రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

తహసిల్దార్ సత్యనారాయణ స్వామి

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండల కేంద్రంలో
రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని  తాసిల్దార్ సత్యనారాయణ స్వామి పేర్కొన్నారు సోమవారం  మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గోన్నారు  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ  చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో   ఎం ఆర్ ఐ దేవేందర్ సర్వేయర్ నిరంజన్. సిబ్బంది గుడాల తిరుపతి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుంది

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుంది.

బాలానగర్ /నేటి ధాత్రి :

 

కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుందని బాలానగర్ మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల ఆస్తులను కొల్లగొట్టి, ప్రశ్నించే బంజారా బిడ్డలను, బంజారా రైతులను, బంజారా ఉద్యోగులను జైల్లో పెడుతున్నారన్నారు. లంబాడ సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం లంబాడ సామాజిక వర్గంకు అవమానం చేసినట్టే అని అన్నారు. ఈ విషయంపై గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో గిరిజనులను తృతీయ శ్రేణి నాయకులుగా పరిగణిస్తున్నారని విమర్శించారు.

సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు భద్రాద్రి జిల్లా అవసరాలకు.!

సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు భద్రాద్రి జిల్లా అవసరాలకు వినియోగించాలి

చర్ల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా మెమోరాండం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

నేటి ధాత్రి చర్ల

చర్ల మండల కేంద్రంలో భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సీతారామ ప్రాజెక్ట్ జలాల కోసం జిల్లా ప్రజల సాగునీటి కోసం చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్నటువంటి తాసిల్దార్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం నిర్వహించి మెమొరండం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును నిర్మించగా ఖమ్మం జిల్లాకు నీళ్లను చక్కగా తరలించబోతున్నారని ఖమ్మం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సరైనదే కానీ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీటి ఇవ్వకపోవడం మాత్రం దుర్మార్గం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించవలసిందిగా రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డుల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు కాకపోగా సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నది ఇకనైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఆరు గ్యారెంటీలలోని 420 హామీలు తక్షణమే అమలు చేయవలసిందిగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము 6 గ్యారంటీలు అమలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ సామాన్య ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని అన్నారు

ఈ కార్యక్రమంలో చర్ల మాజీ మండల అధ్యక్షులు సోయాం రాజారావు మాజీ ఎంపీపీ గీద కోదండ రామయ్య మండల సీనియర్ నాయకులు సయ్యాద్ అజీజ్ ఎడ్ల రామదాసు డివిజన్ యువజన నాయకులు కాకి అనిల్ బీసీ సెల్ అధ్యక్షులు గోరంట్ల వేంకటేశ్వరరావు ఎస్టీ సెల్ కార్యదర్శి కారం కన్నారావ్ ఎస్సి సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము యూత్ మండల అధ్యక్ష కార్యదర్శులు అంబోజి సతీష్ కుప్పల నిరంజన్ మహిళా విభాగం ఉపాద్యక్షురాలు కుప్పల సౌజన్య యూత్ నాయకులు కట్టాం కన్నారావు తడికల బుల్లెబ్బయ్ మెడబత్తిని గోవర్ధన్ తోటపల్లి సాయి కోటి శ్రీకాంత్ బట్ట కొమరయ్య మునిగేలా సాంబ తడికల చంద్రశేఖర్ గట్టుపల్లి రాజు కారం రామారావు గట్టుపల్లీ రామయ్య మైపా వెంకటేశ్వర్లు తదితర యువజన నాయకులు పాల్గొన్నారు

బాల్ బ్యాడ్మింటన్ జూన్ 15 నుండి ప్రతి ఆదివారం

బాల్ బ్యాడ్మింటన్ జూన్ 15 నుండి ప్రతి ఆదివారం కోచింగ్

జిల్లా స్పోర్ట్స్ చిర్రా రఘు

గణపురం నేటి ధాత్రి :

 

గణపురం మండలంలో మే ఒకటో తారీకు నుండి మొదలుకొని జూన్ ఆరో తారీకు వరకు సమ్మర్ క్యాంప్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. తదుపరి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ చిర్రా రఘు అనుమతితో తేదీ 15 .6 .1925 నుండి ప్రతి ఆదివారం గణపురం ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో బాల్ బ్యాట్మెంటన్ కోచింగ్ ఇవ్వబడును కోచింగ్ మాస్టర్ మామిడి శెట్టి రవీందర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

సోమవారం శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఐఏఎస్ శ్రీ హేమంత్ భోర్ఖడేతో నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నేను కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను” అని జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, అధికారులు డివిజన్లలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని, ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీచర్ ఉద్యోగం సాధించిన మహిళ కానిస్టేబుల్.

