చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వేంకట స్వామి మాలకి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా స్థానం లభించిన విషయం విదితమే. ఈ విషయం పట్ల అంబేడ్కర్ యువజన సంఘం జహిరాబాద్ నియోజకవర్గం అద్యక్షులు డి.శ్రీనివాస్ సోమవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
మందమర్రిలో నివాసం ఉంటున్న గంగాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నం సంజీవ్, కరుణ ల కూతురు రత్నం ఉజ్వలిత ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల – ఫిల్టర్ బెడ్ లో ఐదవ తరగతిలో చేర్పించారు.ఫిల్టర్ బెడ్ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో తన కూతుర్ని అడ్మిషన్ చేసినందుకు గాను ఉపాధ్యాయులు రత్నం సంజీవ్ ను అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించేలా చొరవ తీసుకోవాలని ఫిల్టర్ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉజ్వలకు ఫిల్టర్ బెడ్ ప్రదానోద్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి , ఏఏపిసి చైర్మన్ అంజలి లు సాదర స్వాగతం పలికారు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అఖిలపక్షం బహిరంగ లేఖ…
నేటి ధాత్రి – గార్ల :-
ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సోమవారం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ లేఖను విడుదల చేశారు.
2016లో ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల సాగు, త్రాగు నీటి అవసరాల కోసం శంకుస్థాపన చేసిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,రోల్లపాడు ప్రాజెక్టును 2018లో సీతారామ ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్, రిడిజైన్ చేపించి సీతారామ ప్రాజెక్టును సత్తుపల్లి, అశ్వరావుపేట, వైరా, ఖమ్మం, పాలేరు ప్రాంతాలకు అక్రమంగా దారి మల్లించడం జరిగింది.
ఏజెన్సీ గిరిజన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్, ఇల్లందు, డోర్నకల్ నియోజకవర్గాల ప్రాంతాలకు తీరని అన్యాయం చేశారు.
సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి.
సీతారామ ప్రాజెక్ట్ దారి మళ్లింపు పై, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై తగు విచారణ జరిపించి మొదటి డిపిఆర్ ప్రకారం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఇల్లందు మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల బీడు భూములకు సాగునీరు ఇక్కడి ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
పాఖాలేరు అలిగేరు కలిసేచోట గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ఎన్నికల వాగ్దానం గానే మిగిలిపోతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్, డోర్నకల్, కురవి, మహబూబాబాద్, మరిపెడ తదితర మండలాలకు సాగు, త్రాగు నీరు అందించవచ్చు.
గత ప్రభుత్వాలు అనేకసార్లు సర్వేలు, జీవోలతో కాలం వెళ్ళదీశారు.
తెలంగాణ ఉద్యమంలో సైతం మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం అనేది ప్రధాన ఏజెండాగా ఉన్నది.
తెలంగాణ ఏర్పడి 11 ½ సంవత్సరాలు అయినప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం మీద ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం 136 కోట్ల రూపాయల వ్యయంతో మున్నూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తూ 1076 జీవో విడుదల చేసినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఆ జీవోను పట్టించుకున్న పాపానా పోలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ చేస్తూ, మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టేలా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.కాకతీయుల కాలం నాటి గార్ల పెద్ద చెరువు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి ప్రాణాధారం లాంటిది.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములను ఆక్రమించుకొని కొంతమంది వ్యక్తులు అక్రమంగా పట్టా పాస్ బుక్కులు పొందడం జరిగింది.
అట్టి శిఖం భూములలో బావులు తవ్వడం, పంటలు సాగు చేయడం వలన నీటి నిల్వ సామర్థ్యం తగ్గి సుమారు రెండువేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది.
దీనివల్ల రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు.
