బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం.

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం
(నేటి ధాత్రి)
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం

 

 

 

అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో ఇటీవలే అనారోగ్య సమస్యతో అకాల మరణం పొందిన దౌపాటి మహేష్ కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. అడ్డగూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2009-10, పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.30 వేల నగదును సేకరించి అందుబాటులో ఉన్న స్నేహితులు బుధవారం మృతుడి తల్లికి అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు దౌపాటి మహేష్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి మల్లేష్, పయ్యావుల రమేష్, గూడెపు నరేష్, తాడోజు లక్ష్మణా చారి,కత్తుల నరేష్,చుక్క లోకేష్,తోట నగేష్, బాలెంల శంకర్, కప్పల మహేష్ పలువురు ఉన్నారు.

ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ వేడుకలు.

ఎన్.ఎస్.యు.ఐ 55వ ఆవిర్భావ వేడుకలు.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో
ఎన్.ఎస్. యు.ఐ 55 ఆర్బో వేడుకలు పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ వేల్పుల వేణు యాదవ్ మాట్లాడుతూ నేడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జై భీమ్, జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించడం గర్వకారణంగా ఉంది.అని అలాగే ఎన్నో సంవత్సరాలనుండి విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎన్.ఎస్.యు.ఐ నేడు 55వ ఆవిర్భావ దినోత్సవం సిరిసిల్ల పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ ఆవిర్భవ దినోత్సవం సిరిసిల్ల జిల్లా స్థాయిలో పట్టణ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రభాకర్, పద్మశాలి పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్,తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్,టోనీ తదితర కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

కుక్కలకు సోకిన రాబిస్ వైరస్.

కుక్కలకు సోకిన రాబిస్ వైరస్….

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ గ్రామంలో వీధి కుక్కలకు రాబిస్ వైరస్ సోకి చనిపోతున్నాయని పట్టణ బీజేపీ అధ్యక్షులు బసంతపూర్ రమేష్ రెడ్డి తెలిపారు. కుక్కలకి రాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి వైరస్ బారినపడకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను కోరారు. అదేవిధంగా వైరస్ సోకి మరణించిన కుక్కలను మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తొలగించాలని కోరారు.

నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల.!

నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల సాధన సమితి అధ్యక్షుడు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నూతన ఎమ్మార్వో దశరథ్ ను బుధవారం రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యపై ఎల్లవేళలా తమకు అండ ఉండాలని నూతన ఎమ్మార్వో ను రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.

మరణంలోనూ వీడని స్నేహం.

మరణంలోనూ వీడని స్నేహం…

• రోడ్డుప్రమాదం లొ ఇద్దరు نهم మృతి”

• వెంటిలేటర్ పై మరొకరికి చికిత్స

• తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు

రత్నాపూర్లో విషాద ఛాయలు

•ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

రత్నాపూర్ లో విషాద ఛాయలు..

• రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ స్నేహితులు

• ఇద్దరు మృతి, వెంటిలేటర్ పై మరొకరు

• తల్లీదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు

• మరో మృతదేహం వస్తుందేమోనని భయం భయంగా గ్రామస్తులు

• మృతులకు కన్నీటి వీడ్కోలు

• ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం: రెక్కాడితే గానీ డొక్క నిండని పరి
స్థితి వారిది.. వారి శ్రమతోనే వారి జీవితాలు ఆధారప డీ ఉన్నాయి. విధి వారి జీవితాలను ఒక విషాదభరిత మై న నాటకంగా మార్చింది. వారి శ్రమపై ఆధారపడ టం ఇష్టం లేదన్నట్టుగా వారి జీవితాలు మరింత దయ నీయ స్థితికి చేర్చి కుటుంబాలలో తీరని దుఃఖాన్ని నింపింది. ముగ్గురు స్నేహితులు మూడు రోజుల వ్య వధిలో మృత్యు ఒడిలోకి చేరుకున్న విషాద ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చోటు చేసు కుంది.

Government

గ్రామస్తులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్ర కా రం… సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం రత్నా పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీ స్నేహితులు మున్నూరు రమేష్, ఇస్మాయిల్, చాకలి బస్వరాజ్ రోజులాగే ఆదివారం ఉదయం నవ్వుతూ ఇంటి నుంచి కూలి పనికి వెళ్లారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి కూలి పనికి వెళ్లారు. పని ముగించుకుని బైక్పై తిరిగి వస్తుండగా బీదర్ జిల్లాలోని బాల్కి ఖానాపూర్ సమీపంలో వారిని వెనుక నుంచి వేగంగా వచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్మాయిల్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రోజు వారి కూలి కార్మికుడు. ఆయన తల్లిదండ్రులు ఆయన పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మున్నూరు రమేష్, చాకలి బస్వరా జును బీదర్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. రమేష్ మృ త్యువు తో పోరాడుతూ సోమ వారం తుదిశ్వాస విడి చాడు.

Government

 

మృతుడికి ఒక అ మ్మాయి ఒక అబ్బాయి ఉ న్నారు. ర మేష్ రోజు వారి కూలిగా ఉంటూ గ్రామంలోని 40 నుంచి 50 మం ది కులీ కార్మి కులకు పని కల్పించేవాడు. భార్య శ్రీదేవి కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే వా రు. ఇక మిగిలిన మరో స్నే వెంటిలేటర్పై ప్రా ణాలతో పోరాడుతున్నాడు. ఇ తడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య పుష్పమ్మ కూలి పని చేస్తుంది. ఒకరి తర్వాత మరొకరి మృతదేహాలు గ్రామానికి చేరుతుండటంతో గ్రామ స్తులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ది గ్రాం తికి గుర య్యారు. గ్రామస్తుల కన్నీటి ధార అగడం లేదు. రత్నా పూర్ లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. మృతు ల తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనా దాలు అక్క డున్న వారందరిని కంటతడి పెట్టిస్తు న్నాయి. మరో మృత దేహం వస్తుందేమోనని భయప డుతూ, ప్రాణాలతో పోరాడుతున్న బస్వరాజు ఆయుష్షు పెంచాలని గ్రామస్తులు దేవుడిని వేడుకుంటున్నారు. ఇంతటి విషాదం సంభవించినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకులు ఎవరూ స్పందించకపో వడం, వారిని పరామర్శించకపోవడం రత్నాపూర్ గ్రామస్తులను మరింత దుఃఖానికి గురిచేసింది. ఘటన కర్ణాటకలో జరగడంతో ఖానాపూర్ పరిధిలోని దన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగినందున.! 

గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగినందున సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా. 

