు అర్హులు

◆ 18 నుండి 59 సంవత్స రాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్న వారు మాత్రమే అర్హులు.

◆సంబంధిత రైతే స్వయంగా వచ్చి రైతు వేదికలో దరఖాస్తు అందజేయాలి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఎటువంటి దరఖాస్తు స్వీకరించబడదు.

◆ చివరి తేదీ – 12.08.2025

◆ జతచేయవలసిన పత్రాలు
◆ దరఖాస్తు ఫారం
◆ రైతు ఆధార్ కార్డు జిరాక్స్
◆ రైతు భూమి పాస్ పుస్తకం జిరాక్స్
◆ నామినీ ఆధార్ కార్డు జిరాక్స్
సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తులను ఇవ్వాలని సూచించడం జరిగింది..

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-12-3.wav?_=4

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని ఆదర్శనగర్ కాలనీలో సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి నివాసంలో ఆదివారం యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా.సిద్దం ఉజ్వల్రెడ్డి వారిని శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

తహసిల్దార్ కార్యాలయంలో వన మహోత్సవం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-21-3.wav?_=5

తహసిల్దార్ కార్యాలయంలో వన మహోత్సవం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం తహసిల్దార్ వనజా రెడ్డి, ఎంపీఓ శ్రీపతి బాబురావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు,పెళ్లిరోజు వేడుకల సందర్భంగా మొక్కలు నాటి వాటిని విరివిరిగా సంరక్షిస్తూ వాతావరణ సమతుల్యతకు పాటుపడలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సంతోష్,ఏపీవో బాలయ్య,ఎఫ్ఎస్ఓ రామకృష్ణ,ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత,పంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్,తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది,ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-3-3.wav?_=6

నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహీంద్రా & మహీంద్రా అధికారక కార్మిక సంఘం సలహాదారుడు రాజీ రెడ్డి గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ , గణేష్ ,దీపక్ ,చంద్రయ్య ,తదితరులు పాల్గొన్నారు.

జాతీయ నులిపురుగుల దినోత్సవం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-3.wav?_=7

జాతీయ నులిపురుగుల దినోత్సవం

ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ రవితేజ

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలోని కరకగూడెం మండలంలో అన్ని అంగన్వాడి, స్కూల్స్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల టాబ్లెట్ ఇవ్వడం జరిగింది ఇది పిల్లల్లోనూ రక్త హీనతను నివారించి పిల్లలు చురుగ్గా ఉంటారు శరీరం మెదడు చురుగ్గా పనిచేసి చదువులోన ముందంజనంలో ఉంటారని డాక్టర్ రవితేజ అన్నారు.ఈ కార్యక్రమంలో పి హెచ్ సి, హెచ్ ఇ ఓ కృష్ణయ్య, భవాని, ఎం పి హెచ్ ఎ (ఎం) నరసింహారావు, ఎంపీహెచ్ఏ(ఎఫ్), రమాదేవి, జ్యోతి, మరియు, లక్ష్మి, సుజాత, 44 మంది ఆశాలు, మండలంలోని స్కూల్ టీచర్స్, మరియు అంగన్వాడీ టీచర్స్, ఏ హెచ్ ఎస్ చిరు మల్ల హెచ్ఎం రామచంద్రరావు, పిడి బాలరాజు, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మాక్సుద్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడాలంటే నులిపురుగులను నివారించడం తప్పనిసరి అని, ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సింఫోనియా, వైస్ ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే మాణిక్ రావు.

 

నులి పురుగుల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జిల్లా పరిషద్ గర్ల్స్ హై స్కూల్ నందు పాఠశాల విద్యార్థినులకు అర్బెండజోల్ మాత్రలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు నులి పురుగుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకుంటామని తెలిపారు ఈ వ్యాధి వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వలన, వండిన మరియు కలుషితమైన ఆహారం , స్వీట్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వంటి వివిధ కారణాలవల్ల పిల్లల్లో వార్మ్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని అన్నారు
అందుకే ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా ఈ నూలి పురుగుల నివారణ కొరకై ఈ టాబ్లెట్లను పిల్లలు తప్పకుండా వేసుకోవాలని అన్నారు
అనంతరం నూలి పురుగుల నివారణకు టాబ్లెట్లను పిల్లలకు అందించారు ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ , గణేష్ ,దీపక్ ,చంద్రయ్య ,
డీఎం & హోం గాయత్రి దేవి ,వైద్య సిబ్బంది ,ఉపాధ్యాయులు , తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ మాయమాటలతో దళితులను మోసం చేస్తుంది

