పోత్కపల్లి హై స్కూల్ ను తనిఖీ చేసిన MEO Erra రమేష్.

నేటిధాత్రి కథనానికి స్పందన

పోత్కపల్లి హై స్కూల్ ను తనిఖీ చేసిన ఎం ఇ ఓ ఎర్ర రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ఓదెల మండలం పోత్కపల్లి లో గల zphs పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి మధ్యాహ్నం బోజన పథకం లో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన అని నెటిధాత్రి లో ప్రచురితమైన వార్త కథనానికి స్పందించిన ఎం ఈ ఓ బుధవారం జెడ్, పి హెచ్,ఎస్ పాఠశాల ను సందర్శించి
విద్యార్థులను అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులతో మరియు యం డి యం వంట వారితో మాట్లాడడం జరిగింది విద్యార్థులకు సరిపడ బియ్యం ఉపాద్యాయులు ఇచ్చినప్పటికీ తమ వైపు తప్పిదం జరిగినదని వంట వారు ఒప్పుకున్నారని ఏం ఈ ఓ ఎర్ర రమేష్ తెలిపారు.మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకుంటామని తెలియా జేశారు. ఈ సందర్భంగా ఏం ఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులకు సరిపడ అన్నం అందజేయాలని అలాగే ఇలాంటి సంఘటనలు పునరవృతం కాకుండా చూసుకోవాలని, మళ్ళీ ఇలానే జరిగితే తగు చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులకు వంట వారికి సూచించడం జరిగింది.

TUWJ IJU ప్రతినిధులకు ఘన సన్మానం.

టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రతినిధులకు ఘన సన్మానం.

మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్.

నర్సంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐ.జే.యు ) వరంగల్ జిల్లా కమిటిలో ఎన్నికైన నర్సంపేట డివిజన్ కు చెందిన జర్నలిస్టు ప్రతినిధులకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ సన్మానించారు. బుధవారం వరంగల్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభ జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నూతన కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించారు. నర్సంపేట డివిజన్ నుండి జిల్లా కోశాధికారి కోదాటి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు మహాదేవుని జగదీష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, శీలం రమేష్,కంచర్ల కుమార్, మహమ్మద్ చాంద్ పాషా, పల్లెల్ల సోమేశ్వర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం నర్సంపేట మార్కెట్ కమిటి చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబులు నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే ఐజేయు నర్సంపేట డివిజన్ ప్రతినిధులను మార్కెట్ కమిటి కార్యాలయంలో శాలవాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కొనసాగాలన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడికి నివాళిర్పించిన పెద్ది.

తెలంగాణ ఉద్యమకారుడికి నివాళిర్పించిన పెద్ది

కొత్తగూడ, నేటిధాత్రి:

 

తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తొట్టి సత్యంగారి కుటుంబాన్ని పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్తగూడ మండలం పొగల్లపల్లి గ్రామ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు తొట్టి సత్యం ఈరోజు అనారోగ్యంతో మృతి చెందగా వారి భౌతిక ఖా యాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు తొట్టి సత్యం తెలంగాణ ఉద్యమాకారుడుగా రాష్ట్ర సాధనలో మరియు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు ఈరోజు వారి మృతి పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని అన్నారు
ఆయన వెంట లో మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, మల్లయ్య మాజీ సర్పంచ్, భానోత్ వీరన్న, అజ్మీర రవి, మాజీ పడాల నాగేశ్వరరావు, ఎంపిటిసిలు బంగారు నారాయణ, ననుబోతుల స్వప్న లింగన్నయాదవ్,దానం నారాయణ, గుల్లపల్లి శీను , మండల్ నాయకులు కొనకంచి నాగమల్లేశ్వరరావు, నామోజు కనకాచారి, కావట్టి సతీష్ మల్లేష్ యాదవ్, కొలిపాక సదానందం, కత్తుల కుమారస్వామి, సంఘీ కుమారస్వామి ,భూక్య సంతోష్, నామోజు కనకాచారి గుంటుక యాకయ్య పల్లె శివ భైరబోయిన చిరంజీవి బోయిని భద్రయ్య ఆగబోయిన రాజయ్య మల్లేష్ యాదవ్ బండి లింగయ్య భైరబోయిన బుచ్చి రాములు బత్తుల ఉత్తరయ్య , పోతుగంటి రామాచారి, వేణు వంక కొమ్మలు, బోళ్ల యాకయ్యతో ,పాటు మండల నాయకులు పాల్గొన్నారు…

పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ.

పొన్నారం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామంలో, పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రజలకు వసతి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మొదటి దశగా పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మాణం ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

Sri Vivek Venkataswamy

 

నిరుపేద కుటుంబాలకు విశ్వసనీయంగా, నాణ్యమైన నివాస వసతులు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే, ఎంపీలు పేర్కొన్నారు.

26న జరిగే జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం.

26న జరిగే జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం.

ఎంపీడీవో జై శ్రీ

చిట్యాల, నేటి ధాత్రి ;

 

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున ఎంపీడీవో జయ శ్రీ అధ్యక్షతన జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 26న భూపాల పెళ్లిలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో నిర్వహించే జాబ్ మేళను మండలంలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారికి మండలంలో ఉన్న అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి నిరుద్యోగులను అధిక సంఖ్యలో 26న జరిగే జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలని మండల గ్రామ అధికారులను కోరినారు ,ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమ, ఎంపీ ఓ ,రామకృష్ణ, ఎస్సై, ఏపీఓ, పంచాయితీ కార్యదర్శులు ఐకెపి ఏపిఎం, సీసీలు ,వివోఏలు, అగ్రికల్చర్ అధికారులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ ఏఈ మండల గ్రామ అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె.

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె

మున్సిపల్ కమిషనర్ హామీతో విరమించిన కార్మికులు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు కోసం అనేక పోరాటాలు చేసిన ఫలితంగా గత ప్రభుత్వం 2021 జూన్ నెలలో 11వ పి.ఆర్.సి కింద మున్సిపల్ మున్సిపల్ కార్మికుల వేతనాలను 12,000 నుండి 15600 కు నెలకు 3600 పెంచడం జరిగినది. కానీ 2022 ఫిబ్రవరి నెల నుండి కార్మికులకు పెరిగిన వేతనాలు ఇవ్వడం జరిగినది. ఎనిమిది నెలల పి.ఆర్.సి బకాయిలు రావాల్సి ఉంటే మధ్యలో చాలాసార్లు అడిగితే ఒక్కొక్క నెల చొప్పున కేవలo మూడు నెలల పి.ఆర్.సి పెండింగ్ వేతనాలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ ఐదు నెలల పెండింగ్ పి.ఆర్.సి వేతనాలు రావాలి మొత్తం 250 మంది కార్మికులకు ఒక్కో నెలకు 3600 చొప్పున ఒకరికి 18,000 చొప్పున మొత్తం 45 లక్షల రూపాయలు కార్మికులకు రావాలి. మున్సిపల్ కార్మికులు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదు అని తెలిపారు.అంతేకాకుండా గత నెలలో ఫిబ్రవరి, మార్చి నెలల రావాల్సిన వేతనాలు కూడా ఇంకా కార్మికులకు ఇవ్వలేదు అని తెలిపారు.కార్మికులకు సంబంధించి పి.ఎఫ్ , ఈ.ఎస్.ఐ మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం పాలకవర్గ గడువు ముగిసింది జిల్లా కలెక్టర్ ఇన్చార్జిగా ఉన్నారు పై సమస్యలు పరిష్కరించాలని మార్చి 4వ తేదీన కమిషనర్ గారికి , 15 రోజుల క్రితం కలెక్టర్ కి కూడా లెటర్లు ఇవ్వడం జరిగినది. ఏప్రిల్ 10 లోపు సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పనులుస్పందన లేకపోవడంతో ఈరోజు ఉదయం 5 గంటలకు పనులకు వెళ్లకుండా మున్సిపల్ ముందు బెటాయించిన కార్మికులు ఉదయం 6 గంటల వరకు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వచ్చి చర్చలు జరిపి అన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నాలుగు రోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ హామీలు మేరకు ఉదయం 8 గంటలకు విధులలో చేరిన సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు.