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌక్ లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్లకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది. సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలపై వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య, మానవులకు అందుబాటులో లేకుండా ఉండడానికి బిజెపి ప్రభుత్వం చూస్తుందని అన్నారు. అలాగే సిపిఐ పంతం రవి మాట్లాడుతూ నిరుపేద ప్రజలందరికి వంట గ్యాస్ ధర ఆకాశన్ని అంటే విధంగా కేంద్ర ప్రభుత్వo పెంచుతున్నారని. దానివల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుంది అని పేర్కొన్నారు. ఈ ధర్నాలో కడారి ప్రవీణ్, పంతం రవి తదితర సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

వంతెన నిర్మాణంలో జాప్యం ఎందుకు.

వంతెన నిర్మాణంలో జాప్యం ఎందుకు.

శంకుస్థాపన చేశారు.. పనులు వదిలేశారు.?

ఇబ్బందుల్లో ప్రయాణికులు,ప్రజలు.

ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవరం సమీ పంలో వంతెన నిర్మాణంలో జాప్యం నెలకొంది.ప్రతిఏటా వర్షాకాలంలో వరద ఉద్ధృతి పెరిగినప్పుడు గ్రామానికి వెళ్లలేని పరిస్థితి. వంతెన నిర్మించి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్థులు పార్టీలకు అతీతంగా అధికా రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి నిధులు మంజూరు సాధించు కున్నా… నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎంపీ సురేష్ షె ట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు
నాలుగు నెలల కిందట పనులకు శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మా ణానికి పీఆర్ఆర్ శాఖ నుంచి రూ.3 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి కైనా త్వరితగతిన వంతెన పనులు ప్రారంభించి వర్షాకాలం నాటికల్లా పూర్తిచేస్తే ప్యాలవరం, దేవరంపల్లి, ఈదులపల్లి, దిగ్వాల్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు తొలగిపోతాయి.

అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

* అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..

* గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవు..

* అత్యాశకు పోయి అన్ లైన్ పెట్టుబడులు పెట్టొద్దు..

* రామయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్..

రామాయంపేట ఏప్రిల్ 9 నేటి ధాత్రి (మెదక్).

 

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్ గేమ్ యాప్ కి అలవాటు పడి అప్పు లపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రని, అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ యాప్లోగేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు. నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో అవగాహన లోపం వల్ల చాలామంది ప్రజలు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అవగాహన లేక అత్యాశకు పోయి ఆన్ లైన్ నందు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ప్రజలు మోసాల బారిన పడుతున్నారు.

బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు

బెట్టింగ్ యాప్ లు చాలా ప్రమాదకరమైనవి. వీటిల్లో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుంది. యాప్ నిర్వాహ కుల నుండి బెదిరింపులు వస్తాయన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపా దించవచ్చన్న భ్రమలో యువత.విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి బానిసలుగా మారి అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకొని విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లు ఆయా యాప్ నిర్వహకుల సూచనల మేరకే ఆపరేట్ చేయబడుతాయని, ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ ప్రాక్టీస్ ఉంటుంది ఫేక్
లింక్స్ తో వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు తెలుసుకొనే అవకాశం ఉన్నందున గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండా లన్నారు. ఈఅక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ఎవ రిపైనా ఉపేక్షించేది లేదని ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి. ఇటువంటి కార్యకలాపా లపై వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జి ల్లాలో సోషల్ మీడియా ఇన్ఫ్ ఎన్సర్లు బాధ్య తాయుతంగా వ్యవహరించాలని, అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారాన్ని చేయవద్దని, ఆన్లైన్ బెట్టింగ్. ఆన్లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్ తెలిపారు.

అన్నాడీఎంకేతో భాజపా పొత్తు

వైకుంఠపాళిలో అన్నామలైని పాము కాటేసిందా, నిచ్చెన వరించిందా?

తమిళ యాక్టర్‌ విజయ్‌ పార్టీ ఎవరి ఓట్లు చీల్చనున్నదో?

అన్నాడీఎంకే పొత్తు భాజపాకు అనుకూలించే అవకాశాలే ఎక్కువ

అన్నాడీఎంకేకూ భాజపా ఆసరా అవసరం

 అలయన్స్‌ వద్దన్న అన్నామలై, వచ్చే ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం చేస్తారా?

 ఛరిష్మా లేక ఇబ్బంది పడుతున్న పళనిస్వామి

 భాషావివాదాలు, డీలిమిటేషన్‌ను పట్టుకొని వేలాడుతున్న స్టాలిన్‌

 విజయ్‌ ఛరిష్మా ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అన్నామలై తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు, భాజపా నాయకత్వ పగ్గాలు చేపట్టి, అట్టడుగునుంచి 18శాతం ఓట్లు సాధించే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణలో బండిసంజయ్‌ ఎట్లానో, తమిళనాడులో అన్నామలై పార్టీకి అంత ముఖ్యం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒంటరిగా పోటీచేస్తే ఓట్లశాతం ఒక పరిమితికి పెరగవచ్చు కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఏఐడీఎంకేది కూడా ఎదురీదుతోంది. దీనికి బీజేపీ ఆసరా అవసరం. బీజేపీకి అధికారంలోకి రావడం ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు గత ఎన్నికల లెక్కలకు సంబంధించి కూడికలు తీసివేతల ప్రకారం అన్నాడీఎంకేతో పొ త్తు మాత్రమే అధికారాన్ని అందించగలదన్నది స్పష్టమైంది. అన్నామలైకి పొత్తు ఇష్టంలేదు. పళనిస్వామికి, అన్నామలై పొడ గిట్టలేదు. పార్టీ విశాలహితం రీత్యా పదవీకాలం పూర్తయిన అన్నామలై అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇదిలావుండగా తమిళ సినీస్టార్‌ విజయ్‌ ‘తమిళగ వెట్రి కజగం ట్రాన్సిల్‌’ పేరుతో పార్టీని పెట్టి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. మరి ఆయన ఏ ద్రవిడ పార్టీ ఓట్లకు గండికొట్టి కొంప ముంచుతాడో తెలియడంలేదు. ఎక్కుమంది మాత్రం ఆయన ఎంట్రీ డీఎంకేకు నష్టమన్న అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే అన్నాడీఎంకేGబీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమవుతుంది. ఇదిలావుండగా తెలంగాణలో బండిసంజ య్‌ను తప్పించినప్పుడు ఎట్లా నిరసనలు వ్యక్తమయ్యాయో, ఇప్పుడు అన్నామలై తప్పుకోవడం వల్ల తమిళనాడులో కూడా పార్టీ అభిమానుల్లో కూడా నిరసన వ్యక్తమవుతోంది. పార్టీకి ఒక దశ దిశ ఏర్పరచిన నాయకుడిని తప్పించడం ఎంతమేర సమంజసమన్న వాదనలు వినపిస్తున్నాయి. ఈ రాజకీయ వైకుంఠపాళిలో ఎవరిని నిచ్చెన వరిస్తుందో, ఎవరిని పాము కాటేస్తుందో అంచనా వేయడం కష్టం. అధ్యక్షపదవికి రాజీనామా పాము కాటుగా మారుతుందా లేక నిచ్చెన పైకి లాక్కెళుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