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2-4.wav?_=8

కాంగ్రెస్ మాయమాటలతో దళితులను మోసం చేస్తుంది

దళితబందు రెండోవిడత విడుదల చేయాలి

దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఏకు కార్తీక్

పరకాల నేటిధాత్రి

పథకాల పేరుతో దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని రెండో విడత దళితబందు విడుదల చేయాలని దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఏకు కార్తీక్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో దళతుల బలమేందో చూపిస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులను మోసం చేస్తూ వాళ్ళ ఓట్లను దండుకోవడానికి రెండో విడత దళిత బంధు నిధులిస్తాం,ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయల అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా డబ్బులు అందజేస్తామని చెప్పి దళిత బంధు నిధులు ఇవ్వకుండా కనీసం అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రారంభించకుండా దళితులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తుందని గత 18 నెలలుగా ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ఇదిగో అదిగో అని మాయమాటలు చెబుతూ దళితులను వంచిస్తుందని ఏకు కార్తీక్ తెలిపారు.ఇలాంటి ప్రభుత్వానికి ఇక ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నిర్ణయించుకుందని దానిలో భాగంగా మలిదశ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా రెండవ దశ దళిత బంధుసాధన ఉద్యమం ద్వారా ప్రభుత్వం మెడలు వంచుతామని తెలిపారు.దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి దళిత బంధు మరియు అంబేద్కర్ ఆభయం హస్తం ఇచ్చేదాకా దళిత బంధు సాధన సమితి లబ్ధిదారుల తరుపున పోరాటం చేస్తుందని అన్నారు.

ఆనంద్ కుమార్ తల్లోజు ఆచారికి క్షమాపణ చెప్పాలి.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T170554.426.wav?_=9