అనేక సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజలు ఉద్యమాలు చేయడంతో చెరువు భూములను కొలతలు వేస్తూ వదిలేస్తున్నారు తప్ప, అక్రమ పట్టాలు తీసుకున్న వ్యక్తులపై చర్య తీసుకోవడం గానీ చెరువు శిఖం భూములకు రక్షణ వలయాలను ఏర్పాటు చేయడం గానీ చేయకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
గార్ల పెద్ద చెరువు భూములను పరిరక్షించే విధంగా నీటి నిల్వ సామర్థ్యం పెరిగే విధంగా తగిన చర్యలకు ఆదేశించగలరని కోరారు.
పాఖాలేటిపై హై లెవెల్ బ్రిడ్జి లేకపోవడం వల్ల రాంపురం మద్దివంచ గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సుమారు 15 తండాల, గ్రామాల ప్రజలు గార్ల మండల కేంద్రానికి చేరుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పాఖాలేరు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో సుమారు నాలుగు నెలల పాటు రహదారి బంద్ అవుతుంది.
ఆ ప్రాంత ప్రజలు విద్య, వైద్యం ఇతర పనుల నిమిత్తం గార్ల మండల కేంద్రానికి రావడానికి బ్రిడ్జి సౌకర్యం లేదు.
అనేక మంది పాఖాలేరులో పడి కొట్టుకుపోయి చని పోయినారు.
పాఖాలేటిపై గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ పార్టీలు అనేక ఉద్యమాలను నిర్వహించాయి.
ఫలితంగా గత ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
అయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణం కాలేదు.
ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణంపై ఒక అడుగు కూడా ముందుకు వయలేదు.
ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి గార్ల రాంపురం మద్దివంచ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ప్రజల రహదారి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
మున్నేరు నీటిని సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా పాలేరు తరలించేందుకు ప్రస్తుత ప్రభుత్వం 2025, మే 17 తారీఖున జీవో నెంబర్ 98 విడుదల చేస్తూ కాలువ నిర్మాణ పనులకు 162 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.
మున్నేరు నీటిని మున్నేరు పరివాహక ప్రాంత రైతులకు సాగు తాగునీరు ఇచ్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు తీసుకుపోవాలి తప్ప ఇక్కడ ప్రాంతాలను ఎండబెట్టి వేరొక ప్రాంతాలకు నీరు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్నేరు నీటిని పాలేరుకు తరలించే జీవో నెంబర్ 98 ను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతులు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కందునూరి శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుగులోత్ సక్రు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, టీజేఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు, బీఎస్పీ మండల అధ్యక్షులు బాదావత్ వెంకన్న, టిడిపి మండల కార్యదర్శి కత్తి సత్యం, బిజెపి మండల నాయకులు తోడేటి నాగరాజు, వివిధ పార్టీల నాయకులు పోతుల నరసింహారావు మొదలాకర్ శివాజీ, శంకర్, బాలాజీ, కేలోత్ బాల, గుండేటి వీరభద్రం, తెల్ల గర్ల నాగేశ్వరరావు, ప్రవీణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు నమూనా విడుదల..! ఫస్ట్ లుక్ అదుర్స్
తెలుగు సినిమా రంగంలో విశేష ప్రతిభను కనబరిచిన వారికి తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మక తెలుగు కవి గద్దర్ గౌరవార్థం ఆయన పేరు మీద ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ (GTFA) ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు తాజాగా అవార్డు నమూనాకు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ ఫొటోలో అడుగు భాగంలో గద్దె ఆపైన చేతిలో ఓ మూవీ రీల్ బాక్స్ ఉండటం మనం గమనించవచ్చు.
కాగా, మే 29న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు (Gaddar Telangana Film Award)లను ఇవాళ జ్యూరీ చైర్పర్సన్ జయసుధ (Jayasudha)తో పాటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju), జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ దర్శకుడి అవార్డు కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను వరించింది .