పొత్తుకు ఇష్టపడని అన్నామలై

2023 మార్చి నుంచి అన్నామలై, ఎ.ఐ.డి.ఎం.కె.తో పొత్తు కుదుర్చుకోవడానికి ఇష్టపడటంలేదు. ఆవిధంగా పొత్తు కుదుర్చుకోవడం రాష్ట్రంలో పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను పళంగా పెట్టడ మే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 1G1R2 అన్న సూత్రం పనిచేయదు. ఒక్కో సారి 1G1R11 కూడా కావచ్చు! గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అప్రతిహత విజ యానికి, ఎ.ఐ.డి.ఎం.కెGబిజేపీ అలయన్‌ లేకపోవడమే కారణమన్న సత్యాన్ని విస్మరించడానికి వీల్లేదు. కోయంబత్తూరులో గత లోక్‌సభ ఎన్నికల ఫలితాన్ని పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు, డీఎంకే అభ్యర్థికంటే ఎక్కువ. అంటే అలయన్స్‌లో ఉన్నట్లయితే ఇక్కడ అన్నామలై గెలిచివుండేవారని స్పష్టమవుతోంది. ఇదే పరిస్థితి మరో 12 నియోజకవర్గాల్లో కూడా కనిపించింది. 12సీట్లలో బీజేపీ ఓట్లశాతం విషయంలో ఏఐడీఎంకేను వెనక్కు నెట్టేసిన సంగతి కూడా వాస్త వం. అన్నాడీఎంఏ చరిత్రలో 7 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోవడం కూడా ఇదే ప్రథమం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ జరగబోతున్నది. మరి కొత్తగా పార్టీని స్థాపించి ఎన్నికలబరిలో దిగుతున్న సినీనటుడు విజయ్‌ ఈ రెండు ద్రవిడ పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనేది ప్రధాన ప్రశ్న. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పోటీ డీఎంకేకు లాభం చేకూరుస్తుంది. కానీ మరికొందరు మాత్రం విజయ్‌ డీఎంకే ఓట్లను చీల్చే అవకాశమే ఎక్కువని చెబుతున్నారు. ఈ చీల్చడం 15శాతం వరకు ఉంటే డీఎంకే కుప్పకూలడం ఖాయమన్నది వారి అంచనా. ఇదిలావుండగా అన్నామలై గత ఎన్నికల్లో రెండు ద్రవిడ పార్టీలను విమర్శల బాణాలతో చీల్చి చెండాడారు. అంతేకాదు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కూడా విమర్శించడం పళనిస్వామికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది కూడా. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢల్లీిలో ఆయన అమిత్‌షాను కలిసినప్పుడు, అన్నామలైను తప్పించాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పళనిస్వామి, అన్నామలై ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు మాత్రమే కాదు ఇద్దరిదీ గౌండర్‌ కులమే! తమిళనాడులో కుల రాజకీయాలు ఎంతటి స్థాయిలో వుంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ నియమావళి ప్రకారం మరోసారి అన్నామలైని రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కొనసాగించవచ్చు. కానీ ఆయనకు అన్నాడీఎంకేతో పొత్తు అస్సలు ఇష్టంలేదు. కానీ పార్టీ అధిష్టానం ఆలోచనలు వేరే వు న్నాయి. కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చే సానుకూల పరిస్థితులున్నాయి. తెలంగాణలో పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో భాగస్వామిగా వుంది. కేరళలో ఇంకా కష్టంగా ఉన్నప్పటికీ ప్రయత్నాలు మాత్రం మానడంలేదు. ఇక తమిళనాడు విషయానికి వస్తే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈసారి డీఎంకేను చావుదెబ్బ కొట్టవచ్చున న్నది ఎన్నికల లెక్కలు చెబుతున్న సత్యం. దీనికి తోడు అన్నాడీఎంకే నుంచి మరిని సీట్లు కోరవచ్చు కూడా. ఆవిధంగా అధికారంలో భాగస్వామి కావచ్చు. 

అన్నామలై భవితవ్యం?

ఇప్పుడు పార్టీ తమిళనాడు అధ్యక్షపదవికి 39 ఏళ్ల మాజీ ఐపీసీ ఆఫీసర్‌ అన్నామలై రాజీనామా తో బీజేపీ కేంద్ర వర్గాల్లో ఆయన భవితవ్యంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అన్నామలై, ఇటు మోదీకి అటు అమిత్‌షాకు అత్యంత ఇష్టుడైన యువ నాయకుడు. ఈ నేపథ్యంలో మూడు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిది ఆయనకు రాజ్యసభ సభ్యత్వం క ల్పించడం. రెండవది కేంద్రంలో ఏదో ఒక పదవి ఇవ్వడం. మూడవది పార్టీలో కీలకమైన పదవికట్టబెట్టడం. ఇందులో రాజ్యసభ సభ్యత్వం విషయానికి వస్తే, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల ఎంపీ ల విమర్శనలను గట్టిగా ఎదుర్కొనే వాక్పటిమ, విషయపరిజ్ఞానం అన్నామలైకి పుష్కలం. ఈ కా రణంగా ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశమున్నదన్నది మొదటి అంచనా. ఇక రెండవది కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వడం. ఆవిధంగా చేయడం అంత సమంజసమైన నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీని అట్టడుగు స్థాయినుంచి బీఆర్‌ఎస్‌ ఢీకొట్టే స్థాయికి తీ సుకొచ్చిన బండిసంజయ్‌ను ఆకస్మికంగా అధ్యక్ష పదవినుంచి తప్పించి కేంద్రంలో సహాయమం త్రి పదవిని ఇచ్చారు. దీంతో ఆయన పాత్ర తెలంగాణ రాజకీయాల్లో కుంచించుకుపోయింది. ఆయన్ను తప్పించిన కారణంగానే గత ఎన్నికల్లో పార్టీ సీట్లు ఆశించిన స్థాయిలో పెరగలేదన్న విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఈ కారణంగానే తెలంగాణలో బండి సంజయ్‌ను తొల గించినప్పుడు చాలా గొడవైంది.ఇప్పుడు అన్నామలై పరిస్థితి కూడా తమిళనాడులో సరిగ్గా ఇదే మాదిరిగా వుంది. అయితే తమిళనాడులో భాజపా ఎదుగుదలను ద్రవిడవాదం ఒక స్థాయికి మించి ఎదగనీయదనేది అక్షరసత్యం. రాష్ట్రంలో దాదాపు 70`80శాతం మంది ప్రజలు ద్రవిడ వాదానికే మద్దతిస్తారు. తమిళనాడులో 25శాతం ఓట్లు వచ్చినా భాజపాకు సీట్లు రావడం కష్టం. లోక్‌సభలో 18శాతం ఓట్లు వచ్చాయంటే అంటే మోదీ కోసం అనుకోవాలి. అసెంబ్లీకొచ్చేసరికి ఈ శాతం ఇంకా పడిపోతుంది. ద్రవిడ రాజకీయాలు నడిచినంతకాలం బీజేపీకి 25శాతం మించి ఓట్లు వచ్చే ప్రసక్తే లేదు. ఇది బీజేపీ నాయకత్వానికి బాగా తెలుసు. అంటే అన్నామలై ఎంతగా శ్రమించినా ఈ శాతానికి మించి ఓట్లు సాదించడం కష్టం, పార్టీ అధికారంలోకి రావ డం మాట అట్లావుంచి, సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నట్లయితే అధికారంలోకి రావడం ఖాయం. స్టాలిన్‌ తన తండ్రి మాదిరిగా ఛరిష్మా నాయకుడు కాదు, ఆయన కుమారుడు ఉదయనిధి మారన్‌ అంతకంటే కాదు! వీరిద్దరూ ద్రవిడవాదాన్ని భుజానేసుకొని నెట్టుకొస్తున్నారు. డీఎంకే నుంచి పుట్టిన అన్నాడీఎంకే పరిస్థితి అంతకంటే మెరుగ్గా లేదు. జయలలిత మరణం తర్వాత పార్టీకి నేతృత్వం వహిస్తున్న పళనిస్వామికి పార్టీని అధికారంలోకి తెచ్చే ఛరిష్మా లేదు. దీనికి తోడు పన్నీర్‌సెల్వంతో గొడవలు. బీజేపీతో పొత్తు విరమించుకోవడం వల్ల గత ఎన్నికల్లో పెద్దమూల్యమే చెల్లించాల్సి వచ్చిందన్న నగ్నసత్యం కళ్ల ముందు కదలాడుతోంది. దీనికి తోడు జయలలిత చివరిదశలో నరేంద్రమోదీ అండగా నిలవడమే కాకుండా, అన్నాడీఎంకేకు మేలు చేయడానికే కృషిచేశారు. ముఖ్యంగా శశికళ కబంద హస్తాలనుంచి పార్టీని కాపాడే క్రమంలో పన్నీర్‌సెల్వంకు భాజపా అండగా నిలిచింది. చివరకు పళనిస్వామి కూడా భాజపా చేసిన మేలును మరచిపోలేదు. మొత్తంగా అన్నాడీఎంకేకు నరేంద్ర మోదీపట్ల కృతజ్ఞతాభావం వుంది. కాకపోతే అన్నామలై కొరకరాని కొయ్యగా వున్నాడు కనుక ఆయ న్ను తప్పించాలని పళనిస్వామి కోర్కె! ఇప్పుడాయన వాంఛ నెరవేరింది. అన్నామలైని తప్పించడానికి అంగీకరించిన భాజపా, పన్నీర్‌సెల్వంతో కలిసి పనిచేయాలన్న షరతు విధించినట్టు తెలు స్తోంది. 