ఆనంద్ కుమార్ తల్లోజు ఆచారికి క్షమాపణ చెప్పాలి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు కల్వకుర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు ముందుగా కార్యక్రమంలో మొగలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…ఈనెల ఆరో తారీఖున కల్వకుర్తి పట్టణంలో జరిగిన బిజెపి ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ మాజీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హామీని ప్రజల సాక్షిగా నిలదీయడంతో రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని భయాందోళనలకు గురై కంగుతిన్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ కుమార్ 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండాతో పని చేస్తున్న,ఉద్యమనేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పోరాటాల సూర్యుడు, తల్లోజు ఆచారిని ఆరుసార్లు ఓడిపోయావని బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసి లోన్లు తేలేదని కించపరుస్తూ తిట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం…ఆచారి ఆరుసార్లు ఓడిపోయాడని అంటున్న నువ్వు ఒక్కసారి వెనుక తిరిగి నీ వీపు నువ్వు చూసుకో…
మొదటిసారి కాటన్ మిల్ ఎలక్షన్లలో చిత్తరంజన్ దాసు గారి కాళ్లు పట్టుకొని గెలిచావు గుర్తులేదా…?ఇప్పటికీ 9 సార్లు ఓడిపోయిన నువ్వు నీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో…
కౌన్సిలర్ గా ఓటమి…
ఎంపీటీసీ గా ఓటమి…
సర్పంచ్ గా ఓటమి…
కాటన్ మిల్లు ఓటమి…
100 నుంచి 1000 ఓట్ల ఎలక్షన్లలో ఓడిపోయిన నువ్వు ఆచారి గారిని అనే అంత గొప్పోడివా…?
మొదటి ఎలక్షన్లలో 8500 ఓట్లు
రెండవ ఎలక్షన్లలో 52 వేల ఓట్లు
మూడవ ఎలక్షన్లలో 29 వేల ఓట్లు
నాల్గవ ఎలక్షన్లలో 42 వేల ఓట్లు
ఐదవ ఎలక్షన్లలో 60 వేల ఓట్లు
ఆరోసారి ఎలక్షన్లలో 70 వేల ఓట్లు కల్వకుర్తి ప్రజల చేత మన్నన పొంది కల్వకుర్తి ప్రజల ప్రేమాభిమానాలు ఆస్తులుగా సంపాదించిన
తల్లోజు ఆచారీని కించపరుస్తావా…?బిజెపి నుండి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ నుండి టిడిపిలోకి టిడిపి నుండి స్వతంత్ర అభ్యర్థి వైపు అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ వైపు ఇప్పుడు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఇప్పుడు చెప్పండి ఇంకా ఏ పార్టీ మిగిలింది మీకు..?6సార్లు పార్టీలు మారిన నీచరిత్రను తిరిగేస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది కాదా…?
నునుగు మీసాల వయసు నుంచి 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా
ఒకే అజెండా ఒకే పార్టీలో పనిచేస్తూ ఎన్ని గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా కలలో కూడా పార్టీ మారే ఆలోచన చేయకుండా నిరంతరం కల్వకుర్తి ప్రజల గురించి తప్పా తన వ్యక్తిగత జీవితం కూడా మరచి కల్వకుర్తి ప్రజల కోసం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు తల్లోజు ఆచారిని అవమానిస్తావా…?
తల్లోజు ఆచారి బీసీ కమిషన్ ద్వారా ఏం న్యాయం చేశాడని ప్రశ్నించిన ఆనంద్ కుమార్ అసలు బీసీ కమిషన్ అంటే ఏంటో తెలుసా…? ఒక ఉన్నత విద్యావంతుడిని అని చెప్పుకుంటావు కదా..?
బీసీ కమిషన్ కు నిధులు ఉండవన్న సంగతి నీకు తెలియదా…?
బీసీ కమిషన్ అనేది కేవలం బీసీలకు న్యాయం చేయడానికి మాత్రమే ఏర్పడ్డ ఒక రాజ్యాంగ వ్యవస్థాని నీకు తెలియదా…?
ఆచారి గారు బీసీ కమిషన్ మెంబర్ అయిన తర్వాతనే ఈ దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, లా యూనివర్సిటీలో, ఎంబీబీఎస్ సీట్ల విషయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు, అమలుపరిచారన్న సంగతి నీకు తెలియదా…?
బీసీ కమిషన్ ద్వారా దక్షిణ భారతదేశంలో ఎంతోమంది బీసీ ఉద్యోగులకు బీసీ ప్రజలకు న్యాయం చేశాడన్న సంగతి మరిచిపోయావా…?మాట్లాడితే బీసీ బిడ్డ అని చెప్పుకుంటావు కదా కల్వకుర్తి పట్టణంలో గత 30 ఏళ్ళ నీ రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరికి న్యాయం చేసావో..?ఏ ఒక్క బీసీని ఉద్ధరించావో చూపిస్తావా…?
ఒక్క బీసీ నైనా రాజకీయ నాయకుడిగా ఎదగనిచ్చావా…?ఖబర్దార్ ఆనంద్ కుమార్ నీ తప్పు తెలుసుకుని తల్లోజు ఆచారి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను…. అన్నారు.
తదనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..పదవుల కోసం పార్టీలు మారే మీరు అలుపెరుగని పోరాటయోధులైన తల్లోజు ఆచారి గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం…మొన్న ఆరో తారీకు జరిగిన ర్యాలీలో 100 మంది పాల్గొన్నారు.అనడం నీఅవివేకం ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది అర్హులైన లబ్ధిదారులను కించపరచడం మీఅహంకారానికి నిదర్శనం…మీకాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ 2000 పెంచను 4000 చేస్తాం అనలేదా…?వికలాంగుల పింఛన్ 4000 రూపాయలను 6000 రూ” చేస్తాం అనలేదా..?
ప్రతి మహిళకు నెల నెల
2500/-రూ ” ఇస్తాం అనలేదా..?
ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తాం అనలేదా..?
ప్రతి రైతుకు రెండులక్షల రూ రుణమాఫీ హామీ మీరు ఇచ్చింది కాదా..?ఎకరాకు ప్రతి సంవత్సరం 15000/- రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వలేదా…?మీరు ఇచ్చిన 6గ్యారంటీల దొంగ హామీల మీద మాట్లాడితే ఆచారిని తిడతారా..?
ఈ ప్రాంతంలో ఆచారి గారి ప్రజా ఉద్యమాలు గుర్తులేదా..?KLI.. కోసం ఆమనగల్ నుంచి కల్వకుర్తి మీదుగా ఎడ్లబండ్లతో పాలమూరు కలెక్టర్ ముట్టడి మరిచినావా…KLI.. పూర్తి కోసం సీఎం ఇల్లు ముట్టడి కోసం రైతులతో చలో హైదరాబాద్ పేరుతో ప్రభుత్వంతో చేసిన యుద్ధం గుర్తులేదా..?రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్తు కోసం 4రోజుల దీక్ష గుర్తులేదా…?
RDO.. కార్యాలయం కోసం ఏడు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి సాధించింది మరిచిపోయావా..?కొట్ర నుండి కల్వకుర్తి మీదుగా తిరుపతి వరకు 1000 కోట్ల రోడ్డును మోడీ గారితో మాట్లాడి పట్టుబట్టి తీసుకొచ్చింది మర్చిపోయావా..?ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ జడ్చర్లకు తరలిస్తే అప్పటి ప్రభుత్వంతో యుద్ధం చేసి కల్వకుర్తికి తెచ్చింది గుర్తులేదా..? కల్వకుర్తి ప్రాంతంలో ఏది సాధించాలన్న ఉద్యమాలకు ఊపిరి పోసి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి సాధించే ఏకైక నాయకుడు తల్లోజు ఆచారి అని తెలుసు కదా..?కల్వకుర్తిలో 20 సీట్లు గెలుస్తామని గొప్పలు మాట్లాడిన నీవు గత ఎన్నికల్లో కౌన్సిలర్ ఎందుకు ఓడినావు..?కల్వకుర్తి పట్టణంలో గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి పార్టీ ఎదుగుదలను భరించలేకనే కుట్రతో మాట్లాడుతున్నావని మాకు అర్థమవుతుంది…2014-2016-2023 ఆచారికి కల్వకుర్తి పట్టణం లీడు వచ్చింది నిజం కాదా…?
నిజాలని గుర్తుంచుకొని మాట్లాడితే మీకే మంచిది ప్రశాంతమైన కల్వకుర్తిలో ఉద్దేశ పూర్వకంగా చిచ్చులు పెట్టాలని చూసే మీ
కుటిల రాజకీయం ఇకపై చెల్లదు మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తల్లోజు ఆచారి కి క్షమాపణ చెప్పాలనిడిమాండ్ చేసారు…ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ సీనియర్ నాయకులు, సూర్య కృష్ణ గౌడ్,నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, బోడ నరసింహ, పాలకూర్ల రవి గౌడ్, సురేందర్ గౌడ్, గుండోజు గంగాధర్, నాప శివ,కొల్లూరు శ్రీధర్,తగుళ్ల వెంకటేష్ యాదవ్, లక్ష్మీ నరసింహ, సాయి,తోడేటి అరవింద్ రెడ్డి, వాకిటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై ఎందుకీ గలభా?