టీచర్ ఉద్యోగం సాధించిన మహిళ కానిస్టేబుల్ కు సన్మానం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ కానిస్టేబుల్ గా పనిచేసి విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన సూత్రపు లావణ్యను సన్మానించారు.పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు నుండి టీచర్ గా ఎంపికైన లావణ్యను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం లో పని చేస్తూ టీచర్ గా ఉద్యోగం సాధించడం ఎంతో గొప్పతనమని మహిళా పోలీస్ కానిస్టేబుల్ గా స్థానిక స్టేషన్లో విధులు నిర్వహించిన లావణ్య ఎంతో నమ్మకంతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ అందరి మన్ననలు పొందడం అభినందియమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితోపాటు లావణ్య మిత్ర బృందం పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి.

సిరిసిల్ల జిల్లా లో ప్రజావాణి

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రెవెన్యూ శాఖకు 51, హౌసింగ్ 32, ఏడీ ఎస్ఎల్ ఏ, డీఈఓ కు 7 చొప్పున, డిఆర్డీఓకు 6, జిల్లా సంక్షేమ అధికారి 5, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎస్సీ కార్పొరేషన్, ఉపాధి కల్పన శాఖకు మూడు చొప్పున, సిరిసిల్ల మున్సిపల్, ఎంపీడీఓ బోయినపల్లి కి రెండు చొప్పున ఎస్పీ, ఎస్డీసీ, నీటి పారుదల శాఖ, సెస్, ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, ఎల్డీఎం, ఏడీ హ్యాండ్ లూమ్స్, సీపీఓ కి ఒకటి చొప్పున దరఖాస్తులు మొత్తం 134 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

 

Collector Sandeep Kumar.

 

 

అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

హఫీస్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మాయం.

హఫీస్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మాయం……..

బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్ మరియు వాహనాలు పోయే పరిస్థితి అక్కడే లేవు మరియు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యలమైయం అయ్యింది అన్ని అన్నారు.ఈ యొక్క సమస్యలను అధికారులుగాని,నాయకులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు.ఇకనైనా నాయకులు,అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచైయండి అన్ని అన్నారు.లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

“అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం”

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

 

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 25 , గోల్ మజీద్ ప్రాంతంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులతో నిర్మించనున్న బాక్స్ డ్రైనేజీ నిర్మాణపు పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణంలోని గోల్ మజీద్ నుంచి రైస మజీద్ వరకు రూ.4 కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, వారి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ విజన్ 2047 ద్వారా మహబూబ్ నగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే రూ.250 కోట్లతో విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, అందులో కొన్ని ఇప్పటికే పూర్తి చేసుకోగా, మరి కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ ను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ కు ఏమి కావాలన్నా ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, రానున్న 3 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను అద్బుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , ఫైయాజ్, లీడర్ రఘు, మోయీజ్,ఉమర్ అఫీజ్, మహబూబ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల నిర్మాణానికి భారీ విరాళం.

ఆలయాల నిర్మాణానికి భారీ విరాళం

ఆలయాల నిర్మాణానికి తండ్రి జ్ఞాపకార్థకంగా తనయులు భారీ విరాళం అందజేత

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం మున్సిపల్ లోని విలేజ్ కేసముద్రంలో ఇటీవలే విశ్వబ్రాహ్మణ సంఘ వారు శ్రీశ్రీ కాశీ విశ్వేశ్వరాలయం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయము మరియు శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల ఆలయాల నిర్మాణానికి భూమి పూజ సిలన్యాస శంకుస్థాపన చేయడం జరిగింది.

అనంతరం ఆలయాల కమిటీ సభ్యులు ఆలయాల నిర్మాణం కొరకు నిధుల సేకరణ చేపట్టడం జరిగింది.

ఈ నిధుల సేకరణలో భాగంగా కేసముద్రం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి కీర్తిశేషులు చిల్లం చర్ల లక్ష్మణరావు ల జ్ఞాపకార్ధకంగా వారి సతీమణి చిల్లం చర్ల ధనమ్మ మరియు కుమారులు చిల్లం చర్ల శ్రీనివాస్, శ్యాంసుందర్, సంతోష్ కుమార్, సతీష్ కుమార్ లు ఆలయ నిర్మాణం కొరకు వారి తండ్రి జ్ఞాపకార్థకంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 ఆలయాల నిర్మాణం కొరకు భారీ విరాళం అందజేయడం జరిగింది.

చిల్లంచర్ల లక్ష్మణరావు కుటుంబం గ్రామంలో ఇప్పటివరకు నిర్మించిన ఆలయాలకు విరాళం దాతలుగా ముందు వరసల ఉండేవారని అనాదిగా

ఈ కుటుంబం భక్తి శ్రద్దలకు నిదర్శనంగా నిలిచారని అలాగే వ్యాపార రంగంలో ఎంతో నిజాయితీగా కొనసాగే వారిని అందరిని తన మంచితనంతో ఆకట్టుకునే వారిని ఇలాంటి వారు సమాజానికి ఎంతో అవసరమని వారి జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని పలువురు భావిస్తున్నారు.

వీరి తనయులు కూడా తండ్రి బాటలో నడుస్తున్నందుకు వారి ఆశయాలను నిలబెట్టుకుంటూ తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నారని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు గ్రామం ప్రజలు వీరి దాతృత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉల్లి రాజేశ్వరరావు, చిట్టోజు రమణాచారి, ఆరెందుల కుమారస్వామి, కందుకూరి సోమయ చారి, ఉల్లి వెంకటేశ్వర్లు, తుమ్మనపల్లి జితేందర్ రావు, బొల్లోజు శ్రీనివాస్, చిట్టోదు శ్రీనివాస్, కందుకూరి శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి.

“ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి”

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

 

బాలానగర్ మండలంలోని అమ్మపల్లి, అప్పాజీపల్లి, బోడగుట్ట తండా, గౌతాపూర్ గ్రామాలలో సోమవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని.. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను ప్రతి నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రాములు మృతి పార్టీకి తీరని లోటు.

రాములు మృతి పార్టీకి తీరని లోటు.

#అంతిమయాత్రలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి..

నల్లబెల్లి, నేటిధాత్రి:

 

 

మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏరుకొండ వెంకటేష్, వేణు తండ్రిగారైన రాములు గుండెపోటుతో సోమవారం ఉదయం మృతిచెందగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి మృతుని సగృహానికి చేరుకొని మృతవి పార్థివ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట ఫ్యాక్స్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తపెళ్లి అశోక్, నాయకులు మామిళ్ల రాజు, కస్తూరి రవి, పప్పు శంకర్, మేకల సాంబయ్య, ఆకుల సాంబారావ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, నరేష్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ.

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ.

సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధి.

సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్..

విజయవంతంగా దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వార్షిక మహాసభ..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ వలన సంఘాల్లో సభ్యులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు.

దుగ్గొండి మండల కేంద్రంలో గల
దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన ఆ సమితి 12 వ వార్షిక మహాసభ కార్యాలయం ఆవరణలో జరిగింది.

సమితి పరిధిలోని దుగ్గొండి,చంద్రయ్యపల్లి,దేశాయిపల్లి, రేబల్లె,వెంకటాపురం,నేరేడుపల్లి,
వసంతాపురం,ప్రగతిసింగారం,అక్కంపేట అనే 10 సంఘాలు ఉండగా మొత్తం 4382 మంది సభ్యులు కాగా మొత్తం రూ.10 కోట్ల నిధులు ఉన్నాయి.

సమితి నిర్వహణ పట్ల స్థితిగతులు,అభివృద్ధి పట్ల చర్చించుకున్నారు.

ఈ నేపథ్యంలో 2024-25 వార్షిక నివేదికను అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,గణకులు పోలోజు రమణాచారిలు చదివి ప్రవేశపెట్టారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న సహకార వికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సహకార సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు మంచిన నడిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశ్యంతో సహకార వికాస సంస్థ ఏర్పాటు చేయగా నేడు స్వకృషీ ఉద్యమం వజయవంతంగా నడుస్తున్నాయని తెలియజేశారు.

 

Development

 

1995 చట్టం ద్వారానే రాజకీయ పార్టీలకతీతంగా సహావికాస సంస్థ సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

సహకార ఉద్యమంలో 54 సమితిలు ఉండగా సేవా దృక్పథంతో నిర్వహణలో ఉన్నాయని తెలిపారు.

 

సిడీఎఫ్ ధర్మకర్తల మండలి ప్రతినిధి దర్మవతి మాట్లాడుతూ సంఘాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి కీలకమని అన్నారు.రానున్న రోజుల్లో సభ్యులు ,సంఘాలు ఇబ్బందులు పదద్దనే ఉద్దేశ్యంతో సహావికాస కార్యశాల నిర్ణయించిందని దీంతో కొన్ని ఖాతాలు నిలిపివేసిందని తెలియజేశారు.

సిడీఎఫ్ అభివృద్ధి అధికారి నవీన్ మాట్లాడుతూ సంఘాల్లో బకాయి శాతం జీరో చేస్తేనే మెరుగు లభిస్తుంది అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు కందికొండ రవీందర్,సంఘాల అధ్యక్షులు,సమితి పాలకవర్గ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, మోతుకూరి ప్రభాకర్,పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి,బట్టి బక్కయ్య,పొగాకు రమేష్ గౌడ్,వేములపల్లి బాబు,పెండ్యాల మల్లేశం,రాయరాకుల రమేష్,ప్రేమ్ సాగర్,ఆయా సంఘాల ఉపాధ్యక్షులు,పాలకవర్గ సభ్యులు,గణకులు పాల్గొన్నారు

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ నిర్వహించారు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ సిలిండర్ లపై అదనంగా డబ్బులు వసూలు.

గ్యాస్ సిలిండర్ లపై అదనంగా డబ్బులు వసూలు

గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలి

బీఎస్పీ పార్టీ నాయకుల డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ డెలివరీ సమయంలో ఆన్లైన్లో బుక్ చేసిన రవాణ చార్జీల పేరుతో వినియోగదారుల నుండి అదనంగా 100 రూ” వరకు వసూలు చేస్తున్నారని (రిసిప్ట్ బిల్లు) అడుగుతే ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని వినియోదారులకు అందుబాటులో ఉంచకుండా కమర్షియల్ సిలిండర్లకు బదులు ఇండ్లలో వాడే సిలిండర్లను హోటల్స్ బేకరీ షాపులలో నిల్వ ఉంచుతూ ప్రజలకు సకాలంలో అందించకుండా ఇబ్బందులు గురిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని దళారులను గుర్తించి వారి లైసెన్సులు రద్దు చేసి ప్రజలను వారి బారి నుండి కాపాడాలని వారితో కుమ్మక్కైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం తదితరులు పాల్గొన్నారు

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్
అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు

పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు.

పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు

ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

మొగుళ్లపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద గత రెండు సంవత్సరాలుగా పెద్దవాగు అధిక వర్షపాతంతో ఈ వాగులో అధిక మోతాదులో నీటి ప్రవాహం రావడం వలన ఈ యొక్క బ్రిడ్జి ఆనకట్ట వరద ప్రభావానికి కొట్టుకొని పోయింది అప్పటినుండి ఇక్కడున్న అధికారులు ఈ యొక్క ఆనకట్టకు మరమ్మత్తులు చేయలేదు కనీసం పలు అభివృద్ధి పనుల కోసం మండలంలో ఉన్న 20 గ్రామాలకు ఇదే రోడ్డు నుండి వెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఈ సమస్య పట్టలేదా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు చెప్పలేదా మళ్లీ వర్షాకాలం మొదలైంది వాగు అధిక మోతాదులో మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్న 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనగా ఇప్పటికే రోడ్డు పై నుండి అనకట్ట కిందకు వర్షం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతుంది కావున ఈ రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది కావున తక్షణమే సంబంధిత అధికారులు గమనించి ఈ ఆనకట్టకు మరమ్మత్తులు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే మరమ్మతు పనులు జరిపించాలని  కోరుకుంటున్నాను

వార్డుల విభజనలో లోపించిన పారదర్శకత.

వార్డుల విభజనలో లోపించిన పారదర్శకత

వెంటనే సవరించాలని డిమాండ్

నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన ఎంసిపిఐ (యు) నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల విభజన లో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఎం సిపిఐ( యు) నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగ సుధా , కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఇటీవల కొన్ని గ్రామాలను నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేయగా , ఆ గ్రామాల ఓటర్లను రెండు ,మూడు వార్డుల్లో వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గ్రామాల విలీనం తో ఒకవైపు ప్రజలు ఉపాధి కోల్పోగా ,ఇది చాలదన్నట్టు ప్రజలను మరింత అస్థిరపరిచేందుకు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అదే రకంగా పట్టణంలోని జ్యోతిబాసు నగర్ , కారల్ మార్క్స్ కాలనీలో చాలా ఏళ్లుగా సమస్యలు వెంటాడుతున్నాయని ఈ సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గాలు ఘోర వైఫల్యం చెందారన్నారు .ఇప్పటికైనా కాలనీలో అంతర్గత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో దశలవారి ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మా షూక్ , పట్టణ నాయకులు భైరబోయిన నరసయ్య ,బెజ్జంకి పుష్పనీలా , జన్ను విజయ తదితరులు పాల్గొన్నారు .

స్వామి వివేకానంద విగ్రహవిష్కరణ.

స్వామి వివేకానంద విగ్రహవిష్కరణ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో సోమవారం స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానంద భారతదేశంలోని యువతకు రోల్ మోడల్, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు గుర్తించుకునే స్థాయిలో మాట్లాడి మెప్పించారు , యువత వివేకానంద చూపించిన మార్గంలో నడవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆమన్ గల్ మాజీ జడ్పిటిసి కండే హరిప్రసాద్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,మండలంలోని మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం.

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???
మండల కమిటీలో అన్ని గ్రామాలకు లభించని ప్రాతినిధ్యం
అధ్యక్షుడి వ్యవహార తీరుపై సర్వత్రా అసంతృప్తి???
అధికారం కాంగ్రెస్ గెలుపు కాదు బిఆర్ఎస్ ఓటమి
క్యాడర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలం ప్రజలతో మమేకమవ్వకుండా పదవులపై కన్ను
ఐలోనోళ్లకు నచ్చకపోతే అంతే సంగతులు
నైరాశ్యంలో వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

త్వరలోనే మండల కమిటీ మార్పు తద్యం అని నాయకులు భావిస్తున్నారు.

ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఆపత్కాలంలో ఉన్న నాయకులతో మండల కమిటీని సర్దుబాటు చేయగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేదని వారంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే మండల కమిటీలో ఇన్నాళ్లు ఏకపక్షంగా వ్యవహరించిన నాయకులు త్వరలో జరగబోయే స్థానిక సమరంలోను పదవులు ఆశిస్తుండటంతో ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారికి మళ్ళీ పదవులు ఇస్తే కేడర్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు.

అందుకే పోటీపై ఆసక్తి ఉన్న నాయకులకు మండల కమిటీలో చోటు లేకుండా చేసి అసంతృప్తితో ఉన్న నాయకులతో మండల కమిటీని పూర్తి చేసి పాత కొత్త నాయకులను కలుపుకొని ముందుకు పోవాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ప్రస్తుత అధ్యక్షుని వ్యవహార శైలి పై వివిధ గ్రామాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మండల కమిటీ అంటే తాను ఒక్కడినే అన్నట్లు భావిస్తూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి నాయకులకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మండలంలో ఉన్న ఒకరిద్దరు వైట్ కాలర్ నాయకులను వెంటవేసుకొని తం చెప్పిందే మండలంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా ఈ గ్రూపు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.

పాత కొత్త నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాల్సిన నాయకులే తాము చెప్పిందే వేదం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయాన్ని వాళ్ళ పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పార్టీలో తమ స్థానం ఏమిటో కొత్తగా వచ్చిన నాయకులకు తెలియని పరిస్థితి.

ఇటు మండల కమిటీ లోను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ లోను కొత్తవారికి చోటు కల్పించలేదు.

అంతేకాకుండా ప్రభుత్వ పథకాల కేటాయింపులో కూడా తగిన ప్రాధాన్యత లభించడం లేదని పదవులు పథకాలు అన్ని సీనియర్లము అన్న పేరుతో పాత కాంగ్రెస్ నాయకులే పెత్తనం చెలాస్తుండడంతో ఏదో ఆశించి అధికార పార్టీలో చేరిన నాయకులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా అయినవోలు మండలంలో ఉన్న పెద్ద నాయకుడు కాంగ్రెసులో చేరికతో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో నడిచిన నాయకులు కార్యకర్తలకు రాబోయే స్థానిక సమరంలోనూ టికెట్లు కేటాయిస్తారు అన్న ఆశ లేదు.

తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ మారి తాము తప్పు చేశామా అని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

పోలీస్ భాస్ గా ఎన్నో ఆపరేషన్లు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయాల్లో అరగంట తర్వాత రాజకీయ చాణక్యతను చూపి పాత కొత్త నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు చెక్ పెట్టి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తారా లేదా వేచి చూడాలి

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version