ఇక మూడో అంశానికి వస్తే పార్టీలో కీలక పదవి ఇవ్వడం. అన్నామలైకి పార్టీని నడిపే సామ ర్థ్యం, అద్భుతమైన వాక్పటిమ, విషయ పరిజ్ఞానం వున్నాయి. కాకపోతే ఆయన రాజకీయ ప్రొఫైల్‌ కేవలం ఐదున్నరేళ్లు మాత్రమే. పార్టీలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే కొందరికి 30 ఏళ్లు, 40ఏళ్లు మరికొందరికి జీవితకాలం పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ అనుభవం కంటే, ఛరిష్మాతోపాటు, తన ఆకర్షణశక్తిని ఓట్లుగా మార్చే సామర్థ్యమున్న నాయకుడు పార్టీకి అవసరమవుతా రు. ప్రస్తుతం జాతీయస్థాయిలో బీజేపీ అధ్యక్షుడి పదవీకాలం ముగియడంతో నడ్డా తప్పుకోవడంఖాయం. మరి ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? నితిన్‌ గడ్కరీ అంగీకరించరు. రాజ్‌నాథ్‌సింగ్‌కు వయసైపోయింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ ఛరిష్మా మహారాష్ట్రకే పరిమితం. వీటితోపాటు ఇప్పుడు బీజేపీ పరంగా ఆలోచిస్తే ఉత్తరభారత దేశంలో, ఓట్లు, సీట్లు సాధించే విషయంలో ఒక సంతృప్తస్థాయికి చేరుకుంది. అంటే అక్కడ తిరుగులేని స్థాయిలో స్థిరంగా వుంది. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హేమంత్‌ బిశ్వాస్‌ శర్మ నాయకత్వంలో పూర్తిగా బలపడిరది. ఇప్పుడు పార్టీ బలపడాల్సింది దక్షిణ భారతదేశంలో. దక్షిణాదిలో భాజపాకు ఉత్తరాది పార్టీ అన్న ముద్ర పడిపోయింది. ఈ అపప్రధ తొలగించుకొని దక్షిణాదికి కూడా తాము ప్రాధాన్యమిస్తామన్న అంశాన్నిపార్టీ నిరూపించుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో కూడా ఈ రాష్ట్రాల్లో పార్టీ పెద్దగా బలపడలేదు. ఇప్పుడు అన్నామలై యువనేతగా, ఛరిష్మా కలిగినవాడిగా, ద్రవిడ రాజకీయాలను ఎదుర్కొనే సామర్థ్యం వున్న వాడిగా నిరూపించుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అధ్యక్షపదవి ఇవ్వడం ద్వారా పార్టీ అధినాయకత్వం ఒక ప్రయోగం చేయవచ్చు! ఆవిధంగా చేయడం ద్వారా తమ పార్టీలో సామర్థ్యమున్నవారెవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునన్న బలమైన సంకేతాలను ఇవ్వవచ్చు. ఒక తమిళుడిగా, కేరళ రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేయగలరు. ఇన్ని లక్షణాలున్నా, ఇన్నిసానుకూలతలున్నా, మోదీ`అమిత్‌ షా ద్వయం తమకు అత్యంత ఇష్టుడైన అన్నామలైకి ఇంతటి బృహత్తర బాధ్యత ఇచ్చే సాహసం చేస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. 