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (చిన్న కథ కాదు.. 35), ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ (పుష్ప-2), ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామి) స్పెషల్ జ్యూరీ అవార్డులను దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), అనన్య నాగళ్ల (పొట్టేల్), ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2), ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజూ యాదవ్) అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్టూరి (లక్కి భాస్కర్), ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్ (రజాకార్), ఉత్తమ హస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా గణేష్ ఆచార్య (దేవర), బెస్ట్ స్టోరీ రైటర్‌గా శివ పాలడుగు, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్నారు. అదేవిధంగా ఉత్తమ బాలల చిత్రంగా 35.. ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ చిత్రంగా ‘రజాకార్’, ఉత్తమ పుస్తకంగా రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం) అవార్డులను కైవసం చేసుకున్నాయి.
చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ lప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .
BJP Durgam Ashok.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు 26 సంవత్సరాల కాలం తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాఠశాల లో పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మాట్లాడుతూ గతంలో విద్యాబోధన చేసిన పూర్వ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోని వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులను ఎన్నటికీ మరువలేమని వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని కొనియాడారు,గత స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ తమ గురువుల సేవలను త్యాగాలను ఎన్నడూ మరవలేమని తమ జీవితంలో వారు అందించిన విద్య బుద్ధులను స్ఫూర్తి గా తీసుకోవడం వలన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు,అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి చదువుకున్న స్నేహితురాలు గుండెపుడి గ్రామవాసి చంద్రకళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారికి శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 30 మంది కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమన్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి,రమా మేడం, రామచంద్రయ్య,రేపాల యాదయ్య,కుడితి ఉపేందర్ రెడ్డి,నాగార్జున, సరస్వతి మేడం,జానకి రాములు, పూర్వ విద్యార్థులు, ఆర్గనైజేషన్ టీం బూర్లే శివప్రసాద్,రాంపల్లి సురేష్ బాబు,ముదిరెడ్డి అనిత, కళ్యాణి,మంజుల,సంతోష్ అయ్యగారు,బుద్ధ శ్రీకాంత్, గుగులోత్ వీరన్న,మిగితా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇందిర ఇండ్ల లకు. భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పేద ప్రజల అభివృద్ధిలో లో. పేద రాష్ట్రపతిగా అభివృద్ధి.లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగిస్తూ. దేశంలో ఇందిరమ్మ. కన్న కలలు సహకారం చేస్తూ నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయిస్తూ. వారి కుటుంబాల కల సహకారం చేస్తున్నారని. అలాగే ఇప్పటివరకు మండలంలో 85 ఇండ్లకు గాను గ్రౌండ్ వర్కింగ్ చేయడం జరుగుతుందని. ఇప్పటివరకు. 45 ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేయడంతో పాటు. ముగ్గు పోసి నూతన గృహాలు ప్రారంభించామని. అలాగే గత ప్రభుత్వాలతో పోల్చితే. ఈ ప్రభుత్వ. హయాంలో. అలాంటి అవినీతికి తావియ్యకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అని. ఇకముందు కూడా గ్రామాలలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికై. నిరుపేద కుటుంబాల కలసహకారం చేసుకోవాలని. కుటుంబ. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నది అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం మాట్లాడుతూ. ఇప్పటివరకు మండలంలో చాలామందికి ఇందిర ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేయడం జరిగిందని మండలంలో ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం. మహోద్యమంగా మొదలుపెట్టిన. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను. మాకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు. రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్‌కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో. ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. లింగాల భూపతి. సుద్దాల శ్రీనివాస్. సుద్దాల కర్ణాకర్. సామల గణేష్. సత్యనారాయణ రెడ్డి. మచ్చ. మధు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
దర్శక ధీరుడు రాజమౌళి చిత్రంలో ఆఫర్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ చియాన్ విక్రమ్ మాత్రం… ‘సారీ… నో’ అనే శాడట!
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అని ఎంతోమంది నటీనటులు అనుకుంటారు. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేస్తే చాలు… తమకు ఓవర్ నైట్ స్టార్ డమ్ వస్తుందని హీరోలు, హీరోయిన్లు నమ్ముతారు. ఆయన ఆఫర్ ఇవ్వాలే కానీ.. రెండు మూడేళ్ళ పాటు కాల్ షీట్స్ ఇవ్వడానికీ బిజీ ఆర్టిస్టులు సిద్థపడతారు. అయితే ఈ మాయ పడకుండా… తమ కెరీర్ ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకునే నటీనటులూ కొందరు ఉంటారు. రాజమౌళికి రెండు మూడేళ్ళు రాసిచ్చేయడానికి ఆసక్తి చూపించవారి విషయమే ఇది! చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తన కెరీర్ ను చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టాడు. అప్పట్లో తెలుగులో పెద్దంత ప్రాధాన్యం లేని పాత్రలను సైతం చేశాడు. చివరకు తమిళంలో బ్రేక్ వచ్చిన తర్వాత అతని సినిమాలు తెలుగులో డబ్ అయ్యి గ్రాండ్ గా రిలీజ్ కావడం మొదలైంది. ఒకానొక సమయంలో విక్రమ్ సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వైవిధ్య మైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిని కనబరిచే విక్రమ్.. మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి సినిమాలో వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది.
కొంతకాలం క్రితం రాజమౌళి బృందం విక్రమ్ ను కాంటాక్ట్ చేసి, మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్ లో పాత్ర చేయమని కోరిందట. ఈ ప్రాజెక్ట్ కు ఉన్న క్రేజ్ తెలిసి కూడా విక్రమ్ ఆ ఆఫర్ కు నో చెప్పాడట. ఎందుకంటే… అతని పాత్ర సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో సాగుతుందట! ఇప్పుడు తనకున్న ఇమేజ్ కు అలాంటి పాత్ర చేయడం సబబు కాదని విక్రమ్ భావించాడని సన్నిహితులు చెబుతున్నారు. హీరోగా ఎంతటి రిస్క్ చేయడానికైనా సాహసించే విక్రమ్… మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి మాత్రం ధైర్యం చేయలేకపోయాడని తెలుస్తోంది. విక్రమ్ ‘నో’ చెప్పిన తర్వాతే చిత్ర బృందం ఆర్. మాధవన్ (R Madhavan) ను అప్రోచ్ అయ్యిందని, ఆయన వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించి, డేట్స్ అడ్జస్ట్ చేశాడని అంటున్నారు. మాధవన్ హీరోగా కొన్ని చిత్రాలు చేసి, హీరోగా తనను తాను నిరూపించుకుని ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలు సైతం చేస్తున్నాడు. అంతే కాదు… ఇటీవల దర్శకుడిగా మారి మెగాఫోన్ నూ చేతిలోకి తీసుకున్నాడు. మొత్తానికి రాజమౌళి మూవీలో ఆర్టిస్టుల ఎంపిక కుర్చీల ఆటను తలపిస్తోందని సినిమా రంగానికి చెందిన వారు చెవులు కొరుక్కుంటున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో కె. ఎల్. నారాయణ (K.L. Narayana) దీనిని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరరచన చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ సోమవారం మొదలైంది.
ఝరాసంగం మండల పరిలోని ప్యాలారం వాగు ఏటా వానకాలంలో పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు రాకపోకలు తీవ్ర మబ్బందులు పడుతున్నాడు.
ఆరు నెలల క్రితం ఈ వాగు పై నూతనంగా బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి.
అంతేకాకుండా బహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్.
ఇహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్తేపు, స్థానిక ప్రజాప్రతిఙ్ఞడు లతో కలిసి పనులకు శంకుస్థావన కూడా చేశారు.
రానున్న వానకాలం లోపు బ్రిడ్జి నిర్మాదాని పూర్తి చేస్తామని వారు అప్పట్లో ప్రజలకు భరోసా ఇచ్చారు.
దీంతో ఎన్నో ఏళ్ల అవస్థలకు దేక్ పడుతుందని గ్రామస్థులు బావించారు.
కానీ ఇప్పటికి పసులు ప్రారంభంకాకపోత తో ఈ సారీ కూడా ఇక్కట్లు తప్పడం లేదు. 10 రోజుల క్రితం కురి సేన వర్గానికి వాగు ప్రవాహించడంతో రాకపోకలు స్తంభించి ప్రయాణి కులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
Government
రాకపోకలకు తప్పని ఇబ్బందులు
ఎన్నో సంవత్సరాల నుంచి ప్మాలవరం వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు వర్ష కాలం వచ్చిదంటే నానా తంటాలు పడుతు న్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా పసులు ముందుకు సాగలేదు. ప్రస్తుత కాంగ్రెస్: ప్రభుత్వమైనా పనుణు వేగవంతంగా చేస్తుందనుకుంటే కాల యాపనికే పరిమితమైందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Government
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ముఖ్యంగా ప్యాంవరం, దేవరంపల్లి గ్రామానికి రాకపోకలు సాఫీగా సాగుతాయి.
ప్రతీ ఏటా తిప్పలే..
ఎలా వాగు ఉద్భత్తంగా ప్రవహిస్తుండ మతే రాకపోవకు ఇబ్బందులు పడు తున్నాయి.నీళ్లు తగ్గుముఖం పట్టింతవరకు నిరీక్షణ తప్పడంలేదు తప్పని పరిస్థితల్లో దేవరంపల్లి ఈదులపల్లి మీదుగా చుట్టూ తిరిగి జహీరాబాద్ పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.
విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా…
విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘దాదాపు ఏడెనిమిదేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం. ఇందులో నటించమని అడిగిన వెంటనే అంగీకరించిన మా బావ ప్రభా్‌సకు కృతజ్ఞతలు. ఈ సినిమాను శివుడు ఆశీర్వదించాడు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఎవరెవరు పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది. ఈ చిత్ర ప్రయాణం నన్ను చాలా మార్చింది. ‘కన్నప్ప’ కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎంచుకున్నాడని భావిస్తున్నా’’ అని మంచు విష్ణు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, రఘుబాబు, శివబాలాజీ, కౌశల్ పాల్గొన్నారు.
సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం, రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఎంపికై, తన వినూత్న బోధనా పద్ధతులతో అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో,సఫియా సుల్తానా తన పాఠశాలలో అమలు చేసిన సృజనాత్మక బోధనా పద్ధతులు, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన కార్యక్రమాలు, మరియు వీటి ద్వారా పాఠశాలలో సాధించిన గణనీయమైన ప్రగతిని అత్యంత ఆకర్షణీయమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ జి. రమేష్, ఆర్.జె.డి. విజయలక్ష్మి, మల్టీ జోన్-2కు చెందిన 350 మందికి పైగా మండల విద్యాధికారులు హాజరయ్యారు. శ్రీమతి సఫియా సుల్తానా గారి అద్భుతమైన ప్రదర్శనను తిలకించిన ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ రమేష్ మరియు ఆర్.జె.డి. విజయలక్ష్మి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే, ఎస్.సి.ఈ.ఆర్.టి.సురేష్ బాబు, శ్రీ సురేందర్, మరియు న్యాల్కల్ మండల విద్యాధికారి శ్రీ మారుతి రాథోడ్ కూడా ఆమె కృషిని అభినందించారు.
కార్తీ సూపర్ హిట్ మూవీ ‘సర్దార్’ సీక్వెల్ షూటింగ్ పూర్తయిపోయింది. ‘సర్దార్’కు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, సీక్వెల్ కు సామ్ సీఎస్ ను తొలుత అనుకుని ఇప్పుడు యువన్ శంకర్ రాజాతో మ్యూజిక్ చేయించుకున్నారు.
