ఈ సంవత్సరం ఎండలు బాగానే మండుతున్నాయి రానున్న రోజుల్లో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇలాంట ప్పుడు ఎండల్లో బయటకు వెళ్లేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఇప్పటికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రానున్న రోజుల్లో మరింత ఎండ వేడి పెరిగే ప్రమాదం ఉంది వేసవికాలం కావడంతో పిల్లలు బయటికి ఆడుకోవ డానికి వెళ్తుంటారు అలాంట ప్పుడు పిల్లలు ఎండ తీవ్రతకు బయటికి రాకుండా ఉండ డానికి తగు జాగ్రత్తలు తీసు కోవాలని చెబుతున్నారు. మామూలుగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు వల్ల వడగాల్పులు వస్తుంటాయి దీనివల్ల శరీరంపై ఉన్న శ్వేతా రంధ్రాలు మూసుకుపోయి శరీరంలోని వేడి చెమట బయటకు రాకుండా ఉండిపోతుంది దీంతో శరీరంలో ఎండ తీవ్రత ఎక్కువగా అయ్యి అస్వస్థతకు గురవుతారు. స్పృహ కోల్పో వడం వంటి జరుగుతుంది . నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అవసరం చిన్నపిల్లల్లో ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.
దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన, శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఎ. చంద్రశేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న
★ జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ గారు ★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఎ చంద్రశేఖర్ గారు
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలో నెలకొన్న శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యులు సత్కరించిన జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్, మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్.మరియు వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా అండగ ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని పేర్కొన్నారు.
Sangameshwara Temple.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి,ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా గ్రంథయాల చైర్మన్ అంజయ్య ,మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ సునీతా పాటిల్ , జహీరాబాద్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,రామలింగారెడ్డి, కండేం నర్సింలు ,మాక్సూద్,నర్సాసింహ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్, మాజీ ఎంపిపి దేవదాస్ గారు,మాజీ ఎంపిటిసిలు అశోక్ ,శంకర్ పాటిల్,వైస్ ఎంపిపి షాకిర్ , కాగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు,యువజన జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ యువజన జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్,మరియు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తథిదరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో తల్లి జ్ఞాపకార్ధంగా పేదల దహార్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కుమారులు వివరాల్లోకి వెళితే పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి విజయలక్ష్మి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో కృంగి పోయిన ఆ కుటుంబం తల్లి జ్ఞాపకాలు, మధురస్మృతులు మర్చిపోలేని చిట్టి రెడ్డి విజయ్, అజయ్ ఇద్దరు కుమారులు గ్రామంలో తన తల్లి పేరున సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు ఆటో వాలకి, కూలీలకు, ప్రయాణికులు, పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు 200 నుండి 400 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు అనంతరం విజయలక్ష్మి కుమారుడు చిట్టిరెడ్డి విజయ్ మాట్లాడుతూ మాతల్లి పేరు సేవా కార్యక్రమం చలివేంద్రంతో ఆగేది కాదు అని పేదల పిల్లల చదువు,గ్రామ అభివృద్ధి లో,చిన్నపిల్లల ఆపరేషన్ విషయంలో ఎప్పుడు నేను ముందుంటానని అన్నారు నేను పుట్టిన ఊరు నా కన్న తల్లి తో సమానం అని నా ఊరు రుణం తీర్చుకోవడంలో తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గజ్జి ఐలయ్య,చిట్టి రెడ్డి జంగా రెడ్డి,చల్లరాజిరెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, గుర్రం రమేష్, జలంధర్ రెడ్డి, ఉమ్మడి రమేష్, భద్రయ్య నాలుక వెంకటేష్, సురేందర్, అంకెశ్వర మొగిలి, బోయిన అశోక్ బోయిన ఓదెలు బోయిని పైడి, బగ్గి పైడి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదలందరికీ సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం… – దేశంలోనే సన్న బియ్యం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ – కాంగ్రెస్ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు మొగుళ్ళపల్లి
నేటి ధాత్రి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాష్టకంగా: చేపట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని మొగుళ్లపల్లి మండలపరిధిలోని పాత ఇ స్సీ పేట గ్రామంలో జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు డీలర్ బొచ్చు లక్ష్మి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా తక్కల్లపల్లి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడీ ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా దారిద్రరేఖకు దిగువనున్న పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 2కోట్ల 61లక్షల మందికి పేదలకు తలకు ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. అందుకు 10600 కోట్లు కేటాయించింది అయినప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. .పేదలు దొడ్డు బియ్యం తినలేకపోవడం వలన పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం. దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. రైతుల శ్రమ ఎక్కడికీ పోదు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశాం. 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
పలు రైళ్లు నిలపాలని రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ కు వినతి….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో కాజిపేట్ నుండి బల్లార్ష వరకు నడిచే పాస్ట్ ప్యాసింజర్,అండమాన్ -చెన్నై ఎక్స్ప్రెస్, కాగజనగర్ టూ తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లు రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేయాలని, రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనీ మంచిర్యాల రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ కు బిజెపి సీనియర్ నాయకులు అరుముళ్ల పోశం ఆధ్వర్యంలో భాజపా నాయకులు మెమోరండం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్, బంగారి వేణుగోపాల్, శెట్టి రమేష్ లు పాల్గొన్నారు.