పొత్తు లెక్కలు

గత లోక్‌సభ ఎన్నికల్లో ఎ.ఐ.డి.ఎం.కె.కి తమిళనాడులో వచ్చిన ఓట్లు 23శాతం. భాజపాకు 18 శాతం. అదే డీఎంకేకు 46శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 23G18 శాతాలను కలిపితే 41శాతం అవుతుంది. ఒక ఐదారుశాతం ఓట్లు సంపాదించగలిగితే డీఎంకేను మట్టికరిపించవచ్చు. ఇది పొత్తుకు ప్రధాన కారణం. మరి అన్నామలై పార్టీని జీరో స్థాయినుంచి ఆ స్థాయికి పెంచారు. ఒక బేస్‌ ఏర్పాటుచేశారు. కానీ ఆయనకు కొన్ని పరిమితులున్నాయి. ఎంతగొప్పగా చదువుకు న్నా, తమిళనాడుకు వచ్చేసరికి ద్రవిడియన్‌ రాజకీయాల్లోకి మారిపోతారు. అంటే యాంటీ హిందీ, యాంటీ నార్త్‌, యాంటీ బిహార్‌ గురించి మాట్లాడుతుంటారు. అన్నామలై ఆవిధంగా సంకుచితంగా ఆలోచించే మనిషి కాదు. చాలా విస్తృతమైన ఆలోచనా పరిధి వున్నవాడు. ఇక్కడ తమిళుల్లో ఒక గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఇతర ప్రాంతాలకు చెందినవారిని కూడా రాష్ట్రనాయకత్వాన్ని చేపట్టడానికిఅవకాశం ఇస్తారు. ఉదాహరణకు ఎంజీఆర్‌ మళయాళీ, జయలలిత కర్నాటకకు చెందినవారు.డీఎంకే నుంచే ఏఐడీఎంకే పుట్టింది. రజనీకాంత్‌ది మహారాష్ట్ర. అదేవిధంగా స్టాలిన్‌ పూర్వీకులు నెల్లూరు ప్రాంతంవారు. వైగో పూర్వీకులు కూడా ఆంధ్రప్రాంతం వారే! అంటే తమిళనాడులో వేరే ప్రాంతం నాయకత్వాన్ని ఆమోదించే సంస్కృతి కొనసాగుతోంది. ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ముఖ్యమంత్రులైన ద్రవిడ పార్టీన నాయకులంతటి స్థాయి హై ప్రొఫైల్‌ నాయకుడు అన్నామలై కాకపోయినా మంచి ప్రభావాన్ని మాత్రం సృష్టించగలిగారన్నది అక్షరసత్యం.

మండలంలో భారీ కుండపోత.

పెద్ద మొత్తంలో ఎదురుగాలు, ఉరుములు మెపులు.

ఎక్కడి ఆక్కడే,ఆగిన జనం,చీకటి మయంలో మండలం.

మహదేవపూర్- నేతి ధాత్రి:

ఒకేసారి వాతావరణం మార్పుతో వేడికి ఆట్టుడుకుతున్న మండలం 7: గంటల సమయం అనుకోని రీతిలో భారీ ఎదురుగాలు ప్రారంభమై కొద్దిసేపు వ్యవస్థను అతలాకుతలం చేసింది.పెద్ద మొత్తంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడం మొదలుపెట్టింది. పెద్ద మొత్తంలో ఎదురుగా గాలులు సుమారు అరగంట పాటు గీయడంతో, పాదాచారులు వాహనదారుల్లో నడవలేక ఎక్కడి వారు అక్కడే ఆగిపోవడం జరిగింది. ఎదురుగాలులు వీస్తున్న క్రమంలోనే భారీ మెరుపులు ఉరుములతో కుండపోత వర్షం ప్రారంభమైంది. ఉమ్మడి మండలంలో ప్రస్తుతం ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కొనసాగుతుంది.

గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ.

జిల్లెల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ…

 

తంగళ్ళపల్లి నేటి దాత్రి

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రవీణ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐసీసీ. పీసీసీ. పిలుపు మేరకు తంగళ్ళపల్లి మండల జిల్లాల గ్రామం లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగిందని. రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రజాస్వామ్య విలువతో కూడిన లౌకిక వాదం వర్ధిల్లాలంటూ వాడ వాడలా నినాదాలతో పాదయాత్ర కొనసాగిందని. బిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చీకటి ఒప్పందంతో చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని .గత పది సంవత్సరాలు చేసిన దోపిడిని అహంకారంతో కొనసాగించిన పాలన ఎండగడుతూ శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడిని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశలను అమలు చేయాలంటూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరూ సిత్త శుద్ధితో అంకితభావంతో కృషి చేయాలని గ్రామ చౌరస్తాలో గ్రామస్తుల అందరి చేత ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్ చిలుక రమేష్ కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొనడం జరిగింది

బంగారు వార్తలన్నీ గిల్టువేనా?

`మార్కెట్‌ మాయాజాలం… సామాన్యుడికి సుడిగుండం.

`జనాలను మోసం చేయడానికే!

`ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే?

`గత ఆరు నెలల్లో విపరీతంగా పెంచేశారు.

`దసరా పండుగకు ముందు 75వేలు.

`దిగుమతుల సుంకాలను తగ్గించడంతో రూ.69 వేలకు వేరింది.

`ఆరు నెలల్లోనే మళ్ళీ 90 వేలకు ఎందుకు చేరింది?

`విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆపాలని సుంకం తగ్గించారు.

`మరింతగా ధర తగ్గనైనా తగ్గాలి.

`బంగారం ధరలు స్థిరంగానైనా వుండాలి.

`అమెరికా దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం ధర తగ్గుతోందనేది నిజమా?

`మనమే టన్నుల కొద్ది బంగారం దిగుమతి చేసుకుంటున్నాం.

`మన దేశం నుంచి అమెరికాకు బంగారం ఎగుమతి చేస్తున్నామా?

`ఈ లెక్కలు నమ్మశక్యంగా వున్నాయా?

`పావలా తగ్గించి రూపాయి పెంచడం అలవాటు చేసుకున్నారు.

`ధరల నియంత్రణ ప్రభుత్వం వదిలేయడంతో ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి.

`2000 సంవత్సరంలో బంగారం తులం ధర. రూ. 4 వేలు.

`2015 వరకు పదిహేళ్లలో పెరిగిన ధర రూ. 24 వేలు.

`ఈ పదేళ్లలో చేరిన ధర సుమారు రూ. 90 వేలు.

`పదేళ్లలో బంగారం ధర ఎందుకు ఇంత పెరుగింది!

`సామాన్యలకు అందకుండా ఎందుకు పైపైకి వెళ్తోంది.

`ప్రజలలో కొనుగోలు శక్తి లేనప్పుడు ధరలు తగ్గాలి.

`ఎగుమతులు చేసేంత బంగారం మన వద్ద వుంటే మనకు చౌకగా దొరకాలి.

`ఏది నిజం.. ఏది అబద్దం!?