కార్తీ (Karthi) హీరోగా నటించిన ‘సర్దార్’ (Sardar) సినిమా 2022లో దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రజిషా విజయన్ (Rajisha Vijayan), రాశీఖన్నా (Rasi Khanna) హీరోయిన్లుగా నటించారు. లైలా (Laila) ఓ కీలక పాత్రను పోషించి మెప్పించింది. పి.ఎస్. మిత్రన్ (P.S. Mithran) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ తెలిపారు. అన్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ ను కొంతకాలం క్రితం ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. థాయ్ లాండ్ లోని హువా హిన్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా టోటల్ క్రూ అంతా కలిసి కేక్ కట్ చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు.
ప్రిన్స్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘సర్దార్ -2’లో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ చేస్తుండగా, ఎస్. జె. సూర్య (SJ Suryah) ఓ పవన్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తొలుత సామ్ సి.ఎస్.ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఆ స్థానంలోకి యువన్ శంకర్ రాజా (Yuvan Sakar Raja) వచ్చాడు. చిత్రం ఏమంటే… ‘సర్దార్’ తొలి భాగానికి వీరిద్దరూ కాకుండా జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫీ సమకూర్చుతున్న ‘సర్దార్ -2’ చిత్రానికి దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ కొరియోగ్రాఫర్. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ‘సర్దార్ 2’ కు ఎ. వెంకటేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతరం కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.
ఝరాసంగం : గత మూడేళ్ల క్రితం రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారం భమైనప్పటికీ తిరిగి నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతు న్నారు.
దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించనట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిధులు మంజూరు జరిగిన కాంట్రాక్టర్ మా త్రం పనులు వెంటనే ప్రారంభించ లేదు.
ఇటీవలే పనులు ప్రారంభమై నప్పటికీ కొన్ని నెలల్లోనే అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు.
ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామం నుండి పూర్యానాయక్ తండా వైపు 3.50 కిలోమీటర్ల మేర రోడ్డును మరమ్మతులు చేసేందుకు 2022 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.38 కోట్లు మంజూరు చేయడం జరిగింది.
ఇట్టి పనులను పర్యవేక్షించేందుకై ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి నియమించింది.
దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచి ఇట్టి పనిని చేసేందుకు కాంట్రాక్టర్‌కు అప్పగించింది.
అయితే కాంట్రాక్టర్ గత మూడు సంవత్సరాలు పాటు ఎలాంటి రోడ్డు మర మ్మతు పనులను ప్రారంభించకపోవడంతో గిరిజనుల ఆశలు సన్నగిల్లాయి.
BRS Government.
గత కొన్ని ఏళ్లుగా గిరిజనులు కంకర తేలి గుంతలపడ్డ రో డ్డుపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ద్విచక్ర వాహనాల మాట అటు ఉంచితే కనీసం కాలినడకన వెళ్లాలన్న ఈ రోడ్డు అనువుగా లేక పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ తరు ణంలోనే గత రెండు నెలల క్రితం కాంట్రాక్టర్ ఈ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించడంతో గిరిజనుల ఆశలు తిరిగి రేకెత్తిన్నాయి.
కాగా ఇప్పటి వరకు ఈ రోడ్డుపై పలుచోట్ల కల్వర్టులు నిర్మించారు.
అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేగడి మట్టిని తవ్వి సైడ్ వైన్దింగ్ పనులను చేపట్టారు.
అదే విధంగా మొరం కాకుండా చెడేతో కూడు కున్న మట్టిని రోడ్డుపై వేసి చదును చేశారు.
తదుపరి కంకర వేయ కుం డా రోడ్డు మరమ్మతు పనులను అర్ధాంతరంగా వదిలిపెట్టారు.
దీంతో ప్రస్తుతం ఈ రోడ్డు చిరుజల్లుతే చిత్తడిగా మారి ప్రయాణం చేయ డా నికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయా తండాలో గిరి జనులు ఆందోళన వ్యక్తం చేశారు.
