మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె
మున్సిపల్ కమిషనర్ హామీతో విరమించిన కార్మికులు
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు కోసం అనేక పోరాటాలు చేసిన ఫలితంగా గత ప్రభుత్వం 2021 జూన్ నెలలో 11వ పి.ఆర్.సి కింద మున్సిపల్ మున్సిపల్ కార్మికుల వేతనాలను 12,000 నుండి 15600 కు నెలకు 3600 పెంచడం జరిగినది. కానీ 2022 ఫిబ్రవరి నెల నుండి కార్మికులకు పెరిగిన వేతనాలు ఇవ్వడం జరిగినది. ఎనిమిది నెలల పి.ఆర్.సి బకాయిలు రావాల్సి ఉంటే మధ్యలో చాలాసార్లు అడిగితే ఒక్కొక్క నెల చొప్పున కేవలo మూడు నెలల పి.ఆర్.సి పెండింగ్ వేతనాలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ ఐదు నెలల పెండింగ్ పి.ఆర్.సి వేతనాలు రావాలి మొత్తం 250 మంది కార్మికులకు ఒక్కో నెలకు 3600 చొప్పున ఒకరికి 18,000 చొప్పున మొత్తం 45 లక్షల రూపాయలు కార్మికులకు రావాలి. మున్సిపల్ కార్మికులు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదు అని తెలిపారు.అంతేకాకుండా గత నెలలో ఫిబ్రవరి, మార్చి నెలల రావాల్సిన వేతనాలు కూడా ఇంకా కార్మికులకు ఇవ్వలేదు అని తెలిపారు.కార్మికులకు సంబంధించి పి.ఎఫ్ , ఈ.ఎస్.ఐ మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం పాలకవర్గ గడువు ముగిసింది జిల్లా కలెక్టర్ ఇన్చార్జిగా ఉన్నారు పై సమస్యలు పరిష్కరించాలని మార్చి 4వ తేదీన కమిషనర్ గారికి , 15 రోజుల క్రితం కలెక్టర్ కి కూడా లెటర్లు ఇవ్వడం జరిగినది. ఏప్రిల్ 10 లోపు సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పనులుస్పందన లేకపోవడంతో ఈరోజు ఉదయం 5 గంటలకు పనులకు వెళ్లకుండా మున్సిపల్ ముందు బెటాయించిన కార్మికులు ఉదయం 6 గంటల వరకు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వచ్చి చర్చలు జరిపి అన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నాలుగు రోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ హామీలు మేరకు ఉదయం 8 గంటలకు విధులలో చేరిన సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు.