నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్.

నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ నూతన తహశీల్దారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మల్గి గ్రామానికి భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మార్వో ప్రభులు సార్ గారికి సన్మానించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మైనార్టీ నాయకులు అఖిల్ మియా తదితరులు పాల్గొన్నారు.

భూ భారతి రేవన్యూ సదస్సు.

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మార్వో విజయలక్ష్మి

పరకాల నేటిధాత్రి

 

 

 

భూ భారతి రేవన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు.

సోమవారం రోజున మండలంలోని మల్లక్కపేట గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించిందన్నారు.

MRO Vijayalakshmi.

 

రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భూ సమస్యల పరిస్కరిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి సుమలత,జూనియర్ అసిస్టెంట్ రాజు,రెవన్యూ సిబ్బంది,కారోబార్ వెనుకమూరి ఆనందరావు, స్థానికులు పాల్గొన్నారు.

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవేడుకలు.

కల్వకుర్తిలో ఘనంగా..హిందూ సామ్రాజ్య దినోత్సవేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సోమవారం 1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.
శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ, జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.

పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య.

పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

మండల విద్యాధికారి కాలేరు యాదగిరి

2025 పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చూపిన పెనుగొండ ఉన్నత పాఠశాల విద్యార్థికి సన్మానం:

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలోని ప్రభుత్వ పాఠశాల అయినటువంటి పెనుగొండ ఉన్నత పాఠశాలలో చదివి 549 మార్కులు సాధించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల యశ్వంత్ సాయిని మరియు అతని తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కేసముద్రం మండల విద్యాధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన మండల శ్రీను, సరస్వతి దంపతుల కుమారుడు యశ్వంత్ సాయి చిన్నప్పటి నుండి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవాడని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేయుటకు ఈ విద్యార్థి సాధించిన మార్కులే నిదర్శనమని తెలియజేశారు. అదేవిధంగా తల్లిదండ్రులందరూ ఆలోచించి పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని అందుకు మా ప్రభుత్వ పాఠశాలలు ముందు ఉంటాయని తెలియజేశారు. జడ్పిహెచ్ఎస్ పెనుగొండ పాఠశాలలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలియజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ పెనుగొండ పాఠశాలలో అత్యుత్తమమైన విద్యా బోధన మా పిల్లలకు అందుతుందని మా పిల్లల్ని తల్లిదండ్రుల వలె ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణలో చదువు నేర్పుతున్నారని చెప్పారు. ఈ సన్మాన సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అంజయ్య, హుస్సేన్, వెంకటగిరి, భాస్కర్, సత్యం, రవి, భీముడు, కిషన్, మల్లేశం, విజయ్ చందర్ మరియు అప్పరాజుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన సభను విజయవంతం చేశారు.

పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున.

పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున కలెక్టర్ వినతి పత్రం అందజేత

మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో కెసీఆర్ హయాంలో ప్రతిష్టా త్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని నరికి వేసి అక్కడ గ్రామపంచాయతీ భవనం నిర్మించుటకు అధికా రులు సిద్ధమై గ్రామస్తులు వద్ద ని మొరపెట్టుకున్నా కొందరి కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్ల శంకుస్థాపన కూడా పూర్తి చేశారు.గతంలో గ్రామపంచా యతీ భవన నిర్మాణానికి ఎమ్మార్వో పరిశీలించి నిర్ధారణ చేసిన 0.06 గుంటల కాళీ స్థలం పల్లె ప్రకృతి వనానికి పక్కనే ఉన్నందున గ్రామస్తుల కోరిక మేరకు ఆ స్థలంలోనే నిర్మించాలేతప్ప పల్లె ప్రకృతి వనాన్ని నాశనం చేయకూడ దని గ్రామస్తుల సహకారంతో కలెక్టర్ వినతి పత్రం అందజే సిన మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి.ఈ కార్యక్రమంలో జాలిగాపు అశోక్, ఎండి మగ్దున్ పాషా, పోతు రమేష్, పెరుమాండ్ల కుమారస్వామి, సప్పిడి పోషాలు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం.

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…

ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ షర్ట్ ధరపై చర్చ

అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ షర్ట్ ధరపై చర్చ

 

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తాజాగా అఖిల్ అక్కినేని(Akhil Akkineni) రిసెప్షన్ లు కుటుంబ సమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాడు. మహేష్ తో పాటు నమ్రత(Namrata) , సితార కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అఖిల్- జైనబ్ వివాహం జూన్ 6 న జరిగిన విషయం తెల్సిందే. ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా ఈ వివాహం జరిగింది. ఇక జూన్8 న వవీరి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు.

 

ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఎంతో సింపుల్ గా కనిపించినా.. అందరి చూపు మహేష్ పైనే ఉంది అని చెప్పొచ్చు. ఇక మహేష్ ధరించిన టీ షర్ట్ ను చూసి ముచ్చటపడిన అభిమానులు.. అలాంటి టీ షర్ట్ నే కొనడానికి, దాని రేటు ఎంత అని గూగుల్ చేసి ఖంగు తిన్నారు.

ఆలివ్ గ్రీన్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ తో ఉన్న టీ షర్ట్ హెర్మ్స్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ తయారుచేసింది. దీని విలువ అక్షరాలా రూ. 1.51 లక్షలు. నమ్మడానికి వీలు లేకున్నా అది నిజం. అది సూపర్ స్టార్ రేంజ్. మొదటి నుంచి మహేష్ బయటకు చాలా సింపుల్ గా వచ్చినా చాలా కాస్ట్లీ దుస్తులు ధరిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ లు ఇస్తూనే ఉంటాడు. ఇక టీ షర్ట్ ధర లక్షల్లో ఉండడంతో నెటిజన్స్.. ఆమ్మో ఒక్క టీ షర్ట్ ధర అంతనా అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.

ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..

ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..ఎవరూ అదైర్యపడొద్దు

పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, పత్రాల పంపిణీ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మొదటి విడతలో ఇళ్లు రానివారు ఎవరూ అధైర్య పడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు.

ఉద యం నుండి సాయంత్రం వరకు శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.

మండల పరిధిలోని పలు గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలకు హన్మకొండ జిల్లా హౌసింగ్ పీడీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.

పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదిక లల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పంద న బాగుంటుందన్నారు.

గత పాలకులు ఎమ్మెల్యే నివాసా లు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిం దని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రూ.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరంకేటాయిం చిందని, ఆర్థికంగా ఇబ్బందు లు ఉన్నప్పటికీ పేదల సంక్షే మం అజెండాగా పాలన కొనసాగుతుంది గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయా లని, ఎక్కడ లంచాలకు ఆస్కా రం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నిరోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నా మని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడా లని తాము ప్రయత్నిస్తు న్నామని ఎమ్మెల్యే అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఇవ్వని ప్రతిపక్ష నాయకులు ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేస్తుంటే చూసి ఓర్వలేక శిలాఫలకాల ద్వంసానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

Indiramma’s house

 

 

ప్రజా ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవ ర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఇటువంటి పనుల కు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

మేము చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుతగిలితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అన్నారు.

బీఆర్ఎస్ గుండా యిజం మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను అందుకున్న పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ గత పదేళ్లుగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతో షంగా ఉందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికా రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు

విహర యాత్రల పోస్టర్ విడుదల.

విహర యాత్రల పోస్టర్ విడుదల

యాత్రల స్థలాలకు డిలక్స్,ఎక్స్ ప్రెస్ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నాం

డిపో మేనేజర్ రవిచందర్

పరకాల నేటిధాత్రి

 

టిజియస్ ఆర్టిసి పరకాలడిపో ఆద్వర్యంలో విహరయాత్రల వివరాల పోస్టర్ ను డిపో మేనేజర్ రవిచందర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున విడుదల చేశారు.అరుణాచలం (డీలక్స్),మల్లూరు,భద్రాచలం, పర్ణశాల,ధర్మపురి,బాసర,మల్లూరు,మేడారం,రామప్ప,వేములవాడ,కొండగట్టు,గూడెం గుట్ట(ఎక్స్ ప్రెస్) పై యాత్ర స్థలాలకు బస్సులు నడిపిస్తున్నట్టు తెలిపారు.పై స్థలాలకు కాకుండ భక్తులకు అనుకూలమైన ప్రదేశాట విహరయాత్రులకు బస్సులు సమకూరుస్తామని,చార్జీలు మరియు ఇతర వివరాలకు 9666919190 9705479088 సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ కుమారి,అసిస్టెంట్ ఇంజనీర్ రాజశ్రీ పాల్గొన్నారు.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

పలు సమస్యలు తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్టులు.

జర్నలిస్టులపై ఫారెస్ట్ దౌర్జన్యం, వెంటనే చర్యలు తీసుకొని జర్నలిస్టుల భూమిని అప్పగించాలని వినతి.

సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నూతన తహసీల్దార్, రామ్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

మహాదేవపూర్ నూతన తాసిల్దారుగా వై రామారావు బాధ్యతలను స్వీకరించడం తో స్థానిక పాత్రికేయులు తాసిల్దార్ కు సన్మానించడం జరిగింది. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో వై రామారావు ఖమ్మం జిల్లా మదికొండ మండల తాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై మహాదేవపూర్ తాసిల్దార్ గా వై రామారావు బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కు, శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక పాత్రికేయులు శాలువతో సన్మానించడం జరిగింది. అనంతరం పాత్రికేయులు నూతన తహసిల్దార్ కు మండలంలోని పలు ప్రధాన సమస్యలలో ఒకటైన భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డ్, విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభానికి ముందు అందించేలా చూడాలని, మండలంలో పలు భూ సమస్యలపై దృష్టి సాధించి బాధితులకు న్యాయం చేసేలా అధికారులు సిబ్బందికి ఆదేశించాలని కోరడం జరిగింది. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఫారెస్ట్ అధికారులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్వే పేరుతో కాలయాపన చేసి జర్నలిస్టులకు గూడు కట్టుకోకుండా చేస్తున్నారని, తక్షణమే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని జర్నలిస్టులకు అందించేలా చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన నూతన తహసిల్దార్ మండలంలోని సమస్యలపై పరిష్కారం కొరకు సాధ్యమైనంత త్వరలో విచారణ చేసి ప్రజలకు అలాగే పాత్రికేయులకు భూ సమస్య ను పరిష్కా రిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తహసిల్దార్ కు కలిసిన వారిలో సీనియర్ పాత్రికేయులు, టీ న్యూస్ రిపోర్టర్ సయ్యద్ జమీల్,మిన్నుభాయ్, రిపోర్టర్ లు ఉన్నారు.

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన.!

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..,

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అవగాహన కార్యక్రమాన్ని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వాహరయమంగా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ దత్తత గ్రామమైన రాళ్లపేట గ్రామంలో.

వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో.

రైతులకు అధిక దిగుబడుల గురించి చెప్పటాల్సిన .

అధునాతన వ్యవసాయ సాంకేతిక విధానాలపై అవగాహన కల్పిస్తూ.

శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు క్షేత్రస్థాయిలో అవసరమయ్యే ఆరు అంశాలు అనగా.

తక్కువ యూరియా వాడండి.

సాగు ఖర్చులు తగ్గించండి.

అవసరం మేరకే రసాయనాలు వినియోగించండి.

నెల. తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి రసిదరులు భద్రపరచుకోండి.

కష్టకాలంలో నష్టపరిహాన్ని పొందండి.

సాగు నీటిని ఆదా చేయండి.

భవితరాలకు అందించండి.

పంట మార్పిడి పాటించండి.

సుస్థిర ఆదాయాన్నిపోద్దండి చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.

అనే అంశాలపై అవగాహన కల్పించారు వీటితోపాటు వరిలోని వివిధ రకాల నూతన వంగడాలు కూరగాయలు సాగు పంటల్లో చీడపురుగు పీడలు నివారణ చర్యలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ ఆర్ సతీష్ మాట్లాడుతూ.

నైట్రోజన్ ఎరువులు మరియు పురుగుల మందులు సరైన నియోగం పచ్చి రొట్టఎరువుల.

ప్రాముఖ్యత మరియు వరి తెగులు. నెక్ బ్లాస్ట్ నివారణ సమగ్ర సస్యరక్షణ. Ipm.

పద్ధతులు నిర్వహించారు.

అలాగే. ఐ సి డి ఎస్. సూపర్వైజర్ శ్రీ నిర్మల దేవి మాట్లాడుతూ చంటి పిల్లల తల్లిదండ్రులు.

పిల్లల ఆహారం మరియు వారి ఆరోగ్యం పై తగినంత జాగ్రత్త వహించాలని తెలియజేస్తూ వ్యవసాయ అధికారి.

కే సంజీవ్ మరియు ఏఈఓ లు నాణ్యమైన విత్తనాలు వేసేసమయం గురించి రైతులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతుల తెగుళ్లు.

కోతుల బెడద.

మట్టి నమూనాలు.

పరీక్ష కేంద్రాలకు పంపించాలని కోళ్ల పెంపకం గురించి సందేహాలు నివృత్తి చేసుకున్నాడు ద్వారా పెరటిలో పెంచుకునే విత్తనాలు మరియు జగిత్యాల విత్తనాలను రైతులకు అందజేశారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.పాక్స్.

చైర్మన్ బండి దేవదాస్.

మండల వ్యవసాయ విస్తరణ అధికారి డి సలీం.

ఏ కరుణాకర్. ఆర్ గౌతం. ఎం మౌనిక. అంగన్వాడి టీచర్. ఎన్ వినోద. విద్యార్థులు. అభిలాష్. రాకేష్. రాళ్ల పేట గ్రామ రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నా

ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేసిన మల్లయ్య స్వామి.

ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేసిన మల్లయ్య స్వామి ఈశ్వరప్ప

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతా కి సంగమేశ్వర స్వామి దేవాలయములో ఈరోజు ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం కే మల్లయ్య స్వామి ఈశ్వరప్ప లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ ఈవో శివ రుద్రప్ప స్వామి గ్రామ పెద్దలు భక్తులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

(మాస్) సభ విజయవంతం.

(మాస్) సభ విజయవంతం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో,మన ఆలోచన సాధన సమితి (మాస్) సభ అధ్యక్షుడు ఎనుగుల ఎల్లయ్య మాట్లాడుతు (మన ఆలోచన సాధన సమితి)ఆలోచన చైతన్యం, చైతన్యమే ఆయుధం, అనే భావాలతో బీసీ ఉద్యమం నవ శకం ఆరంభమైంది అని అన్నారు. అంతేకాకుండా ప్రధాన లక్ష్యమైన రాజ్యాధికారం బీసీల సమైక్యతలో ఉంటుందని జ్యోతిబాపూ పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోని భాగమే బీసీల సమైక్యత అని తెలిపారు.కటకం నర్సింగరావు .దొంత ఆనందం, మంగలి పల్లి శంకర్, రాష్ట్ర శాఖ నుంచి హాజరై బీసీల సమైక్యత కోసం అనర్ఘళంగా ఉపన్యాసం అందించారు. బీసీలు అందరూ ఒకటైతే బీసీలకు రాజ్యాధికారం వస్తే అందరూ సామాజిక ,ఆర్థికంగా, బలపడతారని సభలో తెలిపారు. సిరిసిల్ల కుల సంఘాల నుండి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయడానికి కుల సంఘానికి ఇద్దరు చొప్పున కన్వీనర్లను నియమించాలని సూచనతో పాటు 15న బీసీ సమైక్యత జెండాను సిరిసిల్ల పట్టణంలో చైతన్యవంతంగా ఎగరవేయాలని నిశ్చయించారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా దొంత దేవదాసు వ్యవహరించారు,గాదమైసయ్య, వెంగళ అంకయ్య,యువ కవి వెంగళ లక్ష్మణ్, తన గానంతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. డాక్టర్ జనపాల శంకరయ్య,కోడం నారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు

మొదటి జాబితాలో పేరు న్న ఆ తర్వాత మాయం

ఇందిరమ్మ కమిటీల మాయాజాలం

పంతపాడుతున్న అధి కారులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో వైద్యుల రాజిరెడ్డి నిరుపేద కుటుంబం రేక్కాఆడితే గాని డొక్కా నిండని పరిస్థితి. నిత్యం కూలి పని చేస్తూ ఇద్దరి కూతుర్ల పెళ్లి చేసి కష్టంగా జీవనం కొనసాగిస్తున్నారు నిజానికి తమకంటే గ్రామంలో నిరుపేదలు ఉండరని పై అధికారులు వచ్చి చూస్తే అన్ని తెలుస్తాయని వారు అంటు న్నారు. గ్రామసభలు జరిగినప్పుడు తమ పేర్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు తమ పేర్లు కనిపించకపోకుండా చేశారని వారు బోరు మంటున్నారు. గ్రామంలో 35 ఇండ్లు వస్తే ముందుగా ఉండాల్సిన తమ పేరు లేకపోవడం ఎంపికలో ఎంత అన్యాయం జరిగిందో చెప్పడానికి నిదర్శనం అంటున్నారు నాకు ఇద్దరు ఆడబిడ్డల పెళ్లి చేసి ఇల్లు లేక గుడిసెలలో నివసించి, ప్రజల సహకారంతో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులకే ఇస్తాం ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడిన సహించే లేదంటూ చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నీటిముట్టలేనా!

ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం

Indiramma’s committees.

 

 

ఎన్నికల్లో చేత గుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అన్నారు చేత గుర్తుకు ఓటేసినా మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు ఇద్దరు ఆడబిడ్డలతో కూలి పని చేసుకుని బతుకుతున్న ఊళ్లో నాకంటే పేదవాళ్ళు ఎవరూ లేరు గ్రామంలో 35 మందికి ఇల్లు వస్తే నాలాంటి పేదోడికి మాత్రం రాలేదు ఒకసారి మా గ్రామానికి వచ్చి మేము చెప్పేది నిజము కాదా చూస్తే తెలుస్తుంది

మా పేదరికం కనబడలేదా!
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన వైద్యుల రాజిరెడ్డి దంపతులు కూలి పని చేస్తూ ఇద్దరూ కూతురుపెళ్లిళ్లు చేసి జీవనో పాధి సాగడం చాలా ఇబ్బం దిగా మారింది. ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇంట్లో చాలా కష్టంగా నివసిస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా కుటుంబం పట్ల చొరవ చూపి నిరుపేద కుటుంబానికి ఆసరా చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు

అప్పుడున్న పేరు ఇప్పు డేమైనట్లు!

ఇందిరమ్మ ఇండ్లు కోసం అందరిలాగే దరఖాస్తు చేసుకున్నాం గ్రామ సభలో మా పేరు చదివినప్పుడు మాకు ఇల్లు వస్తుందని అనుకున్నాం ఇప్పుడు మాత్రం లేదంటు న్నారు గ్రామపంచాయతీ ఆఫీసర్లను అడిగితే పైనుంచి పేర్లు వచ్చినాయి మమ్మల్ని ఏమి చేయమంటారు అన్నారు మాకు ఏమి సంబంధం లేదన్నారు గ్రామంలో మాకంటే పేదవారు ఎవరూ లేరు ఆర్థికంగా ఉన్న వాళ్లకు నాయకుల దగ్గర ఉన్నోళ్లకు మాత్రం ఇండ్లు వచ్చినాయి మేము ఏం పాపం చేసిన్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుల రాజిరెడ్డి దంపతులు, ప్రకాశ్ రెడ్డి, మహిళలు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నా

అమెరికాలో 12 దేశాల ప్రజలకు నో ఎంట్రీ

అమెరికాలో 12 దేశాల ప్రజలకు నో ఎంట్రీ

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) తాజాగా 12 దేశాల పౌరులకు అమెరికాలో ఎంట్రీకి నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా దేశాల వారు అమెరికాకు వెళ్లాలంటే కఠినమైన ఆంక్షలు ఎదుర్కొవాల్సిందే. ఆఫ్రికా, మధ్య ప్రాశ్చ్య ప్రాంతాలకు చెందిన కొన్ని దేశాలకు ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్, మయన్మార్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలతో పాటు వెనిజులా, తుర్కమెనిస్తాన్, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, తదితర దేశాలకు కొత్తగా విధించబోయే షరతులు, పరిమితులు వర్తిస్తాయని పేర్కొన్నారు. వీసా ఉన్నవారికి అనుమతి, కొత్త దరఖాస్తులపై కఠిన నియమాలు విధించారు. ఇప్పటికే వీసా ఉన్నవారు అమెరికాలో ప్రవేశించవచ్చు. కానీ పై దేశాల పౌరులు కొత్త వీసా కోసం దరఖాస్తు చేస్తే, వారి దరఖాస్తులను తీవ్రమైన భద్రతా ప్రమాణాలతో సమీక్షించనున్నారు.

అమెరికా భద్రతే ఫస్ట్

నిషేధిత జాబితాలో ఉన్న దేశాలు సరైన స్క్రీనింగ్ వ్యవస్థలను పాటించడం లేదు. వీసా గడువు ముగిసిపోయినా చాలా మంది అమెరికాలోనే ఉండిపోయారు. ఇది దేశ భద్రతకు పెనుముప్పుగా భావిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల కొలరాడో లో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ నిందితుడు ఈజిప్టు పౌరుడని వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలోనే ఉన్నాడని వెల్లడించారు. ఈజిప్ట్ ఈ జాబితాలో లేకపోయినా, అన్ని దేశాలు తమ భద్రతా ప్రమాణాలను పటిష్టంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచిన దేశాలను ఈ నిషేధ జాబితా నుంచి తొలగించే అవకాశముందని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. తమ అంతిమ లక్ష్యం అమెరికా పౌరుల రక్షణే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జనావాసాల మధ్య ఉన్న చెత్తకుండిని తొలగించాలి.

జనావాసాల మధ్య ఉన్న చెత్తకుండిని తొలగించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరసంగం మండల కేంద్రంలో లో గల అంగడి బజార్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా చెత్తకుండిని ఏర్పాటు చేశారు , ప్రస్తుతం అట్టి చెత్తకుండిలో కొన్ని నెలల నుండి చెత్త మరియు సమీప ఫస్ట్ ఫుడ్ సెంటర్, బేకరి లకు సంబంధించిన వ్యర్థాలను అందులో వేయడం ద్వారా భారీగా దుర్గంధ రావడం కాకుండా ,అట్టి వ్యర్థపదల నుండి నీరు కారి ప్రధాన రహదారి వెంట మురికి నీరు వచి కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతుంది,కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ అధికారులు ఇట్టి వ్యర్థాలను తీయకుండా కాలయాపన చేస్తున్నారు.అట్టి వ్యర్థ జలాల వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారు. తక్షణమే అట్టి చెత్తకుండిని వేరే ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…

మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు.

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది.

ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది.

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.

1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ.

ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.

1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు.

పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు.

మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు.

జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.

అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు.

ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు.

అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.

50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.

మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది.

ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.

ఆన్ లైన్ జూదంతో అప్పులు..

ఆన్ లైన్ జూదంతో అప్పులు.. పీజీ వైద్య విద్యార్థి సూసైడ్

 

తమిళనాడులోని కొడైకెనాల్ సమీపంలో తన కారులో ఒక యువ వైద్యుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మృతుడిని దిండిగల్ జిల్లా వేద చంద్రూర్కు చెందిన జోషువా సమ్రాజ్ (29)గా పోలీసులు గుర్తించారు. అతడు రెండో సంవత్సరం పీజీ వైద్య విద్య చదువుతున్నాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. ఆన్లైన్ జూదాల్లో పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన జోషువా ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కారులో అతను ఇంట్రావెనస్ డ్రగ్ తీసుకుని మరణించినట్టు నిర్ధారించారు. జోషువా ఫిలిప్పీన్స్లో మెడిసిన్ పూర్తి చేసి తమిళనాడులోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేశాడు.