పలువురు వాహనదారులు జారి పడి ప్రమాదాన్ని గురైనట్లు వారు వివరించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు
ఈ రోడ్డుపై కంకర వేసి బీటీ రోడ్డుగా మార్చడా నికి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా పంచుకున్నారు…
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణతో మరోసారి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మా కాంబో చేసే గర్జన మరింత ఎక్కువగా ఉండబోతోంది. చరిత్రలో నిలిచిపోయే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. మంగళవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇది ఆయన నటించనున్న 111వ చిత్రం. వెంకట్ సతీష్ కిలారు నిర్మించనున్నారు. కాగా, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో ‘వీరసింహా రెడ్డి’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
అఖండ 2 టీజర్ వచ్చేస్తోంది
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. వారి కలయికలో నాలుగోసారి తెరకెక్కుతోన్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయనున్నారు మేకర్స్.
ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..
◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..
◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.
అక్కినేని వారసుడు అఖిల్, జైనాబ్ల వివాహాం రెండు రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
అక్కినేని వారసుడు అఖిల్ (Akhil), జైనాబ్ (Zainab)ల వివాహాం రెండు రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే మొన్న కేవలం అతి కొద్దిమంది సమక్షంలోనే ఈ పెళ్లి జరుగగా సినీ ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది అతిథులు మాత్రమే హజరయ్యారు.
తాజాగా వీరి నిశ్చితార్ధం హైదరాబాద్‌లో కనులపండువగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ ఎత్తున హజరయ్యారు.
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), సూర్య, వెంకి అట్లూరి ఈ రిసెప్షన్‌కు హజరైన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మీరూ వాటిపై ఓ లుక్ వేయండి.
ఈ వారం ఓటీటీ సినిమాలివే.. అన్నీ అదిరిపోయే బొమ్మలే
నేటిధాత్రి:
ఈవారం ఓటీటీ () ప్రేక్షకుల చెంతకు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది.
ఈవారం ఓటీటీ () ప్రేక్షకులకు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా 100కు పైనే సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగుకు వస్తుండగా వాటిలో చాలా వరకు ప్రధాన కంటెంట్ తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వీటిలో అధిక శాతం మూవీస్ కేవలం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లలోనే వస్తుండడం విశేషం.
వీటిలో ముఖ్యంగా హీరోయిన్ సమంత నిర్మాతగా మారి మొట్ట మొదటి సారి నిర్మించిన శుభం, మలయాళ యువ నటుడు, ప్రేమలు హీరో నటించిన అలప్పుజ జింఖానా, నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలెవన్ చిత్రాలతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్, బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కేసరి2, తమిళ చిత్రాలు మామన్, డీడీ నెక్స్ట్ లెవల్ వంటి కొత్త చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తున్నాయి. థియేటర్లలో ఈ సినిమాలను మిస్సయిన వారు, ఇంటి పట్టునే ఉండి చూసే వారికి ఈ వీక్ సరిపోను వినోదం అందించడానికి రెడీగా ఉన్నాయి.
Jio Hotstar
Padakkalam (Malayalam + Multi)
Snow White (English + Hindi) – JioHotstar
The Real Housewives Of Miami: S4 (English) [Series]
Subham (Telugu + Multi )
When No One Sees Us (Spanish)
Under Dogs (English)
Netflix
Train Wreck : The AstroWorld Tragedy (English)
OurTimes (Mexican)
Aniela (Polish) [Series]
CheersToLife (Brazilian)
Titan : The OceanGate Disaster (English)
CocaineAir : Smugglers at 30,000 Ft. (English) [Series]
FlatGirls (Thai)
MasameerJunior (Saudi)
AndTheBreadWinnerIs (Filipino)
Cells At Work (Japanese)
Rana Naidu : Season 2 (Hindi)
A Business Proposal (Indonesian)
Too Hot To Handle: Spain (Spanish) [Series]
The Rookie (English) – Netflix
Prime Video
The Amateur (English)
Misericordia (English) Rent
When Fallis Coming (English) Rent
Clown In A Cornfield (English) Rent
Deep Cover (English)
Eleven (Tamil)
Kesari Chapter2 June 13
DD Next Level June 13
Bonjour Tristesse (English) Rent
The Chosen: Last Supper Season 5 (English) [Series]
Final Destination Bloodlines Rent June 17
Zee5
Maaman (Tamil) June 13
Aha Tamil
Eleven (Tamil)
Sony Liv
Alappuzha Gymkhana (Malayalam + Multi)
Tentkotta
Eleven (Tamil)
ETv win
Aa Okkati Adakku (Telugu)
HBO Max
Cleaner (English)
Apple Tv+
EchoValley (English)
Simply South
Eleven (Tamil)
Alappuzha Gymkhana (Malayalam + Multi)
Lionsgate Play
The Prosecutor (Chinese) (Cantonese, Eng, Hi, Ta, Tel)
సుప్రీతా నాయుడు సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఇన్ఫ్లూయెన్సర్, నటి.