శ్మశాన వాటిక గురించి తప్పుడు నివేదిక సోషల్ మీడియాలో.

శ్మశాన వాటిక గురించి తప్పుడు నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని ప్రభుత్వ అధికారులు ఖండించారు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సోషల్ మీడియాలో కోహిర్ నుండి వచ్చిన యువకుడిని నిజం చేయడం చాలా ఖరీదైన పని. వివరాల ప్రకారం, దివంగత భండారీ అబ్దుల్ రషీద్ కుమారుడు ముహమ్మద్ సలీముద్దీన్ భండారీ నిన్న హీర్‌లోని అతిపెద్ద శ్మశానవాటిక అయిన హజ్రత్ మౌలానా ముయిజుద్దీన్ తుర్కీ శ్మశానవాటికలో వక్ఫ్ సవరణ బిల్లు యొక్క మొదటి ప్రభావాన్ని కోహిర్లో చూడవచ్చని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా వైరల్‌గా మారింది. కానీ అది అబద్ధాల ఆధారంగా జరిగింది. వివరాల ప్రకారం, కోహిర్ స్మశానవాటికలో ఒక కుటుంబం తమ పాత సమాధుల దగ్గర ఉన్న ముళ్ల పొదలను శుభ్రం చేయడానికి జెసిబిని ఉపయోగిస్తుండగా, వారు అకస్మాత్తుగా అక్కడికి వెళ్లి తమ మొబైల్ ఫోన్‌తో ఒక వీడియో తీశారు, అందులో వారు సెంట్రల్ బ్యాంక్ మరియు బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పారు. దానికి ఒక ప్రభావం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నయాబ్ తహశీల్దార్గా కరుణాకర్ రావు…

నయాబ్ తహశీల్దార్గా కరుణాకర్ రావు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం నూతన నయాబ్ తహశీల్దార్ గా జి.కరుణాకర్ రావు గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఝరాసం గంలో ఇప్పటివరకు విధులు నిర్వహించిన నయాబ్ తహశీల్దార్ యాసిన్ ఖాన్ నిజాంపేట్ మండలానికి బదిలీపై వెళ్లడంతో గుమ్మడిదల తహశీల్దార్ కార్యాల యంలో నయాబ్ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జి.కరుణాకర్ రావు నూతన నయా తహశీల్దారుగా నియమితులయ్యారు. బుధవారం మండల కేం ద్రంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్ తిరుమలరావు,ఆర్.ఐ రామారావు కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజ లకు మెరుగైన సేవలు అందేలా తన వంతు సహకారం అందిస్తానని నయాబ్ తహశీల్దార్ పేర్కొన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న TSSCDS మాజీ చెర్మెన్.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని పి.వి.ఆర్. గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన చిన్న హైదరాబాద్ గ్రామం పి. లక్ష్మణ్ కుమారుని వివాహా వేడుకల్లో, హోతి. కె. గదక్ తాండలో జరిగిన కిషన్ చౌహాన్ కుమార్తె వివాహా వేడుకల్లో టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మెగా జాబ్ మేళా పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో.

యువతి యువకులకు 26 మెగా జాబ్ మేళా పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో

గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో రైతు వేదికలో
భూపాలపల్లి నియోజక వర్గం లోని యువతీ యువకులకు ఉన్నత స్థాయి అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ,ప్రవేట్, కార్పొరేట్ వివిధ శిక్షణ సంస్థల భాగస్వామ్యం తో దీవి.26/4/2025 రోజున ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
భూపాలపల్లి లోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ నందు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందిఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు తగ్గట్టుగా వివిధ కంపెనీలతో ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ మాట్లాడి 6వ తరగతి నుండి పీజీ వరకు, టెక్నికల్ విద్య ఇతర రంగాలలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వివిధ సెక్టార్, ఐటీ సెక్టర్, నెట్వర్క్ ఇంజనీరింగ్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ ,ఫార్మసీ, మెకానికల్ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్, క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్, ఫైనాన్సు రంగంలో, ఆడిట్ రంగంలో, సేల్స్ ఎగ్జిక్యూటివ్ రంగంలో, టెలికాలర్ రంగంలో, సెక్యూరిటీ రంగంలో, డెలివరీ బాయ్స్ తదితర సంస్థలు ఈ కార్యక్రమంలో హాజరవుతున్నందున యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది.

జాబ్ మేళా విజయవంతం చేయుటకు గాను ఈరోజు గణపురం మండల కేంద్రంలోని రైతు వేదిక లో(10/4/2025) రోజున సన్నహాక సమావేశం వివిధ ప్రభుత్వ శాఖల గ్రామస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది.

MPDO L Bhaskar

 

ఇట్టి సమావేశమున కు ఆర్డీవో ఎన్ రవి మాట్లాడుతూ, గ్రామాల్లో నిరుద్యోగ యువత సరియైన ఉద్యోగ అవకాశాలు లేక చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి మంచి అవకాశం కల్పించినట్లు అయితే సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదగ గలరని, గ్రామస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ గ్రామాల్లోని యువతకు ఇట్టి సమాచారం చేరవేసి మెగా జాబ్ మేళాలో పాల్గొనేటట్లు చేయాలని కోరినారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎల్ భాస్కర్ మాట్లాడుతూ 100 కి పైగా కంపెనీలు మన ప్రాంతానికి రావడం యువతీ యువకుల అదృష్టమని, ప్రతి గ్రామం లోని యువతకు తెలియజేసి అత్యధిక సంఖ్యలో మండలం నుండి జాబ్ మేళాలో పాల్గొనేటట్లు చేయాలని కోరినారు, ఈ కార్యక్రమం లో మండల తహసిల్దార్ ఏం సత్యనారాయణ , వ్యవసాయ అధికారి ఐలయ్య , మండల విద్యాశాఖ అధికారి ఉప్పలయ్య గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ సూపర్వైజర్లు ఆశా వర్కర్లు, గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల ఆణిముత్యాలు..

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని దోరువారివేంపల్లి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు 100%శాతం ఫలితాలు , సత్తా చాటిన పాఠశాల విద్యార్థులు
ఫిబ్రవరి 23 వ తారీఖున జరిగిన టీజీ గురుకుల సెట్ లో హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా అందులో నుండి పోయిన వారం వెల్లడించిన ప్రవేశ ఫలితాల వెల్లడిలో 10/10 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు దొరవారివేంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సువర్ణ పాక క్రిష్ణ తెలిపారు… ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా యొక్క పాఠశాలలో ప్రాథమిక తరగతి వరకే ఉండడం వలన విద్యార్థులు ఈ గ్రామం మంచి పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలని పాఠశాల విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం స్పెషల్ క్లాస్ నిర్వహించము అందుకే విద్యార్థులకు ఈ రోజున పదికి పది మంది విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలలో సీట్ రావడం జరిగిందని చెప్పారు ఈసందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.. విద్యార్థులు తల్లిదండ్రులు సందర్భంగా చాలా సంతోషం పడ్డారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అండెం కృష్ణ గారు అంగన్వాడీ టీచర్ భారతి గారు పాల్గొన్నారు…

చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై శివకృష్ణ.

చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై శివకృష్ణ

పరకాల నేటిధాత్రి

పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో గురువారం రోజు మాజీ పోలీస్ అధికారి శాతరాశి సుధాకర్ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శాతరాశి సనత్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని పరకాల సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ బాటసారుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అలియాబాద్ తాజా మాజీ సర్పంచ్ శాతరాశి రమాదేవి సుధాకర్ రావు,మాజీ ఉప సర్పంచ్ డ్యాగ శ్రీనివాసరావు,యూత్ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వసూళ్లలో రూటు మార్చిన మరో క్వారీ.

*దర్జాగా టీఎస్ఎండిసి సిబ్బంది వసూళ్లు.*

*మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, క్వారీ లో దారుణం.*

*సీరియల్ 700, లోడింగ్ 100, పాసింగ్ కొరకు 100.*

*టీఎస్ఎండిసి ఉన్నత అధికారుల నిఘా ఎక్కడ.*

*మహాదేవపూర్- నేటి ధాత్రి:*

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీలు అదనపు ఇసుక అక్రమ వసూళ్లకు హద్దు అదుపు లేకుండా పోయింది.ఎవరు పసిగ్గటి రీతిలో బొమ్మపూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీలతోపాటు మహాదేవపూర్ పూసుకుపల్లి ,ఒకటవ నంబర్ పేరుతో మండలంలోని కుదురుపల్లి శివారు వద్ద నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ లో వసూళ్లకు రూటు మార్చి ,కాంట్రాక్టర్ సిబ్బంది కాకుండా టి ఎస్ ఎం డి సి, కు చెందిన సిబ్బంది ప్రతి లారీ వద్ద 700 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లోడింగ్ వద్ద 100 రూపాయలు, కాంట వద్ద టీఎస్ ఎంబీసీ సిబ్బంది కూర్చుని పాసింకు ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన తిరిగి ఇసుక వేయడం లేదా తీయడం చేస్తూ మరో అదనంగా 100 రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ లలో ఎక్కువ మోతాదులో ఈ క్వారీ నుండి ఇసుక లారీల రవాణా కావడం జరుగుతుంది.

 

ప్రస్తుతం మండలంలో సుమారు 150 కు పైగా ప్రతిరోజు లారీల ఇసుకను లోడ్ చేసే క్వారీల్లో బొమ్మపూర్ ఎలికేశ్వరం తో పాటు, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఒకటవ నంబర్ క్వారీ కూడా ఉంది. గత నెల కేవలం 3 నుండి 17 లారీలకే పరిమితమైన, ఈ క్వారీ ఈనెల వారం రోజులుగా 60 నుండి నేడు 246 లారీల ఇసుక ను తరలిస్తుందంటే, అక్రమ వసూళ్ల పర్వం ఎంతవరకు ఉందో స్పష్టం అవుతుంది. సాండ్ పొలిసి ని కఠినంగా అమలు పరుస్తున్నాము ,అని చెప్పుకుంటున్న మైనింగ్ శాఖ, మండలంలో దర్జాగా వసూళ్లు చేస్తుంటే ఎందుకు నిశ్శబ్దం వహిస్తుంది. గుత్తేదార్ గుమస్తాలుగా మారి టీఎస్ఎండిసి సిబ్బంది, ఇసుక లోడింగ్ వద్ద ఉండాల్సినప్పటికీ, కేవలం కంటైనర్ల వద్ద పరిమితమై సీరియల్ పేరుతో సిబ్బంది వసూలు చేయడం మైనింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ల నుండి వాటా పోగకుండా ఇలా సాధ్యమవుతుంది. మైనింగ్ ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి, అక్రమ వసూళ్లు చేస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కేరళ కాంగ్రెస్‌ మెడకు చుట్టుకున్న వక్ఫ్‌బిల్లు 

`బూమరాంగ్‌ అయిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు

`కాంగ్రెస్‌, సీపీఎంలపై మండిపడుతున్న క్రైస్తవులు, వక్ఫ్‌ బాధిత ముస్లింలు

`పుట్టి ముంచనున్న ఓటు బ్యాంకు రాజకీయాలు

`తలపట్టుకు కూర్చున్న కాంగ్రెస్‌ క్రైస్తవ ఎంపీలు

`రాహుల్‌, ప్రియాంకలపై కేరళ ముస్లింల ఆగ్రహం

`బీజేపీకి అస్త్రంగా మారిన వక్ఫ్‌బిల్లు

`వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ

`కాంగ్రెస్‌పై మండిపడుతున్న కేథలిక్‌ చర్చ్‌

`కాంగ్రెస్‌ కొంప ముంచనున్న మునాంబం సమస్య

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వక్ఫ్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాత కేరళలో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. మైనారిటీల వర్గాల బుజ్జగింపు రాజకీయాలతో తన రాజకీయ మనుగడను సాగిస్తున్న కాంగ్రెస్‌కు అదే మైనారిటీ అస్త్రం బూమరాంగ్‌ కావడం కేరళలో తాజాపరిణామం. పార్లమెంట్‌లో వక్ఫ్‌ బి ల్లుపై చర్చలో రాహుల్‌ మౌనం పాటిస్తే, ప్రియాంకా వాద్రా అసలు లోక్‌సభకే రాలేదు. చివరకు వక్ఫ్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడంతో, కేరళలోని ముస్లిం వర్గాలు కాంగ్రెస్‌పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. సందట్లో సడేమియా మాదిరిగా ఈ బిల్లు ఆమోదం నేపథ్యంలో బీజేపీ కేరళ క్రైస్తవ వర్గాల్లో సానుకూలతను పెంచుకోవడానికి కృషి చేస్తుండటం తాజా పరిణామం. బిల్లు ఆమోదంతో డిఫెన్స్‌లో పడ్డ కాంగ్రెస్‌ పార్టీ, లెఫ్ట్‌ పార్టీలు ఉమ్మడిగా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఇటీవల జబల్‌పూర్‌లో క్రైస్తవ మత గురువుపై రైట్‌వింగ్‌ కార్యకర్తలు జరిపిన దాడికి ఎక్కువ ప్రచారం కల్పించడం ద్వారా, కేరళ క్రై స్తవుల్లో భాజపాపై సానుకూలతను నిరోధించే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇది అంతగా ఫలితం ఇస్తున్నట్టు లేదు.