మెరిసేదంతా బంగారం కాదు..బంగారం ధరలు దిగివస్తున్నాయ్న వార్తలో నిజం అసలే లేదు. వ్యాపారులు ఆడుతున్న నాటకాలు. జనం జేబులకు చిల్లు పెట్టే కుట్రలు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు వేస్తున్న ఎత్తులు. ఎందుకంటే గతంలో బంగారం కొనుగోలు, వస్తువుల తయారి అనేది వృత్తిగా మాత్రమేవుండేది. ఇప్పుడు అది వ్యాపారమైపోయింది. వేల కోట్లు పెట్టుబడి పెట్టి, షాపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటి నిర్వహణ, లాబాలు ఎప్పటికిప్పుడు రావాలి. ఆ షాపుల్లో పనిచేసే లక్షలాది మందికి జీతాలు చెల్లించాలి. ఇలా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలి. ఇదంతా జనం మీద మాత్రమే రుద్దాలి. ఇదీ బంగారం మార్కెట్‌ చరిత్ర. బట్టల షాపులో పనిచేసే వ్యక్తికి, బంగారం షాపులో పనిచేసే కార్మికుడికి ఒకే రకమైన జీతం వుంటుంది. బట్టల వ్యాపారం చేసే వారికి వచ్చే లాభాలకు, బంగారు వ్యాపారులకు వచ్చే లాభాలకు చాలా తేడా వుంటుంది. ఒక నగరంలో వేలాది బట్టల దుకాణాలుంటాయి. కాని బంగారం దునాలు పదులు సంఖ్యలోనే వుంటాయి. కాని బంగారం వ్యాపారం బంగారమే..కాని జనం కొంటేనే అది నిజమైన బంగారం వ్యాపారం. సహజంగా ధర పెరిగిందంటే ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గుతుంది. వారి కోరికలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటుంటారు. ధర తగ్గకపోతుందా? అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి కోసం అప్పుడప్పుడు బంగారు వ్యాపారులు ఇలాంటి వార్తలు సృష్టిస్తారు. పావలా తగ్గించి, బంగారం ధరలు ఢమాల్‌ అని ప్రచారం సాగిస్తుంటారు. కాని బంగారం ధరలు పెరిగినప్పుడు మాత్రం స్పల్ప పెరుగుదల అని వార్తలు రాయిస్తారు. తగ్గినప్పుడు పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌ అంటారు. బంగారు వార్తలన్నీ గిల్టువే..జనాలను మోసం చేయడానికి వేస్తున్న ఎత్తులే.. ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే. ఆరు నెలల్లో బంగారం ధర విపరీతంగా ఎందుకు పెరిగింది. అంతగా డిమాండ్‌ ఏర్పడితే పెంచారా లేక, మార్కెట్లు పెంచుకునేందుకు లేని లెక్కలు చూపించారా? సగటు వ్యక్తి రోజు తినడానికే సంపాదించింది చాలడం లేదు. రోజంతా కష్టం చేసినా వెయ్యి రూపాయలు రావడం లేదు. పట్టణ ప్రజల జీవితాలు మరీ దుర్భరంగా మారుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే లివింగ్‌ కాస్ట్‌ చాలా తక్కువ అనే పేరుండేది. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో నుంచి వెళ్లే వారు ఎవరూ హైదరాబాద్‌లో బతికే పరిస్దితి లేదు. చేసే పనులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. నివాసముందామంటే అందుబాటులో ఇళ్ల కిరాయలు లేవు. పూట ఎట్లా గడుస్తుందిరా దేవుడా? అని బాధపడే సగటు వ్యక్తికి బంగారం ఆకాశమంత ఎత్తుగా కనిపిస్తుంది. అలాంటి బంగారాన్ని అందుకోవాలన్న ఆశ కూడా ఎప్పుడో చంపుకున్నారు. సగటు ఉద్యోగులు కూడా బంగారం కొనుగోలు చేసే శక్తిలో లేరు. మరి ఎవరు కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? ఇదంతా మార్కెట్‌ మాయాజాలం అంతే..మొన్నటి వరకు బంగారం ధరలు రాకెట్లలా దూసుకుపోయాయి. సరిగ్గా గత దసరా పండుగ సమయంలో తులం 24 క్యారెట్‌ బంగారం ధర రూ.43వేల వరకు వుంది. అదే సమయంలో దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా తులం బంగారం ధర రూ.5వేలకు వరకు పడిపోయింది. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. జనాన్ని నమ్మించారు. ఆలోచించినా ఆశాభంగం అన్నట్లు ప్రచారం సాగించారు. ఒక రకంగా చెప్పాలంటే జనం ఎగబడి కొన్నారు. అంటే వారిలో కొనుగోలు శక్తి వుండి కాదు. సామాన్యుడికి రూ.5వేల ధర తగ్గడం అంటే ఎంతో ఊరట చెందే అంశం. అలా కొంత కాలం కాగానే బంగారం ధర పైపైకి ఎగబాకింది. రూ.90వేలు దాటింది. ఇలా బంగారం ధరలను రూపాయి పెంచడం, పావలా తగ్గించడం జనాన్ని నమ్మించి ముంచడం తప్ప బంగారం వ్యాపారంలో నిజాయితీ లేదు. ఇకతాజాగా అమెరికా సుంకాలను పెంచడం మూలంగా మనదేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయని ప్రచారం సాగిస్తున్నారు. ఏటా మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బంగారం మనదేశంలోనే అమ్ముకుంటేనే మేలు అని వ్యాపారులు జనం మీద దయతలిచి తగ్గించారని ఓ రకమైన ప్రచారం. అసలు మనదేశమే గత ఏడాది లండన్‌ నుంచి సుమారు 400 కోట్ల టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మన అవసరాలు తీరేందుకే ఆ బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం తెప్పించింది. మరి మన దేశ అవసరాలకే సరిపోకుండా వుంటే, అమెరికాలకు ఎలా ఎగుమతి చేస్తున్నట్లు? ఎందుకు చేస్తున్నట్లు? అదే నిజమైనే తలె అమ్ముకొని చెప్పులు కొనుక్కొవడమే అవుతుంది. మనకు లండన్‌ నుంచి చౌకగా బంగారం అందితే మన దేశ ప్రజలకు అందించాల్సిన అవసరం వదిలేసి, విదేశీ మారక ద్య్రవ్యంకోసం ఏ ప్రభుత్వమైనా చూస్తుందా? సహజంగా మనకు మిగులు వున్నప్పుడు, ఇతర దేశాలలో వారికి అందుబాటులో లేని వస్తువులను ఎగుమతులు చేస్తే విదేశీ మారక ద్రవ్యం సమృద్దిగా వస్తుంది. మనదేశం కంటే అమెరికాలోనే బంగారం చౌక. అలాంటిది అంతకన్నా చౌకగా అమెరికాకు ఎగుమతి చేస్తేనే ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అంతే కాని మనదేశం చెప్పిన ధరకు అమెరికానే కాదు, ఏ దేశం కొనుగోలు చేయదు. ఇదంతా మార్కెట్‌ వర్గాలు ఆడుతున్న వింత నాటకం. గత దసరా సమయంలో రూ.75వేల వరకు పలికిన తులం బంగారం ఎందుకు రూ.90వేల వరకు చేరింది. ఆరునెలల సమయంలో ఇంతగా ధర పెరగడానికి, పెంచడానికి కారణం ఏమిటి? బంగారం వ్యాపారంలో జరుగుతున్న మోసాలపై ప్రభుత్వ నియంత్రణ లేకనా? లేక ప్రభుత్వ ఉదాసీనత? ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. వారికి అన్ని వస్తువులు అందుబాటులో వుండేలా విధానాలు రూపకల్పన చేయాలి. నిజం చెప్పాలంటే మనదేశంలో మధ్య తరగతి లేకుంటే దేశమే ఆగమౌతుంది. అలాంటి మధ్య తరగతిని వ్యాపారులు, ప్రభుత్వాలు చిదిమేస్తున్నాయి. జీవిత కాలం కోలుకోకుండా చేస్తున్నాయి. వారి పొదుపును ద్వంసం చేస్తున్నారు. రూపాయి రాక, పోకల మధ్య సున్నా బ్యాలెన్స్‌ కనిపించేలా చేస్తోంది. నెల గడవక ముందే అప్పుల పాలయ్యేలా ప్రభుత్వ విధనాలున్నాయి. గతంలో ఇలాంటి పరిస్ధితులు ఎప్పుడూ లేవు. ఎందుకంటే 2000 సంవత్సరంలో బంగారం ధర తులం. రూ.4000. అది ఏడాదికి కొంత పెరుగుతూపెరుగుతూ 2015వరకు రూ.25 వేలకు చేరింది. అంటే బంగారం ధరల్లో స్ధిరత్వమే కనిపించింది కాని, ఉద్దాన పతనాల ప్రభావం ప్రజల్లో పెద్దగా పడలేదు. కాని 2015 నుంచి 2025 వరకు ఆ ధర రూ.90 వేలకు చేరింది. అంటే పదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. మరి ప్రజల జీతబత్యాలు పెరుగుతున్నాయా? వారి ఆదాయం పెరిగిందా? లేదు. కాని వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటున్నాయి. అంతే కాకుండా జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ దోడిపీ మరింత పెరిగింది. దేశమంతా ఒకటే పన్ను విధానం అంటే ధరలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కాని ఏం జరగింది. రివర్స్‌లో ధరలు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఆగడం లేదు. తగ్గడం లేదు. పెరగని జీతాలు, సంపాదనలతో పెరుగుతున్న ధరలను చూసి జనం విలవిలలాడుతున్నారు. ధరలు చూసి బేంబెలెత్తిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. ఇది ఒక్క బంగారానికే కాదు, అన్ని రకాల వస్తువుల ధరలు ఇలాగే ఆరోహన క్రమంలో ఎవరెస్టు శిఖరాన్ని తాకుతున్నాయి. అసలు ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు ఏ వస్తువు దరలైనా తగ్గాలి. లేకుంటే కొంత కాలం స్ధిరమైన ధరలే వుండాలి. డిమాండ్‌ అండ్‌ సప్లై అనే సూత్రం ఇక్కడ ఎక్కడా వర్తించడం లేదు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ హయాంలో బ్యాంకుల్లో వున్న బంగారం అమ్ముకున్న చరిత్ర వుంది. ఆప్పట్లో దీనిపై పెద్ద వివాదాలు కొనసాగాయి. అంటే ప్రపంచంలోని దేశాలైనా బంగారు బాండ్లను కొనసాగిస్తుంటాయి. టన్నుల కొద్ది బంగారం రిజర్వు బ్యాంకు కొనుగోలు చేసి, అత్యవసర ఆర్ధిక పరిస్ధితుల కోసం నిలువ చేస్తుంది. దేశంలో ద్రోవ్యోల్భనం పెరిగినప్పుడు దాని అసవరం వుంటుంది. కాని కరోనా కాలంలో ప్రపంచ దేశాలన్నీ దివాళా తీసినా, మనదేశంలో ద్రవ్యోల్భనం రాలేదు. ఆకలి కేకలు వినిపించలేదు. అంటే ఇన్ని కోట్ల జనాన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయి. అలాంటప్పుడు ఇలా కళ్లెం లేని గుర్రాల్లా ధరలు పెరిగిపోతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు. బంగారం ధరలు తగ్గుతాయన్న మాటలు నమ్మి, జనం ఎలా, ఎలా అని ఆలోచిస్తున్నారు. కాని నిజానికి బంగారం ధర ఒక్కసారి పెరిగిందంటే తగ్గడం అంటూ వుండదు. కాని హెచ్చు తగ్గుల్లో స్వల్ప తేడాలే గాని, ఉన్న ఫలంగా ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వుండవు.

జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ.

జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

 

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని గోధుర్ మరియు ఇబ్రహీంపట్నం పశు వైద్యాశాలలను జిల్లా పశువైద్యాధికారి డా, వేణుగోపాల్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భారత పశు గాణన గురించి పశువైద్య సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల పశు వైద్యాధికారి డా, శైలజ, పశు వైద్య సిబ్బంది జమున, రవితేజ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి.

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి.

డి ఎస్ పి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మహారాజ్.

చిట్యాల, నేటిధాత్రి :

 

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ వి శారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున పదివేల కార్లతో అదిలాబాదులో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్, జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్, చిట్యాల మండల అధ్యక్షులు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి, నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టే వాడ కుమార్, నవాబ్ పేట గ్రామ అధ్యక్షులు చిలుముల శశి కుమార్,గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ మరియు బొడ్డు పాల్ చరణ్ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు.

కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు
అడ్డుకున్న పోలీసులు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడినట్లేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నేతలకు తోపులాట జరగగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావం అయ్యింది.కొంతమంది కిందపడగా వారికి దెబ్బలు తగిలాయి. ఆందోళన చేస్తున్నంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చమరు ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని, అర్ధరాత్రి వంటగ్యాస్ యాభై రూపాయలు పెంచి పెదాలపై భారం మోపి పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెంచి వీటిని ఆయా కంపెనీలే భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమని, ఏదో ఒక రోజు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచదనే గ్యారంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానిగా పదకొండు సంవత్సరాలు గడిచిపోయిందని పదకొండు సంవత్సరాలలో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పెను భారం మోపడానికి అనేకసార్లు పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని, పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని అలాంటి విధానాలకు మోడీ స్వస్తి పలకాలని,తక్షణమే వంటగ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించక తప్పదని వెంకటస్వామి హెచ్చరించారు. వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు శాంతియుతంగా కమాన్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించడానికి అక్కడకు చేరుకున్న సీపీఐ నాయకులపై, కార్యకర్తలపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి, దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, ముఖం కనబడకుండా మాస్కులు వేసుకొని ఆర్ఎస్ఎస్,బిజెపికి తొత్తులుగా కొంతమంది వ్యవహరిస్తూ నాయకులపై, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడాన్ని సీపీఐ ఖండిస్తుందని, పేద ప్రజలకు అండగా సీపీఐ నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని, పోలీసులు ఈవిషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించాలని వెంకటస్వామి అన్నారు. ఈఆందోళన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, సాయవేణి రాయమల్లు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, నాయకులు కొట్టే అంజలి, చెంచల మురళి, తంగెళ్ళ సంపత్, చారి, రాజు, కూన రవి,నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ చెరుకు రసంతో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్..