సుప్రీతా నాయుడు (Supritha Bandaru Naidu) సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఇన్ఫ్లూయెన్సర్, నటి. ఇప్పటివరకు అధికారికంగా ఒక సినిమా చేయకున్నా బడా హీరోయిన్లను తలన్నేలా అందాలతో హోయలు బోతూ తన ఫ్యాన్స్‌కు నిత్యం తనివితీరా ఫుల్ మీల్స్ పెడుతోంది.
సమయం దొరికితే విదేశాలు, బీచులు, పబ్‌లు తిరుగుతూ అందాలను వడ్డిస్తోంది. తాజాగా తను హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ నటించిన సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఆమె నా ఇష్ట ప్రకారమే నా డ్రెస్సింగ్ ఉంటుందంటూ బోల్డ్ కామెంట్లు చేసింది.
అది మరకువకు ముందే తాజాగా తన ఎద అందాలన్నింటినా ఒపెన్‌గా ప్రదర్శిస్తూ మరోసారి చూసే వారికి కనుల వింతు చేసింది.
ఇప్పుడు ఈ పొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
క్రేజీ డీల్.. యాపిల్ మ్యాక్‌బుక్‌పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్..
నేటిధాత్రి:
చాలా రోజుల నుంచి మీరు యాపిల్ MacBook కొనాలని అనుకుంటున్నారా. అయితే మీకు ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే MacBook Air M1పై ప్రస్తుతం 31 వేల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.
MacBook Air M1: క్రేజీ డీల్.. యాపిల్ మ్యాక్‌బుక్‌పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్.. MacBook Air M1
మీరు అనేక రోజుల నుంచి యాపిల్ మ్యాక్‌బుక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు మీ కలల ల్యాప్‌టాప్‌ను తీసుకునేందుకు మంచి ఛాన్స్ వచ్చింది. Amazonలో MacBook Air M1పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, తక్కువ ధర ఇవన్నీ కూడా ప్రస్తుతం మీకు లభించనున్నాయి. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి. ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ధర తగ్గింపు ఆఫర్..
MacBook Air M1 8GB RAM, 256GB SSD వేరియంట్ ప్రస్తుతం Amazonలో రూ. 58,990కి లభిస్తోంది. అయితే దీని అసలు ధర రూ. 89,900తో పోలిస్తే రూ.31 వేల తగ్గింపుతో లభిస్తుండటం విశేషం. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
MacBook Air M1 ప్రధాన ఫీచర్లు
ప్రాసెసర్: Apple M1 చిప్ (8-కోర్ CPU, 7-కోర్ GPU)
RAM: 8GB
స్టోరేజ్: 256GB SSD
డిస్ప్లే: 13.3-అంగుళాల Retina డిస్ప్లే
బ్యాటరీ: 18 గంటల వరకు బ్యాటరీ జీవితం
కెమెరా: 720p FaceTime HD కెమెరా
కనెక్టివిటీ: Wi-Fi 6, Bluetooth 5.0
పోర్ట్స్: 2x Thunderbolt 3 (USB-C)
లాంగ్ బ్యాటరీ లైఫ్: 18 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
స్లిమ్, లైట్ డిజైన్: 1.29 కిలోల బరువు
macOS: సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సపోర్ట్
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.