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-19-2.wav?_=10

బీసీ రిజర్వేషన్లపై ఎందుకీ గలభా?
-వేముల మహేందర్ గౌడ్
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఆగస్టు 7 భారత సమాజంలో తరతరాలుగా విద్యకు, భూమికి దూరంచేసి వెనుక వేయబడ్డ వర్గానికి స్వతంత్ర భారతదేశంలో సుమారు 50 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు కల్పించబడ్డ రోజు..సామాజిక న్యాయం కోసం 40 సంవత్సరాలు వెనకబడ్డ వర్గాల పోరాటానికి గుర్తింపు లభించిన రోజు..లోక్‌సభలో మాజీ ప్రధాని విపి సింగ్ ఇతర వెనకబడ్డవర్గాల కోసం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రకటన జారీ చేసిన రోజు..నేడు దేశవ్యాప్త బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి నాంది పలికిన రోజు..బీసీల 42 శాతం రిజర్వేషన్ల అంశం..ప్రస్తుతం హైదరాబాద్ ఇంద్రపార్క్ నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు చేరింది. తెలంగాణనే కాదు యావత్ భారతదేశం బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయా, కావా? అనే ప్రశ్నతో వెయ్యి కండ్లతో ఎదురు చూస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని పరిమితి బీసీ రిజర్వేషన్లకు ఎందుకు? 2019 జనవరి నెలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, రెండు సభలలో ఆమోదించడం, (Passage both houses) రాష్ట్రపతి సంతకం చేయడం, గెజిట్‌లో ప్రచురించడం, అమలు కావడం చకచకా జరిగిపోయాయి. కానీ బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ..తెలంగాణ రాష్ట్రం రెండు బిల్లులు పంపి ఆరు నెలలు గడుస్తున్నా..నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు? స్థానిక సంస్థలలో బీసీల 42% రిజర్వేషన్లు అమలు చేయాలని 2018 చట్టంలో సెక్షన్ 285ఎ కి సవరణ చేసి గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపిస్తే..మళ్లీ ఆర్డినెన్స్ ఢిల్లీకి (రాష్ట్రపతి సలహా కోసం) చేరింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని అగ్నిపరీక్ష బీసీల 42 శాతం రిజర్వేషన్లకు ఎందుకు? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని 50 శాతం పరిమితి నిబంధన బీసీ రిజర్వేషన్లకు ఎందుకు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించింది, బీసీ 42 శాతం రిజర్వేషన్లను సమర్థించదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు. జనహిత్ అభియాన్ వర్సెస్ ఇండియా కేసులో 2022 నవంబర్ 7న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు 3:2 మెజార్టీ ద్వారా సమర్థించింది. ముఖ్యంగా ఈ కేసులో సుప్రీం కోర్టు స్పష్టపరిచిన అంశాల్లో ఆర్టికల్ 15(4), 16(4) కింద రిజర్వేషన్లు అసాధారణ పరిస్థితులలో తప్ప 50 శాతం మించకూడదు అనే తీర్పు సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతులకు (ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలు వంటివి) వర్తిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను విడిగా పరిగణిస్తారు. ఈడబ్ల్యూఎస్ (10 శాతం) ఇప్పటికే ఎస్‌సీ, ఎస్‌టీ లేదా ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలోకి రాని వారికి, ఎందుకంటే ఇది అదనంగా కల్పిస్తున్న రిజర్వేషన్లు. 103వ రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఆర్టికల్స్ 15(6), 16(6)లను రాజ్యాంగానికి చేర్చింది. కాబట్టి ఆమోదిస్తున్నాం. ఇది రాజ్యాంగంలో భాగం కాబట్టి, సుప్రీంకోర్టు గతంలో న్యాయపరంగా రూపొందించిన 50 శాతం నియమాన్ని అధిగమిస్తుందని తీర్పు ఇచ్చింది. తమిళనాడు వెనుకబడిన తరగతులు, ఎస్‌సీ, ఎస్‌టీల చట్టం, 1993ను ఆమోదించింది. ఇది 69 శాతం రిజర్వేషన్లను కల్పిస్తుంది. న్యాయ సమీక్ష నుండి రక్షించడానికి రాజ్యాంగంలోని 9షెడ్యూల్‌లో ఈ చట్టం చేర్చబడింది. 2018లో మహారాష్ట్ర ఎస్‌ఇబీసీ (సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు) వర్గం కింద మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇది మొత్తం రిజర్వేషన్లను 70 శాతంకి పెంచింది. మే 2021లో సుప్రీంకోర్టు 50 శాతం పరిమితిని ఉల్లంఘించడానికి ఎటువంటి అసాధారణ పరిస్థితులు లేవని దానిని కొట్టివేసింది. రాజస్థాన్ గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్లు, ఇతర ఓబీసీలకు 21 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించింది, దీనితో మొత్తం రిజర్వేషన్లు 70 శాతం కంటే ఎక్కువయ్యాయి. రాజస్థాన్ హైకోరు, సుప్రీం కోర్టు 50 శాతం పరిమితిని ఉల్లంఘించాయి. అసాధారణ పరిస్థితులను సమర్థించడానికి తగినంత డేటా లేదని ఈ చట్టాన్ని కొట్టివేసాయి. బీహార్ ప్రభుత్వం నవంబర్ 2023లో బీహార్ కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను 75 శాతంకి పెంచుతూ చట్టాన్ని ఆమోదించింది. పాట్నా హైకోర్టు అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప రిజర్వేషన్ 50 శాతం మించకూడదని, కుల సర్వే డేటాలో అసాధారణ పరిస్థితులు నిరూపించబడలేవని, అదనపు రిజర్వేషన్లను సమర్థించడానికి తగినంత బలమైన సామాజిక, -ఆర్థిక సూచికలు దీనికి లేవని కొట్టివేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, కృష్ణమూర్తి కేసులో ఇచ్చిన త్రిబుల్ టెస్ట్ తీర్పును, వివిధ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు ( బీసీలు) 42 శాతం
రిజర్వేషన్లను అమలు చేయడానికి నవంబర్-, డిసెంబర్ 2024లో తెలంగాణ సామాజిక,- ఆర్థిక, కుల సర్వే (ఎస్‌ఇఇఇపిసి)ని నిర్వహించింది, ఇది 96.9% గృహాలను కవర్ చేసింది. జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారని తేల్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా డేటాను విశ్లేషించడానికి, రిజర్వేషన్ సంస్కరణలను సిఫార్సు చేయడానికి బీసీ కమిషన్ ను ఏర్పరచింది. మార్చి 2025లో, తెలంగాణ శాసనసభ విద్యా, ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతంకి పెంచడం (29 శాతం నుండి), పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలకు 42 శాతం కోటాను పెంచడం కోసం (18 శాతం ఎస్‌సీ, 10 శాతం ఎస్‌టీ కోటాలతో పాటు మొత్తం 70 శాతంకి తీసుకురావడం) రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్లమెంట్ అనుమతి కోసం ఢిల్లీకి పంపింది. జూలై 2025లో తెలంగాణ మంత్రివర్గం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285ఎని సవరించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఆమోదం తెలిపింది. గవర్నర్ ఈ ఆర్డినెన్స్‌ను 1 ఆగస్టు 2025న రాష్ట్రపతికి పంపారు. ప్రస్తుతం ఏం చేయాలి. బీసీల 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగా సవరణ అవసరం. 50 శాతం పరిమితిని అధిగమించాలంటే అసాధారణ పరిస్థితుల్లో అధిగమించవచ్చు. 50 శాతం పరిమితి అనేది న్యాయపరమైన మినహాయింపే కానీ రాజ్యాంగపరమైన మినహాయింపు కాదు. కాబట్టి 56.36 శాతం ఉన్న బీసీలకు తగినంత ప్రాతినిధ్యం లేదని డెడికేట్ కమిషన్ ద్వారా రిపోర్టును సమర్పిస్తూ సమగ్ర సర్వే, శాస్త్రీయ డేటాను ముందు ఉంచే ప్రయత్నం చేయాలి. తమిళనాడు మాదిరిగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి కోర్టుల నుంచి మినహాయింపు పొందవచ్చు. (తొమ్మిదవ షెడ్యూల్లోని చట్టాలను న్యాయ సమీక్ష చేయవచ్చు). రాజ్యాంగ సవరణ కోసమే తెలంగాణ సమాజం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంది. ఇంత జరుగుతున్నా బీసీ రిజర్వేషన్లకు మోక్షం లభించడం లేదంటే యావత్ భారతదేశం, తెలంగాణ సమాజం దానికి కారకులు ఎవరో నిర్ణయించుకోవాలి.