సేంద్రియ చెరుకు రసంతో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్

పట్టణంలో సేంద్రియ చెరుకు అమ్ముతున్న ఓ యువకుడు

పరకాల నేటిధాత్రి

ఎండాకాలం ప్రారంభం అయిన తరుణంలో పట్టణంలో ఓ యువకుడు సేంద్రియ చెరుకు రస వాహనాన్ని తిప్పుతూ దానియొక్క పోషక విలవల గురించి వివరిస్తూ తక్కువ దరకే సేంద్రియ చెరుకు రసాన్ని అమ్మకం చేస్తున్నాడు.ఇంతకు మునుపెప్పుడు పట్టణంలో ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సేంద్రియ చెరుకు రసం విక్రయించింది లేదని సేంద్రియ చెరుకు రసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల అన్ని వయసుల వారికి కూడా ఎంతో మంచిదని,కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి చెరుకు రసం మేలు చేస్తు శరీరంలో ప్రొటీన్ లెవెల్స్ ను పెంచుతుంది.లివర్ సమస్యలు ఉన్నవారు అన్ని పోషకాలున్న ఈ డ్రింక్ తాగడం వల్ల అలసట వెంటనే మాయమవుతుంది ఒంట్లో వేడిని చిటికెలో తగ్గిస్తుందని జీర్ణక్రియను సులభతరం చేయడంలోనూ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.చర్మ సమస్యలు, డల్ స్కిన్ ఉన్నవారు చెరుకు రసం తీసుకోవడంలో ఫలితం ఉంటుందని రక్తహీనతతో బాధపడే వ్యక్తులకు ఇది ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తు యాంటీ ఆక్సిడెంట్స్ ను కూడా అందిస్తుందని ఇలాంటి ఉపయోగకర వ్యాపారాన్ని నిర్వరిస్తునందుకు ఆ యువకున్ని ప్రజలు అభినందిస్తున్నారు

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి

 

 

ఓదెల మండలంలోని పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకంలో విద్యార్థులకు భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో సుమారు 50 కి పైగా విద్యార్థులు హాజరు కాగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారని తెలిపారు. వాళ్లకు సందర్భంగా హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని సమాధానం బదులిచ్చారు.కానీ విద్యార్థులు మాకు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందించి అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాలమాజీ ఎంపీపీ ముక్తిసత్యం,గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

మండలంలో సోమవారం రాత్రి గాలి, దుమ్ముతోకురిసిన భారీ వర్షానికి మండలంలో పంటలు, ఇల్లులు, కరెంటు స్తంభాలు కూలిపోయాయని ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మండల తహసిల్దార్ ఇమ్మానియేల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ మండలంలో వందలాది ఎకరాల్లో పంట నేలమట్టం అయిందని, అనేక చోట్ల ఇల్లు కూలిపోయాయని, విద్యుత్ ట్రాన్స్ఫారాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అన్నారు.
మొక్కజొన్న నష్టపోయిన రైతుకు ఎకరాకు 50 వేలు, మిర్చి ఎకరాకు లక్ష రూపాయలు, వరి పంటకు 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మండలంలో కొడవటంచగ్రామంలో వర్షం కు దెబ్బతిన్న పంటను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యా సారపు వెంకన్న, పర్శక రవి, మానాల ఉపేందర్, బానోతులాలు, వాగబోయిన సుందర్రావు, వాగబోయిన బుచ్చయ్య, ఎట్టి సుధాకర్, ఇసం రమేష్, ఇసం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

కిసాన్ పరివార్ అధినేత జన్మదిన వేడుకలు..

కిసాన్ పరివార్ అధినేత జన్మదిన వేడుకలు

కనివిని ఎరుగని రీతిలో ప్రజాసేవకుడి జన్మదిన వేడుకలు

– దంతాలపల్లి మండలంలో ఘనంగా భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలు.

– ప్రజానీకంలో అశేష ఆధారణ పొందుతున్న యువ నేత భూపాల్ నాయక్.

మరిపెడ/దంతాలపల్లి నేటిధాత్రి.

 

ప్రజా సేవకుడు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కిసాన్ పరివార్ సేవా సంస్థ వ్యవస్థాపకులు నానావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామ అమ్మ ఒడి అనాధ శరణాలయంలో యువ దళపతి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.. అనంతరం వృద్ధులకు పండ్లను అందజేయడం అందజేసినారు.. అలాగే భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను ఆగపేట గ్రామ ఉపాధి హామీ కూలీలు,వాల్య తండా లో యువకులు,బిరిశెట్టి గూడెం లో భూపాల్ నాయక్ అభిమానులు,రేఖ్య తండాలో శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు..దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది…. దంతాలపల్లి మండలంలో బాణసంచాలు కాల్చి భూపాల్ నాయక్ జన్మదిన వేడుకల సంబరాలు జరుపుకున్నారు…పెద్ద ముప్పారం అనాధ ఆశ్రమ ఇంచార్జ్ మాట్లాడుతూ అనాధాశ్రమాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని,కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ కు మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. రైతుల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడు,రైతు సంక్షేమం,అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే ప్రజా సేవకుడు భూపాల్ నాయక్ అని అన్నారు..గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పక్షాన నిలబడి మద్దతు తెలిపారని గుర్తు చేశారు.. పల్లెల్లో పలకరింపు కార్యక్రమంలో ఆగపేట ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేసి,ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని పనులు చేయాలని సూచించారన్నారు.ఈ కార్యక్రమంలో మూడవత్ రవి నాయక్,ప్రవీణ్ కుమార్,యాకుబ్ నాయక్,పోలేపక మధు,ధర్మారపు సందీప్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి.

స్కూల్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. 

పాఠశాలలు ప్రారంభమై 9 నెలలు గడిచిన రూపాయి రాని పరిస్థితి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ వర్కర్లకు 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఉన్నాయని వాటిని వెంటనే ఇవ్వాలని బిఆర్టీయి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ పేరుతో విద్యా సంవత్సర ప్రారంభంలో కమిటీ తీర్మానం ప్రకారం స్కూల్ స్వీపర్లను నియమించుకుందని అప్పటినుండి నేటికీ 9 నెలలు గడిచయాన్నారు. వేసవి సెలవులు వచ్చే సరికి కూడా ఒక్క పైసా రాలేదని విద్యార్థుల సంఖ్య కనుగుణంగా జీరో నుండి 30 మంది విద్యార్థుల సంఖ్య ఉంటే 3 వేలు, 30 నుండి 60 మంది ఉంటే 6 వేలు,60 కి పైగా ఉంటే 12 వేల వేతనాలు వేతనాలు ఇస్తామని నియామకం చేసుకుని ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్న 3000 రూపాయలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలల నుండి జీతాలు లేకుండా పనిచేస్తే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని అన్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి జీవో ప్రకారం పెండింగ్ వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వర్కర్లు గొర్రె విజయ, రమాదేవి లక్ష్మి, ఖతాజీ మౌనిక, విజయ, సుజాత, పూజిత, బేతం రేణుక, బేబీ ,ఎల్లమ్మ, కనకమ్మ, జయలక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version