మునాంబం వాసుల్లో ఆనందం

వక్ఫ్‌ బిల్లు ఆమోదంతో కేరళలోని మునాంబం గ్రామ ప్రాంతంలోని క్రైస్తవుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక్కడి క్రైస్తవుల భూములను వక్ఫ్‌బోర్డు తమదిగా ప్రకటించడంతో ఈ ప్రాంత క్రైస్తవుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై పినరయి విజయన్‌ ప్రభుత్వం కూడా పెద్దగా స్పం దించకపోవడం క్రైస్తవుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. తాజాగా పార్లమెంట్‌లో వక్ఫ్‌బిల్లు ఆ మోదం పొందడంతో మునాంబంలోని 610 క్రైస్తవ కుటుంబాలకు ఊరట లభించే అవకాశాలు మెరుగైన నేపథ్యంలో, బీజేపీ పట్ల కృతజ్ఞతా భావంతో ఇప్పటికే ఈ ప్రాంతంలోని 50మంది క్రైస్తవులు బీజేపీలో చేరిపోయారు. ఈనెల 4వ తేదీన కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఎన్‌డీఏ కూటమి భాగసామి నేతలు మునాంబం గ్రామాన్ని సందర్శించి న ప్పుడు వీరికి అపూర్వరీతిలో స్వాగతం లభించింది. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు ఈ ప్రాంత వాసులు వక్ఫ్‌ ప్రకటన కారణంగా పడుతున్న కష్టాలను పట్టించుకోకపోయినా, తాము వారికి దన్నుగా నిలుస్తామని వీరు స్పష్టం చేశారు. వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు తమ భూములపై చట్టబద్ధంగా యాజమాన్య హక్కు వచ్చేవరకు తాము వీరికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్‌బోర్డు వీరి భూములను తమవిగా ప్రకటించడంతో గత 178రోజులుగా ఈ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందడంతో కృతజ్ఞతగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రాంత క్రైస్తవులు కోరడంతో, అందుకు తప్పక అవకాశం కల్పిస్తామని ఈ నాయకులు హామీ ఇచ్చారు. 

మునాంబం వివాదం

2022లో కేరళ వక్ఫ్‌బోర్డు మునాంబం గ్రామంలో ప్రజలు నివసిస్తున్న 400 ఎకరాల విస్తీర్ణంలో ని నివాస భూములన్నీ తమవేనని ప్రకటించడంతో, ఈ ప్రాంతంలో నివసించే ఫలితంగా ఇక్కడ నివసిస్తున్న 600కు పైగా క్రైస్తవ కుటుంబాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్నది హిందూ, క్రైస్తవ మత్స్యకార్లు. ఎర్నాకులం జిల్లాలోని తీరప్రాంత శివారు గ్రామమే మునాంబం. సిద్ధిఖి సైట్‌ అనే వ్యక్తి ‘వక్ఫ్‌’ కింద కోజిక్కోడ్‌లోని ఫరూక్‌ కళాశాలకు దానంగా ఇచ్చాడని వక్ఫ్‌బోర్డు వాదిస్తోంది. అయితే తాము ఈ భూములను కళాశాల యాజమాన్యం నుంచి కొనుగోలు చేశామని దీనికి సంబంధించిన టైటిల్‌ డీడ్స్‌ కూడా తమవద్ద వున్నాయని మునాంబం వాసులు చెబుతున్నారు . ఎన్నో ఏళ్లుగా వీరిక్కడ నివాసం వుండటమే కాదు ఇంటిపన్ను కడుతున్నారు. తమ యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు కూడా వీరివద్ద వున్నాయి. కానీ ఈ భూములను వక్ఫ్‌బోర్డు తమదిగా ప్రకటించడంతో 1995 వక్ఫ్‌బోర్డుచట్టం ప్రకారం, వీరు వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌ను మాత్రమే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడ తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వీరిలో ఎకోశానా లేదు. ఈ ట్రిబ్యునల్‌లో నిష్పక్ష పాత తీర్పు వస్తుంద న్న ఆశకూడా వీరిలో లేదు.ఎప్పుడైతే వక్ఫ్‌బోర్డు ఈ భూములు తమవని ప్రకటించిందో స్థానిక పంచాయతీ పన్ను వసూళ్లను నిలిపేసింది. ఇక బ్యాంకులు ఇక్కడివారికి రుణాలు మంజూరు చేయడంలేదు. ఈ తతంగం 2022 నుంచి కొనసాగుతోంది.

కుహనా సెక్యులర్‌ రాజకీయాలు

ప్రస్తుతం కేరళలో క్రైస్తవ ఓటర్లు 18% వున్నారు. తమను తాము సెక్యులర్‌ పార్టీలుగా చెప్పుకునేకాంగ్రెస్‌ లేదా లెఫ్ట్‌ పార్టీలు ఎక్కువగా ముస్లిం మైనారిటీ వర్గానికే కొమ్ము కాసే విధంగా రాజకీ యాలు నడుతుండటంతో, క్రమంగా ఈ పార్టీలు మిగిలిన వర్గాలకు దూరమవుతున్నాయి. చాప కింద నీరులా జరుగుతున్న ఈ పరిణామాన్ని ఇవి గుర్తించకపోవడం వాటి స్వయంకృతాపరాధం. ‘సెక్యులర్‌’ అంటే దేశంలోని అన్ని వర్గాల పట్ల సమాన వైఖరితో వ్యవహరించడం. కానీ దేశంలోని విపక్ష పార్టీలు కేవలం ముస్లిం మైనారిటీ వర్గానికి మాత్రమే దన్నుగా నిలుస్తూ, మెజారిటీలను నిర్లక్ష్యం చేయడం ద్వారా తమను తాము సెక్యులర్‌గా భావిస్తున్నాయి తప్ప, తాము ‘సూడో సెక్యులర్‌’ విధానాలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారామన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాయి.విపక్ష కాంగ్రెస్‌ నేత వి.డి. సంథీసన్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ బిల్లుకు, మునాంబం సమస్యకు ప్రత్యక్ష సంబంధం లేదని, ఈ విషయంలో ఇప్పటికే చర్చ్‌ మత గురువులను కలిసి చర్చించి వారిని ఒ ప్పించగలిగామని చెబుతున్నారు. ఈలోగా జబల్‌పూర్‌లో క్రైస్తవ మతగురువుపై జరిగిన దాడిని హైలైట్‌ చేయడానికి యత్నించారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్టు క్రైస్తవులు శాంతించినట్లయితే,బీజేపీ లో ఈ చేరికలు జరిగివుండేవి కావు. ఇదిలావుండగా కేరళలో ప్రముఖ ముస్లిం సంస్థ అయిన ‘సమస్థ కేరళ జమియతుల్‌ ఉలేమా’, వక్ఫ్‌బిల్లు విషయంలో రాహుల్‌ గాంధీ మౌనాన్ని, ప్రియాంకా వాద్రా వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ సంస్థ అధికార పత్రిక ‘సుప్రభాతం’ లో ‘‘ప్రియాంక వాద్రా లోక్‌సభకు రాకపోవడం, రాహుల్‌ గాంధీ మౌనం వహించడంతో, బీజేపీ ముస్లింల రాజ్యాంగ హక్కులను నిరోధించే వక్ఫ్‌బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది’’ అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంలో ప్రియాంక ఇచ్చిన వివరణను వారికి తెలియ జేసి శాంతింజేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు నానా తిప్పలు పడుతున్నారు.

 కేరళ కేథలిక్‌ బిషప్స్‌ కౌన్సిల్‌ (కేసీబీసీ) వక్ఫ్‌ చట్టాలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కౌ న్సిల్‌లో సైరో`మలబార్‌, లాటిన్‌, సైరో`మలంకర చర్చ్‌లు భాగంగా వున్నా యి. వక్ఫ్‌ బిల్లుకు మద్దతు పలకాలని తమ ఎంపీలకు కేసీబీసీ బహిరంగంగా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశే ఖర్‌ చురుగ్గా పావులు కదపడం మొదలుపెట్టి, కేసీబీసీ ప్రెసిడెంట్‌ కార్డినల్‌ బేసిలియోస్‌ క్లీమిస్‌ మరియు ఎస్‌ఎన్‌డీపీ యోగం సంస్థ ప్రధాన కార్యదర్శి వల్లెపల్లి నటేషన్‌ను కలిసి మంతనాలు జరిపారు. నటేషన్‌ బీజేపీకి అనుకూలుడు. అంతేకాదు రాజీవ్‌ చంద్రశేఖర్‌ బిల్లు విషయంలో కేసీబీసీ అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. వక్ఫ్‌బిల్లుకు మద్దతు పలకాలని కేసీబీసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కేరళలో మంచి ప్రాచుర్యం పొందిన కేథలిక్‌ దినపత్రిక ‘దీపిక’ తన సంపాదకీయం లో కాంగ్రెస్‌, సీపీఎంల వ్యవహారశైలిని తీవ్రంగా వి మర్శించింది. ‘‘వక్ఫ్‌బిల్లును వ్యతిరేకిస్తే ఈ నాయకులు రాబోయే తరాలకు జవాబుదారీలుగా మిగులుతారు. కొన్ని వర్గాల ఓట్లు తమకే పడతాయని, మరికొన్ని వర్గాలను ఎప్పటికప్పుడు బుజ్జగించక తప్పదని ఈ పార్టీలు తప్పుగా అంచనా వేస్తున్నాయి. కేవలం వక్ఫ్‌కు అనుకూలంగా వ్యవహరించడమే సెక్యులర్‌ విలువలని భావించడం తప్పు’’ అని ఆ పత్రిక సంపాదకీయం ఘాటుగా హెచ్చరించింది. ఇదే సమయంలో ఈ వక్ఫ్‌ బిల్లు సవరణ ద్వారా, వక్ఫ్‌ అక్రమంగా తనదిగా ప్రకటించిన ఈ అమాయక ప్రజల భూములను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని భాజపాను ఈ సంపాకీయం విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో బిల్లు ఆమోదం కేవలం బాధితులకు న్యాయం అందించడానికి తప్ప, రాజకీయం కోసం కారాదని కూడా హెచ్చరించింది.

జరుగుతున్న పరిణామాలు కేరళ కాంగ్రెస్‌ క్రైస్తవ ఎంపీల్లో అసంతృప్తిని రాజేస్తున్న మాట వాస్త వం. ముఖ్యంగా క్రైస్తవ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు ఈ పరిస్థితిని ఎట్లా సర్దుబాటు చేయాలో తెలియక తలపట్టుకు కూర్చున్నారు. కొట్టాయంకు చెందిన కాంగ్రెస్‌ ఎం.పి. జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ ఇప్పుడ తీసుకొచ్చిన సవరణల్లో కొన్ని ఉపయోగకరమే కానీ తుది నిర్ణ యం రాష్ట్రప్రభుత్వం చేతులో వుండటం ఇక్కడ ప్రధాన సమస్య. తుదినిర్ణయం విషయంలో కేం ద్రం ఏమీ చేయలేదన్నారు. అయితే కేరళ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ పి.జె. జెసెఫ్‌ తనయుడు జాన్‌ జోసె ఫ్‌ మాత్రం రాష్ట్రంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం మునాంబం ప్రజలకు న్యాయం చేస్తుందని చెబు తూ బీజేపీ స్వల్పకాలిక వ్యూహాల ద్వారా ముస్లిం మైనారిటీలను నిరాశకు గురిచేయవద్దని కోరా రు. 

కేరళలో వక్ఫ్‌ బాధితులు సగానికి పైగా ముస్లింలే

వక్ఫ్‌బోర్డును చారిత్రకంగా నియంత్రిస్తూ వస్తున్న జమాయత్‌ ఉలేమా ఇ హింద్‌, జమాత్‌ ఎ ఇ స్తామీ వంటి సంస్థలు వక్ఫ్‌ బిల్లు సవరణను వ్యతిరేకిస్తున్నాయి. విచిత్రంగా ముస్లింలలో కూడా చాలామంది వక్ఫ్‌ బోర్డు బాధితులున్నారు. వీరంతా కేరళ కాంగ్రెస్‌ మద్దతుదార్లు. ప్రస్తుతం వీరికి వక్ఫ్‌ బోర్డుతో ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వక్ఫ్‌ ట్రిబ్యునళ్లలో ప్రస్తుతం 40,951 కేసులు పెండిరగ్‌లో వుండగా వీటిల్లో 9942 కేసులు ముస్లిం వర్గాలకు చెందినవే. ఇక కేరళ విషయానికి వస్తే ప్రస్తుతం 1008 వక్ఫ్‌ ఆస్తుల వివాదాలు కొనసాగుతుండగా వీటిల్లో 551 కేవలం ముస్లింవర్గాలకు చెందినవి కాగా కేవలం 457 కేసులు మాత్రమే ముస్లిమేతరులవి. వీరంతా బాధితులు కనుక వక్ఫ్‌ చట్టాలను వ్యతిరేకించడం సహజం. వీరు వక్ఫ్‌ ట్రిబ్యునళ్ల కంటే సివిల్‌ కోర్టుల్లోనే తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గం ప్రజలంతా వక్ఫ్‌బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌, సీపీఎంలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహంతో క్రైస్తవులతో పాటు, వక్ఫ్‌బోర్డు బాధిత ముస్లిం వర్గాల ఓట్లను ఈ రెండు పార్టీ లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిరది. వక్ఫ్‌ బిల్లును సమర్థించాలని కోరిన తన విజ్ఞప్తిని ఖాతరు చేయని కాంగ్రెస్‌పై కేఎస్‌బీసీ తీవ్ర ఆగ్రహంతో వుంది. మొత్తంమీద చెప్పాలంటే వక్ఫ్‌బిల్లు ఆమో దం పొందడంతో కేరళ రాజకీయాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ పరిస్థితి కుడితో పడ్డ ఎలుక చందంగా మారిందనే చెప్పాలి.