అంగన్వాడి సెంటర్లో జాతీయ నులిపురుగుల దినోత్సవం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-10-3.wav?_=11

అంగన్వాడి సెంటర్లో జాతీయ నులిపురుగుల దినోత్సవం

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మాదారం అంగన్వాడి సెంటర్ 3 లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర వేసుకోవాలన్నారు. అలాగే పిల్లలందరూ ఈ మాత్రను తప్పకుండా వేసుకోవాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి కచ్చితంగా పిల్లలు ఈ మాత్ర వేసుకోవాలని అంగన్వాడి టీచర్ కుసునపల్లి మీనా అన్నారు.పిల్లలు ప్రతిరోజు చేతులు కడుక్కొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనియెడల నులిపురుగులు తయారవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు టీచర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,ఆశ వర్కర్ మల్లేశ్వరి పాల్గొన్నారు.

విద్యార్థులు జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-4.wav?_=12

విద్యార్థులు జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.

చిట్యాల, నేటిధాత్రి :

ప్రతి ఒక్కరు దేశభక్తుని కలిగి ఉండాలి ,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పో లసాని తిరుపతిరావు
సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులు పౌరులు అందరు జాతీయ జెండా ను పట్టుకొని తిరం గా ర్యాలీ నిర్వహించారు
అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావం కలిగి దేశం ధర్మం వైపు పయనించాలని దేశభక్తిని కలవచ్చు కావాలని భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి మనకు స్వాతంత్రం కలుగజేశారని ఈసారి 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా నిర్వహించుకోవాలని యువత చెడుదారుల వైపు పోకూడదని ప్రతి ఒక్కరు సోదరా భావంతో కలిగి ఉండి మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన వంతు సహాయ సహకారాలు అందజేయాలని ఎంతోమంది మన దేశం వైపు చూస్తూ దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని మనందరం ఐకమత్యంగా ఉండి అలాంటి వారిని రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బుర్ర వెంకటేష్ గౌడ్ మైదం aశ్రీకాంత్ తీగల జగ్గయ్య సుదగాని శ్రీనివాస్ గుండ సురేష్ మందల మొగిలి గజనాల రవీందర్ చింతల రాజేందర్ మార్తా అశోక్ కదం రాజు తీగల వంశీ నీలి సుధాకర్ రెడ్డి సాదా సాదానందం బుర్ర ఆ భిజ్ఞ బుర్ర వితే ష్ గోల్కొండ అజయ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-3.wav?_=13

ఘనంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల వేడుకలు

నడికూడ,నేటిధాత్రి:

శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి కి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు చెల్లించి,యాటలతో తల్లికి హారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని శుభ్రం చేసి,రంగులు వేయించి, మభక్తుల సౌకర్యార్థమై చలువ పందిళ్ళు, లైటింగ్స్, డెకరేషన్,మంచి నీటి సౌకర్యం కల్పించడం జరి గిందని ఆ సంఘం నాయకులు తెలిపారు,కోరిన కోర్కెలు తీర్చే ఆ పోచమ్మ తల్లికి ఆదివారం రోజున మొదటి మొక్కులు చెల్లించి, ఘనంగా వేడుకలు నిర్వ హిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వేడుకల్లో విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కడివెండి నరేందర్ చారి, గౌరవ అధ్యక్షుడు బెజ్జంకి వెంకటయ్య చారి,గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలకంటి రాజు చారి,ఉపాధ్యక్షుడు బెజ్జంకి రాజేందర్ చారి, ప్రధాన కార్యదర్శి బండ్ల రాజు చారి, కోశాధికారి కడివెండి ప్రశాంత్ చారి, సహాయ కార్యదర్శి బండ్లోజు రమేష్ చారి, కార్యవర్గ సభ్యులు బెజ్జంకి మహేందర్ చారి, వినుకొండ నవీన్ కుమార్ చారి,క్రిష్ణాది సాంబయ్య చారి, కడివెండి కృష్ణ మూర్తి చారి, బిక్షపతి చారి, కడివెండి సత్యం చారి, రాజు చారి, విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ పై బిజెపి చేసిన అనుచిత వాక్యాలు సరికాదు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23.wav?_=14

కేటీఆర్ పై బిజెపి చేసిన అనుచిత వాక్యాలు సరికాదు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్ లో
Ktr పై జిల్లా బీజేపీ నాయకులు చేసిన వాక్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన BRS సిరిసిల్ల పట్టణ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్…. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు కలసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అధికారం లో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ని నీలాదీయడం మానేసి ప్రతి పక్షం లో ఉన్న KTR ని విమర్శించడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాం. Ktr సిరిసిల్ల నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రతి గ్రామం లో మేము చూపిస్తాం మీ నాయకుడు మంత్రి హోదా లో ఉన్న బండి సంజయ్ ఏమి చేసారో కనీసo ప్రతి మండలం లో అయినా చూపెట్టే దమ్ము మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం.బండి సంజయ్ తనకు తాను పెద్ద నాయకుడు అనే భ్రమలో ఉన్నాడు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే వ్యక్తి బండి సంజయ్ కాదు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే శక్తి కూడా కాదు అటువంటి నాయకుడి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ KTR లేదు అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడతారు గల్లీ లో మాట్లాడడం కాదు ప్రజా సమస్యేలపై పార్లమెంట్ లో మాట్లాడాలని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు పాస్ అని తప్పించుకొని పోకుండా పోరాటం చేయాలనీ బండి సంజయ్ కోరుతున్నాను. ktr సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి కి ఏంతగానో కృషి చేసారు మళ్ళీ అధికారం లో కి వచ్చాక మరింత ముందుకు తీసుకెళ్లే దమ్ము ktr కి ఉంది బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రం లో కేంద్ర పరిది లో ఉన్న ఒక ఫ్లై ఓవర్ దాదాపు 8 సంవత్సరము లుగా పనులు పూర్తి గాక అసంపూర్తి గా ఉండి అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది అది కూడా పూర్తి చేయని అసమర్ధత కలిగిన Mp మనకు ఉండటం మన దౌర్భాగ్యం కేంద్ర పరిది లో ప్రజలకు అవసరంమైన ఎన్నో అభివృద్ధి పనులు ఉంటాయి వాటిని తీసుకు రాకుండ మీ కుటుంబం వచ్చి గుడి లో ప్రమాణం చేస్తే మా కుటుంబం వచ్చి ప్రమాణం చేస్తుంది ఇవ్వా ఒక కాబినెట్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు..అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం లో జిల్లా నాయకులు మెట్ట రాజు,కత్తెర వరుణ్ కుమార్, BRSV పట్టణ అధ్యక్షులు షేక్ సికిందర్, వడ్లురి సాయి, సూర్య, జోయేల్, వడ్లురి వేణు, ఆరుట్ల శరన్ పాల్గొన్నారు.

రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం రైతు భీమా ప్రచారం..

రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం రైతు భీమా ప్రచారం

*రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పడం లేదు
*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట( నేటిధాత్రి):

 

వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ రైతులందరూ రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నారు. ఇది చాలా ప్రయోజనకరమైన విషయమని ఇలా తెలియజేసినందుకు రైతులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతి నిధి తెలిపారు. కానీ రైతులకు అవసరమైన నీళ్ల గురించి ఎమ్మెల్యే స్పందించకపోవడం చాలా ఆస్యాస్పదంగా ఉందని మహేందర్ రెడ్డి విమర్శించారు. రైతులు చనిపోయిన తర్వాత ఇచ్చే రైతు బీమా కంటే రైతుల జీవితాలు ఎంతో విలువైనవని ఎమ్మెల్యే ఆలోచించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఇప్పటికీ స్పందించి అధికారులను పురమాయించి నీళ్లు వచ్చే విధంగా పనిచేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుందని ఇప్పటికైనా ఎమ్మెల్యే మేల్కొని దేవాదుల ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు నియోజకవర్గం లోని అన్ని చెరువులను నింపే విధంగా పనిచేయాలని యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని లేదంటే రైతులు లక్షల రూపాయలు వెచ్చించి వేసుకున్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వెంటనే ప్రభుత్వం స్పందించాలని మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అతి త్వరలోనే ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం రైతుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో జరుగుతుందని హెచ్చరించారు.

వైరల్ వివాహ కథ, విక్టర్ పెట్రోవ్, ఎలెనా పెట్రోవ్, ద్రవ నైట్రోజన్ వివాహ..

వివాహ వేడుకలో టెక్ బిలియనీర్లు విక్టర్ మరియు ఎలీనా పետրోవ్ మరణించారని చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి వివాహ దుస్తుల్లో లిక్విడ్ నైట్రోజన్ సిస్టమ్ అమర్చడం వల్ల చలికి గడ్డకట్టిపోయి మరణించారని ఈ కథనం చెబుతోంది. మరణించిన జంటను పెళ్లి ఉంగరం సహా ప్రదర్శనలో ఉంచినట్లు వీడియోలో కనిపిస్తోంది.

అయితే, ఈ సంఘటనకు సంబంధించి ఏ ఆధారాలు లభించకపోవడంతో, ఇది కేవలం సోషల్ మీడియా సృష్టించిన కథే కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ కాలంలో AI టూల్స్, వైరల్ కంటెంట్ పెరుగుతున్న తరుణంలో, నిజం-అబద్ధం మధ్య గీతలు మరింత మసకబారుతున్నాయి. అందుకే, ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి విషయాన్ని నమ్మే ముందు పరిశీలించడం, ధృవీకరించడం అత్యంత ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.

బిలాల్పూర్ భారీ వర్షం….!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-17-1.wav?_=16

బిలాల్పూర్ భారీ వర్షం….!

◆:- చెరువులను తలపిస్తున్న కాలనీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: కోహీర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో మధ్యాహ్నం బారీ వడగండ్ల వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు జోరువానకు కాలనీలు జలమయం అయ్యాయి. ఈ వర్షాకాలం ఎ న్నడూ లేని విధంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈభారీ వర్షం కారణం గా గ్రామంలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు, ఇళ్లు, వరద నీటితో నిండిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. వర్షం దాటికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలుస్థంభించాయి. గ్రామంలోని ప్రదాన రోడ్లు జల మయమై వాహనాలు నీటిలో కూరుకుపోయాయి. స్థానికంగా ఉన్న చిన్న చిన్న కాలువలు, వర్షపు నీటిని తట్టుకోలేకపోవడంతో పరిస్థితి మరింత దిగ జారింది. స్థానిక రైతులు మాత్రం ఈ వర్షం వల్ల పంట పొలాలలో వర్షం నీరు చేరి నీరు నిలిచిపోయాయి. ఇతర పంటలకు మేలు జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version