నాలుగు రోజులుగా జోషువా కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వేదచంద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పూంబారై సమీపంలో ఒక కారు ఆగి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో జోషువా మృతదేహాన్ని కనుగొన్నారు. పక్కనే ఇంట్రావెనస్ డ్రగ్ గుర్తించారు. కారులో అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లో లభించిన బ్యాంకు లావాదేవీల ఆధారంగా నిందితుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడని, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు సంబంధించి ఆధారాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. జోషుగా తనకు తానుగా ఇంజక్షన్ చేసుకుని సూసైడ్ కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. గతంలో కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ సంవత్సరం మార్చిలో ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ సీనియర్ సర్జన్ డాక్టర్ జార్జ్ పి. అబ్రహామ్ (74) కూడా తన ఫామ్ హౌస్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది.

అంగరంగ వైభవంగా నగర సంకీర్తన.

అంగరంగ వైభవంగా నగర సంకీర్తన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం 158వ నగర సంకీర్తన అంగరంగ వైభవంగా జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలోని హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన నగర సంకీర్తన నారాయణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామ లింగేశ్వర మందిరం వరకు కొనసాగింది. శ్రీ కృష్ణ కీర్తనలు, శ్రీ రామ భజనలు, శ్రీ శివ స్తోత్రాలను ఆలపిస్తూ భక్తులు ఆనందోత్సాహల మధ్య నృత్యాలు చేస్తూ భక్తి భావంలో మునిగిపోయారు.

కౌండిన్య కళ్యాణ మండపమే లక్ష్యంగా గౌడ.

కౌండిన్య కళ్యాణ మండపమే లక్ష్యంగా గౌడ వెల్ఫేర్ సొసైటి.

గౌడ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు గండి లింగయ్య.

ఘనంగా 3 వ వార్షిక మహాసభ విజయవంతం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట డివిజన్ పరిధిలో కౌండిన్య కళ్యాణ మండపం లక్ష్యంగా గౌడ వెల్ఫేర్ సొసైటి అడుగులు వేసిందని గౌడ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు గండి లింగయ్య అన్నారు.గౌడ సంక్షేమ సంస్థ 3 వ వార్షిక మహాసభ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ అధ్యక్షతన పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో జరిగింది.500 మంది సభ్యులతో సంస్థ కొనసాగుతున్నదని పేర్కొంటూ ఈ నేపథ్యంలో వార్షిక నివేదికను అధ్యక్షుడు ప్రవేశపెట్టి సంస్థ స్థితిగతులు పట్ల వివరించారు. నర్సంపేట డివిజన్ పరిధిలో గల గౌడ వెల్ఫేర్ సంస్థ గత మూడు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆయన పేర్కొన్నారు.అలాగే భవిష్యత్తు కార్యాచరణ పట్ల సభ్యులకు వివరించారు.ఇప్పటి వరకు నర్సంపేట డివిజన్ పరిధిలో గౌడ కులస్తుల ఫంక్షన్ హాల్ ఎదన్నారు. నమ్మకంతో,సమాజ సేవతో ముందుకుపోతున్న గౌడ వెల్ఫేర్ సొసైటిలో ఎలాంటి అపోహలు ఉండవని తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గండి నర్సయ్య గౌడ్, బూర అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఐలుమల్లు గౌడ్, సహాయ కార్యదర్శి ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ధిక కార్యదర్శి గండి రాము గౌడ్, రామగిరి సుధాకర్ గౌడ్,ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,
బూర వేణు గౌడ్, రావుల లక్ష్మీ నారాయణ గౌడ్, గందం చంద్రమౌళి గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్,వల్లాల శ్రీహరి గౌడ్,విజయ్ గౌడ్,ముఖ్యులు వేముల సాంబయ్య గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, తండ సారంగపాణి గౌడ్, వేముల రవి గౌడ్, గంప రాజేశ్వర్ గౌడ్, పీఈటి శ్రీలత గౌడ్, గౌరవ సభ్యులు గౌడ సంఘ సభ్యులు సర్వ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version