-విలేకరుల సమావేశంలో చదువు అన్నారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కొంతమది చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ విలువ బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని సకల జనులు బీఆర్ఎస్ వైపు చూస్తారని అన్నారెడ్డి అన్నారు.
రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల జయంత్.
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం హోరహోరి మధ్య జరిగాయి. నూతన అధ్యక్షుడిగా ఆకుల జయంత్, ఉపాధ్యక్షుడిగా బొడ్డు పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు మహేందర్, సహాయ కార్యదర్శిగా కంకణాల శ్రీనివాస్, కోశాధికారిగా వంకాయల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా చౌటపల్లి వెంకటేష్, బుస్స రామనాథం, దుమాల రాము, జంగిలి రాజు, ముండ్రాయి శ్రీనివాస్, పి వేణు కుమారులు గెలుపొందారు.గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు తడుక విశ్వనాథం, కరుణాల భద్రచలం, టీవీ నారయణ లు నియామక పత్రాలు అందజేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
తంగళ్ళపల్లి మండలం కస్బేకట్కూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి సందీప్ రావు మృతి చెందారు తెలిపినారు.
తెలిసిన సమాచారం ప్రకారం కట్కూర్ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సికింద్రాబాద్లోనియశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు మృతి చెందారనివారి కుటుంబ సభ్యులు తెలియచేశారు.
వారి మరణం పార్టీకి ఎంతో లోటని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు తెలిపారు
ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 511 మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఒక్క లబ్దిదారుడికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేక పోయారని అందువల్ల వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అధికారంలోకి రాగానే.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఉపాధి పైన అధిక శ్రద్ధ చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని అన్నారు. గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ సాధ్యం కానిది ప్రజా ప్రభుత్వంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కేజీల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల వద్ద సేకరించిన సన్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ప్రజలకే పంచడం నిజంగా విప్లవాత్మక నిర్ణయం ఎమ్మెల్యే అన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని అందరూ తప్పకుండా వాడుకోవాలని ఆయన సూచించారు. మీ బాగుకోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎన్టీయుసి రాములు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, అవేజ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఖాజా పాషా, చిన్న , మోసిన్ , నాయకులు శ్రీనివాస్ యాదవ్, అర్షద్ అలి, కిషన్ నాయక్, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, గోపాల్, చర్ల శ్రీనివాసులు, అజిజ్ అహ్మద్, తులసిరాం నాయక్, మన్యం కొండ నరేందర్ రెడ్డి, , తహసీల్దార్ సుందర్ రాజ్, ఎంపిడిఓ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
* కమనీయ కన్నుల రమణీయ సీతమ్మ తల్లి రామయ్య తండ్రి వరియించిన అపురూప దృశ్యం.
