హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే…

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే అభిమానులకు పండగే.

 

నేటి ధాత్రి:

 

 

 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 

భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 
భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూడవ పాటను ట్రైలర్‌తో పాటు ఆవిష్కరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ  చిత్రం, జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.  ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.  జూన్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Harihara veeramallu Release Date)

ఆలస్యాల మధ్య పగ్గాలు చేపట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, కొద్ది నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ, వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఢిల్లీ గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు.

ఢిల్లీ గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేసిన బీసీల పోరు గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుట్టిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో చేసిన బీసీ గర్జనను చూసైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలన్నారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గర్జన చూసి కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని భావిస్తే..బీసీ డిమాండ్లను పరిష్కరించకపోగా..ఎదురు దాడికి దిగడం బాధాకరమన్నారు. ఢిల్లీ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఢిల్లీలో నిర్వహించిన బీసీల ఆందోళనతో దేశం మొత్తం బీసీల గొంతుకను వినిపించి, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చామన్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ చివరి వారంలో హైద్రాబాదులో 29 రాష్ట్రాల బీసీ ప్రతినిధులతో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే నెల రెండవ వారంలో పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో బీసీల యుద్ధభేరి బహిరంగ సభను నిర్వహించి సత్తా చాటుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జనకు 16 రాజకీయ పార్టీలు, 18 రాష్ట్రాల నుంచి 32 మంది పార్లమెంట్ సభ్యులు, 29 రాష్ట్రాల నుండి ఓబీసీ నాయకులు పాల్గొన్నారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బీసీల పోరుగర్జనలో పాల్గొనడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. బీసీల పోరుగర్జన సభకు వచ్చి మద్దతు తెలిపిన సీఎంతో పాటు మంత్రులు, వివిధ పార్టీల నేతలకు బీసీ సమాజం తరఫున మహేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన.

*23న ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన..

*రిజర్వేషన్లు రద్దు కోసం ప్రభుత్వాల కుట్ర..

*ఎస్సీ వర్గీకరణతో మాలల వంచనకు ప్రయత్నం…

*సింహగర్జనతో మాలల సత్తా చాటుదాం…

*వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం చెబుదాం…

*రాయలసీమ మాలల జేఏసీ నేతల పిలుపు…

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 19:

అనగారిన బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని కుట్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తెచ్చి మాలలను దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని రాయలసీమ మాలల జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ గౌరవ అధ్యక్షుడు అశోకరత్న మాట్లాడారు.2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకొని మాలలను తక్కువగా చూపిస్తూ మాదిగలకు ఉపకరించేలా వర్గీకరణను ఆమోదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను అడ్డుపెట్టుకుని అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. యావత్తు దళిత జాతి ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతి అణిచివేతకు పాలకులు ప్రయత్నించడం అత్యంత హేమమైన చర్య అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ పై ప్రశ్నించకుండా అచేతనంగా నిలబడడం దుర్మార్గమన్నారు. రాజకీయ లబ్ధి కోసం పాలకులు చేసే కుయుక్తులను అడ్డుకోకపోతే యావత్ దళిత జాతి రాజ్యాంగబద్ధంగా సిద్ధించిన రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో కోల్పోయే పరిస్థితి దాపురుస్తుందన్నారు. ఇప్పటికీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాలలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దళిత జాతి వ్యతిరేక పవిత్రమైన కూటమికి గుణపాఠం చెప్పేందుకు యావత్ మాల జాతి సన్నిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖున భారీ స్థాయిలో తిరుగుతూనే నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో 23వ తేదీ సాయంత్రం మూడు గంటలకు మాలల సింహగర్జన సభను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సింహగర్జన సభకు రాయలసీమలోని యావత్ మాల జాతి తో పాటు దళిత మేధావులు ఉద్యోగులు, పెద్ద ఎత్తున తరలివచ్చి మాలల ఐక్యతతో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ ప్రతినిధులు మల్లారపు మధు. సుదర్శనం. ఏ ఆర్ అజయ్ కుమార్. ధన శేఖర్. కే మురళి. అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version