మింగలేని, కక్కలేని మిల్లర్ల కష్టాలెన్నో!

`త్రిశంకు స్వర్గంలో తెలంగాణ మిల్లర్లు!

`నిత్యం ఒత్తళ్లతోనే వ్యాపారం

`దివాలా తీస్తున్నా చెప్పుకోలేని ధైన్యం

`ప్రభుత్వం వినిపించుకోదు!

`అధికారులు పట్టించుకోరు!

`ప్యాడీ టెండర్ల ఆగడాలు తట్డుకోలేకపోతున్నారు

`అన్ని రకాలుగా నష్టాలు మిల్లర్లే అనుభవిస్తున్నారు!

`తేమ శాతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!

`నాణ్యమైన బియ్యం అందచేయడానికి మరింత నష్టపోతున్నారు

`బకాయిలు పేరుకుపోతున్నాయి

`కోట్లలో రావాల్సిన సొమ్ము అందక ఆగమౌతున్నారు

`ఎటు చూసినా సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసే అవకాశం లేదు

`కనీసం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అప్పాయింట్‌మెంటు దొరకదు

`ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగూ తెలంగాణ మిల్లర్లకు మేలు జరగలేదు

`పన్నెండేళ్లుగా మిల్లర్ల సమస్యలు వినిపించుకునే నాధుడు లేడు

`అప్పులపాలై అనేక మంది మిల్లర్లు దివాలా తీస్తున్నారు

`ప్యాడీ టెండర్ల మూలంగా ప్రభుత్వం నష్టపోతోంది

`మధ్య వర్తుల మూలంగా మిల్లర్లు అవస్థలు ఎదుర్కొంటున్నారు

`దేశంలో పుడ్‌ సెక్యూరిటీ అమలుకు కారణం మిల్లర్లు

`తెలంగాణ ఉద్యమంలో మిల్లర్ల పాత్ర ఎంతో పెద్దది

`ప్రభుత్వాలు అందించే బియ్యం పథకాల అమలులో మిల్లర్ల సహకారం గొప్పది

`అయినా తెలంగాణ మిల్లర్లపై చిన్న చూపు తగదు

`కొంత మంది దళారుల మూలంగా మిల్లర్ల వ్యవస్థ కుదేలౌతోంది

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 సమాజంలో కష్టాలు కొందరికే వుంటాయనుకుంటారు. కొన్ని వర్గాలే అనుభివిస్తాంటారు. కాని పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అని పెద్దలు ఊరికే అనలేదు. అలాగే సమాజంలో రైస్‌ మిల్లర్లకు కష్టాలుంటాయా? అని కూడా అనుకుంటుంటారు. కాని వారికుండే కష్టాలు వింటే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్లే వుంటుంది. పైకి సిల్కు షర్టు వేసుకున్నా లోపల చినిగిన బనియన్‌ వున్నట్లే మిల్లర్లకు కూడ అనేక చిల్లులుంటాయి. కాని పైకి కనిపించే మిల్లర్ల సిల్కు చొక్కలే చూస్తారు. వారి కష్టాలు చెప్పుకోలేక, వినేవారు లేక నానా ఇబ్బందులు పడుతున్నవారు చాలా మంది వున్నారు. సమాజం దృష్టిలో మాత్రం మిల్లర్లుపై రకరకాల అభిప్రాయలుంటాయి. కాని వారి గోడు వినేవారుండరు. చెప్పుకుందామన్నా ఆలకించేవారుండరు. అంత ధైన్యంగా మిల్లర్ల పరిస్ధితులంటాయి. రైతులు మిల్లర్లనే తప్పు పడుతుంటారు. అదికారులు మిల్లర్లపైనే జులుం చేస్తుంటారు. ప్రభుత్వం మిల్లర్లనే దోషులుగా చిత్రీకరిస్తారు. కాని అందరికీ అవసరమైంది మిల్లర్లే అని మర్చిపోతుంటారు. రైతు ఆరు గాలం కష్టం చేసి ధాన్యం పండిస్తాడు. కాని ఆ ధాన్యాన్ని దేశానికి అన్నంపెట్టేలా మార్చేది మిల్లర్లు. ప్రజల నోటికి ముద్ద వచ్చేందుకు మిల్లర్లు కష్టపడుతుంటారు. కాని రైతు కష్టమే చూస్తారు. మిల్లర్‌ను వ్యాపారి కింద జమకట్టేస్తారు. దాంతో మిల్లర్లు తమ గోడును చెప్పలేక, వారి బాధలు మింగలేక, కక్కలేక కష్టాలు పడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిశంకు స్వర్గంలో జీవిస్తుంటారు. పైన పటారం లోన లొటారం లాగా లాభం లేని వ్యాపారాలు సాగిస్తుంటారు. మిల్లర్లకు లాభాల కన్నా నష్టాలే వుంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే రైతుల ధాన్యం అమ్ముకుంటే రైతుకు రాబడికి మంచి లాభం వస్తుందనుకుంటారు. కాని అది వాస్తవం కాదు. నిత్యం ఒత్తిళ్లతోనే సతమతమౌతుంటారు. కాని పైకి నవ్వుతూ వుంటారు. తాముదివాళా తీస్తున్నామని కూడా చెప్పుకోలేక మధనపడుతుంటారు. ధాన్యం తేమ విషయం నుంచి మొదలు, బియ్యం అమ్ముకునేదాకా కష్టమే. ఎందుకంటే ఒకప్పుడు రైతు ధాన్యాన్ని మిల్లుకు చేర్చినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వుండేవారు. కాని ఇప్పుడు ఇప్పుడు రైతులు తెచ్చే ధాన్యం మిల్లర్లకు శాపాన్ని తెచ్చిపెడుతుంటి. ఎందుకంటే ధాన్యాన్ని బాగా ఎండబెట్టి, మట్టి లేకుండా చూసుకొని, తాలు లేకుండా తూర్పారపట్టి మిల్లుకు రైతు ధాన్యం తెచ్చేవారు. కాని ఇప్పుడు ఇప్పుడు కోసిన కోతను అలాగే మిల్లుకు చేర్చుతున్నారు. ప్రభుత్వం ఐకేపి వ్యవస్దను తెచ్చిన తర్వాత రైతు ఎలాంటి ధాన్యం తెచ్చినా తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురైంది. మిల్లర్ల కష్టాలు ఇక్కడి నుంచే మొదలౌతున్నాయి. రైతుకోత నుంచి నేరుగా తెచ్చే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. సహజంగా తేమ 17శాతం వుండాలి. కాని ప్రభుత్వాలు 25 శాతం వరకు వున్నా మిల్లర్లు సేకరించాల్సిందే అంటుంది. దాంతో నాణ్యమైన బియ్యం రావడం కష్టమౌతుంది. ఒకవేళ అలాంటి ధాన్యాన్ని సేకరించకోతే నాయకుల నుంచి, అధికారుల నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొవాల్సివుంటుంది. ఇవన్నీ తట్టుకున్నా, మీడియా నుంచి కూడా వచ్చే వార్తల మూలంగా అదో రకమైన ఇబ్బంది. రైతులను ముంచుతున్న మిల్లర్లు అని వార్తలు వస్తాయి. మిల్లర్లు మునుగుతున్నారని ఎవరూ జాలి పడరు. కాని తేమ శాతం ఎంతున్నా ధాన్యం సేకరిస్తే రైతులు ఎలా నష్టపోతాడన్నది ఎవరూ ఆలోలించరు. కాని మిల్లర్లు మోసం చేస్తున్నామంటారు. అసలు ఆ వార్తలకు లాజిక్‌ కూడా వుండదు. లేనిపోని లెక్కలు జోడిస్తారు. మిల్లర్లపై బురజల్లుతారు. కొవ్వొత్తిలాగా మిల్లర్లు తమనుతాము కాల్చుకుంటున్నారని ఎవరూ జాలిపడరు. కాని రైతలును కాల్చుకు తింటున్న మిల్లర్లు అని వార్తలు రాసేస్తుంటారు. రైస్‌ మిల్లర్ల ఆలోచనలు ఎవరూ ఆలకించరు. మిల్లు ఏర్పాటు కోసం అప్పులు తెచ్చి, నిర్మానం చేస్తారు. వాటి ఈఎంఐలు కూడా వెల్లదీసుకోలేక, ఎప్పటి పంట పైసలు అప్పుడు రాక ఎన్ని రకాలుగా మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారో ఎవరికీ అక్కర్లేదు. కాని అందరూ మిల్లర్లనే బెదిరిస్తుంటారు. అయితే మిల్లర్లు వేల కోట్లు బకాయిలు వున్నాయనే వార్తలు కూడా వున్నా యి. ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యమిచ్చి, బియ్యం తీసుకోవాలి. కాని మిల్లర్లకు దాన్యం ఇచ్చే క్రమంలో టెండర్‌ ప్యాడీ దళారీ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. ఆ దళారీ వ్యవస్దలో వున్నవాళ్లు కూడా కొంత మంది పాతుకుపోయిన మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలున్నారు. అసలు ప్రభుత్వానికి, ఇటు మిల్లర్లకు మద్య దళారీ వ్యవస్ద అవసరమే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో యంత్రాంగముంది. సివిల్‌ సప్లైకి శాఖలో వివిద స్ధాయిల్లో ఉద్యోగులున్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేసుకోవచ్చు. కాని ప్రభుత్వాన్ని నమ్మించి, కొంత మంది అసోసియేషన్‌ పెద్దలు టెండర్ల వ్యవస్ధను తెచ్చిపెట్టారు. ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈ వ్యవస్ధనంతా వారి గుప్పిట్లో పెట్టుకున్నారు. టెండర్‌ వ్యవస్ధ ఎందుకు? ఏర్పాటైందో అసలు కారణం పక్కకు వెళ్లింది. మిల్లర్లను దోచుకునే వ్యవస్దగా ప్యాడీ టెండర్‌ మారిపోయింది. టెండర్‌ వ్యవస్ధ మిల్లర్ల నుంచి ధాన్యమే సేకరించాలి. కాని మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే మిల్లర్లు నష్టపోయినా ఫరవాలేదు. కాని టెండర్‌ వ్యక్తులకు నేరుగా మిల్లర్లు సొమ్ము జమచేయాల్సివస్తుంది. మరి మిల్లర్లు ఆ దాన్యం ఎక్కడమ్ముకోవాలి? ఎలా అమ్ముకోవాలి? నష్టాలు ఎలా భరించాలన్నదానిపై మిల్లర్లు పడుతున్న ఇబ్బందులు ఎవరికీ అక్కర్లేదు. టెండర్‌ దారులకు రూ.1900 చెల్లించాలన్న లెక్క వుంది. కాని టెంటర్‌ దారులు మాత్రం మిల్లర్లు రూ.2300 చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. తనికీలు చేయిస్తామని హెచ్చరిస్తుంటారు. ఓ వైపు మిల్లర్లు నెలల తరబడి తమ గోడౌన్లలో దాన్యాన్ని కాపాడేది మిల్లర్లు. ఆ సమయంలో ఎలాంటి నష్టం వాటిల్లిన్నా మిర్లదే బాద్యత. అయినా భరిస్తున్నారు. గోదాములు కిరాయిలు చెల్లించేవారు లేరు. గన్నీ బ్యాగులు పాడైపోతాయి. వాటి ఖర్చు ఎవరు భరించాలి? అని మిల్లర్లు అడిగే ప్రశ్నలకు అధికారులు వద్ద, టెండర్‌ దారుల వద్ద సమాధానం వుండదు. కనీసం కనికరం కూడా వుండదు. దాన్యం మిల్లర్ల గోడౌన్‌ నుంచి లిఫ్ట్‌ చేయరు. కాని డబ్బులు మాత్రం వసూలు చేస్తూ టెండర్‌ దారులు వేదిస్తుంటారు. ఈ విషయంపై మిల్లర్లు కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా మిల్లర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. టెండర్‌ దారులు మిల్లర్ల నుంచి ధాన్యం మాత్రమే తీసుకోవాలి అనిచెప్పింది. కాని ఆ తీర్పును టెండర్‌ దారులు లెక్క చేయరు. అధికారులు అమలు చేయరు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధవల్ల క్వింటాల్‌కు రూ.230 రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తుంది. అటు రైతులు బాగుపడ్డట్టు కాదు. ఇటు మిల్లర్లకు మేలు జరిగింది లేదు. ప్రతిసారి టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ జేబుల్లోకి రూ.1100 కోట్ల రూపాయలు అప్పనంగా చేరుతోంది. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధను తొలగిస్తే ప్రభుత్వానికి రూ.1100 కోట్లు మిగులుతాయి. టెండర్‌ ప్యాడీ పెద్దలకు కనీసం గోడౌన్లు కూడా వుండవు. మిల్లర్లే ఆ ధాన్యాన్ని కాపాడి టెండర్‌ ప్యాడీకి అప్పగిస్తారు. అలాంటప్పుడు టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ ఎందుకంటూ, మిల్లర్లు ప్రభుత్వానికి, సంబంధిత అదికారులకు అనేక సార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. కాని పట్టించుకున్న నాధుడు లేడు. టెండర్‌ ప్యాడీ పేరుతో ఓ నలుగురు దళారులు బతుకుతుంటే, 3300 మంది మిల్లర్లు అవస్ధలు పడుతున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పులపాలౌతున్నారు. కాని వారికి అది పట్టడం లేదు. కేవలం దళారుల అవతారం ఎత్తిన నలుగురైదుగురు మేలు కోసం మొత్తం మిల్లర్ల వ్యవస్ధనే ఫణంగా పెట్టడం ఏ మాత్రం సరైంది కాదు. అయితే ఈ దళారుల మూలంగా 3వేల మంది మిల్లర్లు ప్రభుత్వ పెద్దలను కలవలేకపోతున్నారు. వారి సమస్యలు విన్నవించుకోలేకపోతున్నారు. కనీసం మిల్లర్లకు అప్పాయింటు మెంట్‌ కూడా దొరకడం లేదు. మిల్లర్లు ప్రభుత్వ పెద్దలను కలిస్తే తమ బండారం బైట పడుతుందని దళారులు కుట్రలు చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే దళారుల అవతారం ఎత్తిన వారిలో మిల్లర్ల యూనియన్‌ అసోసియేషన్‌ నాయకులే వుండడం గమనార్హం. టెండర్‌ ప్యాడీ సభ్యులు రూల్స్‌ ప్రకారం మిల్లర్లు వుండకూడదు. కాని బినామీల పేరుతో మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలు కొంత మంది దళారుల అవతారం ఎత్తి, మిల్లర్లనే దోచుకు తింటున్నారు. ప్రభుత్వానికి చెందిన సొమ్మును మింగుతున్నారు. మిల్లర్ల కడుపు కొట్టి, బతుకుతున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలుసుకుంటే దళారుల పాలౌతున్న రూ.1100 కోట్లు ఖజానకు చేరుతాయి. లేకుంటే ప్రభుత్వం కనికరిస్తే మిల్లర్లకు అందుతాయి. అటు మిల్లర్లకు కాకుండా, ఇటు ప్రభుత్వానికి కాకుండా దళారులు మింగుతున్నారు. వ్యవస్ధను భ్రష్టు పట్టిస్తున్నారు. మిల్లర్ల ఉసురు పోసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి, మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే అసలు విషయాలన్నీ బైటకు వస్తాయి. మిల్లర్లు పడుతున్న సమస్యలు వెలుగులోకి వస్తాయి. మిల్లర్లు అను భవిస్తున్న కష్టాలు తెలుస్తాయి. మిల్లర్లకు మేలు జరిగితే రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఎంతో మంచిది. మిల్లర్లు కేవలం ధాన్యం ఆడిరచి, ప్రభుత్వానికి బియ్యం అందించేందుకు వున్న వ్యవస్ధ. ఈ వ్యవస్ధలో కొంత మంది అవకాశవాదులు చేరి, మిల్లర్ల జీవితాలను ఆగం చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా నొక్కేస్తున్నారు. రైతుల వి షయంలో మిల్లర్లను విలన్లుగా చూపిస్తున్నారు. కాని మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరూ అర ్ధం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని మిల్లర్లు ఆశిస్తున్నారు. వారిని పిలిచి ఒక్కసారి మాట్లాడితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని కోరుకుంటున్నారు.