మరిపెడ/కురవి నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని నల్లెల్ల గ్రామపంచాయతీలో కురవి మండల కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్ర గౌడ్ శకుంతల, బండి ఉప్పలయ్య గౌడ్ ఉమా దంపతుల ఆధ్వర్యంలో సీతారాములవారి కల్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది, ప్రతి గ్రామంలో అత్యంత వైభవంగా ప్రతి ఏటా నిర్వహించే వివాహ వేడుక సీతారాముల వివాహ వేడుక అని, సీతారాముల జంట ఎంతోమందికి ఆదర్శం అని, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి మాటకు ఒకరు వింటూ, ఆది దంపతులుగా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దంపతులు సీతారాములు అని, ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కాంక్షిస్తూ, ప్రతి ఒక్కరు సుఖః సంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి మల్లయ్య గౌడ్,గౌడ సంఘం అధ్యక్షుడు బండి సుధాకర్ గౌడ్, బండి సైదులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆవుల కందయ్య,మంద వీరన్న,తోట నారాయణ,బండి సైదులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ చేస్తున్న భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పెద్ద మోసం
జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పెద్ద మోసమని బిజెపి, బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అందులో పని చేసే అగ్రకుల నాయకులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూసినవారే అదును చూసి దెబ్బ కొట్టడానికి ఈ మూడు పార్టీలు చూస్తున్నాయి ఈ పాదయాత్రను బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు నమ్మి మోసపోవద్దు ఇది ఓట్లు దండుకొనే పెద్ద కుట్రఇది. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ ని భారత రాజ్యాంగం రాయొద్దని ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేసిన గాంధీని ఫోటొలను ఒకచోట పెట్టి పూలమాల వేయడం రాజ్యాంగాన్ని, అది రాసిన అంబేద్కర్ను అవమానించడమే దేశంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే ఆయనకి ప్రజల పైన ప్రేమ ఉన్నట్టు కాదు ఒకవేళ ఉంటే 90 శాతం జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఈ రాజ్యాన్ని అప్పగించాలి అదే నిజమైన ప్రజాస్వామ్యం. గతంలో 9సంవత్సరాల నుండి డిఎస్పి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం వర్ధిల్లాలని భారత రాజ్యాంగాన్ని పూలతో అలంకరించి ఊరేగింపు చేసింది డి.ఎస్.పి ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్తంబచిహనాలు పెట్టించింది ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే డాక్టర్ విశారదన్ మహారాజు జ్ఞానాన్ని కాపీ కొడుతూ జై భీమ్ అనకున్నా భారత రాజ్యాంగం వర్తిల్లాలి అనకున్న మనుగడ లేదని ఈ నాటకాలు ఆడుతున్నారు ఇలా చేయడం సిగ్గుచేటు. భారత రాజ్యాంగాన్ని కాపాడేది ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే అని ప్రజలు గమనించాలని కోరుతున్నాం
శ్రీ ఉమామహేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్
నేటి దాత్రి….
గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో శివాలయం ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగ శివాలయం కళ్యాణ మంటపంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు పుష్యమి నక్షత్రం మిథున లగ్నంలో పచ్చని పందిల్లో వరుడు వైపు ఆకుల సుభాష్ కుటుంబం నిలువగా వధువు కుటుంబంగా కన్న రాజన్న కుటుంబం ప్రతి సంవత్సరం అనవయితీగా వస్తుంది శివాలయం ఆలయ అర్చకులు లంక రాజేశ్వరరావు శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
Wedding.
సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు గ్రామస్తులు, , వివిధ గ్రామాల నుంచి,భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా రామనామ స్మరణంతో మార్మోగింది. సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమం శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా సాయంకాలం పుర విధుల్లో ఊరేగింపు కార్యక్రమం కోలాటలతో భక్తి పాటలతో వైభోపెతంగా జరిగింది
పరకాల నందు వివిధ నేరాల పై పట్టుబడిన వాహనాలను జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వరంగల్ రూరల్ ఆదేశానుసారం బుధవారం రోజున ఉదయం 11గంటలకు ప్రోహిభిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరకాల నందు వేలం నిర్వహించడం జరుగుతుందని కావున ఆసక్తి కలిగినవారు వాహనం అప్ ప్రైస్ పై 50శాతం డిపాజిట్ గా చెల్లించి వేలం లో పాల్గొనవచ్చని ఎక్సయిజ్ సిఐ పి.తాతాజీ తెలిపారు.
ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి…
తంగళ్ళపల్లి నేటి దాత్రి….
తంగళ్ళపల్లి మండలంలో బస్సాపూర్ గ్రామంలో సందర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ . తంగళ్ళపల్లి మండల లో బస్వాపూర్ అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కేంద్రాల్లో అంగన్వాడి కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా బ్లడ్ నెస్ ప్రివెన్షన్ వీక్ అంధత్వం నివారణ వారత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని తంగళ్ళపల్లి మండలంలోని బస్వాపూర్ లో సోమవారం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు ఏమైనా లోపాలు ఉంటే గుర్తించి పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు ఎక్కువ ఇబ్బంది పడే విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానలువైద్యం అందించాలని తెలిపారు బస్వాపూర్ లోని ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులు హాజరు శాతం పాఠశాలలో బోధిస్తున్న తీరు విద్యార్థుల ఉపాధ్యాయులు హాజరులను పరిశీలించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం జిల్లా వైద్య అధికారి రజిత వైద్యులు నయు మా జహా సంపత్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
నస్పూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములవారి కల్యాణ మహోత్సవం ముఖ్య అతిథులుగా లోపాల్గొన్న మంచిర్యాల డిసీపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సి ఐ అశోక్ కుమార్
నస్పూర్ నేటిదాత్రి
నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామాలయంలో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైగోపేతంగా కన్నుల పండుగా జరిగినది ఈ సందర్భంగా గ్రామ నాయకులు ప్రజలు ఆలయ కమిటీ ఆలయ అర్చకుల సమక్షంలో సీతారాములవారి కల్యాణం జరిపించడం జరిగినది సకలజనులు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేదపండితులు దేవరాజు రంజిత్ శర్మ మంత్రోచ్ఛారణతో ప్రజలను ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించే విధంగా మంత్ర వేదాలతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాములవారి కళ్యాణాన్ని జరిపించారు
DCP Bhaskar
అదేవిధంగా శ్రీరామచంద్ర మూర్తి వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ తల్లిదండ్రుల పట్ల రాములవారు ఎంతటి విధేయత కలిగి ఉండేవారో వివరించారూ భక్తులందరూ శ్రీరాముని తల్లిదండ్రులను గౌరవించాలని ఆకాంక్షించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మంచిర్యాల డిసిపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సిఐ అశోక్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సీతారాముల కళ్యాణానంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపబడినది ఇట్టి కార్యక్రమాన్ని రా చకొండ కృష్ణారావు అండ్ బ్రదర్స్ నిర్వహించినారు ఆలయ కమిటీ సభ్యులు రాచకొండ గోపాలరావు రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న) మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొనపల్లి లింగయ్య ఇరికిల్ల పురుషోత్తం గడ్డం సత్యా గౌడ్ కోయిల వెంకటేష్ గరిసె రామస్వామి భీమయ్య సందీప్ బండం గోపాల్ కుందరపు రమేష్ కొయ్యలరమేష్ సిరిపురం శ్రీనివాస్ కిష్టయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్నారు
కేతకీ సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గా అప్నగారి.శేఖర్ పాటిల్
◆ కేతకీ సంగమేశ్వర దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నూతన చైర్మన్ & పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రా౹౹ & మం౹౹ శ్రీ కేతకీ సంగమేశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం రోజున శ్రీ.సంగమేశ్వర స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికీ పాలభి శేకం నిర్వహించారు.ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్.అప్నగారి.
Temple
శేఖర్ పాటిల్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి .ఈకార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ గారు,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,జిల్లా యూత్ మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,బి.మల్లికార్జున్ మరియు ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఆలయం ఈవో&అర్చకులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామంలో ఓవ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన సత్తార్మియా కుమారుడు అబ్బాస్ (25) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన మిత్రులతో డైరీఫామ్ వద్ద దావత్ చేసుకుంటుండగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని మారణాయుధాలతో ఆకస్మికంగా దాడిచేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయపున నిర్మాణానికి రంగాచార్యులు లక్ష 16 వేల విరాళం.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి లక్షణాచార్యులు (మూకయ్య) గారి చిన్న కుమారుడు రంగాచార్యులు శివాలయానికి విరాళంగా 116000/- రూపాయలు అక్షరాల (ఒక లక్ష పదహారు వేల రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేసిన బీసీల పోరు గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుట్టిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో చేసిన బీసీ గర్జనను చూసైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలన్నారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గర్జన చూసి కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని భావిస్తే..బీసీ డిమాండ్లను పరిష్కరించకపోగా..ఎదురు దాడికి దిగడం బాధాకరమన్నారు. ఢిల్లీ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఢిల్లీలో నిర్వహించిన బీసీల ఆందోళనతో దేశం మొత్తం బీసీల గొంతుకను వినిపించి, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చామన్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ చివరి వారంలో హైద్రాబాదులో 29 రాష్ట్రాల బీసీ ప్రతినిధులతో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే నెల రెండవ వారంలో పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో బీసీల యుద్ధభేరి బహిరంగ సభను నిర్వహించి సత్తా చాటుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జనకు 16 రాజకీయ పార్టీలు, 18 రాష్ట్రాల నుంచి 32 మంది పార్లమెంట్ సభ్యులు, 29 రాష్ట్రాల నుండి ఓబీసీ నాయకులు పాల్గొన్నారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బీసీల పోరుగర్జనలో పాల్గొనడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. బీసీల పోరుగర్జన సభకు వచ్చి మద్దతు తెలిపిన సీఎంతో పాటు మంత్రులు, వివిధ పార్టీల నేతలకు బీసీ సమాజం తరఫున మహేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.