జైపూర్ పిఎస్ కి రెండవ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన.

జైపూర్ పిఎస్ కి రెండవ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి

జైపూర్,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ బదిలీల ప్రక్రియలో జైపూర్ పోలీస్‌ స్టేషన్‌ కి నూతన రెండవ ఎస్సైగా రామలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందు నుండి పోస్ట్ ఖాళీగా ఉండడంతో రెండవ ఎస్సై గా ఎస్సై నాగరాజును స్థానిక పిఎస్ కు ఉన్నతాధికారులు నియమించారు.దీనితో ఈ పోస్ట్ కు గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రామలక్ష్మి పదోన్నతి పై జైపూర్ పిఎస్ కి బదిలీ అయ్యారు.బాధ్యతలు చేపట్టిన రెండవ ఎస్సై రామలక్ష్మి కి ఏసీపి వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.పదోన్నతులతో బాధ్యతలు మరింత పెరుగుతాయని సూచించి,విధి నిర్వహణలో రాజీ పడకుండా పని చేయాలన్నారు.ఫిర్యాది దారుల సమస్యలను మర్యాదపూర్వకం గా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అదే క్రమంలో నూతన రెండవ ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి కి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై రామలక్ష్మి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.జూదం,అక్రమ మద్యం,మాదకద్రవ్యాలు తదితర వాటిపై పోలీస్ వారి ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

బహుజన సమాజ్ పార్టీలో చేరికలు.

బహుజన సమాజ్ పార్టీలో చేరికలు

బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరికలు
ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లాఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ హాజరయ్యారు చేరికలను ఉద్దేశించి పొన్నం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏకం అయ్యి బహుజన రాజ్యాధికారానికి అడుగులు వేయాలని అగ్రవర్ణాల పార్టీలు చేస్తున్న రాజకీయ కుట్రలను తిప్పి కొట్టాలని సమాజంలో గౌరవం సమానత్వం పొందాలంటే రాజ్యాధికారమే మార్గమని అన్నారు అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా మురారి సదానందం భూపాలపల్లి నియోజకవర్గ కోశాధికారిగా జీడి సునీల్ గణపురం మండల అధ్యక్షునిగా ఈర్ల చిన్న మండల ప్రధాన కార్యదర్శిగా జీడి రాజేందర్ ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు

విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ సంజయ్ మొగుళ్ళపల్లి.

నేటి విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును సద్వినియోగం చేసుకోండి

విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ సంజయ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

నేడు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాల విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును గురువారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో టీజీ ఎన్పీడీసీఎల్ సిజిఆర్ఎఫ్ -1 చైర్ పర్సన్ వేణుగోపాల చారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ ఏఈ సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ, విద్యుత్ నియంత్రికల మార్పు, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసుల మంజూరు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కోర్టును నిర్వహిస్తామన్నారు. కావున మండలంలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

BRS పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష.

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష

ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనంలో ఈరోజు

సిరిసిల్ల నేటి ధాత్రి:

 

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ముఖ్య అతిథిగా బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

BRS & KTR

అనంతరం మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి కృప, కటాక్షం సుఖ:సంతోషాలతో ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కే.టీ.ఆర్ కోరాతు, స్వామి వారి చిత్రపటాన్ని స్వీకరిస్తూ, అనంతరం హనుమాన్ దీక్ష స్వాములతో బిక్ష కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు

ముగుస్తున్న గడువు,పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 14 వరకు ముగుస్తుందని మండల పరిషత్ అధికారులు ప్రకటించారు.దరఖాస్తు సమయం ముగుస్తున్న కొలది, దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు బుధవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా దరఖాస్తు గడువు దగ్గర పడుతున్నట్లుగా గమనించి, లబ్ధిదారులు ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా  తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version